Archive | March 2020

నిజమైన స్నేహితుడు

నిజమైన స్నేహితుడు

విలువ   : ప్రేమ ,నమ్మకము . 

ఉపవిలువ : స్నేహము.  

                       అవి మొదటి ప్రపంచ యుద్ధం   జరుగుతున్న రోజులు. ఎక్కడ చూసినా  భయాందోళనలు కమ్ముకుని ఉన్నాయి. యుద్ధభూమిలో యుద్ధం జరుగుతోంది . సైనికులు ఎంతో అప్రమత్తంగా ఉంటున్నారు . ఆ సమయంలో ఒక సైనికుడు తన చిరకాల మిత్రుడైన సైనికుని కోసం వెతకసాగాడు. యుద్ధభూమిలో దూరంగా శత్రువుల భూమిపై కాలువ ప్రక్కన , గాయాలతో పడి ఉండటం చూశాడు. అతడు తీగలతో కంచె అల్లిన తమ భూమి సరిహద్దు అవతల ఉన్నాడు. ఇంకా యుద్ధం జరుగుతూనే ఉంది. తుపాకుల ఫైరింగ్ శబ్దాలు వినపడుతూనే ఉన్నాయి.  తూటాలు గాలిలో దూసుకుపోతున్నాయి. ఆ సమయంలో ,ఈ సైనికుడు తన బాస్ అయిన లెఫ్టనెంట్ ను కలిసి తన సైనిక స్నేహితుని కలవటానికై వెళ్తానని పర్మిషన్ అడిగాడు. సరిహద్దులో ఉన్న కంచె తీగ, కాలువ దాటి తన స్నేహితుడిని తమ భూమిలోకి తెస్తానని చెప్పాడు. 

                    ఇది విన్న లెఫ్టనెంట్  “నీవు వెళితే వెళ్ళు ,కానీ అతను ఎప్పుడో మరణించి ఉంటాడు” అని అన్నాడు. నీవు క్షేమంగా ప్రాణాలతో  తిరిగిరాలేవు అంత ప్రమాదకరము” అని హెచ్చరించాడు లెఫ్టనెంట్. కానీ తన ప్రాణ స్నేహితుడిని చూడాలనే ఆత్రుతతో ఈ సైనికుడు ధైర్యమ ,సాహసాలతో ,తెలివిగా తన స్నేహితుని వద్దకు,అన్ని అడ్డంకులను  దాటి శత్రువుల భూమిలోకి అడుగుపెట్టాడు. మెల్లిగా గాయాలతో పడివున్న తన స్నేహితుడిని తన భుజములపై ఎక్కించుకుని ,ప్రయాసపడుతూ తన సరిహద్దుల్లోకి చేర్చాడు. లెఫ్టనెంట్ వారి వద్దకు వచ్చి సైనికుడితో  ,“నేను ఎంత చెప్పానా వినకుండా నీవు ప్రాణానికి తెగించి శత్రువు భూమిలోకి వెళ్ళావు “,కాని అతని ప్రాణాలతో తీసుకురాలేకపోయావు “,అని భాద పడ్డాడు. అంతేకాదు, నీవు అక్కడకి వెళ్లొచ్చి నందుకు ఎన్నో గాయాల పాలయినావు అని సానుభూతి చూపించాడు లెఫ్టనెంట్. దానికి సైనికుడు ఈ విధంగా బదులు  చెప్పాడు.  

                            “ సార్! నేను నా స్నేహితుని కోసం వెళ్ళటం ఎంతో మంచిదయింది!” అని అన్నాడు . దానికి లెఫ్టనెంట్ ఆశ్చర్యంగా , ఏం అంటున్నావు నీవు !  అతను మరణించాడు గదా” అన్నాడు . సైనికుడు , “అవును సార్, నేను అతనిని సమీపించేటప్పటికి , అతను బ్రతికే ఉన్నాడు ,నన్ను చూడగానే ఎంతో సంతోషించాడు. నన్ను చూసి,“జిమ్! నాకు తెలుసు! నీవు ఎలాగైనా నాకోసం వస్తావని” , అని అన్నాడు. నేను కూడా నా ఫ్రెండ్ ను చూసి అతని సంతోహాన్ని కళ్ళారా  చూసి, అతని మాటలు విని నేను ఎంతో సంతృప్తి చెందాను. వెళ్ళి ఉండకపోతే జీవితాంతం బాధపడుతూ ఉండేవాడిని”, అని అనుకున్నాడు.   

 ఈ సైనికుడు సరియైన నిర్ణయం తీసుకుని ఎంతో  సాహసం చేసి తన స్నేహితుని సంతోషం చూసి అతనికి తనపై గల నమ్మకమును నిలబెట్టినందుకు తను జీవితంలో ఎంతో మంచి పని చేశాననుకున్నాడు. 

నీతి  : 

                    చాలా సార్లు ఏదైనా పని చేసేముందు అది  విలువైనదా ,చేయతగినదా?, అనే నిర్ణయం ఆ పని చేయబోయే వాడు ఆలోచించే కోణం మీద ఆధార పది ఉంటుంది.   ఏది మంచిదో, నిర్ణయంచుకుని ఎంతో ధైర్యంగా ఆ పనిని చేయాలి. ఒక్కొక్కసారి చేయాలా ? వద్దా ? అనే నిర్ణయం చేయటం కష్టమే! అయితే తరువాత రోజులలో ఆ పని చేయలేదే అని పశ్చాత్తాప పడకూడదు. మనలను ఎంతమంది వదిలి పెట్టినా మన నిజ స్నేహితుడైన వాడు మనతోనే ఉంటాడని? యుద్ధము ,ఒప్పుఎవరిదీ ?తప్పు ఎవరిదీ ? కన్నాచివరివరకు మనతో ఎవరు మిగిలి ఉన్నారు అని తెలియపరుస్తుంది. 

https://saibalsanskaar.wordpress.com/2016/01/28/a-true-friend/

భావేన దైవం 

విలువ –యథార్థము / సత్యము 

అంతర్గత విలువ — మంచి ఆలోచన 

అనగనగా ఒక ఊరిలో రామ అనే  మంచి స్వభావము గలవాడు ఉండేవాడు.రామ అజీర్ణ వ్యాధితో ఎంతో బాధ పడుతూ ఉండేవాడు. అది తగ్గడానికి చాలా ఔషదాలు వాడాడు, కానీ ఏది పనిచేయలేదు. 

ఒక మహాత్ముడు ఆ ఉరికి ఉపదేశం ఇవ్వడానికి రావడం జరిగింది. రామ ఆయన దగ్గరికి వెళ్లి , తన ఆరోగ్య పరిస్థితిని గురించి  చెప్పుకున్నాడు. ఇది విన్న మహాత్ముడు, రామాని, ‘రాతి ఉప్పు ‘(rock salt ) చప్పరించమని , చిన్న చిట్కా చెప్పారు. ఆ మహాత్ముడు చెప్పినట్టే చేసిన రామ కొంత ఉపశమనాన్ని  పొందాడు.

రామ పండగ సమయంలో  ,ఊరిలోని బీద పల్లలికి  మిఠాయి పంచేవాడు. ఒక రోజు మిఠాయి కొనడానికి అంగడికి వెళ్ళాడు. మిఠాయిలని కొనే ముందు వాటిని రుచి చూశాడు , అతనికి అవి చేదుగా అనిపించాయి. అందుకని మరి కొన్ని దుకాణాలకి వెళ్ళి  అక్కడ కూడా మిఠాయిలని రుచి చూస్తే అవి కూడా చేదుగా అనిపించాయి.

అప్పుడు రోజూ రామ ,ఉప్పుని  చప్పరిస్తున్నాడు అని తెలిసిన ఒక షావుకారు , అతనిని ముందర నోరుని  శుభ్రముగా కడుక్కున్న తరువాత మిఠాయిని తినమని సలహా ఇచ్చాడు. అలా చేసిన తరువాత రామకి మిఠాయి, తీపి రుచి తెలిసింది. 

నీతి:

మనలో దుర్గుణములు తెలుసుకుని, వాటిని సరిదిద్దు కోవాలి. మనలోని చెడు నిర్మూలమైనప్పుడే మనకి ఎదుటి వాడిలో  మంచితనం కనిపిస్తుంది. అప్పుడే మనము మహాత్ముల సత్సంగాన్ని ఆనందంగా అనుభవించ కలుగుతాము. దాని వల్ల కలిగే లాభములని పొందగలుగుతాము. ఆలోచనలు ఎంతో శక్తివంతమైనవి . మనలో కలిగే ఆలోచనలే మనము ఎటువంటి వారమో ,ఎటువంటి పనులను చేస్తామో సూచిస్తాయి .మంచి మంచిని ,చెడు చెడుని ఆకర్షిస్తుంది.కనుక మంచినే తలిచి తద్వారా శాంతిని,ఆనందాన్ని పొందుదాము.

https://saibalsanskaar.wordpress.com/2016/03/02/bitter-tasting-sweet/