Archive | May 2016

చిరునవ్వుతో గెలుపు!!

చిరునవ్వుతో గెలుపు
విలువ — సత్ప్రవర్తన / ప్రేమ

అంతర్గత విలువ — చిరునవ్వు / నిశ్చింత

image

 

చిరునవ్వుతో గెలుపు!!!

విలువ – ప్రేమ
అంతర్గత విలువ :చిరునవ్వు ,నిశ్చింత

అరేబియా రాజుకి, ముల్లా నజురుద్దీన్ అంటే చాలా ఇష్టం. రాజుగారు , ముల్లాని తీసుకుని రాజ్య పర్యటన చేస్తూ ఉండేవారు. ఒకరోజు రాజుగారు, ముల్లా పెద్ద బండిలో ప్రయాణం చేస్తూ ఒక గ్రామం దగ్గర ఆగారు.

రాజుగారు, ముల్లాతో, “ఈ చిన్న గ్రామంలో నన్ను ఎవరయినా గుర్తు పడతారా? ఇక్కడ ఆగి చూద్దాము”అని అన్నారు.

అనుకున్నట్టుగానే బండి దిగి, ఆ గ్రామంలో నడుస్తుండగా ,రాజుగారికి ఆశ్చర్యం కలిగింది, ఎందుకంటే అందరూ ముల్లాని చూసి సంతోషంగా నవ్వారు కాని రాజుగారిని ఎవరూ గుర్తుపట్టలేదు.

రాజుగారు చాలా చికాకు పడ్డారు.ఆగ్రహంతో , ముల్లాతో “అందరూ నిన్ను చూసి సంతోషిస్తున్నారు కాని ..నన్ను ఎందుకు ఎవరూ గుర్తు పట్టటంలేదు”.

అలా ఏమీ లేదు మహరాజా,”నాకు కూడా ఇక్కడ ఎవరూ తెలియరు,కాని అందరినీ చూసి చిరునవ్వుతో పలకరించాను, అందుకని వారు కూడా నన్ను చూసి తిరిగి నవ్వుతూ పలకరించారు” అంతే కాని మీరు తెలియక కాదు అని అన్నాడు …ముల్లా.

నీతి :-
ఈ చిన్న కధ నుంచి మనం చిరునవ్వు, ప్రేమ ఎంత ముఖ్యమో నేర్చుకోవచ్చు.
ఒక్క చిన్న చిరునవ్వుతో ఎంతో మందికి ఆనందాన్ని కలిగించవచ్చు!

http://saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu

 

పిల్లలను ప్రేమించండి కానీ అతి గారాబం చేయకండి

MonarchEmergeSeries_butterflyపిల్లలను ప్రేమించండి కానీ అతి గారాబం చేయకండి.
…హిందూ ధర్మచక్రం.

  శూరసేనుడనే మహారాజు చాలా గొప్పవాడు. అతడు తన రాజ్యంలోని ప్రజలందరినీ కన్నబిడ్డలా చూసుకునేవాడు. ఇతని పరిపాలనలో రాజ్యం చాలా సుభిక్షంగా ఉండేది. ప్రజలు ఎవరి వృత్తులను వారు సక్రమంగా చేసుకునేవారు.. అలా పరిపాలిస్తున్న మహారాజుకు ఓక కోరిక కలిగింది. గొంగళి పురుగువ సీతాకోకచిలుక ఎలా అవుతుందో చూడాలి అనుకున్నాడు. తన ఉద్యానవనంలో కొన్ని చెట్లకి గొంగళి పురుగులు ఉండడం చూసి పంట పండింది అనుకోని రోజు వచ్చి చూస్తూ ఉండేవాడు అవి ఒక రొజు వచ్చి చూస్తే గూడు కట్టుకుని వాటిలో మరలా ఉండేవి మరునాడు వచ్చి చూసేసరికి సీతాకోకచిలుకలై ఎగిరిపోతూ ఉండేవి. ఇలా చాలారోజులు ప్రయత్నించాడు. కాని ఎప్పుడు సీతాకోక చిలుక పుట్టుకను మాత్రం చూడలేకపోయేవాడు.

ఒకనాడు మంత్రిగారిని పిలిచి తన మనస్సులో కోరికను వెల్లడించాడు. మంత్రి విని వెంటనే ఆ గొంగళి పురుగులు ఉన్న చెట్టు దగ్గర భటులను నియమించి ”సీతాకోకచిలుక పుట్టే సమయాన్ని మాకు తెలియజేయండి.. అని ఆదేశించాడు. భటులు అలాగే అని,గొంగళిపురుగులు ఉన్న చెట్టు దగ్గర కాపలా కాచి సీతాకోకచిలుక పుట్టే సమయాన్ని మంత్రిగారికి తెలియజేయగా, ఆయన హుటాహుటిన రాజుగారిని వెంటబెట్టుకొని ఉద్యానవనానికి వెళ్ళాడు. సరిగ్గా అదే సమయానికి గూడులో నుండి సీతాకోక చిలుక బయటికి రావడం మొదలైంది.

రాజుగారు ఎంతో ఆసక్తిగా చూడడం మొదలుపెట్టాడు. గూడులో నుండి  సీతాకోక చిలుకను మెల్లమెల్లగా బయటికి రావడం  చూసి, మహారాజు య్యో! ఎంత చిలుక కష్టపడుతుందో! పాపం అనుకుని దగ్గరికి వెళ్లి తన దగ్గర ఉన్న చాకుతో చిన్నగా, సీతకోకచిలుకకి ఏమీ కాకుండా ఆ గూడుని చిందర వందర చేశాడు.అప్పుడు 

చిలుక బయటికి వచ్చి క్రింద పడిపోయి గిలగిలా కొట్టుకుంటుంది. అది చూసి అయ్యయ్యో ఇది ఎగరలేకపోతుంది అని తన చేతుల్లోకి తీసుకొని పైకి ఎగరేశాడు. అయినా అది ఎగరలేక క్రిందపడిపోయి ఎగరడానికి ప్రయత్నిస్తూనే ఉంది . కాని,రెక్కలు విచ్చుకోకపోవడంతో  గిల గిలా తన్నుకొని తన్నుకొని చనిపోయింది. అది చూసిన మహారాజు దుఃఖించాడు.

మంత్రివర్యా! ఏమిటి ఇలా జరిగింది. ఎందుకలా ఈ చిలుక చనిపోయింది? అని అడిగాడు. అప్పుడు మంత్రిగారు ఇలా అన్నారు.

మహరాజా! సృష్టిలో ప్రతీదీ తనకుతానుగా ఎదగడానికి ప్రయత్నించాలి. అప్పుడే తన సామర్ధ్యం ఏమిటో తెలుస్తుంది. ఒక విద్యార్థి విద్య నేర్చుకునేటప్పుడు బాధ్యత గల గురువు అతనిని శిక్షించవచ్చు!అలాగని గురువుకి శిష్యుడి మీద కోపం ఉందని  అనుకోకూడదు. తనను మంచి మార్గంలో పెడుతున్నాడు అని అర్ధం చేసుకోవాలి .శిక్షించకపోతేనే ప్రమాదం. విచ్చలవిడితనం పెరుగుతుంది. సర్వనాశనం అవుతాడు. అలాగే ప్రకృతికి నియమములకి కట్టుబడి జీవులు బ్రతకాలి. మీరు ఏదో ఆ చిలుకకి అది కష్టపడకూడదు అన్న ఉద్దేశ్యంతో సహాయం చేద్దాం అనుకున్నారు. చివరికి పాపం అది చనిపోయింది. ఇదిగో దీన్ని చూడండి అని మరొక సీతాకోకచిలుక బయటికి రావడం చూపించాడు. రాజు గారు మళ్ళీ దానిని బయటికి తీయడానికి వెళ్లబోతుంటే మంత్రి ఆపి, మహారాజా! ఎం జరుగుతుందో చూడండి అని ఆయనను మర్యాదగా ఆపాడు.

సీతాకోకచిలుక తన చుట్టూ ఉన్న వలయాన్ని చీల్చుకువచ్చి రివ్వున ఆకాశానికి ఎగిరింది. అప్పుడు ఆ మంత్రి వినయపూరకంగా మహారాజా! చూశారా!  సహజంగా తనకు తానుగా పోరాడి బయటికి రావడం వలన చిలుక ఇంద్రియాలలో బలం పెరిగింది. దానివలన అది చక్కగా ఎగరకలిగింది. ఇందాక మీరు అది ఎక్కడ కష్టపడుతుందో అని, వలయాన్ని చీల్చేసారు. దానివలన సీతకోకచిలుకకి తన  రెక్కలలో బలం చాలక ఎగరలేక చనిపోయింది. అర్థమైందా మహారాజా! ప్రతిజీవికి పరమాత్మ స్వయం శక్తిని ఇచ్చాడు. దానిని ఎవరికివారు  తెలుసుకునే అవకాశాన్ని ఇవ్వాలి.అలాకాకుండా ఎక్కడ కష్టపడతారో అని ఆ జీవి కష్టం కూడా మనమే పడితే ఇదిగో అనవసరంగా వారి వికశానికి మనమే అడ్డుపడిన వారము అవుతాము”, అని మంత్రి తెలుపగా ,రాజుగారు మంత్రిగారికి కృతజ్ఞతలు తెలియజేసి సన్మానించి బహుమతులను కూడా ఇచ్చాడు. 

ParentAndChild

నీతి :
ఈ కథ ఇప్పటి తల్లిదండ్రులకు సరిగ్గా అతికినట్లు సరిపోతుంది.
ఇలా పిల్లలపై ప్రేమ పిల్లల నాశనానికే తప్ప వికాసానికి దారితీయదు అని నా అభిప్రాయం.
….✍ హిందూ ధర్మచక్రం.

జ్ఞానోదయం

జ్ఞానోదయం
విలువ  : సత్యం
అంతర్గత విలువ : వివేకం

 

image

ఒక ఊరిలో ఒక శిల్పి ఉండేవాడు. అతను చాలా అద్భుతంగా బొమ్మలు చెక్కేవాడు. అలా చెక్కిన బొమ్మల్ని తన గాడిదపై తీసుకువెళ్ళి పక్క ఊరి సంతలో అమ్ముతుండేవాడు. ఒక రోజు ఆ శిల్పి ఒక దేవత బొమ్మను చెక్కాడు. బొమ్మ చాలా అందంగా, దైవత్వంతో ఉన్నట్టు ఉంది. ఆ బొమ్మను జాగ్రత్తగా గాడిద మీద పెట్టుకుని, పక్క ఊరికి తీసుకువెళ్తున్నాడు. దారిలో వెళ్ళేవారు ఆ దేవత బొమ్మను చూసి, నిజంగా దేవతలా భావించి దణ్ణం పెట్టుకుని వెళ్తున్నారు. అయితే ఇదంతా గాడిదకి మరొక రకంగా అనిపించింది. అందరూ తనని చూసి, తనకే నమస్కారం చేస్తున్నారనుకుంది. అలా నడుస్తూ వెళ్తున్న కొద్దీ అందరూ ఆగాగి నమస్కారాలు చేయడంతో గాడిదకి గర్వం పెరిగింది.

‘ఇంత మందికి నేను పెద్ద మనిషిలాగా, గౌరమివ్వాలనిపించేలా కనిపిస్తున్నానా! అని ఆశ్చర్యపోయింది. ‘ఇక నేనెవ్వరి మాట విననవసరం లేదు’ అనుకుంది. కొద్ది సేపయ్యాక దానికి కాళ్ళునొప్పి పుట్టాయి. అందుకని అది దారి మధ్యలో ఆగిపోయింది. గాడిద ఆగిపోయినా, దానిపైన దేవతకి ప్రజలు ఇంకా దండాలు పెడుతూనే పోతున్నారు. గాడిద ఆగిపోయిందేంటబ్బా అని శిల్పి గాడిదను ఎంత సముదాయించినా అది కదలలేదు. ‘ఊరి వాళ్ళంతా నాకు గౌరవమిస్తుంటే నేను గొప్పదాన్నే కదా! మరి గొప్పవాళ్ళు యజమానుల మాటని ఎందుకు వినాలి, అనుకుని అక్కడి నుండి కదలలేదు.

శిల్పికి విసుగు వచ్చి, దేవతా విగ్రహాన్ని గాడిదపై నుండి తీసి తన తలపైనే పెట్టుకుని ముందుకు సాగాడు.” ఆ(! పోతే పోయాడు” అనుకుని గర్వంతో కళ్ళు మూసుకుంది గాడిద. కొద్ది సేపటి తర్వాత కళ్ళు తెరచి చూస్తే, ఒక్కరు కూడా తన దగ్గర లేరు. అందరూ తన యజమాని వెనకే దండాలు పెట్టుకుంటూ వెళ్తున్నారు. ఇంతలో దారిలో అడ్డంగా ఉందని ఒకతను, గాడిద వీపుపై కర్రతో కొట్టాడు. దానితో గాడిదకి జ్ఞానోదయం అయింది. “అనవసరంగా నన్ను నేను గొప్పగా ఊహించుకున్నాను. ఇంకాసేపు ఇక్కడే ఉంటే, నా వీపు పగిలిపోయేలా ఉంది, అనుకుని యజమాని దగ్గరకు పరుగెత్తింది.
నీతి :
గొప్పవారి పక్కన ఉన్నప్పుడు దక్కే మర్యాదలు శాశ్వతమని విర్రవీగడం అవివేకం.

http://saibalsanskaar.wordpress.com

 

రెండు తోడేళ్ళ కథ!!!

రెండు తోడేళ్ళు .
విలువ– సత్ప్రవర్తన
అంతర్గత విలువ — విచక్షణ.

 

image

ఒక రోజు సాయంకాలం ఒక ముసలి తాత మనుషలందరి మనసుల్లో జరిగే యుద్ధం గురించి తన మనవడితో ఇలా చెప్తున్నారు. ‘నాయినా, యుద్ధం మన అందరి మనసుల్లో రెండు తోడెళ్ళ మధ్య జరుగుతునే ఉంటుంది.
అందులో ఒక తోడేలు మనలోని చెడు గుణాలకి ప్రతీక ,
అవేమిటో నీకు తెలుసా … మనలోని క్రోధము, అసూయ, చింత,లోభము, గర్వము, మనపై మనకు కలిగే జాలి,అసహ్యము,నూన్యతా భావము , అసత్యము,ఆడంబరము,పొగరు మరియు అహంకారము.

ఇంకో తోడేలు మన లోని మంచి గుణాలకి సంకేతం:
అవి ఎమిటంటే మనలోని సంతోషం, ప్రశాంతత, ప్రేమ ,ఆశ, నమ్రత, వినయము,ఉదారత, సత్యము సానుభూతి, అవుదార్యం , నమ్మకం , కరుణ, మరియు విశ్వాసము.

తాతగారు చెప్పిన తోడేళ్ళ గురించి వినగానే మనవడు ఉత్సుకతతో ,”తాతా! మరి మనందరిలో జరిగే ఈ మంచి మరియు చెడ్డ తోడేళ్ళ యుద్ధం లో ఏది గెలుస్తుంది ” అని అడిగాడు.
అప్పుడు వెంటనే ,”మనవడా యే తోడేలు ని అనగా యే గుణాలని మనం ఎక్కువగా పోషిస్తామో …ఆ తోడేలే గెలుస్తుందని సమాదానం చెప్పారు.

నీతి.:
ఏ గుణాలని ఐతే మనము ఎక్కువగా ప్రోత్సహించి ఆచరిస్తామో అవి మనకి సహజంగా అలవరుతాయి. అయితే ఎటువంటి వి గుణాలని చేరతీస్తామో అది మన చేతుల్లో నే ఉంది.కనుక చిన్నతనం నుంచే పిల్లలలు మంచి అలవాట్లను అలవరుచుకోగలిగితే వారు భావి తరాలలలో మంచి ఆదర్శవంతమైన పౌరులగా తయారు అవుతారు.

 

http://saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu

వృద్ధ దంపతులు వారి మానవత్వం!

image

వృద్ధ దంపతులు వారి మానవత్వం

విలువ :సత్యము

అంతర్గత విలువ :నిజాయితీ మరియు తృప్తి!!!

కొన్నాళ్ళ క్రిందట నేను ఒక రోజు రాత్రి తమిళనాడు లోని తంజావూరు జిల్లా  లో ప్రయాణం చేస్తున్నాను.  చాలా చీకటి గా ఉంది. బంగాళా ఖాతంలో తుఫాన్ కారణం గా వర్షం విపరీతంగా కురుస్తోంది. రోడ్డు వెంట నీళ్ళు పొంగి పొర్లుతూ ఉంటే ముందుకు పోయే మార్గం లేక డ్రైవర్ కారును ఒక ఊరు సమీపం లో ఆపేశాడు.   ఈ వర్షం లో ఇక ముందుకు పోయే అవకాశం ఎంత మాత్రం లేదు. కారులో కూర్చోవడం కంటే సమీపం లో ఎక్కడికైనా వెళ్లి విశ్రాంతి తీసుకోవడం మంచిది అని చెప్పాడు డ్రైవరు.

తెలియని ప్రదేశం పరిచయం లేని మనుషులు నాకు కొంచెం చీకాకు అనిపించింది. గొడుగు తీసుకుని కారు దిగి నెమ్మదిగా ఆ చిన్న ఊర్లో నడవడం మొదలు పెట్టాను. ఆ ఊరు పేరేమిటో ఇప్పుడు నాకు గుర్తు లేదు కరెంటు లేదు వర్షం లో ఆ చిట్ట చీకటిలో నడవడం నా కొక పెద్ద పరీక్షలా అనిపించింది. కొంచెం దూరం వెళ్ళే సరికి దగ్గరలో ఒక చిన్న గుడి కనిపించింది. అది విశ్రాంతి తీసుకోవడానికి అనువైన ప్రదేశం అని అనిపించింది అటు వైపు గా నడిచాను. రెండు అడుగులు వేసే సరికి వర్షం మరింత ఎక్కువైంది.  గాలి తీవ్ర్రత మరింత పెరిగి నా గొడుగు ఎగిరి పోయింది   నేను పూర్తి గా తడిసి పోయాను నేను గుడిలో కి ప్రవేశి o చే సరికి ఒక వృ ద్దుడి గొంతు వినిపించింది. నన్ను లోపలకు రమ్మని పిలుస్తూ నాకు తమిళం రాదు కాని ఆ వృ ద్దు డి గొంతు  మాట తీరును బట్టి నేను వర్షం లో తడిసి పోయినందుకు ఆయన బాగా అందోళన పడుతున్నాడని తెలుసుకో గలిగాను చాల ప్రయాణాలు చేయడం వల్ల    అనుభవo తో భాష రాక పోయినా మాట తీరును బట్టి ఎదుటి వాళ్ళ భావం అర్ధం చేసుకో వచ్చు అని తెలుసుకున్నాను ఆ చీకటి లో గుడిలోకి తొంగి చూశాను అక్కడ ఒక ఎనభై సంవత్సరాల వృద్ధుడు కనుపిం చాడు ఆయన ప్రక్కన ఇంచు మించు ఆయనతో సమానమైన వయస్సుగల ఒక స్త్రీ సంప్రదాయ పద్ధతిలో నూలు చీర కట్టుకొని నిరాడంబరం గా ఉందిబహుశా ఆ వృద్దు డి భార్య అయి ఉంటుంది ఆవిడ భర్త తో ఏదో చెప్పి శుభ్రమైన ఒక పొడి తువ్వాలు పట్టుకుని నా దగ్గరకు వచ్చింది ఆ తువ్వాలు తీసుకుని ముఖం తుడుచు కున్నాను అప్పుడు గమనించాను ఆ ముసలివాడు గ్రుడ్డి వాడని వాళ్ళు ఉన్న పరిసరాలని చూస్తే వాళ్ళు చాల బీద వాళ్ళని చెప్పక్కర లేకుండానే తెలుస్తోంది నేను నిలబడి ఉన్న  ఆ గుడి శివాలయం పెద్దగా ఆడంబరాలేవీ లేకుండా సామాన్యం గా ఉంది శివ లింగం మీద ఒకే ఒక మారేడు దళం మాత్రం ఉందో అక్కడ ఒక చిన్న దీపం వెలుగుతోంది మిణుకు మిణుకు మనే ఆ దీపం వెలుగులో నాకెంతో ప్రశాంతం గా అనిపించింది ఇంతకు ముందెప్ప్పుడూ అంత ప్రశాoతతను నేను అనుభవించి ఎరుగను నేను భగవంతునికి ఎంతో దగ్గర గా ఉన్నానని పించింది  వచ్చీ రాని తమిళం లో ఆ వృ ద్దు డి ని సాయంకాలం హారతి ఇవ్వండి అని అడిగాను  చాలా అంకిత భావంతో ఆయన శివునికి హారతి ఇచ్చాడు హారతి పూర్తి అయినతరువాత పళ్ళెం లో వంద రూపాయల నోటు వేశాను  ఆయన ఆనోటు ను ఒక సారి చేతితో తాకి వెంటనే చెయ్యి వెనక్కి తీసుకున్నాడు మృదువు గా ఇలా చెప్పాడు అది పది రూపాయల నోటు అనుకున్నాను సాధారణం గా ఇక్కడ్డకు వచ్చే వాళ్ళు పది రూపాయల నోట్లే వేస్తారు మీరు ఏ గుడి కి వెళ్ళినా భక్తి ప్రధానం డబ్బు కాదు మనకున్నంత లో శక్తినిబట్టి  దానం చేయాలని పెద్దలు చెబుతూంటారు కదా నా దృష్టి లో మీ రు కూడా ఈ దేవాలయానికి వచ్చే అందరు భక్తులవంటి వారే మీ డబ్బులు వెనక్కి తీసుకోండి  ఆయన మాటలు విని నాకేం చెప్పాలో తోచలేదు నేను వేసిన వంద రూపాయల నోటు వెనక్కి తీసుకున్నాను చివరి మాటగా నేను వాళ్ళతో ఇలా అన్నాను మీరు పెద్ద వాళ్ళు ఈ ముసలి తనం లో మిమ్మల్ని చూసుకోవడానికి మీకు పిల్లలు లేరు ముసలితనం లో కుటుంబ పోషణ కవసరమైన వస్తువుల కంటె వైద్య సహాయం మీకు ఎక్కువగా అవసర మవుతుంది ఈ వూరు పట్టణానికి చాల దూరం గా ఉండి మీరు ఏమీ అనుకోను అంటే ఒక మాట చెబుతాను ఒక్క నిముషం ఆలోచించాను అప్పటికి మేము ఒక వృద్ధా శ్రమం నడపుతున్నాను ముసలి వాళ్లకు పించను పేరుతొ కొంత ఆర్ధిక సహాయం కూడా చేస్తున్నాము. వాళ్ళు కట్టుకున్న చిరిగి పోయిన బట్టలు చూస్తుంటే నేను సహాయ పడడానికి వీళ్ళు ఎంతగానో తగినవాళ్ళు అనిపించింది ఆ మాటే వాళ్ళతో చెప్పను అప్పుడు ఆ ముసలాయన భార్య ఇలా అంది మీరు మంచి పని చేస్తున్నారు బాబూ మేము కూడా మీకు కొంత డబ్బు పంపుతాము దాన్ని ఒక జాతీయ బాంకు లేదా పోష్టాఫీసు లో డిపాజిట్ చేసి దాని మీద వచ్చే వడ్డీ తో అత్యవసరం గా వైద్య సహాయo కావలసినవారికి సహాయం చేయండి  ఈ మాటలు విని ఆ ముసలాయన ముఖం అనందం తో వెలిగి పోయింది నువ్వు మాకంటే చిన్నవాడివి లా ఉన్నావు చాల తెలివి తక్కువగా ఆలోచిస్తున్నావు ఈ వృద్ధాప్యం లో మాకు డబ్బెందుకు పరమేశ్వరుడికి వైద్య నాధుడు అని పేరు ఉంది నీకు తెలియదా ఆయనను మించిన డాక్టరు ఎవరు మేము నివసించే ఈ ఊరిలో చాల మంది దయా స్వభావులు దానగుణం గల వాళ్ళు ఉన్నారు నేను ఈ గుడిలో పూజ చేస్తుంటాను దానికి ప్రతి ఫలం గా వాళ్ళు మాకు తిండికి సరిపోయే బియ్యం ఇతర అవసరమైన వస్తువులు ఇస్తూ ఉంటారు మేము ఇద్దరం ఆరోగ్యం గానే ఉన్నాము ఒక వేళ మాకు ఏదైనా అనారోగ్యం చేస్తే  ఈ వూరిలో ఉన్న వైద్యుడు మాకు మందులు  ఇస్తాడు మా అవసరాలు చాల తక్కువ తెలియని వాళ్ళ వద్దనుంచి మేము డబ్బులు ఎందుకు తీసుకోవాలి మీరు చెప్పినట్లు గా మేము మీ దగ్గర డబ్బులు తీసుకుని బాంకు లో వేసుకోవచ్చు అది తెలిసి ఎవడో వచ్చి ఆ డబ్బులకోసం మమ్మల్ని పీడించ వచ్చు బెదరించి ఆ డబ్బులు ఇమ్మని అడగ వచ్చు లేదా  ఆ డబ్బుల కోసం మాకు హాని తలపెట్ట వచ్చు ఈ బాధలన్నే మాకెందుకు  నీవు చాల దయా స్వభావం గలవాడవు లా ఉన్నావు అందకే పరిచయం లేని వాళ్లకు కూడా సహాయ పడాలని భావిస్తున్నావు కాని మేము ఉన్నదానితో తృ ప్తి పడే వాళ్ళం నీ దగ్గర నుంచి మాకేమీ అక్కరలేదు మమ్మల్ని ఇలా తృ ప్తి గా బ్రతకనియ్యి నాయనా.  ఈ మాటలు వినేసరికి ధనవంతుడననే నా అహంకారం ఒక్క సారిగా పటా పoచలయి oది తృప్తితో జీవించే ఆ ముసలి దంపతుల కంటె మానసికంగా నేనెంత పేద వాడినో తెలిసి వచ్చింది

నీ తి :– భగవంతుని మీద విశ్వాసం సంతోషాన్ని తృప్తి ని ఇస్తాయి  కోరికలకు అంతం లేదు కోరికలను పెంచుకునే కొద్దీ అవి తీరక పోతే విచారం పెరుగు తుంది పరిమితమైన కోరికలతో తృప్తి గా జీవించ గలిగిన వాళ్ళే ఎప్పుడూ ఆనందం గా ఉండ గలుగు తారు .

http://saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu