Archive | June 2020

అరుణి భక్తి

విలువ     :    ధర్మ 

ఉప విలువ :   గురువు పట్ల శిష్యునికి ఉండవలసిన ప్రేమ ,భక్తి . 

                        పూర్వం పాంచాల దేశంలో ధౌమ్యుడు అనే ఒకఋషికి  ఆరుణి అనబడే అంకిత భావం గల మంచి శిష్యుడు ఉండేవాడు. ఆరుణి  గురువు ఆశ్రమంలోనే  ఉంటూ నిత్యం ఆశ్రమం లో జరిగే కార్యక్రమములు  అన్నింటిలో పాల్గొని తన సేవలను అందిస్తూ గురువుగారి వద్ద దివ్యజ్ఞానమును పొందాలని అభిలషించేవాడు. 

                    ఒక రోజున చలి చాలా తీవ్రంగా ఉన్నది. ఆ రోజన ఆరుణి అడవి నుంచి సేకరించిన  కట్టెలను ఆశ్రమానికి తీసుకొస్తున్నాడు .  ఆశ్రమంలో తన గురువుగారి పొలం పక్కనుంచి వస్తూ పొలం గట్టున ఉన్న కాలువ ఒడ్డుకు గండి పడటం గమనించాడు . అలా గండి పడటం వలన

 పొలంలో నీరంతా బయటకు పోతున్నది. అలా మొత్తం నీరంతా పొతే నీరు లేక పొలం ఎండిపోతుంది ,పంట పూర్తిగా నష్టమైపోతుంది.  ఆరుణి ఈ విధంగా ఆలోచించాడు“ఇపుడు నేను ఏమి చేయాలి? నేను గండి పూడ్చటం కోసం ఇక్కడ ఉండిపోతే ఆశ్రమానికి కట్టెలు చేర్చలేను. కట్టెలు అందించలేకపోతే హోమం  లేక, ఆశ్రమం లో  అంతా చల్లగా అయిపోతుంది. అందువల్ల నేను త్వర,త్వరగా ఆశ్రమానికి వెళ్ళి  కట్టెలు ఇచ్చేసి మళ్ళీ  తిరిగి వచ్చి ఈ కాలువ గట్టును బాగు చేస్తాను.” 

                     ఈ లోగా ఆశ్రమంలో గురువుగారు పిల్లలకు పాఠాలు నేర్పటానికి సిద్ధంగాకూర్చుని ఉన్నారు . ఆరుణి  పాఠం నేర్చుకోవటానికి ఇంకా రాలేదు. ఇంతలో ఆరుణి హడావుడిగా వచ్చి ఆశ్రమంలో కట్టెలు అందచేసి గురువుగారికి కాలువ గండి పడిన విషయాన్ని చెప్పి వెంటనే తిరిగి పొలం దగ్గరకి వెళ్ళాడు.  అంత  భాద్యత గల శిష్యుడిని చూసి గురువు ధౌమ్యుడు చాలా ఆనందించాడు. 

                   వేగంగా పొలానికి తిరిగి వెళ్ళిన   ఆరుణి కాలువకు పడిన గండిని పూడ్చడానికి కొన్ని కట్టెలను  ,మట్టిని అడ్డుపెట్టాడు. అయినాకాని  నీరు కారిపోవడం ఆగలేదు. నీరు బాగా వేగంగా,ఉధృతంగా   ఉండటం వలన ఆరుణి కట్టిన తాత్కాలిక ఆనకట్ట కొట్టుకు పోయింది. 

ఆరుణికి ఏం చేయాలో తోచలేదు.  సమయం వ్యవధి తక్కువగా ఉంది. ఆ నీటిని ఆపటం ఎలాగో ఆరుణికి అర్థం కాలేదు. అతనికి వెంటనే ఒక ఆలోచన స్ఫురించింది  . నీరు కాలువ నుండి బయటికి పోకుండా ఆపటానికి  అతనికి ఒక ఉపాయం తోచింది. ఇంతలో సాయంకాలం అయింది, చీకటి పడింది. ఆరుణి  ఇంకా ఆశ్రమానికి తిరిగి రావకపోవటంతో ఆశ్రమంలో అందరూ కంగారు పడసాగారు. ధౌమ్యుడు తన శిష్యులందరితో కలిసి ఆరుణి ని వెదకటానికి బయలుదేరాడు. పొలం వద్దకు వెళ్ళి  “ఆరుణి !” అంటూ గట్టిగా  ధౌమ్యఋషి పిలిచారు. అప్పుడు ఆయనకు  బలహీనంగా ఉన్న ఒక గొంతు “ఇక్కడ ఉన్నాను గురువుగారు”అనటం వినిపించింది. అందరూ ఆ ధ్వనివినపడిన వైపుగా పరిగెత్తారు. తీరా చూస్తే నీరు బయటకు పోకుండా ఆరుణి ఆ కాలువ గండికి అడ్డముగా పడుకునున్నాడు. నీటిని ఆపటం అసాధ్యం కావటంతో , తానే  స్వయంగా  గండికి  అడ్డంగా పడుకున్నాడు అని గురువుగారికి అర్ధమైంది . శిష్యులంతా కలిసి ముందుగా, ఆరుణిని ఆ గడ్డ కట్టించే ఆ చల్లని నీటి నుండి  బయటకు  లాగేసారు.  కాలువ  గండిని  మనం కలిసి  పూడ్చివేద్దాం …  విచారించవద్దు “ఆరుణి “ అన్నారు  శిష్యులంతా .           

                 ఆరుణితో “,  బిడ్డా ! ఈ పంట కంటే నీవే విలువైనవాడివి”,అని  అన్నారు గురువుగారు . ఆరుణిని ఒక కంబళి లో వెచ్చగా చుట్టి ఆశ్రమానికి తీసుకొచ్చారు . ఆరుణి ని దగ్గరకు తీసుకుని  అతనిని  ఆశీర్వదిస్తూ ధౌమ్యుడు ,”గురువు పట్ల నీకు గల సాటిలేని భక్తి వినమ్రత నీకు శాశ్వత కీర్తిని ప్రసాదిస్తాయి” అన్నారు . 

నీతి :  గురువు అనుగ్రహాన్ని పొందటం కోసం ఆరుణి తన గురువు పట్ల చూపిన భక్తి , వినయం  సాటిలేనివి . గురువు మెచ్చుకునే  గుణాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఎటువంటి గట్టి ప్రయాతాన్ని చేయాలో  దీన్ని బట్టి మనకి అర్థం అవుతుంది. ఇటువంటి గుణానికి  నిదర్శనం ,ఉదాహరణ ఏమిటంటే మన తల్లి తండ్రులను ,గురువులను గౌరవించటం . 

https://saibalsanskaar.wordpress.com/2016/06/02/arunis-devotion/

పోస్ట్ మాన్ — చిన్న పాప.

విలువ :       ప్రేమ .  

ఉప విలువ :  కరుణ ఇతరుల అవసరముల పట్ల సున్నితమైన స్పందన . 

                 ఒక పోస్ట్ మాన్ ఒక ఇంటి గుమ్మం వద్ద నిలబడి “ఉత్తరం వచ్చింది” అని చెపుతూ తలుపు తట్టాడు . వస్తున్నాను అంటూ ఒక చిన్న పిల్ల గొంతు అతనికి వినిపించింది. కానీ మూడు నాలుగు నిమిషములు గడిచినా ఎవ్వరూ బయటకి రాలేదు. కొంచం  చిరాకు పడుతూ  పోస్ట్ మాన్ “దయచేసి ఎవరన్నా తొందరగా బయటకు వచ్చి ఉత్తరం తీసు కోండి. అని గట్టిగా అరిచాడు. “ పోస్ట్ మాన్! దయచేసి ఆ ఉత్తరం తలుపు క్రింద పెట్టి వెళ్ళు. నేను వస్తాను అంటూ మళ్ళీ ఒక చిన్నపాప గొంతు వినిపించింది.  ఇది  “రిజిస్టర్ ఉత్తరం  కావటం చేత ఎవరైనా సంతకం చేసి తీసుకోవాలి “ అని పోస్ట్ మాన్ తిరిగి జవ్వాబ్య ఇచ్చాడు.  . సుమారు ఆరు లేక ఏడు నిమిషముల తరువాత తలుపు తెరుచుకుంది. అంత  ఆలస్యంగా తలుపు తీసినందుకు చాలా కోపం వచ్చిన  పోస్ట్ మాన్ ఆ తలుపు తీసిన వ్యక్తిని గట్టిగా మందలించాలనుకున్నాడు.  కాని  తలుపు తీసిన వ్యక్తిని చూసి నిర్ఘాంత  పోయిన అతనికి నోట మాట రాలేదు. పాదాలు లేని ఒక చిన్న పాప మోకాళ్ళమీద ప్రాకుతూ ఉత్తరం తీసుకోవటానికి  వచ్చి తలుపు తీసింది . పోస్ట్ మాన్ మౌనం గా ఉత్తరాన్ని  పాపా చేతికి అందించి తనకి కోపం వచ్చినందుకు  బాధ పడుతూ వెళిపోయాడు. . 

                    ఉత్తరంవచ్చినప్పుడల్లా పోస్టుమాన్ ఆ ఇంటికి  వెళ్ళి  పాప తలుపు తీసి ఉత్తరం తీసుకొనేవరకు విసుగు లేకుండా వేచి ఉండేవాడు. ఆ విధంగా జరుగుతుండగా దీపావళి పండుగ రాబోతున్నది.  చిన్న పాప  ,ఆ పోస్ట్ మాన్ ఎప్పుడు  వచ్చినా చెప్పులు వేసుకోకుండా రావటం  గమనించింది. ఒకసారి పోస్ట్ మాన్ ఉత్తరం ఇవ్వటానికి వచ్చినప్పుడు నేలమీద అతని పాద ముద్రలు బట్టి అతని పాదాల కొలతలను  తీసుకొందితీసుకుంది. దీపావళి పండుగ ముందు రోజు ,ఉత్తరం ఇవ్వటానికి పోస్ట్ మాన్ వచ్చినప్పుడు ఆ పాపాప  పోస్టుమాన్ తో “అంకుల్ ! ఇది నీకు దీపావళి కి నేను ఇస్తున్న బహుమానం అంటూ ఒక పొట్లం అతనికి ఇచ్చింది. “నువ్వు నా కూతురు లాంటి దానవు . నేను నీదగ్గర బహుమతి ఎలా తీసుకుంటాను అంటూ పోస్ట్ మాన్ పాపని వారించాడు . కానీ పాప చాలా పట్టు పట్టడం  వలన కాదనలేక ఆ పొట్లాన్ని ఇంటికి తీసుకెళ్లాడు.  ఇంటికి వెళ్ళి  ఆ పొట్లం విప్పినప్పుడు అందులో ఉన్న బూట్ల జత ను (షూస్ ) ను చూసి అతని కళ్ళు కన్నీటితో నిండిపోయాయి. ఎందుకంటే ఇన్నేళ్ళ   జీవితం లో అతను  చెప్పులు లేకుండా ఇంటింటికి తిరిగి ఉత్తరాలు ఇస్తున్నా  ఆ విషయాన్ని ఇంతవరకు ఎవ్వరూ గుర్తించలేదు.

          నీతి :  

                      ఇతరుల బాధను గుర్తించి సున్నితంగా స్పందించి   ,వారి బాధను తమదిగా భావించి పంచుకునే ప్రయత్నం చేయటం అనేది మానవత్వపు లక్షణం. ఈ లక్షణమే లేకపోతే మానవుడు మానవుడు అనిపించుకోలేడు. 

                సున్నితత్వము,సానుభూతి అనే ఆభరణాలను ప్రసాదించవలసిందిగా మనం ఆ భగవంతుడిని  ప్రార్ధించాలి . అటువంటి లక్షణము ఉంటేనే  ,మనము  ఇతరులు భాదలలో ఉన్నప్పుడు వారి బాధను తగ్గించటంలో మనం కొంత సహాయం అందించ గలుగుతాము. 

https://saibalsanskaar.wordpress.com/2016/05/06/postman-and-the-little-girl/

నిష్కళంక మైన ప్రార్థన — భగవంతుడి సాక్షాత్కారం.

saibalsanskaar telugu

sincere

విలువ — ప్రేమ

అంతర్గత విలువ — భక్తి , సేవ.

మహాభారతంలో ద్రౌపదిని ఎలా అవమానించారో మనకి తెలుసు.

దుశ్శాసనుడు   బలవంతంగా  ద్రౌపదిని,జుట్టు పట్టుకుని ఈడ్చుకు వచ్చి  , సభలో ద్రౌపది  భర్తల మధ్య , పెద్ద వాళ్ళ మధ్య అవమానిస్తాడు. ద్రౌపది  ఒంటిమీద ఉన్న చీర కూడా తియ్యడానికి ప్రయత్నిస్తాడు.

ఈ  అవమానాన్ని అందరూ చూస్తూ ఉండిపోయారు.

ద్రౌపది కృష్ణుడిని  ‘ ద్వారకవాసీ నన్ను వచ్చి రక్షించు ‘ అని ప్రార్థించింది.

దుశ్శాసనుడు  ద్రౌపది చీర బలవంతంగా తీసే ప్రయత్నం చేస్తున్నపుడు  వెంటనే  ద్రౌపదిని రక్షించడానికి, కృష్ణుడు చీర రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ద్రౌపదిని నిండుగా కప్పి,దుశ్శాసనుడు తీసేకొద్దీ చీరలు వచ్చేలా చేసాడు.

ద్రౌపదిని రక్షించడానికి ఒక కారణం ఉంది.

ఒక రోజు కృష్ణుడు చెరుకు కోస్తున్నపుడు, వేలు తెగుతుంది. రక్తం కారిపోతోంది.  అక్కడ ద్రౌపది, రుక్మిణి, సత్యభామ ఉంట్టారు.

రుక్మిణి కట్టు కట్టడానికి, పాత గుడ్డ  తీసుకునిరావడానికి వెళుతుంది.

సత్యభామ మందు తీసుకుని రావడానికి ఇంటికి వెళుతుంది.

కానీ ద్రౌపది తన చీర కొంగుని చింపి కృష్ణుడి వేలికి కట్టు కడుతుంది. ద్రౌపది భక్తిని చూసి కృష్ణుడికి చాలా ఆనందం కలుగుతుంది.

ద్రౌపది చేసిన ఈ సేవకి కృష్ణుడు, తను పిలవగానే కష్టంలో వెళ్ళి ఆదుకుంటాడు.

నీతి.

భగవంతుడు మన భక్తిని, మనం చేసిన సేవని ఎన్నడూ మరిచిపోడు.

మనకి కావాల్సిన సమయంలో తప్పకుండా వచ్చి సహాయపడతాడు.

https://saibalsanskaar.wordpress.com/2015/06/12/god-responds-to-sincere-prayers/

https://m.facebook.com/neetikathalu

View original post