Archive | August 2014

జ్ఞానదీపం, విలువ: సత్యం,అంతర్గత విలువ: జ్ఞానం

ఒక సాధకుడు దైవత్వం గురించి పూర్తిగా తెలుసుకోవాలని అనుకున్నాడు. ఎలాగయినా సాధన చేసి మూడవకన్ను (జ్ఞాననేత్రం) తెరుచుకునేలా చేసుకోవాలని చాలా ఆశగా ఉన్నాడు.ఒక గుహలో తపస్సు చేసుకుంటున్న గురువుగారి దగ్గరకు వెళ్ళేడు.గుహలోకి వెళ్ళేటప్పుడు అతనికి చిన్నవెలుగు కనిపించింది. దానికి దగ్గరగా వెళ్ళేకొద్దీ తగ్గిపోతూ చివరికి పుర్తిగా చీకటి అయిపోయింది. ఆ కటిక చీకటిలో అతనికి చాలా భయంవేసి ఆర్తితో”ఓం నమశ్శివాయ” అని అరిచాడు. ఆ పిలుపు విన్న గురువుగారు ఎవరది అని అడిగారు.మీ అనుగ్రహం కోసం వచ్చాను అని సాధకుడు చెప్పేడు.ఆ గురువుగారు ఆ గుహలో కొన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు. ఈ సాధకుడిని పరీక్షించాలని అక్కడ ఉన్న దీపం వెలిగించమని చెప్పేరు.సాధకుడు ప్రయత్నించినా అది వెలగలేదు. అగ్గిపెట్టెలో ఉన్న పుల్లలు అన్నీ అయిపొయాయి, కాని దీపం వెలగడం లేదు అని సాధకుడు గురువుగారితో చెప్పేడు.
అప్పుడు గురువుగారు ఆ ప్రమిదలో ఉన్న నీటిని తీసివేసి, నూనెతో నింపి వెలిగించమని చెప్పేరు. సాధకుడు అలా ప్రయత్నించినా కూడాఅది వెలగలేదు. అప్పుడు గురువుగారు ప్రమిదలో ఉన్న వత్తి నీటిలో నానిపోయి ఉంటుంది కాబట్టి దానిని బాగ ఆరబెట్టి అప్పుడు ప్రయత్నించమని చెప్పేరు. అలా చేసి సాధకుడు దీపం వెలిగించగలిగాడు.
ఈసారి తనని అనుగ్రహించమని గురువుగారిని అడిగాడు. గురువుగారు ఆశ్చర్యతో ఇంతసేపూ అనుగ్రహం పొందే మార్గం బోధించాను కదా అన్నారు. అప్పుడు సాధకుడు తన అజ్ఞానాన్ని క్షమించమని అర్థమయ్యేలా చెప్పమని అడిగేడు.గురువుగారు ఈ విధమగా వివరించారు.
images9U8RQWPR“నీ హృదయం అనే ప్రమిదలో వత్తి అనబడే ఆత్మ ఉంది. అది ఇన్నాళ్ళూ కోరికలు, లోభం, అసూయ,అహంకారం మొదలైన దుర్గుణాలు అనే నీటిలో నానిపోయిఉంది.అందువల్ల నువ్వు జ్ఞానం అనే దీపాన్ని వెలిగించలేకపోతున్నావు.అవన్నీ తీసివేసి నీ హృదయాన్ని ప్రేమతో నింపు.ఆత్మని విచక్షణ అనే ఎండలో ఆరబెట్టు.హృదయాన్ని భక్తి,నమ్మకం అనే నూనెతో నింపు. అప్పుడు నీకు జ్ఞానదీపం వెలిగించుకోవడానికి వీలవుతుంది.”
నీతి: మనందరిలోనూ పవిత్రమయిన హృదయం ఉంది. మనసంతా ఆలోచనలతోనూ, దుర్గుణాలతోను నిండిపోవడం వల్ల దానిని గుర్తించలేకపోతున్నాము. కామ,క్రోధ,లోభ,మోహ,మద,మాత్సర్యాలు అనే దుర్గుణాలను , అహకారాన్ని విడిచిపెట్టి సాధన చేస్తే పవిత్రమవుతుంది. అప్పుడు ఆ పవిత్ర మైన హృదయంలో జ్ఞానమనే దీపం వెలిగించుకోవడం సాధ్యమవుతుంది.
https://www.facebook.com/neetikathalu
http://saibalsanskaar.wordpress.com/

ప్రార్థన విశిష్టత, విలువ: సత్యం ,అంతర్గత విలువ: విశ్వాసం

మేజర్ సాహిబ్ నాయకత్వంలో పదిహేనుమంది సైనికులు హిమాలయ పర్వతాలలో ఉన్న సరిహద్దు ప్రాంతంలో తమ విధులు నిర్వర్తించడానికి బయలు దేరారు. ఈ దళం అక్కడికి చేరుకుంటే అక్కడ పని చేసే వారు తమ ఇళ్ళకు చేరుకోవచ్చు. అందుకోసం ఆ సైనికులు వీళ్ళ కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సైనికులు కూడా తొందరగా అక్కడకు చేరుకొని అక్కడి సైనికులను వాళ్ళ ఇళ్ళకు పంపడానికి ఉత్సాహం గా ఉన్నా రు. కాని ఆ పర్వత శిఖరాలు ఎక్కి గమ్య స్థానం చేరుకోవడం చాల శ్రమ, ప్రమాదాలతో కూడిన పని. కాలి నడకన వెళ్ళడం తప్ప మరొక మార్గం లే దు. దానికి తోడు ధారాపాతం గా కురిసే మంచు ఎముకలు గడ్డ కట్టుకు పోయేలా చేస్తుంది. imagesYI6FQJA0
అక్కడ ఎవరైనా ఒక కప్పు టీ ఇస్తే బాగుండునని మేజర్ సాహిబ్ అనుకున్నాడు. అది చాలా చిన్న కోరికే అయినా అక్కడ ఆ సమయంలో అది అత్యాశే అని మేజర్ సాహిబ్ కి తెలుసు. వాళ్ళు ఒక గంట పాటు ప్రయాణం చేసి కొంత దూరం వెళ్ళేసరికి ఒక హోటల్ కనిపించింది. కాని అది మూసి వేసి ఉంది. అప్పుడు సమయం రాత్రి రెండు గంటలు. ఆ చుట్టు పక్కల దగ్గరలో ఇళ్ళు కూడాలేవు. అందుచేత ఆ షాపు యజమాని ఎవరో తెలుసుకొనే అవకాశం కూడా లేదు. కొంచెం దూరం వెళ్లి అక్కడ ఉండే ఇళ్ళ తలుపులు కొట్టడం కూడా ఆ సమయం లో భద్రత దృష్ట్యా అంత మంచిది కాదు.
ఎటూ కాని పరిస్థితి. మన దురదృష్టం. మిత్రులారా టీ దొరికే అవకాశం లేదు. ఇప్పటికే చాలా దూరం నడిచారు కొంచెం సేపు విశ్రాంతి తీసుకోండి అన్నాడు,మేజర్ సాహిబ్. ఇంతలో ఒక సైనికుడు మేజర్ సాహిబ్ ని చూసి ఇక్కడో టీ దుకాణం ఉంది కాని ఇది తాళం వేసి ఉంది. తాళం పగుల కొట్టాలి అన్నాడు. మేజర్ సాహిబ్ కొంచెం సందేహంలో పడ్డాడు. మొత్తం మీద తాళం పగుల కొట్టడానికి అనుమతించాడు. తాళం పగులగొట్టా రు.

imagesT7CLDF01 వాళ్ళ అదృష్టం కొద్దీ అక్కడ టీ తయారు చేసుకోవడానికి కావలసిన అన్ని వస్తువులు పాలు, పంచదార, టీ పొడి అన్నీ ఉన్నాయి. వాళ్ళు టీ తయారు చేసుకుని చల్లటి వాతావరణంలో టీ త్రాగి చాలా ఆనందించారు . ఇక వాళ్ళు అక్కడి నుంచి బయలు దేరాలి.మేజర్ సాహిబ్ మళ్ళీ సందేహంలో పడ్డాడు. వాళ్ళు తాగిన టీ కి డబ్బులు ఇవ్వాలి. వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా పుచ్చుకోవడానికి అక్కడ ఎవరూ లేరు. వాళ్ళు క్రమ శిక్షణ కలిగిన సైనికులు. దొంగలు కాదు. డబ్బులు చెల్లించకుండా వెళ్ళిపోవడానికి మేజర్ సాహిబ్ మనస్సు ఎంత మాత్రం అంగీకరించ లేదు. చివరికి మేజర్ సాహిబ్ కి ఒక ఆలోచన వచ్చింది . ఒక వెయ్యి రూపాయల నోటు తీసి కౌంటర్ వద్ద ఉంచాడు. అది ఎగిరి పోకుండా దానిమీద పంచదార డబ్బా పెట్టాడు. మరుసటి రోజు ఉదయం యజమాని వచ్చి చూసేసరికి కనిపించేలా నోటును అలా పెట్టి సైనికులను బయలు దేరండి అని చెప్పి తానూ బయలుదేరాడు. రోజులు, వారాలు, నెలలు గడచి పోయాయి. ఆ సైనికులు తమ విధులు ముగించుకొని అందరు క్షేమంగా తిరిగి ఇళ్లకు బయలుదేరారు. తిరిగి వచ్చేటప్పుడు కూడా అనుకోకుండా అదే షాపు దగ్గర టీ త్రాగడానికి ఆగారు. ఆ షాపు యజమాని ఒక ముసలి వాడు మరియు బీదవాడు . తన షాపు వద్ద టీ తాగడానికి వచ్చిన ఆ పదిహేనుమందిని చూసి ఎంతోసంతోషించాడు ఆ సైనికులు ఆ షాపు యజమానితో కబుర్ల లో పడ్డారు . ఆ ముసలి వాడికి భగవంతుని మీద దృఢ మైన భక్తి ఉందని గమనించిన ఒక సైనికుడు, తాతా నిజంగా భగవంతుడు ఉంటే నీలాటి వాళ్ళకు ఇన్ని కష్టాలు ఎందుకు వస్తాయి అని అడి గాడు.
images89KYK9B0 దానికి ఆ ముసలివాడు ,కాదు బాబూ భగవంతుడు నిజం గా ఉన్నాడు. దానికి కొన్ని నెలల క్రిందట నా జీవితంలో జరిగిన ఒక సంఘటన ప్రత్యక్ష నిదర్శనం అని ఇలా చెప్పడం మొదలు పెట్టాడు . అప్పుడు నేను చాలా కష్టంలో ఉన్నాను . నా కొడుకును టెర్రరిస్ట్ లు (తీవ్ర వాదులు) బాగా కొట్టారు . ఎవరు కొట్టారో తెలియదు . నేను షాపు మూసేసి నా కొడుకును హాస్పిటల్ కు తీసుకు వెళ్ళాను . మందులు కొనడానికి డబ్బులు లేవు . ఎవరూ అప్పు ఇవ్వలేదు. నా కొడుకు దక్కుతాడనే ఆశ లేకుండా పోయింది. ఆర్తి తో భగవంతుణ్ణి వేడుకున్నాను. నేను షాపు దగ్గరకు వచ్చి చూసే సరికి తాళం పగులగొట్టి ఉంది. షాపులో ఉన్న కొద్ది పాటి విలువైన వస్తువులు పోయి ఉంటాయి అనుకున్నాను. కాని ఆశ్చర్యకరం గా పంచదార డబ్బా క్రింద వెయ్యి రూపాయలు కనపడ్డాయి. ఆ రోజు ఆ డబ్బులు నాకెంత విలువైనవో చెప్పలేను . భగవంతుడే నా షాపులోకి నడచి వచ్చి ఆ డబ్బులు అక్కడ పెట్టాడని పించింది . ఆ డబ్బులతో నా కొడుకును బ్రతికించుకోగలిగాను. నిజంగా దేవుడు ఉన్నాడు బాబూ ఇక్కడ తీవ్ర వాదుల చేతిలో ప్రతి రోజు అనేకమంది చనిపోతున్నారు . మీరు మీ విధులు ముగించుకుని క్షేమం గా త్వరలో ఇంటికి వెళ్ళబోతున్నారు . మీ భార్యాబిడ్డలను, ఆత్మీయులను కలుసుకోబోతున్నారు . మీరు ఇంటికి వెళ్లి మీరు మీ ఆత్మీయుల లో పాటు భగవంతునికి మనసారా కృత జ్ఞతలు చెప్పుకోండి. నిజం గా దేవుడు ఉన్నాడు బాబూ, ఆ ముసలి వాడి కళ్ళలో భగవంతుని మీద స్థిరమైన విశ్వాసం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. మేజర్ సాహిబ్ కళ్ళు ఆనంద బాష్పాల తో నిండి పోయాయి . తాతా నువ్వు చెప్పినది నిజం. నిజంగా దేవుడు ఉన్నాడు . నువ్వు చేసిన టీ అద్భుతంగా ఉంది అంటూ లేచి బిల్లు చెల్లించాడు . ఆ పదిహేను మంది సైనికుల కళ్ళు కూడా చెమ్మగిల్లేయి. వాళ్ళ జీవితాలలో అది ఒక అరుదయిన సంఘటన .
నీతి: విశ్వాసం కలిగి ఉండడం ముఖ్యం . అది పర్వతాలను కూడా కదిలించగలదు. భగవంతుడు ఉన్నాడని మనం విశ్వసిస్తే నిజంగా ఉన్నాడు . అనేక సందర్భాలలో అనేక విధాలుగా మన కంటికి కనబడని చెయ్యేదో మనకు సహాయ పడుతూ ఉంటుంది . విశ్వాసం ఉన్నవాళ్ళు మాత్రమే తమ జీవితంలో కంటికి కనపడ కుండా ప్రతి అడుగులోను భగవంతుడు సహాయపడుతున్నాడని గుర్తించగలుగుతారు.

http://saibalsanskaar.wordpress.com
https://www.facebook.com/neetikathalu

రాఖీ పండుగ విశిష్టత

శ్రావణమాసంలో వచ్చే పండుగలలో శ్రావణ పూర్ణిమ నాడు జరుపుకొనే రక్షాబంధన్ లేదా రాఖీపండుగ ఎంతో విశిష్ట మైనది. సోదరీ సోదరుల దృఢ మైన అనుబంధమునకు గుర్తుగా ఈ పండుగ జరుపుకోవడం సంప్రదాయము. భారత దేశంలో హిందువులు, సిక్కులు, జైనులు ఈ పండుగ జరుపుకుంటారు. పాకిస్తాన్ లోని కొన్ని ప్రాంతాలలో, నేపాల్లో కూడా ఈ పండుగ చేసుకోవడం కనిపిస్తుంది.
సోదరి తన సోదరుని చేతికి రక్షా బంధనం కడుతూ ఈ క్రింది శ్లోకం చదవడం, సోదరుడు తన జీవితాంతం తన సోదరికి అన్ని సందర్భాలలోను అండగా ఉంటానని ప్రతిజ్ఞ చేయడం ఈ పండుగలో ముఖ్య మైన విశేషం.
యేన బద్ధో బలీ రాజా దానవేం ద్రో మహా బలః
తేన త్వా మనుబద్నామి రక్శే మా చల మా చల Rakhi
ఈ విషయం లో చాల పురాణ కథలు కనిపిస్తాయి. ఈ పండుగ కేవలం సోదరీ సోదరుల అనుబంధాని కి గుర్తుగా మాత్రమే కాకుండా ఆత్మీయుల మధ్య కూడా ఐక మత్యానికి పరస్పర సహకారానికి చిహ్నంగా చేసుకోవడం కనిపిస్తుంది. బలి చక్రవర్తి, విష్ణుమూర్తిని శాశ్వతం గా పాతాళంలో తన భవనంలో ఉండిపొమ్మని ప్రార్థిస్తే విష్ణువు అందుకు అంగీకరిస్తాడు. లక్ష్మీ దేవికి అది ఇష్టం లేదు. ఆమె బలి చక్రవర్తి చేతికి రక్షాబంధం కడుతుంది. బలి చక్రవర్తి ఆమెను తన సోదరి గా మన్నించి ఆమె కోరిక ప్రకారం విష్ణువును వైకుంఠము వెళ్ళడానికి అంగీకరిస్తాడు. కృష్ణుని చేతికి ద్రౌపది, యముని చేతికి అతని సోదరి యమున రక్షా బంధనములు కట్టి నట్లు పురాణాలు చెబుతాయి.
చరిత్ర పరిశీలిస్తే రాజపుత్ర స్త్రీలు సమీప దేశాలలోని రాజులకు రక్షా బంధనములు పంపినట్లు తెలియ వస్తుంది. అలెగ్జాండర్ భార్య రుక్సానా పురుషోత్తముని కి రక్షాబంధనం కట్టిందని పురుషో త్తముడు ఆమెను సోదరి గా మన్నించి అవకాశం వచ్చినా అలెగ్జాండర్ ను చంపకుండా విడచి పెట్టాడని చెబుతారు. రాణి కర్ణావతి 1535 లో బహదూర్ షా దండ యాత్ర నుంచి తన భర్త ను రాజ్యాన్ని కాపాడ మని కోరుతూ హుమయూన్ కి రక్షా బంధనం పంపినదని కాని హుమాయూన్ సమయానికి రాలేక పోవడం చేత రాజ్యం శత్రువుల వశ మైనదని, కర్ణావతిభర్త యుద్ధం లో మరణిస్తే మహారాణి అగ్ని ప్రవేశం చేసిందని, హుమయూన్ ఆ రాజ్యాన్ని శత్రువుల నుంచి తిరిగి జయించి కర్ణావతి కుమారునికి పట్టాభిషేకం చేశా డని ఇంకొక కథ.
1905 లో ఆంగ్లేయులు బెంగాల్ ను రెండుగా విభజిస్తే పెద్ద ఉద్యమం చెల రేగింది. విశ్వకవి రబీంద్ర నాథ్ టాగోర్ రక్షా బంధన్ స్ఫూర్తి గా హిందూ మహమ్మదీయ ఐక్యతకోసం మరియు బెంగాల్ విభజనకు వ్యతిరేకంగాను పోరాడినట్లు గా తెలియవస్తుంది. అనేక మంది ముస్లిం స్త్రీ లు ఈ సందర్భం లో సోదర హిందువులకు రక్షా బంధనం కట్టినట్లు చెబుతారు . ఖురాన్ లో ఇటువంటి పండుగ ప్రస్తావన లేక పోయినా మత సామరస్యం ప్రాతి పదిక మీద ముస్లిములు హిందువులు కలసి ఈ పండుగ చేసుకోవడం సంతొషించ దగిన విషయం. ఇలా రక్షా బంధన్ పండుగ కేవలం సోదరీ సోదరుల ఆత్మీయతకు మాత్రమే చిహ్నం కాకుండా వర్గాల మధ్య జాతుల మధ్య దేశాల మధ్య ఐక్యతకు కారణం కావడం ఆహ్వానించ దగిన పరిణామం .
http://saibalsanskaar.wordpress.com
https://www.facebook.com/neetikathalu

వరలక్ష్మీ వ్రత వైశిష్ట్యము

హిందూ సంప్రదాయము ననుసరించి చైత్రము మొదలైన పన్నెండు నెలలో శ్రావణ మాసము ఎంతో విశిష్ట మైనది. నెలల వరుస లో ఇది ఐదవది. శ్రవణా నక్షత్రము తో కూడిన పూర్ణిమ ఈ నెలలో వస్తుంది కావున ఈ మాసమునకు శ్రావణ మాసము అని పే రు. శ్రవణా నక్షత్రము శ్రీ మహా విష్ణువు జన్మ నక్షత్రం కావడం ఈ మాసము నకు ఎంతో గొప్పదనాన్ని తెచ్చింది. ఈ మాసము లో మంగళ శుక్ర శ ని వారములు ఎంతో పవిత్రము గా భావింప బడ తాయి. మంగళ శుక్ర వారములు లక్ష్మీ పూజకు శ్రావణ శని వారము వెంకటేశ్వర స్వామి ఆరాధనకు ప్రశస్తమైనవి. శ్రావణ మాసము చతుర్మాస్యలలొ ఒకటి. యోగులు సన్యాసులు పీఠా ది పతులు చాతుర్మాస్య దీక్ష ను పాటి స్తారు. ఈ కాలంలో శ్రీ మహా విష్ణువు యోగ నిద్ర లో సముద్రం పై పవళించి ఉంటాడు. శ్రావణ పూర్ణిమ రోజున హయగ్రీవ జయంతి రక్షా బంధన్ పండుగలు జరుపు కుంటారు . ఇదే మాసము లో శ్రీ కృష్ణ జన్మాష్టమి కూడా వస్తుంది. వివాహ మైన స్త్రీలు ఎంతో ముఖ్య మైనది గా భావించే వరలక్ష్మీ వ్రతం ఈ నెలలోనే ఆచరిస్తారు. శ్రావణ మాసము ఇన్ని విధాల విశిష్టత కలిగినది.
వరలక్ష్మీ వ్రతం వివాహమైన స్త్రీలు ఆచరించే వ్రతాలలో ప్రధానమైనది. శ్రావణ పూర్ణిమ కు ముందు (preceding) వచ్చ్గే శుక్ర వారము ఈ వ్రతము చేసుకుంటారు. సాధారణము గా ఇది శ్రావణ మాసం లో వచ్చే రెండవ శుక్ర వారము అవుతూ ఉంటుంది ఎప్పుడైనా ఒక్కొక సారి శ్రావణం పూర్ణిమ శుక్రవారం వస్తే ఆరోజున చే సుకుం టారు. మగధ దేశం లో చారుమతి అనే భ్రాహ్మణ స్త్రీ కి శ్రీ మహాలక్ష్మి స్వప్నం లో సాక్షాత్కరించి ఈ వ్రతం ఆచరించిన వారు సంపదలతో తుల తూగుతూ ఎల్లప్పుడూ క్షేమం గా ఉంటారని చెప్పిందట చారుమతి ఆమె వలన ఈ విషయం విన్న స్త్రీలు ఈ వ్రతం చేసి భోగ భాగ్యాల తో సుఖం గా ఉన్నారని ఆ నాటి ఈ వ్రతం ఆచరించడం మొదలైనదని వరలక్ష్మీ వ్రత కల్పం చెబుతుం ది.

పద్మాసనే పద్మకరే సర్వ లోకైక పూజితే
నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా varalakshmi

అని వరలక్ష్మి ని స్తోత్రం చేస్తే అష్ట లక్ష్ముల అనుగ్రహం కలుగు తుం దని విశ్వా సము . చిత్ర నేమి అనే గంధర్వుడు శివ పార్వతులు జూదం ఆడుతూ ఉన్న సమయం లో మధ్య వర్తి గా ఉండి పక్ష పాత బుద్ధి తో శివుడు గెలిచినట్లు ప్రకటించ డం తో పార్వతి కోపించి చిత్రనేమిని కుష్ఠు రోగివి కమ్మని శపిస్తుంది. ఆ శాపం నుంచి విముక్తి పొంద డానికి పార్వ తి ఆదేశం మేరకు చిత్రనేమి వరలక్ష్మి వ్రతం చేసి కుష్ఠు రోగం నుంచి విముక్తు డై నట్లు మరొక కథ వలన తెలియ వస్తుంది. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి కుండిన నగరం లో ఒక భక్తు రాలికి స్వప్నం లో కనుపించి ఈ వ్రతం చేస్తే సంపదలు సౌభాగ్యము కలుగు తాయని చెప్పినట్లు గా మరొక కథ. మొత్తము మీద శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం తో సంపదలు సౌభాగ్య సమృద్ధి కొరకై ఆంద్ర కర్నాటక తమిళ నాడు రాష్ట్రాలలో స్త్రీ లు ప్రధానం గా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు నేపాల్ లోకూడా ఈ వ్రతాని ఆచరించ డం కనుపిస్తుం ది ఈ సంవత్సరం జూలై నెల 8 వ తేదీ వరలక్ష్మీ శుక్రవారం పర్వదినము. స్త్రీలందరూ ఈ వ్రతాన్ని ఆచరించి కోరిన వరాలు ఇస్తూ వరలక్ష్మి గా ప్రసిద్ధి పొందిన ఆ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో సంపత్ సౌభాగ్యాలను పొందాలని ఆకాం క్షిస్తున్నాము.
http://saibalsanskaar.wordpress.com
https://www.facebook.com/neetikathalu

నిజాయితీ

విలువ: ప్రేమ

అంతర్గత విలువ : నమ్మకం

 

ఒక రోజు, ఒక బీద పిల్లవాడికి, తినడానికి ఏమీ దొరకలేదు. చాలా ఆకలితో ఉన్నాడు. పక్కనే ఉన్న ఒక కిరాణా కొట్టు నుంచి ఒక అరటి పండు దొంగిలించాడు.
భగవంతుని భక్తుడు అవ్వడం వల్ల, సగం పండు హుండీ లో వేసి ఇంకో సగం తను తిన్నాడు.

కిరాణా కొట్టువాడు గమనించి పిల్లవాడిని పట్టుకుని నిందించాడు. పిల్లవాడు కూడా తన తప్పు ఒప్పుకున్నాడు. కొట్టువాడికి, పిల్లవాడిని చూస్తే, చాలా జాలి వేసింది.
గుణపాఠం చెప్పడానికి, గుడి చుట్టూ కొన్ని ప్రదక్షిణాలు చెయ్యమన్నాడు. పిల్లవాడు చెప్పిన మాట విని, గుడిలో ప్రదక్షిణం చేస్తుంటే, భగవంతుడు కూడా ప్రదక్షిణం చెయ్యడం చూసి, కొట్టువాడు ఆశ్చర్య పోయాడు.

ఆ రోజు రాత్రి, భగవంతుడు కొట్టువాడి కలలోకి వొచ్చి ఇలా అన్నారు,’నేను కూడా దొంగిలించిన పండు సగభాగం తీసుకున్నాను. అం దుకే గుడిలో పిల్లవాడితో పాటు ప్రదక్షిణం చేశాను’ KA2_091

నీతి:
భగవంతుడు ఎప్పుడు మనుషులలో, నీతి, నిజాయితీ, ప్రేమ చూస్తారు.

http://saibalsanskaar.wordpress.com
https://www.facebook.com/neetikathalu