Archive | February 2017

అసలైన విలువలు

విలువ : సత్యం

అంతర్గత విలువ : విచక్షణ

img_2080

ఒక పాప దగ్గర పెట్టెలో కొన్ని ముత్యాలున్నాయి. వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేది. ఒకరోజు ఆ పాప పడుకుని ఉండగా తండ్రి పక్కనే కూర్చుని, “నీ ముత్యాలు నాకివ్వవా అమ్మా….?!” అని అడిగాడు.
“అవంటే నాకిష్టం డాడీ. నేను పెద్దవుతున్నాగా… కావాలంటే నా బేబీ డాల్ తీసుకో….!” అంది.
“థాంక్యూ… వద్దులే అమ్మా… ఐ లవ్యూ…!” అని నుదుటి మీద ముద్దు పెట్టుకుని వెళ్లిపోయాడు తండ్రి.
అయిదు సంవత్సరాలు గడిచాయి. ఒక రోజు పక్కమీద పాప పడుకుని వుండగా, తండ్రి వచ్చి పక్కన కూర్చుని “నీ ముత్యాలు ఇవ్వవా తల్లీ….?!” అని అడిగాడు.
“సారీ డాడీ… కావాలంటే నా సైకిల్ తీసుకో… పెద్దయ్యాగా….!” అంది.
“వద్దులే అమ్మా….! థాంక్యూ…. డాడీ లవ్స్ యు….!” అని వెళ్లిపోయాడు. అలా కొంత కాలం గడిచింది.
ఒకరోజు ఆ అమ్మాయి తల్లితో కలిసి దేవాలయానికి వెళ్లింది. అక్కడ బాలల శిక్షా బడిలో చెప్పిన నీతి కథలను పాప శ్రద్ధగా వింది.
ఆ రోజు రాత్రి తండ్రి వచ్చి మళ్ళీ అదే అడిగాడు. ఆ అమ్మాయి ముత్యాల పెట్టె ఇచ్చేస్తూ…. “తీసేసుకో డాడీ. నాకివీ అవసరంలేదు….!” అంది.
అప్పుడా తండ్రి జేబులోనుంచి అలాంటి పెట్టేనే మరొక దాన్ని తీశాడు. దాన్ని ఆమెకిస్తూ “వీటిని నీకిద్దామని ఎప్పటినుంచో నా దగ్గిరే ఉంచుకున్నాను. ఇవి నిజమైన ముత్యాలు. ఇప్పటివరకూ నువ్వు భద్రంగా దాచుకున్నవి నకిలీవి తల్లీ…!” అంటూ కూతురికి అందించాడు అసలైన ముత్యాలని.
ముందువాటి కన్నా ఇవి ఎంతో స్వచ్ఛంగా మెరుస్తునాయి…. ఆ పాప కళ్ళలాగే ……!!!

నీతి :
భగవంతుడు కూడా ఇలాగే అసలు ముత్యాలయిన ఆనందం… ప్రేమ… ప్రకృతి పట్ల ఇష్టం…. సంగీతం పట్ల ఆరాధన…. కరుణ… ఆప్యాయత లాంటి గుణాలని  ‘ఇవ్వటానికి’ సిద్ధంగా ఉంటాడు.
కానీ మనమే తాత్కాలిక ఆనందాన్నిచ్చే అసూయ… ద్వేషం… కోపం… స్వార్ధం… లోభం
లాంటి నకిలీ ముత్యాల్ని పట్టుకుని అవే ‘నిజమైన’ ఆనందాన్ని ఇస్తాయని అనుకుంటూ ఉంటాం ….! వాటిని వదిలేస్తే తప్ప నిజమైనవి దొరకవని తెలుసుకున్న మనిషే ధన్యుడు…

http://saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu

Advertisements

నిష్కల్మషమైన ప్రేమ

విలువ — ప్రేమ

అంతర్గత విలువ — విశ్వాసము / దయ

 

img_2032

 

గురు గోబింద రాయి , వంద ఏళ్ళ క్రితం , సిక్కుల ల 10ఓవా గురు. ఆయన చిన్న వయస్సుకల వారై, బలంగా ఉండేవారు.
చాలా బిగ్గరగా నవ్వేవారు, భగవంతుడు అందృఢమైన ప్రేమ, నమ్మకం. ఆయన చుట్టూ ఆనందాహ్లాదమైన వాతావరము ఉండేది. అందరూ గురువుగారు ఏమి పాఠాలు నేర్పిస్తారో అని ఎదురు చూసేవారు.

గురు గోబింద రాయి తన శిష్యులందరిని పిలిచి “మీరు యాత్రికులకు, అతిధులకు, ఉచితంగా అన్నదానం చెయ్యాలి. మీ ఇంటికి వచ్చిన అతిధి, భోజనము చెయ్యకుండా వెళ్ళకూడదు’ అని బొధించారు.”

అందరూ , గురువుగారు చెప్పినట్టే విని, యాత్రికులను , అతిధులను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. అయినా,గురువుగారికి, శిష్యులకి పరీక్ష పెట్టాలి అని అనిపించింది. “ఎప్పుడూ ప్రేమగా భోజనము పెడుతున్నారా , లేక బద్ధకిస్తున్నారా అని చూడాలనిపించింది.

గురు గోబింద రాయి, ఎప్పుడూ చాలా శుభ్రముగా ఉండే దుస్తులు వేసుకునే వారు. కాని ఒక రోజు మాములు యాత్రికుడి లాగా వేషము వేసుకున్నారు. దుస్తులు చాలా మురికిగా ఉన్నాయి.

శిష్యుల ఇంటికి తెల్లవారుతూనే వెళ్లారు. అందరూ అప్పుడే లేచి తయారవుతున్నారు.
గురువుగారు అన్నారు “నేను రాత్రంతా ప్రయాణము చేసి వచ్చిన యాత్రికుడిని, తినడానికి ఎమైనా ఉంటున్నదా ‘ అని అడిగారు.
ఒక శిష్యుడు ‘ఇంత ఉదయాన్నే తినడానికి ఏమీ ఉండదు, కొంచంసేపు అయ్యాక వస్తే భోజనము తయారవుతుంది ‘ అని అన్నాడు.

గురువుగారికి నిష్కల్మషమైన ప్రేమ అంటే ఏంటో , తన శిష్యులకి చూపించాలని అనిపించింది. అందరికీ వాళ్ళ గురించి తప్ప, ఎదుటి వాడిని ప్రేమతో చూసుకోవాలి అని తెలియడంలేదు, అని అనుకున్నారు. ”

అందరి ఇళ్ళకి వెళ్లారు కానీ,ఎవ్వరూ భోజనము పెట్టడానికి తయారుగా లేరు.
ఆఖరికి నందలాల్ అనే శిష్యుడి ఇంటికి వెళ్లారు గురువుగారు. నందలాల్ కి గురువుగారు అంటే చాలా ప్రేమ , భక్తి.
నందలాల్ , యాత్రికుడి వేషములో ఉన్న గురువుగారిని చూడగానే, చాలా మర్యాద చేశాడు. అప్పుడు గురువుగారు అన్నారు ‘నేను రాత్రంతా ప్రయాణము చేసి వచ్చిన యాత్రికుడినని, తినడానికి ఎమైనా ఉందా ‘ అని అడిగారు.
అప్పుడు నందలాల్ అన్నాడు ‘మీరు భోజనము ఉందా అని అడగక్కర్లేదు, భోజనము తయ్యారు గానే ఉంది’

గురువుగారు చాలా సంతోషపడ్డారు.
నందలాల్, లోపలినుంచి, కొంచం చపాతీపిండి, సగము ఉడికిన పప్పు, పచ్చి కూరలు, వెన్న, అన్నీ గురువుగారి ఎదురిగా పెట్టి, మీకు ఏమి వడ్డించమంటారో చ్గెప్పండి అని అడిగాడు. మీకు,నా గురువుగారికి చేసిపెట్టి నట్టుగా ప్రేమగా వడ్డిస్తాను అని అన్నాడు.
గురువుగారు చెప్పినట్టుగానే ఇంటికి ఎవరు వచ్చినా ప్రేమగా భోజనము పెట్టేవాడు నందలాల్.

మరునాడు గురువుగారు అందరిననీ పిలిచి , మన ఊరిలో నందలాల్ ఇల్లు ఒక గుడి. నందలాల్, ఎవరు ఏ సమయము లో వచ్చినా కూడా ప్రేమగా, శ్రద్ధగా భోజనము పెడుతున్నాడు అని చెప్పారు. ఇలా ప్రవర్తించడం వల్ల నందలాల్ ధన్యుడు అయ్యాడు.

నందలాల్ దానికి గురువుగారి పట్ల తన కృతజ్ఞతను తెలియపరుస్తూ ‘సత్పురుషులకి, మహాత్ములకి భోజనము వండి పెట్టడము, స్వర్గలోకానికి వెళ్లడం కంటే పుణ్యము. మహాత్ములకి సేవ చెయ్యడం ఒక భాగ్యం. సత్పురుషుల మాటలు వేదవాక్కులు”అని అన్నాడు

నీతి.
ప్రేమకి , సహాయము చెయ్యడానికి ఎప్పుడూ ముందు ఉండాలి అని మన గురువులు మనకి నేర్పించారు. మన ఇంటికి ఎవ్వరు వచ్చినా ప్రేమగా, మర్యాదగా చూడాలి.
అందరిననీ ప్రేమించాలి, అందరికీ సహాయము చెయ్యాలి, అందరిలోనూ భగవంతుడిని చూడాలి.

 

http://saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu

 

 

బీదవాడి సంపద

img_1965బీదవాడి సంపద.
విలువ — శాంతి
అంతర్గత విలువ — తృప్తి/ సంతోషము

రాంచంద్ మరియు ప్రేమ్చంద్ యిరుగింటివాళ్ళు. (యిరుగు, పొరుగు)
రాంచంద్ ఒక బీద వ్యవసాయి.
ప్రేంచంద్ ఒక జమీందారు.
రాంచంద్ సంతోషంగా జీవితం గడుపుతున్నాడు. రాత్రి విశ్రాంతి తీసుకునే టప్పుడు, తన ఇంటి తలుపులు కిటికీలు, మూసుకునే వాడు కాదు. ధనము లేకపోయినా సంతోషంగా ఉండేవాడు.
ప్రేంచంద్ మటుకు ఎప్పుడూ దిగులుగా ఉండేవాడు.తన ధనమును కాపాడుకోవడానికి, తలుపులు మూసుకుని ఉండేవాడు. రాత్రి విశ్రాంతిగా నిద్రించేవాడు కాదు.
ప్రశాంతంగా, సంతోషంగా ఉండే రాంచంద్ ని చూసి ప్రేంచంద్ అసూయ పడ్డాడు.

ఒక రోజు ప్రేంచంద్, రాంచంద్ ని పిలిచి, ‘నేను చాలా భాగ్యవంతుడిని. నీ దారిద్యాన్ని చూడలేక, నా దెగ్గిర ఉన్న ధనము కొంచం నీకు యిస్తున్నాను. సంతోషంగా ఉండు’ అని అన్నాడు.
రాంచంద్ చాలా సంతోషపడ్డాడు. రోజూలాగా విశ్రాంతి తీసుకున్నాడు, కానీ నిద్రపట్టలేదు. తన ఇంటి తలుపులు, కిటికీలు మూసివేశాడు, అయినా నిద్రపట్టలేదు. పెట్టెలో ఉన్న ధనాన్ని రాత్రి అంతా చూస్తూ కలత పడ్డాడు.
తెల్లవారగానే రాంచంద్ పెట్టెలో ఉన్న ధనాన్ని తీసుకుని వెళ్లి ప్రేంచంద్ ఇచ్చేసి ఇలా అన్నాడు ‘నేను బీద వాడిని, నువ్వు ఇచ్చిన ధనము, నా సంతోషాన్ని దూరం చేసింది. నీ ధనము నువ్వు తిరిగి తీసుకో!నేను ఇది వరకే బీదవాడిగానే ఆనందంగా ఉన్నాను !”

నీతి
ధనముతో అన్నీ కొనలేము. మనకి ఉన్న దాంతో తృప్తిగా సంతోషంగా ఉండడం నేర్చుకోవాలి.

http://saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu

గురు భక్తి

గురు భక్తి .

విలువ — ప్రేమ.
అంతర్గత విలువ — భక్తి , గౌరవము.

 

img_1938

ఈ కథ రాహుల్ శెట్టికి, తన గురువుగారు శంభు, మీద ఉండే భక్తి, గౌరవం తెలియచేస్తుంది.

ఒక బీద వాడు, రాహుల్ గురువుగారైన శంభు గురించి విని, తన ఆర్ధిక కష్టం నుంచి బయట పడడానికి, సహాయం కోసం ఆయన వద్దకి వెళ్ళాడు

గురువుగారు , బీద వాడి కష్టం విన్నాక, తన పాత చెప్పులు తప్ప ఏమీ ఇవ్వలేక పోయారు.

బీద వాడు నిరాశతో గురువుగారి చెప్పులు తీసుకుని ఒక సత్రములో ఆ రాత్రి గడపడానికి నిర్ణయించుకున్నాడు.

అదే రోజు రాత్రి రాహుల్ శెట్టి, అదే సత్రం లో విశ్రాంతి తీసుకుంటున్నాడు . రాహుల్ శెట్టి చాలా పెద్ద వ్యాపారస్తుడు. మణిమాణిక్యాలతో వ్యాపారం చేసేవాడు.

మరునాడు ప్రొదున్న నిద్రలేవగానే తన గురువుగారి ఉనికిని గుర్తుచెసే సువాసన ఎక్కడినించో వస్తోంది అని గ్రహించాడు రాహుల్.

బీద వాడి దగ్గరకి వెళ్లి , “మా గురువుగారిని కలుసుకున్నావా “అని అడిగాడు. అప్పుడు బీద వాడు అంతా చెప్పి గురువుగారు ఇచ్చిన పాత చెప్పులను చూపించాడు.
రాహుల్ శెట్టి గురుపాదుకలు చూడగానే, బీద వాడికి మణిమాణిక్యాలు ఇచ్చి, పాదుకలు తీసుకున్నాడు.
బీద వాడు రాహుల్ శెట్టికి కృతఙ్ఞతలు తెలిపి ధనం తీసుకుని వెళ్ళిపోయాడు.

రాహుల్ శెట్టి గురుపాదుకలు తీసుకుని తన గురువైన శంభు గారి దగ్గిరకి వెళ్లి, తన వద్ద ఉన్న ధనము అంతా ఇచ్చి పాదుకలు తీసుకున్నానని అని తెలియ చేశాడు.

నీతి.
ఈ కథ గురు భక్తికి మంచి ఉపమానము.
గురు పాదుకలు శిష్యుడికి అత్యంత శ్రేష్ఠమైనవి.l

 

http://saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu