Archive | April 2018

ఇచ్చి పుచ్చుకో — కర్మ సిద్ధాంతం

విలువ — ఆశావాదం / సరైన నడత
అంతర్గత విలువ — నమ్మకము / ఔదార్యము.
C2825E07-1149-487D-99D7-F336EA18A91E
వివేక్ అడవి లో తప్పిపోయాడు. తన దగ్గర  ఉన్న ఫ్లాస్క్  మంచి నీళ్లు రెండు రోజుల క్రితమే పూర్తి  అయిపోయాయి. కొంచం దూరంలో నీరు ఉన్నట్టు కనిపిస్తోంది , కానీ,ఎండమావి ఏమో అని అనుకుంటూ  నడుస్తున్నాడు.
దగ్గరికి   వెళ్ళగానే మంచి నీళ్లు దొరుకుతాయి అని అతనికి ఆశ కలిగింది. తీరా ముందుకెళ్ళి చూస్తే అతనికి  ఒక పాడు బడ్డ పూరి గుడిసె కమిపించింది .ఆ గుడిసెలో  నీళ్ల పంపు  ఉంది.
వివేక్ పంపు ని కొట్టి నీళ్ల  కోసం ప్రయత్నించాడు, కానీ వ్యర్థం అయింది. నిరాశతో నీళ్ల పంపుని కొట్టే ప్రయత్నం మానుకున్నాడు.
     ఆ పాడు బడ్డ పూరి గుడిసెలోనే  , ఒక నీళ్ల సీసా కనిపించింది.అమ్మయ్యా అనుకుని ఆ నీళ్ళు తాగి తన దాహాన్ని తీర్చుకోబోయాడు” అప్పుడు అతనికి ఆ సీసా కి అతికించి ఉన్న ఒక కాగితం కనిపించింది.
అందులో ఎదో రాసి ఉందని గమనించాడు.
DD05226D-E04E-45B7-B9C9-6B5F7DBDFFDB
 దానిమీద ‘ఈ  నీళ్లు, నీళ్ల పంపు పనిచేయడానికి వాడండి, తరువాత తప్పకుండా ,మళ్ళి సీసాలో నీళ్లు నింపడం మరిచిపోకండి ‘ అని వ్రాసి ఉంది.
అది చదివిన వివేక్ ఆలోచనలో పడ్డాడు.
ఏమి చెయ్యాలి ? ఈ  నీళ్లు, నీళ్ల పంపు లో పోస్తే నిజంగా  పనిచేస్తుందా ? నీళ్ల పంపు పాతది అయిపోతే పని చేయదు కదా ? నీళ్ల పంపు కి ఓట ఉంటే (లీక్ ఉంటే ) నీళ్లు అన్నీ  కారిపోతాయి కదా ? కింద భూమి లో నీరు లేకపోతే కూడా నీళ్ళు తోడలేము కదా ?
కానీ సూచనను నమ్మి , సీసాలో ఉన్న కొంచం నీళ్లు కూడా ఉండవు.
అయినా కూడా ఆశతో అతను ,
చేతులు ఒణుకుతూ, భగవంతుడిని తలచుకుంటూ,  సీసాలో నీళ్లు, నీళ్ల పంపులో పోశాడు.
కొన్ని క్షణానలో నీళ్ల చప్పుడు వినిపించింది. తనకి కావాల్సిన దానికంటే ఎక్కువగా నీళ్ళు వచ్చాయి.
తృప్తిగా నీళ్ళు తాగి తిరిగి వేరే వారి కోసం సీసా లో నీళ్ళు నింపి పెట్టాడు
అప్పుడు గుడిసెలో  కనిపించిన ఒక కాగితం మరియు పెన్సిల్ తీసుకుని
సీసా పైన ముందుగానే రాసి ఉన్న సూచన కింద ,
‘ఈ సలహాని తప్పక నమ్మండి  పంపు చేస్తుంది నీళ్లు ఖచ్చితంగా వస్తాయి ‘ అని వ్రాశాడు  వివేక్.
నీతి:
ఈ సంఘటన మన దైనిక జీవితానికి కూడా వర్తిస్తుంది ,మనం నిజ జీవితంలో ఎంత దానం చేస్తే , అంతకంటే ఎక్కువ మనకి భగవంతుడు  ఇస్తాడు.
అంతే కాకుండా విశ్వాసం యొక్క ప్రాముఖ్యతను కూడా చాటి చెప్తోంది ఈ కథ .
ఈ కథలో వివేక్ తాను చేయబోయే పనికి ఫలితం వస్తుందా లేదా అని అనుమాన పడకుండా గట్టి విశ్వాసంతో ప్రయత్నం చెశాడు.
ఇక్కడ నీరు మన జీవితంలో మనకి మనసుకి ఆహ్లాదాన్ని కలించేవాటికి సంకేతం.అది ధనము కావచ్చు, ప్రేమ కావచ్చు, స్నేహము కావచ్చు.
నీళ్ల పంపు కర్మ సిద్ధాంతము లాంటిది.
కథ లో ఎలాగైతే వివేక్ కొంత నీరు పంపులో పోసి , పోసిందానికంటే ఎక్కూ రెట్లు నీరుని పొందాడో అదే విధంగా జీవితంలో కూడా ఫలితాలు వస్తాయో రావో ఎప్పుడు వస్తాయి అని అనుమానించకుండా నమ్మకంతో   మంచి కర్మలు చేస్తూ పొతే  మనకి రెట్టింపు ఫలితాలు వాటికవే వస్తాయి
మనము ఎల్లప్పుడూ  మంచి చేస్తే, మంచి తలిస్తే , మనకి మంచే జరుగుతుంది.

రామ్ మరియు కావలివాడు.

5BC1F8DC-5242-4887-B736-BE8FC09B00AD
విలువ — సరైన నడత
అంతర్గత విలువ — గౌరవం, మంచితనము.
రామ్ ఒక కూరగాయల వితరణ కార్ఖానాలో పని చేస్తున్నాడు.
 ఒక రోజు సాయంకాలం , కార్ఖానాలోపల, కూరగాయలు పెట్టే   చల్లగది లోపలికి పనిమీద వెళ్ళాడు.
కార్ఖానాలో అందరూ వెళ్లిపోయారు అని అనుకుని, తలుపులు అన్నీ  మూసి వేశారు. ఈ చల్లగది లోపలి నుంచి పిలిచినా ఎవ్వరికీ వినిపించదు.
 అయిదు గంటలు అయ్యాక , గదిలో రామ్ ప్రమాద పరిస్థితిలో ఉండగా, కావలివాడు తలుపు తెరిచి రామ్ ప్రాణం కాపాడాడు.
రామ్ అప్పుడు  ‘నీకు ఎలా అనిపించింది తలుపు తీయాలని?’కావలి వాడిని అడిగాడు.
కావలివాడు ఇలా అన్నాడు ‘నేను 35ఏళ్లగా ఈ కార్ఖానాలో పని చేస్తున్నాను. ఇక్కడ వందల కొద్దీ  పనిచేసేవాళ్ళు వస్తూ , వెళ్తూ ఉంటారు, ఎవ్వరూ   నన్ను పలకరించరు.
మీరు రోజూ నన్ను ప్రేమగా పలకరిస్తారు . ఈ రోజు కూడా మీరు వచ్చేటప్పుడు  నన్ను పలకరించారు  కానీ వెళ్ళిపోయేటప్పుడు చెప్పలేదు. అందుకని నాకు అనుమానము వచ్చింది .
నేను ఎప్పుడూ ” మీ పలకరింపు “వినాలి.
నీతి:
మనం అందరితో వినయంగా, ప్రేమగా మంచిగా నడుచుకోవాలి. ఇలా ఎప్పుడు అయితే మనము ప్రవర్తిస్తామో, మనకి తెలియని  వాళ్ళ దగ్గర  నుంచి కూడా సహాయము పొందుగలము.

అనుభవంతో ఇచ్చిన సలహా.

విలువ –సత్ప్రవర్తన
అంతర్గత విలువ — మంచి అలవాట్లు చిన్నప్పుడే నేర్చుకోవాలి.
Image result for images of a old man in garden
ఒక ధనవంతుడి కుమారుడికి, చాలా చెడు గుణాలు ఉండేవి.
 అనుభవము గల  ఒక మంచి స్నేహితుడితో ,
 తన కుమారుడిని మంచి మార్గములో పెట్టమని ప్రాధేయ పడ్డాడు.
స్నేహితుడు మరియు ధనవంతుడి కుమారుడు ఒక వనంలో నడుస్తున్నారు.ఆయన మధ్యలో ఆగి ,పక్కనే పెరుగుతున్న చిన్న మొక్కని లాగమని అడిగారు. అప్పుడు పిల్లవాడు సులువుగా లాగ గలిగాడు. కొంత  దూరం నడిచాక, కొంచం పెద్ద  మొక్కని తుంపమని అడిగారు. పిల్లవాడు కొంచం కష్టపడ్డాడు.
తరవాత ఒక చెట్టుని చూపించి, తుంపమని అడిగారు. పిల్లవాడు చెట్టు పట్టుకుని, ఆయాస పడుతూ, “నేను చెయ్యలేను ” అని అన్నాడు.
ఇది ఒక ఉదాహరణ అని ఆ స్నేహితుడు చెబుతూ ఇలా అన్నారు “చెడు గుణాలు కూడా అంతే. చిన్నగా ఉన్నపుడే తుంపడం  సులువు. పెరిగిపోతే చాలా కష్టం.”
ఇలా చెప్పి పిల్లవాడిని తన అనుభవంతో మార్చ గలిగారు.
నీతి:
మొక్కై వంగనిది మానై ఒంగునా అని ఒక సామెత ఉంది. చెడు అలవాట్లను చిన్నతనంలోనే గుర్తించి తల్లిదండ్రులు మరియు గురువులు వాటిని మానిపించి పిల్లలను మంచిమార్గంలో పెట్టగలగాలి, ఎందుకంటే ఆలస్యం చేసిన కొద్దీ వాటిని మానిపించటం చాలా కష్టము.
 అలాగే చిన్నతనం లోనే మంచి అలవాట్లు నేర్చుకోవాలి. అప్పుడు అవి పిల్లల మనసులో బలంగా నాటుకుపోయి ముందు ముందుగా వారి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. అలా  నేర్చుకున్న మంచి విలువలు ఎప్పుడూ   మనతో ఉంటాయి.
మంచి అలవాట్లు , మరియు విలువలను నేర్చుకుని పాటిద్దాం, మనము ఉన్న ఊరికి, మన దేశానికి మంచి చేద్దాం!

కుళ్ళిన అరటిపండ్లు

                         

విలువ :   సత్ప్రవర్తన 

ఉపవిలువ :  ఎపుడు చేయవలసిన పనిని అప్పుడు చెయ్యకుండా వాయిదా వేస్తుండటం.
banana

నారిమన్  చాలా మంచివాడు . ఎప్పుడూ దేవుని నామము స్మరించుకుంటూ ఎంతో సేపు ధ్యానం చేస్తూ  దేవునితో అనుసంధానం చెంది ఎంతో శక్తిని , ప్రేరణని పొందుతుండేవాడు. అతని జీతం లో కొంత భాగమును ,తన సమయంలో కొంత భాగమును బీద ప్రజలకి  సహాయపడటానికి కేటాయంచేవాడు. ఫ్రీ మెడికల్ క్యాంపులను నిర్వహిస్తున్నపుడు అక్కడకి వెళ్లి సహాయం చేసేవాడు. తాను పండ్లను కొనుక్కొని ,ఆసుపత్రులలో బీద రోగులకు పంచుతుండేవాడు.  బీద ప్రజలు నివసించే కాలనీలకు వెళ్లి అక్కడి పిల్లలకి ఐస్ క్రీంలని కొనివ్వటం ,లేక ఏదన్నా సినిమా చూపించటం చేసేవాడు . అతని చేసే ప్రతి సేవ భగవంతుడి సేవగా భావించేవాడు. ఒక రోజు యువకుడైన తన కొడుకు మణిత్ ని ” మణిత్,  నేను గుడికి వెళ్తున్నాను. అరటిపండ్లను అక్కడ గుడి బైట కూర్చుని ఉండే బిచ్చగాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాను, నువ్వు వచ్చి ఆ పనిలో నాకు సహాయం చేస్తావా”? అని అడిగాడు. మణిత్ ” ఓహ్ !ఏంటి నాన్నా “? నాకు ఇట్లాంటి పనులు చెప్తావు?. నేను ఏమన్నా ముసలి వాడినా?  గుడికి వెళ్ళటం, పండ్లు పంచటం ఇట్లాంటి పనులు చేయటానికి. ఇవి నేను చెయ్యవలసిన పనులు కాదు. నీవు పెద్దవాడివి. ఇట్లాంటి పనులన్నీ పెద్దవాళ్ళు చేయవలసినవి ,నాలాంటి యువకులు కాదు. నాకీ పనులు చెయ్యాలని లేదు. నీ అంత అయినపుడు చేస్తాలే . కానీ ఎప్పుడు కాదు అని చెప్తూ , వాక్ మాన్ ,హెడ్ఫోన్స్  చెవిలో పెట్టుకొని రాక్ మ్యూజిక్ వింటూ డాన్స్ చేస్తూ ఉండి పోయాడు.

నారిమన్  కొడుకు ధోరణి చూసి , ఏమీ  మాట్లాడకుండా తాను అనుకున్న ప్రకారం గుడికి అక్కడున్న బిచ్చగాళ్ళలో  పండ్లను పంచేశాడు. కొన్నాళ్ల తరువాత ఒక పెద్ద బుట్టనిండా అరటిపండ్లు తెచ్చి వరండాలో పెట్టి  స్నానం చేసిరావటానికి లోపాలకి వెళ్ళాడు , ఇంతలో అటుగా వచ్చిన మణిత్ ఆ పండ్లను చూశాడు. అవి బాగా క్రుళ్ళి పోయి ఉన్నాయి . వాటిమీద చిన్న దోమలు ముసిరి ఉ న్నాయి. పండ్లు ఏమాత్రం బాగాలేవు. ఇంతలో నారిమన్ తెల్లని దుస్తులు ధరించి ,చక్కగా తయారయ్యి  ఆ అరటిపండ్ల బుట్టని కారు డిక్కీ లో పెడుతుంటే, మణిత్, ” నాన్నా! ఈ పండ్లని ఎక్కడకి తీసుకెళ్తున్నావు” అని అడిగాడు. నారిమన్, గుడికి తీసుకెళ్తున్నాను అని చెప్పాడు. అప్పుడు మణిత్ ” అదేంటి నాన్నా తాజా పండ్లు కొని గుడికి తీసుకెళ్ళు. ఈ క్రుళ్ళిన పండ్లు ఎందుకు కొన్నావు? దేవుడికి  ఇలాంటివి ఇవ్వటం సిగ్గు చేటు”. అన్నాడు.

అప్పుడు తండ్రి , నీవు కూడా , బాగా పెద్దవాడైన తర్వాత దేవుని పూజిస్తానంటే నీ వల్ల  దేవునికి ఏమి ఉపయోగం? ముసలి వాడివి అయ్యాక ,ఏమి చేయగలవు? అట్లాగే అతిగా పండిన ,మగ్గిన  పండ్లని ఉపయోగించవచ్చులే”అని బదులు చెప్పాడు. అది విని కొడుకు సిగ్గుతో తలవంచుకున్నాడు.  సిగ్గుతో తండ్రి వైపు చూడలేక పోయాడు. తండ్రి సరైన సమయంలో సరైన కారణం చెప్పగలిగిగాడు.

 

                తండ్రి ,”నీవు యువకుడిగా ఉన్నప్పుడు ,భగవంతునికి  ఎంతయినా సేవ చేయగలవు, ఆపదలో ఉన్న వారికి సేవలందించగలవు . నీ  సమయాన్ని , డబ్బును కూడా బీదవారి కోసం ఖర్చుపెట్టవచ్చు. ఆపదలో ఉన్నవారిని  ఆదుకోవచ్చు . కానీ, నువ్వు ముసలి వాడైతే నీ శరీరం లో అనేక రుగ్మతలు వస్తాయి. అప్పుడు, నీకే ఎవరన్నా సేవ చెయ్యాలి.  ధన సంపాదన లేకపోతె ఆర్థిక బాధలుంటాయి ,ఖర్చులు ఎక్కువ అవుతాయి. ఎవరికి తెలుసు? వయసుతో వచ్చే కాళ్ళ నొప్పులు , మోకాళ్ళ నొప్పులతో కొద్ది గంటలైనా కూర్చొని దైవ   ప్రార్ధన చేయగలవా? నీవు దేవునికి ఏమి సమర్పించగలవు? ఆ సమయంలో నీకు ఇప్పటికంటే కూడా , దైవానుగ్రహం చాలా అవసరం”, అన్నాడు. ఈ మాటలన్నీ చెప్పి తండ్రి బుట్టని కారు  డిక్కీ లో పెట్టుకొని వెళ్ళిపోయాడు. కొడుకుకు చెప్పాల్సినవి చెప్పాడు. కానీ గుడికి వెళ్ళలేదు. ఎందుకంటే ఆ పళ్ళు దేవుడికి సమర్పించటానికి పనికిరావని ఆయనకీ తెలుసు . ఆ బుట్టలో ఉన్న పండ్లని గుడికి తుసుకెళ్ళకుండా , గోశాలకు తీసుకెళ్లి ఆవులకు తినిపించాడు. క్రుళ్ళిన  అరటిపండ్లు ఆ రాకంగా మణిత్ కి బుద్ధి చెప్పటానికి,ఆవుల ఆకలిని తీర్చటానికి పనికొచ్చాయి .

 

నేర్చుకోవలసిన విషయము:

మానసికంగా, శారీరకంగా , ఆర్ధికంగా ఇంకొకరికి సహాయ  పడే స్థితిలో వున్నపుడు తప్పక సహాయం చెయ్యాలి. దానివల్ల అతనికి, ఇతరులకి కూడా ఉపయోగదాయకం. ఏ పనైనా సరే సరైన సమయంలో చేస్తేనే అది అర్ధవంతం అవుతుంది. దాని ప్రయోజనము నెరవేరుతుంది. తప్పక నిర్వహించవలసిన   కర్తవ్యములను రేపు, రేపంటూ వాయిదా వేయవద్దు. ఆలస్యము చేయవద్దు. తగిన సమయంలో చెయ్యాలి . సాక్షత్ యుగ పురుషులైన భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారు ఇలా అన్నారు,” మ్రొక్కను వంచవచ్చు ,అదే చెట్టును వ్రంచితే  అది ఇరిగి పోతుంది. పిల్లలు యువకులుగా పరివర్తన చెందే కాలంలో వారు ప్రపంచ ఆకర్షణ , ఉద్యోగం , కుటుంబ విషయములలో పూర్తిగా నిమగ్నం అవుతారు.చిన్నతనం లోనే పిల్లలను, మానవతా విలువలను బోధిస్తూ పెంచితే వారు పెరిగిన కొద్దీ ప్రపంచ ఆకర్షణలకు లొంగి  దారిని తప్పినా కూడా ,మళ్ళి ఖచ్చితంగా చిన్నప్పటి మంచి దారికే వస్తారు. అందువల్ల ప్రతి ఒక్కరూ ప్రతి రోజూ తప్పని సరిగా దైవ ప్రార్ధన చెయ్యాలి ,భగవంతునికి కృతజ్ఞతలను సమర్పిస్తూ ఉండాలి.

ఇలాంటి  అలవాటును చిన్నప్పటినుండి ఎవరు అనుసరిస్తారో ,వారు వారి వయస్సు పెరుగుతున్నకొద్దీ ,ఎంతో   నిబ్బరంగా ప్రశాంతంగా ఉంటూ ,జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను ,ఒత్తిడిని ఎదురుకొనగలుగుతారు.  అటువంటివారు భౌతిక సుఖములు ,ఆధ్యాత్మిక పురోగమనం పొందుతారు.

 

https://saibalsanskaar.wordpress.com/2015/06/02/rotten-bananas/

https://m.facebook.com/neetikathalu