Archive | March 2017

ముళ్ళ పందుల కథ

ముళ్ళపందులు కధ

 

cartoon hedgehog repetitions

 

విలువ — శాంతము
అంతర్గత విలువ — సహనము , ఐక్యత.

చాలా జంతువులు శీతాకాలపు, తీవ్రత వల్లన మరణిస్తున్నాయి.
పరిస్థితిని గమనించి ముళ్ళపందులు, కలిసి ఉండాలి అని నిర్ణయించుకున్నాయి. ఇలా ఉండడం వల్ల అందరికీ రక్షణా , వెచ్చదనం లభించాయి కానీ ,అందరి మీదా ఉన్న ముళ్ళు, పక్కనే ఉన్న పందులకి రాసుకుని వాటికి పుండ్లు పడ్డాయి.

కొన్ని రోజులు అయ్యాక, అందరూ విడిపోయారు. దీనివల్ల తీవ్ర చలికి గురి అయ్యి, ఒకళ్ళ తరవాత ఒకళ్ళు మరణించారు. అప్పుడు,
అందరూ ఆలోచించు కున్నారు, 1) అందరమూ కలిసి ఉందామా ? ముళ్ళ బాధ భరిస్తూ?
2) విడిపోయి కష్టపడుతూ మరణిద్దామా ?

తెలివిగా అందరూ కలిసి ఉందాము అని నిర్ణయించుకున్నారు. చిన్న చిన్న గాయాలు సహించుకోవడం వల్ల, అందరికీ రక్షణా , వెచ్చదనం లభించాయి.

నీతి:
అందరితో మంచి సంబంధము పెట్టుకోవాలి అంటే, చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. అందరిలోనూ ఉన్న మంచి గుణములను నేర్చుకోవాలి. అందరితో సహనము, హితముగా ప్రవర్తించాలి.

http://saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu

 

Advertisements

రెండు ఏనుగుల కథ

రెండు ఏనుగుల కథ

విలువ –ధర్మం
అంతర్గత విలువ — ప్రేమ, తలితండ్రుల మీద గౌరవం.

IMG_2397

హిమాలయ పర్వతాల మధ్యలో , తామర పువ్వుల మడుగు దగ్గర, సోనా అనే ఒక ఏనుగు పుట్టాడు . ముఖము నీలం గా, పాదాలు తెల్లగా , దంతములు, పొడుగు తొండము తో దివ్యంగా ఉండేవాడు సోనా.
తల్లి వెంటే తెరిగేవాడు సోనా. చెట్ల నుంచి లేత ఆకులూ, తీపి మామిడి పళ్ళు ,కోసి ఇచ్చేది తల్లి, సోనాకి. తామర పువ్వుల మడుగు నుంచి తల్లి తన తొండముతో చల్లటి నీరుతో , స్నానము చేయించేది. ఇద్దరూ తొండము తో నీరు తీసుకుని చాలాసేపు ఆడుకునే వారు.
ఆ తరవాత ఇద్దరూ కొంత సమయము విశ్రాంతి తీసుకునే వారు. సోనా మిగతా ఏనుగులతో ఉన్నప్పుడు, తల్లి దూరం నుంచి గమనిస్తూ ఉండేది.
పిల్ల ఏనుగ సోనా, కొంచం కొంచం ఎదుగు తోంది. మిగతా ఏనుగుల కన్నా,బలముగా , పొడవుగా ఎదిగింది. సోనా ఎదుగు తున్నకొద్దీ, తల్లి ఏనుగు ముసలిగా , అయింది. దంతములు విరిగి, గుడ్డిదయింది.
సోనా తన తల్లికి చెట్ల నుంచి లేత ఆకులూ, తీపి మామిడి పళ్ళు కోసి ఇచ్చేది. తామర పువ్వుల మడుగు నుంచి తన తొండముతో చల్లటి నీరుతో , స్నానము చేయించేది. సోనా తన తల్లిని ఎంతో జాగ్రత్తగా , ప్రేమగా చూసుకునేవాడు.

ఒక రోజు రాజుగారు అడివి లోకి వేటకి వచ్చారు. అప్పుడు అందమైన సోనా మీద అయిన కళ్ళు పడ్డాయి. రాజుగారు సోనుని తన వెంట తీసుకుని వచ్చి, పట్టు వస్త్రాలు, మరియు ఆభరణాలతో అలంకరించారు.
సోనుకి పళ్ళ రసాలు, మంచి నీరు అన్నీ ఇచ్చారు. కానీ ఏమి త్రాగలేక పోయింది. సోను చాలా దిగులుతో చిక్కిపోయింది. రాజుగారు అన్నారు ‘పట్టు వస్త్రాలు, మరియు ఆభరణాలు, పళ్ళ రసాలు, మంచి నీరు అన్ని ఇచ్చాను. ఏమి తినడంలేదు, త్రాగటంలేదు.’
ఏమి చేస్తే నువ్వు సంతోషంగా ఉంటావు అని అడిగారు. దానికి సోనా, పట్టు వస్త్రాలు, మరియు ఆభరణాలు, నాకు సంతోషాన్ని ఇవ్వవు. అంధురాలైన నా తల్లిని , చూసుకోవడానికి ఎవ్వరూ లేక ఒక్కత్తీ అడివిలో ఉంది. నా తల్లికి ముందర ఆహారము పెడితే గాని నేను ఏమి తినను అని అంది.

రాజుగారు ఇది విని అన్నారు ‘ఇంత కరుణ మనుషులలో కూడా చూడలేదు.ఏనుగును ఇక బంధించడం భావ్యము కాదు.’ అని అన్నారు.
అప్పుడు సోనా పరుగులు తీసుకుంటూ తల్లి దెగ్గిరకి వెళ్ళాడు . తొండంతో నీరు విదిలించాడు . ‘నా పిల్ల నా దెగ్గిరకి వచ్చినదా, లేక వర్షం పడుతోందా ?’ అనుకుంది తల్లి. రాజుగారు నన్ను ఇంటికి పంపించారు, అని నీళ్లతో కళ్ళు తుడవగానే, తల్లికి చూపు వచ్చింది.
‘రాజుగారు సంతోషంగా ఉండాలి’ అని అంది తల్లి ఏనుగు.

నీతి.
మన తలితండ్రులు మనల్ని నిష్కల్మషంగా ప్రేమిస్తారు. మనము , తల్లి, తండ్రి, గురువులను దైవముగా భావిస్తాము. తల్లి మన మొదటి గురువు. ఎప్పుడూ తలితండ్రులని ప్రేమగా చూసుకోవాలి.

http://saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu

 

నమ్మకము

ఒక మహాత్ముని నమ్మకము
విలువ; ధర్మం
అంతర్గత విలువ ; అంకితభావం

 

IMG_2330

పూర్వకాలంలో ఒక ముని ఉండేవాడు. అతను భగవంతుని దర్శనం కోసం తపస్సు చేస్తున్నాడు. అడవిలో చెట్ల క్రింద నివసిస్తూ, ఆ చెట్ల ఆకులనే తింటూ ఉండేవాడు. ఒక రోజు నారద మహర్షి అటువైపుగా వెళ్తూ ఈ మునిని చూసి ఆగేడు.

ముని కూడా నారద మహర్షిని చూసి నమస్కరించి, మీరు భగవంతుని దగ్గరకు వెళ్తూ ఉంటారు కదా, నాకు ఒకసహాయం చెయ్యగలరా? అని అడిగాడు. దానికి నారద మహర్షి చేస్తాను అన్నాడు. అప్పడు ముని ” నేను ఎన్నో సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నాను.నాకు మోక్షం ఎప్పుడు లభిస్తుందో అడిగి చెప్పండి” అన్నాడు.
నారద మహర్షి సరేనని భగవంతుని దగ్గరకు వెళ్ళాడు. నారదుణ్ణి చూసి భగవంతుడు ” భూలోకంలో విశేషాలు ఏమిటి?” అని అడిగాడు.
విశేషాలు చెప్తూ ఈ ముని మోక్షం గురించి కూడా అడిగాడు. దానికి భగవంతుడు అతను తపస్సు చేస్తున్న చోట చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని జన్మల తరువాత మోక్షం ఇస్తాను అని చెప్పాడు.
అది విన్న నారదుడు చాలా బాధపడ్డాడు. అయ్యో ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న అతనికి విషయం చెప్తే ఎంత నిరాశ పడతాడో కదా అనుకున్నాడు.
తిరిగి ముని దగ్గరకు వచ్చాడు. అతనిని చూసిన ముని సంతోషంతో భగవంతుడు ఏమి చెప్పాడు ? అని అడిగాడు.
నీవు కూర్చున్న చెట్టుకి ఎన్ని ఆకులున్నాయో అన్ని జన్మల తరువాత మోక్షం వస్తుంది అని చెప్పాడు. అది విన్న ముని ఆనందంతో గెంతులు వెయ్యసాగాడు.
నారద మహర్షి ఆశ్చర్యంతో దీనిలో సంతోషం కలిగించే విషయం ఏముంది? అని అడిగాడు. అప్పుడు ముని, భగవంతుడు నాకు మోక్షం ఇస్తానని  మాట ఇచ్చారు  కదా అందుకు సంతోషిస్తున్నాను అన్నాడు. ఆ మాట చాలు నాకు అన్నాడు.
వెంటనే భగవంతుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అది చూసి నారదుడు మరింత ఆశ్చర్యంతో స్వామీ; ఇప్పుడే వచ్చారేమిటి? చాలా జన్మల తరువాత కదా ఇతనికి మోక్షం ఇస్తానని చెప్పేరు ? అని అడిగాడు.
అన్ని జన్మలు తరువాత ఇస్తానన్నా కూడా ఈ ముని అసలు నిరాశ పడలేదు. ఇతనికి నా మాట పై ఉన్న  నమ్మకము ,భక్తి చూసి ఇప్పుడే మోక్షం ఇవ్వాలని నిర్ణయించుకున్నాను అన్నాడు భగవంతుడు.

నీతి; నారద మహర్షి చెప్పిన సమాధానం విని ముని ధైర్యం కోల్పోయి ఉంటే భగవంతుని దర్శనం లభించేది కాదు. అంకిత భావంతో పని చేస్తే మన గమ్యాన్ని సులభంగా చేరుకోవచ్చు. ఒకసారి లక్ష్యాన్ని నిర్ణయించుకుని, సక్రమమైన పద్దతిలో నమ్మకంతో శక్తివంచన లేకుండా కృషి చేసి దానిని సాధించాలి.

http://saibalsanskaar.wordpress.comm

http://www.facebook.com/neetikathalu

 

జింక అందం

జింక అందం

విలువ : శాంతి

అంతర్గత విలువ : కృతజ్ఞత

IMG_2284

ఒక అడవిలో ఒక జింక ఉంది. ఒక రోజు అది దాహం తీర్చుకోడానికి కాలువ దగ్గరకి వెళ్ళింది. తేటగా ఉన్న నీటిలో దానికి తన ప్రతిబింబం స్పష్టంగా కనిపించింది. అది నీరు త్రాగటం మానేసి తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ నిలబడింది. ‘ఆహా! ఎంత అందంగా ఉన్నాను. పెద్ద పెద్ద కళ్ళు, తమలపాకుల్లాంటి చెవులు, బంగారు చుక్కలతో మిలమిల మెరిసే చర్మం ఇంకెవరికైనా ఉంటుందా? ఇలా తన శరీరంలోని ఒక్కో భాగాన్ని చూసుకుంటూ. అందంగా వర్ణించుకుంటూ తన్మయత్మంతో నిలబడింది.

ఇంతలో దాని దృష్టి తన కాళ్ళపై పడింది. వెంటనే దాని ముఖం దిగులుగా మారిపోయింది. ‘నా కాళ్ళు ఇలా ఉన్నాయేమిటి? సన్నగా పీలగా! ఇంత అందమైన శరీరాన్ని ఇచ్చిన దేవుడు ఇలాంటి కాళ్ళనెందుకు ఇచ్చాడు’? అని ఎంతో దిగులుపడింది.

అప్పటివరకు ఎంతో ఆనందంగా ఉన్న జింక మనసులో బాధ ప్రవేశించింది. ‘ఆ చిన్న లోపం లేకుండా ఉంటే ఎంతో బాగుండును కదా!’ అనిపించింది దానికి. ఇంతలో ఏదో ప్రమాదం రాబోతున్నట్లు పసిగట్టింది. ఎవరో వేటగాడు రహస్యంగా చెట్టు దాపులో ఉన్నట్లు దాని మనస్సు హెచ్చరించింది. కనీసం తల తిప్పి చూడకుండా ఏ దిక్కు వైపు నిలుచుందో అదే దిక్కున ఒక్కసారిగా పరుగు తీసింది. వెనుక ఎవరో అనుసరిస్తున్న అడుగుల శబ్దం, చెంగుచెంగున అంగలు వేస్తూ వేగంగా పరుగెత్తింది జింక. అలుపు లేకుండా సురక్షితమైన ప్రదేశం వచ్చేవరకు అలా పరిగెడుతూనే ఉంది. ప్రమాదం తప్పిపోయిందని గ్రహించి పరుగు ఆపేసి ఒక చెట్టు కింద నిలబడి, “హమ్మయ్య! ఎంత గండం గడిచింది?” అనుకుంది. ఆ గండం తప్పించిన తన కాళ్ళ వైపు జింక అందం

ఒక అడవిలో ఒక జింక ఉంది. ఒక రోజు అది దాహం తీర్చుకోడానికి కాలువ దగ్గరకి వెళ్ళింది. తేటగా ఉన్న నీటిలో దానికి తన ప్రతిబింబం స్పష్టంగా కనిపించింది. అది నీరు త్రాగటం మానేసి తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ నిలబడింది. ‘ఆహా! ఎంత అందంగా ఉన్నాను. పెద్ద పెద్ద కళ్ళు, తమలపాకుల్లాంటి చెవులు, బంగారు చుక్కలతో మిలమిల మెరిసే చర్మం ఇంకెవరికైనా ఉంటుందా? ఇలా తన శరీరంలోని ఒక్కో భాగాన్ని చూసుకొంటూ… అందంగా వర్ణించుకుంటూ తన్మయత్మంతో నిలబడింది. ఇంతలో దాని దృష్టి కాళ్ళపై పడింది. వెంటనే దాని మొఖం దిగులుగా మారిపోయింది. ‘కాళ్ళు ఇలా ఉన్నాయేమిటి? సన్నగా పీలగా! ఇంత అందమైన శరీరాన్ని ఇచ్చిన దేవుడు ఇలాంటి కాళ్ళనెందుకు ఇచ్చాడు’? అని ఎంతో దిగులుపడింది.

అప్పటివరకు ఎంతో ఆనందంగా ఉన్న జింక మనసులో బాధ ప్రవేశించింది. ‘ఆ చిన్న లోపం లేకుండా ఉంటే ఎంతో బాగుండును కదా!’ అనిపించింది దానికి. ఇంతలో ఏదో ప్రమాదం రాబోతున్నట్లు పసిగట్టింది. ఎవరో వేటగాడు రహస్యంగా చెట్టు దాపులో ఉన్నట్లు దాని మనస్సు హెచ్చరించింది. కనీసం తల తిప్పి చూడకుండా ఏ దిక్కు వైపు నిలుచుందో అదే దిక్కున ఒక్కసారిగా పరుగు తీసింది. వెనుక ఎవరో అనుసరిస్తున్న అడుగుల శబ్దం, చెంగుచెంగున అంగలు వేస్తూ వేగంగా పరుగెత్తింది జింక. అలుపు లేకుండా సురక్షితమైన ప్రదేశం వచ్చేవరకు అలా పరిగెడుతూనే ఉంది. ప్రమాదం తప్పిపోయిందని గ్రహించి పరుగు ఆపేసి ఒక చెట్టు కింద నిలబడి, “హమ్మయ్య! ఎంత గండం గడిచింది?” అనుకుంది. ఆ గండం తప్పించిన తన కాళ్ళ వైపు చూసుకుంది. అంతకు ముందు ఎంతో అందవికారంగా కనిపించిన తన కాళ్ళు ఇప్పుడు బంగారు కడ్డీల్లాగా ఎంతో అందంగా కనిపించాయి. దేవుడు తనకు అలాంటి కాళ్ళు ఎందుకు ఇచ్చాడో తెలిసి తనకు అలాంటి కాళ్ళను ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు తెలుపుకొంది.చూసుకుంది. అంతకు ముందు ఎంతో అందవికారంగా కనిపించిన తన కాళ్ళు ఇప్పుడు బంగారు కడ్డీల్లాగా ఎంతో అందంగా కనిపించాయి. దేవుడు తనకు అలాంటి కాళ్ళు ఎందుకు ఇచ్చాడని తెలిసుకుని తనకు అలాంటి కాళ్ళను ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంది

నీతి : మనకి ఉన్నదానితో సంతృప్తిని పొందడంలోనే శాంతిని పొందగలుగుతాము. ఏ కారణం లేకుండా , భగవంతుడు మనకు ఏదీ ఇవ్వడు. మనకి మంచి కానిది లేదా  ఉపయోగం లేనిదీ భగవంతుడు మనకు ఎన్నడూ ఇవ్వడు

http://saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu