Archive | April 2014

ప్రార్థించేపెదవులకన్నా,సేవించేచేతులుమిన్న విలువ: ప్రేమ,అంతర్గత విలువ : సేవ

చాలా మంది మనుషులకి అనిపిస్తుంది, ఎంత ప్రార్థించినా కష్టాలు తీరట్లేదు, భగవంతుని కృప లేదు అని. శ్రీ రామాయణంలో ఒక కధ చదివితే అర్థమౌతుంది.
0
విభీషణుడు ఒక రోజు హనుమంతునితో ఇలా అన్నారు.’హనుమాన్ నీవు కోతివి అయినా కూడా, నీ మీద భగవంతుని కృప ఉంది, నేను ఎంత రాముడి ధ్యానంలో ఉన్నా, ఆ కృప నాకు రాలేదు’
God-Shri-Hanuman-HD-Pictures-Photos-images-Wallpapers
అప్పుడు హనుమంతులవారు ఇలా అన్నారు, విభీషణా! మీరు నిజంగానే, శ్రీరాముడి ధ్యానంలో ఉన్నారు, కానీ, శ్రీ రాముని కార్యంలో ఎంత పాల్గొన్నారు? కేవలం, శ్రీరాముని నామం ధ్యానం చెయ్యటం వల్ల, కృప రాదు. మీ అన్న రావణుడు,సీతమ్మవారిని, తీసుకుని వచ్చినప్పుడు, సీతాదేవికి ఏమి సహాయము చేశారు. కొంచెమైనా, శ్రీరాముని బాధ తగ్గించే ప్రయత్నం చేసేరా….
నీతి :
కేవలం భగవంతుని మీద, గురువు మీద, భక్తి, ప్రేమ ఉంటే సరిపోదు. వారు నేర్పించినవి, సాధనలో పెట్టాలి. వాటిలో ఒక మార్గం, మనుషులని ప్రేమించటం, సేవ చెయ్యటం.

http://saibalsanskaar.wordpress.com
https://www.facebook.com/neetikathalu

Advertisements

జంతువులు పట్ల దయ, ప్రేమ

14th November 2012, సాయి భజన అయ్యాక, ఇంటివైపునడుస్తున్నాము. చిన్నగా పిల్లి అరుపు వినిపించింది. ఎక్కడ నుంచి, ఈ అరుపు అని వెతుకుతుండగా, ఒక పిల్లి బోనులో ఇరుక్కుపోయింది.
cat in cage

అక్కడపని వాడు, పిల్లి చాలా ఇబ్బంది పెడుతోంది అని, బోనులోపెట్టేసాడు . కానీ మాకు జాలి వేసి పిల్లిని విడిపించాలి అని అనిపించింది. ఏంచెయ్యాలో తెలియలేదు. దారిలో వెళ్లే ఒక ఆవిడని ప్రాధేయ పడ్డాము, పిల్లిని విడిపించచడానికి, సహాయము చేయమని. ఆవిడ సహాయం తో పిల్లిని విడిపించాము. పిల్లి ఆనందంతో, గెంతులువేస్తుంటే, చూడడానికి, చాలా సంతోషం కలిగింది. పిల్లి ఎవ్వరినీ ఇబ్బంది పెట్టలేదు.
ఒక మంచి పని చేసాము, అని మాకు అనిపించింది. అప్పటి నుంచి ఏ పిల్లి అయిన బోనులో ఇరుక్కుందా అని గమనిస్తూనే ఉన్నాము.

జంతువులు పట్ల, జాలి, దయ, ప్రేమ నేర్చుకున్నాము.
మా చుట్టుపక్కల ఏమీ అవుతోందో గమనిస్తూనే ఉన్నాము.

http://premaarpan.wordpress.com/