Archive | November 2018

బాలగోవిందం -తొమ్మిదవ శ్లోకము

తొమ్మిదవ శ్లోకము                                                                                                                                     సజ్జన సాంగత్యంలో ఉండు

bg9a

సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |                                                                                                             నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః                                                                                                                     భజగోవిందం భజగోవిందం. || 9||

అనువాదం

సత్సంగత్వమె  నిస్సంగత్వం

నిస్సంగత్వమె నిర్మోహత్వం

నిర్మోహత్వమె నిశ్చలతత్వం

నిశ్చలతత్వమె జీవన్ముక్తి

భజగోవిందం భజగోవిందం. || 9||

తాత్పర్యము :    సత్సాంగత్యం వల్ల ,  అసంగత్వం ఏర్పడుతుంది. అసంగత్వం ,మోహాన్ని నశింపచేస్తుంది. మోహం  నశిస్తే నిశ్చలమైన తత్వము, ఏర్పడుతుంది. అది జీవన్ముక్తికి దారి తీస్తుంది.గోవిందుని భజించు ,గోవిందుని  కీర్తించు. ఓ మందమతి !గోవిందుని సేవించు.

విద్యార్థుల కొరకు కథ :  

మంచి,చెడు గుర్తించగలిగే  సామర్ధ్యము.

విలువ: మంచి నడవడి,

ఉప విలువ:సత్సాంగత్యము, మంచి వారితో స్నేహం.

9b

 

 

 

 

 

 

ఒక కాకి, హంస, యిద్దరూ స్నేహితులు. ఒకరోజు కాకి, హంసను తన ఇంటికి రమ్మని ఆహ్వానించింది.​హంసను ,కాకి తన ఇంటికి తీసుకెళ్ళి ఒక ఎండిన, వంకర పోయిన చెట్టు కొమ్మపై కూర్చోమంది.  ఆ చోటు అంతా పేడ, మాంసము ,ఎముకలు  ,దుర్గంధముతో వ్యాపించి ఉన్నది. అది చూసి హంస అన్నది”సోదరా నేను ఇటువంటి  ప్రదేశములో ఒక్క క్షణమైనా ఉండలేను. ఎక్కడన్నా పవిత్ర స్థలం ఉంటే అక్కడకి తీసుకెళ్ళు “ అన్నది .

9c

 

 

 

 

 

 

అందుకు కాకి, హంసను రాజు గారి తోటలోని ,ఒక పెద్ద చెట్టు పైన ఉన్న కొమ్మల మధ్యన ఉన్న తొర్రలో  కూర్చోబెట్టింది. అదీ  ప్రక్కనే కూచుంది. కూచోగానే హంస క్రిందకు చూసింది చెట్టు క్రింద రాజుగారు తల పైకెత్తి కూర్చుని వున్నారు. అయన ముఖంపై  సూర్యకాంతి పడుతూ ఉంది. దయాగుణం కల హంస రాజుగారికి  ఎండ తగలకుండా, నీడకోసం తన రెక్కలు విచ్చుకొని ఎండకు అడ్డం పెట్టింది. రాజు గారికి ఊరట కలిగింది. కానీ దుష్టబుద్ధి గల కాకి రాజు గారి తలపై రెట్ట వేసింది. పై నుంచి రెట్టపడగానే రాజుగారు విల్లు ఎక్కుపెట్టి బాణం వేశారు. బాణాన్ని చూస్తూనే కాకి ఎగిరి పోయినది. కానీ ఆ బాణం హంసకు  తగిలింది. హంస కిందపడి చనిపోతూ యిట్లా అంది. “ఓ రాజా! నీ మీద రెట్ట వేసింది నేను కాదు కాకి. నేను స్వచ్ఛమైన జలాల్లో వుండే హంసను. నీకు ఎండ వేడి తగలకుండా సహాయం చేశాను. కానీ దుష్ట స్వభావి అయినా కాకితో స్నేహం వలన నా  జీవితం నాశనం అయింది . అందుకే దుష్టులను దూరంగా  పెట్టాలి”. అంటారు

నేర్చుకోవలసిన విషయము :మనుషుల మంచితనం ప్రభావం వారితో ఉండేవారిపై ఏ విధంగా ప్రభావం, ప్రేరణ స్తుందో , చెడ్డ వారి సాంగత్యము వారితో ఉండేవారిని ప్రభావితం చేస్తుంది. అందుకే స్నేహితులని ఎన్నుకొనే ముందర సరి అయిన  నడవడి గల మంచి వారితోనే స్నేహం చెయ్యాలి. మంచివారి సాంగత్యం  వల్ల మనిషి  సన్మార్గములో  వుంటాడు.  ఒక మంచివాడు దుష్టుల సహవాసంలో అతని మంచితనం గుర్తింపబడక పోగా ,దుష్టసావాసం వల్ల తన జీవితం నాశనం చేసుకుంటాడు. ఒక సామెత వుంది. “నీ స్నేహితులెవరో చెప్పు, నీవు ఎట్లాంటివాడివో చెపుతాను” అని. చిన్నతనం నుంచే మంచి వారితో స్నేహం అలవరచుకోవాలి. ఇది చాల ముఖ్యము. ఒక క్రుళ్ళిన పండు బుట్టలో మిగతా పండ్లతో ఉంటే  క్రమంగా బుట్టలోని మిగతా  పండ్లు  అన్ని క్రుళ్ళి పోతాయి. స్నేహితులని ఎంచుకొనే విషయం లో కూడా చాల జాగ్రత్తగా ఉండాలి . చిన్న వయసులో అలవర్చుకొనే విలువలు జీవితాంతం మనతో ఉంటాయి. మానవతా విలువలు తెలియచెప్పే విద్య, మంచివారితో సావాసము జీవితం లో అత్యంత ముఖ్యము ,ప్రధానము.

https://saibalsanskaar.wordpress.com

 htps://facebook.neetikathalu.com 

 

దయగల హృదయం

విలువ : ప్రేమ
అంతర్గత విలువ : ఇతరుల పట్ల దయ
     ఈశ్వర చంద్ర విద్యాసాగర్ ఎంతో మంచి వ్యక్తిత్వం కలిగి ఉండేవాడు. సాటివారి పట్ల ఆదరణ,దయ కలిగి ఉండేవాడు. ఎక్కువ స్థాయి, తక్కువ స్థాయి అన్న తేడా లేకుండా అందరినీ సమానంగా చూసేవాడు. తన ఇంట్లో పని చేసేవారిని కూడా ఆదరించేవాడు. ఒక రోజు విద్యాసాగర్ తన ఇంట్లో మెట్లు దిగి కిందకి వస్తూ ఉండగా, ఇంట్లో పనివాడు చేతిలో ఉత్తరం పట్టుకుని, మెట్ల పక్కన నిద్రపోతూ ఉండడం గమనించాడు. నెమ్మదిగా పనివాడి చేతిలో ఉత్తరం తీసుకుని చదివాడు. ఆ ఉత్తరంలో విషయాన్ని బట్టి అతను చాలా ఇబ్బందుల్లో ఉన్నాడని అవి తట్టుకోలేక వాటి గురించి బాధపడుతూ నిద్రపోయాడని అర్థం చేసుకున్నాడు. అతని పరిస్థితికి జాలిపడి, గదిలోకి వెళ్ళి విసనకర్ర తెచ్చి పనివాడికి విసరసాగాడు. అలా విసరడం వల్ల అతను ఇంకా సౌకర్యంగా నిద్రపోగలడని విద్యాసాగర్ భావించాడు. 
  ఇంతలో విద్యాసాగర్, స్నేహితుడు అతన్ని కలవడానికి వచ్చాడు.ఈ దృశ్యం చూసిన అతను కోపంతో విద్యాసాగర్ తో ” జాలికి కూడా ఒక హద్దు ఉండాలి. పనివాడికి నువ్వు సేవ చెయ్యడం ఏమిటి? నెలకు 700 రూపాయలకు పనిచేసే వాడికి నువ్వు గాలి విసురుతావా” అన్నాడు.
దానికి విద్యాసాగర్ నవ్వుతూ మా నాన్నగారు కూడా  నెలకు 700 రూపాయలే సంపాదించేవారు. ఒకరోజు ఇంటికి వస్తూ రోడ్డు మీద కళ్ళు తిరిగిపడిపోయారు. ఆ దారిలో వెళ్తున్న ఒకాయన మంచినీళ్ళిచ్చి మా తండ్రిని ఆదుకున్నాడు.ఈ పనివాడి మొహంలో , ఆరోజు మా నాన్నగారు పడిన కష్టం కనిపించింది అన్నాడు.
నీతి
 
సాటి మానవుల పట్ల మన ప్రేమను, దయను మాటల ద్వారా మాత్రమే కాక చేతల ద్వారా కూడా చేసి ఆదర్శంగా జీవించవచ్చు అని పై కథ వలన తెలుసుకోవచ్చు. భగవంతుని సృష్టిలో అందరూ సమానమే అని గుర్తించి, అందరినీ సమానంగా ఆదరించడం నేర్చుకోవాలి.

శరణాగతి

శరణాగతి

 

 

విలువ: నమ్మకం  

అంతర్గత విలువ : శరణాగతి

ఒక వ్యక్తి  ఓడలో ప్రయాణం చేస్తున్నాడు. ఆ ఓడ ప్రమాదానికి గురి అయింది. ఆ  ప్రమాదం నుంచి తప్పించుకుని  ఒక ద్వీపం దగ్గరకి చేరాడు.రోజూ భగవంతుడిని  ప్రార్థించుకుంటూ ఎవరైనా సహాయానికి కనబడతారేమో అని ఎదురు చూస్తూ ఉండేవాడు. అతి కష్టంతో ఒక చిన్న గుడిసె కట్టుకున్నాడు. ఒక రోజు తినడానికి ఏమైనా దొరుకుతుందా అని వెతుకుతూ  బయటికి వచ్చాడు. తిరిగి ఇంటికి వెళ్ళి చూస్తే కష్టపడి కట్టుకున్న చిన్న గుడిసెకి చితిమంట అంటుకుంది. పొగ ఆకాశం వైపు వెళుతోంది. చాలా  నిరుత్సాహంతో,కోపంతో ఏడుస్తూ  “ఎందుకు ఇలా చేసావు” అని భగవంతుడిని అడిగాడు.మర్నాడు పొద్దున్నే ఓడ హారన్ వినిపించింది. ఇక్కడ నేను ఉన్నట్టు ఎలా తెలిసింది అని ఓడలోని  వ్యక్తులను అడిగాడు. “ఆకాశం లో పొగని చూసి, ఇక్కడ ఎవరో ఉన్నారు అని వచ్చాము అన్నారు వాళ్ళు.  ఆ ఓడలో ప్రయాణం చేసి ఆ వ్యక్తి తన ఇంటికి చేరుకున్నాడు. 

నీతి మనము అనుకున్నవి జరగనప్పుడు నిరుత్సాహ పడడం సహజం. మనం కష్టకాలంలో కూడా భగవంతుడిని నమ్ముకుని పూర్తి శరణాగతితో ఉంటే మనకి కావాల్సిన ధైర్యం, ఆలోచనా శక్తి , బలం అన్నీ  భగవంతుడు మనకి ఇస్తాడు

https://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

ఎండా-వాన  కథ

విలువ — సత్యం,ఆశావాదం
అంతర్గత విలువ –అవగాహన
ఒక పెద్దావిడకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వారిద్దరికీ పెళ్ళిళ్ళు అయి కాపురాలు చేసుకుంటున్నారు.పెద్దమ్మాయి భర్తకి గొడుగుల వ్యాపారము, చిన్నమ్మాయి భర్తకి నూడిల్స్ వ్యాపారము ఉన్నాయి.ఆ పెద్దావిడ వాతావరణం మారినప్పుడల్లా తరచుగా బాధపడుతూ ఉండేది. బాగా ఎండగా ఉన్నప్పుడు, “అయ్యో పెద్దల్లుడుకి వ్యాపారము ఉండదు, ఎవరూ గొడుగులు కొనుక్కోరు ” అని బాధ పడేది. బాగా వర్షం వచ్చినప్పుడు “అయ్యో చిన్నల్లుడికి  వ్యాపారము ఉండదు, ఎండ ఉంటేనే నూడిల్స్ తయారు చెయ్యడానికి అవుతుంది ” అని బాధ పడేది.
ఒక రోజు ఆ పెద్దావిడ ఒక సాధువుని కలిశారు. సాధువు పెద్దావిడ బాధపడడానికి కారణము తెలుసుకుని ఇలా సలహా ఇచ్చారు.
“ఇది చాలా సులభం. బాగా ఎండగా ఉన్నప్పుడు పెద్దమ్మాయి గురించి అసలు ఆలోచించద్దు. చిన్నమ్మాయి గురించి ఆలోచించండి. ఎండగా ఉండడం వల్ల నూడుల్స్ వ్యాపారం బాగుంటుంది అని సంతోషించండి. అలాగే బాగా వర్షం పడినప్పుడు చిన్నమ్మాయి గురించి అసలు ఆలోచించద్దు. పెద్దమ్మాయి గురించి ఆలోచించండి, గొడుగుల వ్యాపారం  బాగుంటుంది అని సంతోషించండి. “
పెద్దావిడ సాధువు చెప్పినట్టు అనుసరించి ఆలోచనలో మార్పు తెచ్చుకున్నారు. తరువాత ఇంక బాధ పడలేదు. రోజూ సంతోషంగా నవ్వుతూ ఉండేవారు.
నీతి 
ఎలాంటి పరిస్థితి ఎదురైనా దానిలో మంచి చూడడం అలవాటు చేసుకుంటే మనం సంతోషంగా జీవించగలము.