Archive | June 2014

పరోపకారం, విలువ: ధర్మం , అంతర్గత విలువ: సమయానుకూల సహాయం

ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉండేవాడు. అతను చాలా పిసినారి. అతని పిసినారి ప్రవర్తన వల్ల విసిగిపోయిన ఊరిప్రజలు అతనితో సరిగా మట్లాడేవారు కాదు. అందరూ తనని దూరంగా ఉంచుతున్నారన్న బాధతో అతను ప్రజలతో ఇలా అన్నాడు. మీరందరూ నన్ను, నా ఆస్తిని చూసి అసూయపడి నాతో సరిగా మాట్లాడట్లేదు. కాని నేను చనిపొయేటప్పుడు ఇవేమీ నాతో తీసుకునివెళ్ళనుకదా, నా ఆస్తి అంతా దానధర్మాలకి ఉపయోగపడేలా వీలునామా రాస్తాను, అదివిని ప్రజలందరూ ఇంకా ఎక్కువగా నవ్వసాగేరు, దానితో విసుగు చెందిన ఆ ధనవంతుడు, కొన్ని సంవత్సరాలు ఆగితే ఏమి జరుగుతుందో మీరే చూస్తారు అన్నాడు, అయినా అతని మాటలు ఎవ్వరూ నమ్మలేదు. అతనిని ఎవరూ నమ్మట్లేదు అని గ్రహించిన ఆ ధనవంతుడు చాలా బాధపడసాగేడు.
Volunteers talking to villagers ఒక రోజు అతను పనిమీద బైటికి వెళ్ళివస్తూ దారిలో వర్షం రావడంవల్ల ఒక చెట్టుకింద నిలబడ్డాడు. అదే చెట్టుకింద ఒక పంది, ఆవు కుడా ఉన్నాయి.అవిరెండూ మట్లాడుకుంటూఉంటే ఆ ధనవంతుడు వినసాగేడు.
imagesZ2HLMWOWపంది ఆవుని ఇలా అడిగింది,మనుషులు అందరూ నిన్ను మెచ్చుకుంటారు, నన్ను అసహ్యించుకుంటారు ఎందుకు? నువ్వు వాళ్ళకి పాలు ఒక్కటే ఇస్తావు, కాని నేను చనిపొయాక వాళ్ళు నామాంసం, చర్మం అన్నీ ఉపయోగించుకుంటారు అయినా నాకు ఎలాంటి విలువ ఇవ్వరు. అప్పుడు ఆవు ఇలా చెప్పింది, నేను బ్రతికిఉండగానే నాకు ఉన్నదాంట్లో వాళ్ళకి కొంచెం ఇస్తున్నాను, కాని నువ్వు చనిపొయేవరకు ఏమి ఇవ్వవు.

మనుషులు భవిష్యత్తుకంటే వర్తమానానికే ప్రాధాన్యత ఇస్తారు, నువ్వు కూడా బ్రతికిఉండగనే వాళ్ళకి ఏదయినా చెయ్యి, అప్పుడు నిన్ను కూడా మెచ్చుకుంటారు.
ఇదంతా విన్న ధనవంతుడు తన తప్పు తెలుసుకుని ఆరోజు నుండే దానధర్మాలు చెయ్యడం మొదలుపెట్టేడు.

నీతి: ఏ పని అయినా సమయానికి చేస్తేనే దానికి విలువ ఊంటుంది, అలాగే చెయ్యగలిగిన సహాయం కూడా అవసరానికి ఉపయోగపడేలా చెయ్యాలి . సమయం మించిపోయాక చేసినా దానికి విలువ ఊండదు. పరోపకారం వల్ల మంచిపేరు, మనశ్శాంతి రెండూ సంపాదించుకోవచ్చు.

http://saibalsanskaar.wordpress.com
https://www.facebook.com/neetikathalu

Advertisements