Archives

జంతువులు పట్ల దయ, ప్రేమ

14th November 2012, సాయి భజన అయ్యాక, ఇంటివైపునడుస్తున్నాము. చిన్నగా పిల్లి అరుపు వినిపించింది. ఎక్కడ నుంచి, ఈ అరుపు అని వెతుకుతుండగా, ఒక పిల్లి బోనులో ఇరుక్కుపోయింది.
cat in cage

అక్కడపని వాడు, పిల్లి చాలా ఇబ్బంది పెడుతోంది అని, బోనులోపెట్టేసాడు . కానీ మాకు జాలి వేసి పిల్లిని విడిపించాలి అని అనిపించింది. ఏంచెయ్యాలో తెలియలేదు. దారిలో వెళ్లే ఒక ఆవిడని ప్రాధేయ పడ్డాము, పిల్లిని విడిపించచడానికి, సహాయము చేయమని. ఆవిడ సహాయం తో పిల్లిని విడిపించాము. పిల్లి ఆనందంతో, గెంతులువేస్తుంటే, చూడడానికి, చాలా సంతోషం కలిగింది. పిల్లి ఎవ్వరినీ ఇబ్బంది పెట్టలేదు.
ఒక మంచి పని చేసాము, అని మాకు అనిపించింది. అప్పటి నుంచి ఏ పిల్లి అయిన బోనులో ఇరుక్కుందా అని గమనిస్తూనే ఉన్నాము.

జంతువులు పట్ల, జాలి, దయ, ప్రేమ నేర్చుకున్నాము.
మా చుట్టుపక్కల ఏమీ అవుతోందో గమనిస్తూనే ఉన్నాము.

http://premaarpan.wordpress.com/