Archive | December 2014

నమ్మకం, విలువ: సత్యం, అంతర్గత విలువ:నమ్మకం

ఒక వ్యక్తి తన జుట్టు సమంగా కత్తిరించుకోవడానికి క్షవరసాలకి వెళ్లాడు. అక్కడ మంగలి, పని మొదలుపెట్టగానే ఇద్దరూ చాలా విషయాలు మాట్లాడుకోవడం ప్రారంభించారు. భగవంతుడి గురించి మాట్లాడడం మొదలుపెట్టేసరికి, మంగలి”నాకు భగవంతుడు ఉన్నాడు అని నమ్మకం లేదు” అన్నాడు.

“ఎందుకు అలా అంటున్నావు”అని ఆ వ్యక్తి ఆడిగాడు.

మంగలి ఇచ్చిన సమాధానం.” బైటకి వెళ్ళి చూస్తే, భగవంతుడు ఉన్నాడు అని నమ్మకం కలగదు. నిజంగానే భగవంతుడు ఉంటే, ఎందుకు మనుషులు సుస్తీతో బాధ పడుతున్నారు? ఇంతమంది అనాధపిల్లలు ఉంటారా? ఎవరయినా బాధ పడతారా? నిజంగా భగవంతుడికి ప్రేమ ఉంటే ఇవన్నీ చుస్తూ ఊరుకుంటాడా?

imagesC2PRAPJA

 

ఆ వ్యక్తి కాసేపు ఆలోచించి, ఏమీ సమాధానం చెప్పలేదు. అనవసరంగా వాదన చేయడం ఇష్టం లేక. మంగలి పని ముగించగానే, ఆ వ్యక్తి బయటికి వెళ్ళిపోయాడు. రోడ్డు మీదఒక మనిషిని చూసాడు. పొడుగు జుట్టుతో సమంగా కత్తిరిచుకోకుండా, చూడడానికి అసహ్యంగా ఉన్నాడు. అప్పుడు, ఆ వెంటనే, మంగలి కొట్టుకి వెళ్ళి ఇలా అన్నాడు. “నీకు తెలుసా, మంగలి ఉన్నాడు అని నాకు నమ్మకం లేదు”

అప్పుడు, మంగలి, “అలా ఎలా అనగలువు, నేను ఇప్పుడే నీకు పని చేశాను కదా”

అప్పుడు ఆ వ్యక్తి ఇలా అన్నాడు, “నిజంగానే మంగలి ఉంటే, బయట ఆ మనిషి అలా, అంత జుట్టుతో అసహ్యంగా ఉండడు.”

అప్పుడు మంగలి “నా దగ్గరికి రాకపోతే నేను ఏమి చేయ గలను” అని అన్నాడు.

దానికి ఆ వ్యక్తి, “మనుషులు భగవంతుడి సహాయం కోసం, దగ్గరికి వెళ్ళాలి. ఎప్పుడు అయితే భగవంతుడికి దగ్గర అవుతామో ,అప్పుడు సంతోషంగా ఉంటాము. భగవంతుడు ఉన్నాడు.”

నీతి:

భగవంతుడు కావాలి అని అనుకునే వాడికి, భగవంతుడు తప్పకుండా ఉంటాడు. భగవంతుడు ఎక్కడ లేడు? నీ మొహంలో చిరునవ్వు, ఎదుటి వాడు బాధ పడుతుంటే జాలి చూపించటం, మన దగ్గర వాళ్ళకి ప్రేమగా ఉండడం,అన్ని కూడా, భగవంతుడు మనలో ఉండి చేయిస్తున్నాడు. భగవంతుడి కోసం మన హృదయంలో దృష్టి పెడితే నవ్వుతూ కనిపిస్తాడు.

http://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu