Archive | June 2015

దొంగలించ బడ్డ బిస్స్కెట్ట్ కథ ! విలువ:ధర్మము ; అంతర్గత విలువ :నిశ్పక్షపాతము

download (1)

ఏర్పోర్ట్ లో ,బోర్డింగ్ రూం లో ఒక యువతి వేయ్ట చేస్తోంది.కొన్ని గంటలసేపు వేయ్ట్ చేయాలి కనుకా,ఈ సమయంలో ఆమె ఒక పుస్తకం కొనుక్కుని చదువుకోవాలని నిర్ణయించుకుంటుంది.పుస్తకం తో పాటు ఒక బిస్స్కెట్ పేకెట్ కూడా కొనుక్కుంటుంది. ఈ రెండూ తీసుకుని  ఒక  వీ.ఐ.పీ రూం కి వెళ్ళి తాపీ గా ఒక చైర్   లో ప్రశాంతంగా ఆ పుస్తకాన్ని చదువుకుందామని కూర్చుంటుంది.

ఆమె పక్క కుర్చీ లో ఒక యువకుడు కూడా కూర్చుని మేగజీన్ చదువుకుంటున్నాడు .ఆమె తను తెచ్చుకున్న  పేకెట్ట్ లోనించి ఒక బిస్స్కెట్ నోట్లో వేసుకున్న వెంటనే ఆ యువకుడు కూడా ఒక బిస్స్కెట్ ముక్క తీసుకుని తింటాడు.ఇది చూసిన ఆమెకి అతని మీదచాలా కోపం వస్తుని .కానీ ఎమీ అనకుండా ఊరుకంటుంది .ఎదో తనలో తానే అతనిని తిట్టుకుని మౌనంగా పుస్తకం చదువుకుంటూ కూర్చుంటుంది  ఐతే ఆ యువకుడు మటుకు తను బిస్స్కెట్ తిన్న ప్రతిసారి పొటీ గా ఒకటి తింటూ ఉంతాడు .మెల్లి మెల్లిగా ఈమెకి కోపం పీకల దాకా వచ్చేస్తుంది .చివరికి ఆ పేకెట్ లో ఒకటే బిస్స్కెట్ మిగిలేసరికి అతడు చక్కగా దాన్ని రెండు ముక్కలుగా చేసి చెరి సగం పంచుతాడు.దీనితో  ఇక ముంచుకుని వస్తున్న కోపాన్ని తట్టుకోలేక , ఆమె ఆవేశంగా ఆమె తన పుస్తకాన్ని,వస్తువులని  తీసుకుని బోర్డింగ్ రూం  వైపుకి వెళ్ళిపోతుంది.

తరవాత ఫ్లైట్  ఎక్కి తన సీట్ లో కూర్చున్నాక తన బాగ్ ని కళ్ళజోడు వెతుక్కోవటం కోసం తెరుస్తుంది.ఆ బాగ్ లో ఆమెకి తను అంతక ముందు కొనుక్కున్న బిస్స్కెట్ట్ పేకెట్ట్ కనిపిస్తుంది.ఇంతా చేస్తే అసలు ఆమె కొనుక్కున్న పేకెట్ట్ కనీసం తెరవనుకూడా లేదు అది అలాగే బాగ్ లో పడి ఉందని  తెలుసుకుంటుంది. ఇది గ్రహించిన ఆమె మొహం సిగ్గుతో

చిన్నబోతుంది.తన తప్పు తెలుసుకున్న ఆ యువతి ,”అరే ! నేను నా పేకెట్ట్ అనుకుని అతని పేకెట్ట్ లో ఉన్నవి తినేసానే అని బాధ పడుతుంది.పైగా పాపం అతడు మంచి వాడు కనుక ,తన బిస్స్కెట్ట్స్ ని ప్రేమతో ఆమెతో పంచుకున్నాడు .తను మటుకు అతడు ఏదో ఆమె వస్తువు, తనని  అదగకుండా వాదేసినట్తు అర్ధం చేసుకుని అతని మీద కోపం తెచ్చుకుని , అక్కడినించి విసుక్కుంటూ  లేచి వెళ్ళిపోతుంది.ఇప్పుడు నిజం కొంచం ఆలస్యంగా  తెలుసుకున్నాకూడా ,తిరిగి అతనిని క్షమాపణ అడిగే అవకాసం కూద లేక పోయిందే అని పశ్చాతాప పడుతుంది.

నీతి:  ఎప్పుడూ కూడా తొందరపడి ఎవరినీ అపార్ధం చేసుకోకూడదు.ముందుగా ,నిదానంగా నిజం ఏమితో తెలుసుకుని ,అప్పుడే మన అభిప్రాయాని పంచుకోవాలి.అసలు సంగతి ఎమొతో తెలుసుకోకుండా ఎవరినీ విమర్సించకూడదు. ఎందుకంటే విడిచిన బాణం యెలాగైతే వెనుకకి తీసుకోలేమో, అలాగే నోరు జారిన మాటలని వెనుకకి తీసుకోలేము !

http://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

Advertisements

నిజానికి ఆనందం మనలోనే ఉంది!! విలువ: ధర్మము,అంతర్గత విలువ: సరి అయిన వైఖరి.

downloadఒకానొక సాధువు చిన్న ఊరికి వెళతాడు. అతనిని చూడగానే ఆ ఊరి వారు సాధువు చుట్టూ చేరి ఈ విధంగా తమ తమ కోరికలను మనవి చేసుకుంటారు. “స్వామి దయచేసి మమ్మల్ని ఈ కష్టాలనుండి బైటకి లాగి మా కోరికలను నెరవేర్చండి. అప్పుడే మేము జీవితంలో సంతొషంగా ఉండగలము.” అని ఆ సాధువుకి మనవి చేసుకుంటారు.

సాధువు, ప్రశాంతంగా వారి కోరికలను విని మౌనం వహిస్తాడు. మరునాడు సాధువు తన శక్తితో ఆ ఊరివారికి ఆకాశవాణి వినపడేలా చేస్తాడు. అది ఏమిటంటే “రేపు ఈ ఊరిలో సరిగ్గా మధ్యాన్నం ఒక గొప్ప అద్భుతం జరగ బోతున్నది. మీ మీ సమస్యలని ఒక మూటలో గట్టిగా కట్టి, ఊరి చివర నదీ తీరంలో విసిరి పారేసినట్లు ఊహించుకోండి.” తరువాత అదే సంచీలో ,మీకు కావలిసినంత బంగారం, భోజన పదార్ధాలు, నగలు ఇలా ఏది కావాలంటే అది నింపుకుని తెచ్చుకున్నట్టు ఊహించుకోండి.

ఈవిధంగా చేస్తే మీ కోరికలు తప్పక నెరవేరుతాయి. అని ఆకాశవాణి సూచిస్తుంది. ఇదంతా విన్న ఊరివారు ఆశ్చర్యపోయి, నిజమా! లేక కలా అనుకుని, సరే ఆకాశవాణి చెప్పినట్లే చేద్దాము, అలా ఊహించుకోవటం వలన నష్టమైతే లేదు కదా అనుకుంటార.  అది నిజమే అయితే మన కష్టాలన్నీ గట్టెక్కి, మన కోరికలన్నీ నెరవేరుతాయి. లేదా, అది అబద్దమే అయితే ఏమీ నష్టపోము కదా అనుకుని, ఆకాశవాణి చెప్పింది చెప్పినట్లుగా చేద్దాము అని ఆ ఊరి వారంతా కలిసి నిర్ణయించికుంటారు.

సరిగ్గా మరునాడు మధ్యాన్నం 12 గంటలకి, అందరూ వారి వారి సమస్యలను ఒక మూటలో కట్టి నదీ తీరంలో విసిరి పారేసినట్లు, అదే సంచీలో వారికి ఆనందం కలిగించే బంగారం, నగలు  డబ్బు మొదలైనవి వారి వారి కోరికల ప్రకారం ఇంటికి తెచ్చుకున్నట్లు ఊహించుకుంటారు.అయితే ఊహలో అనుకున్నవన్నీ నిజంగానే నెరవేరి వారికి కావలసిన వస్తువులన్నీ వారి వారి ఇంటికి చేరతాయి.

అయితే ఈ సంబరాలు ఎక్కువ సేపు నిలవవు. ఎందుచేతనంటే అందరూ , పక్కవారితో పోల్చుకుని, ఎవరికి వారు “అరే మన పక్కింటి వారు మనకంటే సంతోషాంగా మనకంటే గొప్పగా ఉన్నారే” అనుకుంటూ వారిని చూసి చిన్నతనంగా భావించుకుని, మెల్లిగా కొంతసేపటికి పక్కింటి వారి గురించే కాకుండా ఎవరికి వారు ఊరివారందరి గురించి ఆరాతీయటం మొదలు పెడతారు. ఈవిధంగా ఊరంతా ఒకటే అసంతృప్తి కల్లోలం వ్యాపిస్తుంది.

“ఒకరేమో అరే నేను చాలా సాధారణమైన గొలుసు అడిగానే, మా పక్కింటి ఆవిడ ఖరీదైన నగ కోరుకున్నదే!” అని ఇంకొకరేమో “అయ్యో! నేను చిన్న ఇల్లు కొరుకున్ననే, మా పక్కింటి వాడు గొప్ప భవనమే కోరుకున్నాడు” నేను కూడా అలాగే గొప్ప గొప్పవి కోరుకోవలసింది అయ్యో ఎంతమంచి అవకాశాన్ని చేతులారా వదులుకున్నానే! ఇలాంటి అదృష్టం మళ్ళీ మళ్ళీ మనకి జీవితంలో చిక్కుతుందా అని ఎవరికి వారు నిరాశతో అసంతృప్తితో కృంగి పోతారు.ఇలా మళ్ళీ ఊరంతా దుఃఖసాగరంలో మునిగిపోతుంది.

నీతి:

మామూలుగా అందరూ కష్టాలు ఉంటే ఆనందంగా జీవించలేము అనుకుంటారు. నిజానికి ఎవరికి సమస్యలు లేవు? ఎప్పటికప్పుడు “కష్టాలు నష్టాలు ఎన్ని ఎదురైనా, ధైర్యంగా, సంతోషంగా వాటిని ఎదుర్కుంటాను” అని మనస్సుకి సర్ది చెప్తూ ఉండాలి. ఇలా అనుకుంటూ ఉండటం చేత మనము ఎప్పుడూ నవ్వుతూ చిరునవ్వులు చిందిస్తూ ఉండగలుగుతాము. అలాగని సమస్యలని దాటేసి తప్పించుకుని తిరగమనికాదు!

అవతార పురుషుడైన కృష్ణ పరమాత్మకే తప్పలేదు కదా పరీక్షలని ఎదురుకోవటం. మేనమామ అయిన కంసుడు ఎన్ని సార్లు తనని చంపేందుకు కుట్ర పన్నలేదు? మాహాభారత యుద్దం లో కూడా కృష్ణుడు రధసారధిగా వ్యవహరించి, అర్జునుడు చివరి క్షణంలో,” నేను యుద్ధం చేయను”, అని కురుక్షేత్రంలో తన కవచాన్ని సహితం విసిరి పారేసినప్పుడు, గీతోపదేశం చేసి అర్జునిడికి తన కర్తవ్యం ఏమిటో చక్కగా తెలియపరిచాడు. అర్జునిడిపై శత్రువులు విడిచిన బాణాలని కృష్ణుడు చిరునవ్వుతో ఎదుర్కున్నాడు.

గీతలో ,కష్టాలకి క్రుంగి, సంతొషాలకి పొంగిపోవటం మంచిదికాదని, రెండింటినీ సమానంగా తీసుకోవాలని స్పష్టంగా బోధించాడు కృష్ణుడు. సుఖదుఃఖాలు ఒక నాణానికి రెండు వైపులవంటివి. రెండిటిలోనూ నేర్చుకోవలసినవి చాలా విషయాలు ఉంటాయి. అనుభవపూర్వకంగా ఈ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు, మనకి గీతలో శ్రీ కృష్ణుడు తెలిపిన సందేశం స్పష్టంగా అర్ధమవుతుంది.

ప్రపంచంలో లభ్యమయ్యే వస్తువుల వల్లనో, మనుషుల వల్లనో మనము ఆనందాన్ని పొందలేము.ఆనందమనేది మనిషి సహజ స్వభావం. దాని కొరకు మనం బైట ఎక్కడో వెతుక్కునే అవసరం ఏమాత్రం లేదు. అది మనలోనే ఉంది.

