Archive | January 2015

భూతదయ, విలువ: ప్రేమ, అంతర్గత విలువ: సహనం

ఒక అబ్బాయి తన మావయ్యతో కలిసి సముద్రం ఒడ్డున ఆడుకుంటున్నాడు. అక్కడ ఒక తాబేలుని చూసి దాని దగ్గరికి వెళ్ళేడు. అది తలని పెంకు(షెల్) లోపలికి ముడుచుకుని ఉంది. ఎలాగయినా దానిని చూడాలని ఒక చిన కర్ర తీసుకుని దానిని పొడవడం ప్రారంభించాడు. అది చూసిన వాళ్ళ మావయ్య అలా పొడిచి హింసించకూడదు అని చెప్పి, అది తల బయటకు పెట్టి చూడాలి అంటే ఒక మార్గం ఉంది అని చెప్పి, దానిని ఇంటికి తీసుకువచ్చాడు.

images93JGDTU4తాబేలుకి వేడి తగిలేలా పొయ్యి దగ్గర ఉంచేడు. శరీరానికి వేడి తగలగానే కొన్ని నిమిషాలలో తాబేలు తల బయటకు పెట్టి చూసి పాకడం మొదలుపెట్టింది.

అప్పుడు ఆ అబ్బాయితో వాళ్ళ మావయ్య ఇలా చెప్పేడు.

“ఏదయినా సాధించాలంటే ప్రేమ వల్ల సులువుగా అవుతుంది. మనుషులు అయినా జంతువులు అయినా మనం ప్రేమగా ప్రవర్తిస్తేనే మనకి దగ్గరవుతారు. వాళ్ళకి అనుకూలమైన వాతావరణం కల్పించి ప్రేమగా ఉంటే వాళ్ళు మనకోసం ఏమైనా చేస్తారు.”

నీతి: ఎదుటివాళ్ళని బలవంతపెట్టడం, వాళ్ళ మనసు కష్టపెట్టి ఎలగయినా పని చేయించాలనుకోవడం మంచి పద్ధతి కాదు. సహనంగా ఉంటూ ప్రేమగా ప్రవర్తించడం వల్ల అవతలి వాళ్ళ మనసు గెలుచుకోవచ్చు.

https://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

 

 

Advertisements

కోపంలో ఉన్నపుడు మనం ఎందువలన గట్టిగా అరుస్తాం?, విలువ : శాంతి, అంతర్గత విలువ: శాంతము, మౌనం

ఒక రోజున ఒక హైందవ సాధువు తన శిష్యులతో కలిసి గంగానది వద్దకు స్నానం చెయ్యడానికి వెళ్ళేడు. అక్కడ ఒక కుటుంబంలోని సభ్యులు కొంతమంది కోపంతో ఒకరిపై ఒకరు అరుచుకుంటున్నారు. ఆ సాధువు తన శిష్యులవైపు చూసి నవ్వుతూ వారిని ఇలా అడిగేడు.

Misunderstanding

“కోపంలో ఉన్నప్పుడు మనుషులు ఒకరిపై ఒకరు ఎందుకు అరుచుకుంటారు?” ఒక్క క్షణం ఆలోచించిన తరవాత ఆ శిష్యులలో ఒకడు ఇలా సమాధానం చెప్పేడు, “మనం సహనాన్ని కోల్పోవడం వల్ల అరుస్తుంటాము”

“కాని మనుషులు పక్కనే ఉన్నప్పుడు అలా అరవలసిన అవసరం ఏముంది? మెల్లగా పక్కనే ఉన్నవాళ్ళకి నెమ్మదిగా చెప్పవచ్చు కదా” అన్నారు సాధువు.

మిగిలిన శిష్యులు కూడా వారికి తోచిన విధంగా సమాధానాలు చెప్పేరు కాని ఎవరుచెప్పిన అభిప్రాయము సంతృప్తికరంగా లేదు.

చివరకు సాధువు ఇలా వివరించేరు.

angerఇద్దరు వ్యక్తులు ఒకరిపట్ల ఒకరు కోపంగా ఉన్నప్పుడు వాళ్ళ హృదయాలు చాలా దూరం అయిపోతాయి. ఆ దూరాన్ని అధిగమించడం కోసం, వాళ్ళకి వినిపించడంకోసం అలా గట్టిగా అరుచుకుంటూ ఉటారు. కోపం ఎక్కువయిన కొద్దీ తమ మధ్య పెరుగుతున్న దూరం కారణంగా మరింత గట్టిగా అరుచుకుంటారు.

అదే ఇద్దరు వ్యక్తులు ప్రేమగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది?

వాళ్ళు ఏమాత్రం అరుచుకోకుండా ఎంతో మెల్లగా, మృదుమధురంగా మట్లాడుకుంటూ ఉంటారు, ఎందుకంటే వారి హృదయాలు ఎంతో దగ్గరగా ఉంటాయి కనుక. ప్రేమలో ఉన్నప్పుడు మనుషుల హృదయాల మధ్య దూరం చాల తక్కువగా, అసలు దూరమే లేనట్లుగా ఉంటుంది.

ఆ సాధువు తన శిష్యులకు ఇంకా ఈ విధంగా వివరించేరు.

మనుషులు ఒకరినొకరు గాఢంగా ప్రేమించినప్పుడు ఏంజరుగుతుంది? వాళ్ళు మాట్లాడరు, ఒకరితో ఒకరు గుసగుసలాడుకుంటూ చాలా ప్రేమగా దగ్గరవుతారు. చివరకు వాళ్ళ్ళకు గుసగుసలతో కుడా అవసరం లేకుండా  ఒకరి కళ్ళలో ఒకరు కళ్ళు పెట్టి చూసుకుంటూ చూపులతోనే మాట్లాడుకుంటారు.అంతే ఆవిధంగా ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకున్నప్పుడు వారి హృదయాలమధ్య అసలు దూరమే లేకుండా దగ్గరవుతాయి.

ఆ సాధువు తన శిష్యులతో ఇంకా ఈ విధంగా అన్నాడు.

“కాబట్టి మీరు వాదించుకునేటప్పుడు కోపంతో మీ హృదయలను దూరం చేసుకోకండి.మనుషుల మధ్య దూరం పెరిగే విధంగా మాట్లాడకండి.లేకపొతే ఆ దూరం ఎప్పటికీ దగ్గరకాలేనంతగా పెరిగిపోతుంది.”

నీతి:

కోపం వచ్చినపుడు మాట్లాడకుండా మౌనంగా ఉండడం ఉత్తమమైన పద్ధతి. అటువంటి కోపంలో మట్లాడే మాటలు అవతలి వ్యక్తి హృదయంపై చెరగని ముద్ర వేస్తాయి.కోపం మనల్ని మనకి ప్రియమైన వారి నుండి దూరం చేస్తుంది.

https://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

 

భగవతుడిని తెలుసుకోవటానికి కావలిసిన ముఖ్యమైన అరహత….

విలువ: ప్రేమ

అంతర్గత విలువ: ఆర్తి లేదా తీవ్రత

ఒక సాధు నదీ తీరం లో ధ్యానం చేస్తుండగ, అక్కడికి ఒక  యువకుడు వస్తాడు.

ఆతడు ,సాధు ధ్యానానికి అంతరాయం కలిగుస్తూ , ” స్వామి , నన్ను దయ చేసి మీ శిష్యునిగా స్వీకరించరా?” అని వినయంగా

అర్ధిస్తాడు !

”  యెందుకు నాయనా, నీవు నా సిష్యుడివి కావాలని కొరుకుంటున్నావు ” అని సాధు ఆ యువకుడిని తిరిగి ప్రస్నిస్తాడు.

దానికి ఆ యువకుడు , ” దైవాన్ని తెలుసుకోటానికి స్వామి “,అని జవాబు ఇస్తాడు.

అంతలోనే , జవాబు విన్న ఆ సాధు, యువకుడిని, నది వద్దకు ,మెడ పట్టి లాక్కెళ్ళి, ఆ నీల్లలో అతడి తలని  ముంచి ఒక నిమిషం పాటు  ఉంచుతాడు.

యువకుడు నీటిలో ఉక్కిరి బిక్కిరి అయిపొయ్యి తప్పించు కోవాలని తన సాయశక్తులా ప్రయత్నిస్తాడు.
సాధు విడిచిపెట్టగానే , యువకుడు దగ్గుతూ , ఆయాసపడుతూ,ఊపిరి తీసుకోటానికి కూడా కష్టపడుతూ బైటికి వస్తాడు.

కొంత  స్తిమితపడ్డాక, సాధు అతడిని, “నాయనా ,నీటిలో ఉన్న ఆ కొద్ది పాటు సమయంలో నీకు అన్నిటికంటే ఏది అత్యవసరముగా కావల్సి వచ్చింది?”  అని నిదానంగా ప్రస్నిస్తాడు.
దానికి అతడు “గాలి, స్వామి” అని సమాధానం చెప్పగా , సాధు ప్రేమగా , ” మంచిది నాయనా, నీవు ఇక ఇంటికి తిరిగి వెళ్ళు”.    నీటిలో ఉన్నప్పుడు, గాలిని ఎంత  అవసరముగా భావించావో అంతే ఆర్తిగా  భగవంతుడొక్కడే కావాలని బలంగా నువ్వు  కోరుకున్నప్పుడు , నా వద్దకి రా,నిన్ను అప్పుడు నా సిష్యుడి గా తప్పకుండా స్వీకరిస్తాను అని మాట ఇస్తున్నాను”, అని చెప్పి  సమాధానపరచి,అతనిని  ఆ సాధు, తిరిగి వెనుకకి పంపించేస్తాడు.

   నీతి:

  ఎవరైతే “నాకు భగవంతుడు తప్ప  ఏదీ వద్దు “,అని కొరుకుంటారో వారిని ఆ భగవంతుడు తప్పక  అనుగ్రహిస్తాడు.అంతేకాక వారి యోగ క్షేమాలను కూడా తానే దెగ్గరుండి చూసుకుంటాడు.

ప్రాపంచిక సుఖాలని లెక్క చేయక తననే పరిపూర్ణమైన విస్వాసముతో నమ్ముకున్న త్యాగరాజు, మీరాబాయి, అన్నమయ్య,రామదాసు వంటి భక్తుల పై పరమాత్ముడు తన అపారమైన కరుణని  కురిపించి వారిని  కంటికి రెప్పలా ఎలా కాపాడుకున్నాడో మనము  పురాణాలలో విన్నాము కదా!