Archive | November 2015

అహం కారం దాని ప్రభావం

 

image.jpegఅహం అనే శబ్దము నకు నేను అని అర్ధం అందరి కంటే నేనే గొప్పవాడిని లేదా నేను మాత్రమే అందరి కంటే గొప్పగా ఉండాలి అని ఈ భావననే అహం అని నిర్వచించ వచ్చు ఇది మన జీవితానికి చేసే చెడు ఇంతా అంతా కాదు ఈ భావన నుంచి బయట పడగలిగితే జీవితం లో అంతకంటే ఆనందం మరేదీ ఉండదు ఈ ప్రభావానికి లోనైతే ఇంత కంటే నరకం కూడా మరొకటి ఉండదు

చాల నిరుత్సాహం కలిగించే ఒక విషయం ఏమిటంటే విజయాలను సాధించా మని భావించే వారు, ప్రముఖ వ్యక్తులు చేసే పనులు ఎక్కువగా ఇతరుల దృష్టిని ఆకర్షించ డానికే చేస్తారు. వాళ్ళు కూడా అహం అనే సంకెళ్ళ నుంచి బయట పడలేరు అహం అనే చెడ్డ గుణం సహజంగా తనను పెంచి పోషించే వాళ్ళకోసం వెతుక్కుంటూ ఉంటుంది అందువల్ల అదో పెద్ద ముష్టిది అహం అనే చెడ్డ గుణం తో ఉన్న సమస్య ఏమిటంటే దాన్ని మనం పెంచి పోషిస్తే మనలో నేనే గొప్ప అనే భావం (superiority complex) ప్రబలుతుంది దాన్ని అసలు పట్టించు కోకుండా వదిలేస్తే మనలో ఆత్మ న్యూనతా భావం (inferiority complex) బయలు దేరు తుంది ఎలా చూసినా అది మనకు మన శ్శాంతి లేకుండా చేస్తుంది అహం మననుంచి కోరే మూల్యం ఏమిటంటే మన మన శ్శాంతి. దువ్వెన కొనుక్కోడానికి జుట్టు ఎందుకు అమ్ముకోవాలి ? అలాగే అహం అనే చెడ్డ గుణాన్ని సంతృప్తి పరచడానికి మనం మన మన శ్శాంతి ని ఎందుకు దూరం చెసుకూవాలి?

ఈ అహం కారం మూలంగా ఇతరులకంటే మన గొప్పగా ఉండాలని లేదా వాళ్ళను మించి పోవాలని నిరంతరం సంఘర్షణ కు గురి అవుతుంటాం అహాన్ని విడచి పెడితే మనం మనని జయించా గలుగుతాం మన స్వ శక్తితో అభివృద్ధి సాధించ గలుగుతాం ఇతరుల దృ ష్టి లో గుర్తింపు పొందడానికి అహం మన చేత మంచి చెడ్డల తో నిమిత్తం లేకుండా ఏదైనా చేయిస్తుంది ఇటువంతి స్థితిని జీవితం లో ప్రతివారు ఎప్పుడో ఒకప్పుడు ఎదుర్కొంటూనే ఉంటారు ఇది ఒక విచిత్రమైన పరిస్థితి మంచి అయినా దానికి గుర్తింపు లభించి నపుడే అది మంచిగా భావింప బడుతుంది పదిమంది దృ ష్టిని ఆకర్షించ గలిగితే చెడ్డ కూడా మంచిగా గుర్తింపు పొంద గలుగుతుంది ఇదేరీతిలో పదిమంది దృష్టిని ఆకర్షించ లేక పొతే మంచి కూడా చెడ్డ గానే భావింప బడవచ్చు ఈ అహం అనేది దాని విషయం లో మనం శ్రద్ధ చూపించి నపుడే అది బ్రతక గలుగుతుంది అందుచే ప్రతివాళ్ళు జీవితం లో ఈ అహం అనే స్థితి ని దాటడానికి (అధిగమించడానికి) ప్రయత్నించాలి జీవితం లోకి అహం ప్రవేశిస్తే ఉన్నవన్నీ పోతాయి దాన్ని దూరంగా ఉంచ గలిగితే మనకు అన్నీ సమకూరతాయి

అహం కారణం గా ఎంతోమంది ఎన్నో విలువైన అనుబంధాల్ని దూరం చేసుకున్నారో కదా అందుచేత అహం ఎంత మాత్రము విలువ లేనిది ఎంతమాత్రము గొప్పది కాదు అహాన్ని విడిచి అందరితో అనుబంధం పెంచుకోవాల లేదా అహాన్ని పెంచి పోషించి అనుబంధాలను నాశనం చేసుకోవాలా అనే విషయం ఎవరికీ వారే ఆలోచించు కోవాలి అహాన్ని రక్షించుకోవడం అంటే బంగారం లాంటి అనేక సదవ కాశాల్ని పోగొట్టుకోవడమే అహం తో నిడిన మనస్సు తో ఉన్నవారు వేసే ప్రతి అడుగు నిప్పు మీద నడవడం లాంటిది వాళ్ళకు ప్రతి క్షణం ప్రతి విషయం ప్రతి అనుబంధం ఉద్రిక్తత ను అవిశ్రాంతి ని కలిగిస్తాయి. ప్రశాంతత అహం ఈ రెండింటికి ఎంతమాత్రం పొసగదు

ఒక కాకి ఒక మాంసము ముక్కను తన్నుకు పోతోంది ఆ మాంసము ముక్క కోసం చాలా పక్షులు దాని వెంట పడ్డాయి ఆ కాకి మాంసం ముక్కను వదిలేసింది పక్షులన్నీ కాకిని వదిలేసి మాంసం ముక్క వైపు మరలాయి అప్పుడు ఆ కాకి ఆకాశం లో స్వేచ్చ గా ఎగర గలిగింది మాంసం ముక్కను వదిలేశాక నాకు స్వేచ్చ గాఎగేరే అవకాసం లభించింది అనుకుంది కాకి అందుచే అహాన్ని విడిచి పెడితే మనకి స్వేచ్చ మనశ్శాంతి లభిస్తాయి

http://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

 

 

 

మాతృ ప్రేమ!!!

image

విలువ :ప్రేమ

అంతర్గత విలువ :అవ్యాజ మైన ప్రేమ

మా అమ్మకు ఒక కన్నే ఉండేది నేను ఆమెను ఎంతగానో అసహ్యించు కొనేవాడిని ఆమెను చూడడానికే చాలా ఇబ్బంది అనిపించేది అంటే ఆమె అంత అందవికారంగా ఉండేది ఆవిడ కుటుంబ పోషణ కోసం పిల్లలకు ఉపాధ్యాయులకు వంట చేసి పెట్టేది ఎలిమెంటరీ స్కూల్ లో నేను చదివే రోజుల్లో ఒకరోజున మా అమ్మ నాకు అభినందలు చెప్పడానికి వచ్చింది నేను చాల ఇబ్బంది పడ్డాను అసలామె అలా ఎందుకు చేసింది అని అనుకున్నాను నేనసలు ఆమెను పట్టించుకో లేదు ఆమె కేసి అసహ్యంగా ఒక చూపు చూసి పరుగెత్తుకుని పారిపోయాను ఆ మరునాడు నా తోటి విద్యార్ధి మీ అమ్మకు ఒక కన్ను లేదా అని అడిగేడు నాకు చాల సిగ్గనిపించింది చచ్చి పోవాలని పించింది మా అమ్మ అసలు కనపడ కుండా పొతే బాగుండునని అనిపించినది ఆ రోజున ఆమెతో పెద్దగా గొడవ పడ్డాను నన్ను ఎందుకు నవ్వుల పాలు చేస్తావు నీవు చావ కూడదా? అని కోపంగా అన్నాను మా అమ్మ ఏమీ సమాధానం చెప్పలేదు కోపం లో నేను ఎంత అనరాని మాటలన్ననో తరువాత కూడా నేను మరొకసారి ఆలోచించలేదు పశ్చాత్తాప పడలేదు ఆవిడ ఏమనుకుంటుందో అనే ధ్యాస అసలే లేదు ఆ యింటి నుంచి వెళ్లి పో వాలని నాకావిడ తో పని లేదని భావించాను చాల కష్ట పది చదివాను విదేశాలు వెళ్ళే అవకాసం కోసం రావాలని మంచి ఉద్యోగం వచ్చింది పెళ్లి చేసుకున్నాను పిల్లలు పుట్టారు ఇల్లు కూడా కొనుక్కున్నాను నా భార్యా పిల్లల తో హాయిగా సుఖ సంతోషాలతో కాలం గడుపుతున్నాను

ఒక రోజున నాకెంతో ఆశ్చర్యం కలిగేల మా అమ్మ మా ఇంటికి వచ్చింది ఆవిడను చూసి చాల ఏళ్ళ యింది మా పిల్లల్ని ఆవిడ అసలు చూడనేలేదు మా పిల్లలు గుమ్మం దగ్గర నిలబడ్డ ఆవిడను చూసి నవ్వారు పిలవకుండా వచ్చిన ఆవిడను చూసి నాకు చాల కోపం వచ్చింది ఇక్కడకు రావడానికి నీకెంత ధైర్యం వెంటనే ఇక్కడనుంచి ఫో అని కోపంగా అరిచాను మా అమ్మ చాల ప్రశాoతంగా క్షమించు బాబూ తప్పుడు చిరునామాకు వచ్చాను అని చెప్పి మళ్ళీ కనబడ కుండా వెళ్లి పోయింది ఒక రోజున పూర్వ విద్యార్ధుల సమావేశం ఉందని మా school నుంచి ఆహ్వానం వచ్చింది బిజినెస్ పని మీద ఊరు వెడుతున్నానని మా ఆవిడతో అబద్ధం చెప్పి బయలు దేరాను ఫంక్షన్ అయిపోయినతరువాత మేము చిన్నప్పుడు ఉన్న పాత ఇంటికి వెళ్లాను ఉత్సాహం గా మా అమ్మ కొన్ని రోజుల క్రిందట చని పోయిందని చుట్టు ప్రక్కల వాళ్ళు చెప్పారు నేను ఒక్క కన్నీటి బొట్టు కూడా విదల్చ లేదు నాకు ఇమ్మని చెప్పిందని వాళ్ళు నాకు ఒక ఉత్తరం ఇచ్చారు దాని లో ఇలా వ్రాసి ఉంది

ప్రియాతి ప్రియమైన బాబూ

నేను ఎప్పుడూ నీ గురించే ఆలోచిస్తూ ఉంటాను నేను మీ ఇంటికి వచ్చి మీ పిల్లలను భయ పెట్టాను నీ వు పూర్వ విద్యార్ధుల ఫంక్షన్ కు వస్తున్నావని చాల ఆనందం కలిగింది ఒక్కసారి నిన్ను చూడాలని ఉంది కాని నేను మంచం మీద నుండి లేవగలిగే పరిస్థితి లో లేను నేను నిన్ను చిన్నప్పటి నుంచి ఇబ్బంది పెడుతూనే ఉన్నాను ఒక్క మాట…….

నువ్వు చిన్నపిల్లవాడు గా ఉన్నప్పుదు ఒక ప్రమాదం లో నీ కన్ను పోయింది పెరిగి పెద్దవాడ వవుతున్న నిన్ను నీకున్న ఒకే కన్నును చూసి నాగుండె తరుక్కు పోయింది నాకున్న ఉన్న రెండు కళ్ళ లో ఒక కన్ను నీకు ఇచ్చాను పోయిన నీ కంటి స్థానం లో ఉన్న నా కంటి తో నీ వీ ప్రపంచాన్ని చూస్తున్న్నందుకు నేనెంతో గర్వపడుతున్నాను

ఇట్లు

ప్రేమతో మీ అమ్మ

నీతి మనం తల్లి తండ్రుల నెప్పుడు ప్రేమతో గౌరవం తో చూడాలి భగవంతుడు మనకు ప్రేమతో ఇచ్చిన ఆశీస్సు లే మన తల్లి తండ్రులు. తాను అందరి దగ్గర ఉండడం సాధ్యం కాదు కనుక భగవంతుడుమనకెంతో విలువైన తల్లి తండ్రులను ఇచ్చాడు పిల్లల కోసం తల్లి తండ్రుల కంటే త్యాగం చేసే వారు మరెవరు ఉండరు పై కథ వలన మనకు తెలిసే నీతి ఇదే

మనలను ప్రేమతో పెంచిన తల్లి తండ్రులను మనం ప్రేమగా చూడాలి వాళ్ళని సంతోషం గా ఉంచేందుకు మన చేయగలిగినంత ప్రయత్నం చేయాలి

http://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

 

 

వ్యతిరేక విషయాలలో అనుకూలతలు !!!

imageవిలువ :నిజాయతీ

అంతర్గత విలువ :ఆశాభావ దృ క్పధం

ఒక యువతి తన డైనింగ్  టేబుల్ వద్ద కూ ర్చుని చెల్లించాల్సిన పన్నుల గురించి చేయాల్సిన ఇంటి పని గూర్చి మరుసటి రోజు థాంక్స్ గివింగ్ డే సందర్భం గా వచ్చే అతిధులకు కుటుంబ సభ్యులకు చేయాల్సిన వంట గురించి ఆలోచిస్తూ చాల చీకాకు గా ఉంది ఆవిడ ఒక సారి తల ప్రక్కకు త్రిప్పి చూసింది ఆమె కుమార్తె నోట్ బుక్ లో ఏదో శ్రద్ధ గా వ్రాస్తోంది ఏం వ్రాస్తున్నావు అని కుమార్తెను అడిగింది వ్యతిరేక విషయాలలో ఉండే అనుకూ లతలు అనే విషయం గురించి ఒక పారాగ్రాఫ్ వ్రాసుకు రమ్మని మా టీచర్  వర్క్ ఇచ్చారు మొదట్లో మనకు ఇబ్బంది గా అనిపించి చివరకు ఆనందం కలిగించే విషయాల గురించి వ్రాయమని కూడా చెప్పారు అని చెప్పింది
తన కుమార్తె ఏం రాసిందో చూద్దామని ఉత్సాహంగా ఆ యువతి పుస్తకం లోకి తొంగి చూసింది దాల్లో ఇలా వ్రాసి ఉంది
సంవత్సరాం త పరీక్షలు వస్తున్నాయి అని గాభరా అనిపించినా తరువాత్ సెలవులు వస్తాయి అనే విషయం ఆనందాని కలిగిస్తుంది
మందు చేదు గా అనిపించినా అది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది
అలారం కొట్టినపుడు లేవడం బద్ద్ద్ధకం అనిపించినా ఆ అలారం మనం బ్రతికే ఉన్నామని గుర్తు చేస్తుంది
ఇది చూశా క తల్లికి జ్ఞా నోదయం అయింది ఆమె ఇలా ఆలోచించింది నాకు చాల సమస్యలు ఉన్నాయి కాని వాటిని పరిష్క రించు కొనే అవకాశా లు కూడా ఉన్నాయి
నేను పన్నులు చెల్లించాలి అదృ ష్ట వశాత్తు ఉద్యోగం ఉంది ఇంటి పనులు చేసుకోవ లసి వచ్చినా ఉండడానికి ఇల్లు ఉంది అతిధు ల కు కుటుంబ సభ్యులకు వంట చేయాల్సి వచ్చినా థాంక్స్ గివింగ్ డే వాళ్ళ తో ఆనందంగా గడపె అవకాశం ఉంది అంటే సమస్యలు మాత్రమే ఉండి వాటిని పరిష్కరించు కోవడానికి అవకాశాలు లేని చాలామంది కంటే నేను చాల చాల అదృ ష్ట వంతురాలను అనుకుంది ఈ ఆలోచన రాగానే ఆమెకు మానసికం గా ఎంతో ఉత్సాహం గా అనిపించింది.
నీతి:మనం మనకు వ్యతిరేకం గా ఉన్న విషయాల గురించి చాల ఇబ్బంది పడుతుంటాము కాని వాటిలో ఉండే అనుకూలతలను గురించి ఒక్క క్షణం ఆలోచిస్తే మనం ఎంత అదృష్ట వంతులమో తెలిసి వస్తుంది

http://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

 

ఉత్తమ చెట్టు

 

image
ఒక రైతు పొలం లో ఒక మామిడి చెట్టు, ఒక వేప చెట్టు పక్క పక్కన మొలిచాయి. వాటిని గమనించిన పొలం యజమాని మామిడి చెట్టుకు పాదు చేసి, మంచి ఎరువు వేసి నీళ్లు పెట్టేవాడు. వేప చెట్టును గురించి పట్టించుకోలేదు.
తానూ గొప్పది కాబట్టి రైతు తన పట్ల శ్రద్ద చూపుతున్నాడనే భావం మామిడిలో కలిగింది. కాసింత అహంకారం కూడా పెరిగింది.
కాలక్రమంలో రెండు చెట్లు పెరిగి పెద్దవయ్యాయి. పూలు పూచి, కాయలు కాసాయి. మామిడి పండ్లు మధురంగా వుండగా వేప పండ్లు చేదుగా వున్నాయి. ప్రతి ఒక్కరూ తన మధుర ఫలాలని ఇష్టపడి తింటూ వుండటం తో మామిడికి మరింత గర్వం పెరిగి వేపతో మాట్లాడటం మానివేసింది .
అది గమనించిన వేప ” మామిడిగారూ ..! ఏమిటి ఇటీవల నాతొ మునుపటిలా వుండటం లేదు ..? ” అని అడిగింది .
” నాకూ .. నీకు ఏమి పోలిక. మధుర రసాలను యిచ్చు వృక్షాన్ని నేను. నోట పెట్టుకోను పనికిరాని చెడు ఫలాలు నీవి. నా కంటే తక్కువ దానివి నీతో నాకు స్నేహమేంటి ….? ” గర్వంగా చెప్పింది మామిడి .
” నీవి మధుర ఫలాలయినంత మాత్రాన గొప్ప దానివని మురిసిపోకు. నా విత్తనాలకూ మంచి గిరాకీ వుందని ఏరుకు పోతూ వున్నారు తెలుసా ..! అయినా అహంకారితో స్నేహం అవసరం లేదులే . .! ” అంది వేప .
అలా మామిడి , వేప వాదులాడుకోవడం వాటి పక్కన నిలువెత్తుగా పెరిగి వున్న కొబ్బరి చెట్టు వింది . రెంటి మధ్య మాటలు దానికి చిర్రెత్తి పోయి ” అబ్బా ..! ఆపండి మీ వాదులాట. వినలేకపోతున్నాను . .” అంది .

 

image
” అదేంటి కొబ్బరిగారూ .. అలా విసుక్కుంటారు . మా ఇద్దరిలో ఉత్తమ చెట్టు ఏదో తేల్చుకోలేక పోతుంటే ..” అంది మామిడి .
” పోనీ మీరైనా చెప్పండి. మా ఇద్దరిలో ఎవరు గొప్పో …! దాంతో ఈ గొడవ తీరిపోతుంది . ఎవరి మానాన వాళ్లు బతుకుతాం ..” అంది వేప.
”పిచ్చి మొఖాల్లారా …! ఒకరు గోప్పెంటి . ..మరొకరు తక్కువేంటి…! మన చెట్లు దేనికవే గొప్పవి. ప్రతిదీ ఏదో ఒక ప్రత్యేకతను కలిగి వుంటుంది . మీ వాదులాట మానుకోండి ..” అని మందలించింది కొబ్బరి .
కానీ తమలో ఉత్తమ చెట్టు ఏదో తేల్చి చెప్పమని నిలదీసింది మామిడి .
”సరే ..! అంతగా అడుగుతున్నావు కాబట్టి చెపుతున్నాను …చెప్పాక బాధ పడకూడదు …” అంది కొబ్బరి .
” అలాగే ” అని తలలూపాయి మామిడి , వేప .
” నా దృష్టిలో వేప ఉత్తమ చెట్టు ..” చెప్పింది కొబ్బరి .
” ఎలా చెప్పగలవు …?” ప్రశ్నించింది మామిడి .
” మధురమైన మామిడి ఫలాలు తిన టానికి అందరూ ఇష్టపడతారు. తిన్నవారికి రుచినీ, తృప్తినీ ఇవ్వగలవు మరి వేప పండ్లు తిన టానికి చేదుగా వుంటాయి. అయినా వేప విత్తనాలు ఔషధ గుణాలు కలిగి, ఎన్నో వ్యాధులు నయం చేయడానికి ఉపయోగ పడతాయి. అలాంటి మంచి లక్షణాలు కలిగిన వేపను ఉత్తమ చెట్టుగా నిర్ణయించాను. ఇక మీ ఇష్టం …” చెప్పింది కొబ్బరి .
” అదేం లేదు. నీకు నేనంటే అసూయ. దానికి మద్దతుగా అలా చెప్పావు. నీ తీర్పును నేను అంగీకరించనుఅంది మామిడి .
కాలం సాగి పోతూ వుంది.
మామిడికి అంటు పట్టని చీడ పీడలు సోకాయి. వేరులో కుళ్ళు తెగులు పట్టింది . ఆకులు , కాయలు రాలి పోసాగాయి. కొమ్మలు కూడా అక్కడక్కడా ఎండు ముఖం పట్టాయి . మామిడికి పట్టిన తెగులు రైతు గమనించాడు . వెంటనే వేప చెట్టు క్రింద రాలివున్న కాయలను బాగా దంచి పొడిచేసి , దానిని మామిడి చెట్టు మొదట్లో వేసాడు . దానితో మామిడి వేరుకు పట్టిన పురుగు నశించి , తిరిగి మామిడి ఆరోగ్యంగా తయారైంది .
అప్పుడు మామిడికి కనువిప్పు కలిగింది .
కొబ్బరి చెట్టు చెప్పినట్లు ‘ తీపిని యివ్వటం గొప్ప కాదు . ఆరోగ్యాన్ని యివ్వటం గొప్ప ..’ అన్న విషయాన్ని తెలుసుకుంది. వేపని ఉత్తమ చెట్టుగా అంగీకరించి , తిరిగి స్నేహాన్ని కొనసాగించింది.
నీతి: ఎదుట వారి గొప్ప గుణాలను తక్కువగా ఎంచకూడదు

http://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

 

 

భగవంతుడు ఎక్కడ ఉన్నాడు!!!

image

 

విలువ:సత్యం
అంతర్గతవిలువ:జాగ్రత్తగా గమనించడం

ఒక సాధకుడు గురువుగారి దగ్గరకు వెళ్ళి భగవంతుడు ఎలా ఉంటాడు? ఆయన్ని కలుసుకోవాలంటే ఏమి చెయ్యాలి? అని అడుగుతాడు.
దానికి గురువుగారు, నాయనా: భగవంతుడు అన్నిచోట్ల ఉంటాడు, ఆయన లేనిప్రదేశం ఉండదు. అలాగే అందరి హృదయాల్లోనూ ఉంటాడు, నీ హృదయంలో కూడా ఉన్నాడు అని చెప్పారు. దానికి సాధకుడు మరి నాలోనే ఉంటే నాకెందుకు కనిపించట్లేదు అని అడుగుతాడు. అప్పుడు గురువుగారు నీ హృదయంలో భగవంతుడు ఉన్నా నీ మనసు ప్రాపంచిక విషయాల్లో చిక్కుకుని ఉంది, మనసు భగవంతుడి వైపు తిప్పు అప్పుడు నువ్వు భగవంతుడిని గుర్తించగలవు అంటారు. సాధకుడు ఇంకా ప్రశ్నలతో విసిగిస్తుంటే గురువుగారు అతన్ని హరిద్వార్ లో గంగా నది వద్దకు వెళ్ళమంటారు. అక్కడ ఒక చేప మనలాగే గొంతువిప్పి మట్లాడగలదు, అది నీకు సమాధానం చెప్తుంది అంటారు.
సాధకుడు గంగానది వద్దకు వెళ్ళి కనిపినంచిన చేపలన్నిటిని ఇదే ప్రశ్న అడుగుతూ ఉంటాదు. కొంతసేపటికి మట్లాడే చేప నీటి పైకి వచ్చి నువ్వు ఎక్కడనుండి వచ్చావు? అని అడుగుతుంది. గురువుగారు తనను పంపిన విషయం చెప్తాడు. అప్పుడు చేప వారం రోజులుగా దాహం వేస్తోంది. నాకు తాగడానికి నీరు ఎక్కడ దొరుకుతుందో చెప్పగలవా అని అడుతుంది. సాధకుడు నవ్వుతూ , మూర్ఖంగా మట్లాడకు నీ చుట్టూ ఉన్న నీరు నీకు కనిపించట్లేదా? అని అడుగుతాడు. దానికి చేప మరి భగవంతుడు కూడా అన్ని చోట్లా ఉన్నాడుగా, నువ్వెందుకు చూడలేకపోతున్నావు అంటుంది.
అప్పుడు సాధకుడు నువ్వు తలకిందులుగా నీటిలోకి వెళ్తే నీరు తాగచ్చు. నీ శరీరం ఆ విధంగా తయారుచేయబడింది.మమూలుగా నీటిలో ఉన్నా అది నీలో ప్రవేశించదు అలా అయితే నువ్వు వెంటనే చచ్చిపోతావు అంటాడు. అప్పుడు చేప కూడా నువ్వు మనసు భగవంతుడి వైపు తిప్పు, అలా ప్రయత్నం చేస్తే నువ్వు భగవంతుడిని చుడగలవు అంటుంది. సాధకుడుచేప చెప్పినట్లుగా ప్రయత్నం చేసి భగవంతుడు తనలోనే ఉన్నాడని గ్రహిస్తాడు.
నీతి: మనసు పెట్టి ప్రయత్నం చేస్తే భగవంతుడిని మనలోనె కాక ప్రతిజీవి లోనూ చూడవచ్చు.

https://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

 

ఒక గ్లాసు పాలతో బాకీ పూర్తి గా తీరి పోయింది

image

విలువ :సత్ప్రవర్తన

అంతర్గత:విలువ కృతజ్ఞత

ఒక బీద విద్యార్ధి ఇంటింటికి తిరిగి సరుకులు అమ్మి వచ్చిన సొమ్ము తో school fee కట్టి విద్యాభ్యాసం కొనసాగించే వాడు ఒకరోజున అతడు బాగా అలసి పోయి ఆకలిగా ఉన్నాడు అతడు అమ్మ వలసిన సరుకులలో ఒకే ఒక packet మిగిలి ఉంది తాను తరువాత వెళ్ళే ఇంటి వాళ్ళను భోజనం పెట్టమని అడుగుదా మనుకున్నాడు ఒక ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు ఒక అందమైన యువతి వచ్చి తలుపు తీసింది ఆ పిల్లవాడు కొంతసేపు నిశ్చే ష్టు డై నిలబడి పొయాదు. కొంతసేపటికి తేరుకుని భోజనం అడగడానికి బదులుగా మంచినీళ్ళు కావాలని అడిగేడు ఆమె ఆ పిల్లవాడు చాల ఆకలి గా ఉన్నాడని గ్రహించి ఒక గ్లాసు నిండుగా పాలు తెచ్చి ఇచ్చింది ఆ పిల్లవాడు తృ ప్తి గా పాలు త్రాగి మీకు ఋ ణ పడి ఉన్నాను మీకు ఎంత ఇవ్వాలి అని అడిగేడు దానికామె నీవు నాకు ఏమీ ఇవ్వ నక్కర లేదు ఎదుటివారికి దయ తో చేసి న సహాయానికి ప్రతి ఫలం ఆశిం చకూడదని మా అమ్మ చెప్పింది అని ఆమె సమాధానం చెప్పింది ఆ పిల్లవాడు మరిక సారి ఆమెకు కృ త జ్ఞ త చెప్పి వెళ్లి పోయాడు ఆ అబ్బాయి పేరు Kelly
చాల రోజులు గడచి పొయాయి. ఆ యువతి ఏదో ఒక అరుదైన వ్యాధి తో బాధ పడుతోంది ఆ వూరిలో వైద్యులు ఆమెకు చికిత్స చేశారు కాని వారికి ఆమెకు వచ్చిన వ్యాధి ఏం టో అంతు పట్టలేదు వాళ్ళు ఆమెను సమీపం లోని పట్టణం లో ఉన్న పెద్ద ఆసుపత్రి కి వె ళ్ళమని సలహా ఇచ్చారు ఆ ఆసుపత్రి వారు ఆ కేసు ను చూడమని kelly కి అప్ప జెప్ప్పారు ఆ పేషెంట్ వూరు పేరు విని kelly కళ్ళ లో ఏదో వింత మెరుపు కనిపించింది వెంటనే కెల్లీ డాక్టర్ దుస్తులలో ఆ పేషెంట్ ఉన్న గదికి వెళ్ళాడు ఆమెను చూసిన వెంటనే గుర్తు పట్టాడు ఆమెను పరీక్షించి తన గదికి వెళ్ళాడు ఎలాగైనా ఆమెను ఎలాగైనా రక్షించాలని నిర్ణయించు కున్నాడు ఆ రోజు నుంచి ఆమెకు ప్రత్యెక శ్రద్ధ తో వైద్యం చేసాడు చాలా కాలం ప్రయత్నించి చివరకు ఆమె వ్యాది ని నయం చేయ గలిగాడు ఆమె హాస్పిటల్ బిల్ ను approval నిమిత్తం తన వద్దకు పంపమని కెల్లీ హాస్పిటల్ సిబంది ని కోరాడు వాళ్ళు పంపిన బిల్లు తీసుకుని చివరలో ఏదో వ్రాసి సంతకం చేసి Kelly దానిని పేషెంట్ గదికి పంపించాడు
ఆమె ఆ బిల్లు ను తెరచి చూడడానికే భయపండింది తన మిగిలిన జీవితకాలం అంతా కష్ట పడి నా ఆ బిల్లు చెల్లించ డం తన వలన కాదని ఆమె భయపడింది ఆమె ఆ బిల్లు తెరచి చూసే సరికి చివరలో వ్రాసిన అక్షరాలూ ఆమె దృ ష్టి ని ఆకర్షిం చాయి ఆక్కడ ఇలా వ్రాసి ఉంది ఒక గ్లాసుడు పాల తో ఈ బిల్లు పూర్తి గా చెల్లించ బడింది క్రింద కెల్లీ సంతకం ఉంది ఆమె కళ్ళు ఆనంద బాష్పా లతో నిండి పోయాయి తృప్తి గా ఆమె భగవంతుడికి కృ త జ్ఞ త లు చెప్పుకుంది ఓ భగవంతుడా నీ ప్రేమ సమస్త మానవకోటి హృ దయాలలో వ్యాపించాలి అని ఆమె భగవంతుడిని ప్రార్ధించింది

నీతి:మనం ఏది ఇస్తే అదే తిరిగి మనకు లభిస్తుంది మనం ఇతరులకు సహాయపడితే మన అవసరాలకు ఎవరో ఒకరు సహాయపడతారు ఇతరులు చేసిన సహాయం మరచి పోకుండా గురుత్మ్చుకోవాలి ప్రతి ఫలాపేక్ష లేకుండా ఇతరులకు సహాయం చేయాలి సాధ్యమైనంత ఎక్కువ మందికి సహాయ పడాలి అందరికీ ప్ర్రేమను పంచి ప్రపంచంలో మార్పు తీసుకు రావాలి

https://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu