Archive | October 2015

రెండు కుక్కల కధ!!!

విలువ: సత్ప్రవర్తన

ఒకసారి ఒక చోట రెండు కుక్కలు కలిసి నడుస్తూ వెళుతున్నాయి. మొదటి కుక్క ఒక గదిలోనికి వెళ్ళి అనందంతో తోక ఊపుతూ బయటికి వచ్చింది. కొంతసేపటికి రెండవ కుక్క కూడా అదే గదిలోనికి వెళ్ళి కోపంతో అరుస్తూ బయటికి వచ్చింది.

ఈ రెండు కుక్కలను గమనిస్తూ ఉన్న ఒక స్త్రీ ఆ గదిలో ఒక కుక్కని ఆనందంగా, రెండవ కుక్కని కోపంగా ప్రవర్తించటానికి కారణం ఏముందో చూడటానికి ఆ గదిలోనికి వెళ్ళింది. ఆమెకి అమితమైన ఆశ్చర్యమును కలిగిస్తూ ఆ గదిలో అంతా అద్దాలు అమర్చబడి ఉన్నాయి.
సంతొషంగా ఉన్న కుక్క వెయ్యి అనందంగా ఉన్న కుక్కలను ఆ అద్దాలలో చూసింది. కొపంగా ఉన్న కుక్క తనవైపు కోపంగా చూస్తూ ఉన్న వేయి కుక్కలన్ను ఆ అద్దాలలొ చూసింది.

నీతి: ఈ ప్రపంచంలో మనం చూస్తున్నది మన ప్రతిబింబమునే. మనం నిదానంగా, ప్రశాంతంగా ఉంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం కూడా ప్రశాంతంగా ఉంటుంది.

https://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

Advertisements

కలలను వ్యాఖ్యానించిన పక్షి

విలువ: అహింస
ఉపవిలువ: సానుకూల భావములు

 

King dreaming

రాజు అనబడే ఒక యువరైతు తన పొలంలో చాలా కష్టపడి పనిచేసేవాడు. ఒక రోజు సాయంకాలం రాజుగారు ఒక దండోరా వేయించారు “రాజు గారికి వచ్చిన కలకు సరైన అర్ధం చెప్పగలిగినవారు ఏవరైనా సరే వారికి నూరు బంగారు నాణెములు బహుమతిగా ఇవ్వబడతాయి” అని. రాజుగారికి కలలో “ఒక తోడేలు తన ఒడిలోనికి గట్టిగా అరుస్తూ దూకింది.” నాకు ఈ కలకి అర్ధం తెలిస్తే బాగుండును అని తనలో తానే గొణుక్కున్నాడు రాజు. “నీకు వచ్చిన బహుమానంలో సగం నాకు ఇస్తే రాజుగారికి వచ్చిన కలకి అర్ధం చెపుతాను” అన్నది ఒక చిన్న పక్షి రాజుతో. రాజు అందుకు అంగీకరించాడు. “తోడేలు మోసానికి గుర్తు. అందువలన రాజుగారిని జాగ్రత్తగా ఉండమని చెప్పు.” అన్నది పక్షి.
రాజు వెళ్ళి రాజుగారితో ఈ కలకి అర్ధం చెప్పి బహుమానాన్ని పుచ్చుకున్నాడు. “కాని, ఇప్పుడు ఈ బహుమతిలో సగభాగం ఆ పక్షికి ఇచ్చెయ్యాలి కదా!” అనుకున్నాడు రాజు. అతను తన మనస్సును మార్చుకుని పక్షిని తప్పించుకుని వెళ్ళిపోయాడు.
అతడు ఆ డబ్బును తెలివిగా ఖర్చుపెట్టి, బాగా ధనవంతుడు అయ్యాడు. ఐదు సంవత్సరములు గడిచాయి. ఒకరోజు సాయంకాలం రాజుగారి సైన్యాధికారి రాజు ఇంటికి వచ్చి రాజుతో “రాజుగారికి మళ్ళి కల వచ్చింది. కలలో రక్తంతో తడిసిన ఒక బాకు రాజుగారి తలచుట్టూ తిరుగుతూ కనిపించింది.” భయపడిపోయిన రాజు పక్షి కోసం వెతుక్కుంటూ వెళ్ళాడు. మర్రిచెట్టు దగ్గరకి వెళ్ళగానే అతనికి సుపరిచితమైన కంఠధ్వని వినిపించింది. “నేను కలకి అర్ధం చెపితే నీకు వచ్చే బహుమానంలో సగం నాకు ఇస్తావా?” అన్నది పక్షి. ఇస్తానని ప్రమాణంచేసాడు రాజు. “బాకు హింసకి చిహ్నం కనుక రాజుగారు సరైన రక్షణలో ఉండాలని” చెప్పింది పక్షి. ఈసారి రాజుకి బహుమతిగా 1000 బంగారు నాణెములు లభించాయి.
ఈసారి కూడా అతనికి తన బహుమానంలో సగభాగం ఇచ్చిన మాట ప్రకారం పక్షికి ఇవ్వాలని అనిపించలేదు. కాని, ఒకవేళ ఈ పక్షి వెళ్ళి రాజుగారికి అసలు విషయం చెప్పేస్తే! అని భయం కలిగి పక్షి పైకి ఒక రాయి విసిరాడు. అదృష్టవశాత్తు పక్షికి ఎటువంటి గాయము కాలేదు. ఆ పక్షి ఎగిరిపోయి తప్పించుకున్నది. అలా ఏళ్ళుగడుస్తున్నకొద్దీ రాజు అసలు ఈ విషయమే మరచిపోయాడు. మళ్ళి రాజుగారికి మరొక కల వచ్చేదాకా. ఈసారి రాజుగారికి కలలో “తన ఒడిలో ఒక పావురం ఉన్నట్లుగా” కనిపించింది. మళ్ళి రాజు పక్షి దగ్గరికి వెళ్ళి పావురం అంటే “శాంతికి చిహ్నం” అని అర్ధం తెలుసుకున్నాడు. ఈసారి రాజుకి 10,000 బంగారు నాణెములు లభించాయి.

ఈసారి అతను తనకు వచ్చిన బహుమానం మొత్తాన్ని పక్షికి ఇచ్చేసాడు. కాని, పక్షి తనకు వద్దని చెప్పింది. “దయచేసి నువ్వు నన్ను క్షమించానని మాత్రం చెప్పు” అన్నడు రాజు. “మొదటిసారి వాతావరణంలో మోసం ఆవరించిఉండటం వలన నీవు నన్ను మోసం చేసావు. రెండవసారి వాతావరణంలో హింస వ్యాపించి ఉండటంవలన నీవు కూడా హింసాత్మకంగా ప్రవర్తించావు. ఇప్పుడు అంతటా నమ్మకం, శాంతి వ్యాపించి ఉండటంవలన నీవు కూడా దానికి తగిన విధంగానే ప్రవర్తించావు. కొద్దిమంది మాత్రమే తమ అంతరంగమును అనుసరించి ప్రవర్తించగలరు” అన్నది పక్షి.
నీతి: తరచుగా మనం మనచుట్టూ ఉన్న వాతావరణం, వ్యక్తుల వలన ప్రభావితమవుతూ ఉంటాము. సానుకూలధోరణి కల వ్యక్తుల మధ్య ఉంటే మనలో సానుకూలధోరణి పెంపొందుతుంది. వ్యతిరేక భావాలుకల వ్యక్తులు, పరిస్థితులు మనని క్రుంగ దీస్తాయి. అందువల్ల మనం సానుకూల ధోరణి పెంపొందించే వ్యక్తుల సాంగత్యంలో గడపాలి. ఇలా అనుకున్నప్పటికీ మనం మరింత వ్యతిరేక పరిస్థితులలో, వ్యతిరేక ధోరణి కల వ్యక్తుల సాంగత్యంలో పడిపోవచ్చును. అందువల్ల ఇలాంటి పరిస్థితులలోనే మనకి ఇటువంటి వ్యక్తులకు, పరిస్థితులకు లొంగనటువంటి “స్వంతబుద్ధి” కావాలి. ఎటువంటి సవాళ్ళనైనా, ఎటువంటి వ్యతిరేక పరిస్థితులనైనా ఎదుర్కొనగల ఆత్మశక్తిని అభివృద్ధి చేసుకోవాలి. ప్రార్ధనలు, శాస్త్రపఠనం, ఆధ్యాత్మిక సాధనలు, చైతన్య స్ఫూర్తిని కలిగించే కార్యములు చేయటం మనకి సానుకూల ధోరణి పెంపొందించే మార్గమును చూపిస్తాయి. అంతేకాకుండా మనకి అదుపులో లేని విషయాన్ని ఎదుర్కొనగల శక్థిని కలిగిస్తాయి. అయితే ఈ నేర్చుకున్నవన్నీ ఆచరణలో పెట్టగలిగినప్పుడే ఇది సాధ్యం అవుతుంది.

 

https://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

సామాజిక స్పృహ

విలువ: సత్యం

అంతర్గత విలువ: ఆశావాదం

ఒక రాజు తన రాజ్యంలో ప్రజల క్షేమసమాచారాలు తెలుసుకోవడానికి వారి ప్రవర్తన పరిశీలించడానికి మారువేషంలో బయలుదేరాడు. ఒక పెద్ద బండరాయిని దారికి అడ్డంగా పెట్టి ఏమి జimageరుగుతుందో అని పక్కనుండి గమనించసాగాడు. చాలా మంది దాన్నిచూసి కూడ పక్కనుండి వెళ్ళిపోతున్నారు. కొంతమంది దాన్నిచూసి పక్కకు తీసే ప్రయత్నం చెయ్యకుండా, రోడ్లు శుభ్రంగా ఉంచలేదని రాజుని నిందించసాగారు.

తరవాత ఒక రైతు కూరగాయల తట్ట మోసుకుంటూ ఆ దారిన వచ్చాడు. రోడ్డుకి అడ్డంగా ఉన్న రాయిని చూసి తన తట్ట పక్కకు పెట్టి అతికష్టం మీద దాన్ని పక్కకు తొలగించాడు. దానికింద ఒక సంచి ఉండడం గమనించాడు. అది ఏమిటా అని తీసిచుస్తే దానిలో బంగారు నాణాలు, ఒక చీటీ కనిపించాయి. అందులో ఇలా రాసిఉంది. “ఈ దారిలో అడ్దం తొలగించినవారికి ఈ బంగారు నాణాలు తీసుకొవడానికి అర్హులు” . అవి తీసుకుని ఆ రైతు తన దారిన తాను వెళ్ళిపోయాడు.

నీతి:

సామాజిక స్పృహ కలిగి ఎవరయితే తమ పరిసరాల పట్ల బాధ్యతనెరిగి ప్రవర్తిస్తారో ఉంటారో వారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది.

https://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

మనకు సహాయ పడిన వారి విషయం లో ఎప్పుడూ కృ త జ్ఞ త కలిగి ఉండాలి !!

విలువ :సత్ప్రవర్తన

అంతర్గత విలువ :మర్యాద

image

ఒక పది సంవత్సరాల పిల్లవాడు ఒక రెస్టా రెంటు కు వెళ్లి ఒక టేబుల్ దగ్గర కూర్చున్నాడు ఆ రోజుల్లో ఐస్ క్రీమ్ చాల చౌక ఇంతలో అక్కడ సప్లయర్ గా ఉన్న అమ్మాయి వచ్చి ఒక గ్లాస్ మంచినీళ్ళు టేబుల్ మీద పెట్టి ఏమి కావలి అని అడిగింది రెస్టా రెంటు కొంచెం రద్దీ గా ఉంది అన్ని టేబుల్స్ వద్ద జనం ఉన్నారు. స్పెషల్ ఐస్ క్రీం ధర ఎంత అని అడిగాడు ఏభై సెంట్లు అని ఆమె సమాధానం చెప్పింది ఆ పిల్లవాడు తన జేబులో ఉన్న చిల్లర తీసి లెక్క పెట్టుకుని మామూలు ఐస్ క్రీం ధర ఎంత అని అడిగాడు ముప్ఫై అయిదు సెంట్లు అని ఆ అమ్మాయి కొంచెం విసుగ్గా సమాధానం చెప్పింది ఆ పిల్లవాడు తన దగ్గర ఉన్న చిల్లర మరొక సారి లెక్క పెట్టుకుని అయితే నాకు మామూలు ఐస్ క్రీమ్ కావాలి అని చెప్పాడు ఆ అమ్మాయి ఐస్ క్రీమ్ తెచ్చి ఇచ్చింది బిల్లు టేబుల్ మీద పెట్టి వెళ్లి పొయిం ది ఆ పిల్లవాడు ఐస్ క్రీమ్ తిని క్యాషియర్ దగ్గరకు వెళ్లి బిల్లు చెల్లించి వెళ్ళిపోయాడు మరికొంత సేపటి తరువాత టేబుల్ శుభ్రం చేయడానికి వచ్చిన ఆ అమ్మాయి ఖాళీ ఐస్ క్రీమ్ డిష్ ప్రక్కన పెట్టి ఉన్న పది సెంట్ల నాలుగు పెన్నీలు చిల్లర చూసి ఏడుపు ముఖం పెట్టింది ఆ అబ్బాయి స్పెషల్ ఐస్ క్రీం తింటే తన దగ్గర ఉన్న డబ్బులు ఆ అమ్మాయికి టిప్ ఇవ్వడానికి చాలవని మామూలు ఐస్ క్రీమ్ మాత్రమె తిని వెళ్లి పోయాడు
నీతి :మనకు సహాయపడిన వారితో మనం మర్యాద గా మెలగాలి. వాళ్ళు  చేసిన సహాయం గుర్తు పెట్టుకోవాలి అలా ఉన్నప్పుదే సహాయం చేసినవారికి పొందినవారికి కూడా తృ ప్తి సంతోషం మిగులుతాయి

https://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

పల్లెటూరి ఎలుక, పట్టణం ఎలుక; విలువ : సత్యం, అంతర్గత విలువ: తృప్తి

ఒక రోజు ఒక పట్టణం ఎలుక తన బంధువును కలవడానికి పల్లెటూరు   వెళ్ళింది.

పట్టణం నుంచి వచ్చిన తన బంధువును చూసి పల్లెటూరు ఎలుక చాలా సంతోషించింది. అతిధి మర్యాదలు చేయడానికి ఎక్కువ లేకపోయినా  తన దగ్గర  వున్న స్వల్పాహారంతో జున్ను ముక్క, పళ్ళు పెట్టి ఎంతో మర్యాద చేసింది.

picture6పట్టణం ఎలుక  జున్ను ముక్క చూసి, “ఇదేంటి? నువ్వు ఇంకా జున్ను ముక్కల మీదే బతుకుతున్నావా? నా మాట విని నాతో పట్నం వచ్చేయి. అక్కడ రోజూ  విందు భోజనం తినొచ్చు. ఎంత కాలం ఇలా పేదరికంలో గడిపేస్తావు?” అని అడిగింది.

ఈ మాటలు విని ఆశ కలిగిన పల్లెటూరి ఎలుక పట్నం వెళ్ళడానికి తయారు అయ్యింది. రెండు ఎలుకలూ రోజంతా ప్రయాణం చేసి బాగా ఆకలి మీద పట్నం చేరుకున్నాయి.

పట్నం ఎలుక గర్వంగా తను ఉంటున్న ఇంట్లో వంట గదికి తీసుకువెళ్ళింది. అక్కడ ఇంట్లోవాళ్ళు వండుకున్న భోజనం ఇద్దరు ఎలుకలకు పండగ రోజు తినే విందు భోజనంగా అనిపించింది.

పల్లెటూరి ఎలుక, “నువ్వు నిజమే చెప్పావు! మా వూరిలో మనుషులు ఎప్పుడో పండగలకు తప్ప ఇలా వండుకోరు . పొద్దున్నే పొలానికి వెళ్ళే హడావిడిలో చద్దన్నం తిని వెళ్ళిపోతారు. ఇది చాలా బాగుంది” అంటూ ముందు ఏమి తిందామా అని చుట్టూరా చూసుకుంది.

కాని ఎలుకలు భోజనం ముట్టుకునే లోపల ఒక భయంకరమైన శబ్దం విని పించింది. పల్లెటూరి ఎలుక కంగారు పడి, “ఆ చప్పుడు ఏమిటి?” అని అడిగింది.

“ఇంటి కుక్కలొస్తున్నాయి, త్వరగా దాక్కో!” అంటూ పట్నం ఎలుక ఒక కన్నంలోకి దూరింది. వెనుకే పల్లెటూరి ఎలుక కూడా దూరింది. “ఇలా ఎంత సేపు?” అని అడిగింది.

“అవి అలా వస్తూనే వుంటాయి. అవి చూడనప్పుడు మనకి కావాల్సిన ఆహారం ఈ కన్నంలోకి తెచ్చుకుని హాయిగా తినచ్చు” అని పట్నం ఎలుక జవాబు చెప్పింది.

ఇది విన్న పల్లెటూరి ఎలుక, “భయపడుతూ విందు భోజనం తినే కన్నా ప్రశాంతంగా జున్ను తినడం మేలు!” అని ఆలస్యం చేయకుండా వెంటనే తన ఊరికి వెళ్ళిపోయింది. 

 నీతి: మన పెద్దవాళ్ళు తృప్తికి మించిన ఐశ్వర్యం లేదు అని చెప్తుంటారు. అత్యాశకు పోయి అన్నీకావాలి అని ఆరాటపడే బదులు ఉన్నదానితో త్తృప్తిగా జీవిస్తే ఆరోగ్యం, ఆనందం రెండూ లభిస్తాయి.   

https://kathalu.wordpress.com/

https://www.facebook.com/neetikathalu

స్నేహమనే ఓడ విలువ: సత్ప్రవర్తన ఉప విలువ: ఇతరుల పట్ల ప్రేమ

image

సముద్రంలో ప్రయణం చేస్తున్న ఒక ఓడ తుఫానులో చిక్కుకుని ముక్కలైపోయింది. కేవలం ఇద్దరు ప్రయాణీకులు మాత్రం ఈదుకుంటూ ఎడారివంటి ఒక ద్వీపానికి చేరుకున్నారు. వాళిద్దరూ మంచి స్నేహితులు. భగవంతుని ప్రార్ధించటం తప్ప వేరే మార్గ మేదీ లేదన్న ఉద్దేశంతో వారొక అంగీకారానికి వచ్చారు. ఎవరి ప్రార్ధన బలమైనదో తెలుసుకోవటం కోసం వాళిద్దరూ ఆద్వీపాన్ని రెండు భాగాలుగా చేసుకుని, ఎదురెదురు భాగాలలో ఉంటూ ప్రార్ధన చేయటం ప్రారంభించారు.

మొట్టమొదట వాళ్ళు ఆహారం కోసం ప్రార్ధించారు. మరునాటి ఉదయం మొదటి వ్యక్తి ఉన్న భాగంలో ఒక పండ్ల చెట్టు కనిపించింది. అతడు ఆ ఛెట్టు నించి పండుకోసుకుని తిన్నాడు. రెందవ వ్యక్తి ఉన్న స్థలంలో ఏ చెట్టు లేకుండా ఏడారిలా ఉన్నది.
ఒక వారం తరువాత మొదటివ్యకికి ఒంటరిగా అనిపించి భార్య కావాలని దేవుడిని ప్రార్ధించాడు. మర్నాడు వేరొక ఓడ సముద్రంలో ముక్కలైపోయి ఒక స్రీ మాత్రం బతికి ఈదుకుంటూ మొదటి వ్యక్తి ఒన్న భాగం వైపుకి వచ్చింది. రెండవ వ్యక్తి ఉన్న ద్వీపం భాగంలో ఏమీ లేదు.
ఆ తరువాత మొదటి వ్యక్తి ఇల్లు, బట్టలు, మరింత ఆహారం కోసం ప్రార్ధన చేసాడు. మరునాడు ఏదో మాయమంత్రం వేసినట్లుగా అతను ప్రార్ధించినవన్నీ అతనికి లభించాయి. రెండవ వ్యక్తి ఉన్న వైపు ఏమీ లేవు. చివరిగా, మొదటి వ్యక్తి తాను, తన భార్య అక్కడినించి వెళ్ళీపోవటం కోసం ఒక ఓడ కావాలని ప్రార్ధించాడు. మరునాటి ఉదయం మొదటివ్యక్తి ఉన్న ద్వీపం భాగంవైపు ఒక ఓడ నిలిచి ఉండటం కనిపించింది. మొదటి వ్యక్తి భార్యతో కలిసి ఓడనెక్కి, రెండవ వ్యక్తిని అక్కడే విడిచి వెళ్ళి పోవాలని నిశ్చయించుకున్నాడు.రెండవ వ్యక్తికి ఏదీ లభించకపోవటం వలన అతని ప్రార్ధనలలో బలం లేదని మధిటి వ్యక్తి భావించాడు.
ఓడ కదలబోతుండగా స్వర్గలోకం నుంచి ఒక స్వరం మొదటి వ్యక్తి కి ఈవిధంగా వినిపించింది. “నీ స్నేహితుడిని ద్వీపంలో విడిచిపెట్టి ఎందుకు వెళుతున్నావు?” అని. “నాకు లభించిన ఆశీస్సులు నాకు మటుకే స్వంతం. ఎందుకంటే నేనే వాటికోసం ప్రార్ధించాను కనుక “అన్నామొదటివ్యక్తి.”అతని ప్రార్ధన లేవీ అంగీకరింపబడలేదు. అందువల్ల అతనికి ఆశీస్సులు పొందే అర్హత లేదు.” అన్నాడు. ఆకాశవాణి ఆ మొదటివ్యక్తిని మందలిస్తూ “నీవు పొరపడ్డావు.అతడు ఒకే ఒక కోరిక కోరాడు. నేను అతనిని వెంటనే అనుగ్రహించాను. ఆ వరమే కనుక నేను అతనిని ఇచ్చి ఉండకపోతే నీకు అసలు నా ఆశీస్సులు లభించిఉండేవి కాదు “అన్నది.
“అతను దేని కోసం ప్రార్ధించాడు? అతనికి నేను ఎందుకు ఋణపడి ఉండాలి?” అని మొదటివ్యక్తి ఆకాశవాణిని ప్రశ్నిచాడు. “నీ ప్రార్ధనలన్నీ ఫలించాలని అతను నన్ను ప్రార్ధించాడు.” అన్నది ఆకాశవాణి.

నీతి: మనకి లభించిన అనుగ్రహమంతా కేవలం మన ప్రార్ధనల ఫలితం న మాత్ర మే కాదని, ఇతరులు కూడా మనకోసం ప్రార్ధించటం వలననే ఇది సాధ్యమనీ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మనకోసం ఇతరులు చేసే ప్రార్ధనల వలన కూడా మనకి భగవంతుని ఆశీస్సులు లభిస్తాయి. స్నేహితులకు విలువనివ్వాలి. ప్రేమించిన వారిని ఏప్పుడూ దూరం చేసుకోకూడదు.

http://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

చిత్తశుద్ధి!! విలువ: ప్రేమ ; అంతర్గత విలువ:గురు భక్తి


image

సిక్కుల 10వ గురువైన గురుగోవింద్ సింగ్ కాలంలో జరిగిన విషయం ఇది. గురు గోవింద్ సింగ్ చాలా చురుకైన వ్యక్తి. భగవంతుని పట్ల భక్తి విశ్వాసాలు కలిగి ఉండేవారు. ఈ గురువుగారు తన అనుచరులకు ఆదేశాలు ఇచ్చి వాటిని అమలుచేసేటప్పుడు పరీక్షలు పెట్టి సాధనలో వారి అభివృద్ధికి సహాయపడేవారు.ఒకసారి అందరూ తమ ఇంటివసారాలో యాత్రికులకు ఉచిత భోజన సౌకర్యాలు కల్పించాలని , ఇంటికివచ్చిన వారెవ్వరు ఖాళీ కడుపుతో తిరిగి వెళ్ళకూడదని ఆదేశించారు.

శిష్యులంతా అలాగే చేస్తూ, యాత్రికులను బాగా ఆదరిస్తూ మంచిపేరు తెచ్చుకున్నారు. గురువుగారు ఒకరోజు వాళ్ళని పరీక్షిచాలని మారువేషంలో బయలుదేరారు. శిష్యులంతా అప్పుడే లేచి తమ పనులు చేసుకుంటున్నారు. కొందరు బట్టలు ఉతుకుతున్నారు, కొందరు ప్రార్థన చేసుకుంటున్నారు ఇలా ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. గురు గోవింద్ సింగ్ ఒకరింటికి వెళ్ళి అయ్యా; నేను ఒక యాత్రికుడిని , ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఉందా అని అడుగుతారు. దానికి ఆ ఇంటి యజమాని మీరు ఇంత పొద్దున్నే వస్తే ఎలాగ? ఇంకా వంట మొదలుపెట్టలేదు, తరవాత రండి అంటాడు.

ఇంకో ఇంటిదగ్గర కూడా ఇలాంటి సమధానమే వస్తుంది.వాళ్ళు కుడా తరవాత వస్తే పెడతాం అంటారు. అలా ప్రతి ఇంటికీ వెళ్ళి చివరకు నందలాల్ అనే వ్యక్తి ఇంటిదగ్గర ఆగుతాడు. నందలాల్ గురు గోవింద్ సింగ్ కన్నా 20 సంవత్సరాలు పెద్ద. కాని గురువుగారి పట్ల, ఆయన బోధల పట్లా ఎంతో భక్తి శ్రద్ధలు కలిగిన వ్యక్తి. యధాప్రకారం గురు గోవింద్ సింగ్ తినడానికి ఏమైనా పెట్టమని అడుగుతాడు. నందలాల్ ఆయన్ని ప్రేమతో ఆదరించి వండిన పదార్థాలన్ని వడ్డిస్తాడు. గురువుగారు కూడ అతను ప్రేమగా వడ్డిస్తూ ఉంటే తృప్తిగా తింటారు.
మర్నాడు అందరూ సమావేశమైనప్పుడు గురు గోవింద్ సింగ్ ఇలా అన్నారు. “మన ఊరిలో నేను చెప్పిన ఆదేశాలు చిత్తశుద్ధితో పాటిస్తున్నది నందలాల్ ఒక్కడే ” అది విని అందరూ ఆశ్చర్యపోయారు, ముందురోజు పొద్దున్నే తమందరి ఇంటికి యాత్రికుడి రూపంలో వచ్చింది గురువుగారేనని గ్రహించారు.

నీతి: చిత్తశుద్ధి ఉంటేనే గురువు అనుగ్రహం లభిస్తుంది.దానికోసం గురువు అదేశాలు ఏదో చెయ్యాలి అన్నట్లు కాకుండా, క్రమం తప్పకుండా నిజాయితీగా చెయ్యాలి.

http://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu