చేతనైనంత సహాయం చెయ్యండి

విలువ : ప్రేమ

అంతర్గత విలువ: దయ

ఒక పరిచారిక చాలా అలసట, బాధతో ఉన్న ఒక పెద్దాయన మంచం దగ్గరికి ఒక వ్యక్తిని తీసుకుని వెళ్ళింది. ‘మీ అబ్బాయి ఇక్కడ ఉన్నాడు’ అని ఆ పెద్దాయనకి చెప్పింది. చాలా సార్లు ఆ మాట చెప్పాల్సి వచ్చింది, రోగి కళ్ళు తెరిచే లోపల.

రోగి గుండె నెప్పితో బాధ పడటం వల్ల, ఎక్కువ మోతాదు మత్తు మందు ఇవ్వటం జరిగింది. నెమ్మదిగా కళ్ళు తెరిచి చూస్తే, తన మంచం పక్కన, మంచి దుస్తులు వేసుకున్న ఒక అబ్బాయి నుంచుని ఉన్నాడు. పెద్దాయన , తన చెయ్యి బయటికి పెట్టారు, అప్పుడు ఆ అబ్బాయి కూడా,
చెయ్యి ప్రేమతో పట్టుకున్నాడు. అప్పుడు పరిచారిక, ఆ అబ్బాయికి ఒక కుర్చీ తెచ్చి వేసింది.nu219002 రాత్రంతా ఆ అబ్బాయి మంచం పక్కనే, పెద్దాయన చెయ్యి ప్రేమతో పట్టుకుని, కబుర్లు చెబుతూ, ధైర్యాన్ని ఇచ్చాడు. కొంచెంసేపు అయ్యాక, పరిచారిక, ఆ అబ్బాయిని విశ్రాంతి తీసుకోమని అడిగింది, కానీ ఆ అబ్బాయి ఒప్పుకోలేదు.

అప్పుడప్పుడు ఆ పెద్దాయన, ఏదో మాట్లాడినట్టు అనిపించేది. కానీ చూస్తే, ఆ అబ్బాయి చెయ్యి, రాత్రి అంతా గట్టిగా పట్టుకునే ఉన్నారు.
తెల్లవారుజామున, పెద్దాయన కన్ను మూశారు. ఆ అబ్బాయి వెళ్ళి పరిచారికకి, తెలియ చేశాడు.

పరిచారిక అన్ని పనులు పూర్తిచేసుకుని వచ్చేదాకా, ఆ అబ్బాయి అక్కడే ఉన్నాడు.పరిచారిక,ఆ అబ్బాయిని ఓదారుస్తూ ఉండగా, ఆ అబ్బాయి ఆమెను ఆపి, ఆ పెద్దాయన ఎవరు అని అడిగాడు. పరిచారిక ఆశ్చర్యంతో ‘మీ తండ్రిగారు కాదా’ అని అడిగింది. దానికి ఆ అబ్బాయి’నేను ఎప్పుడూ, ఆయనని చూడలేదు’ అని సమాధానం చెప్పాడు. దానికి పరిచారిక’నేను ఆయన దగ్గరికి తీసుకుని, వెళ్ళినప్పుడు, ఏమీ మాట్లాడలేదే?’ అని అడిగింది.
ఆ అబ్బాయి సమాధానం చెప్పాడు, ‘ఎక్కడో పొరపాటు జరిగింది, అని వెంటనే తెలిసింది, కానీ ఆయనకి ఇప్పుడు తన కొడుకు అవసరం అని తెలిసింది. పెద్దాయన చాలా జబ్బుతో ఉండడం వల్ల, అలాగే ఆయనతో ఉండిపోయాను’

‘ఈ రోజు నేను విలియం గ్రే గారిని చూడడానికి వచ్చాను. అయిన కుమారుడు, ఈ రోజు ఇరాక్ లో మరణించాడు. ఈ పెద్దాయన గారి పేరు ఏమిటి?’
పరిచారిక కళ్ళు నీళ్ళు పెట్టుకుని, ఈయనే విలియం గ్రే అని చెప్పింది.

నీతి:
—–

ఎంత వీలు అయితే అంత సహాయం చెయ్యాలి. మంచి మాట, చిరునవ్వు, సహాయం ఎదుటి వారికి ఎలా పనికి వస్తుందో మనకి తెలియదు .

http://saibalsanskaar.wordpress.com
https://www.facebook.com/neetikathalu

One thought on “చేతనైనంత సహాయం చెయ్యండి

Leave a comment