నిష్కళంక మైన ప్రార్థన — భగవంతుడి సాక్షాత్కారం.

sincere

విలువ — ప్రేమ

అంతర్గత విలువ — భక్తి , సేవ.

 

మహాభారతంలో ద్రౌపదిని ఎలా అవమానించారో మనకి తెలుసు.

దుశ్శాసనుడు   బలవంతంగా  ద్రౌపదిని,జుట్టు పట్టుకుని ఈడ్చుకు వచ్చి  , సభలో ద్రౌపది  భర్తల మధ్య , పెద్ద వాళ్ళ మధ్య అవమానిస్తాడు. ద్రౌపది  ఒంటిమీద ఉన్న చీర కూడా తియ్యడానికి ప్రయత్నిస్తాడు.

ఈ  అవమానాన్ని అందరూ చూస్తూ ఉండిపోయారు.

 

ద్రౌపది కృష్ణుడిని  ‘ ద్వారకవాసీ నన్ను వచ్చి రక్షించు ‘ అని ప్రార్థించింది.

దుశ్శాసనుడు  ద్రౌపది చీర బలవంతంగా తీసే ప్రయత్నం చేస్తున్నపుడు  వెంటనే  ద్రౌపదిని రక్షించడానికి, కృష్ణుడు చీర రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ద్రౌపదిని నిండుగా కప్పి,దుశ్శాసనుడు తీసేకొద్దీ చీరలు వచ్చేలా చేసాడు.

 

ద్రౌపదిని రక్షించడానికి ఒక కారణం ఉంది.

ఒక రోజు కృష్ణుడు చెరుకు కోస్తున్నపుడు, వేలు తెగుతుంది. రక్తం కారిపోతోంది.  అక్కడ ద్రౌపది, రుక్మిణి, సత్యభామ ఉంట్టారు.

రుక్మిణి కట్టు కట్టడానికి, పాత గుడ్డ  తీసుకునిరావడానికి వెళుతుంది.

సత్యభామ మందు తీసుకుని రావడానికి ఇంటికి వెళుతుంది.

కానీ ద్రౌపది తన చీర కొంగుని చింపి కృష్ణుడి వేలికి కట్టు కడుతుంది. ద్రౌపది భక్తిని చూసి కృష్ణుడికి చాలా ఆనందం కలుగుతుంది.

ద్రౌపది చేసిన ఈ సేవకి కృష్ణుడు, తను పిలవగానే కష్టంలో వెళ్ళి ఆదుకుంటాడు.

 

నీతి.

భగవంతుడు మన భక్తిని, మనం చేసిన సేవని ఎన్నడూ మరిచిపోడు.

మనకి కావాల్సిన సమయంలో తప్పకుండా వచ్చి సహాయపడతాడు.

https://saibalsanskaar.wordpress.com/2015/06/12/god-responds-to-sincere-prayers/

https://m.facebook.com/neetikathalu

One thought on “నిష్కళంక మైన ప్రార్థన — భగవంతుడి సాక్షాత్కారం.

Leave a comment