Archive | September 2017

ఇటుక

IMG_0033

విలువ: ధర్మ
ఉప విలువ : సహనం

ఒక రోజు ఒక ఉన్నత అధికారి వేగంగా తన కొత్త కార్ -”జాగ్వార్” లో పని మీద వెళ్తున్నాడు.దూరం నుండి దారిలో పిల్లలు ఆడుకోవటం గమనించాడు. పిల్లలు ఆడుకుంటున్న చోట దెగ్గరికి వచ్చేసరికి బ్రేక్ వేసి పిల్లలుకు దెబ్బల తగలకుండా జాగ్రత్త పడ్డాడు. ఇంతలో హఠాత్తుగా ఒక ఇటుక రాయి ఎక్కడ నించో తన కార్ డోర్ మీద పడింది.

కార్ ని వెనుకకు తిప్పి ఇటుక రాయి పడేసిన ఆ కుర్రాడిని “ నువ్వు ఎవరు?ఎందుకలా చేశావురా “,అని కోపంగా మందలిస్తూ అడిగాడు. అంతే కాకుండా,”నా కార్ కొత్తదిరా,నీవు చేసిన పని వల్ల జరిగిన నష్టానికి నాకు చాలా డబ్బు ఖర్చు అవుతింది తెలుసా! నీవు ఎందుకలా చేశావు?”అని ఆ పిల్లవాడిని ఈ పెద్ద మనిషి నిలదీసి అడిగాడు.

దానికి జవాబుగా ఆ పిల్లవాడు”మాస్టారు!,దయ చేసి నా మాట వినండి,నన్ను తప్పుగా అర్ధం చేసుకోండి.ఎంత ప్రయత్నించినా ఎవరూ కార్ ను ఆపడం లేదు.. అందుకే నేను లా చేయవలసి వచ్చింది.”అదిగో అటు చూడండి సార్ ,మా తమ్ముడు వీల్ చైర్ నుండి కింద పడి పోయాడు?”వాడిని తిరిగి మళ్ళీ ఆ కుర్చీ లో కూర్చోపెట్టి ఇంటి వరకు తీసుకెళ్ళాలి,దయ చేసి నాకు సహాయం చేయగలరా,నేను ఒకడిని వాడిని ఎత్తి అందులో కూర్చో పెట్ట లేక పోయాను” అని ఏడుస్తూ  బ్రతిమాలాడు.

ఆ పిల్లవాడి పరిస్థితిని చూసి కార్ ఓనర్ చాలా జాలి పడ్డాడు,అతని కోపమంతా కరిగిపోయింది. వెంటనే తన చేతులతో క్రింద పడి ఉన్న ఆ పిల్ల వాడి తమ్ముడిని మళ్ళీ కుర్చీ లో కూర్చోపెట్టాడు. తన సొంత రుమాల్ (కర్చీఫ్ )ని తీసుకుని అతని ఒంటికి తగిలిన గాయాలను తుడిచి ,”నీకింకేమి కాదు,భయపడకు .”అని అన్నదమ్ములిద్దరికీ ధైర్యం చెప్పాడు.
ఎంతో దయతో సహాయం చేసిన అతనికి ఆ పిల్లవాడు కూడా,“ఆ భాగవతుడు మిమ్మల్ని  చల్లగా చూడాలి సార్” అని కృతజ్ఞతలను తెలుపుతూ వీల్ చైర్ లో కూర్చున్న తన తమ్ముడిని తోసుకుంటూ ఇంటి వైపు వెళ్ళిపోయాడు.

జోరుగా తగిలిన ఇటికరాయి దెబ్బకి కార్ డోర్ బానే సొట్ట బోయిందని తెలుసుకున్న ఓనర్ దాన్ని రిపేర్ చేయించకుండా  ఈ సంఘటనకి గుర్తుగా అలాగే  ఉంచేసాడు.

ఎందుకంటే దాని వల్ల ఆతను
“జీవితంలో మన చుట్టూ ఉన్న మనుషులని,పరిసరాలని పట్టించుకోకుండా మన సొంత పనులలో మునిగిపోతే,ఆపదలో ఉన్న వారిని గమనించలేము.అప్పుడు మన దృష్టిని వారి వైపు మరల్చటానికి ఎవరైనా ఇలంటి  సైగ చేసి మనని పిలిచే పరిస్థితి కలగకుండా మనము చూసుకోవాలి”అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు.”

నీతి: భగవంతుడు మనతోనే ఉంటూ మన బాగు కోసం అంతర్వాణి రూపంలో ( inner voice) మనకి ఎప్పటికప్పుడూ సూచనలను,హెచ్చరికలను ఇస్తూనే ఉంటాడు. కానీ ,మన గోలలో మనం పడి వాటిని అశ్రద్ధ చేసినప్పుడు అనుభవాల ద్వారా మనము గుర్తించేలా చేస్తాడు.వాటిని వినటం, వినకపోవడం మన చేతుల్లోనే ఉంది. కనుక నిజ జీవితంలో అతి వేగాన్ని తగ్గించుకుని నిదానంగా , మానసిక అలజడి లేకుండా ఉండగలిగితే మన మంచి చెడులే కాకుండా మన చుట్టు పక్క వాళ్ళ బాగోగులని కూడా తెలుసుకుని వారికి సహాయపడే అవకాశాన్ని ఆ  భగవంతుడు మనకి అనుగ్రహిస్తాడు.

http://saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu

సాధువుగా మారిన ఒక జాలరి

సాధువుగా మారిన ఒక జాలరి
విలువ -సత్ప్రవర్తన
ఉపవిలువ – పరివర్తనం

1f323d3

చీకటి బాగా కమ్మిన ఒక రాత్రి,జాలరి ఒకడు సరైన సమయం చూసుకుని ఒకరి ఉద్యానవనం లోకి
జొరపడ్డాడు.అందరూ నిద్రపోతున్నారని గమనించి అక్కడ ఉన్న చిన్న పాండ్ (కొలను)లో చేపలను
దొంగతనంగా పడదాము అని నిర్ణయించుకున్నాడు.

కాని,అతను చేపలను పట్టడానికి నీటిలో వల వేయగానే వచ్చిన చప్పుడుకి,ఆ ఇంటి యజమాని నిద్రకి భంగం కలిగింది.దాంతో ఆతను లేచేశాడు.ఖచ్చితంగా తన చేపలను దొంగిలించడానికి ఎవరో దొంగ దూరాడని గ్రహించాడు.

వెంటనే తన ఇంటిలో పని చేసే వారందరిని విషయమేమిటో కనుక్కోమని పంపించాడు. దాంతో ఆ జాలరికి,భయంతో ఎం చేయాలో తోచలేదు. “ఆమ్మో !వీళ్ళు నా వైపే వస్తున్నారు,ఇక్కడ గనక నన్ను చూస్తే తప్పకుండా చితకబాదుతారు,వారి నుంచి నన్ను నేను ఎలా రక్షించుకోవాలి “అని బాగా కంగారు పడ్డాడు. మందుగా తన చేతిలో ఉన్న వలని అక్కడ ఉన్న ఒక చెట్ల పొదలోకి విసిరేసాడు.కానీ,తాను దాక్కోవాటానికి సరైన చోటుని కనుక్కోలేకపోయాడు.

అప్పుడు అతనికి కొంత దూరంలో ఎవరో సాధువు వెలిగించైనా నిప్పు మంట కనిపించింది.
“అమ్మయ్య ,ఆ దేవుడి దయ వల్లో లేదా నా అదృష్టం వల్లనో నాకు వీళ్ల నుంచి తాప్పించుకునే మార్గమొకటి దొరికింది”అని ఎంతో సంతోషించాడు. తెలివిగా వెంటనే తన నెత్తికి ఉన్న తలపాగాను విసిరేసి అక్కడ ఉన్న బూడిదని కొంచం తన నుదుటి మీద రాసుకుని ఆ అగ్నిహోత్రం ముందు చక్కగా ఒక ముని వేషంలో ధ్యానం చేస్తున్నట్టు నటిస్తూ కూర్చున్నాడు.

అక్కడికి వచ్చిన ఆ ఇంటి యజమాని యొక్క దాసులు,ఇతనెవరో సాధువు,పాపం ఏదో ధ్యానం చేసుకుంటుంన్నట్టున్నారు,ఎందుకులే ఆయనకి ఇబ్బంది కలిగించటం అని వెళ్లిపోయారు.

యజమాని,వాళ్ళని ,”ఏ మైందిరా ఇంతకీ ఆ దొంగని పట్టుకున్నారా లేదా”అని ప్రశ్నించాడు.” దానికి జవాబుగా వాళ్ళు యజమానితో ,”లేదు దొరా ..దొంగని అయితే పట్టుకోలేకపోయాము కానీ ,మన వనం లో ఒక యోగి ని చూశాము”, అని చెప్పారు.

“అవునా,నిజమా! మన వనాన్ని ఒక ముని పుంగవులు పావనం చేశారా”ఎంత అదృష్టం అని ఎంతో ఆనంద పడిపోయాడు”నన్ను వెంటనే వారి దగ్గరకి తీసుకెళ్లండి అని వారిని అడిగారు.

ఆ యోగి దర్శనం చేసుకుని ,యజమాని నిశ్శబ్దంగా అక్కడి నించి వెళ్లిపోయాడు.”అమ్మయ్యా! మొత్తానికి చాలా తెలివిగా నేను సాధువుననే అని ఇంటి యజమానిని కూడా నమ్మించగలిగాను”అని జాలరి స్థిమిత పడ్డాడు. సరే ఎలాగో రాత్రి వేళ కదా ఇంకొంచం సేపు ఇక్కడే ఉండి తెల్లవారగానే ఇక్కడ నించి తప్పించుకుందాములే”అని అనుకుని అక్కడే ఆ రాత్రికి ఉండిపోయాడు ఆ జాలరి.

తీరా తెల్లవారగానే అక్కడి నుంచి బయలుదేరుతుంటే,అక్కడికి ఒక నడిమి వయస్సు కల దంపతులు చేతిలో ఒక చిన్న శిశువుని పట్టుకుని వచ్చి,
ఓ మహాశయా! ఇప్పుడే మీ రాక గురించి తెలుసుకున్నాను.దయచేసి మా బిడ్డని పది కాలాలు చల్లగా ఉండాలని దీవించండి” అని కోరారు.

ఏమి చేయాలో పాలుపోక.. వారిని నిరాశ పరచటం ఇష్టం లేక జాలరి వారి శిశువుని “సుఖీభవ!”అని ఆశీర్వదించి తప్పించుకుందామని బయలుదేరాడు. ఇంతలోకి ఆ వనానికి జనాలు గుంపులు గుంపులుగా తాను ఒక గొప్ప సన్యాసి అనుకుని,తన దర్శనం చేసుకుందామని చేరారు.

ఆ తరువాత ఆ జాలరి దొంగతనం చేయటం మానేశాడు.

 

నీతి:జీవితంలో జరిగే సంఘటనలు మరియు ఎదురయే అనుభవాలు మనలో ప్రవర్తనని తీసుకొస్తాయి.ముందుగా మనం మంచిగా మారాలి అని ప్రయత్నించాలి,అలా ప్రయత్నిస్తూ ఉంటే క్రమంగా మనలో మార్పు తప్పక వస్తుంది.
ఆంగ్లంలో “ఫేక్ ఇట్ టు మేక్ ఇట్”అని ఒక సూక్తి ఉంది .అంటే కథలోని జాలరిలా ముందు మాటవారసకైనా ఆదర్శవంతులలా జీవించటం అలవాటు చేసుకుంటే తప్పక ఒక రోజు అలాగే మారతాము.

 

http://saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu

ఆక్షేపణ ని తగిన రీతిలో తీసుకోవడం

IMG_5466.JPG

 

విలువ –సరైన నడత
అంతర్గత విలువ — సరైన తీరు

ప్రోఫెట్ మొహమ్మద్ కి, ఆలీ అని ఒక శిష్యుడు ఉన్నాడు.
అందరూ తరుచూ ఆలీని ఆక్షేపించేవారు, కానీ ఆలీ ఎంతో మౌనంగా భరించేవాడు. కానీ ఒక రోజు గరువుగారి ఎదురిగా, ఆక్షేపిస్తుంటే మౌనంగా ఉండలేక ఎదురు తిరిగాడు. వెంటనే ప్రోఫెట్ మొహమ్మద్, లేచి వెళ్లిపోయారు. ఆలీ గురువుగారి తోపాటు వెళ్లి ఇలా అడిగాడు “అందరూ నన్ను ఆక్షేపిస్తుంటే మీరు ఎందుకని ఏమి మాట్లాడలేదు ”
దానికి బదులుగా గురుగారు “అందరూ ఆక్షేపిస్తుంటే నువ్వు మౌనంగా భరిస్తున్నపుడు , నిన్ను 10మంది దేవతలు రక్షించడం చుశాను. నువ్వు ఎదురు తిరిగి నప్పుడు, ఆ 10మంది దేవతలు, మాయమయిపోయారు . అందుకని నేను కూడా లేచి వెళ్ళిపోయాను “.

నీతి.
సంతోషం, సహనము , క్షమా గుణము, ఇవి అన్నీ మనలో ఉన్న దేవతలు.
మనము ఎదురు తిరిగినప్పుడు, మనలో ఉన్న ద్వేషము అసూయా బయటికి వస్తాయి.
మనని ఎవరైనా ఆక్షేపణ, చేస్తే మనము ఎదురు తిరగకపోతే, మనము ఆ భగవంతుడికి దెగ్గర అవుతాము.
మనకి ఎవ్వరినైనా మార్చే అరహతి లేదు, మనము ధర్మ మార్గములో నడిచి నలుగురికీ ఉపయోగపడేలా ఆదర్శవంతంగా జీవిద్దాము .

 

http://saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu