Archive | March 2015

నిస్వార్థ ప్రేమ, విలువ: ప్రేమ, అంతర్గత విలువ: షరతులు లేని లాలనతో కూడిన ప్రేమ

 

ఆనంద్ చాలా నెమ్మది, సిగ్గరి అయిన చిన్న పిల్లవాడు. ఒకరోజు అతను స్కూల్ నుండి ఇంటికి వచ్చాక తల్లితో తన క్లాసులో పిల్లలందరికి ఒక్కొక్క బహుమతి తయారుచేసి ఇస్తానని చెప్పాడు.అది విని ఆవిడ హృదయం ద్రవించింది. ఆమె రోజూ పిల్లలు స్కూల్ నుండి వస్తున్నప్పుడు గమనిస్తూ ఉంటుంది.తోటిపిల్లలు ఎవ్వరూ ఆనంద్ ని తమతో కలవనివ్వకపోవడం, అతనిని పలకరించకపోవడం, వాళ్ళు మాత్రమే కలిసి మట్లాడుకోవడం, ఆనంద్ వాళ్ళందరి వెనక ఒక్కడే వస్తూ ఉండడం ఆమెకు బాగా తెలుసు.అందువల్ల అతను అలా కానుకలు తయారుచెయ్యకపోతే బాగుండునని అనుకున్నది కాని, ఆనంద్ కోరిక ప్రకారం చెయ్యాలని నిర్ణయించుకుంది. అందువల్ల ఆమె కాగితాలు, రంగు రంగుల పెన్సిళ్ళు, జిగురు కొడుకుకి కొని ఇచ్చింది. మూడువారాల పాటు ప్రతి రాత్రి కష్టపడి ఆనంద్ 35 కానుకలు తయారు చేసాడు.

కానుకల రోజైన “వాలంటైన్స్ డే” రానే వచ్చింది. ఆనంద్ ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. తాను తయారు చేసిన కానుకలన్నింటిని చక్కగా సంచిలో సర్దిపెట్టి దాచి ఉంచాడు. ఆనద్ స్కూల్ నుండి వచ్చాక అతనికి ఇష్టమైన “కుక్కీస్” వేడి వేడి పాలు ఇవ్వాలని తల్లి అనుకుంది.

imagesDXJNVKHIకొడుకు నిరాశగా స్కూల్ నుండి వస్తాడు కనుక తాను ఇలా చేస్తే అతనికి కొంచెం ఉపశమనంగా ఉంటుందని ఆమె భావించింది.ఎందుకంటే ఆనంద్ కిఎక్కువ కానుకలు రాకపోవచ్చు. అసలు ఒక్కటికూడా ఎవరూ ఇవ్వకపోవచ్చునన్న ఆలోచన ఆమెకు చాలా బాధ కలిగిస్తున్నది. ఆ రోజు మధ్యాహ్నం ఆమె వేడి పాలు, కుక్కీస్ తయారుచేసి బల్ల మీద పెట్టింది. పిల్లలు వస్తున్న సవ్వడి వినిపించగానే కిటికీలో నుండి చూసింది. ఎప్పటిలాగే అందరూ కబుర్లు చెప్పుకుంటూ, నవ్వుకుంటూ వస్తున్నారు. ఆనంద్ అందరికంటే వేగంగా ఒక్కడూ వస్తున్నాడు. అతను రోజూ కంటే కొంచెం వేగంగా వస్తున్నాడు.

లోపలికి రాగానే అతను బాధతో ఏడ్చేస్తాడేమో అని ఆమె అనుకుంది.అతని చేతులు ఖాళీగా ఉండడం ఆమె గమనించింది.ఉబికివస్తున్న కన్నీళ్ళను ఆపుకుంటూ ” అమ్మ నీకోసం పాలు, కుక్కీస్ తయారుచేసి ఉంచింది” అని చెప్పింది.

 

కాని ఆనంద్ ఆమె మాటలు వినిపించుకోకుండా వెలిగిపోతున్న ముఖంతో గబగబా నడుస్తూ వచ్చి ” ఒక్కళ్ళు ఒక్కళ్ళని కూడా మరచిపోకుండా అందరికీ కానుకలు ఇచ్చాను” అన్నాడు.అతని నిస్వార్థ ప్రేమ చూసి ఆ తల్లి హృదయం కరిగిపోయింది.

     నీతి: ఒక మంచిపని చెయ్యడం ధర్మం కనుక ఆ ఫనిని ప్రేమతో చెయ్యాలే కాని ఏదో ప్రతిఫలం ఆశించి చెయ్యకూడదు. ఇది చాలా ఉత్కృష్టమైన , ఉన్నతమైన ప్రేమ.నిస్వార్థమైన, పవిత్రమైన ప్రేమని పెంచుకోవడం అంత సులభం కాదు.నిరంతరమైన విచారణ ఈ మార్గాన్ని అనుసరించడానికి సహయపడుతుంది.

https://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

Advertisements

అహంభావం, విలువ: అహింస,అంతర్గత విలువ: ప్రశాంతత

“టాంగ్” వంశానికి చెందిన ప్రధానమంత్రి జాతీయ నాయకుడిగా, సైనికాధికారిగా సాధించిన విజయాల వలన గొప్ప పేరు ప్రఖ్యాతులు గడించాడు. కాని అతనికి కీర్తి, అధికారం, సంపదల కంటే వినయవిధేయతలు, భక్తితో కూడిన బౌద్ధునిగా ఉండడమే ఎక్కువ ఇష్టం. తనకి ఎంతో ప్రియమైన గురువు జెన్ వద్దకు వెళ్ళి ఎన్నో మంచి విషయాలు నేర్చుకుంటూ ఉండేవాడు. వారిద్దరూ ఎంతో బాగా కలిసి ఉండేవారు.పూజనీయుడైన గురువు, గౌరవప్రదమైన శిష్యుడుగా వారిరువురి మధ్య సఖ్యత చాలా బాగా ఉండేది.

ఒకరోజున ఎప్పటిలాగే గురువు వద్దకు వెళ్ళినపడు ఈ ప్రధానమంత్రి, “బౌద్ధమతం ప్రకారం అహంభావం“ అంటే ఏమిటి? అని ప్రశ్నించాడు. వెంటనే గురువుగారి ముఖం కోపంతో ఎర్రబడి, తిరస్కారపూరితమైన భావంతో ఏమిటా పిచ్చి ప్రశ్న? అని అడిగారు.

 

unnamed

ఎదురుచూడని ఈ సమాధానంతో ప్రధానమంత్రికి కోపం,బాధ వచ్చాయి. అప్పుడు ఆ జెన్ గురువు చిరునవ్వుతో ప్రధానమంత్రి గారూ; అహంభావం అంటే ఇదే అన్నారు.

నీతి: వివరాలు తెలుసుకోవడం కంటే, స్వయంగా అనుభవం పొందడం వల్లనే విషయాలు చక్కగా అర్థం అవుతాయి. జెన్ గురువులు ఈ విధంగా సులభమైన విధానాలలో సాధకులైన శిష్యులకు చక్కగా అర్థం అయ్యేలా బోధ చేస్తూ ఊంటారు. ఇది చాలా ఆసక్తికరమైన బోధనా విధానం.

https://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

ఆదరణ, విలువ: ధర్మం, అంతర్గత విలువ: గౌరవించడం

నేను కాలేజీలో చదువుతున్న రోజులలో ఒకసారి మా ప్రొఫెసర్ చిన్న పరీక్ష పెట్టారు. నేను చాలా ఆసక్తిగా ఏమి ప్రశ్నలు ఉన్నాయో అని చదువుతున్నాను.అన్నీసులువుగా ఉన్నాయి, కాని చివరి ప్రశ్న నాకు చాలా వింతగా అనిపించింది. అది ఇలా ఉంది.

రోజూ మీ కాలేజిని తుడిచి శుభ్రం చేసే స్త్రీ పేరు ఏమిటి?

cleaningఇది చదివాక నాకు నవ్వు వచ్చింది. ఆవిడని నేను చాలాసార్లు చూస్తూ ఉంటాను. పొడుగ్గా ఉంటుంది, ఆమెకి పెద్ద జడ ఉంది.50 సంవత్సరాల వయసు ఉంటుంది. కాని ఆవిడ పేరు నాకు తెలీదు.అయినా తెలుకోవలసిన అవసరం ఏమిటి? అనుకున్నాను.

 

ఆ ప్రశ్నవదిలిపెట్టి మిగిలిన అన్నింటికి జవాబులు రాసాను. ఇంతలో నా పక్క విద్యార్థి ప్రొఫెసర్ గారిని అడిగాడు, చివరి ప్రశ్నకు కూడా మార్కులు ఉన్నాయా అని.   అప్పుడు ప్రొఫెసర్ ఉన్నాయి అని చెప్పి ఇలా అన్నారు.

 

 

 

“మనం నిత్య జీవితంలో అనేకమందిని కలుస్తూ ఉంటాము.అందరినీ గౌరవించడం మన ధర్మం.

చిరునవ్వుతో ఒక్కసారి పలకరిస్తే చాలు వాళ్ళ మనసుకి ఎంతో తృప్తి కలుగుతుంది.” class

 

ఈ మాటలు నన్ను ఎంతో ప్రభావితం చేసాయి. చేసే పనితో సంబధం లేకుండా ప్రతి మనిషిని గుర్తించి, గౌరవించాలి అనితెలుసుకున్నాను. తరువాత ఆ స్త్రీ దగ్గరకు వెళ్ళి నవ్వుతూ పలకరించాను. ఆమె పేరు సత్యవతి అని తెలిసింది.

 

నీతి:

మన ఇల్లు, పరిసరాలు, చదువుకునే వాతావరణం ఇవన్నీ అనుకూలంగా, మనసుకు ఆహ్లాదం కలిగించేలా ఉన్నాయి అంటే దాని వెనుక ఎంతోమంది శ్రమ ఉంటుంది. పనులు అవుతున్నాయి కదా అని నిర్లక్ష్యం చెయ్యకుండా వాళ్ళు ఎంత కష్టపడితే అవుతున్నాయో గమనించి వాళ్ళని చిరునవ్వుతో పలకరించి గౌరవించడం మన ధర్మం.

https://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

 

భగవద్గీత వైశిష్ట్యం, విలువ:- నిజాయితీ, అంతర్గత విలువ:- పరివర్తన

 

ఒక ముసలివాడు తన మనుమని తో కలసి తన పొలంలో నివాసం ఉంటున్నాడు. ఆ ముసలివాడు ప్రతి రోజు ఉదయం లేవగానే వంటింట్లో తన టేబుల్ వద్ద కూర్చుని భగవద్గీతను శ్రద్ధతో చదువుతూ ఉండేవాడు. మనుమడు తాతను అన్నివిధాల అనుకరిస్తూ ఆయనలాగే ఉండాలని ప్రయత్నిస్తూ ఉండేవాడు. ఒకరోజు పిల్లవాడు తాత దగ్గరికి వెళ్లి, తాతా; నేను నీలాగే భగవద్గీత చదవాలని ప్రయత్నం చేస్తున్నాను. కాని నాకు ఒక్క ముక్క కూడా అర్ధం కావడం లేదు. ఏ కొంచెమైనా అర్ధమైనా పుస్తకం మూసివేసేసరికి మరిచిపోతున్నాను అని అడిగాడు. మౌనంగా పొయ్యిలో బొగ్గులు వేస్తున్న తాత వెనుకకు తిరిగి బొగ్గులు పొయ్యి లో వేసిన తరువాత ఖాళీ అయిపోయిన బుట్టను మనవడికి ఇచ్చి ఈ బుట్టతో నదికి వెళ్లి నీళ్ళు పట్టుకురా అని పిల్లవాడితో చెప్పాడు.

boy waterపిల్లవాడు నీళ్ళు ముంచుకుని తిరిగి వచ్చాడు. వచ్చే సరికి బుట్టలోని నీళ్లన్నీ కారిపోయాయి. మళ్ళీ వెళ్లి మళ్ళీ తెచ్చాడు. మరల నీళ్ళు కారిపోయాయి. ఖాళీ బుట్ట మాత్రము మిగిలింది. తాత పిల్లవాడిని చూసి నీవు ఇంకొంచెం తొందరగా తిరిగి రావాలి. అని చెప్పాడు. పిల్లవాడు పరుగు పెట్టుకుంటూ తిరిగి నీళ్ళు పట్టుకువచ్చాడు. ఈసారి కూడా ఖాళీ బుట్ట మాత్రమే మిగిలింది. బుట్టతో నీళ్ళు తేవడం అసాధ్యం అని పిల్లవాడికి అర్ధమైంది. బాల్చీతో తెద్దామని బాల్చీ కోసం వెళ్ళాడు. తాత పిల్లవాడిని చూసి నాకు కావలసింది బుట్టతో నీళ్ళు కాని బాల్చీతో కాదు అని చెప్పాడు. బుట్టతో నీళ్ళు తేవడం అసాధ్యం అని తాతకు తెలియచెప్పాలని పిల్లవాడు నిర్ణయించుకొని మళ్ళీ నదికి వెళ్లి నీళ్ళు పట్టుకుని వేగంగా తిరిగి వచ్చాడు. ఈ సారి కూడా ఖాళీ బుట్ట మిగిలింది. నీళ్ళు పూర్తి గా కారిపోయాయి. బుట్టతో నీళ్ళు తేవడం సాధ్యం కాదు ఇది ఉపయోగం లేని పని నీకు తెలియడం లేదా అని పిల్లవాడు తాతను అడిగాడు.

అప్పుడు తాత పిల్లవాడితో ఒకసారి బుట్ట వైపు సరిగా చూడు అని చెప్పాడు. పిల్లవాడు బుట్టకేసి చూసి  ఇంతకు  ముందు కంటే బుట్ట తేడాగా కనిపిస్తోందని గమనించాడు. అసహ్యంగా ఉన్న ఆ బొగ్గుల బుట్ట లోపల, పైన కూడా శుభ్రంగా ఉంది. అప్పుడు తాత పిల్లవాడితో ఇలా చెప్పాడు. నీళ్ళతో కడిగితే ఆ బుట్ట ఎలా శుభ్రపడిందో అలాగే భగవద్గీత చదవడం వల్ల నీకు అది అర్ధం అయినా కాకపోయినా, గుర్తు ఉన్నా లేకపోయినా, బయట, లోపల నీలో పరివర్తన కలుగుతుంది. భగవద్గీతను మనకు ప్రసాదించి శ్రీకృష్ణుడు మన జీవితాలలో తెచ్చే మార్పు ఇదే. ఇలా తాత వివరించి చెప్పేసరికి పిల్లవాడికి కనువిప్పు కలిగింది.

నీతి:- గొప్పవాళ్ళ ఉదాత్తమైన బోధనలు, భగవద్గీతలాంటి ఉదాత్తమైన మత గ్రంధాలు సంఘంలో మనం ఎలా మసలుకోవాలో, ఆధ్యాత్మిక విలువలని ఎలా పెంపొందించుకోవాలో మనకు తెలియ జెప్పి ప్రతివారు తమను ఉన్నతమైన వ్యక్తిత్వం గలవారుగా తీర్చిదిద్దుకోవడానికి ,తోటివారిని ఆవిధంగా తీర్చిదిద్దడానికి సహకరిస్తాయి.

https://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

 

ప్రతిఫలాపేక్ష లేని సేవ, విలువ : ప్రేమ, అంతర్గత విలువ: నిస్వార్థ సేవ

 

ఒకరోజు రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఒక ఆఫ్రికన్ స్త్రీ అమెరికాలోని అలబామా రహదారి మీద విపరీతమైన తుఫాను సమయంలో నిలబడి ఉంది. ఆమె కారు పాడయిపోయింది. ఆమెకు ఆ సమయంలో అత్యవసరంగా ప్రయాణం చేయడానికి ఏదో ఒక వాహనం కావాలి. చలికి విపరీతంగా వణికి పోతూ వెనుక వచ్చే కారును ladyఆపింది. ఒక తెల్ల జాతి యువకుడు ఆమెకు సహాయపడే ఉద్దేశ్యంతో కారు ఆపాడు. 1960 ప్రాంతంలో నల్లజాతి వాళ్లకు తెల్లజాతి వాళ్లకు ఘర్షణలు విపరీతంగా జరిగే రోజుల్లో ఇది చాలా ఆశ్చర్యపడవలసిన విషయం.ఆ యువకుడు ఆమెను ఒక సురక్షిత మైన ప్రాంతానికి చేర్చి ఒక కారులో ఆమె ఇంటికి చేరుకోవడానికి సహాయపడ్డాడు. ఆమె చాలా తొందరగా, ఆతృతగా ఆందోళనగా ఉన్నట్లు కనిపిస్తోంది. అంత తొందరలో కూడా ఆమె ఆయువకుడి చిరునామా వ్రాసుకుని కృతజ్ఞతలు చెప్పింది. వారం తోజుల తరువాత ఒకనాడు ఎవరో వచ్చి ఆయువకుడి ఇంటి తలుపు తట్టారు. ఆశ్చర్యం; ఎవరోవచ్చి ఒకపెద్ద కలర్ టీవీ ఇచ్చి వెళ్ళారు. దానికి ఒక కాగితం జత చేయబడి ఉంది. దానిమీద ఇలా వ్రాసి ఉంది.

ఆ రోజున తుఫాను సమయంలో అంత రాత్రి వేళ అలబామా రహదారి మీద నాకు సహాయపడి నందుకు కృతజ్ఞతలు.వర్షం ఆ రోజున నా బట్టలమీద మాత్రమే కాదు నా ఆశలమీద కూడా నీళ్ళు చల్లింది. ఆ సమయంలో నీవు వచ్చి నాకు సహాయం చేశావు. నీ సహాయము కారణముగా మరణశయ్య మీద ఉన్న నా భర్త వద్దకు ఆయన మరణించడానికి కొన్ని క్షణాల ముందు చేరుకోగలిగాను. నీ సహాయానికి నిస్వార్థ సేవా దృక్పధానికి భగవంతుడు సర్వదా నిన్ను అనుగ్రహించు గాక.

నీతి: ప్రతి ఫలాపేక్ష లేకుండా నిస్వార్ధంగా ఇతరులకు సహాయపడితే అది మనకు సంతోషాన్ని ఇవ్వడమే కాకుండా ఎదుటి వారిని సంతోషపెట్టి వాళ్ళ ముఖం మీద చిరునవ్వులు నింపుతుంది.

https://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

 

నాణాల సంచి, విలువ: సత్యం, అంతర్గత విలువ: యుక్తి

ఒకసారి ఒక చమురు వ్యాపారికి మరియు కసాయి వాడికి చాల పెద్ద గొడవ అయిపోయింది. విషయం తేలక ఇద్దరు బీర్బల్ దగ్గరకు వెళ్ళారు.

తగువు తీర్చమని బీర్బల్ ని అడిగారు.

“అసలు గొడవ యేమిటి?” అని బీర్బల్ అడిగాడు.

beerbal 1అప్పుడు కసాయి వాడు ఇలా చెప్పాడు, “నేను మాంసం అమ్ముకుంటుంటే ఈ చమురు వ్యాపారి నా దుకాణానికి వచ్చి చమురు పోస్తానన్నాడు. పాత్ర తీసుకు రావడానికి నేను లోపలకి వెళ్ళి నప్పుడు ఇతను నా నాణాల సంచి తీసుకుని అది తనదే అని గొడవ చేస్తున్నాడు. నా డబ్బు సంచి నాకు ఇప్పించండి”

వెంటనే ఆ చమురు వ్యాపారి, “లేదు! అతను చెప్పేవన్నీ అబద్ధాలు. ఆ సంచి నాదే. నేను నాణాలు సంచి లోంచి తీసి లెక్క పెడుతున్నాను. అది చూసి ఇతను దురాశతో నా సంచి కాజేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. న్యాయం చెప్పండి.” అన్నాడు.

బీర్బల్ యెన్నిసార్లు అడిగినా వాళ్ళిద్దరూ మళ్ళీ మళ్ళీ అదే మాట చెప్పసాగారు.

ఈ గమ్మత్తైన సమస్యకి బీర్బల్ ఒక యుక్తిని ఆలోచించాడు.

ఒక పెద్ద పాత్రలో నీళ్ళు తెప్పించాడు. ఆ నీళ్ళల్లోకి సంచిలో నాణాలు వేశాడు. వెంటనే ఆ పాత్రలో నీళ్ళపైన పలచగా నూనె తేలింది.

ఆ తెట్టు చూసిన వెంటనే ఆ సంచి చమురు వ్యాపారిదని అందరూ గ్రహించారు.

బీర్బల్ సంచిలో మళ్ళీ నాణాలు నింపి చమురు వ్యాపారికి ఇచ్చేసాడు. ఆ కసాయిని కఠినంగా శిక్షించాడు.

నీతి: నిజం నిప్పులాంటిది, అబద్ధం నీటిమీద వ్రాతలాంటిది అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అబద్ధం చెప్పి సంపాదించినది నిలవదు అనడానికి ఈ కథలో కసాయివాడు ఉదాహరణ. భగవంతుడు ప్రసాదించిన వాక్కుని సక్రమమార్గంలో ఉపయోగించాలంటే సత్యం పలకడం మన ధర్మం.

https://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu