Archive | August 2015

ఉన్నదంతా మన లోనే ఉంది!!! విలువ: సత్యము; అంతర్గత విలువ: అంతఃసోధన

all is within

పూర్వకాలంలో ఒక అందమైన జింక రొజంతా అడవిలో చెట్లమద్య గంతులు వేస్తూ కాలం గడుపుతుండేది.ప్రతిరోజూ దానికి ఒక అధ్బుతమైన సువాసన ముక్కుకి తగులుతుండేది. ఆ సువాసన వానకంటే పూల వాసనకంటే ఎంతో బాగుండేది. నిజం చెప్పాలంటే అంత సువాసన, అంత అధ్బుతమైన సుగంధం ఎప్పుడూ దానికి ఎన్నడూ తెలియదు.అంత కమ్మని సువాసన ఎక్కడినించి వస్తున్నదో దానికి తెలియటంలేదు. ఆ జింక ఇలా వాసనచూస్తూ చెట్ల మద్య తిరుగుతూ “అబ్బా ఈ సువాసన బహుశా చెట్టు నుంచి వస్తున్నదేమో!”అనుకుంటూ చెట్టు దగ్గరికి వెళితే చెట్టు వాసన మామూలుగానే ఉన్నది.

అన్ని చోట్లా వాసన చూస్తూ జింక అడవి అంతా తిరిగింది.” ఈ సువాసన సీతాకొక చిలుకల నించి వస్తున్నదా? చూడు చూడు వాసన చూడు ….లేదు లేదు వాటినించి రావటంలేదు.”రాబిన్” నుంచి వస్తున్నదా?… లేదు లేదు అక్కడినించి కూడా కాదు.” అని తనలో తానే ఆశ్చర్య పడుతూ  అన్నింటిని వాసన పీల్చి చూస్తున్నది. ఒక వేళ అక్కడి చిత్తడి నేల నుంచి వస్తున్నదా? ఊహూ కాదు!బహుశా అక్కడ ఉన్న పాదుల నుంచి ,తుప్పల నుంచి వస్తున్నదా అని మళ్ళీ మళ్ళీ వాసన చూసింది. ఊహూ… కానే కాదు కాని సువాసన మాత్రం దాని ముక్కుకి సోకుతూనే ఉన్నది. కానీ ఈ అడవిలో దేని నుంచి ఈ సువాసన రావటంలేదు. మరి ఈ సువాసన ఎక్కడి నుంచి వస్తున్నది.” అనుకుంటూ ఆ జింక తనలో తానే తికమక పడుతున్నది.

చాలా దూరం ఆ జింక పరుగులు పెట్టింది, గెంతింది,దూకింది, నాట్యం చేసింది. ఈ అపురూపమైన వాసన ఎక్కడినుంచి వస్తున్నదా అని అది పరిశీలిస్తూ, ఆ సువాసన మూలం కోసం వెతికింది.

అలా వెతికి వెతికి ఆ జింక విసిగి పోయింది.అలిసిపోయింది. “ఎలా అయినా సరే ఈ వాసన ఎక్కడినుంచి వస్తున్నదో కనుక్కునే తీరతాను? అని పట్టుదలతో మళ్ళి వెతకటం ప్రారంభించిది. ఏ మాత్రం ఓపిక లేకపోయినా పరిగెత్తి, పరిగెత్తి అలా పరిగెత్తుతూ వెతుకుతూనే ఉన్నది. ఇక్కడా, అక్కడా, అన్నిచోట్లా,అన్నింటినీ వాసన చూస్తూ పరిగెడుతున్నది. “నా శరీరానికి ఇంక శక్తి చాలటం లేదు. అయినప్పటికి ఈ అధ్బుతమైన సువాసన ఎక్కడినుంచి వస్తున్నదో నేను కనిపెట్టి తీనతాను.”అనుకున్నది. శరీరానికి వేగం తగ్గినా అలా వెతుకుతూనే ఉన్నది.ప్రయత్నిస్తూనే ఉన్నది.ఆఖరికి ఆ జింక ఇంక వెతకలేక నేలపై పడిపోయింది.

అలా నేలమీద శరీరం పడిపోయినప్పటికి , మనసులో మాత్రం ఇంకా ఆ వాసన మూలం కనుక్కొవాలని దానికి అనిపుస్తున్నది. ఇంతలో దానికి ఆ సువాసన గుప్పున వచ్చింది.” ఇదే ఇదే ఆ సువాసన!ఈ వాసన మూలం కనుక్కోవాలనే నేను ప్రయత్నంచేస్తున్నాను.! ఔను ఆ సువాసన ఇదే!.” అనుకున్న్నది జింక. కాని ఆ సువాసన ఎక్కడినుంచి వస్తున్నది? క్షణంలో అది ఒక విషయాన్ని గ్రహించింది.”ఓయి భగవంతుడా! ఈ వాసన నాలోనుంచే వస్తున్నది. ఇంతకాలం నుంచి ఈ సువాసన నాలోనుంచే వస్తున్నది.” అని ఇంతో అన్నందంగా నవ్వుకుని, హాయిగా,ప్రశాంతంగా నిద్రపోయింది.

ఔను నిజమే ! ఆ వాసన ఆ జింక లోనుంచే వస్తున్నది. భగవంతుడు కూడా అంతే.భగవంతుడు కూడా బయట ఎక్కడో ఉన్నాడని జనులు అనుకుంటూ ఉంటారు.కాని, భగవంతుడు ఎల్లప్పుడూ మనలోనే ఉంటాడు.మనకి దూరంగా ఎప్పుడూ లేడు. మనలోనే, మనచుట్టూ, మనతోనే ఉంటాడు.చాలా కాలం వెతికి వెతికి చివరికి జింక తననుండే వస్తున్న వాసనని గుర్తించినట్లే జగత్ప్రభువు కూడా మనలోనే ఉన్న విషయం తెలుసుకోవాలి.

 

నీతి: మనం అంతర్ముఖులై , మన అంతరంగంలో వెతికి చూస్తే భగవంతుడు , శాంతి మనసులోనే ఉంటాయి కాని, మనం మాత్రం ఆ దేవుడి కోసం, శాంతి కోసం బయట ఎక్కడో వెతుకుతూ ఉంటాము.

“పగలూ రాత్రి నా లోపల గాఢంగా నీ నామాన్ని అర్ధిస్తూ,స్మరిస్తూ, నీ నామం ద్వారానే శాంతిని కనుక్కుంటాను” అంటారు

గురురామదాస్

https://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

మొసలి – పూజారి !!! విలువ: సత్యం;అంతర్గత విలువ: అంతటా, అన్నింటా ఏకత్వాన్ని ప్రదర్శించాలి.

ఒకప్పుడు ఒక మొసలి ఉండేది. ప్రతిరోజూ ఉదయం ఈ మొసలి చాలా విచిత్రంగా ప్రవర్తించేది. సాధారణంగా ఇతర మొసళ్ళు ఏవీ చెయ్యని పనులను ఈ మొసలి చేస్తుండేది. రొజూ సూర్యోదయానికి ముందే ఈ మొసలి నిద్ర లేచేది. ఎంతో విశ్వాసం తో సాధన చేసేది. సాధన అంటే ఏమితో మీకు తెలుసా?

సాధన అంటే ఆధ్యాత్మిక సాధన. ప్రతి రోజూ భగవంతుడిని తలుచుకోవటం కోసం ఏదైన చెయ్యటం. భగవంతుడిని తలుచు కోవటం కోసం మీరు ఏమి చేస్తారు?

ఈ మొసలి చాలా తెలివైనది. సూర్యూదయానికి ముందు కాలం భగవంతుడిని తలుచుకోవటానికి చాలా ఉత్తమమైన కాలం అని ఆ మొసలికి తెలుసు. అందువల్ల సూర్యుడు ఉదయించటానికి ముందే లేచేది. ఆ తరువాత హృదయపూర్వకంగా భగంతుడి నామాన్ని తలుచుకుంటూ ప్రార్ధన చేసేది. ప్రతి రోజునూ తన ప్రార్ధనతో ప్రారంభించేది. సాధన తరువాత తన శరీరానికి మంచి శక్తిని ఇచ్చే ఆహారాన్ని తినేది. ఒక రోజున అక్కడికి ప్రఖ్యాతి గాంచిన ఒక పూజారి వచ్చాడు.

మొసలి చేస్తున్న సాధన చూసిన పూజారి “ఓ మొసలి… నువ్వు ఏమి చేస్తున్నావు? నువ్వొక జంతువువి అయినా రోజూ నీవు నామాన్ని స్మరిస్తూ ప్రార్ధన చేస్తున్నావు ఎందుకు? ఏమిటి ప్రయొజనం? “అని మొసలిని అడిగాడు.”నిజమే! నేను జంతువునే… కానీ, నాకు భగవదనుభవం పొందాలని ఉన్నది. అందుకే ప్రతిరోజూ సాధన చేస్తున్నాను అన్నది మొసలి. “కాని అందువల్ల ఉపయోగం లేదు” అన్నడు పూజారి. “ఎందుకు లేదు” అడిగింది మొసలి. అప్పుడు పూజారి మొసలితో “నీవు భగవంతుడిని పొందలేవు. నువ్వు కేవలం ఒక మొసలివి.మళ్ళీ మనుష్య జన్మ లభించేవరకు వేచి ఉండాలిసిందే!” అన్నాడు.

download (6)

మొసలి ఎంతో ధైర్యంగా బదులు చెప్పింది.” వావ్…. నీవు చాలా మూర్ఖుడివి అనిపిస్తోంది. నీవు పూజారిగా కనిపిస్తున్నావు కాని నీకు కనీసం మామూలు విషయాలు కూడా తెలియవు. నిన్నుసృష్టించిన దేవుడే నన్ను కూడా సృష్టించాడు!” ఈ మొసలి ఎంత తెలివైనది అని పూజారి ఆశ్చర్యపడ్డాడు.

మొసలి ఇంకా ఇలా అన్నది.”ప్రతిరోజూ నేను దేవుడిని తలుస్తూ ధ్యానం చేస్తే నాకు భగవంతుడిని పొందే అవకాశం ఉన్నది కానీ, నువ్వు ఏ సాధన చెయ్యంకుండా ఉంటే నీకు అసలు అవకాశమే ఉండదు! నిజానికి మరుజన్మలో నీవు మొసలిగా పుట్టవలసి వస్తుంది.”

“నేను మొసలిగా పుట్టటమా! నీకు ఇలాంటీ పిచ్చి ఆలోచన ఎలా వచ్చింది?” అన్నాడు పూజారి. ఇంతలో ఆశ్చర్యంగా తక్షణమే ఆ పూజారి ఒక మొసలిగా మారిపోయాడు. ఇప్పుడు రెండు మొసళ్ళు పక్క పక్కనే కూర్చుని ఉన్నాయి.

మొసలి పూజారిని అడిగింది “అయితే ఇప్పుడు నీకు ఎలా అనిపిస్తున్నది?” పూజారికి అంతా అయోమయంగా ఉన్నది.

“నేను మొసలిగా మారతానని నీకు ఎలా తెలుసు? అని పూజారి అడిగాడు. మొసలి చాలా తెలివైనది. అది పూజారితో “నేను మొసలిగా ఉన్నా పవిత్రంగా జీవిస్తూ సాధన చేస్తున్నాను. నువ్వు పూజారిగా ఉన్నా మొసలిలాగ ప్రవర్తిస్తున్నావు.” అన్నది.

చూడండి – తాను మొసలి కంటే ఉన్నతమని భావించాడు పూజారి. కాని, మనమందరం ఒక్క భవంతునిచే సృష్టిచేయబడ్డవాళ్ళమే.  మీరు ఎవరైనా, ఏదైనా ఇతరుల కంటే మీరు ఎక్కువని భావించవద్దు. ఎంత ఉత్తమంగా జీవితాన్ని గడపగలరో అలా గడిపేందుకు ప్రయత్నం చెయ్యండి.

నీతి: “సత్యం ఉన్నతమైనది కాని, సత్యంగా జీవించగలగటం మరింత ఉన్నతమైనది.” –గురునానక్

ప్రతిరోజూ సాధన, నిత్యం చేసే ధ్యానం సత్యంగా జీవించటానికి ఉపయొగపడతాయి. తరగతిలో నీకంటే బలహీనులు కాని,నీకంటే తక్కువ అని నీవు భావిస్తున్నవారు కాని అందరూ నీలాగె భగవంతుడి చేత సృష్టించబడినవారే.

గాఢంగా శ్వాస తీసుకుంటూ “మనమంతా ఒక్కటే” అని తలుచుకోండి.

https://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

“ఒక కప్ప్ కాఫీ …గోడ మీద ఇంకొకటి!!!”విలువ- సత్ప్రవర్తన;అంతర్గత విలువ: స్వార్ధరహిత సేవ

నేనూ నా స్నేహితుడు ,విద్యుత్ దీపాలు మరియు నీటి మార్గాలకి మారుపేరైన పట్టణం వెనిస్ (ఇటలీ) లో ఒక ప్రసిద్ధ కాఫీ షాప్ లో కూర్చున్నాము. మేము మా కాఫీ ఆస్వాదిస్తూ ఉన్న సమయములో, ఒక పెద్దమనిషి ప్రవేశించి మాకు పక్కన ఒక ఖాళీ టేబుల్ వద్ద కూర్చున్నాడు. అతను “వెయిటర్!”, అని  పిలిచి “కాఫీ రెండు కప్పులు, గోడ మీద ఒకటి!’అని  చెప్పడం మేము ఆసక్తి తో వినసాగాము. అతను కాఫీ ఒక కప్ మాత్రమే తీసుకొని రెండు కాఫీలకు బిల్లు చెల్లించటం గమనించాము.

cup-of-coffee

అతను వెళ్ళిన వెంటనే, వెయిటర్ ‘ఒక కప్పు కాఫీ’ అని అంటూ గోడ పై కాగితం ముక్క అతికించాడు. మేము అక్కడ ఇంకా ఉండగానే, మరో ఇద్దరు పెద్దమనుషులు ప్రవేశించి కాఫీ మూడు కప్పులు ఆర్డరు చేసి కూర్చున్నారు. వారు రెండు కప్పులు కాఫీ తాగారు కానీ మూడింటికి బిల్లు చెల్లించడం గమనించాము. ఈ సమయంలో కూడా, వెయిటర్ అదే చేసాడు.. గోడ పై ‘ఒక కప్పు కాఫీ’ అని కాగితం ముక్క అతికించాడు. ఇది మాకు వింతగా.. ఏదో విచిత్రంగా తోచింది మేము మా కాఫీ పూర్తి బిల్లు చెల్లించిన పిదప వెళ్ళి పోయాము.

కొన్ని రోజుల తరువాత, మళ్ళీ ఈ కాఫీ దుకాణానికి వెళ్ళడానికి అవకాశం లభించింది. మేము మా కాఫీ ఆనందించే సమయంలో, ఒక మనిషి పేలవంగా దుస్తులు ధరించి ప్రవేశించాడు అతను తాను కూర్చున్నచోట నుండి గోడ చూస్తూ ‘గోడ నుండి కాఫీ ఒక కప్’ అన్నాడు వెయిటర్ మర్యాదగా, గౌరవం తో ఈ మనిషి కి కాఫీ ఇచ్చాడు.  ఆ మనిషి తన కాఫీకి బిల్లు చెల్లించే పని లేకుండా వదిలి వెళ్ళిపోయాడు. వెయిటర్ గోడ నుండి కాగితం ముక్క డస్ట బిన్ లో విసిరి వేసాడు. మేము అంతా చూసి ఆశ్చర్యపోయాము. ఇప్పుడు విషయం చాలా స్పష్టంగా అర్ధమైంది. ఈ పట్టణం యొక్క నివాసితులు పేదవాడి కోసం చూపిన గొప్ప గౌరవం మమ్ములను బాగా కదిలించి, కన్నీళ్లతో మా కళ్ళు చమ్మగిల్లాయి.

నోరు  తెరిచి అడగకుండానే  కాఫీ షాప్ప్ కి వచ్చిన ఆ మనిషికి ఈ కప్ దానం చేసినవారిని గురించి అదిగి తెలుసుకునే అవసరం  లేకుండా నే సమయానికి కాఫీ ఉచితంగా  లభించింది.  అతను తన  ఆర్డర్, చక్కగా గోడ వైపు  చూసి చేసి నిస్సంకోచముగా తన కాఫీని ఆనందించాడు !

నీతి:

మీరు నిజంగా ఎవరికైనా సహాయం చేయాలనుకునప్పుడు,  దాని ద్వారా వారి జీవితంలో చక్కటి మార్పు వచ్చే అవకాశం ఉన్నప్పుడు, నిస్స్వార్థంగా చేయాలి. అవసరం  లో ఉన్న వ్యక్తి, సహాయం కోరుతూ వస్తే, అతని  గౌరవాన్ని  తక్కువ చేయకుండా సహాయం చేయాలి.  మనము ఎదుటి వారికి సహాయం చేయగలిగే స్థానం లో ఉన్నాము కదా అని , గొప్పలకి పోకూడదు . అహంకారాన్ని , మన స్వలాభాన్ని పక్కనపెట్టి  కేవలం ఇతరులకు మంచి చేసే ఉద్దేశము కలిగి ఉండాలి. ఇదే  నిజమైన సహాయము.

https://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

అసలు అవివేకి యెవరు ? ?పండితుడా లేక పామరుడా!!! విలువ – ప్రేమ ఉప విలువ – భక్తి

ఒకానొక సమయంలో ,అతి మేధావి మరియు విజ్గానవంతుడైన ఒక మతగురువు ఉండేవారు. అతను అన్ని గ్రంధములను క్షుణ్ణంగా ఆకళింపు చేసుకొని, లోకం అంతా తిరుగుతూ వివిధ వర్గాల ప్రజలను ప్రభోదలతో జ్ఞానమార్గములో నడిపించసాగారు.

ఐతే , గ్రామం లో అతను ఒక సరస్సు తటస్థించింది. ఆ సరస్సులో విహరిస్తుండగా అతనికి సరస్సు మధ్యలో, ఒక ద్వీపం కనిపిస్తుంది. ఆ ద్వీపంలో ఒక వ్యక్తి నివసించుచున్నారు. అతగాడు చాలా సాధారణ, సరళ స్వభావుడై ఉన్నందున ..అతనిని అందరూ, ఒక అవివేకిగా భావించేవారు

image ఆ సరస్సు యొక్క నీటి దగ్గరకు రాగానే, గురువుగా రికి ఆ వ్యక్తి “భజగోవిందం భజగోవిందం మూఢమతే …ల… ల…ల…ల. “అని గానం చేయుట వినిపిస్తుంది, కానీ అతడి ఉచ్చారణ భయంకరముగా ఉంది! అతనికి పెద్దగా ఏమీ తెలియదు…అందుకే కాబోలూ .. అని నిర్ధారణకి వచ్చారు, మతగురువు.
మతగురువు ఒక నిమిషం అతని పాట విని, “భగవంతుడా, ఇతని పాట నా చెవులను ఎంత బాధిస్తోంది?!!! అతను చాలా తప్పులు పలుకుతున్నాడు.నేను ఈ మనిషికి సహాయం చేయాల్సిందే అని అనుకుటూ ఎంతో కరుణ తో ..ఒక పడవ లో ఆ వ్యక్తికి బోధించడానికి, ఆ చిన్న ద్వీపాన్ని చేరతాడు ఆ మతగురువు. అతనితో “నమస్తే అండి, kనేను మీకు సేవ చేయటానికి వచ్చాను.” అని చెప్పారు. అందుకు ఆ వ్యక్తి “ఇది నాకు ఎంత గౌరవం… దయచేసి ముందు మీరు నేను మీకు సమర్పించుకోగలిగగే ఆహారాన్ని మరియు మంచి నీరుని దయచేసి స్వీకరించండి” అని అర్థించాడు.

మొత్తానికి అనుకున్న విధంగా ఆ మతగురువు మూడు రోజులు ఆ ద్వీపంలో అతగాడికి బోధనలు చేస్తూ గడిపారు. అతనికి మంత్రాలని , ప్రార్థనలని యెలా సరిగ్గా పలకాలి, అని నేర్పించటమే కాక పురాణాలలో యెన్నో అధ్యాత్మిక విషయాలని , తెలిపే కథలని కూడా చెప్పారు.మూడు రోజుల తర్వాత ఆ మూఢ మనిషి “మహాత్మా ఎంతో దయతో నాకు యెన్నో గొప్ప విషయాలని నాకు మీరు నేర్పారు ,దానికి మీకు నా … ధన్యవాదాలు, ధన్యవాదాలు, ధన్యవాదాలు !, నాకు చాలా ఆనందంగా ఉంది! మిమ్మల్ని ఆ భగవంతుదు చల్లగ చూస్తాడు .ఇక సెలవు!”, అని అతని కృతఙ్నతని తెలుపుతాడు . ఆ తరువాత గురువు తన పడవ లో ద్వీపం వదిలి వెళ్ళిపోతాడు. అలా గురువు పడవలో ప్రయాణిస్తుండగానే , ఆ వ్యక్తి నీటిపై అలవోకగా పరిగెత్తుకుంటూ ఇతని వైపు రావటం గమనిస్తాడు

గురువుగారి వద్దకు వచ్చి, “స్వామీ నేను ఒక విషయం మర్చిపోయాను! మీరు నేర్పిన ఆ శ్లోకం లో చివర వాక్యాన్ని ఎలా పలకాలో మర్చిపొయాను ,దయచేసి ఇంకొక సారి నేర్పగలరా అని వినయంగా కోరతాడు.కానీ గురువు మటుకు, “అసలు ఇతను నీటి లో ఎలా నడుస్తూ రాగలిగాడు ?”అని చాలా ఆశ్చర్యంతో కొంతసేపు, చుస్తూ ఉండిపోయాడు. మెల్లిగా తేరుకుని అతనికి సమాధానం గా ఆ వాక్యాన్ని ఎలా పలకాలో…. మ్మ.. అది… అని పలికి వినిపిస్తారు .దానికి ఎంతో పొంగిపోయి ఆ వ్యక్తి “ఓహో అవునా!!! ఊహూ! “అని ఎగిరి గెంతేసి తిరిగి నీటిపైన పరిగెత్తుకుంటూ ద్వీపం వైపు వెళ్ళిపోతాడు.
గురువు నిశ్చేష్టుడై, “నేను చాలా జ్ఞానం కలిగి వున్నాను, కానీ ద్వీపంలో ఉన్న ఈ అందమైన వ్యక్తి నాకంటే గొప్పవాడు. అతను ఆధ్యాత్మిక శక్తులు కలిగి ఉండటమే కాక స్వచ్చమైన భక్తి కూడా కలిగినవాడు . నిజానికి అవివేకి అతను కాదు .అంతటి అపార భక్తుడితో పోలిస్తే నేను ఒక అవివేకిని”అని గ్రహిస్తాడు.
గురువు మాట…. నిర్మలమైన ,శాశ్వతమైన సత్యమును గుర్తించడం ద్వారా ఒక మనీషి నిజమైన గురువు అవుతాడు “!

నీతి: భగవంతుడు భక్తుడి ..ప్రార్ధనలలో ,గ్రంధములలో గల జ్ఞానం మరియు నైపుణ్యానికి కాకుండా ప్రేమ, విశ్వాసం మరియు వినయమునకు ప్రాధాన్యత ఇస్తాడు . అవగాహన మరియు సాధన, ప్రార్ధనలు యొక్క అంతిమ లక్ష్యం. ఈ విధముగా స్వచ్ఛమైన మరియు కారుణ్యపూరితమైన జీవితాన్ని గడపి ప్రతి వ్యక్తీ తమను తాము అభివృద్ధి చేసుకోవాలి.

https://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu