Archive | October 2018

చదువుకున్న పండితుడు

విలువ — సత్యము,
అంతర్గత విలువ — ఆచరణ / అభ్యాసమ
 ఒక నది దాటటానికి కొంత మంది మనుషులు పడవలో కూర్చున్నారు. అందులో ఒక చదువుకున్న పండితుడు ఉన్నాడు.  ఆ పండితుడు తను చదువుకున్న పుస్తకాల గురించి , తనకి ఉన్న జ్ఞానాన్ని గురించి అందరికీ  చెప్పాలి అనుకున్నాడు.
పండితుడు , అందరినీ  ప్రశ్నించడం మొదలు  పెట్టాడు.
మీరు ఉపనిషత్ లు  చదివారా ?? శాస్త్రాలు చదివారా ?? 6 వర్గాల హిందూ తర్కశాస్త్రము గురించి తెలుసా ??
దానికి  పడవలో ప్రయాణము చేసే వాళ్ళు,” ఈ వాక్యములు వినలేదు మాకు తెలియదు” అని సమాధానము చెప్పారు.
దానికి పండితుడు, “మీ జీవితం వ్యర్థము, వీటిగురించి తెలియదా ??” అని అన్నాడు. పండితుడు అలా అన్న కొంతసేపటికి నదిలో పెద్ద పెద్ద అలలు  రావడం మొదలు పెట్టాయి. పండితుడికి కంగారు వేసింది. పడవలో  ఉన్న ఒక వ్యక్తి పండితుడిని మీకు ఈత వచ్చా? అని అడిగాడు.
పండితుడు ‘రాదు ‘ అని సమాధానము చెప్పారు. అప్పుడు ఆ వ్యక్తి “ఇంక మీ  జీవితము అయిపోయింది ” అని పడవ లోంచి నదిలోకి దూకి ఈదుకుంటూ  వెళ్ళిపోయాడు.
నీతి
 ఎన్నో పుస్తకాలు చదివిన జ్ఞానం ఒక్కటీ ఉంటే సరిపోదు.అవసరానికి మనము నేర్చుకున్నది ఆచరణలో పెట్టలేకపోతే ,ఆ జ్ఞానము వ్యర్థము. ఇది యధార్థము.
Advertisements

బాలగోవిందం -ఎనిమిదవ శ్లోకము

ఎనిమిదవ శ్లోకము
bg8a

కా తే కాంతా కస్తే పుత్రః

సంసారో‌உయమతీవ విచిత్రః |

కస్య త్వం వా కుత ఆయాతః

తత్వం చింతయ తదిహ భ్రాతః

|| భజగోవిందం భజగోవిందం ||8||

 

అనువాదం

ఎవరు నీ సతి?ఎవరు నీ సుతుడు?

చిత్రం,సోదర! ఈ సంసారం!

ఎవరివాడ?వెవ్వడ?వెటు వచ్చితి?

చేయుము ఇక్కడె తత్వ విచారం

|| భజగోవిందం భజగోవిందం ||8||

 

తాత్పర్యం :

ఎవరు నీ  భార్య ? నీ కుమారుడు ఎవరు ? అంతా విచిత్రమైన సంసారము .ఎవరివాడివి నీవు ? ఎక్కడ నుంచి వచ్చావు ? తమ్ముడూ !ఆ సత్యాన్ని ఇక్కడే విచారించు . ఇప్పుడే ఆలోచించు.గోవిందుని భజించు .గోవిందుని కీర్తించు .ఓ మందమతి గోవిందుని సేవించు.

విద్యార్థుల కొరకు కథ:-   ఏనుగు  త్రాడు

విలువ : ఆశావాదము.

ఉపవిలువ :తన శక్తీ సామర్ధ్యములను తన ఆంతరంగిక  శక్తిని ,స్వేచ్ఛను  తెలిసికొనుట.

ఒక అతను మార్గము మీద నడుస్తూ  వెళుతున్నాడు. దారిలో అతనికి ఒక ఏనుగుల గుంపు కనపడింది. విచిత్రం ఆ ఏనుగులన్నీ కదలక అట్లాగే నిలబడివున్నాయి. ఇతనికి ఆశ్చర్యం వేసింది యివన్నీ ఎందుకిట్లా వున్నాయి అని. తీరా పరిశీలిస్తే ప్రతి ఏనుగు కుడికాలుకు ఒక త్రాడు కట్టబడి ఉంది. అవేమి వేరే త్రాళ్లతో కట్టి లేవు. ఎదురుగా  “వల ” అట్లాంటివి ఏమి లేవు. ఏనుగు కావాలనుకుంటే ఆ ఒక్క కాలికి కట్టిన త్రాటిని నిమిషంలో తెంపుకొని వెళ్లగలవు. కారణం  తెలియదు  కానీ అన్ని ఏనుగులు నిలబడి ఉన్నాయి. ఇంతలో ఎదురుగా ఏనుగుల ట్రైనర్ కనిపించాడు. ఈ బాటసారి ఆ ట్రైనర్ దగ్గరకి  వెళ్ళి ఏనుగులు కదలక పోవటానికి కారణం ఏమిటని అడిగాడు. అప్పుడు అతను ఇట్లా చెప్పాడు.” ఏనుగు పిల్లలు  అటు ఇటు  పోకుండా ముందు కాళ్ళకి  త్రాడు కట్టి వుంచేవాళ్ళము. ఆ త్రాడు ఒక పెద్ద స్తంభానికి ముడి వేసేవాళ్ళము. అవి ఎక్కడకి కదలలేకపోయేవి.

చిన్నప్పటి  అలవాటు వల్ల కాలికి త్రాడు కడితే చాలు ఇక కదలలేము అనే భావన వారికి పెద్దైనా  సరే , ఆ కట్టుబాట్లు ,నియతి ఉన్నవని భావించి అలాగే ఉంటాయి. అవి తెంచుకొని పోవచ్చు అనే ఆలోచన వాటికి రాదు” అన్నాడు . అంత శక్తివంతమైన ఏనుగు కు ఆ  త్రాడు తెంపుకొని పోవటం ఎంత పని. ఆ బంధం  నుంచి తేలికగా తెంపేసుకొని ,స్వేచ్ఛగా ఉండవచ్చు. కానీ అవి  ఏ మాత్రం ఆలోచన లేకుండా అక్కడే బంధాలున్నాయి అనుకోని బంధింపబడ్డట్టు భావిస్తున్నాయి. ఎందుకంటే చిన్నతనంలో బంధాలకు అలవాటు పడిపోయాయి.  బంధ విముక్తి కావచ్చనే ,ఆలోచన వాటికీ కలుగదు. మానవులకు , చిన్నతనం నుంచీ బంధాలైన రాగ ద్వేషాలలో చిక్కుకొని ,వాటి నుంచి బైటపడాలనే తలపే రాదు.

నేర్చుకోవలసిన విషయము:

ఈ ఏనుగుల లాగానే మనం కూడా ఏమి చేయలేము అనే ఒక నమ్మకం ఫై ఆధారపడి ఉంటాము. ఎందుకంటే ఎపుడో ఒక సారి సన్నివేశములో అపజయం అనుభవించాము. ఎన్ని సంవత్సరములు గడిచిన , ఆ అపజయం భావమువల్ల మనం ఈ పనులు చేయట యందు సమర్ధత లేదు అనే ఒక నిర్ణయమును గట్టిగ పట్టుకొని అదే సత్యం అనుకుంటాము. అంతే కాదు మన ఆలోచనలను ,శక్తినీ  పరిమితం చేసుకుంటు ఉంటాము. కొన్ని పనులకు మనం సరిపోము. అనే నిర్ధారణ చేసుకుంటాము.

ఈ అపజయాలన్నిటినీ మనం మెట్టుగా భావించి వాటి నుంచి ఏం నేర్చుకున్నామో ఆలోచించి ఉన్నతమైన స్థానం  వైపు  క్రమక్రమంగా సోపానాలను అధిగమిస్తూ సాగిపోవాలి. అపజయం వల్ల మనం ఏది వదిలేయాలా? ఏవి సమకూర్చుకోవాలి ? చేసిన పనిలో లోటుపాట్లు గుర్తించి ,ఆ సంఘటనను , ఒక ప్రేరణగా భావించి ,మన  గమ్యమును   చేరుకోటానికి సాధనగా ఉపయోగించుకోవాలి. ఏ రకంగా విజయం సాధించాలి అని ఆలోచించాలి.  మనం మన ప్రపంచాన్ని చిన్న సందర్భమునకు పరిమితం చేయవద్దు. మన మానసిక హద్దులను ఛేదించి ఈ విశాల ప్రపంచం అంతా  వ్యాపింప చేసుకుందాము. ఒక చిన్న సంఘటనతో జీవితం అంతా మూసుకుపోకూడదు. మనం మన నమ్మకమును, హృదయమును,మనమీద, మన శక్తి పై పెట్టినప్పుడు  విజయం మనదే.  ఇంకొక  విషయం ఏమిటంటే, మన మనస్సును, విశాల దృక్పదంతో ఆలోచించకుండా ఏది  బంధిస్తుందో, దాని నుంచి బైట పడాలి.ఏ ఆలోచనలు  మన స్వేచ్ఛను ,శక్తీ ని అడ్డుకుంటున్నాయో గమనించి వాటిని వదిలేయాలి “అన్ని నేనే  , అంతా నాదే అనే దృక్పధం కలిగి ఉండాలి. మన భావాల్ని  నిర్బందించే ఆలోచనలని తొలగించుకోవటానికి  కృషి చెయ్యాలి. ఎప్పుడైతే  అలాంటి బంధించే  ఆలోచనల నుంచి స్వేచ్ఛ వచ్చిందో , మనము  ఎంతో సంతోషంగా  ప్రశాంతంగా ఉండగలుగుతాము.

విద్య విద్యార్థుల జీవితంలో అత్యంత ప్రాధాన్యమైనది. దానివల్ల జ్ఞాన సముపార్జన మాత్రమే  కాక అనేక ఇతర కళల యందు ప్రావీణ్యమును యిస్తుంది. దీనితో  పాటు మానవతా విలువలు పెంచే విద్య చాల అవసరము. దీనివల్ల మనిషి సంపూర్ణ అభివృద్ధి చెంది జీవితము సంతోషంతో ప్రశాంతంగా గడపగలుగుతాడు.  పిల్లల్లో పోటీ మంచిదే. దానివల్ల వారు లక్ష్యసాధనకు  మార్గము , ఎంచుకొని కృషితో లక్ష్య సాధన పొందుతారు.  మన స్వాధీనంలో వున్నది అంకిత భావం తో ఆ పని నిర్వర్తించటమే . ఆ పని ఫలితాలపై మనకు ఎంటువంటి నియంత్రణ లేదు. ఒక లక్ష్య సాధనకు పూనుకున్నప్పుడు మధ్యలో ఎన్ని  ఆటంకాలు వచ్చిన , భయాలు, కలిగిన బద్ధకం వచ్చిన ,ఆ పనిని మధ్యలో చేయకుండా వాయిదా వేసిన మొదలగున్నవన్నీ , మన లక్ష్యం వైపు చేరనీయవు.  ఉదాహరణకు సోషల్ మీడియా వల్ల  దారి మళ్ళి విలాసాలపై మనసు మళ్లే అవకాశం వుంది. బద్ధకం వల్ల పనిని రేపు, రేపు చేయచ్చు అని ఆ పని ప్రాముఖ్యత గుర్తించకుండా ,వాయిదా వేసే పద్ధతి వస్తుంది .  ఏవి మొదట్లో చాల సౌకర్యంగా, సంతోషంగా అనిపిస్తాయి. మన పనులు చేసే విషయంలో శ్రద్ధ లేక మన పనుల కొరకు , వేరే వారిమీద ఆధారపడినప్పుడు ,వేరే విషయాలమీద  ఆధారపడినప్పుడు మనల్ని మన అత్త్యున్నతమైన  లక్ష్యం నుంచి దూరం అవుతాము. చిన్నతనంలోనే యివి గుర్తించి బైటపడటం తేలిక. కానీ పెద్ద అయినతరువాత మెల్ల మెల్లగా ప్రయత్నం మీద వీటినుంచి బైట పడే మార్గము తెలిసికొని ,చేస్తున్న తప్పును గ్రహించి సరిదిద్దుకొనే అవకాశాలని సృష్టించుకుని  మన లక్ష్య సాధనకై దిశా నిర్ధేశం చేసుకుంటే తప్పకుండ అనుకున్నది సాదిస్తారు.

 

అర్జునుడు మరియు బ్రాహ్మణుడి కథ .

krishna-arjuna

 

విలువ — ప్రేమ

అంతర్గత విలువ — స్వార్ధం లేని సేవ.

కృష్ణ పరమాత్మ మరియు అర్జునుడు నడుస్తూ ఉండగా, త్రోవలో ఒక బీద బ్రాహ్మణుడు కనిపించాడు. బ్రాహ్మణుడి దీన పరిస్థితిని  చూసి, అర్జునుడు ఒక సంచీలో బంగారు నాణాలు ఇచ్చారు.బ్రాహ్మణుడు సంతోషంగా ఇంటికి వెళుతుండగా, దారిలో దొంగలు బంగారు నాణాల సంచీని దొంగిలించారు. బ్రాహ్మణుడు నిరాశతో మళ్ళీ  అడుక్కోవడానికి రొడ్డున పడ్డాడు. కృష్ణ పరమాత్మ మరియు అర్జునుడు, బ్రాహ్మణుడి కథ విన్నారు. అర్జునుడు బ్రాహ్మణుడి దీన పరిస్థితి చూసి, అతనికి ఒక పెద్ద వజ్రమును ఇచ్చాడు.

       బ్రాహ్మణుడు వజ్రాన్ని ఇంటికి తీసుకుని వెళ్లి, దానిని  ఒక పాత కుండ లోపల జాగ్రత్తగా దాచాడు. బ్రాహ్మణుడి భార్య మంచి నీళ్లు తేవడానికి రోజూ చెరువు దెగ్గరకి   వెళ్ళేది . కాని ఆ రోజు , తీసుకుని వెళ్లిన కుండ పగిలి పోవడం వల్ల, ఇంట్లో ఉన్న ఒక పాత కుండను తీసుకుని వెళ్ళింది. కుండ చెరువులో ముంచ గానే, దాంట్లో ఉన్న వజ్రము నీళ్ళల్లో మునిగిపోయింది.బ్రాహ్మణుడు పాత కుండ కోసం వెతికి, భార్య ఇంటికి తిరిగి రాంగానే,ఆమె  చెప్పింది విని, వజ్రము పోగొట్టుకున్నాను అని తెలుసుకుని ఎంతో బాధపడ్డాడు.

నిరాశతో మళ్ళీ  అడుక్కోవడానికి రొడ్డున పడ్డాడు. కృష్ణ పరమాత్మ మరియు అర్జునుడు, బ్రాహ్మణుడి పరిస్థితిని తెలుసుకున్నారు.  అర్జునుడు ‘నేను ఇంక ఈ బ్రాహ్మణుడికి సహాయము చెయ్యలేను ‘అని అన్నాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ ఆ బ్రాహ్మణుడికి  రెండు పైసలు ఇచ్చారు.అది చూసి అర్జునుడు అనుమానంతో ‘నేను బంగారు నాణాలు, వజ్రము ఇచ్చాను కాని ఈ బ్రాహ్మణుడి దారిద్య్రము  ఎంత మాత్రము తీరలేదు. మీరు ఇచ్చిన ఈ రెండు పైసలు ఏమి చెయ్యగలవు ?’ , అని ప్రశ్నించాడు. దానికి కృష్ణ పరమాత్మ నవ్వుతూ ‘చూద్దాము’  అని అన్నారు.

         బ్రాహ్మణుడు తన దారిద్య్రమును   నిందించుకుంటూ నడుస్తుంటే, త్రోవలో ఒక చేపలు పట్టే వాడి దెగ్గెర, ఆతను అప్పుడే పట్టిన చేపను చూశాడు. ఈ రెండు నాణాలు అతనికి అంతగా ఎలాగూ పనికిరావనుకుని ,కనీసం  వాటితో ఆ గిలగిలా కొట్టుకుంటున్న ఆ చెప్పాను విడిపిద్దాము అనుకున్నాడు.ఆ రెండు పైసలు జాలరికి ఇచ్చి,చేపను కొనుక్కున్నాడు. చేపని నదిలో వదిలి పెట్టడానికి ప్రయత్నిస్తుంటే, గొంతులో ఏదో అడ్డుకుని ఆ చేప  కష్టపడటం గమనించాడు.బ్రాహ్మణుడు చేపని ఆ అవస్థ నుంచి కాపాడదామని అనుకున్నాడు. దాని గొంతులో అడ్డుకున్న పదార్ధము తీసే ప్రయత్నము చేశాడు. తీరా చూస్తే అది తను పోగొట్టుకున్న వజ్రమే.

బ్రాహ్మణుడు సంతోషంతో పరుగులు పెట్టాడు. ‘దొరికింది దొరికింది ‘ అని ఎంతో  ఉత్సాహంతో పెద్దగా అరవటం మొదలుపెట్టాడు. అప్పుడు అదే త్రోవలో నడుస్తున్న , బంగారు నాణాలు దొంగిలించిన దొంగ, బ్రాహ్మణుడి అరుపులు విని భయపడి, సంచీని వదిలేసి పారిపోయాడు. బ్రాహ్మణుడు తనకి తిరిగి లభించిన  ధనంతో సంతోషంగా అర్జునుడి దెగ్గెరకి వెళ్లి తనకి జరిగిందంతా చెప్పి,తన ధన్యవాదములను తెలిపాడు.ఇదంతా చూసి ఆశ్చర్యంతో అర్జునుడు ,”హే కృష్ణా! ,నేను ఇచ్చిన బంగారు నాణాలు కాని ,వజ్రము కాని ఈ బ్రాహ్మణుడికి ఏ మాత్రము ఉపయోగ పడలేదు  అలాంటిది నీవు ఇచ్చిన రెండు నాణాలు అతనికి ఎలా సహాయ పడ్డాయో నాకు అసలు అర్ధం కావాటంలేదు. దయచేసి వివరించు “ అని అర్ధించాడు.

           అప్పుడు, కృష్ణ పరమాత్మ ఇలా సమాధానం చెప్పారు ‘అర్జునా ! ఆ బ్రాహ్మణుడు బంగారు నాణాలు, వజ్రము ఉన్నప్పుడు తన గురించే ఆలోచించుకున్నాడు. కాని,  కేవలము రెండు పైసలు మాత్రమే ఉన్నప్పుడు , వాటితో ఎవరికైనా సహాయం చేద్దాం”, అని అనుకున్నాడు’,నిజం ఏమిటి అంటే ‘కష్టపడుతున్న వాళ్ళకి సహాయం చెయ్యడమంటే  భగవంతునికి సేవ చేయడమే. మనకంటే ముందు వేరే వాళ్ళ బాగోగుల గురించి ఆలోచించి వారిని ప్రేమించినప్పుడు, మనల్ని భగవంతుడు తప్పక కాపాడుతాడు’. మన యోగక్షేమాలని ఆయనే చూసుకుంటారు.

నీతి :

ఏపనిలో నైనా, ఫలితం ఆశించకుండా, స్వార్ధం లేకుండా చెయ్యాలి. స్వచ్ఛమైన  ప్రేమ మరియు స్వార్ధం లేని సేవా గుణాన్ని పెంచుకుందాం.

https://saibalsanskaar.wordpress.com/2015/08/03/selfless-service-story-of-arjuna-and-the-brahmin/

htps://facebook.neetikathalu.com

వినయము గల నాందేవ్.

 namdev

 

చిన్న వయసులోనే నాందేవ్ కి  పండర్ఫుర్ భగవాన్ విఠలుడి సాక్షాత్కారం కలిగింది.ఎంత అదృష్టమో కదా ! ‘నేను ఎంతో అదృష్టమంతుడిని ‘ అని అనుకునేవాడు నాందేవ్.నాందేవ్ కి ఒక గురువు యొక్క అవసరం ఉందనుకు న్నాడు భగవంతుడు.

గ్రామంలో సాధు-గోరా అనే ఒక కుమ్మరి ఉండేవాడు.ఒక సారి ఆ గ్రామంలో ఉన్న వారందరిని పిలిచి ఒక విందు ఏర్పాటుచేశారు.  వారందరినీ గోరా పరీక్షించడం జరిగింది.అదెలా అంటే జ్ఞానేశ్వర్ గ్రామంలో ఉన్న సాధులు అందరి దెగ్గిర ఉన్న ‘కుండ’, బ్రహ్మ జ్ఞానం తో నిండి ఉందా లేదా అని గోరాని చూడమన్నాడు. సాధువులు అందరూ కూర్చున్నారు, గోరా తల మీద కుండను కర్రతో కొట్టి, పరీక్షించ సాగాడు. కానీ నాందేవ్ ఈ పరీక్షకి ఒప్పుకోలేదు. సాధువులు అందరూ నాందేవ్ ని  ‘సగం ఉడికిన కుండ ‘ అని ఎక్కిరించారు. అప్పుడు విఠలుడి దెగ్గిరకి వెళ్ళాడు నాందేవ్. విఠలుడు నాందేవ్ ని  ఓదార్చి, మహాత్ములు, సాధువుల చర్యలు అర్ధం అవ్వాలి అంటే పరిపూర్ణమైన  జ్ఞానము కలగి ఉండాలి అని అన్నారు. ఆ జ్ఞానము కలగడం కోసం,శివుడి గుడిలో ఉన్న విశోభా కేచరా అనే గురువు దెగ్గిరకి నాందేవ్ ను వెళ్ళమని పంపించాడు విఠల దేవుడు.

                తీరా నాందేవ్ గుడిలోపలికి వెళ్ళగానే, అక్కడ ఆ పెద్దాయన, తన రెండు కాళ్ళను శివలింగము పైన పెట్టుకుని పడుకుని ఉన్నాడు .అది చుసిన నాందేవ్, ఆ పెద్దాయనని తట్టి లేపాడు. నిద్దర లేచి నాందేవ్ ని  చూడగానే ‘నిన్ను విఠలుడు ఇక్కడికి పంపించారు కదా ‘ అని అడిగారు. నాందేవ్ ఆశ్చర్య పోయి, ఈ పెద్దాయన మాములు మనిషి కాదు అని అనుకున్నాడు.

                    ‘మీరు చాలా పెద్ద మనిషి లాగా కనిపిస్తున్నారు కాన, ఎందుకు రెండు కాళ్ళు  శివలింగము పైన పెట్టుకుని పడుకున్నారు “, అని అతనిని నాందేవ్ ప్రశ్నించాడు. దానికి  ఆ పెద్దాయన ‘ఓ అలాగా ! నేను చాలా అలిసిపోయి ఉన్నాను, కొంచం నా కళ్ళు శివలింగము పైనుంచి తీసి కింద పెట్టమని అడిగారు. అప్పుడు నాందేవ్ ఆ పెద్దాయన కాళ్ళు పట్టుకుని, ఎటువైపు పెట్టినా, అక్కడ శివలింగము ఆవిర్భవించింది (ప్రత్యక్షమయింది). ఆఖరికి నాందేవ్,గురు విశోభా కేచరా కాళ్ళను  తన ఒడిలో పెట్టుకున్నాడు. అలా చేసి నాందేవ్ శివతత్వ అనుభూతిని  పొందాడు.

                 ఈ కథలో మనం గమనించ వలసినది  ఏమిటి అంటే, నాందేవ్ గురువుకి శరణాగతుడు అయ్యి, గురు పాదాలని పట్టుకోవడం వల్ల శివతత్వాన్ని, జ్ఞానాన్ని పొందగలిగాడు. గురు విశోభా కేచరా, నాందేవ్ ని  ఆశీర్వదించి పంపించారు. నాందేవ్ తన గ్రామానికి తిరిగి వచ్చి, ఇంట్లోనే సమయం గడిపాడు. ఇది గమనించిన భగవాన్ విఠలుడు, నాందేవ్ ని చూడడానికి తన ఇంటికె వచ్చి,”నాందేవ్  నీవు గుడికి వచ్చి చాలా కాలం అయింది” రాకపోటానికి కారణం ఎమిటి అని ప్రశించాడు. ఆ ప్రశ్నకి నామదేవ్ వినయంగా “స్వామి! మీరు అంతటా వ్యాపించి ఉన్నారు’. మీరు లేని చోటంటూ ఏదైనా ఉందా? “ మీరు  వేరు నేను వేరు కాదు ,మీరు లేక ,మీకు దూరంగా నేను జీవించగలనా ? “అని బదులు చెప్పాడు.

ఇది తెలియడానికే, భగవాన్ విఠలుడు నాందేవ్న  గురు విశోభా కేచరా వద్దకి పంపించారు.

htps://facebook.neetikathalu.com

https://saibalsanskaar.wordpress.com/2015/07/31/namdev-humbled/