Archive | February 2022

జనక మజరాజు మరియు అష్టావక్రుడు

విలువ : సత్యం 

ఉప విలువ : అంతర్గత బలం .

రాజర్షి ,ఆత్మజ్ఞాని ఆయన జనక మహారాజు ఒకసారి మహర్షి అష్టావక్రుడు వద్దకు వచ్చి ఆయన పాదములకు నమస్కరించి , “ఈ రాజ్యం ,రాజభవనం,ఈ వైభవాలు ఇక మీదట నాకు ఎంత మాత్రము ముఖ్యమైనవి కావు. నాకు కేవలం మీ పాదాల వద్ద జీవించాలని ఉన్నది. ఈ అరణ్యంలో ఆశ్రమం లో మీతో పాటు నన్ను కూడా నివసించనివ్వండి” అని ప్రార్ధించాడు .

కాని , అష్టావక్రుడు , “ఇప్పుడు నీకు ఆత్మ సాక్షాత్కారం అయింది కనుక నీ జీవితం ఇక మీదట నీ ఇష్టాయిష్టాల పైన ఆధారపడి ఉండదు. నిజానికి నీకు ఎటువంటి అవసరాలు లేవు కనుక నీ జీవితం నీ అవసరాల కోసం కాదు. నీ దేశ ప్రజలకు ఒక జ్ఞాని అయిన రాజు అవసరం ఎంతైనా ఉన్నది. నువ్వు నీ ప్రజలకు రాజు గా ఉండాలి అన్నాడు .జనక మహారాజు అయిష్టంగానే అంగీకరించి గొప్ప మేధా శక్తితో రాజ్యాన్ని పరిపాలించాడు. పూర్తిగా మనోవికాసం పొందిన రాజర్షి రాజు కావడం ఆ రాజ్య ప్రజలకి నిజమైన ఆశీర్వాదం . తాను ఎంతటి జ్ఞాని అయినా కూడా జనకుడు రాజ్యాన్ని సమర్ధవంతంగా ఒక గొప్ప రాజుగానే పరిపాలించాడు. భారత దేశం లోని అనేక మంది సాధువులు ,ఋషులు ఒకప్పుడు గొప్ప గొప్ప రాజులు ,చక్రవర్తులు వారంతా స్వచ్చందంగా తమ తమ రాజ్యాలను ,సంపదలను విడిచి పెట్టి ఎంతో హుందాగా నిరుపేదలగా ,బిచ్చగాళ్ళ వలె బయటకి నడిచి వెళ్ళిపోయినవాళ్ళే .

గౌతమ బుద్దుడు ,మహావీరుడు ,బాహుబలి మొదలైన వారంతా ఇటువంటి వారే . కాని ఆత్మజ్ఞాని అయిన రాజుగా ఉండటం అరుదైన విషయం . జనక మహారాజు ,రాజుగా ఉన్నప్పటికీ అవకాశందొరికినప్పుడల్లా అష్టావక్రుని ఆశ్రమం దర్శించేవాడు.

అష్టావక్రుని ఆశ్రమంలో కొందరు సన్యాసులకు బోధలు చేస్తూ ఉండేవాడు . వీళ్ళకి జనకమహారాజు పట్ల మెల్ల మెల్లగా అసూయ కలగసాగింది . ఎందుకంటే జనక మహారాజు ఆశ్రమానికి వచ్చినప్పుడల్లా ఆయనతో అష్టావక్రుడు చాలా సేపు గడిపేవాడు. ఎందుకంటే వారిద్దరి మధ్య చక్కటి అవగాహన ఉండేది . జనక మహారాజు వచ్చినప్పుడల్లా అష్టావక్రుని ముఖం, జనకుని ముఖం వెలిగి పోతూ ఉండేవి . ఆ ఆనందం తో ఇతర సన్యాసుల తో మాట్లాడుతున్నప్పుడు అష్టావక్రుడు అంత ఆనందం వ్యక్త పరిచేవారు కాదు . సాధువులకు అసూయ కలిగించే విషయం ఏదో వారిద్దరి మధ్య ఉన్నది .ఆ సాధువులు తమలో తాము ఇలా అనుకుంటూ ఉండేవారు . “ఇది ఏమి విచిత్రం”? చూస్తుండగా మన గురువుగారు ధన లోభం లో పడిపోతున్నట్లున్నారు. ఈ జనకుడు ఒక మహారాజు ,రాజభవనంలో నివసిస్తుంటాడు . ఆయనకి చాలా మంది భార్యలు ,ఎంతోమంది సంతానం కూడా ఉన్నారు . చూడండి ఆయన నడిచే విధానం ఎలా ఉన్నదో! ఠీవిగా నడుస్తూ ఉంటాడు . ఆయన ఎటువంటి దుస్తులను ,ఆభరణాలను ధరించాడో చూడండి !అసలు ఈ రాజు కేసి మన గురువు కన్నెత్తి చూడటానికైనా అతనిలో ఆధ్యాత్మిక విశేషము ఏమీ లేదు ? మనము ఆధ్యాత్మిక సాధనలో పూర్తిగా అంకితమై ఉన్నాము . ఇక్కడకి సాధువులుగా వచ్చాము కానీ గురువుగారు మనని నిర్లక్ష్యం చేస్తున్నారు .”

తన శిష్యులలో పెరుగుతున్న ఈ అసూయని గురించి అష్టావక్రునికి తెలుసు. అందువల్ల ఒక రోజున ఆయన ఒక సంఘటన జరిగేలా సంకల్పించారు . ఒక హాలులో కూర్చుని ఆయన తన వద్ద ఉన్న సన్యాసులతో మాట్లాడుతున్నారు . అక్కడ జనక మహారాజు కూడా ఉన్నారు . ప్రవచనం జరుగుతున్న సమయంలో ఒక సైనికుడు హడావిడిగా వచ్చి , జనక మహారాజుకి మాత్రమే అభివాదం చేసి “ఓ రాజా ! రాజ ప్రాసాదమునకు నిప్పు అంటుకుని అంతా తగలబడిపోతున్నది . మొత్తం సామ్రాజ్యం అంతా గందరగోళంగా ఉన్నది” అని తెలియచేశాడు.జనకుడు లేచి నిలబడి ఆ సైనికుడిని గట్టిగా మందలించాడు . ముందు ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో ! ఇలా లోపలికి వచ్చి సత్సంగమును మధ్యలో ఆపటానికి నీకు ఎంత ధైర్యం ? అంతే కాక నా గురువుగారికి కాకుండా నాకు నమస్కరించటం ఎంత పొరపాటు ! అలా చేయటానికి నీకు ఎంత ధైర్యం ? వెంటనే ఇక్కడనించి నీవు వెళ్ళిపో ! “అని భటుడిని మందలించాడు జనక మహారాజు . ఆ సైనికుడు వెంటనే బయటకి వెళ్ళిపోయాడు . జనకుడు తన స్థానంలో మళ్ళీ స్థిమితంగా కూర్చున్నాడు . అష్టావక్రుడు తన ప్రసంగాన్ని కొనసాగించాడు .

కొద్ది రోజుల తరువాత అష్టావక్రుడు మరొక సంఘటన జరిగేలా సంకల్పించాడు . హాలులో కూర్చుని అష్టావక్రుడు ప్రసంగిస్తూ ఉండగా శిష్యులంతా కూర్చుని వింటున్నారు . సరిగ్గా ప్రసంగం మధ్యలో ఆశ్రమ సహాయకుడు హాల్లోకి వచ్చి తీగలపైనా ఆరేసి ఉన్న బట్టలన్నింటినీ కోతులు లాగి చింపేసి ఆగం చేస్తున్నాయని చెప్పాడు . అక్కడ ఉన్న సన్యాసులందరూ కోతుల నుండి తమ బట్టలను కాపాడుకోవడం కోసం పరుగులు తీశారు . కోతులు తమ బట్టలను చింపటం వారికి ఇష్టం లేదు. కానీ వాళ్ళు బట్టలు ఆరవేసి ఉన్న స్థలానికి వెళ్ళేసరికి అక్కడ అసలు కోతులే లేవు . వాళ్ళ బట్టలు తీగల పై ఆరవేసినవన్నీ అలాగే ఉన్నాయి . జరిగింది ఏమిటో వాళ్ళకి అర్థం అయింది . వారంతా తలలు వంచుకుని సిగ్గుతో ఆశ్రమానికి తిరిగి వచ్చారు .

అప్పుడు పప్రవచనం లో భాగంగా అష్టావక్రుడు “ఈ విషయాన్ని గమనించండి . కొద్ది రోజుల క్రితం ఈ జనక మహారాజు భవనం కాలిపోయింది . సామ్రాజ్యం అంతా అల్లకల్లోలం అయింది . సంపద అంతా కాలి బూడిద అయిపొయింది . అయినా ఈ జనక మహారాజు కాలిపోయిన సంపద గురించి కాకుండా సత్సంగం భగ్నం అయినందుకు బాధ పడ్డాడు . ఆయన విచారం అది. మీరంతా సన్యాసులు! మీకెవరికీ భార్య ,పిల్లలు లేరు కానీ కోతులు వచ్చి మీ బట్టలు ఎత్తుకు పోతున్నాయి అంటే, మీరు ఒక్కసారిగా సత్సంగం విడిచి పరుగెత్తారు . మీరు కట్టుకొనే ఆ లొంగోటి గుడ్డలు , ఇల్లు తుడవడానికి కూడా ఎవరికీ పనికిరావు . మీరు వాడే బట్టలు అటువంటివి . అటువంటి బట్టల కోసం మీరు నేను చెపుతున్నది కూడా వినిపించుకోకుండా పరిగెత్తారు . ఏది? ఎక్కడుంది మీ సన్యాసం ? జనక మహారాజు అసలైన సన్యాసి . రాజు అయినప్పటికీ అతనే సన్యాసి . మీరు సన్యాసులు , ఇతరులు విడిచి పెట్టిన వస్తువులను వాడతారు. అయినప్పటికీ మీలో సన్యాస లక్షణమే లేదు . ఇది మీ స్థితి . అది అయన స్థితి .

నేర్వవలసిన నీతి :
ఎవరికైనా తమ అంతరంగంలో సాధించే పురోభివృద్ధి కి బాహ్యంలో వారు చేసే పనికి సంబందం లేదు . అతను / ఆమె అంతరంగం లో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అన్నది మాత్రమే అత్యంత ముఖ్యమైన విషయం . మనం బాహ్య ప్రపంచం లో చేసేది సమాజం కోసం ,ఆయా సందర్భాలకు అనుగుణంగా ప్రవర్తిస్తాము . దీని వలన సాంఘిక పరమైన ప్రాముఖ్యతే కానీ ,ఆధ్యాత్మిక ప్రాముఖ్యత లేదు. మన అంతరంగం లో మనం ఏమిటి , మన స్వభావం ఏమిటి అన్నదే చాలా ముఖ్యం .