Archive | April 2017

గురువు – శిష్యుడు

గురువు – శిష్యుడు
విలువ -ధర్మం
అంతర్గత విలువ – అవగాహన, మనసుని అదుపులో ఉంచుకోవడం

 

IMG_3791
ఒక గురువుగారు తన శిష్యుడిని వెంట పెట్టుకుని హిమాలయ పర్వత మార్గంలో నడుస్తునారు. ఆ దారి అంతా ముళ్ళు,పొదలతో మరియు ఇరుకైన మలుపులతో ఉంది. కానీ వారి ఆశ్రమానికి వెళ్ళాలంటే ఆ దారిలోనే వెళ్ళాలి. అక్కడికి దగ్గరలోనే గంగానది చాలా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నదిని దాటి ఆశ్రమానికి చేరుకోవాలి.

అక్కడ గంగానది ఒడ్డున ఒక యువతి కూర్చుని ఉంది. ఆమె నివసించే పల్లెకు చేరుకోవాలంటే నదిని దాటి వెళ్ళాలి. కానీ గంగా నది ఉధృతం చూసి ఆమె భయంతో అక్కడే కూర్చుని ఉంది. అప్పుడే అటువైపు వచ్చిన గురుశిష్యులను చూసి నదిని దాటడానికి సహాయం చెయ్యమని గురువుగారిని అడిగింది.
గురువుగారు ఆమెను రెండు చేతులతో ఎత్తుకుని నది దాటించారు. గురువుగారి ప్రవర్తనకు శిష్యుడు ఆశ్చర్యపోయాడు. నది దాటగానే ఆ యువతి గురువుగారికి కృతజ్ఞతలు చెప్పి తన దారిన తను వెళ్ళిపోయింది. శిష్యుడి ముఖంలో గురువుగారి ప్రవర్తన నచ్చక అసంతృప్తి కనిపిస్తోంది. గురుశిష్యులు ఇద్దరూ ఇంకో రెంగంటలు నడిచి ఆశ్రమానికి చేరుకున్నారు.
శిష్యుడి ముఖంలో అసంతృప్తి గమనించిన గురువుగారు కారణం ఏమిటని అడిగారు.
గురువుగారూ; మనకి స్త్రీలను తాకకూడదు అనే నియమం ఉంది కదా. మరి ఆ యువతిని చేతులతో ఎత్తుకుని నది ఎందుకు దాటించారు? మీరు చెప్పిన నియమాలు మీరే పాటించకపోతే ఎలాగ? అని ప్రశ్నించాడు.
దానికి గురువుగారు నవ్వుతూ ” ఆ యువతిని నది దాటించి నేను అక్కడే వదిలేసాను, కానీ నువ్వు మనసులో ఇంకా మోస్తున్నావు ” అన్నారు.
నీతి:- గురువుగారు/ పెద్దలు చెప్పిన ఏ విషయాన్ని అయిన విని దాని అంతరార్థం గమనించి నడుచుకోవాలి. అంతేకానీ దానిని అనవసరంగా విశ్లేషించి అయోమయానికి గురయ్యి తప్పుగా అర్థం చేసుకోకూడదు.

http://saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu

 

Advertisements

బలరామకృష్ణులు – ఒక భూతం

బలరామకృష్ణులు – ఒక భూతం
విలువ ; ధర్మం
అంతర్గత విలువ ;ఆత్మవిశ్వాసం

IMG_3748

ఒక పౌర్ణమి నాడు బలరామకృష్ణులు అడవి మార్గంలో నడిచి వెళ్తున్నారు.
చీకటి పడడంతో ఆ రాత్రికి అక్కడే నిద్రపోవాలని అనుకున్నారు. అది ప్రమాదకరమైన అడవి కావడంతో కృష్ణుడు, బలరాముడితో ,”అన్నయ్యా; నువ్వు మధ్య రాత్రి వరకు కాపలాగా ఉండు. నేను నిద్రపోతాను.
తరువాత నువ్వు నిద్రపో, నేను కాపలా కాస్తాను “అన్నాడు. బలరాముడు సరేనని ఒప్పుకున్నాడు.
కృష్ణుడు నిద్రపోతున్నాడు. బలరాముడు కాపలా కాస్తున్నాడు. ఇంతలో బలరాముడికి భయంకరమైన పెద్ద అరుపు ఒకటి వినిపించింది. ఆ అరుపు వినిపించిన దిశగా నడిచి వెళ్ళాడు. అక్కడ ఒక భూతం ఉంది. అది బలరాముడి వైపే నడిచి వస్తోంది. దానిని చూసి బలరాముడు భయపడ్డాడు.అతను భయపడేకొద్దీ ఆ భూతం ఇంకా పెద్దదిగా మారసాగింది. బలరాముడు భయంతో కృష్ణా; అని అరుస్తూ స్పృహ తప్పి పడిపోయాడు.
కొంతసేపటి తరువాత కృష్ణుడు నిద్రలేచాడు. మధ్య రాత్రి కావడంతో బలరాముడు నిద్రపోయాడు అనుకుని తను కాపలా కాయసాగాడు. తనకు దగ్గరగా వస్తున్న భూతాన్ని చూశాడు. ఏమి కావాలి నీకు? అని ధైర్యంగా, గట్టిగా అడిగాడు. కృష్ణుడు అలా గట్టిగా ప్రశ్నించడంతో భూతం భయపడి ఆకారం చిన్నదైంది. ఏమి చేస్తున్నావు ఇక్కడ? అని ఇంకా గట్టిగా ప్రశ్నించాడు కృష్ణుడు. భూతం మళ్ళీ భయపడి దాని ఆకారాన్ని సగానికి తగ్గించింది. అలా కృష్ణుడు ప్రశ్నించేకొద్దీ దాని ఆకారం తగ్గుతూ వచ్చింది.

చివరికి అది 2 అంగుళాల సైజుకి తగ్గిపోయింది. అప్పుడు కృష్ణుడు దాన్ని తీసుకుని జేబులో వేసుకున్నాడు. ఇంతలో తెల్లవారడంతో బలరాముడు నిద్ర లేచాడు.
కృష్ణుడిని చూసి బలరాముడు కంగారుగా “కృష్ణా; నిన్న రాత్రి ఏమి జరిగిందో తెలుసా !”అని భూతం గురించి చెప్పాడు. తను భయపడేకొద్దీ దాని ఆకారం పెరిగిందనీ చివరగా తను కళ్ళు తిరిగి పడిపోయాననీ చెప్పాడు. కృష్ణుడు జేబులోనుండి భూతాన్ని తీసి ,”అన్నయ్యా; నువ్వు చెప్పేది దీని గురించేనా? “అని అడిగాడు.
బలరాముడు ఆశ్చర్యంతో ,”ఈ భూతం ఇంత చిన్నగా ఎలా అయిపోయింది ?” అని అడిగాడు.
కృష్ణుడు తను ధైర్యంగా ప్రశ్నించేకొద్దీ భూతం ఆకారం తగ్గిపోయిందని చెప్పాడు. బలరాముడు గత రాత్రి భూతం ఆకారం ఎలా పెరిగిందీ చెప్పాడు.

అప్పుడు కృష్ణుడు ” మనం భయపడే కొద్దీ మన భయాలు పెరుగుతాయి, మనం విచక్షణా జ్ఞానం తో తిరిగి ప్రశ్నించేకొద్దీ అవి తగ్గుతాయి” అని చెప్పాడు.

నీతి:- మనం భయపడేకొద్దీ మన ఆలోచనలు మనల్ని ఇంకా భయపెడతాయి. పరిస్థితులని ధైర్యంగా ఎదుర్కొంటే భయం తగ్గి ,పరిష్కారం లభిస్తుంది. మన ప్రయత్నాన్ని వాయిదా వేసే కొద్దీ భయం కూడా పెరుగుతుంది. అదే ధైర్యంగా ఎదుర్కొంటే గెలిచినా లేదా ఓడినా దాని నుండి ఒక పాఠం నేర్చుకోవచ్చు.

http://saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu

తల్లి మీద ప్రేమ – చాణక్యుడు

తల్లి మీద ప్రేమ – చాణక్యుడు
విలువ ; ప్రేమ
అంతర్గత విలువ ; గౌరవం

IMG_3540

ఒక చిన్న బాలుడు తన తల్లితో కలిసి నివసించేవాడు. వాళ్ళు చాలా పేదవాళ్ళు. ఆ బాలుడు అన్ని విషయాలలో చాలా చురుకుగా, తెలివిగా మరియు చూడడానికి అందంగా ఉండేవాడు. ఆ బాలుని తల్లి ఎప్పుడూ విచారంగా ఉండేది.
ఒకరోజు ఆ బాలుడు తల్లిని , ఎందుకమ్మా ఎప్పుడూ విచారంగా ఉంటావు? అని అడిగాడు. దానికి ఆమె ” ఒక జ్యోతిష్కుడు నీకు ఉన్న ప్రత్యేకమైన పలువరుస (పళ్ళు) కారణంగా నీకు చాలా కీర్తి, ప్రతిష్టలు వస్తాయి అని చెప్పాడు” అని చెప్పింది. దానికి ఆ బాలుడు అందులో విచారించవలసినది ఏముంది? నాకు కీర్తి రావడం నీకు ఇష్టం లేదా? అని అడిగాడు. బాబూ; ఏ తల్లి తన కొడుకు గొప్పవాడు కావాలని కోరుకోదు? నాకు ఇష్టమే, కాని నీకు వచ్చే కీర్తి,ప్రతిష్టల కారణంగా నువ్వు నన్ను వదిలి వెళ్లిపోతావేమో అని భయంగా ఉంది,అని చెప్పింది.
అదివిన్న బాలుడు కూడా ఏడవడం ప్రారంభించాడు. కొంతసేపటి తరువాత ఇంటి నుండి బయటకు వెళ్ళి ఒక పెద్ద రాయి తీసుకుని తన పలువరుస(పళ్ళు) ఊడిపోయేలా కొట్టుకోసాగాడు. అతని నోటి నుండి రక్తం కారసాగింది.
ఇంటినుండి బయటకు వచ్చిన ఆ తల్లి అది చూసి ఆశ్చర్యంతో, బాధతో ఎందుకలా కొట్టుకుంటున్నావని ఆ బాలుని అడిగింది. అప్పుడు ఆ బాలుడు ఈ పలువరుస(పళ్ళు) కారణంగా నేను నీకు దూరమౌతానంటే, అలాంటి పలువరుస(పళ్ళు) నాకు వద్దమ్మా, నేను నీకు సేవ చేస్తూ నీ ఆశీస్సుల వల్ల మాత్రమే జీవితంలో పైకి రావాలని కోరుకుంటున్నాను అన్నాడు.
ఆ బాలుడే తరువాతి కాలంలో చాణక్యుడిగా ప్రసిద్ధి పొందాడు.
నీతి; తల్లిదండ్రులు మరియు పెద్దవారి దీవెనలు మన జీవితంలో చాలా ముఖ్యం. తల్లిదండ్రులు ఎప్పుడూ మన మంచినే కోరుకుంటారు. మనం కూడా వారిని ప్రేమతో, గౌరవంగా చూసుకోవాలి. తల్లిదండ్రులను గౌరవిస్తూ, మంచి ప్రవర్తన కలిగి ఉన్నవారు జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకుంటారు.

http://saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu

ఏ విషయమైనా అందమైన కోణంలో చూడాలి

విలువ — ఆశావాదం
అంతర్గత విలువ — ఆలోచనలో స్పష్టత
శ్రీనివాస్ గారు, పత్రిక చదువుతుండగా, కూతురు శ్వేత, ఒకటే మాట్లాడుతోంది.
 పత్రిక లో భూగోళ పటము ఉన్న పేజీ  చించి, దాన్ని చిన్న ముక్కలుగా చించి, సరైన రీతిలో పెట్టమని  శ్వేతకి ఇచ్చారు. శ్వేత, కాగితము తీసుకుని ,  పరుగులు పెడుతూ తన గదిలోకి వెళ్ళింది.
శ్రీనివాస్ గారు, సంతోషంగా పత్రిక చదువుకుంటున్నారు. ఐదు నిమిషాలలో శ్వేత, భూగోళ పటమును, సరైన రీతిలో అమర్చి, తండ్రికి ఇచ్చింది. తండ్రి ఆశ్చర్యంగా అడిగారు’ఇంత త్వరగా ఎలా చేసావు?’
‘నాన్నగారు మీరు ఇచ్చిన కాగితము వెనుక  వైపు, ఒక మనిషి బొమ్మ ఉంది. ఆ మనిషి బొమ్మని ఒక్కొక్కటిగా అమర్చాను, పేజీ తిప్పితే భూగోళ పటము, వచ్చింది.’ అని ఆనందముగా చెప్పింది శ్వేత.
నీతి.
జీవితములో ప్రతీ అనుభవానికి, కష్టానికి మరోవైపు ఉంటుంది. ఏ ఆలోచన తోచని పరిస్థితిలో , మరో వైపు ఆలోచించాలి. ఆశ్చర్యంగా కష్టము తొలగి పోతుంది.

చెత్త బండి

చెత్త బండి.

విలువ — ఆశావాదం
అంతర్గత విలువ — వైఖరి / తీరు

IMG_2519

విమానాశ్రయానికి వెళ్ళడానికి ఒక రోజు టాక్సీ ఎక్కాను. తోలేవాడు సరైన దోవలోనే ఉన్నాడు, హఠాత్తుగా ఒక నల్ల కారు మా ముందరికి వచ్చింది. నా టాక్సీ తోలేవాడు, చాలా తెలివిగా ప్రమాదం నుంచి తప్పించాడు.

నల్ల కారు తోలేవాడు, కోపంగా మా కారును చూస్తూ అరుస్తున్నాడు. నేను ఎక్కిన టాక్సీ తోలేవాడు, నవ్వుతూ ఆ కారులో ఉన్న వాడిని చూశాడు.
అప్పుడు నేను , నీకు కోపం రాలేదా అతని మీదా!కొంచం లో మనము హాస్పిటల్ లో చేరటం తప్పించుకున్నాము.
ఇదే ‘చెత్త బండి విశిష్టత ‘అని అన్నాడు.మనుషులు చాలా సార్లు చెత్త బండి స్వభావాన్ని కోపము, నిస్సహాయత వంటివి చెత్తా చెదారం లాగా పేరుకుని ఉంటుంది. ఈ చెత్తని పారివెయ్యడానికి చోటు కావాలి కదా ? అందుకని కోపము, విసుకు చూపిస్తూ ఉంటారు. మనము దాన్ని పట్టించోకూడదు.
ఇది నాకు పెద్ద పాఠము అని అనిపించింది.

నీతి.
ప్రతి సందర్భానికి తగినట్టుగా ప్రవర్తించాలి. అయిపోయినదానికి బాధపడడము, అవబోయేదానికి వేదన పడడము, మంచి పద్ధతి కాదు!

http://saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu