Archive | December 2017

భజగోవిందం -మొదటి శ్లోకం

భజగోవిందం

C52DC367-BC58-47C5-BDAE-1D5EA3BFD2EC.jpeg

 

ఉపోద్ఘాతము

శ్రీ ఆది శంకరాచార్యుల వారు రచించిన భజగోవిందం భక్తి వైరాగ్య భావనలు పెంచే అతి సరళమైన ఎంతో జ్ఞానసంపత్తిని కలిగిన గొప్ప వేదాంత సాహిత్యము. ఒక రోజున శంకరాచార్యులు వారి శిష్యులతో కలిసి కాశీపుర వీధులలో పర్యటిస్తూఉండగా , దారిలో ఒక ముసలి పండితుడు పాణినీ వ్యాకరణ సూత్రములు వల్లె వేస్తూ కనిపించాడు. ఆ పండితుడి యొక్క దృష్టి, ఆసక్తి వ్యాకరణ సారాంశము మీద కాకుండా, కేవలము వ్యాకరణమును వల్లె వేయుటయందు, కంఠస్తము చేయుటయందు పరిమితమై ఉండుట గమనించారు ఆచార్యులు.

అది చుసిన మరుక్షణమే ప్రేరణ పొందినటివంటి ఆచార్యుల వారిచే ప్రకటితమైన మహత్తరమైన భక్తి జ్ఞాన సంపన్నమైన శ్లోకముల సముదాయమే భజగోవిందం.

మొదటి శ్లోకము

భజ గోవిందం భజ గోవిందం
గోవిందం భజ మూఢమతే
సంప్రాప్తే సన్నిహితే కాలే
నహి నహి రక్షతి డుకృం కరణే

అనువాదము
భజ గోవిందం భజ గోవిందం
గోవిందం భజ మూఢమతే
మృత్యువు దాపున మొసలుచు నుండగ
వ్యాకరణము నిను కాపాడదురా

భజ గోవిందం భజ గోవిందం
గోవిందం భజ మూఢమతే!!!

భావము: ఓ మూఢుడా : గోవిందుని భజన చెయ్యి. మరణ కాలము ఆసన్నమైనపుడు, డుకృం కరణే అని నీవు వల్ల వేసే వ్యాకరణ పాఠం నిన్ను రక్షించదు.

కథ – అక్బరు- సూఫీ ఫకీరు

 

CAE36ECA-8766-49AE-A708-132A568C7F97.jpeg

ఒకనాడు ఒక గొప్ప సూఫీ ఫకీరు కొంత సహాయము అడుగుటకు అక్బరు చక్రవర్తి వద్దకు వెళ్ళాడు. ఆ ఫకీరు రాజభవనం చేరేటప్పటికి అక్బరు దైవ ప్రార్థన చేస్తూ ఉండటం చూసాడు. అక్బరు రెండు చేతులూ పైకెత్తి ఎంతో సంపద మరియు అధికారమును ప్రసాదించమని వేడుకుంటున్నాడు. ఇది చూసిన సూఫీ ఫకీరు మరుక్షణమే వెళ్ళిపోసాగాడు.

ఈ లోపల ప్రార్థన పూర్తి చేసుకున్న అక్బర్ చక్రవర్తి, సూఫీ ఫకీరు వెళ్తూ ఉండడం గమనించి త్వరత్వరగా వెళ్ళి ఫకీరు కాళ్ళపై పడి తన దగ్గరకు వచ్చిన కారణము తెలుపమని ఫకీరుని ప్రార్థించాడు.

అప్పుడు ఫకీరు ఈ విధంగా అన్నాడు” నీ నుండి కొంత సహాయము పొందుటకై నేను వచ్చాను. కానీ నీవు కూడా దేవుని సహాయము యాచించుట నేను గమనించాను. ఒక యాచకుడు, వేరొక యాచకుడికి ఏమి సహాయం చేయగలడు అనుకుని వెళ్ళిపోతున్నాను. నేను ఫకీరును. భగవంతుని నా జీవితము సాగించుటకై కావలసిన ఆహారేతర అవసరములకు మాత్రమే ప్రార్థిస్తున్నాను. నీవు నాకంటే పెద్ద యాచకుడివి. అధిక ధనము, కీర్తి, అధికారము కొరకు ప్రార్ధిస్తున్నావు. కావున నిన్ను యాచించుట కంటే, నేనే స్వయంగా భగవంతుని యాచించుట ఉత్తమము”. ఆ ఫకీరు మాటలు విన్న అక్బరు జ్ఞానోదయము పొంది “ఆహా; నేనెంతటి గొప్ప చక్రవర్తిని అయినప్పటికీ, నాలో ఎంత పేదరికము, దౌర్బల్యము ఉన్నాయి కదా అని అనుకున్నాడు.

సారాంశము

శంకరాచార్యులవారు ఈ విధంగా అంటున్నారు ” మనం దేని కొరకు యాచిస్తున్నాము? కోరిక తీరడంకోసమే.అప్పుడు మన భక్తి,కోరికలు తీర్చే ఉపాయంగా మారుతుంది. ఇది ఒక బార్టర్ పధ్ధతి.అంటే ఇచ్చి పుచ్చుకునే వ్యవస్థ. భగవంతుని యందు భక్తి నిర్మలంగా, స్వఛ్ఛంగా ఎటువంటి కోరికలు లేకుండా ఉండాలి. అటువంటి భక్తిలో సార్థకత ఉంటుంది. సత్యము నందు ప్రేమను పొందుటే భక్తి.పరిపూర్ణ భక్తిలోనే సంరక్షణ ఉందన్న అనుభూతి చెందినవాడు అసలైన భక్తుడు. అనిత్యమైన వస్తువులు, ధనము ఎంత కూడా బెట్టినా నిశ్చింతను, రక్షణను ఇవ్వలేవు. అవసరమేదో, దురాశ ఏదో తెలుసుకోవాలి. దురాశ వలన అభద్రత, అశాంతి, దుఃఖము జీవితాంతం ఉండి, జీవిత ఆఖరిక్షణాల్లో కూడా అసంతృప్తిగా ఉంటాడు. కాబట్టి భగవంతుని యందు నిరపేక్ష కలిగిన స్వఛ్ఛమైన ప్రేమని పెంచుకోవాలి.

 

 

 

 

 

 

 

 

Advertisements

బాధ్యతగల ఒక కుమారుడు.

బాధ్యతగల ఒక కుమారుడు.

 

D9839A09-2446-4C80-A554-608D930EB418

విలువ –సరైన నడత
అంతర్గత విలువ — గౌరవం , ప్రేమ

వృధావస్థ లో ఉన్న తల్లిని, కొడుకు హోటల్ కి తీసుకుని వెళ్ళాడు. తల్లి బలహీనంగా ఉండడం వల్ల, తింటున్న భోజనం, తన బట్టల మీద పడుతోంది. పక్కన ఉన్న వాళ్ళందరూ చూస్తున్నారు, కానీ కొడుకు శాంతంగానే ఉన్నాడు.

భోజనం పూర్తి అయ్యాక, తన తల్లిని తీసుకుని వెళ్లి కొడుకు, బట్టల మీద పడిన మరకలను శుభ్రం చేశాడు , తన జుట్టును సరి చేశాడు.కళ్ళజోడును కూడా సరి చేశాడు.

బయటికి రాంగానే, అందరి మధ్యలో ఇబ్బంది పడకుండా కొడుకు ఎలా ఉన్నాడు అని ఆశ్చర్యపోయి చూస్తున్నారు.

కొడుకు, కట్టవలసిన డబ్బులు కట్టేసి , నిదానంగా, తల్లిని తీసుకుని బయటకు నడుస్తున్నాడు.
కూర్చున్న వాళ్లలో ఒక పెద్ద అయిన దెగ్గిరకి వచ్చి ‘మీరు ఇక్కడ ఒకటి వదిలి వెళ్తున్నారు ” అని అన్నారు.
“లేదు అండి ” అని సమాధానం చెప్పాడు కొడుకు.
అప్పుడు పెద్ద అయినా ఇలా అన్నారు “బాధ్యత గల కొడుకు, తల్లిని ఎలా చూసుకుంటాడో, అన్న ఒక చక్కటి గుణపాఠాన్ని ఎప్పటికీ మర్చిపోని గుర్తుగా వదిలి వెళ్తున్నారు”అని అన్నారు.

హోటల్ లో అందరూ నిశ్సబ్ధంగా ఉండిపోయారు.

నీతి
మన తల్లమతండ్రులని ఎప్పుడూ మర్దుమర్చిపోకూడదు. తల్లితండ్రులు చేసిన మేలు ఇంక ఎవ్వరు మనకి చెయ్యలేరు, ముఖ్యంగా తల్లి.
నిరంతరం కృతజ్ఞతా భావంతో ఉందాము.
యలవేళలా అమ్మని నాన్నగారిని గౌరవిద్దాము , ప్రేమగా చేసుకుందాము. నలుగురిలో వారు ఎలా ప్రవర్తించినా చిన్నబుచ్చుకుని వారిని విసుక్కోకూడదు.

http://saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu

భగవంతుడి అడుగులు

 

విలువ — ప్రేమ
అంతర్గత విలువ — నమ్మకము , భగవంతుడి అనుగ్రహం.

 

F1C0A65E-F8D3-47BA-AB63-4185CFD7B651

 

ఒక రోజు రాత్రి కలలో, భగవంతుడితో, నేను సముద్రపు ఒడ్డున నడుస్తున్నాను.

అప్పటిదాకా నా జీవితంలో జరిగిన సంఘటనలు అన్నీ కనిపిస్తున్నాయి. ప్రతి సంఘటన లో చూస్తే నాలుగు అడుగులు కనిపించాయి. రెండు అడుగులు నావి, రెండు అడుగులు భగవంతుడివి.

కానీ ఆఖరి సంఘటన లో చాలా కష్టమైన సమయం లో చూస్తే, రెండు అడుగులే కనిపించాయి. అప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించి
భగవంతుడిని ఇలా అడిగాను, స్వామీ; “మీరు అన్నారు కదా, ఒక్కసారి నా భక్తుడి చేయి పట్టుకుంటే చివరిదాకా వదలిపెట్టను అని, మరి కష్టమైన సమయం లో ఎందుకు రెండు అడుగులే కనిపిస్తున్నాయి. మీరు నన్ను ఒంటరిగా వదిలేసారా ??”

దానికి భగవంతుడు ఇలా సమాధానం చెప్పారు ” నా ప్రియమైన భక్తురాలా, కష్టసమయం లో నువ్వు చూసిన రెండు అడుగులు నావే. ఆ సమయంలో నేను నిన్ను ఎత్తు కున్నాను. నేను నిన్ను ఎల్లవేళలా కంటికిరెప్పలా కాపాడుతూనే ఉంటాను.”

నీతి:భగవంతుడి పై ప్రేమ, నమ్మకం, భక్తి మనల్ని ఎప్పుడూ కాపాడతాయి. భగవంతుడు కష్టముల  నుంచి మనము బయట పడడానికి మనము బయట పడే మార్గాన్ని చూపిస్తాడు , అంతే  కాకుండా అతి కష్టమైన పరిస్థితిలో, ఆయన మనతో పాటే ఉంటూ మన కూడా కుడా నడుస్తారు.

http://saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu