Archive | April 2016

ఏనుగు మరియు తాడు !

image
విలువ –సత్యం
అంతర్గత విలువ — మన బలం మరియు శక్తి తెలుసుకోవడం.

ఒక మనిషి నడుస్తూ ఉండగా దారిలో చాలా ఏనుగుల్ని చూశాడు. అంత పెద్ద ఏనుగుల ముందర కాళ్ళకి ఒక తాడుని కట్టారు. ఇంక వేరే గొలుసులు గాని, ప్రత్యేకమైన నిర్బంధం గాని ఏర్పాటుచెయ్యలేదు.. అంత పెద్ద ఏనుగు అలా ఎలా అలా తాడుకి కట్టుబడి ఉంటుంది అని ఆశ్చర్యపోయాడు. ఏనుగు తలుచుకుంటే, తాడుని తెంచుకుని వెళ్ళిపోగలదు, కాని ఎందుకు వెళ్ళట్లేదు అంక్ అనుకున్నాడు.

ఏనుగులకి శిక్షణ ఇచ్చే మావటివాడిని ఇలా అడిగాడు, ” అంత పెద్ద ఏనుగు తాడుని తెంచుకుని వెళ్ళిపోకుండా ఎలా ఉంటుంది? “. అప్పుడు ఆ శిక్షణ ఇచ్చే మావటి ఇలా చెప్పాడు, ” ఏనుగులకి చిన్న వయసు నుంచి, ఇదే తాడుతో ముందర కాలు కట్టేస్తాము. అప్పుడు చిన్నది కాబట్టి, ఆ తాడు సరిపోతుంది, తెంచుకుని వెళ్ళలేదు . పెద్దది అవుతున్న కొద్దీ , అలవాటు అయిపోయి ఆ తాడు తెంచుకుని వెళ్ళాలన్న ఆలోచన రాదు”.

మావటివాడి సమాధానం విని ఆ మనిషి ఆశ్చర్యపోయాడు.

నీతి:-

జీవితంలో మనం ఎన్నో సార్లు ఓడిపోయి ఉంటాము. దానికి మనం ఏమి చెయ్యలేము అని నిరాశ పడిపోతాము. ఓటమిని మనం ఒక పునాదిగా తీసుకుని కృషి చెయ్యాలి. పై కధలో ఏనుగులాగా ఏమీ చెయ్యలేము అని అనుకోకూడదు.
మనం మన చిన్న ప్రపంచం నుంచి బయటికి వచ్చి, పెద్ద ప్రపంచాన్ని చూడాలి. మనసు పెట్టి,ఆత్మవిశ్వాశం తో చేస్తే ఏ పనిలోనైనా విజయాన్ని సాధించవచ్చు.

http://saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu

మెరిసే చేపలు!

 

విలువ:సత్ప్రవర్తన

అంతర్గత విలువ:ప్రత్యేకత

 

image

 

 

ఒకప్పుడు ఒక రచయిత ఉండేవాడు ఆయన గొప్ప మేధావి సముద్రం ఒడ్డున కూర్చొని రచనలు చేయడం ఆయనకు అలవాటు వ్రాయడం మొదలు పెట్టేముందు కొంచెం సేపు సముద్రపు ఒడ్డున ఇటూ అటూ పచార్లు చేసేవాడు ఒకరోజున సముద్రం ఒడ్డున ఒంటరిగా అటూ ఇటూ నడుస్తూంటే ఆయనకు కొంచెం దూరం లో ఎవరో నాట్యం చేస్తున్నట్టు గా అనిపించింది ఆనాట్యo చేసేది ఎవరో చూడాలని తొందర గా అటు వైపు అడుగులు వేశాడు దగ్గరకు వెళ్లి చూసే సరికి అక్కడ ఒక యువకుడు కనిపించాడు అతడు రచయిత భావించి నట్లుగా నాట్యం చేయడం లేదు ఏదో పని చేస్తున్నాడు ఆ యువకుడు ఒడ్డు నుంచి ఎదో వస్తువును తీసి నీళ్ళ లోకి విసరుతున్నాడు రచయిత ఆ యువకుడి దగ్గరకు వెళ్లి శుభోదయం చెప్పి మీరేమి చేస్తున్నారో తెలుసు కోవచ్చా అని అడిగాడు ఆ యువకుడు ఒక్క క్షణం ఆగి రచయిత కేసి చూసి మెరిసే చేపలను సముద్రం లోకి విసరుతున్నాను అని సమాధానం చెప్పాడు రచయిత ఆశ్చర్య పడుతూ మీరు అలా చేయడం ఎందుకు అని అడిగాడు కెరటాల కి ఈ చేపలు ఒడ్డుకు కొట్టుకు వస్తూ ఉంటాయి ఎండ చాల ఎక్కువ గా ఉంది తిరిగి వీటిని నీటిలో వేయకపోతే ఇవి చని పోతాయి అని ఆ యువకుడు బదులు చెప్పాడు దానికి ఆ రచయిత ఆ యువకుడు తెలివి లేని వాడు అని భావిస్తూ చూడు బాబూ సముద్రం ఒడ్డు కొన్ని వందల మైళ్ళ దూరం ఉంటుంది ప్రతి చోట ఇలా ఈ చేపలు ఒడ్డుకు కొట్టుకొని వస్తూనే ఉంటాయి ఎన్ని చేపలను నీవు తిరిగి సముద్రం లోకి తిరిగి వేయగలవు దాని వలన ఎంత ప్రయోజనం ఉంటుంది అని అడిగాడు ఈ మాటలు విని ఆ యువకుడు మరో చేపను తీసి సముద్రం లో వేస్తూ అది నీళ్ళలో పడిన తరువాత చూడండి నాకు చేతనై నంత లో కొన్ని చేపలనైనా బ్రతికించగలిగానని నాకు సం తృప్తి అని సమాధానం చెప్పాడు. ఇప్పుడు ఆశ్చర్య పోవడం రచయిత వంతు అయింది

నీతి:— ప్రతివారు అవకాశo వచ్చినప్పుడు చేయగలిగినంతలో ఎదో ఒక మంచి పని చేయాలి మనం చిందించే ఒక చిరునవ్వు మాట్లాడే ఒక మంచి మాట చేసే ఒక మంచి పని ఇతరుల జీవితాలలో వెలుగులు నింప వచ్చు ఏమీ చేయకుండా కూర్చోవడం కంటె ఎంతో కొంత చేయడం మంచిది

http://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

 

 

పట్టుదల,ఆశావహ దృక్పధం విజయానికి సోపానాలు, విలువ: ఆశావాదం అంతర్గత విలువ దీక్ష

 

ఒకచోట ఒక కప్పల గుంపు ఉండేది. వాటిలో కొన్నింటికి మితి మీరిన ఆత్మ విశ్వాసం.  ఆ కప్పలన్నీ కలసి ఒక పోటీ ఏర్పాటు చేశాయి.  ఒక పెద్ద ఎత్తైన చెట్టు చివర వరకు ఎక్కడం లక్ష్యం గా నిర్దేశిoచు కున్నాయి. పోటీ చూడడానికి పోటీలో పాల్గొనే కప్పలను ఉత్సాహపరచడానికి ఎన్నో కప్పలు అక్కడ గుమిగూడాయి.  పోటీ ప్రారంభమయింది.

frogsచెట్టు చాల ఎత్తైనది. పోటీలో పాల్గొనే ఒక్క కప్పకూడా చెట్టు చివరకు చేరుకోవడం అసాధ్యం. ఇది చాలా కష్ట మైన పోటీ  అని అక్కడ గుమి గూడిన కప్పలు అనుకుంటున్నాయి.  ఒక దానితో  ఒకటి పోటీ పడి కప్పలు చెట్టు ఎక్కడం మొదలు పెట్టాయి. కొన్ని ఎక్కలేక జారి క్రింద పడి చనిపోతున్నాయి. కొన్ని కప్పలు బాగా అలసిపోయి తమ ప్రయత్నం విరమించుకుంటున్నాయి. మరి కొన్ని కప్పలు రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ ప్రయత్నిస్తున్నాయి.  క్రింద ఉన్న కప్పలు అరుస్తున్నాయి. చివరకు కప్పలన్నీ చెట్టు ఎక్కడం అసాధ్యం అని నిర్ణ యిoచుకుని తమ ప్రయత్నం విరమించు కున్నాయి. ఒక చిన్ని కప్ప మాత్రం నెమ్మది నెమ్మది గా చెట్టు ఎక్కుతూనే ఉండి ఆశ్చర్యకరంగా అది చెట్టు చివరకు చేరుకుంది.పోటీలో గెలిచి అందరినీ ఆశ్చర్యపరచింది.కప్పలన్నీ ఆశ్చర్యంతో నోట మాట లేకుండా చూస్తూ ఉండి పోయాయి.ఒకకప్ప గెలిచిన ఆ చిన్న కప్పను చూచి ఇంత ఎత్తైన చెట్టు చివరివరకు ఎలా ఎక్కగలిగావు? నీకింత శ క్తిఎలా వచ్చింది? అని అడిగింది గెలిచిన ఆచిన్ని కప్ప చెవిటి దానిలా ఆ మాటలను పట్టించుకొననే లేదు.

నీతి:- పట్టుదల, దీక్ష, ఆశావహ దృక్పధం విజయానికి సోపానాలు.

https://saibalsanskaar.wordpress.com

సత్యమే భగవంతునికి ప్రతిరూపం, విలువ – సత్యము పలుకుట, అంతర్గత విలువ — నిజాయితీ

gandhijiగాంధీజీ చిన్న తనం లో చాల బిడియ పడే స్వభావం గలిగి ఉండేవాడు  సాయం కాలం స్కూలు గంట కొట్టగానే తిన్నగా ఇంటికే వెళ్లే వాడు. మధ్యలో ఎక్కడా ఆగే వాడు కాదు. మిగిలిన పిల్లలు మాత్రం మధ్యలో ఆగి కబుర్లు చెప్పుకుంటూ వేళాకోళాలు ఆడు కుంటూ తీరికగా ఇల్లు చేరేవారు తన తోటి పిల్లలు తనను మధ్యలో ఆపి ఎక్కడ ఆట పట్టిస్తారో నని గాంధిజీ కి భయం అందుచే ఎక్కడా ఆగకుండా తిన్నగా ఇంటికే వెళ్లేవాడు.

ఒకరోజు  తనిఖీ కోసం స్కూళ్ల ఇన్స్పెక్టర్ గైల్స్ వచ్చాడు ఆయన ఐదు ఆంగ్ల పదాలు డిక్టే ష ను చెప్పి పిల్లలను వ్రాయమన్నాడు మిగిలిన పిల్లలు అందరు ఐదు పదాలు తప్పులు లేకుండా వ్రాశారు kettle అనే పదానికి గాంధీజీ కి స్పెల్లింగ్ తెలియ లేదు కొంచెం గాభరా పడ్డాడు. గాం ధీజీ కంగారు పడడం చూసి హెడ్ మాస్టర్   “ప్రక్క నున్న పిల్లవాడి పలక మీద చూసి వ్రాయి”  అని ఇన్స్పెక్టర్  గమనించ కుండా గాం ధీజీ కి సైగ చేశాడు. గాంధీజీ దానిని పట్టించుకో లేదు అందరు పిల్లలు ఐదు పదాలు సరిగా వ్రాస్తే గాంధీజీ  నాలుగు పదాలు మాత్రమే తప్పులు లేకుండా వ్రాయ గలిగాడు.

ఇన్స్పెక్టర్ వెళ్లి పోయాక హెడ్ మాస్టర్ గాంధీజీ ని చూచి ప్రక్కనున్న పిల్లవాడి పలక మీద చూసి వ్రాయమని చెప్పానుగా అది కూడా చేయలేక పోయావా అని కోప పడ్డాడు. ఇది చూచి మిగిలిన పిల్ల లంతా గొల్లున నవ్వారు

మామూలు గా స్కూలు అయిపోగానే సాయం కాలం గాంధీజీ ఇంటికి వెళ్ళాడు. హెడ్ మాస్టర్ మందలిoచినందుకుఆయనకేమీ బాధ కలుగలేదు  తానూ తప్పు చేయలేదని తానూ చేసిన పని సరి యైదేనని  సంతోషించాడు కూడా. కాని ప్రక్కనున్న పిల్లవాని పలక మీద చూసి వ్రాయమని హెడ్ మాస్టర్ చెప్పడమే ఆయనకు బాధ కలిగించింది

నీతి :-నిజాయితీ అన్నింటి కంటె ఎంతో ఉత్తమ మైనది  మోసగించే స్వభావం నిజాయితీ లేక పోవడం అనే ఈ రెండు చెడు లక్షణాలు మన జీవితాన్ని సక్రమం గా గమ్యానికి చేర్చ లేవు అందుచే చిన్న తనం నుంచి పిల్లలలో సత్యం పలకడం నిజాయతీ కలిగి ఉండడం అనే లక్షణాలను పెంపొందింప జేయాలి నిజాయతీ గలవారే జీవితంలో ప్రశాంతంగా సంతోషం గా ఉండగలుగుతారు.

https://saibalsanskaar.wordpress.com

అమోఘమైన ఖడ్గం!

విలువ: అహింస,

అంతర్గత విలువ: శాంతి

ఓ చక్రవర్తి వద్ద ఒక గొప్ప ఖడ్గం ఉండేది.దాని గురించి అందరూ చాలా గొప్పగా చెప్పుకునేవారు.ఆ చక్రవర్తి తన భవనంలో ఎల్లప్పుడూ విందులు విలాసాలలో మునిగి తేలుతూ ఉండేవాడు. ఒకసారి పొరుగున ఉన్న రాజుతో వచ్చిన తగాదా రెండు రాజ్యాలకీ మధ్య యుద్ధానికి దారి తీసింది.

ఇంత కాలం యుద్ధంలో పాల్గొనే అవకాశం వచ్చినందుకు ఆ ఖడ్గానికి ఉత్సాహం ఎక్కువైంది. ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న తన ధైర్యాన్ని మరియు ప్రత్యేకతలను అందరికీ చాటి చెప్పే అవకాశం వచ్చిందని భావించింది.అన్ని ఖడ్గాలకంటే ముందు వరుసలో నిలబడి, తన పౌరుష ప్రతాపాలను చూపి తనే అన్ని అఖండ విజయాలను సాధించినట్టు ఊహలలో తేలిపోయింది.

అనుకున్నట్టే యుద్ధం ప్రారంభమైంది.యుద్ద రంగంలో సంభవించే పరిణామాలను చూసి ఆ ఖడ్గం నివ్వెరపోయింది.తను ఊహించుకున్నట్టు ఏ విషయాలు యుద్ధంలో కనబడలేదు సరి కదా, దానికి విరుద్ధంగా ఎక్కడ పడితే అక్కడ కుప్పలు కుప్పలుగా అన్ని ఆయుధాలు విరిగి పడి ఉన్నాయి.తినడానికి ఏమీ దొరకక లెక్కలేనంత జనం ఆకలి దాహాలతో అలమటిస్తున్నారు.ప్రతి చోట దుమ్ము ధూళి పేరుకు పోయి, శవాలన్నీ రక్తపు బురదగా యుద్ధ రంగం అంతటా దుర్వాసన వస్తూ ఉంది.కాళ్లు-చేతులు తెగి పడిన వారు కొందరు, కొన ఊపిరితో మరికొందరు, గాయాల నుండి రక్తం ఓడుతూ ఇంకొందరు, ఇలా వారందరి హృదయ విదారకమైన ఆర్తనాదాలతో యుద్ధ రంగం మారు మ్రోగి పోkhadgamతూ, చాలా దయనీయంగా కనిపిస్తోంది.

ఇదంతా చూసి ఆ ఖడ్గానికి జ్ఞానోదయం అయింది. యుద్దాలంటేనే విరక్తి కలిగింది.ఇక మీదట ఆటలపోటీలలో తప్ప ఇంకే యుద్ధంలో పాల్గొనరాదని నిర్ణయించుకుంది.యుద్ధాలలో పాల్గొనకుండా ఉపాయాలు ఆలోచిస్తూ ఒక నిర్ణయానికి వచ్చింది.లయబద్ధంగా అటు ఇటు ముందు నెమ్మదిగా కదిలి, క్రమంగా వేగంగా తిరగడం మొదలు పెట్టింది.తరువాత పెద్దగా శబ్దం రావడం మొదలైంది.మిగిలిన ఖడ్గాలు, సైనికుల ఒంటిపై కవచాలు ఇదంతా చూసి అదేమిటని అడిగాయి.“నాకు యుద్ధం అంటే ఇష్టం లేదు, నేను రేపటి నుండి యుద్ధంలో పాల్గొనను”, అని ఖడ్గం సమాధానం ఇచ్చింది.“యుద్ధం అంటే ఎవరు మాత్రం ఇష్టపడతారు, కానీ మనం ఏం చేయగలం”, అని ఒక ఖడ్గం నిట్టూర్చింది. “మీరు కూడా నాలాగనే లయబద్ధంగా కదులుతూ శబ్దం చేయడం మొదలుపెట్టండి, దాని వలన ఎవరికీ నిద్ర పట్టదు”, అని ఖడ్గం సమాధానం చెప్పింది.

అన్ని ఖడ్గాలు మరియు ఇతర ఆయుధాలు అలాగే శబ్దం చెయ్యడం మొదలుపెట్టాయి. శత్రు శిబిరం లోని కత్తులు కూడా వీటితో జత కలిపాయి. రాత్రంతా చెవులు చిల్లులుపడేలా ఎక్కడ చూసినా శబ్దంతో నిండిపోయింది. తెల్లవారే సరికి ఒక్క ఆయుధం కూడా యుద్ధానికి సిద్ధంగా లేదు. రాత్రంతా నిద్ర కరువై సైనికులు, సైన్యాధికారులు మరియు ఇరు రాజులూ నిద్ర కరువై అతి కష్టం మీద సాయంత్రానికి నిద్ర లేచారు. యుద్ధం మరునాటికి వాయిదా పడింది. అన్ని ఆయుధాలు ఆ రాత్రి కూడా మరొక సారి శబ్దం చేయసాగాయి. రాత్రంతా మళ్ళీ ఏ ఒక్కరికి నిద్రలేక యుద్ధం మళ్ళీ ఆ మరుసటి రోజుకు వాయిదా పడింది. ఇలా ఏడు రోజులు గడిచాయి, యుద్ధం వాయిదా పడటం మామూలు అయిపోయింది. ఇరు పక్షాల రాజులు తప్పనిసరి పరిస్థితులలో అసహనంగానే సమావేశమయ్యారు. ఇంతకు ముందు వచ్చిన తగాదాకి ఒకరిపై మరొకరు తీవ్ర కోపంతో ఉన్నా, అతి కష్టం మీద శాంతి చర్చలు కొనసాగించారు. ఆయుధాల శబ్దాలు ఇద్దరికీ చాలా ఆశ్చర్యం కలిగించింది. అందరికీ నిద్రలేక పోవడం కూడా కాస్త అయోమయంగా అనిపించి ఇద్దరూ కొంత సేపు నవ్వుకుని మళ్ళీ స్నేహితులుగా మారిపోయారు.

అదృష్టవశాత్తు వాళ్లిద్దరూ పాత తగాదాలు మరచి యుద్ధానికి చరమగీతం పాడారు. తమ మధ్య శత్రుత్వం అంతరించి మైత్రి నేల కొన్నందుకు సంతోషించి రెట్టించిన ఉత్సాహంతో ఇరువురి రాజ్యాలకూ తిరిగి వెళ్ళారు.తరువాత వారిద్దరూ తరచుగా కలుసుకుంటూ తమ అనుభవాలను పంచుకోవడం మొదలుపెట్టారు. వారి మధ్య శత్రుత్వంకంటే కూడా మైత్రి పెరగడానికి ఎక్కువ సంఘటనలు దోహదం చేశాయని గుర్తించారు.చిన్నపాటి విభేదాలను విస్మరించి శాంతి సౌభాగ్యాలకు, రెండు రాజ్యాల అభ్యున్నతికి కృషి చేస్తూ గొప్ప చక్ర వర్తులుగా పేరు తెచ్చుకున్నారు.

నీతి :- ప్రతి ఒక్కరూ శాంతి, సంతోషాలనే కోరుకుంటారు. యుద్ధం సమస్యలకు పరిష్కారం కాబోదు.శాంతిని స్థాపించడానికి అహింసకు మించిన శక్తివంతమైన సాధనం మరొకటి లేదు.

https://saibalsanskaar.wordpress.com

రామయ్య – రాబందు, విలువ: ప్రేమ, అంతర్గత విలువ : అన్ని జీవుల పట్ల దయ కలిగి ఉండడం

 

రామfarmerయ్య పొలం దున్నడానికి వెళ్లి అక్కడ వలలో చిక్కిన రాబందుని చూసి జాలితో దానిని వదిలేసాడు.eagle

ఆ తరువాత రామయ్య భోజనం తరవాత అలసటగా ఉండి ఒక పాత గోడ పక్కగా నిద్రించాడు.

ఆ పాత గోడ తొర్రలో ఉన్న ఒక పాము రామయ్యను కాటు వేయడానికి వచ్చింది.

అది చూసిన రాబందు ఆ పామును ఒక్కసారిగా కాళ్ళతో తన్నుకుపోయింది.

ఈ అలజడికి నిద్రలేచిన రామయ్య , రాబందు చేసిన సహాయానికి ఆశ్చర్యపడ్డాడు.

నీతి: ఒక మంచి పని మరో మంచిపనికి ప్రోత్సహిస్తుంది.

                                                        siabalsanskaar.wprdpress.com

http://www.facebook.com/neetikathalu

గర్వభంగము, విలువ: వినయము, అంతర్గత విలువ: అందరి పట్ల గౌరవం కలిగి ఉండాలి

ఒకనాడు నారదుడు విష్ణుమూర్తిని దర్శించి గంధర్వపురం మీదుగా భూలోకానికి వస్తున్నాడు.దారిలో గంధర్వ గాయకుడైన తుంబురుడు కలిసి నారదుణ్ణి కుశలప్రశ్నలు వేసాడు. ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ భూలోకానికి వస్తున్నారు. మధ్యలో వారికి ఇద్దరిలో ఎవరు గొప్ప అని గొడవ వచ్చింది.

ఆ దారిలోనే వెళ్తున్న Lord Hanuman along with Tuburu and Naradaహనుమంతుడు ఈ వాదన విని వారి దగ్గరకు వచ్చాడు.గొడవకి కారణమేమిటో చెప్పమన్నాడు.

నారదుడు తాను దేవ గాయకుడనని, తుంబురుడు తాను గంధర్వ గాయకుడనని చెప్పారు.

అప్పుడు హనుమంతుడు ఇద్దరిలో ఎవరు గొప్పో తాను నిర్ణయిస్తానని అక్కడున్న పెద్ద బండ రాయి పై నారదుని వీణ ఉంచి గానం చేసాడు. హనుమంతుడి గానానికి ఆ వీణ రాతియందు ఇమిడిపోయింది.

మీలో ఎవరు గొప్పో తెలియాలంటే ఆ వీణను తీసి గానం చెయ్యమన్నాడు హనుమంతుడు. నారదుడు గానం చేసి తన వల్ల కాదన్నాడు. తుంబురుడి వల్ల కుడా కాలేదు. అప్పుడు హనుమంతుడు గానం చేసి మరలా ఆ వీణను బయటికి తీసాడు.

ఇలా గొడవ పడడం మంచిది కాదని హనుమంతుడు ఇద్దరినీ మందలించాడు. నారదుడు,తుంబురుడు సిగ్గుపడి వెళ్ళిపోయారు.

నీతి: మనం ఎంత గొప్పవారమైనా మనల్ని మించిన వారు ఉంటారు. గర్వం కుడా దోషమే కనుక అది లేకుండా చూసుకోవాలి.

saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu