Archive | January 2014

ప్రేమయే తీర్థయాత్ర

విలువ : ప్రేమ

అంతర్గత విలువ : దయ

man-and-dog1

హజ్రత్ ఝునైద్ బాగ్దాది, మక్కా  తీర్థయాత్రకు బయలుదేరినప్పుడు , బాగా గాయపడిన కుక్కను  చూశాడు. దానికి  బాగా దెబ్బలు తగిలి,  నాలుగు కాళ్ళు కూడా గాయ పడ్డాయి.  ఎంతో రక్తం కూడా పోయింది . అప్పుడు హజ్రత్ కుక్కని,  పక్కనే ఉన్న బావి దగ్గరికి తీసుకుని వెళ్ళేడు. దెబ్బలను, నీటితో కడిగి ఆ గాయాలకు కట్టు కట్టాడు.  హజ్రత్ బట్టలు మరియు ఒళ్ళు మొత్తము రక్తంతో తడిసిపోయాయి . కాని అతను తన గురించి ఏమీ పట్టించుకోలేదు. కుక్కని తీసుకుని, ఎడారిలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు,  అతనికి దారిలో ఒక చోట చిన్న ఒయాసిస్ కనిపించింది.

             తీరా చూస్తే ,నీళ్ళు తోడడానికి అక్కడ ఒక బకెట్ కాని, తాడు కాని లేదు.  అప్పుడు దగ్గరలో ఉన్న, ఎండు ఆకులతో ఒక చిన్న బకెట్ తయారు చేశాడు. తన తలగాపాగాను కూడా తాడుగా వాడాడు  కాని, పొడుగు సరిపోలేదు . తోడటానికి బావిలో నీరు  అందలేదు. అందుకని తను వేసుకున్న చొక్కాను కూడా తీసి  ఆ తలపాగాకి కట్టాడు, ఇంకా నీరు అందలేదు అప్పుడు తన ప్యాంటుని  కూడా వాడి తాడు యొక్క పొడుగుని పెంచేడు .మొత్తానికి ఈ సారి నీరు అందింది.

       దాంతో నీరు, తోడి హజ్రత్ కుక్క యొక్క  గాయాలను బాగా కడిగి కట్టు కట్టాడు. కుక్కను జాగ్రత్తగా ఎత్తుకుని ఊరి దాకా కష్టపడి తీసుకొచ్చాడు. అక్కడ  మసీదుకు వెళ్ళి అల్లా దగ్గర ప్రాధేయపడ్డాడు. ‘ తను మక్కా వెళ్ళి వచ్చేదాక కుక్కను జాగ్రత్తగా చూసుకోమని ,తిరిగి రాగానే దానిని తీసుకువెళ్తానని’అల్లాను ప్రార్ధించాడు. ఆ రాత్రి హజ్రత్ నిద్రిస్తున్నప్పుడు ,చాలా పెద్ద వెలుగు ప్రత్యక్షమయింది. హజ్రత్ కి ఈ  మాటలు వినబడ్డాయి, “ హజ్రత్ , నీవు మక్కాకు  వెళ్ళ కుండానే తీర్థయాత్ర ఫలితమును పొందావు . ఎందుకంటే నువ్వు నీగురించి అలోచించకుండా భగవంతుడు సృష్తించిన జీవి మీద అమిత మైన ప్రేమను  చూపించావు. అయినా కూడా మక్కా తీర్థయాత్ర చేస్తావో లేదో నీ నిర్ణయం మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే భగవంతునికి నీ మీద అమితమైన  దయ  కలిగింది. తీర్థయాత్రలు చెయ్యడంకంటే తన సృష్టిని గౌరవించి, ప్రేమించే వారంటే భగవంతుడికి చాలా ఇష్టం.

నీతి

ఏ పనిలో అయినా భగవంతుడు  ప్రేమని మాత్రమే లెక్క చేస్తాడు. ఎందుకంటే ఆయనకి  ప్రేమ, భక్తి అంటే చాలా ఇష్టం.

https://saibalsanskaar.wordpress.com/2013/02/25/love-is-the-pilgrimage/

 

ఉన్నతంగాఆలోచించు అంతర్గత విలువ:- మంచి నడవడిక-విలువ:- ధర్మ

first pic tiger and foxఒక అడవిలో ఒక నక్క ఉండేది.  దాని ముందు కాళ్ళు రెండు విరిగి పోయాయి అవి ఎలా విరిగి పోయాయో ఎవరికీ తెలియదు.  బహుశా  ఏ బోను లో నుంచో తప్పించుకునే సమయం లో విరిగి పోయి ఉంటాయి. అడవిలో ఉండే ఒక వ్యక్తి తరచుగా  ఆ నక్కను గమనించి ఆశ్చర్య పడుతూ ఉండేవాడు.  కాళ్ళు లేని నక్క ఆహారం ఎలా సంపాదించుకోగలుగుతోంది,  ఎలా బ్రతక గలుగుతోంది అని.

ఒక రోజున చాలా దగ్గర నుంచి అతడు  నక్కను గమనిస్తున్నాడు.  ఆ సమయం లో ఒక పెద్దపులి అటువైపు వస్తోంది.  అది గమనించి చేసేదేమీ లేక పొద చాటున నక్కి కూర్చున్నాడు.  పులి పంజా నిండా తాజా గా వున్న మాంసం ఉంది. పులి నక్క సమీపంలో నేల మీద కూర్చుని తనకు కావలసిన మాంసం తిని మిగిలిన మాంసం అక్కడ వదలి వెళ్లి పోయింది.   మరుసటి రోజు కూడా అలాగే జరిగింది.   ప్రతి రోజు ఇదే విధంగా నక్కకు ఆహారం అందుతూ వచ్చింది.  ఇది ఏదో అదృశ్యశక్తి ప్రభావం అని ఆ వ్యక్తి భావించాడు. ఆ వ్యక్తి కి భగవంతుని మీద భక్తి ఉంది.

అప్పుడు ఆ వ్యక్తి ఇలా ఆలోచించాడు. నక్క లాగే నేను కూడా విశ్రాంతి తీసుకుంటూ ఒకమూల కూర్చుంటే అదృశ్య శక్తి నాకు కూడా ఆహారం అందిస్తుంది అని భావించాడు. ఆహారం కోసం ఎన్ని రోజులు ఎదురు చూసినా అతనికి ఎవరూ ఆహారం అందించలేదు.  క్రమంగా చిక్కి శల్యమై  పోయాడు. స్పృహ  కోల్పోయే పరిస్థితికి చేరుకున్నాడు.

అప్పుడు అతనికి ఒక అశరీర వాణివినిపించింది ;  ఓయీ నీవు పొరపాటు పడుతున్నావు నక్కను అనుసరించడం కాకుండా  పులిలా ఆలోచించు  అని.

second pic tiger and fox

నీతి:-  బాధ్యత  మనకు శక్తి నిస్తుంది.  బాధ్యతా రాహిత్యం మనల్ని బలహీనుల్ని చేస్తుంది. ఇతరులకు సహాయపడే వాళ్ళకు భగవంతుడు సహాయపడ తాడు. కష్ట పడకుండా ఫలితం లభించదు.

ప్రార్థన-అంతర్గత విలువ : భక్తి, విశ్వాసం-విలువ: ప్రేమ

first pic earn gods grace thro prayers

ఒక పేదరాలు నలుగురు కొడుకులతో , ఇద్దరు కుమార్తెలతొ నివసించేది. ఆమె భర్త ఆరోగ్యం సరిగా లేకపొవడంతో ఇంట్లో ఆదాయం వచ్చే దారి నిలిచిపోయింది. ఇంట్లో సరుకులు అయిపోతుండడంతో ఏమి చెయ్యాలో తెలియక ఆమె బాధపడసాగింది. దగ్గరలో వున్న షాపులో అరువు మీద సరుకులు తెద్దామని వెళ్ళింది.

షాపు యజమానితో వినయంగా తన ఇంటి పరిస్థితి చెప్పింది.అర్ధం చేసుకుని అరువు  మీద సరుకులు ఇస్తాడేమో అని ఆశ పడింది. అతను అర్థం చేసుకోకపోగా, సహాయం చెయ్యడానికి కుడా ఇష్టపడలేదు. ఆ షాపు కి వచ్చిన  ఒక ఆయన అదంతా చూసి ఆమెకి కావలసిన సరుకులు ఇమ్మని , డబ్బులు తాను ఇస్తానని చెప్పేరు.  షాపు యజమాని అయిష్టంగానే సరుకుల చీటిని తక్కెడలో పెట్టమని, ఆ చీటికి సరితూగే వస్తువులను మత్రమే ఇస్తానని చెప్పేడు. అది విన్న పేదరాలు తలవంచుకుని కొంచెంసేపు కళ్ళుమూసుకుంది . తరవాత చీటి మీద ఏదో రాసి వినయంగా తక్కెడలో పెట్టింది. ఆమె చీటి ఉంచిన వైపు తక్కెడ, చాలా బరువు ఉన్నటుగా కిందకి దిగిపొయింది.అది చూసిన షాపు యజమాని,అక్కడ ఉన్న వ్యక్తి ఇద్దరూ ఆశ్చర్యపోయారు.

షాపు యజమాని చీటిబరువుకి సరితూగేలా సరుకులను తక్కెడలో ఉంచడం మొదలుపెట్టేడు. విచిత్రంగా ఎన్ని సరుకులు పెట్టినా చీటి ఉన్న వైపు బరువుగానే ఉంది. అతనికి అనుమానం వచ్చి అసలు అందులో ఏమి రాసి ఉందాఅని చుసాడు. అందులో సరుకుల  వివరాలకి బదులు  , ఈ విధంగా ఒక ప్రార్థన వుంది. “ప్రియమయిన భగవంతుడా నా అవసరాలు ఏమిటో నీకు తెలుసు, నిన్ను శరణువేడుతున్నాను నువ్వేమి  ఇవ్వాలనుకుంటే అవి ఇవ్వమని నా విన్నపము”.

ఆ అద్భుతం చూసిన షాపు యజమాని ఉచితంగా ఆమెకి కావలసిన సరుకులు అన్ని ఇచ్చేడు. ఆమె కృతజ్ఞతలు తెలిపి సంతోషంగా వెళ్ళింది. అతను చీటిలో ఏముందో చూడకపొయిఉంటే దాని బరువుకి తక్కెడ విరిగిపొయిఉండేది అనితెలుసుకున్నాడు.

second pic love god thro prayers

నీతి:

ప్రార్థన ద్వారా భగవంతుడితో మన భావాలు  తెలియచేస్తూ సన్నిహిత సంబంధం కలిగిఉండవచ్చు. మనకి సహాయం చెయ్యడానికి భగవంతుడు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. నిజాయితీతో చేసే ప్రార్థనకి తప్పకుండా వెంటనే స్పందిస్తాడు. పూజించడం ద్వారా లేదా  మానసికంగా స్మరించడం ద్వారా  భగవంతుడిని ఆరాధించవచ్చు. ప్రేమతో నమ్మకంగా చేసే ప్రార్థనలు తప్పకుండా ఫలిస్తాయి.