Archive | September 2014

సహనం , విలువ: ప్రేమ, అంతర్గతవిలువ: సహనం


నా చిన్నతనంలో ప్రతిరోజూ మా అమ్మ వంట చెయ్యడం గమనించేదాన్ని. అమ్మ వంట చాల బాగా చేసేది. అమ్మ ఒకరోజు ఆఫీస్ లో బాగా అలిసిపోయి ఇంటికి వచ్చింది. రాత్రి భోజనం సమయానికి కోడిగుడ్లు, సాస్, బాగా మాడిపోయిన బ్రెడ్ నాన్నకి కంచంలో పెట్టింది. నాన్న అదిచూసి ఏమంటారో అని గమనిస్తున్నాను.

image003

నాన్న ఆరోజు మా స్కూల్లో ఏమి నేర్చుకున్నానో అడుగుతూ, మాడిపోయిన ఆ బ్రెడ్ మీద బట్టర్(వెన్న)రాసుకుంటూ ఓపిగ్గా భోజనం పూర్తిచేసేరు. కొంచెంసేపు అయ్యేక బ్రెడ్ మాడిపోయినందుకు క్షమించమని అమ్మ , నాన్నని అడిగింది. ఆరోజు నాన్న చెప్పిన సమాధానం నాకు ఇంకా గుర్తుంది, ” నాకు బ్రెడ్ మాడితే ఇష్టమే, బాధపడకు” అన్నారు.

రాత్రి పడుకునేముందు నాన్నకి ముద్దు పెట్టడానికి వెళ్ళేను, అప్పుడు imagesO1ORQ60Xఅడిగేను, నాన్నా నిజంగా నీకు మాడిన బ్రెడ్ తినడం ఇష్టమా అని. నాన్న నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకుని ఇలా అన్నారు” మీ అమ్మ రోజంతా కష్టపడి ఇంటికి వచ్చింది, వంట చేసేటప్పుడు పొరపాటున బ్రెడ్ మాడిఉంటుంది.అసలే అలసిపోయిఉన్న మీ అమ్మని ఇంకా బాధపెట్టడం నాకు ఇష్టం లేదు”

నీతి: జీవితంలో మనుషుల మధ్య ఉండే అనుబంధాలు చాలా విలువైనవి.చిన్న చిన్న విషయాలకి దెబ్బలాడుకుని ద్వేషం పెంచుకోవడంకన్నా సహనంతో వాటిని పరిష్కరించుకుంటూ, బంధాలు నిలుపుకుంటూ ముందుకి వెళ్ళడం మంచింది. తల్లిదండ్రులు ఈ విలువల్ని పాటిస్తే పిల్లలు అది చూసి నేర్చుకుంటారు.

https://www.facebook.com/neetikathalu

http://saibalsanskaar.wordpress.com/

భగవంతుని మీద విశ్వాసమే మనకు రక్షా కవచం, విలువ — ప్రేమ,అంతర్గత విలువ– శ్రద్ధ వహించడం

మా మేడ మీద నుంచి చూస్తుంటే రోడ్డుకు కొంచెం దగ్గరగా ఒక పచ్చిక బీడు కనిపిస్తుంది. తరచుగా రెండు గుఱ్ఱాలు అక్కడ మేస్తూ ఉండడం నేను గమనించేదాన్ని. దూరం నుంచి ఆ రెండు గుఱ్ఱాలు ఒకేలా ఉన్నట్లు కనిపించేవి. కాని బాగా దగ్గరగా వెళ్లి చేస్తే ఆ రెండు గుఱ్ఱాలలో ఒకటి గుడ్డిది అని తెలిసింది. యజమాని ఆ గుఱ్ఱం గుడ్డిదైనా దానిని విడచిపెట్టేయలేదు. అది సుఖంగా జీవించడానికి ఒక చక్కటి ఏర్పాటు చేశాడు.
horse-wallpaper (2)బాగా దగ్గరగా వెళ్ళిగమనిస్తే ఒక గుఱ్ఱం దగ్గర నుండి గంటలు మ్రోగుతున్న శబ్దం వినిపిస్తుంది . ఎర్రగా రాగి రంగులో ఉన్న గంటలు ఒక తాడుతో ఆ గుఱ్ఱం మెడలో వ్రేలాడగట్టబడి ఉన్నాయి. ఆ గంటల సన్నని మ్రోతను బట్టి రెండవ గుఱ్ఱం ఎక్కడ ఉందో ఆ గుడ్డి గుఱ్ఱం తెలుసుకోగలిగేది . ఆ శబ్దమును బట్టి దాన్ని అనుసరించిపోతూ ఉండేది. మొదటి గుఱ్ఱం కూడా మధ్యలో ఒక్కొక్కసారి ఆగి వెనుకకు చూస్తూ తన మిత్రుడైన ఆ గుడ్డి గుఱ్ఱం వస్తోందో లేదో గమనించేది . తాను మరీ దూరం వెళ్లిపోతే తన మెడలో గంటల శబ్దం వినబడదని అందుచే తన మిత్రుడు రాలేకపోతాడని ఆ గుఱ్ఱం చాలా జాగ్రత్తగా తన మిత్రుని విషయం లో ఎంతో శ్రద్ధ వహించేది.

ఆ గుఱ్ఱాల యజమానిలాగే భగవంతుడు కూడా వీడు సక్రమంగా లేడని ఏ ఒక్కరిని విడచిపెట్టడు. ప్రతివారిని శ్రద్ధగా గమనించి అవసరాన్ని బట్టి సహాయం చేయడానికి వారి జీవితంలోకి ఎవరో ఒకరిని పంపిస్తాడు. ఒక్కొక్కసారి ఇతరులకు సహాయం చేయడానికి భగవంతుడు మనని ఉపకరణంగా వాడుకుంటాడు. ఎవరైతే భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా విశ్వసిస్తారో వారికి భగవంతుడు ఎప్పుడూ వెంట ఉంటాడు .

నీతి:-నువ్వు ఒంటరి వాడవు కావు. భగవంతుడు ఎప్పుడూ నిన్ను జాగ్రత్తగా రక్షిస్తూ ఉంటాడు. అవసరాన్ని బట్టి తగిన వ్యక్తులను సహాయంగా పంపిస్తాడు.ఇతరులకు వారి అవసరాలలో సహాయపడడానికి నీకు అవకాశం కల్పిస్తాడు. అందుచే ప్రతివారు ఇతరులకు సహాయపడడానికి ఎప్పుడూ సంసిద్ధులై ఉండాలి.

http://saibalsanskaar.wordpress.com
https://www.facebook.com/neetikathalu