Archives

కల్లు రామ్ మరియు గురు నానక్

విలువ :సత్యం
అంతర్గత విలువ :సాక్షాత్కారం

కల్లు రామ్ అనే పేదవాడు గురు నానక్ ని , తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు.
గురు నానక్ అంగీకరించి, ఒక రోజు, కల్లు రామ్ ఇంటికి వెళ్ళారు. మూసివేయబడిన తలుపును గురు నానక్ తట్టారు. కానీ తలుపు తెరవడానికి కొంత సమయము పట్టింది.

కల్లు రామ్ తలుపు తీసి , “గురువుగారు, నన్ను క్షమించాలి, తలుపు తీయడానికి ఆలస్యము అయింది “,
అని అన్నాడు. గురు నానక్, ‘ఎందుకు ఆలస్యమయింది , ఏమి చేస్తున్నావు లోపల?’ అని అడిగితే . కల్లు రామ్, ‘నేను గోడకి మేకులు కొడుతున్నాను’ ,అని సమాధానం ఇచ్చాడు . గురు నానక్ , “ఏమిటి? గోడకి మేకులు కొడుతున్నావా !! నువ్వు నా వెంట రా”, అని అన్నారు . “కల్లు రామ్ , మీరెలా చెప్తే అలా ,అని గురునానక్ వెంట వెళ్ళాడు.

ఆ విధంగా కల్లు రామ్, “ గురునానక్ అడుగుజాడలలో నడిచి ఆయన ప్రియ శిష్యుడయ్యాడు .

నీతి :

మనలోని ఆత్మ గురువు, కరుణా పూర్ణమైన,మధుర మైన స్వరంలో మనని ,” మీరు ఏమి చేస్తున్నారు?

గోడలకు మేకులు కొడుతున్నారా?ఇంకా సంసారమనే రొంపిలో మునిగి ఉన్నారా?తినటం,త్రాగటం,పొగత్రాగడం, పేక ముక్కలతో ఆడటం,వినోదాలలో మునిగి తేలటం లొనే ఇంకి  ఉంటారా?జీవితపరమార్ధం, ఆత్మయొక్క వైభవం,ఆత్మసాక్షాత్కారం అనే అతి ముఖ్యమైన లక్ష్యములను మరిచిపోయారా?”,అని అడుగుతున్నారు.

మనకి సరియైన మార్గమును చూపించమని పరమాత్మను వేడుకుందాం.అజ్ఞానం నుండి సుజ్ఞానం వైపుకు ,చీకటి నుండి వెలుగు వైపుకు నడిపించే దయామయుడైన సద్గురువును పంపించమని ప్రార్ధన చేద్దాము.

మూలం:

తత్వజ్ఞానానికి సంబందించిన స్వామి శివానంద కథలు

నిజమైన భక్తి

          విలువ :   ప్రేమ 

         ఉప విలువ :    భక్తి . 

ఒకానొక  గ్రామంలో ఒక గొప్ప పండితుడు భగవద్గీతను గురించి చాలా చక్కని వ్యాఖ్యానం చేస్తూ ప్రవచనం చెబుతున్నారు . ఆ ప్రసంగం వినడానికి ఒక పల్లెటూరి బైతు కూడా వచ్చాడు. అక్కడున్నవారంతా చాలా శ్రద్ధగా ప్రవచనం వింటున్నారు . కానీ ఈ పల్లెటూరి రైతు మాత్రం ఏడుస్తూ ఉన్నాడు . అక్కడ వ ఉన్నవాళ్లు   ఇతనిని ఎందుకు ఏడుస్తున్నావు? అని అడిగారు. రధ సారధిగా శ్రీ కృష్ణుడు అర్జునుని   రధం నడుపుతున్నాడు.   అర్జునునితో ఏదైనా మాట్లాడాలి అంటే మెడ తిప్పి శ్రీ కృష్ణుడు మాట్లాడాలి కదా . అలా మాట్లాడినప్పుడు  ప్రభువు  మెడ ఎంత నొప్పి పెట్టిందో కదా ! అని ఏడుస్తున్నాను  అని అతను అన్నాడు . ఆ పల్లెటూరి అమాయకపు వ్యక్తి అంతగా ఆ ప్రవచనం లో ని పాత్రలో లీనమై నాడు . అర్జునితో జరిగిన సంభాషణలో శ్రీ కృష్ణుడు పడిన భాదను అతను స్వయంగా అనుభవించగలిగాడు అంటే అతనికి భగవంతుని యందు కల నిజమైన భక్తి మాత్రమే . 

నేర్వవలసిన నీతి :గొప్ప శాస్త్రాలు చదవటం ,వినటం వాటిని గురించి చెప్పడం ఒక విషయం . అయితే అందులో శాస్త్ర సారాంశమును ,అసలైన సందేశమును బాగా అర్థం చేసుకొని దానిని స్వయంగా ఆచరణలో పెట్టకపోతే విన్నది, చదివినది చెప్పింది అంతా వ్యర్థం. శాస్త్రములు కేవలం మనకి మార్గాన్ని చూపే మ్యాప్ ల వంటివి మాత్రమే. మనము విన్నదానిని ,చదివినదానిని అర్థం చేసుకొని వాటిని ఆచరణలో పెట్టగలగాలి .  

https://saibalsanskaar.wordpress.com/2017/07/26/real-devotion/

బ్రహ్మ జ్ఞానమును పొందుట

.

    విలువ :   ధర్మ 

ఉప విలువ :  ఆత్మ జ్ఞానము.

ఒకానొకప్పుడు ఒక శిష్యుడు , ఒక గురువుగారి వద్దకి వెళ్ళి  బ్రహ్మ జ్ఞానమును     బోధించమని అర్ధించాడు. గురువుగారు అతనికి ఒక మంత్రాన్ని ఉపదేశించి ఎటువంటి స్వార్ధపూరితమైన కోరిక  లేకుండా  ఆ మంత్రాన్ని ఏడాది పాటు జపించి ఆ తరువాత బ్రహ్మ జ్ఞానమును పొందటానికి రమ్మని చెప్పారు.   ఒక సంవత్సర కాలం ఆ మంత్ర జపం చేసిన తరువాత శిష్యుడు గురువు దగ్గరకి వచ్చి “గురుదేవా సంవత్సరమంతా  మంత్రం జపం చేసి వచ్చాను”. అన్నాడు. గురువుగారు ఏమి చెపుతారో అని ఆసక్తితో  ఎదురు చూస్తూన్నాడు . గురువుగారు తనకి  తప్పకుండ  బ్రహ్మ జ్ఞానము గురించి  బోధిస్తారని ఆశ పడ్డాడు. అదే సమయంలో అక్కడి పరిచారిక, ఆశ్రమం ఆవరణ అంతా తుడిచి చూసుకోకుండా ఆ దుమ్మంతా శిష్యుడి మీద పోసింది. శిష్యుడు ఆ పని మనిషి పైన కోపంతో మండి పడ్డాడు అప్పుడే శుభ్రంగా స్నానం చేసి వచ్చిన అతని బట్టలు మొత్తం మట్టి కొట్టుకు పోయాయి.అతను కోపంగా చూడటం వలన ఆ పరిచారిక చాలా భయపడింది. గురువుగారు  జరుగుతున్న సంఘటనను గమనిస్తున్నారు . 

                                బ్రహ్మ జ్ఞానమును బోధించటానికి నీవు  అర్హుడవు కాదు . చూసుకోకుండా దుమ్ము పోసినందుకే నీవు పని అమ్మాయి పైన కోపించావు. ఆ పాటి సహనం లేని వాడికి బ్రహ్మ జ్ఞానము ఎలా బోధించగలరు ? “వెనుకకు వెళ్ళిపోయి మళ్ళీ ఒక సంవత్సరం  పాటు మంత్రం జపం చేసి రా “,  అని గురువుగారు చెప్పారు . 

                         రెండవ సంవత్సరం ఆ శిష్యుడు మంత్రం జపం ఏడాది పాటు చేసి ఆశ్రమం లోకి ప్రవేశించబోతున్నాడు . గురువుగారి ఆదేశం మేరకు ఆ పనిమనిషి మళ్ళీ  ఆ శిష్యుడి మీద దుమ్ము పోసింది . కోపం లో రెచ్చిపోయిన ఆ శిష్యుడు ఆ పనిమనిషిని కొట్టబోయి ఎలాగో తమాయించుకున్నాడు . శిష్యుడు గురువుగారి దగ్గరకు వెళ్ళి  నమస్కరించాడు . బ్రహ్మ తత్వమును ఉపదేశించటానికి ఇంకా నీకు అర్హత రాలేదు . క్రిందటి సంవత్సరం నీవు పాము లక్షణాలను ప్రదర్శించావు . ఇప్పుడు నీవు కుక్క  లక్షణాలను ప్రదర్శించావు  . నీలో ఈ పశు లక్షణాలు పోయిన తరువాతనే నీవు నా దగ్గరకి రా! అని అన్నారు . గురువుగారు . 

                       మూడవ సంవత్సరం లో చివరలో శిష్యుడు శుభ్రంగా  స్నానం చేసి ఆశ్రమానికి వెళ్ళాడు. గురువుగారు ఆదేశం మేరకు పనిమనిషి మళ్ళీ శిష్యుని మీద మురికి నీళ్ళు  పోసింది . శిష్యుడు ప్రశాంతంగా ఆ పరిచారికకు నమస్కారం చేసి,”తల్లీ  !నీకు నా ప్రణామములు అర్పిస్తున్నాను . క్షమ అనే గొప్ప సుగుణాన్ని అలవరించుకోవటానికి నీవు నాకు ఎంతగానో సహాయపడ్డావు . ఇప్పుడు నేను నా గురువు అనుగ్రహాన్ని పొందటానికి అర్హుడనైనాను . ఇక ఎప్పటికీ  నేను నీకు ఋణపడి ఉంటాను , కృతజ్ఞతతో ఉంటాను.”అని చెప్పాడు . 

                      శిష్యుడు గురువుగారికి సాష్టాంగ దండ ప్రణామం చేయగానే గురువు గారు  ఎంతో ప్రేమతో,”నాయనా ! బ్రహ్మ జ్ఞానాన్ని పొందటానికి ఇప్పుడు నీవు పూర్తిగా ఆర్హుడవు అని చెప్పాడు. 

నేర్వవలసిన నీతి : భగవంతుని నామస్మరణ  చేయటం , నిస్స్వార్ధ సేవ చేయటం ,శాస్త్రములను అధ్యయనం చేయటం ,ఆదర్శవంతమైన జీవితం గడపటం వంటి అంశములన్నీ  ఆధ్యాత్మికత ప్రయాణములో చేసేటువంటి సాధనలు  మాత్రమే. ప్రతి ఒక్కరు (సాధకులైనవారు ) ముందుగా అంటే స్వీయ నియంత్రణను అలవరచుకోవాలి  ,ఆహంకారమును పోగొట్టుకోవటం , తనను తాను  అదుపులో పెట్టుకోగలగటం లో పరిణితి సాధించగలిగినప్పుడు ఆత్మ సాక్షాత్కారమునకై  తపన ప్రారంభం అవుతుంది.  సరైన సమయం వచ్చినప్పుడు అటువంటివారికి ఆత్మ జ్ఞానం కలుగుతుంది . కాయ ఇంకా పండకుండా పచ్చిగా ఉన్నప్పుడు ఎంత  బలం గా గాలి వీచినప్పటికీ అది రాలి క్రింద పడదు. కానీ పండు బాగా పండినప్పుడు రాత్రి నిశ్శబ్ద వేళలో కూడా నేలపై పడిపోతుంది . 

https://saibalsanskaar.wordpress.com/2017/02/22/receive-the-knowledge-of-the-supreme/

భగవంతుని మీద నమ్మకం

saibalsanskaar telugu

విలువ : సత్యం

అంతర్గత విలువ : నమ్మకం

శాంతి తన స్నేహితురాలి ఇంటికి వెళ్ళి అనుకోకుండా చాలా సేపు ఉండిపోయింది. చీకటి పడింది, తన ఇంటికి వెనక్కి, ఒక్కత్తి నడుచుకుంటూ వెళ్తోంది. తనని ఇంటికి జాగ్రత్తగా తీసుకుని వెళ్ళమని, భగవంతునికి ప్రార్థన చేసుకుంది.ladyఇంటికి దగ్గర త్రోవలో నడుచుకుంటూ వెళ్తోంది, చాలా చీకటిగా ఉంది. సగం దూరం నడిచాక, రోడ్డు చివర ఒక మనిషి నుంచుని ఉన్నాడు. తన కోసమే నుంచున్నట్టు, శాంతికి అనిపించి , చాలా భయపడింది,రక్షించమని భగవంతుడిని వేడుకుంది. వెంటనే శాంతికి ఎంతో ధైర్యంగా అనిపించింది. ఎవరో తనతో పాటు నడుస్తున్నట్టుగా అనిపించింది. ఆ మనిషి నుంచున్న చోటు దాటి జాగ్రత్తగా ఇల్లు చేరింది.imagesXGFEY3DIతరవాత రోజు పేపర్ లో, నిన్న రాత్రి ఒక యవతి బలాత్కరింపబడింది అన్న వార్త చూసింది. సమయం చూస్తే శాంతి అక్కడ నుంచి వచ్చిన 20నిమిషాలకి ఈ సంఘటన జరిగింది. ఇది విని శాంతి బాధతో ఏడవడం మొదల పెట్టింది.
భగవంతునికి కృతజ్ఞత చెప్పుకుని, ఆ యువతికి సహాయం చెయ్యడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్ళడానికి నిర్ణయించుకుంది. శాంతి తప్పు చేసిన మనిషిని గుర్తుపట్టగలనని, తన కధ అంతా పోలీస్ కి చెప్పింది. అప్పుడు పోలీస్ శాంతిని, తప్పు చేసిన మనిషిని గుర్తుపట్టగలవా అని అడిగారు. వెంటనే శాంతి, ఆ మనిషిని గుర్తు పట్టి చూపించింది.
తప్పు చేసిన మనిషి వెంటనే క్షమాపణ…

View original post 71 more words

మంచి ఆలోచన –మంగళప్రదము, చెడు ఆలోచన — పతనానికి హేతువు

విలువ — సత్యం
అంతర్గత విలువ — నిర్మలమైన ఆలోచన / మనసు. అభయం

పాండవ వనవాసం కథ మన అందరికి తెలిసిందే !

శ్రీకృష్ణుడు వనవాసములో ఉన్న పాండవులను పలకరించడానికి అరణ్యానికి వెళ్ళి వారితో ఒక రాత్రి గడిపారు. పాండవులు వనవాసకాలంలో ఎన్నో కష్టాలను అనునుభవించారు.

ద్రౌపది కూడా వారితో ఉండటంవల్ల రోజూ ఒక్కళ్ళ తరువాత ఒకళ్ళు రాత్రంతా నిఘా చేసేవారు. ఆ రోజు రాత్రి ,కృష్ణ పరమాత్మ కూడా ఒక గంట నిఘా చేయడానికి ఒప్పుకున్నారు.ధర్మరాజు ఆశ్చర్యంతో ‘కృష్ణా !మీరు లోకపాలకులు ! ప్రపంచంలో అందరినీ కాపాడేవారు . అటువంటప్పుడు మీరు కూడా ఒక గంట నిఘా చెయ్యడంలో అర్ధము ఏమిటి !మీకు తెలియని విషయం కాదు అయినప్పటికీ చెప్పడం నా బాధ్యత ! ఈ పరిసరాలలో ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుడితో మీరు జాగ్రత్తగా ఉండండి. నేను, నా అన్నదమ్ములు , వాడి వల్ల చాలా బాధ పడుతున్నాము. కృష్ణా మీరు మా అతిథి,మా క్షేమ సమాచారాన్ని కనుక్కోవడానికి వచ్చారు.కనుక మీరు విశ్రాంతి తీసుకోండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మాకు ఇష్టంలేదు. దయచేసి మీరు నిఘా చేయకండి.” అని బ్రతిమాలారు. ‘

దానికి జవాబుగా కృష్ణ పరమాత్మ ‘ నా దైవత్వాన్ని మీరు ఇంతే అర్ధం చేసుకున్నారా ధర్మరాజా ! ఏ రాక్షసుడు కూడా నన్ను ఏమి చెయ్యలేడు. కనుక నన్ను కూడా ఒక గంట నిఘా చెయ్యనివ్వండి” అని అన్నారు.

ఒక గంట నిఘా చేసి కృష్ణుడు చిరునవ్వుతో అక్కడ ఉన్న బండరాయి పైన కూర్చున్నాడు.ఆయన తరవాత అర్జునుడు నిఘా చెయ్యాలి. అర్జునుడు శ్రీ కృష్ణుని చెంతకి వచ్చి ‘రాక్షసుడు మిమ్మల్ని తినేస్తాడేమో అని ఎంతో భయపడ్డాను.ఒక వేళ అతనిని మీరే హత మార్చారా ?”అని అడిడాడు.

ఆ ప్రశ్నకి శ్రీ కృష్ణుడు,” ఈ విధంగా జవాబు ఇచ్చారు ‘ నేను రాక్షసులని, పిశాచులని సృష్టించలేదు. అటువంటప్పుడు లేని ఆ రాక్షసులు ఎలా ప్రత్యక్షమవ్వగలరు చెప్పు ?”మీరు ఉన్నాయి అనుకునే రాక్షసులు , మీలో దాగి ఉన్న — కోపము,పగ , ద్వేషము, అసూయ వంటి దుర్భుద్ధుల యొక్క రూపాలు .,మానసిక భయం వల్ల లేని పిశాచాలు,దయ్యాలు ఉన్నాయని ఊహించి మీ బాధలకి ఏవ్ కారణమేమి ఊహించుకుంటున్నారు. నిజానికి భగవంతుని సృష్టిలో దయ్యాలు భూతాలే లేవు! కేవలం ఒక మనిషే తాను పడే బాధలకి గాని,ఇతరులు పడే బాధలకి కానీ కారణం కాగలడు . వేరే ఏ కారణముల లేవు!

కృష్ణుడి మాటల వెనక ఉన్న సత్యాన్ని గ్రహించిన,అర్జునుడు ,ఎంతో కృతజ్ఞతతో కృష్ణుడి పాదాల మీద పడి నమస్కరించాడు. అంతేకాకుండా అప్పటినుండి దయ్యాలకి భయపడటం మానేశాడు.

నీతి :
మంచి చెడు రెండూ కూడా మనిషి చేసే కర్మల వల్ల పొందే ఫలితాలే. యద్భావం తద్భవతి అంటారు. మనము ఏది ఎక్కువగా తలుస్తాము అదే అవుతాము. చాలా వరకు సమస్యలు మానసిక భయాల వల్ల కలిగేవే. ఈ భయాలను అధిగమించి మనలోని ఆత్మవిశ్వాసాన్ని బలపరుచుకుంటే మనని ఏ శక్తులు బాధపెట్టలేవు.

నిష్కళంక మైన ప్రార్థన — భగవంతుడి సాక్షాత్కారం.

saibalsanskaar telugu

sincere

విలువ — ప్రేమ

అంతర్గత విలువ — భక్తి , సేవ.

మహాభారతంలో ద్రౌపదిని ఎలా అవమానించారో మనకి తెలుసు.

దుశ్శాసనుడు   బలవంతంగా  ద్రౌపదిని,జుట్టు పట్టుకుని ఈడ్చుకు వచ్చి  , సభలో ద్రౌపది  భర్తల మధ్య , పెద్ద వాళ్ళ మధ్య అవమానిస్తాడు. ద్రౌపది  ఒంటిమీద ఉన్న చీర కూడా తియ్యడానికి ప్రయత్నిస్తాడు.

ఈ  అవమానాన్ని అందరూ చూస్తూ ఉండిపోయారు.

ద్రౌపది కృష్ణుడిని  ‘ ద్వారకవాసీ నన్ను వచ్చి రక్షించు ‘ అని ప్రార్థించింది.

దుశ్శాసనుడు  ద్రౌపది చీర బలవంతంగా తీసే ప్రయత్నం చేస్తున్నపుడు  వెంటనే  ద్రౌపదిని రక్షించడానికి, కృష్ణుడు చీర రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ద్రౌపదిని నిండుగా కప్పి,దుశ్శాసనుడు తీసేకొద్దీ చీరలు వచ్చేలా చేసాడు.

ద్రౌపదిని రక్షించడానికి ఒక కారణం ఉంది.

ఒక రోజు కృష్ణుడు చెరుకు కోస్తున్నపుడు, వేలు తెగుతుంది. రక్తం కారిపోతోంది.  అక్కడ ద్రౌపది, రుక్మిణి, సత్యభామ ఉంట్టారు.

రుక్మిణి కట్టు కట్టడానికి, పాత గుడ్డ  తీసుకునిరావడానికి వెళుతుంది.

సత్యభామ మందు తీసుకుని రావడానికి ఇంటికి వెళుతుంది.

కానీ ద్రౌపది తన చీర కొంగుని చింపి కృష్ణుడి వేలికి కట్టు కడుతుంది. ద్రౌపది భక్తిని చూసి కృష్ణుడికి చాలా ఆనందం కలుగుతుంది.

ద్రౌపది చేసిన ఈ సేవకి కృష్ణుడు, తను పిలవగానే కష్టంలో వెళ్ళి ఆదుకుంటాడు.

నీతి.

భగవంతుడు మన భక్తిని, మనం చేసిన సేవని ఎన్నడూ మరిచిపోడు.

మనకి కావాల్సిన సమయంలో తప్పకుండా వచ్చి సహాయపడతాడు.

https://saibalsanskaar.wordpress.com/2015/06/12/god-responds-to-sincere-prayers/

https://m.facebook.com/neetikathalu

View original post

కృతజ్ఞత విధి వ్రాతను కూడా మార్చగలదు.

విలువ :  శాంతి  

ఉప విలువ : కృతజ్ఞత. 

ఒక ఎడారిలో ఒక చిన్న పిట్ట పక్షినివసిస్తూ ఉండేది. ఆ ఎడారిలో ఎటువంటి పచ్చదనమూ లేకపోవటం వలన ఆ చిన్న పక్షి మండే ఇసుకలో రోజంతా గెంతుతూ ఉండేది. ఒక రోజున ఒక దేవదూత భగవంతుని దగ్గరకు వెళుతూ త్రోవలో ఈ పిట్టను చూసి చాలా జాలి పడ్డాడు. ఆ దేవదూత ఆ పక్షి దగ్గరకు వెళ్ళి ,” ఓ చిన్ని పక్షి !ఇంత మండే  ఎడారిలో నీవు ఏమి చేస్తున్నావు?నేను నీకు ఏమైనా సహాయం చేయగలనా ?అని అడిగాడు. ఆ చిన్ని పక్షి,” నాకు నా జీవితం ఎంతో ఆనందంగా ఉంది . కాని ఈ ఎండ వేడిని నేను భరించలేకపోతున్నాను.నా పాదాలు రెండు కాలిపోతున్నాయి ఇక్కడ ఒక చెట్టు ఉంటే నాకు  ఎంతో హాయిగా,సంతోషంగా

ఉంటుంది,”అని చెప్పింది . “ఇటువంటి  ఎడారిలో చెట్టు మొలవటం అంటే, నా ఊహకి అందకుండా ఉన్నది. నేను దేవుడి దగ్గరకి వెళుతున్నాను. నీ కోరిక అయన నెరవేల్చగలడేమో అడుగుతాను”, అన్నాడు దేవదూత. 

              ఆ పిట్టకి సహాయం చేయమని దేవదూత దేవుడిని అడిగాడు . అప్పుడు దేవుడు “నేను అక్కడ ఒక చెట్టును పెరిగేలా చేయగలను” కానీ ఆ పిట్ట విధి రాత అందుకు అనుకూలంగా లేదు. నేను విధి లిఖితాన్ని మార్చలేను. కానీ, ఎండనుంచి కాపాడబడటానికి నేను ఒక ఉపాయం చెబుతాను . ఒక సమయంలో ఒక కాలినే ఉపయోగించమని ఆ పక్షికి చెప్పు. అలా చేస్తే ఒక కాలు నేలపై ఉన్నప్పుడు మరొక కాలికి  కొంత సమయం విశ్రాంతి దొరికే అవకాశం లభిస్తుంది. అందువల్ల పక్షి గెంతేటప్పుడు ఒక కాలికి ఒక సమయంలో ఒక కాలికి మాత్రమే మాత్రమే ఎండ వేడి తగులుతుంది. అలా చేయటం వలన పక్షికి కొంత విశ్రాంతి ,ఉపశమనం కలుగుతుంది. అంతే  కాకుండా ఆ పక్షిని తన జీవితంలో జరిగిన కొన్ని మంచి మంచి సంఘటనలను ,మంచి విషయాలను తలచుకుని అవి లభించినందుకు దేవుడికి కృతజ్ఞతని తెలుపుకుంటూ ఉండమని చెప్పు”, అన్నాడు దేవుడు. దేవదూత వెనుకకు వచ్చి పక్షికి దేవుడు పంపిన సందేశాన్ని వినిపించాడు.

                                     పక్షికి దేవుడు చెప్పిన ఈ ఉపాయం చాలా నచ్చింది. తనకోసం శ్రమపడి దేవుడి నుంచి మంచి సందేశం తెచ్చినందుకు దేవదూతకి  కృతజ్ఞతను తెలిపింది. కొన్ని రోజుల తరువాత దేవదూత  మళ్ళీ అదే దారిలో వెళుతూ ఆ పక్షిని  ఒకసారి కలిసి వెళదామని అనుకున్నాడు. సరిగ్గా ఎడారి మధ్యలో ఒక పెద్ద పచ్చని చెట్టు మధ్య ఆ పక్షి హాయిగా కూర్చుని ఉండటం చూశాడు. పక్షి సుఖంగా హాయిగా ఉండటం చూసి దేవదూతకి ఆనందం కలిగినా ,ఆ పక్షి తలరాతలో చెట్టు  లేనే లేదని దేవుడు చెప్పిన విషయం  వల్ల అతనికి కొంత నిరుత్సహం కలిగించింది. దేవదూత మళ్ళీ  దేవుడి దగ్గరకి వెళ్ళి  ఆయనతో ఈ పక్షి గురించి తాను చూసిందంతా చెప్పాడు. 

                           దీనికి జవాబుగా  దేవుడు ఆ దూతతో ,”నేను నీతో ఎప్పుడూ  అబద్దం చెప్పలేదు. పక్షి తల రాతలో చెట్టు రాసి పెట్టలేదు. కానీ నీవు తనకి నా సందేశం వినిపించిన తరువాత నా సందేశాన్ని ఆ పక్షి ఆచరణలో పెట్టి తనకి జరిగిన  మంచి కోసం భగవంతుడికి కృతఙ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నది. నిర్మలమైన హృదయంతో తనకు లభించిన ప్రతీ విషయాన్ని గుర్తుకు తెచ్చుకుని దేవుడికి ధన్యవాదములు తెలుపుకుంది. ఆ పక్షి చూపించిన కృతజ్ఞత పట్ల నేను దయతో కరిగిపోయాను. ఆ కృతజ్ఞత పక్షి తలరాతను మార్చేసింది”, అని అన్నారు “. 

నీతి : కృతజ్ఞత దయను సంపాదించి పెడుతుంది. మనందరం కూడా జీవితం లో మనకు లభించిన వాటన్నిటికీ  కృతజ్ఞతను కలిగి ఉండి,అవన్నీ మనకు అందించినందుకు దేవుడికి ,ఈ విశ్వానికి  మనందరం ధన్యవాదములు తెలియచేసుకోవాలి. మనం భగవంతుని ఆశీస్సులను పొందే ప్రయత్నం చేయాలి. ఒక చిన్న కృతజ్ఞతా భావం మన జీవితం లో ఎంతో అనుగ్రహం తెచ్చిపెడుతుంది.

https://saibalsanskaar.wordpress.com/2016/04/22/gratitude-can-change-destiny/

మూలము:

http://www.speakingtree.in/blog/gratitude-can-change-destiny

మనమందరం సంతోషంగా ఉందాము!!!

విలువ : శాంతి
పవిలువ : నిర్లిప్తత .

అనగనగా రాజభవముకు కొంత దూరంలో ఒక బిచ్చగాడు నివసించేవాడు . అతడు ఒక రోజు ఆ భవనపు గోడపై ఒక నోటీసు బోర్డును చూశాడు.అందులో ,”రాజుగారు ఒక విందును ఇవ్వబోతున్నారు, ఆ విందుకు రాజు వేషధారణలో వచ్చేవారందరు ఆహ్వానితులే.”,అని ఉంది. ఆ ప్రకటన చదివిన బిచ్చగాడికి ఒక వింత కోరిక కలిగింది. తాను ఆ విందుకు వెళ్లి ఆ భోగాలన్నీ చూడాలనుకున్నాడు. కానీ రాజు ధరించే దుస్తులు తనవద్ద లేవు. వెంటనే అతను ఒక ఆలోచన చేశాడు. తన దుస్తులు చిరిగిపోయాయి. విందులో పాల్గొనాలి అంటేరాజరికపు దుస్తులు కావాలి అందుకని రాజు కాపలా దారు వద్దకు వెళ్ళి తనను రాజుగారి వద్దకు వెళ్ళటానికి అనుమతి ఇవ్వమని కోరాడు.
కాపలాదారు లోనికి వెళ్ళి రాజుగారు కొలువులో ఉండటం చూసి,ఆయన ప్రజల కష్టమములను,సమస్యలను వింటున్న సందర్భం చూసి ,ఈ బిచ్చగాడిని లోనికి పోవుటకు అనుమతి ఇచ్చాడు. బిచ్చగాడు రాజసభలోనికి వెళ్ళి రాజు ముందర చేతులు జోడించి నిలబడ్డాడు. రాజు బిచ్చగాడిని, “నీకు ఏమి కావాలి?”, అని అడిగాడు . బిచ్చగాడు, “రాజా! మీరూ ఇవ్వబోతున్న విందుకు, నాకు రావాలని ఉంది . దయచేసి మీ పాత దుస్తులు నాకు ఇప్పిస్తారా”? అని కోరాడు. రాజుగారు తన దుస్తులను అతనికి ఇప్పించారు . బిచ్చగాడు ఆ దుస్తులు తన సైజుకే ఉన్నాయని చాలా సంతోషించాడు. రాజుగారన్నారు ,ఆ బీదవానితో ,”ఈ దుస్తులు ఎప్పటికీ ఇలానే కొత్తవిగా ,శుభ్రంగా తాజాగా ఉంటాయి. వీటిని ఉతకవలసిన పని లేదు. ఎన్నాళ్లు వాడినా చినిగిపోవు”, అని చెప్పారు. ఈ దుస్తులను ధరించి ఆతను విందుకు రావచ్చు అని కూడా చెప్పాడు. ఇది విన్న బిచ్చగాడి ఆనందానికి అంతు లేదు. అతని కళ్ళవెంట నీరు కారింది. వంగి నమస్కారములు చేసి ధన్యవాదములు చెప్పాడు. కానీ, అతనికి రాజు గారి మాటపై నమ్మకము లేదు! ఒకవేళ రాజుగారు ప్రసాదించిన బట్టలు చినిగి పొతే తన పాత బట్టల అవసరం ఉంటుంది ,అని తన పాత బట్టల మూట ఒకటి తయారు చేసికున్నాడు.
అతనికి ఉండటానికి ఒక చోటు అంటూ లేదు. అందువల్ల ఆ మూట చంకలో పెట్టుకుని తిరుగుతూ ఉండేవాడు. తాను వేసుకున్న రాజుగారి బట్టలు చక్కగా మురికి పట్టకుండా శుభ్రంగా ఉండేవి. అయినా తన పాత బట్టలు మూట వదిలేవాడు కాదు. అదే మూట ప్రక్కన పెట్టుకుని రాజు గారిచ్చిన విందుకు వెళ్ళాడు. కానీ లోపల బాధ పడుతూనే ఉన్నాడు. రాజ భవనం లో భోం చేస్తున్నందుకు ఆనందించ లేక పోయాడు. ఎందుకంటే తన పాత బట్టల మూటను ఎవరన్నా కాజేస్తారేమో అని భయము వల్ల. రాజుగారు చెప్పినట్లు రాజు దుస్తులు ఎప్పుడు కొత్తవిగానే ఉన్నాయి. కానీ ఆ బీదవాడు తన పాత బట్టలపై మమకారం వదులుకోలేక ఆ మూటను పట్టుకునే, తిరుగుతుండేవాడు.ఆ బట్టల అవసరం ఏమాత్రం లేకపోయినా సరే. వాటిమీద ప్రేమ వల్ల , ఆ మూట తనతో పాటు ఉండాల్సిందే. అందరు అతనిని “పాతగుడ్డల మనిషి”అంటుండేవారు.
కొన్నాళ్లకు బిచ్చగాడు మంచం పట్టాడు. కానీ పాత గుడ్డల మూట తన దిండు ప్రక్కనే పెట్టుకున్నాడు. రాజు గారు ఒకసారి ఈ బిచ్చగాడి గురించి తెలిసి అతనిని పలకరించటానికి వచ్చాడు. రాజుగారు ఆ బిచ్చగాడిని చూసి చాలా జాలిపడ్డాడు . ఎందుకంటే మూట అవసరం లేక పోయినా ,ఎక్కడ ఎవరన్నా ఆ మూట తీసి కెళ్తారేమో అని అనుక్షణం బాధ, భయంతో సంతోషం లేకుండా గడిపాడు. జీవితాంతం ఈ పాత గుడ్డల మూట అతని సంతోషాన్ని హరించింది అనుకున్నాడు రాజుగారు.

నీతి:
ఈ కథ బిచ్చగాడిదే కాదు. మనందరముకూడా మూటలు మోస్తున్న వారమే. మనస్సు అనే మూటలో శత్రుత్వము, అసూయ ,ద్వేషము,కోపము,బాధలు మొదలగున్నవి నిరంతరం మోస్తున్నాము. ఈ బరువు మనలోనే పెట్టుకుని పెరిగి పెద్దవారమవుతాము. అందువలన సంతోషించాల్సిన సమయంలో కూడా వీటివల్ల పూర్తి ఆనందం పొందలేక పోతున్నాము. ఎప్పటికపుడు ఈ చెడుగుణములను లోపల స్టోర్ చేయకుండా విడిచి పెట్టలేక పోతున్నాము. అందువలననే ఈ దుఃఖము.
పెద్ద పెద్ద భావనాలయందు, రాజభవనములయందు ఉండేవారు ఒక్కొక్కసారి కథలో బిచ్చగాడి లాగే జీవిస్తుంటారు. కొంతమంది అనాధ ఆశ్రమంలో ఉం టూ ఏమి లేకపోయినా సంతోషంగా తృప్తిగా వుంటారు దర్జాగా రాజుల్లాగా వుంటారు ధైర్యంగా. ఇదంతా బాహ్యంలో కన్పించేది కాదు. అంతరంగంలో మనం ప్రపంచాన్ని చూసే దృక్పధం ఫై ఆధారపడి వుంటుంది. మనం యిళ్ళలో అవరసం లేనివి ,పాతవి జమ చేస్తాము. చెత్తపేరుకు పోతుంది. అవసరమైన వాటిపై ప్రేమతో వాటిని వదిలించుకోవటానికి ఇష్టపడము. క్రమంగా యిల్లు గోడౌన్ అయిపోతుంది.

మనకు ఏది ముఖ్యమో ,ఏది కాదో తెలుసుకోలేము. జీవితం అంతా చిన్న చిన్న విషయాలలోనే చిక్కుకుంటున్నది. వృధా అవుతోంది. ఇది యింటికి మాత్రమే పరిమితం కాదు. మన మనసు అనేక ఆలోచనలతో నిండిన పెద్ద గోడౌన్. ఎన్నో పనికిరాని అవసరమైన ఆలోచనలతో నింపేసాము. మళ్ళీ మళ్ళీ ఇంకా నింపుతున్నాము.

సంతోషంగా ఉండటానికి ఏ కారణం అవసరం లేదు. ఎందుకంటే అది మన స్వరూపమే.  

              మన అహంకారంతో జీవితంలో  వచ్చే ఎన్నో సువర్ణావకాశములను కోల్పోతున్నాము. చేతులారా అవకాశములను వదిలేసుకుంటున్నాము. ఎందుకంటే మనం ఎపుడూ మన అహంకారం పోషించు కోవటంలో తీరిక లేకుండా ఉంటున్నాము. ప్రతి క్షణం బరువుగా గడుపుతాము. ప్రతి సంఘటనకు తీవ్ర ఆదుర్దా . ప్రతి చర్యలో కంగారు ,హడావిడి. అహంకారంతో చేసే చర్యలన్నీ నిప్పుల మ్మీద నడకలే. కఠినత్వానికి ,సరళత్వానికి ఏనాటికి పొంతన కుదరదు. మంచి ,చెడు రెండూ ఒకే సమయంలోఉండలేవు.   

             మాంసపు ముక్కను నోట కరుచుకున్న ఒక కాకి ఎగురుతూ ఉన్నది. దానిని చూసి మిగతా పక్షులన్నీ ఆ మాంసపు  ముక్కకై కాకిని తరమసాగాయి . ఇది గమనించి కాకి మాంసపు ముక్కను వదిలేసి పైకెగిరింది. ఇక పక్షులన్నీ కాకి ని వదిలేసి ముక్కవైపు వెళ్లాయి. సుదీర్ఘ ఆకాశంలో ఒంటరిగా సంతోషంగా విహరిస్తున్న  కాకి ఇలా అనుకుంది. “ఒక్క మాంసపు ముక్కను వదిలేస్తే ఆకాశం అంతా నాదే . ఎంత స్వేచ్ఛగా విహరిస్తున్నాను!” 

 పరిస్థితులను స్వీకరించు ,దేవుని శరణాగతి చేయి . మిగతావి వదిలేయి … .!

మూలము:

మే 2014: మ్యాగజైన్ మహాత్రియ – అనంత ఆలోచనలు : 

https://saibalsanskaar.wordpress.com/2016/01/28/let-us-be-happy/

భావేన దైవం 

విలువ –యథార్థము / సత్యము 

అంతర్గత విలువ — మంచి ఆలోచన 

అనగనగా ఒక ఊరిలో రామ అనే  మంచి స్వభావము గలవాడు ఉండేవాడు.రామ అజీర్ణ వ్యాధితో ఎంతో బాధ పడుతూ ఉండేవాడు. అది తగ్గడానికి చాలా ఔషదాలు వాడాడు, కానీ ఏది పనిచేయలేదు. 

ఒక మహాత్ముడు ఆ ఉరికి ఉపదేశం ఇవ్వడానికి రావడం జరిగింది. రామ ఆయన దగ్గరికి వెళ్లి , తన ఆరోగ్య పరిస్థితిని గురించి  చెప్పుకున్నాడు. ఇది విన్న మహాత్ముడు, రామాని, ‘రాతి ఉప్పు ‘(rock salt ) చప్పరించమని , చిన్న చిట్కా చెప్పారు. ఆ మహాత్ముడు చెప్పినట్టే చేసిన రామ కొంత ఉపశమనాన్ని  పొందాడు.

రామ పండగ సమయంలో  ,ఊరిలోని బీద పల్లలికి  మిఠాయి పంచేవాడు. ఒక రోజు మిఠాయి కొనడానికి అంగడికి వెళ్ళాడు. మిఠాయిలని కొనే ముందు వాటిని రుచి చూశాడు , అతనికి అవి చేదుగా అనిపించాయి. అందుకని మరి కొన్ని దుకాణాలకి వెళ్ళి  అక్కడ కూడా మిఠాయిలని రుచి చూస్తే అవి కూడా చేదుగా అనిపించాయి.

అప్పుడు రోజూ రామ ,ఉప్పుని  చప్పరిస్తున్నాడు అని తెలిసిన ఒక షావుకారు , అతనిని ముందర నోరుని  శుభ్రముగా కడుక్కున్న తరువాత మిఠాయిని తినమని సలహా ఇచ్చాడు. అలా చేసిన తరువాత రామకి మిఠాయి, తీపి రుచి తెలిసింది. 

నీతి:

మనలో దుర్గుణములు తెలుసుకుని, వాటిని సరిదిద్దు కోవాలి. మనలోని చెడు నిర్మూలమైనప్పుడే మనకి ఎదుటి వాడిలో  మంచితనం కనిపిస్తుంది. అప్పుడే మనము మహాత్ముల సత్సంగాన్ని ఆనందంగా అనుభవించ కలుగుతాము. దాని వల్ల కలిగే లాభములని పొందగలుగుతాము. ఆలోచనలు ఎంతో శక్తివంతమైనవి . మనలో కలిగే ఆలోచనలే మనము ఎటువంటి వారమో ,ఎటువంటి పనులను చేస్తామో సూచిస్తాయి .మంచి మంచిని ,చెడు చెడుని ఆకర్షిస్తుంది.కనుక మంచినే తలిచి తద్వారా శాంతిని,ఆనందాన్ని పొందుదాము.

https://saibalsanskaar.wordpress.com/2016/03/02/bitter-tasting-sweet/

నత్త గుల్లల యొక్క విలువ

విలువ :      ప్రేమ,ఆశావాదము. 

ఉపవిలువ:  త్యాగము, భాద్యత. 

అక్కా- తమ్ముళ్ళిద్దరు ఒక  బజారులో నడుస్తున్నారు. తమ్ముడికి 4 సంవత్సరములు,అక్కకు 6 సంవత్సరములు. ఇద్దరూ నడుస్తూ ఉండగా , తమ్ముడు ముందు వెళుతూ ఒక్కసారిగా వెనుతిరిగి  చూసే సరికి తన పక్కన అక్క లేదు. అక్క ఒక బొమ్మల దుకాణం ముందు నిలబడి షోకేస్ లోని బొమ్మలను ఎంతో సంతోషముగా చూస్తోంది. తమ్ముడు వెంటనే అక్క నిల్చున్న షాప్ దగ్గరికి వెళ్ళాడు. “అక్కా ఏంటి చూస్తున్నావు ! నీకేం కావాలి?”అని అడిగాడు. అతని అక్క షోకేసులోని బొమ్మలను చూపించి,”నాకు ఆ బొమ్మ కావాలి”,  అని చెప్పింది . తమ్ముడు అక్క చెయ్యి పట్టుకుని షాప్ లోపలకి వచ్చి ఆ బొమ్మను తీసి అక్క చేతిలో పెట్టాడు. ఎంతో బాధ్యత గల అన్నయ్య లాగా ప్రవర్తించాడు . అక్క ఎంతో సంతోషంగా బొమ్మని చూసుకుంటూ ఉంది . తమ్ముడు కాష్ కౌంటర్ దగ్గరకి వెళ్ళాడు. ఆ షాపు యజమాని వీరిద్దరిని ఎప్పటినుంచో గమనిస్తున్నాడు. తమ్ముడు  అక్కను సంతృప్తి పరిచే విధానం చూసి అతను ఎంతోఆనందించాడు. 

                తమ్ముడు కౌంటర్ దగ్గరకు వచ్చి షాప్ యజమానిని “ఈ  బొమ్మ వెల ఎంత సార్” ? అని అడిగాడు . ఆ షాప్ యజమాని జీవితంలో అనేక కష్టములననుభవించి పై కొచ్చిన వాడు. అందువల్ల ఎంతో ప్రేమగా ,ఆప్యాయంగా తమ్మునితో “నీవు ఎంత ఇవ్వగలవు అని ప్రశ్నించాడు ”?

తమ్ముడు తను సముద్రపు ఒడ్డున ఏరిన నత్తగుల్లలు(shells ) మొత్తం తన జేబులోంచి తీసి  షాపు యజమాని బల్ల పై ఉంచాడు. షాపు యజమాని ఆ నత్తగుల్లల్ని డబ్బులు లెక్కపెట్టినట్లు ,లెక్కపెట్టాడు. ఇంతలో తమ్ముడు దిగులుగా “ఇవి ఆ బొమ్మ ఖరీదుకు సరిపోతాయా అండి  ”? అని అడిగాడు.దానికి షాపు యజమాని “లేదు లేదు చాలా ఎక్కువే ఉన్నాయి,నేను బొమ్మ ఖరీదుకి సరిపడేగుల్లలను ఉంచుకుని మిగతావి నీ కు తిరిగి ఇచ్చేస్తాను మిగతావన్నీ నీకిస్తాను”, అని జవాబు ఇచ్చాడు. చెప్పినట్లే , బొమ్మ ఖరీదు వరకు నాలుగు నత్త గుల్లల్ని తీసుకుని మిగతావి తమ్మునికి తిరిగిచ్చేశాడు. తమ్ముడు ఎంతో సంతోషముగా మిగిలిన నత్త గుల్లల్ని జేబులో వేసుకుని అక్క చేయి పట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.             

                  అదే షాప్ లో పనిచేస్తున్న అబ్బాయి ఇదంతా ఎంతో ఆశ్యర్యంగా గమనించాడు. అతను  యజమాని దగ్గరకు వచ్చి “అంత ఖరీదయిన బొమ్మను 4 నత్తగుల్లలకు ఎలా ఇచ్చారు ? అని అడిగాడు. షాపు యజమాని యిలా చెప్పాడు “మనకు ఇవి డబ్బులు కాదు నత్తగుల్లలు మాత్రమే”. కానీ, ఆ బాలునికి అవి చాలా విలువైనవి. అంత చిన్న వయసులో డబ్బు అంటే ఏమిటో తెలియదు అర్థం కాదు. పెద్దవాడుగా ఎదుగుతున్న కొద్దీ డబ్బంటే ఏమిటో తెలుసుకుంటాడు. అప్పుడు అతను అక్కకు నాలుగు నత్తగుల్లలిచ్చి మంచి బొమ్మను కొన్న విషయం గుర్తుతెచ్చుకుంటాడు. డబ్బులివ్వకుండా బొమ్మను కొన్నాను అని నన్ను గుర్తుతెచ్చుకుని ప్రపంచంలో  ఇలాంటి మంచి వాళ్ళు కూడా ఉన్నారు అని అనుకుని మంచి ఆలోచనలు చేస్తాడు. 
నీతి  : స్వచ్ఛమైన ప్రేమను త్యాగం ద్వారా గుర్తించగలుగుతాము. కరుణ ,ప్రేమ కలిగిన మనుషులను వారు దయతో చేసే పనుల ద్వారా గుర్తించగలుగుతాము. మనం కూడా ఇతరులకు మంచినే చేస్తూ మన జీవిత కాలంలో ఎంతో మందికి స్ఫూర్తినిద్దాము.

https://saibalsanskaar.wordpress.com/2016/01/22/shell-worth/