https://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

భగవంతుడు భావప్రియుడు బాహ్యప్రియుడు కాదు! విలువ: ప్రేమ, అంతర్గత విలువ: దయ

angels1

అబ్దుల్లా అనే వ్యక్తి మసీదులో ఒక మూల పడుకుని ఉండగా అతనికి ఇద్దరు దేవదూతల మధ్య జరిగిన సంభాషణ వినపడి హటాత్తుగా మెలకువ వస్తుంది. వారివురూ ధన్య జీవుల యొక్క జాబితా తయారు చేస్తున్నారు. అందులోని ఒక దూత, సికందరు అనే నగరానికి చెందిన మెహబూబ్ అనే వ్యక్తి ,భగవంతుని కృపకు పాత్రులైన వారిలో అందరికంటే ప్రధమ స్థానానికి చెందిన అర్హత కలవాడు అని, అంటుండగా వింటాడు అబ్దుల్లా. అదీకాక మహబూబ్ ఏ తీర్థయాత్రలకు వెళ్ళకుండా ఇంతటి గొప్ప అర్హతను పొందటం అబ్దుల్లాకి ఆశ్చర్యం కలిగించింది. అతడు మహబూబ్ గురించి తెలుసుకోవటానికి సికందరు నగరానికి వెళ్తాడు.

అక్కడికి వెళ్ళాక అబ్దుల్లా, మహబూబ్ ఒక చెప్పులు కుట్టే వాడని తెలుసుకుంటాడు.అంతేకాక అతడు పొట్టకూటికి కూడా సరిపడే డబ్బు లేని నిరుపేద అని కూడా తెలుసుకుంటాడు.

మెహబూబ్ కొన్ని సంవత్సరాల పాటు కష్టపడి కొంత డబ్బును దాచుకుని ,గర్భవతి అయిన తన భార్యకి ప్రేమతో, పసందైన విందును తయారు చేసి ,ఆమెని ఆనందపరచాలని ఎంతో ఉత్సాహంగా  ఇంటికి బయలుదేరుతాడు. అయితే అతనికిదారిలో ఆకలితో అలమటిస్తున్న ఒక బిచ్చగాడి ఏడుపు వినపడుతుంది. అది విన్న మహబూబ్ ముందుకి వెళ్ళలేక పోతాడు. చివరికి తన భార్య కోసం ఎంతో కష్టపడి ,దాచిన డబ్బుతో తయారు చేసిన , ఆమెకి పసందైన పదార్ధ్హాన్ని ,ఆ బిచ్చగాడికి దగ్గరుండి ప్రెమగా వడ్డించి పెడతాడు . అంతేకాక అతడు తృప్తిగా తింటుండగా చూసి పక్కనే కూర్చుని ఆనందిస్తాడు.

ఈ విధంగా, మెహబూబ్ దయాగుణాన్ని గురించి తెలుసుకున్న అబ్దుల్లా ,అతడు దేవదూతలు తయారుచేస్తున్న జాబితాలో ఉత్తమ స్థానానికి పొందే అర్హత ఎలా దక్కించుకున్నాడో తెలుసుకుంటాడు.

ప్రేమ, దయ వంటి ఉత్తమ గుణములు కలిగి ఉండటం వల్ల ,మెహబూబ్ బోలెడు డబ్బు ఖర్చు పెట్టి మక్కా వంటి పుణ్యస్థలాలకి పుణ్యం కోసం వెళ్ళే ,ఎంతో మందికి దక్కని గొప్ప అదృష్టాన్ని సొంతం చేసుకోగలిగాడు.భగవంతుడు దానం వెనుక ఉన్న పవిత్ర భావాన్ని చుస్తాడే కానీ …ఆర్భాటం కోసం, నలుగురి మెప్పు కోసం చేసే దాన ధర్మాలని ఏ మాత్రం లెక్క చేయడు.

నీతి: సహాయం ఎంత చిన్నదైనా కావచ్చు కాని, అది ప్రేమ, దయ వంటి పవిత్ర భావములతో చేయగలిగితే అది, కించిత్ ప్రేమ కూడా లేకుండా చేసే పెద్ద సహాయం కంటే ఎంతో మేలు!అందుకే అంటారు భగవంతుడు భావప్రియుడు కానీ బాహ్య ప్రియుడు కానేకాదు!

https://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

“ప్రేమ పరివర్తన తెస్తుంది” అన్నది గొప్ప సిద్దాంతం! విలువ: ప్రేమ ,అంతర్గత విలువ: పెద్దలను ప్రేమించటం, గౌరవించటం.

hqdefault

చాలా కాలం క్రిందట లీ-లీ అనే ఒక అమ్మాయి పెళ్ళి చేసుకుని భర్తతో కలసి, అత్తవారింటికి కాపురానికి వెళ్ళింది. కొద్దిరోజులకే ఆమె తనకి, అత్తగారికి సరిపడదని భావించింది. వారిద్దరి వ్యక్తిత్వాలు పూర్తిగా వ్యతిరేకమైనవి. అత్తగారి అలవాట్లు, పద్ధతులు అంటే ఈ అమ్మాయికి చాలా కోపంగా ఉండేది. అంతే కాకుండా అత్తగారు ,లీ-లీ ని ఎప్పుడూ విమర్శిస్తూ ఉండేది. అలాగే రోజులు, వారాలు గడిచిపోతున్నాయి. లీ-లీ, ఆమె అత్తగారు నిరంతరం ఏదో ఒక విధంగా వాదించుకుంటూ, పోట్లాడుకుంటూ ఉండేవారు. ప్రాచీన చైనా వారి సంప్రదాయం ప్రకారం కోడలు అత్తగారి ముందు తలవంచుకుని, ఆవిడ ప్రతి కోరిక తప్పకుండా తీర్చవలసిరావటం, వీళ్ళ పరిస్తితిని మరింతగా దిగజార్చి వేసింది. ఇంట్లోని ఈ కోపతాపాలు, అశాంతి పాపం నిస్సహాయుడైన భర్తకి చాలా విచారమును కలిగిస్తూ ఉండేది.

అత్తగారి చెడ్డ స్వభావం, నియంతృత్వ ధోరణి ఇంక ఎంత మాత్రమూ భరించలేక పోయిన లీ-లీ ఏదైనా ఒక పరిష్కారం ఆలోచించాలని నిర్ణయించుకున్నది. తన తండ్రికి మంచి స్నేహితుడైన మిష్టర్ హువాంగ్ దగ్గరికి లీ-లీ వెళ్ళింది. అతను మూలికలు అమ్ముతుంటాడు. ఆమె అతనితో పరిస్థితిని గురించి వివరంగా చెప్పి, అతను కొంచం విషం ఇస్తే తన సమస్యని పూర్తిగా అంతం చేసుకోగలుగుతానని అన్నది. మిష్టర్ హువాంగ్ ఒక్క నిమిషం ఆలోచించాడు.

“లీ-లీ, నీ సమస్య పరిష్కారం కావటానికి నేను తప్పకుండా సహాయం చేస్తాను. కానీ, నువ్వు నేను చెప్పినట్లు నడుచుకోవాలి” అన్నాడు హువాంగ్. లీ-లీ “తప్పకుండా మిష్టర్ హువాంగ్! మీరు చెప్పినట్లే చేస్తాను” అన్నది. మిష్టర్ హువాంగ్ వెనుక గదిలోనికి వెళ్ళి కొద్ది నిమిషాలలో కొన్ని మూలికలు తీసుకుని వచ్చాడు. అతడు లీ-లీ తో “మీ అత్తగారు తొందరగా పోవటానికి వెంటనే పనిచేసే విషం నేను ఇవ్వటం లేదు. ఎందుకంటే అలా చేస్తే జనానికి సందేహం కలుగుతుంది నీమీద. అందువల్ల నీకు కొన్ని రకరకాల మూలికలు ఇస్తున్నాను.ఇవి నిదానంగా ఆమె శరీరం పై విష ప్రభావాన్ని కలిగిస్తాయి. రోజు విడిచి రోజు నీవు వండే వంటకాలలో ఈ మూలికలను కలిపి ఆమెకు తినిపించు. ఆమె చనిపోయినా, నీమీద ఎవ్వరికీ సందేహం కలగకుండా ఉండేటందుకు ఆమెతో చాలా స్నేహంగా ప్రవర్తించు. ఇకమీదట వాదించకుండా, మీ అత్తగారి ప్రతి కోరికను తీర్చు, ఆమెను ఒక మహారాణీ లాగా చూసుకో” అని చెప్పాడు.

లీ-లీ ఎంతో సంతోషించి, మిష్టర్ హువాంగ్ కి కృతజ్ఞతలను తెలియచేసి, అత్తగారిని చంపాలన్న పధకం అమలు చేయాలన్న ఉద్దేశంతో ఇంటికి తిరిగి వచ్చింది. లీ-లీ తాను వండిన వంటకాలలో ఆ మూలికలను కలిపి అత్తగారికి పెట్టసాగింది. అలా రోజులు, వారాలు, నెలలు గడిచిపోతున్నాయి.మిష్టర్ హువాంగ్ చెప్పిన సలహా ప్రకారం జనాలకి తనపైన అనుమానం రాకుండా అత్తగారితో స్నేహంగా ఉంటూ, వాదించ కుండా ప్రేమతో, ఆమెను తన స్వంత తల్లిలాగా చూసుకోసాగింది. ఆవిధంగా ఆరు నెలలు గడిచేసరికి ఇంటి వాతావరణం అంతా మారిపోయింది. లీ-లీ తన స్వభావాన్ని ఎంతగా అదుపు చేసుకున్నదంటే ఇప్పుడు ఆమెకు అసలు కోపం లేదు. అత్తగారితో అసలు వాదించటమే లేదు.ఇప్పుడు, ఆమె అత్తగారు కూడా ఎంతో సౌమ్యంగా మారిపోయింది. కోడలి పట్ల అత్తగారి ప్రవర్తన కూడా మారి పోయింది. ఆమె కోడలిని తన స్వంత కూతురిలా ప్రేమించసాగింది. అత్తగారు తన స్నేహితులు, బంధువులతో తన కోడలు లీ-లీ చాలా ఉత్తమురాలని, అటువంటి కోడలు దొరకటం తన అదృష్టమని చెప్పసాగింది. ఇప్పుడు లీ-లీ, ఆమె అత్తగారు, తల్లీ కూతుళ్ళలాగా ఎంతో ప్రేమతో ఉండటం వలన, భర్త కూడా ఎంతో ఆనందంగా ఉంటున్నాడు.

295f99c6065da9ae683b4241a7a2d166

ఒక రోజున లీ-లీ మళ్ళీ మిష్టర్ హువాంగ్ దగ్గరికి వెళ్ళింది సహాయం కోరుతూ.”మిష్టర్ హువాంగ్! మా అత్తగారు నేను పెట్టిన విషం వలన చనిపోకుండా మళ్ళీ మీరే ,ఏదైనా మూలికలు ఇవ్వండి. ఆమె ఇప్పుడు ఎంతో మారిపోయి నన్ను స్వంత తల్లిలాగా ప్రేమిస్తున్నది. నేను పెడుతున్న విషం వలన ఆమె చనిపోవటం నాకు ఇష్టం లేదు.” అని చెప్పింది. మిష్టర్ హువాంగ్ నవ్వుతూ తల ఊపాడు.”లీ-లీ, విచారించవలసినది ఏమీ లేదు. నేను అసలు నీకు విషమే ఇవ్వలేదు. నీకు నేను ఇచ్చిన మూలికలు, మీ అత్తగారి ఆరోగ్యం మెరుగు పడటం కోసం ఇచ్చిన విటమిన్లు. విషం ఉన్నది నీ మనసులో, ఆవిడ పట్ల నీ స్వభావంలో. కాని, ఇప్పుడు నీవు ఆవిడ పట్ల చూపిస్తున్న ప్రేమ వలన ఆ “విషం” అంతా కొట్టుకు పోయింది.” అని మిష్టర్ హువాంగ్ అన్నాడు.

 

నీతి: స్నేహితులారా, ఇతరులు మీ పట్ల ఎలా ప్రవర్తిస్తారో, మీరు కూడా వారి పట్ల అలాగే ప్రవర్తిస్తారన్న విషయాన్ని మీరు ఎప్పుడైనా గుర్తించారా?  “ఇతరులను ప్రేమించేవాళ్ళు ఇతరులచేత తాము కూడా ప్రేమింపబడతారని” చైనా లో అంటారు. ఇది చాలా విలువైన బంగారం లాంటి మాట.

https://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

తల్లిదండ్రుల ప్రేమ, విలువ: ప్రేమ, అంతర్గత విలువ:గౌరవం

 

ఒక అమ్మాయి తన తల్లితో పోట్లాడి ఇంట్లోనుండి బయటకు వచ్చేసింది. కోపంలో బయటకు అయితే వచ్చింది గాని తన దగ్గర ఇంటికి ఫోన్ చెయ్యడానికి కూడా డబ్బులు లేవని గ్రహించింది. ఆ సమయంలో ఆ అమ్మాయి నూడుల్స్ షాపు పక్కనుండి వెళ్తోంది. ఆ వాసనకి నోరూరి ఒక ప్లేట్ నూడుల్స్ తింటే బాగుండును అనుకుంది కాని  డబ్బులు లేవు అని ఆలోచిస్తూ నిల్చుంది.

ఆ షాపు యజమాని ఆ అమ్మాయిని చూసి నూడుల్స్ తింటావా అని అడిగాడు. దానికి ఆ అమ్మాయి తినాలని ఉంది కాని నా దగ్గర డబ్బులు లేవు అంది. దానికి అతను ఏమీ పరవాలేదు నేను ఇస్తాను వచ్చి కూర్చో అన్నాడు.కొద్దిసేఫటి తరవాత ఒక ప్లేట్లో నూడుల్స్ చేసి తెచ్చి తినమని ఆ అమ్మాయి ముందు పెట్టాడు. అది చూసి ఆ అమ్మాయి ఏడవడం ప్రారంభించిది.ఏమయింది అని అడిగాడు ఆ షాపు యజమాని. ఏమీ లేదండి మీరు నా పట్ల చూపిస్తున్న ప్రేమకి నాకు ఏడుపు వచ్చింది అని ఇంకా ఇలా చెప్పసాగింది. ఇంతవరకు పరిచయంలేని మీరు కూడా నా ఆకలి గుర్తించి నాకు తిండి పెడుతున్నారు కాని మా అమ్మ కోపంతో నన్ను ఇంట్లోనుండి బయటకు పంపేసింది.

అప్పుడు ఆయన ఈ విధంగా వివరించాడు. ఒక్క ప్లేట్ నూడుల్స్ ఇస్తేనే నాకు నీ మీద ప్రేమ ఉంది అని అనుకుంటున్నావు మరి చిన్నప్పటినుండి పెంచి పెద్దచేసిన నీ తల్లికి నీ మీద ఎంత ప్రేమ ఉండి ఉండాలి? ఏదో కోపంలో ఒక్క మాట అంటే ప్రేమ లేకుండా పోతుందా? నిజంగా ప్రేమ లేకపొతే ఇన్ని సంవత్సరాలు నీ గురించి శ్రద్ధ తీసుకోదు కదా, ప్రశాంతంగా అలోచిస్తే నీకే అర్థం అవుతుంది అన్నాడు.

అది విన్న ఆ పాప ఆశ్చర్యపోయింది. తనలో తాను ఇలా అనుకుంది. నిజమే ఇవాళ ఈ పెద్దాయన నా పొరపాటు నాకు వివరించి చెప్పకపోతే మా అమ్మని అపార్థం చేసుకుని జీవితాంతం నేను కష్టపడి ఆమెని కష్టపెట్టేదాన్ని.  ఇంటికి వెళ్ళగానే అమ్మని క్షమించమని అడగాలి అనుకుటూ ఇంటికి వెళ్ళింది.ఇంటికి వెళ్ళేసరికి తల్లి తన గురించి కంగారుపడుతూ ఉండడం చూసింది. ఈ అమ్మాయిని చూడగానే తల్లి ప్రేమగా దగ్గరికి తీసుకుని చాలా ఆకలిగా ఉండి ఉంటుంది, రామ్మా భోజనం చేద్దువుగాని అంది. అది చూసిన ఆ అమ్మాయి తల్లిని గట్టిగా పట్టుకుని ఏడుస్తూ క్షమించమని అడిగింది.

 

stock-photo-sad-daughter-hugging-his-mother-159905609మనుషుల మధ్య అపార్థాలు వస్తూ ఉంటాయి. అవి వదలి పెట్టి వాటి వెనక ఉన్న ప్రేమని గుర్తించే ప్రయత్నం చేస్తే మనుషుల మధ్య  బంధాలు బలపడతాయి.

 

నీతి: తల్లిదండ్రుల ప్రేమని పొందడం అనేది భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం. ఏమీ ఆశించకుండా మన కోసం కష్టపడి, మనం వృద్ధిలోకి రావాలని ఆశించే నిస్వార్థ ప్రేమ తల్లితండ్రులది. తల్లిదండ్రులను గౌరవిస్తూ వాళ్ళ మనసు కష్టపెట్టకుండా నడుచుకోవడం మన కర్తవ్యం.

 

https://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu