Archive | February 2018

దయతో చేసిన పని చిన్నదే అయినా లక్షలాది ముఖాలపై చిరునవ్వు తెప్పించగలదు

విలువ: ధర్మం
ఉపవిలువ: దయ

 

B04F85AB-34A6-4C24-B1C1-5473715D6D36

ఇద్దరు అబ్బాయిలు పొలంలో నుండి వెళ్తున్న ఒక రహదారిపై నడిచి వెడుతున్నారు. ఇద్దరిలో చిన్నవాడు, ఒక వ్యక్తి తన పొలంలో కష్టపడి పనిచేస్తుండడం చూసాడు. ఆ వ్యక్తి దుస్తులు పొలంగట్టు పక్కన అందంగా పేర్చబడి ఉన్నాయి. ఆ పిల్లవాడు తనకంటే పెద్దవాడైన తన స్నేహితునితో ” ఇతని బూట్లని మనం దాచిపెడదాము. పొలం నుండి బయటికి వచ్చినపుడు అతనికి బూట్లు కనబడవు కదా, అప్పుడు అతని ముఖంలో కనిపించే భారం అమూల్యమైనదిగా ఉంటుంది” అంటూ నవ్వాడు.

ఇద్దరిలోనూ పెద్దవాడైన పిల్లవాడు ఒక్క క్షణం ఆలోచించి ఇలా అన్నాడు.” అతను చాలా పేదవాడిలా కనిపిస్తున్నాడు. అతని దుస్తులు చూడు ఎలా ఉన్నాయో. మనం మరొక విధంగా చేద్దాము. బూట్లు రెండింటిలో ఒక్కొక్క వెండి నాణేన్ని పెట్టి ఈ పొదల వెనుక దాక్కుని చూద్దాము, ఆ వెండి నాణేలను చూసి అతను ఎలా స్పందిస్తాడో చూద్దాము”

ఈ పధకానికి చిన్నవాడు కూడా అంగీకరించాడు. ఒక్కొక్క బూటులోనూ ఒక వెండి నాణేన్ని ఉంచి వాళ్ళిద్దరూ పొద వెనుక దాగి చూస్తున్నారు.

కొద్దిసేపటి తరువాత పనిలో అలసిపోయిన ఆ రైతు బయటకు వచ్చాడు. బూట్లను చూసాడు. ఒక బూటును చేతిలోకి తీసుకోగానే అందులో వెండినాణెం ఉండడం గమనించాడు. ఆ నాణేన్ని పట్టుకుని ఎవరు పెట్టారా అని చుట్టుపక్కలంతా కలయచూసాడు. అతనికి అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. చేతిలో ఆ నాణేన్ని పెట్టుకుని నమ్మలేనట్లుగా దానివైపే చూస్తున్నాడు. అలా అయోమయ స్థితిలోనే రెండవ బూటును చేతిలోకి తీసుకోగానే అందులో రెండవనాణెం అతనికి కనిపించింది. అతని ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

తాను ఒక్కడే అక్కడ ఉన్నానని భావించిన అతను మోకాళ్ళపై కూర్చుని పెద్దగా ప్రార్థన చెయ్యసాగాడు. అతను చేసే ప్రార్థన ఆ కుర్రవాళ్ళు దాక్కున్న ప్రదేశానికి స్పష్టంగా వినబడింది. ఆ పేదరైతు కృతజ్ఞతతో, బాధ నుండి విముక్తి పొందిన ఆనందంతో కళ్ళ వెంట నీళ్ళు కారుస్తూ ప్రార్థన చేసాడు. అనారోగ్యంతో ఉన్న తన భార్య గురించి, ఆకలితో ఉన్న తన కొడుకుల గురించి చెప్పడం వీళ్ళు విన్నారు. అజ్ఞాతవ్యక్తులు ఎవరో తనకు చేసిన ఈ సహాయానికి అతను తన హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేసాడు.

కొద్దిసేపటి తరువాత ఈ కుర్రవాళ్ళు పొదలచాటు నుండి బయటకు వచ్చి తమ ఇంటి వైపుకి నడక కొనసాగించారు. ఆపదలో, అవసరంలో ఉన్న ఒక పేదరైతుకు సమయానికి సహాయం అందించి ఒక మంచిపని చేసినందుకు వాళ్ళకి మనసులో వాళ్లకి ఎంతో ఆనందం, తృప్తి కలిగాయి. ఆత్మానందంతో కూడిన చిరునవ్వు వారి ముఖాలపై వికసించింది.

నీతి: దయతో చేసే ఒక మంచిపని ఒక జీవితాన్నే మార్చవచ్చు. అటువంటి సహాయం అందించినవారికి,అందుకున్నవారికి కూడా ఆనందం కలుగుతుంది. ఇతరులకు మేలు చేసే మంచిపని చేయగల అవకాశం కోసం ఎప్పుడూ ఎదురుచూడండి.

https://saibalsanskaar.wordpress.com/2014/04/20/the-kind-neighbour/

http://www.facebook.com/neetikathalu

 

 

 

 

 

 

 

 

 

 

 

Advertisements

కాలం మాత్రమే ప్రేమ విలువను గుర్తించగలదు

విలువ: ప్రేమ

ఉపవిలువ: ప్రేమ

 

199B7C48-11CC-494F-8CE9-0564B38BF064.jpeg

చాలా ఏళ్ల క్రితం అన్నిరకములైన అనుభూతులు, ఉద్వేగాలు తమ సెలవలను గడపడం కోసం ఒక తీరప్రాంత ద్వీపమునందు సమావేశమైనాయి. ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా, ఉల్లాసంగా సమయం గడుపుతున్నారు. ఒకరోజున అకస్మాత్తుగా గొప్ప తుఫాను రాబోతున్నదనీ, అందరూ ద్వీపాన్ని వెంటనే విడిచిపోవాలని వాతావరణ ప్రకటన వినవచ్చింది.

ఈ ప్రకటన విన్న అనుభూతులు, ఉద్వేగాలు చాలా ఆందోళనకు గురై వెంటనే తమ పడవల దగ్గరికి పరిగెత్తాయి. కాని ఒక్క ప్రేమ మాత్రం వింతగా ప్రవర్తించింది. అది ద్వీపం వదిలి వెళ్ళడానికి తొందరపడలేదు. ప్రేమ చెయ్యవలసిన పని చాలా ఉంది. అది అంతా పూర్తి చేసుకునేసరికి బాగా ఆలస్యమైపోయింది. అప్పటికే పడవలన్నీ వెళ్ళిపోయాయి. ప్రేమ కోసం ఒక్క పడవ కూడా లేదు. అయినా ప్రేమ ఆశతో ఏదో ఒక ఆధారం దొరకకపోతుందా అని ఎదురుచూస్తున్నది.

ఈలోగా “సంపద” అందమైన పడవలో వెళ్తూ కనిపించింది. నీతో నన్ను కూడా తీసుకువెళ్ళవా? అని ప్రేమ సంపదని అడిగింది. ” నా పడవంతా బంగారంతో ఇంకా అనేక విలువైన వస్తువులతో నిండిపోయింది. నీకు పడవలో చోటు లేదు” అంటూ వెళ్ళిపోయింది సంపద.

తరువాత గర్వం మరొక చక్కటి పడవలో వెళ్తూ అటుగా వచ్చింది.” ఓ గర్వమా; నన్ను నీతో పాటు పడవలో తీసుకువెళ్తావా” అని ప్రేమ అడిగింది. దయచేసి సహాయం చెయ్యి అంటూ అర్థించింది ప్రేమ. నీ పాదాలు బురదగా ఉన్నాయి. నిన్ను ఎక్కించుకుని నా పడవను మురికి చేసుకోవడం నాకు ఇష్టం లేదు” అంటూ వెళ్ళిపోయింది గర్వము.

AB2157F5-F6EC-409D-B354-1E2FD7CAE829.png

 

కొంచెం సేపటి తరువాత విచారం పడవలో వెళుతూ కనిపించింది. ప్రేమ సహాయం కోసం విచారాన్ని అర్థించింది. “నేను చాలా బాధలో ఉన్నాను. నేను ఒంటరిగా ఉండాలని అనుకుంటున్నాను.” అంటూ విచారం వెళ్ళిపోయింది.

కొద్దిసేపటి తరువాత “సంతోషం” కూడా అటువైపు వచ్చింది. ప్రేమ సహాయం కోసం సంతోషాన్ని అడిగింది. కాని సంతోషం మరీ ఎక్కువగా సంతోషంగా ఉండడం వలన దానికి ఇతరులను పట్టించుకునే ఆలోచనే లేకుండా ప్రేమను వదిలి వెళ్ళిపోయింది.

ఇంతలో హఠాత్తుగా ఎక్కడినుండో ఎవరిదో స్వరం వినిపించింది.ప్రేమా; నాతోరా. నిన్ను నాతో తీసుకువెళ్తాను అంటూ పిలిచింది. తనను కాపాడుతున్నది ఎవరో ప్రేమ గుర్తుపట్టలేదు, ఆనందంలో వెళ్ళి పడవ ఎక్కింది.

అందరూ సురక్షితంగా ఒడ్డుకి చేరుకున్న తరువాత పడవ దిగిన వెంటనే ప్రేమ, జ్ఞానాన్ని అడిగింది. “ఓ జ్ఞానమా; అందరూ నిరాకరించి వెళ్ళిన తరువాత నాకు సాయం చేసింది ఎవరో నీకు తెలుసా?” అని ఆతృతగా అడిగింది. జ్ఞానం నవ్వుతూ, అది కాలం. ఎందుకంటే నీ శక్తిసామర్ధ్యాలు ఏమిటో, నీ విలువ ఏమిటో కేవలం కాలానికి మాత్రమే తెలుసు కనుక. ప్రియమైన ప్రేమా; నీవు మాత్రమే శాంతిని, సంతోషాన్ని అందివ్వగలవు అన్నది.

నీతి మనం సంపదలతో తులతూగుతున్నపుడు ప్రేమని తక్కువగా అంచనా వేస్తాం. మనమే చాలా ముఖ్యం అని భావించినపుడు ప్రేమని అభిమానించలేము. దుఖంలోనూ, సంతోషంలోనూ కూడా మనం ప్రేమని పట్టించుకోము. కేవలం కాలం గడుస్తున్న కొద్దీ మాత్రమే

మనం ప్రేమని గుర్తించగలము. ఆ ప్రేమను మన నిత్యజీవితంలో ప్రతిరోజూ అనుభవించి, అందరికీ ప్రేమను పంచుతూ ఆనందాన్ని ఎందుకు పొందకూడదు? ఎప్పటిదాకానో ఎందుకు ఉండాలి?

https://saibalsanskaar.wordpress.com/2014/04/18/only-time-will-value-love/

 

http://www.facebook.com/neetikathalu

ఎగిరే ఈకలు

విలువ :సత్యం

ఉపవిలువ : సత్ప్రవర్తన

D954407F-2FAC-451F-87BD-7262F93349D7

ఒకనాడు ఒక బాలుడు తన సహచరుల గురించి తప్పుడు మరియు ప్రతికూల పుకారు లను వ్యాపింపచేయసాగాడు . ఒక క్రిస్టియనుగా, అతను ప్రతి ఆదివారం చర్చి సందర్శించుచూ ఉండెడివాడు
అతగాడికి చర్చివద్ద కన్ఫెషన్ బాక్స్ ఉంది అని తెలుసు మరియు మరియు చేసిన ఒక తప్పు ప్రీస్ట్ ద్వారా తెలపటంచే దేవునితో క్షమింపబడటం సాధ్యమని తెలుసు. ఈ బాలుడు ఆ పుకార్లు వ్యాప్తి ద్వారా తన క్లాస్మేట్ చాలా బాధపడటానికి కారణమైంది అని గ్రహించాడు.
చర్చిలో ప్రీస్ట్ పిల్లలకు వారి సమస్యలను పరిష్కరించడం ద్వారా చాలా సాయపడుతూ ఉండేవారు. ఈ బాలుడు తన క్లాస్మేట్ కు తప్పు చేసిన వైనం ప్రీస్ట్ ముందు అంగీకరించాడు. ప్రీస్ట్ ఓపికగా అతను చెప్పినది విని అతని యొక్క క్షమ కొరకు ప్రార్థన చేసే ముందు, తన చర్య ప్రభావం ఈ బాలుడు అర్థం చేసుకోవలెనని , అతను కొన్ని ఈకలు ఒక బ్యాగ్ లో తీసుకుని గాలులతో ఆవృతమై ఉన్న ఒక రోజున కొండ పైన వెళ్ళమని బాలునితో చెప్పారు. అతను ఈకలు తీసుకొని మరుసటి రోజు వెళ్ళి వాటిని అన్నిటినీ ఎగుర వేసి మరల ఈకలు అన్ని ఎంచుకొని మళ్ళీ రమ్మని ఆదేశించారు . బాలుడు వెంటనే ప్రతి ఈక ఎంచుకునేందుకు అసాధ్యం అని ప్రీస్ట్ కి బదులిచ్చారు. అప్పుడు ప్రీస్ట్ ఇది కూడా పుకారు ఎటువంటిదో సరిగ్గా అదే అని బాలునికి వివరించారు. అది ఒకసారి వ్యాప్తి చెన్దినచే తిరిగి అది ఆపడానికి చాలా కష్టం మరియు చాలానష్టం జరుగుతుంది అందుకే ముందు ముందు అతను ఎవరితోనూ ఈ తప్పు పునరావృతం చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి.
బాలుడు తన పాఠం ఈ విధంగా నేర్చుకున్నాడు మరియు ఇంకెప్పుడూ ఈ తప్పు పునరావృతం చేయకూడదని తెలుసుకున్నాడు
నీతి:
మనము ఎప్పుడు ఇతరులు గురించి చెడుగా మాట్లాడకూడదు. ఒకరి గురించి నిజానిజాలు తెలియకుండా తప్పుడు వార్తలు వ్యాప్తి చెందించి ప్రజల భావాలను గాయపరచవచ్చు. ఒకసారి నోటనుండి వచ్చిన పదాలు తిరిగి తీసుకోవటం, ఒక  సారి చేసిన నష్టం, వీటికి మరమ్మతులు సాధ్యం కాదు. మచ్చ లేక గాయం ఎప్పుడు ఉండిపో తుంది అందువల్ల మాట్లాడేటప్పుడు ప్రతి పదం ఆచి తూచి మాట్లాడాలి

 

https://saibalsanskaar.wordpress.com/2014/03/14/the-feather-story/

http://www.facebook.com/neetikathalu

 

 

ఒక రైతు కథ — సంతోషంగా ఉండడానికి రహస్యం

A52C741A-4169-4422-89AC-D86A8A6F0B4D

విలువ –సత్ప్రవర్తన
అంతర్గత విలువ — మన ధర్మం / కర్తవ్యం ప్రేమతో చెయ్యాలి, ఇదే సంతోషానికి మార్గము.

రాజుగారు తన రాజ్యంలో అందరూ సంతోషంగా ఉన్నారా, అని తెలుసుకోవడానికి మారువేషం లో, బయలుదేరారు.
చాలా మందిని కలుసుకున్నారు. అందులో ఒక రైతు సంతోషంగా కనిపించాడు. రాజుగారు రైతు దెగ్గిరకి వెళ్లి, “నువ్వు సంతోషంగా ఉండడానికి కారణం ఏమిటి ?” అని అడిగారు.
రైతు ఇలా అన్నాడు.
నేను సంపాదించిన ధనం లో 1/4(పావు వొంతు ) నాకు ఉన్న అప్పు తీర్చుకుంట్టాను,
1/4(పావు వొంతు ) భవిష్యత్తులో అవసరానికి దాచుకుంటాను
1/4(పావు వొంతు ) దానం చేస్తాను
1/4(పావు వొంతు ) నా యొక్క కర్తవ్యానికి వాడుకుంట్టాను.

రాజుగారు, రైతుని మళ్ళీ విరంగా చెప్పమని అడిగారు. అప్పుడు రైతు ఇలా చెప్పాడు.
“ఇంత అద్భుతమైన జీవితాన్ని ఇచ్చిన నా తల్లికి, తండ్రికి ఎంతో కృతజ్ఞతులు తెలుపుకుంటున్నాను .

వాళ్ళని వృద్ధాప్యంలో చూసుకుంటూ
1/4(పావు వొంతు )నేను సంపాదించిన ధనం ఖర్చుపెడుతున్నాను.”

“నా పిల్లలు నా భవిష్యత్తు. 1/4(పావు వొంతు ) వాళ్ళ చదువు, మీద ఖర్చుపెడతాను.”

“నాకంటే బీద వాళ్ళకి 1/4(పావు వొంతు ) దానం చేస్తాను.”

“నా భార్య నన్ను నమ్ముకుని వచ్చింది. తనని చూసుకోవటం నా బాధ్యత. 1/4(పావు వొంతు ) ఇంటి ఖర్చుకి వాడుకుంటాను.
“ఇదే నేను సంతోషంగా ఉండడానికి రహస్యం ”

DC3AFF8B-2310-4058-98E0-50A79C5D619D

 

నీతి:
నిజమైన సంతోషం డబ్బు,పేరు, పరపతి వల్ల కాదు
మన కుటుంబం , సమాజం మరియు దేశం పట్ల బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం వల్ల దొరుకుతుంది.

https://saibalsanskaar.wordpress.com/2015/05/25/secret-to-happiness-the-happy-peasant/

http://www.facebook.com/neetikathalu