Archive | October 2014

భగవంతుని సృష్టి విచిత్రం, విలువ: నిజాయతీ, అంతర్గత విలువ: జరిగేదంతా మన మంచికే అని అంగీకరించడం

ఒకప్పుడు ముల్లా నసీరుద్దీన్ కాలినడకన ప్రయాణం చేస్తూ బాగా అలసిపోయి ఒక మర్రిచెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆ చెట్టు క్రింద కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్న అతని దృష్టి ఆ చెట్టు మీదకి పాకిన ఒక గుమ్మడితీగ మీద పడింది.

images15FAHKUXఆ గుమ్మడితీగ పెద్దపెద్ద కాయలతో విరగ కాసి ఉంది. వెంటనే అతడు మర్రి కొమ్మల కేసి చూశాడు. ఆ కొమ్మల నిండా ఎర్రటి చిన్న చిన్నపళ్ళు కనిపించాయి. వెంటనే నసీరుద్దీన్ ఇలా ఆలోచించాడు. దేవుడు ఎంత తెలివి తక్కువ వాడు. ఇంత పెద్దదైన దృఢంగా ఉన్న ఈ మర్రి చెట్టు కొమ్మలకు ఇంత చిన్న పళ్ళు, ఇంతసన్నని బలహీనమైన గుమ్మడి తీగకు ఇంత పెద్ద పెద్ద కాయలు కాసేటట్లు చేశాడు. ఇలా అనుకుంటూ రెండు నిముషాల పాటు కళ్ళు మూసుకుని ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు.

 

 

ఇంతలో గాలికి మర్రి కొమ్మలు కదలి అతని తల మీద కొన్ని మర్రి పళ్ళు రాలి పడ్డాయి. తల మీద తడివి చూసుకున్నాడు. తలమీదbanyan tree1 పడిన మర్రి పళ్ళు చేతికి తగిలాయి.

 

 

 

 

 

banyan treeఅప్పుడు నసీరుద్దీన్ ఇలా అనుకున్నాడు. భగవంతుడు చాలా గొప్పవాడు. నేను అనుకుంటున్నట్లుగా మర్రిచెట్టుకు పెద్ద పెద్ద కాయలు కాసి ఉంటే ఈ పాటికి ఆ కాయలు నాతల మీద పడి ఉంటే నిజంగా ఈ పాటికి నా తల పగిలి ఉండేది. భగవంతుని సృష్టిని ప్రశ్నించడం నిజంగా నా అవివేకం అని తన తెలివితక్కువతనానికి సిగ్గుపడ్డాడు.

 

 

 

 

నీతి : భగవంతుడు మనకు ఏది ఇస్తే దానిని మనస్ఫూర్తి గా స్వీకరించాలి. మనం మంచిదని భావించింది మంచిది కాక పోవచ్చు. మనం చెడ్డదని భావించినది మంచిది కావచ్చు. ఆ విషయం మనకంటే భగవంతుడికే బాగా తెలుసు. అందుచేత భగవంతుడు ప్రసాదించినది ఆనందంగా స్వీకరించడం వివేకం.

http://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

 

దురాశ , విలువ: సంతృప్తి, అంతర్గతవిలువ: అత్యాశ పడకుండా ఉండడం

wood cutter   ఒక ఊరిలో ఒక కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు. అతడు దగ్గరలో ఉండే అడవికి వెళ్లి కట్టెలు కొట్టి తెచ్చి సమీప గ్రామాలలో అమ్మి దాని వలన వచ్చిన స్వల్పమైన ధనంతో జీవించేవాడు. ఎంత బీదవాడైనా సంపాదించిన సొమ్ము కుటుంబ పోషణ కు చాలకపోయినా అత్యాశకు పోకుండా సంతృప్తిగా జీవించేవాడు.

అతడు ఒక రోజున ఒక నది ఒడ్డున ఉన్న చెట్టును నరకుతుండగా పొరపాటున అతని గొడ్డలి జారి నీటిలో పడిపోయింది. ఆ ప్రదేశంలో నది చాలా లోతుగా ఉండడం ప్రవాహ వేగం ఎక్కువ కావడం చేత గొడ్డలిని నదిలో నుంచి తీసుకోవడానికి అతనికి సాధ్యం కాలేదు. తన జీవనాధార మైన గొడ్డలి పోవడంతో అతడు విచారిస్తూ ఏమీ తోచక నది ఒడ్డుననే కూర్చుండిపోయాడు. అతని విచారం చూసి జలదేవతకు జాలి కలిగిందిwc1

. ఆమె అతనికి సహాయ పడాలని భావించింది. అదే సమయంలో అతడిని పరీక్షించాలి అనే ఆలోచన కూడా ఆమెకు కలిగింది. ఒక బంగారు గొడ్డలి పట్టుకుని ఆ కట్టెలు కొట్టే వాడి ముందు ప్రత్యక్షమైంది.

 

 

 

 

wc2ఈ గొడ్డలి నీదేనా అని అడిగింది. వాడు ఒక నిముషం ఆశ్చర్యంలో మునిగి పోయాడు. ఆశ్చర్యంలోంచి తేరుకుని నాది కాదు తల్లీ అని బదులు చెప్పాడు. మరొక్క నిముషం తరువాత వెండి గొడ్డలి పట్టుకొని వచ్చి ఇది నీదేనా అడిగింది. కాదని బదులు చెప్పాడు. ఈసారి ఇనుప గొడ్డలి తెచ్చి ఇది నీదేనా అని అడిగింది. ఆ గొడ్డలి తనదే అని చెప్పి తన గొడ్డలి తనకు తిరిగి ఇచ్చి సహాయ పడినందుకు జలదేవతకు కృతజ్ఞత చెప్పుకున్నాడు. ఆమె సంతోషించి బంగారు, వెండి, ఇనుప గొడ్డళ్ళు మూడు కూడా అతడికి ఇచ్చి సుఖంగా జీవించమని చెప్పి ఆశీర్వదించి అదృశ్యమైంది. వాడు సంతోషించి ఇంటికి వెళ్ళాడు. ఈ విషయం తన మిత్రుడైన మరొక కట్టెలు కొట్టుకొనే వాడికి చెప్పాడు.

 

అతడు చాల దురాశా పరుడు. తానూ తన మిత్రుడి లాగే బంగారు వెండి ఇనుప గొడ్డళ్ళు సంపాదించు కోవాలని అనుకున్నాడు. నది ఒడ్డుకు వెళ్లి చెట్టు నరుకుతూ కావాలనే గొడ్డలి నదిలో జార విడిచేడు. నిజముగా పొరపాటున గొడ్డలి పడిపోయినట్లు ఏడవడం మొదలు పెట్టాడు. జల దేవత ప్రత్యక్షమై బంగారు గొడ్డలి తెచ్చి ఇది నీదేనా అని అడిగింది. వాడు అత్యాశతో నాదే అని చెప్పాడు. జలదేవత కోపంతో ఇది నీది కాదు.నీవు దురాశా పరుడవు అని కోపం గా చూసి అదృశ్య మై పోయింది. తన దురాశ ఫలితంగా ఉన్న గొడ్డలి కూడా పోయినందుకు విచారిస్తూ ఆ కట్టెలు కొట్టేవాడు ఇంటి ముఖం పట్టాడు.

నీతి:

ఉన్నదానితో సంతృప్తి పొందాలి. దురాశ ఎప్పుడు దుఃఖాన్నే కలిగిస్తుంది.

http://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu