Archive | March 2014

క్రిస్మస్ కానుక విలువ : ప్రేమ , అంతర్గతవిలువ : బాధ్యత

9 ఏళ్ల వయసున్న, జారోన్, మరియు 6 ఏళ్ల వయసున్న,పార్కర్, క్రిస్మస్, పండుగ వస్తోంది అని చాలా సంతోషంగా ఉన్నారు.
వాళ్ళ ఊరిలో ఒక చదువుల పోటీలో పాల్గొన్నారు. ఇద్దరిలో ఎవరు ఎక్కువ పుస్తకాలు చదువుతారో, వారికి ఒక సైకిల్ బహుమానంగా ఇవ్వబడుతుంది. ఎన్ని పుస్తకాలు రోజుకి చదువుతారో, వారి తల్లి తండ్రులు, ఉపాధ్యాయులు, పుస్తకం పైన సంతకం చెయ్యాలి.
పార్కర్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు, ఎందుకంటే సైకిల్ కొనుక్కోవాలి అని చాలా ఆశ. అన్న జారోన్ ఒక పోటీలో సైకిల్ గెల్చుకున్నాడు, రోజు అతను సైకిల్ తొక్కటం చూసి విసిగిపోయాడు.
reading books పార్కర్ ఇధి ఒక గొప్ప అవకాశం, సైకిల్ కొనుక్కోవడానికి అని అనుకున్నాడు. అందుకని కష్టపడి చాలా పుస్తకాలు చదవటం మొదలుపెట్టాడు. ఎంత చదివినా, ఇంకాఎవరో తనకంటే ఎక్కువగా, చదువుతున్నారు. ఇంతలో జారోన్ గమనించాడు , తన తమ్ముడు, కొంచెంలో పోటీ గెలుస్తాడు అని. క్రిస్ట్‌మస్, అంటే సంతోషాన్ని పంచుకోవటం, అని తెలుసుకున్నాడు. జారోన్ కూడా కష్టపడి, రోజుకి 8గంటలు పుస్తకాలు, చదవటం మొదలుపెట్టాడు .
పోటీకి ఆఖరి రోజు వచ్చింది. జారోన్ మరియు అతని తల్లి పోటీలో ఎవరు గెల్చుకున్నారు అని చూడడానికి వెళ్లారు. అక్కడ ఉన్న ఎర్రటి రంగు సైకిల్ ని, జారోన్ చాలా సంతోషంగా, గమనిస్తున్నాడు. అక్కడ ఉన్న మేనేజర్ జారోన్ తో ఇలా అన్నారు,’నువ్వు గనక గెలిస్తే, ఇంతకంటే, పెద్ద సైకిల్ కావాలి కదా’ అని అన్నారు. దానికి జారోన్ ‘నాకు ఇదే కావాలి’ అని చెప్పాడు. దానికి ఆ మేనేజర్ ‘ఇధి నీకు చాలా చిన్నది అవుతుంది ‘ అని చెప్పారు. అప్పుడు జారోన్ ‘ సర్ నేను నా చిన్నతమ్ముడి కోసం, ఈ సైకిల్ గెల్చుకోవాలి అని అనుకుంటున్నాను ‘ అని చెప్పాడు.
దానికి మేనేజర్ చాలా ఆశ్చర్య పోయారు, జారోన్ తల్లితో ఇలా అన్నారు. ‘ఈ సంవత్సరం లో నేను చూసిన గొప్ప క్రిస్మస్ కధ ఇది’ అని చెప్పారు. జారోన్ తల్లికి తెలియనే లేదు, జారోన్ తన చిన్న తమ్ముడి కోసం కష్ట పడుతున్నాడు అని. తల్లి ఇంటికి వెళ్తూ, జారోన్ వైపు చాలా గొప్పగా, సంతోషంగా చూసింది.
ఇంటికి వెళ్ళగానే, ఫోన్ వచ్చింది 280 పుస్తకాలు చదివి, జారోన్ పోటీలో గెల్చాడు అని. తల్లిదండ్రుల సహాయంతో, సైకిల్ ని, అమ్మమ్మగారి ఇంట్లో, క్రిస్మస్ దాకా దాచాడు జారోన్.
cycle తరవాత, ఒక అన్న తన చిన్న తమ్ముడి కోసం, 280పుస్తకాలు, చదివాడు,సైకిల్ గెల్చుకున్నాడు ,అని ప్రేమ కధ చెప్పింది .
జారోన్ లోపలికి వెళ్ళి చిన్న తమ్ముడికి, సైకిల్ తీసుకునివచ్చేడు.. అందరు చాలా సంతోషించారు. పార్కర్ సైకిల్ మీద , ఒక రౌండ్ వెళ్లాడు. అన్నదమ్ములు ఇద్దరూ సంతోషంతో కౌగిలించుకున్నారు.

నీతి:
అందరినీ ప్రేమ, దయతో చూడాలి. మన కుటుంబంతో, మన తోటి వారితో, మొదలుపెట్టి, మన ఇరుగుపొరుగు వారితో ప్రేమగా ఉండాలి. ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళని ప్రేమగా, గౌరవంగా, చూసుకోవాలి.

http://saibalsanskaar.wordpress.com
https://www.facebook.com/neetikathalu

గురువుఅనుగ్రహం విలువ:- భక్తి అంతర్గత విలువ:- ధర్మం , సత్ప్రవర్తన

గురుర్బ్రహ్మా గురుర్విష్ణు : గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరంబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః

బ్రహ్మ, విష్ణువు, పరమేశ్వరుడు ఈ ముగ్గురి స్వరూపం కూడా గురువే, సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు కూడా గురువే . అటువంటి గురువునకు నమస్కరించు చున్నాను

ధౌమ్య మహర్షి ఒక అరణ్యంలో ఒక ఆశ్రమం నిర్మించుకొని తన శిష్యుల తో పాటు నివసించేవాడు. ఒక రోజున ఉపమన్యుడు అనే విద్యార్ధి , ధౌమ్యుని వద్ద శిష్యునిగా చేరడానికి వచ్చాడు. అతడు చూడడానికి చాల అసహ్యంగా కనిపిస్తున్నాడు. ఎంత మాత్రం తెలివైనవాడిలా కనిపించడం లేదు. అతడు గురువు గారికి నమస్కరించి తనను శిష్యునిగా స్వీకరించమని కోరాడు. ఆ రోజులలో ఎవరిని శిష్యునిగా చేర్చుకోవాలో ఎవరిని చేర్చుకోకూడదో గురువు గారి ఇష్టం మీద ఆధారపడి ఉండేది. ధౌమ్యుడు ఉపమన్యుణ్ణి శిష్యుని గా చేర్చు కోడానికి అంగీకరించాడు.
GuruSishya
ఉపమన్యుడు మందబుద్ధి. ఎంత మాత్రం చురుకుదనం లేని వాడు అయినా ధౌమ్యుడు ఉపమన్యుణ్ణి ఆశ్రమంలోని మిగిలిన శిష్యులతో కలసి ఉండనిచ్చేవాడు. ఉపమన్యుడి చదువు విషయంలో మాత్రం ధౌమ్యుడు ఏవిధమైన శ్రద్ధ చూపించే వాడు కాదు వేదాలు, శాస్త్రాలు ఉపమన్యుడుఅర్థం చేసుకోలేక పోవడం మాత్రమే కాదు, కంఠస్థం చేయలేక పోయేవాడు కూడా. ఒక విదార్థిలో ఉండాల్సిన మంచి లక్షణాలేవీ కుడా ఉపమాన్యుడిలో లేవు.

ధౌమ్యుడు ఉన్నతమైన వ్యక్తిత్వం కలవాడు. ఉపమన్యుడిలో ఎన్ని లోపాలు ఉన్నా అతడిని ఎంతో ప్రేమ గా చూసేవాడు. తన దగ్గర ఉన్న తెలివైన విద్యార్ధుల కంటే ఉపమన్యుడి మీద ఎక్కువ ప్రేమ చూపించేవాడు. ఉపమన్యుడు కూడా గురువు గారి విషయం లో శ్రద్ధ, భక్తీ కలిగి గురువు గారు ఏమి చెప్పినా చేయడానికి సిద్ధం గా ఉండేవాడు. ఉపమన్యుడు అతిగా తినే స్వభావం కలవాడు, అందుచే మందబుద్ధి కలవాడై చురుకుదనం లేక నిద్ర పోతూ సరిగా ఆలోచించలేక పోతున్నాడు, అర్థం చేసుకోలేకపోతున్నాడు అని ధౌమ్యుడు గ్రహించాడు. ధౌమ్యుడు తన శిష్యులను అతిగా తిన వద్దని జిహ్వ చాపల్యం అదుపు లో ఉంచుకోమని తరచు చెబుతూ ఉండేవాడు
ధౌమ్యుడు ఉపమన్యుణ్ణి ఆశ్రమంలోని ఆవులను కాసుకు రమ్మని ఆదేశించాడు. ఉదయమే ఆవులను తోలుకు వెళ్లి వాటిని సాయంకాలం వరకు మేపి సాయంకాలం ఇంటికి తోలుకు రావడం ఉపమన్యుడి దినచర్య. భోజనం చేసినా కూడా ఉపమన్యుడికి ఎంతో ఆకలి వేసేది అందుచే ఆవుల పాలు పితుకుకొని త్రాగేవాడు. ఆవులను కాయడానికి ఉపమన్యుడు రోజంతా కష్టపడుతున్నా ఉపమన్యుడు బలం గానే కనిపించేవాడు. గురువుగారు ఆశ్చర్య పడి ఇంత బలంగా ఎలా ఉండగలుగుతున్నావు అని అడిగితే ఆవుల పాలు త్రాగుతున్నానని ఉపమాన్యుడు నిజాయతీగా సమాధానం చెప్పాడు. ఆ ఆవులు నీవి కావు నా అనుమతి లేకుండా పాలు త్రాగ కూడదని గురువు గారు ఉపమన్యుణ్ణీ సున్నితంగా మందలించారు. ఉపమన్యుడు గురువు గారి మాటకు అంగీకరించాడు. మరునాటి నుంచి దూడలు పాలు త్రాగేటప్పుడు క్రిందకు జారిపడే పాల చుక్కలను దోసిళ్ళ తో పట్టుకుని త్రాగే వాదు. ఉపమన్యుడు మామూలుగానే బలంగా ఉండడం చూసి గురువు గారు నీవింత బలంగా ఎలా ఉండగలుగుతున్నావని అడిగారు. ఉపమాన్యుడు మరల నిజాయతీ గా సమాధానం చెప్పాడు, దూడలు పాలు త్రాగే టప్పుడు వాటి నోటి నుంచి జారి పడే పాల చుక్కలలో మురికి ఉంటుంది అవి త్రాగితే ఆరోగ్యానికి మంచిది కాదు అని గురువు గారు ఉపమన్యుడికి చెప్పారు.

మరునాడు ఉపమన్యుడు ఆకలి బాధకు తాళ లేక అరణ్యం లో తనకు కనిపించిన జిల్లేడు ఆకులను తిన్నాడు.విషపూరితమైన ఆ ఆకుల ప్రభావం చేత ఉపమన్యుడు గ్రుడ్డివాడై పోయాడు. త్రోవ తడుముకుంటూ సరిగా కనపడక ఒక నూతిలో పడిపోయాడు. సాయంకాలం ఆవులు మాత్రమే ఇంటికి వచ్చాయి. ఉపమన్యుడు రాలేదు. ధౌమ్యుడు ఉపమన్యుణ్ణి వెదకుతూ వెళ్లి నూతిలో పడిన ఉపమన్యుణ్ణి చూసి బయటకు తీశాడు. ఆయనకు ఉపమన్యుడి మీద చాల దయ కలిగింది, ఉపమన్యుడికి ఒక మంత్రం ఉపదేశించాడు ఉపమన్యుడు భక్తితో ఆ మంత్రం జపించే సరికి అశ్వనీ దేవతలు ప్రత్యక్షమయ్యారు. వాళ్ళ అనుగ్రహం వాళ్ళ ఉపమన్యుడికి చూపు వచ్చింది.
guru_in_forest_hermitage

తరువాత అతిగా తినడం వలన ఎటువంటి కష్టాలు వస్తాయో ఉపమన్యుడికి ధౌమ్యుడు వివరించి చెప్పాడు. ఉపమన్యుడు కళ్ళు పోగొట్టుకనడానికి కారణం అవే కదా, సరియైన సమయంలో సహాయం అందకపోయి ఉంటె ఉపమన్యుడు మరణించిఉండే వాడు. ఉపమన్యుడు, ధౌమ్యుడు చెప్పిన విషయాలు అర్థం చేసుకుని అతిగా తినడం మానివేశాడు. అటు తరువాత అతడు చక్కని ఆరోగ్యం కలవాడై, తెలివిగలవాడై ,బుద్ధిమంతుడై వేద శాస్త్రాలు శ్రద్ధగా అభ్యసించి గొప్ప విద్వాంసుడయ్యాడు.

నీతి :- గురువు శిష్యులకు మంచిని బోధించి, మంచిమార్గంలో జీవితం సాగించడం నేర్పిస్తారు. అలాంటి గురువుని గౌరవించి వారిపట్ల కృతజ్ఞత కలిగిఉండడం మన ధర్మం.
http://saibalsanskaar.wordpress.com
https://www.facebook.com/neetikathalu

దయామయుడు విలువ : ప్రేమ అంతర్గత విలువ : భక్తి, నమ్మకం

కేరళ రాష్ట్రంలో ఉన్న గురువాయూర్ కృష్ణ దేవాలయం బాగా ప్రసిద్ధి చెందింది. అక్కడికి నిత్యం వేలమంది భక్తులు వచ్చి శ్రీకృష్ణ దర్శనం చేసుకుంటూ ఉంటారు
images8BAWAUAZఒక భక్తుడు కాలునెప్పితో బాధపడుతూ ఉండేవాడు. 41 రోజుల పాటు నిత్యం గుడిదగ్గర స్నానం చేసి కృష్ణుణ్ణి దర్శించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ 41 రోజులు పూర్తి అయ్యేసరికి కాలునెప్పి తగ్గించమని కృష్ణుణ్ణి వేడుకోసాగేడు. అతను డబ్బున్నవాడు కావడంతో , రోజు అతన్ని గుడికి తీసుకురావడానికి పనివాళ్ళని పెట్టుకున్నాడు. అలా శ్రద్ధగా 40 రోజులు పుర్తిచేసాడు. అయినా కాలునెప్పి తగ్గకపొవడంతో నిరాశపడసాగేడు.
గురువాయూర్ లోనే ఉన్న వేరొక భక్తుడు తన కుమార్తె పెళ్ళి కోసం కృష్ణ్ణుణ్ణి ప్రార్ధిస్తున్నాడు. పెళ్ళి కుదిరి నిశ్చితార్ధం జరిగింది. అతను బాగా పేదవాడు కావడంతో పెళ్ళికి కావలసిన డబ్బు, నగలు సమకూర్చుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడు. ఒకరోజు రాత్రి కృష్ణుడు ఈ భక్తుని కలలోకి వచ్చి, రేపు పొద్దున్న గుడిదగ్గర చెరువుగట్టు మీద ఒకసంచి ఉంటుంది. అది తీసుకుని వెనక్కి తిరిగిచూడకుడా ఇంటికి వెళ్ళీపో అని చెప్పేడు. imagesK6WJTKI2
కాలునెప్పి తగ్గించమని ప్రార్థిస్తున్న భక్తుడు , 41వ రోజు కృష్ణుడుకి కానుకగా ఇవ్వాలని ఒక సంచిలో బంగారునాణేలు పట్టుకుని గుడికివచ్చేడు. ఆ సంచి చెరువు గట్టుమీద పెట్టి స్నానానికి వెళ్ళేడు. ఇంతలో కృష్ణుడు చెప్పినట్లుగా పేదభక్తుడు చెరువు దగ్గరికి వచ్చి సంచి తీసు కుని వెనక్కి తిరిగిచూడకుండా పరిగెత్తసాగేడు. స్నానం చేస్తున్న భక్తుడు అది గమనించి తన సంచి ఎవరో దొంగ ఎత్తుకుపోతున్నాడని భావించి అతని వెనకాల పరిగెత్తేడు , కాని పట్టుకోలేకపోయేడు. తన దురదృష్టానికి బాధపడుతూ వెనక్కి వస్తూండగా, ఒక్కసారిగా నడవగలుగుతున్న విషయం గమనించాడు. కాలునెప్పి తగ్గిపొవడమే కాకుండా ఇంతసేపు సంచి కోసం పరిగెత్తగలిగేనని తెలుసుకుని చాలా సంతోషించేడు.
ఈ విధంగా శ్రీ కృష్ణభగవానుడు ఇద్దరు భక్తుల కోరికలు సమయానుకులంగా తీర్చి సంతోషాన్ని అందించాడు
imagesH22YFCJSనీతి: భగవంతుడు దయామయుడు. హృదయపూర్వకంగా చేసే ప్రార్థనకి తప్పకుండా స్పందిస్తాడు. ఆయనకి భక్తులందరు సమానమే, అయితే వాళ్ళ పరిస్థితిని బట్టి,సమయానుకూలంగా వాళ్ళని సంతోషపెట్టడం ఆయన ప్రత్యేకత. ఆయన అనుగ్రహించే పద్ధతులు వేరుగా ఉన్నా, అందరిపట్లా ఆయన ప్రేమ సమానంగా ఉంటుంది.

saibalsanskaar.wordpress.com
http://www.facebook.com/neetikathalu

వడ్రంగి విలువ : ప్రేమ అంతర్గత విలువ: ఐకమత్యం

ఇద్దరు అన్నదమ్ములు నలభైయేళ్ల పాటు కలిసి సంతోషముగా ఉండేవారు. ఇద్దరు ఎదురెదురు పొలాల్లోనివసించేవారు. యంత్రాలు వాడుకోవడం, వ్యాపారానికి కావలసిన వస్తువులు, అన్నీ కలిసి పంచుకునే వారు.
ఇంతలో చిన్న మాట తేడా వల్ల, ఇద్దరికి అభిప్రాయభేదాలు వచ్చాయి. కొన్ని రోజుల పాటు మౌనంగా ఉండేవారు. తరువాత ఆ మౌనం, కఠినమైన మాటలుగా మారింది. తరువాత ఇద్దరు పూర్తిగా మాట్లాడుకోలేదు.
ఒక రోజు జాన్ ఇంటి తలుపు ఎవరో తట్టేరు. తలుపు తెరవగానే, ఒక వడ్రంగి, తన పనిముట్టు సామాన్లతో నుంచుని ఉన్నాడు.’ఒక రోజు పని ఏమైన ఇప్పించ గలరా’ అని వడ్రంగి అడిగేడు. నా దగ్గర ఒక పని ఉంది అని జాన్ చెప్పాడు.
carpenters-insurance

ఎదురుగా ఉండేది, నా తమ్ముడే. కొద్దిరోజులుగా, మేము మాట్లాడుకోవడం లేదు.కొన్ని రోజుల క్రితం పొలం దున్నడానికి, యంత్రం తీసుకుని వెళ్లాడు. అప్పటి నుంచి మాకు గొడవ అయింది. అందుకని నేను ఏమైనా చేసి వాడికి గుణపాఠం చెప్పాలి. అక్కడ ఉన్నసామాన్లతో ఒక ఎనిమిది అడుగుల గోడ, రెండు పొలాలకి మధ్య కట్టమని అడిగేడు. అలాకట్టటం వల్ల, రేపటి నుంచి వాడి మొహం చూడక్కర్లేధు, అని చెప్పాడు. వడ్రంగికి కావలిసిన సామాన్లు ఇచ్చి జాన్ పనిమీద, పట్టణం వెళ్లాడు.
వడ్రంగి రోజు అంతా కష్టపడి పని చేశాడు. సాయంకాలం జాన్ రాగానే, పని అయిపోయిందని చెప్పాడు.
ఆశ్చర్యంగా చూసాడు జాన్. గోడ లేదు, కానీ ఒక వంతెన ఉంది. ఆ వంతెన రెండు పొలాలకి మధ్య కట్టేడు వడ్రంగి. చూడడానికి అధ్భుతంగా ఉంది. bridge_2 వంతెనకి అటువైపు నుంచి చూస్తే, తమ్ముడు, చేతులు చాచి అన్న దగ్గరికి వస్తున్నాడు. ఇద్దరు అన్నదమ్ములు వంతెన మధ్యలో నుంచుని, చేతులు పట్టుకున్నారు. వడ్రంగి తన సామాన్లు పట్టుకుని వెళ్ళి పోతున్నపుడు, అతన్ని ఆపి, మాకు ఇంకా చాలా పనులు, చేసి పెట్టాలి అని అన్నారు. దానికి వడ్రంగి ,నాకు ఉండడం ఇష్టమే, కానీ ఇంకా చాలా వంతెనలు కట్టాలి అని అన్నాడు.

నీతి: మనుషులతో సంబంధాలు తెంచుకోవడం సులభం, కాని తిరిగి నిలబెట్టుకోవడం చాలా కష్టం.ఏ ఇద్దరి మధ్య అయినా అభిప్రాయభేదాలు రావడం సహజం,వాటిని పక్కనపెట్టి, అనుబంధం నిలుపుకునే ప్రయత్నం ఇద్దరూ చెయ్యాలి.అహంకారం , ద్వేషం అడ్డుగోడలుగా ఉన్నప్పుడు ప్రేమతో వాటిని దాటే ప్రయత్నం చెయ్యాలి.
ఎంత ఆడంబరంగా జీవించాము అన్నదానికన్న, ఎంతమందికి సహాయపడ్డాము అన్నది ముఖ్యం. మనకి ఎంతోమంది స్నేహితులు ఉండచ్చు, అందులో ఎంతమంది మనని నిజమైన స్నేహితులుగా భావిస్తున్నారో తెలుసుకోవాలి.అందం, డబ్బు, ఆడంబరాలు మొదలైనవాటివల్ల మనిషికి గుర్తింపు రాదు, అహకారం వస్తుంది, అది మన వ్యక్తిత్వాన్ని పాడుచేస్తుంది.
ఒక మనిషిగా ఎప్పటికీ గుర్తింపు పొందాలి అన్నా, సమజానికి ఉపయోగపడాలి అన్నా అది ఉన్నతమైన వ్యక్తిత్వం వల్ల మాత్రమే సాధ్యమౌతుంది.

http://saibalsanskaar.wordpress.com/
http://www.facebook.com/neetikathalu

తండ్రి-కొడుకు విలువ: ప్రేమ ; అంతర్గత విలువ : సహనం

ఒక ఇంట్లో 80 సంవత్సరాలు వయసున్న తండ్రి, 45 సంవత్సరాల వయసున్న కొడుకు ఉన్నారు. ఒక రోజు ఇద్దరూ సోఫాలో కూర్చొని ఉండగా ఒక కాకి వచ్చి వాళ్ళ ఇంటి కిటికీ మీద వాలింది.

అది ఏమిటి? అని తండ్రి, కొడుకుని అడిగాడు.
336448217_640

కాకి అని చెప్పేడు కొడుకు.
HouseCrow

మళ్ళీ కొన్ని నిమిషాల తరవాత అది ఏమిటి? అని అడిగాడు తండ్రి

ఇప్పుడే కదా కాకి అని చెప్పేను అన్నాడు కొడుకు.

మళ్ళీ కొన్ని నిమిషాల తరవాత అది ఏమిటి? అని అడిగాడు తండ్రి.

కొడుకు మొహం చిట్లించుకుని అసహనంతో ” అది కాకి, కాకి ” అని గట్టిగా చెప్పేడు.
మళ్ళీ కొన్ని నిమిషాల తరవాత అది ఏమిటి? అని అడిగాడు తండ్రి.
కొడుకు గట్టిగా అరుస్తూ ఇలా అన్నాడు” ఎందుకు నాన్నా ఒకటే ప్రశ్న మళ్ళీ మళ్ళీ అడుగుతావు. అది కాకి అని 4సార్లు చెప్పేను, అర్థంకావట్లేదా”

కొంచంసేపటి తరవాత తండ్రి గదిలోకి వెళ్ళి ఒక డైరీ తెచ్చాడు. కొడుకు చిన్నప్పటి విషయాలు అన్నీ అందులో ఉన్నాయి. ఒక పేజి తీసి చదవమని కొడుకు చేతికి ఇచ్చ్హాడు.అందులో ఈ విధంగా రాసి ఉంది.
crow
“ఇవాళ నా మూడేళ్ళ కొడుకు నాతోపాటు సోఫాలో కూర్చున్నాడు. ఒక కాకి వచ్చి కిటికీ మీద వాలింది. అది ఏమిటి నాన్నా? అని వాడు 23సార్లు అడిగాడు.ప్రతిసారీ నేను ప్రేమతో వాడిని దగ్గరికి తీసుకుని కాకి అని చెప్పేను. వాడు అన్నిసార్లు అడిగినా నాకు కోపం రాలేదు, పైగా వాడి అమాయకత్వానికి నవ్వు వచ్చింది.”

కొడుకు చిన్నప్పుడు ఎన్నిసార్లు అడిగినా తండ్రి ఓపికగా అర్థమయ్యేలా చెప్పేడు. ఇవాళ అదే తండ్రి ముసలివాడు అవ్వడంవల్ల 4సార్లు అడిగితే కొడుకు విసుక్కుంటున్నాడు
.
నీతి: తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడి పిల్లల్ని పెంచి పెద్దచేస్తారు. వాళు ముసలివాళ్ళు అయ్యాక విసుక్కోవడం, చులకనగా చూడడం చెయ్యకూడదు. వాళ్ళు పంచిన ప్రేమని, వాళ్ళు పడిన కష్టాన్ని గుర్తుపెట్టుకుని వాళ్ళ పట్ల కృతజ్ఞతగా ఉండడం పిల్లల బాధ్యత.

http://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu