Archive | January 2016

మూడు చేపల కథ

విలువ : ధర్మం

అంతర్గత విలువ : వివేకము

 

image

అనగనగా ఒక చెరువు లో చాలా చేపలు ఉండేవి . ఒక రోజు ఇద్దరు చేపలు పట్టే వాళు ఆ  చెరువు లో చాలా చేపలు వున్నాయని గమనించి మరునాడు చేపలు పడదామని నిర్ణయించు కున్నారు.

వాళ్ళ మాటలు విన్న ఒక పెద్ద చేప ఈ విషయం తన స్నేహితులైన ఇంకో రెండు చేపలకు చెబుతూ – “మనం వెంటనే మన బంధువులను తీసుకుని ఈ చెరువు ని వదిలి వెళ్ళిపోవాలి – లేక పోతె రేపు మనం ప్రాణాలతో వుండము” అని తను విన్న జాలరులు మాట్లడుకున్న మాటల గురించి చెప్పి హెచ్చరించింది.

అవి విన్న రెండు చేపలు ఆలొచన లో పడ్డాయి.

రెండో చేప, “వాళ్ళు రేపు వస్తే చూద్దాం” అని అనుకుంది.

మూడో చేప, “ఈ ముసలి చేపకు చాదస్తం ఎక్కువ – ఆ చేపలు పట్టే వాళ్ళు వచ్చినా మన అదృష్టం  బాగుంటే వాళ్ళేమి చేయకేరులే!” అనుకుంది.

మొదటి చేప రాత్రి కి రాత్రి తన బంధువులతో ఈదుకుంటూ వేరే చెరువుకు వెళ్ళి పొయింది.

తెల్లవారగనే రెండో చేప నేరుగా వస్తున్న చేపలు పట్టే వాళ్ళని చూసి తన కుటుంబం తో వేరే చెరువుకు వెంటనే వెళ్ళి పొయింది.

మూడో చేప వల లో చిక్కుకుని ప్రాణాలను పోగొట్టుకుంది.

దూరదృష్టి తో ఆలోచించిన మొదటి చేప తన బంధువులనందరినీ కాపడుకో గలిగింది. ముందుగానే ఆపాయాన్ని గ్రహించి వెంటనే చర్యలు తీసుకున్న రెండో చేప ,కొంత వరకు తన కుటుంబాన్ని కాపడుకుంది.

ఆదృష్టాన్ని నమ్ముకున్న మూడో చేప మటుకు యేమి చేయలేక పొయింది.

నీతి :అలాగే మన జీవితం లో కూడా కేవలం అదృష్టాన్ని నమ్ముకుని, మన వంతు కృషి మనం చచేయకపోతే ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొని విజయాన్ని సాధించలేము.

 

http://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

 

పెద్దలు చెప్పిన నీతికథ

4x5 original

4×5 original

విలువ: ధర్మం

అంతర్గత విలువ :సత్ప్రవర్తన

అది భవ్యమైన ఉజ్జయినీ నగరపు రాచవీధి. ప్రొద్దుకుంకినా ఆ దారిలోని దేశవిదేశ వర్తకుల సంఖ్య బేరసారాలాడుతున్న జనావళి రద్దీ తగ్గలేదు! రాత్రి కొంత గడచిన తరువాత కాస్త కాస్తగా రద్దీ తగ్గటం మొదలుపెట్టింది. ఇంతలో తేనెలమ్మే ఒక వయ్యారి తన వన్నెచిన్నెలు ఒలకబోస్తూ ఆ వీధివెంట వచ్చి బుట్ట క్రిందికి దించి అమ్మకం మెదలుపెట్టింది. నిమిషములో కొన్ని లక్షలాది చీమలు మధువు కోసం ఆ వన్నెలాడి తేనె బుట్ట వద్దకు చేరినాయి. చీమల పుట్టలు చూసి వాటిని బఠానీల్లా నములుదామని ఒక తొండ అక్కడికి వచ్చింది.

రాత్రంతా నగరంలోని వేడుకల వలన జనసంచారమునకు భయపడి బయటకురాని ఎలుక తొండకోసం వచ్చింది. పిల్లిగారు ఆ తొండని గుటకాయస్వాహా చేద్దామని పొంచినిలిచినారు. పిల్లికోసం కుక్క కూడా అక్కడికి వచ్చింది. రాచవీధిలోని వేటకుక్కలు ఊరికుక్కని చూసి హంగామా చేశాయి.

ఇంతలో ఒక మాంత్రికుడు తన మంత్రశక్తి ద్వారా అడవిలోని ఒక పెద్దపులిని బంధించి రాచవీధిన తెస్తున్నాడు రాజుగారికి చూపించి మెప్పుపొందుదామనే ఉద్దేశ్యముతో. పౌరుషంలేని పులిని చూసి వేటకుక్కలు మీదపడ్డాయి. మరే జంతువైనా మంత్రించి బంధించేసేవాడు మాంత్రికుడు కానీ రాజుగారి వేటకుక్కలయ్యేసరికి కిమ్మనక ఉండిపోయాడు. ఈ గందరగోళానికి రాచభటులు ఆ పై మహామంత్రిగారు అక్కడికి వచ్చి పరిస్థితులను సమీక్షించి రాజుగారికి నివేదించారు. రాజుగారు “నగరపు ముఖ్యవీధిలోనే ఇంత అల్లకల్లోలం ఎందుకు జరిగింది?” అని ప్రశ్నించాడు.

సూక్ష్మబుద్ధి అయిన మహామంత్రి ఇలా సమాధానమిచ్చినాడు “ప్రభు! కొద్దికాలముగా మన దేశములోని యువత రాత్రంతా వేడుకలతో సంబరాలతో గడుపుతున్నది. దీనివలన నిశాచరులైన జంతువులకు వేట కుదరటంలేదు. ఆహారము దొరకని కారణముగా ప్రకృతిలో ఈ అసహజస్థితి వచ్చినది. మానవునితో పాటు సహజీవనము చేసే భూతజాలములకు సైతం దయ చూపమని మన భారతీయ సంస్కృతి ఘోషిస్తున్నది కదా”!

 

image

ప్రజాహితుడైన ఉజ్జయినీ మహారాజు వెంటనే “రాత్రి ఒక జాము నగారా తరువాత వీధులలో జనసంచారము ఉండరాదు” అని దండోరా వేయించాడు.

నీతి :మన చిన్నప్పుడు అమ్మ “బాబూ! రాత్రయిందిరా! ఇంక ఆటలు మాని ఇంటికి రారా. వేళకానివేళ ఆడితే నేలతల్లి కోపిస్తుందిరా! మంచి పిల్లలు త్వరగా పడుకుని తెల్లవారకముందే లేస్తారు” అని చెప్పి మందలించిన సన్నివేశం మనందరికీ గుర్తే. ఈ సూక్తి వెనుకనున్న తత్త్వం మనకు మహామంత్రి మాటల ద్వారా తెలిసినది. ఈ విధముగానే అన్ని ప్రాచీన ఆచార సాంప్రదాయాల వెనుక ఆరోగ్య, సామాజిక, ఆధ్యాత్మిక హేతువులు కలవు. వాటి వివరమెఱిగి అనాదిగా వస్తున్న ఆచారాలను కాపాడుకొంటూ ముందు తరాలకు అందించుట మన కనీసకర్తవ్యము.

https://neetikathalu.wordpress.com/category/sampradayam/

 

ప్రతీ చిన్న పని కూడా లెక్క లోకి వస్తుంది !!

విలువ — సర్త్ప్రవర్తన
అంతర్గత విలువ — ఇతరులను గౌరవంగా, ప్రెమగా చూడడం.

జాన్ మామసం డిస్ట్రిబ్యూషన్ కార్ఖానా లొ పని చేసేవాడు.ఒక రొజు పని ముగించు కున్నాక, ఆఫీసు లొపల చల్ల గా ఉన్న గదకి (ఫ్రీజర్ ) ఎదో పని మీద వెళ్ళాడు. అనుకోకుండా తలుపుకి తాళం బయటనుంచి పడిపొయింది. చాలా ఖంగారు పడిపొయాడు జాన్. ఎంత పిలిచినా ఆ గది లోనించి ఎవ్వరికీ వినిపించలేదు.పని వాళ్ళు అందరూ కూడా,ఒఫీస్స్ టైం అయిపొవటం తో ఇంటికి వెళ్లిపోయారు .

image.jpegకొన్ని గంటల తరువాత, జాన్ కి ఇంక ఊపిరి అందలేదు. సరిగ్గా అదే సమయానికి అక్కడ పని చేసే  వాచ్చ్ మాన్న్ వచ్చి తలుపు తీశాడు. జాన్ ,అమ్మయ్య అనుకుని ,కొంత కుదుట పడి అతనికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వాచ్చ్ మాన్న్ ని ఇలా అడిగాడు,

“నీవు పని చేసే చోటు ఇది కాదు కదా మరి నీవు ఇక్కడ ఏమి చేస్తున్నావు ? అసలు ఈ గది లోపల నీకు ఏమి పని ?”అప్పుడు వాచ్చ్ మాన్న్ ఇలా జవాబు ఇచ్చాడు ,
” సార్ ! నెను ఈ కార్ఖానా లో 35 సంవత్సరాలుగా పని చేస్తున్నాను. చాలా మంది ఇక్కడ పని చెస్తున్నారు ,కానీ , మిరు ఒక్కరు మాత్రం ప్రతి రోజూ నన్ను, పొద్దున్న ఇక్కడికి వచ్చినప్పుడు మరియు సాయంకాలం ఇంటికి తిరిగి వెళ్ళి నప్పుడూ నన్ను తప్పకుండా ప్రేమతో పలకరిస్తారు. కానీ ఈ రోజు మాత్రం మీరు పొద్దున్న వచ్చినప్పుడు పలుకరించారు కానీ సాయంకాలం పలకరించలేదు . కారణం ఎమయ్యి ఉంటుందని తెలుసుకుందామని మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను.”

ఇదిగో ఇలా మిమ్మల్ని ఇక్కడ కలుసుకోగలిగాను .

నీతి :
మనం ఎప్పుడూ కూడా అందరితో గౌరవంగా, అణుకువగా, ఉండాలి. ఎవ్వరు ఎదురైనా నవ్వుతూ పలకరించాలి !ఎంత చిన్నది అయినా ,మంచి పని ని ఎప్పుడూ తక్కువ అంచనా వెయ్యకూడదూ. చిన్న సహాయమైనా మన్స్పూర్తిగా చేస్తా గొప్ప ఫలితాలను  అందిస్తుంది.

http://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

 

 

విశ్వాసము మరియు దృఢ నిశ్చయము !!!

th
విలువ — సరయన నడత.
అంతర్గత విలువ — విశ్వాసము మరియు నిశ్చయము
ఒక రొజు రాత్రి చాలా గాలి, మబ్బుగా, వర్షం వొచ్చేట్టుగా ఉంది.ఖదీజా తన ముగ్గురి పిల్లల తొ ఒక పాత దుప్పటి కప్పుకుని తన గదిలో ఉన్నారు. ఖదీజా తన గది కిటికి  వంక   తన భర్త కోసం ఎదురు చూస్తోంది. తలుపు చప్పుడు వినగానే, పిల్లలలని వాళ్ళ నాన్నని చూడడానికి వెల్లమంది.
అందరి కంటే చిన్న పిల్ల  ‘ఆమ్మా, నాన్న మనకి భొజనం తిసుకుని వొచ్చారా ‘అని అడిగింది?అప్పుడు ఖదీజా నిమ్మదిగా  అలా  ఏమీ అడగవొద్దు’అని చెప్పింది . కాని పిల్లలు తండ్రి దెగ్గిరకి పరుగున వెళ్లారు. ఖదీజా ప్రేమగా తన భర్తని పలక రించింది.
భర్త కొంచం బ్రెడ్ చీసు భార్యకి ఇచ్చాడు. పిల్లలికి తల్లి పళ్ళాలలో వోడ్డిన్చింది.
అందరూ తింటున్నపుడు ఖదీజా నవ్వుతూ మాట్లాడింది. తరవాత పిల్లలు బొమ్మలు, ఆటలు గురించి మాట్లాడు కుంటూ నిద్రపోయారు. అప్పుడు ఖదీజా ,తన భర్త వాళ్ల జీవితం గురించి ఆలోచించ సాగెరు.
‘ఈ సంవత్సరం ముగిసింది, నాకు ఇంకా ఉద్యోగం దొరకలేదు’ అని ఖదీజా భర్త హసన్ అని బాధతో  అన్నాడు. ‘మనం దాచుకున్న డబ్బులు, అన్నీ  ఖర్చు పెట్టేసాము , పిల్లల ఆకలిని ఎలా తీర్చగలము ?” అని ఆలోచనలో పడ్డాడు.
అప్పుడు భార్య ఇలా అంది “విశ్వాసము మరియు దృఢ నిశ్చయము ఉంటే, తప్పక  మనకి మంచి మార్గం ఆ దేవుడే చూపిస్తాడూ ,ఇంకా   సంతోషం గా ఉంటాము’
అప్పుడు భర్త ఇలా అన్నాడు ‘విశ్వాసము వలన  మనము ఎలా  సంతొషాన్ని పొందాము? మన పిల్లలు చిరిగిన బట్టలు ధరిస్తున్నారు, ఆకాలితో ఉంటున్నారు. విశ్వాసము ఉన్నా కూడా   అందరము కష్ట పడుతున్నాము. ఇదివరుకు ఏంతో దర్జాగా ఉండే వాళ్లము ‘.
అప్పుడు ఖదీజా ఇలా అంది ‘ దర్జా అంటె ఎమిటి? జుదం ఆడి సంసారాన్ని పోషించడం. భగవంతుడు కూడా  జూదం ఆడడం తప్పు అని చెప్పారు కదా . మనం తినే ఆహరం, జూదం వల్ల సంపాదించింది అయితేమనం సంతోషంగా ఉండగలమా ? మన వల్ల అప్పుడు ఎంత  మంది ఆకలితో బాధ పడతారు ,చెప్పండి ?
నిజమే ఖదీజా అన్నాడు హసన. ‘నువ్వు చేప్పినవి అన్నీ నిజాలు . అందుకనే ననేను జూదం ఆడడం మానేశాను. కాని దాని వల్ల మనకి ఏమీ దక్కింది . భగవంతునికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటాను  . కాని ,ఇలా దరిద్రం లో  బతకటం చాలా సిగ్గుగా ఉంటోంది ‘
ఖదీజా తన భర్తని నిదాన పరిచి ఇలా అంది ‘జీవితం లొ ఇలాంటి ఇబ్బందులు తప్పవు. భగవంతుని మీద నమ్మకం పెట్టుకుని, మంచి పనులు చెస్తూ రాబోయే కాలం బాగుండాలి అని భగవంతుడని వేడు కుందాము. కష్టం లో ఓర్పు తొ ఉండడం, భగవంతుని మీద నమ్మకం పెట్టుకోవడం వల్ల సంతొషంగా ఉంటాము. మన పెళ్లి ఉంగరం ఉంది నా దెగ్గిర. రెపు ఆది తాకట్టు పెట్టి  డబ్బు తెచ్చుకుందాము. మీకు ఉద్యొగం తప్పక వస్తుంది, నమ్మకం పెట్టకోండి.భగవంతుడు మనకి తప్పకుండా సహా యం చెస్తారు. ‘
అప్పుడు భర్త అన్నాడు ‘నాకు నువ్వు చెప్పే  మాటలు వింటుంటే చాలా నమ్మకం కలుగు తున్నది . కాని ఈ కష్టాల వల్ల మనము ఏమి పొందుతున్నాము.మనకి ఈ కష్టాలు ఎప్పుడు తీరుతాయి.’
ఖదీజా దానికి జవాబుగా  ‘ మనం చదువు కున్నాము కదా, ఓర్పు మరియు సహనం తో ఉన్నప్పుడు, మంచి పనులు చెసి నప్పుడు, భగవంతుని మీ ద నమ్మకం పెట్టుకునప్పుడు, భగవంతుడు పెట్టిన పరీక్ష నెగ్గినప్పుడు, మన కష్టాలు తప్పక తీరుతాయి అంది’.
తరవాత ఖదీజా, హసన్ ఇద్దరూ భగవంతుడిని ప్రార్థించుకుని నిద్రపొయారు. ఉదయాన్నే లేచి ఖదీజా ఇంటి పనులు, చేసుకుంది  హసన్ భగవంతుడిని ప్రార్దిస్తున్నాడు. చిన్న పిల్ల తినడానికి బ్రెడ్ అడిగింది. తన స్నెహితుల ఇంట్లో  తినడానికి చాలా పదార్థాలు ఉన్నాయి అని చెప్పింది.
ఆ మాటకి  తల్లి చాలా బాధ పడి పిల్లని దెగ్గిరకి తీసుకుని ముద్దు పెట్టుకుని ఇలా అంది ‘భగవంతుని దయ వల్ల మనం కుడా రేపు అన్ని తిందాము.
అప్పుడు పిల్ల అమాయకంగా అడిగింది ‘ఏంటి  భగవంతుని దయ వలనా  ?’
అప్పుడు తల్లి ‘ఔను! నిజంగానే భగవంతుని దయ వల్లత్వరలో  అన్నీ  తింటాము ?” హసన్ ఈ మాటలన్నీ వింటూ , తనకి ఉన్న విశ్వాసానికి ఆశ్చర్య పొయాడు. హసన్ కుడా పిల్లల తొ మంచి రొజులు ఒస్తాయి, తనకి మంచి ఉద్యొగం వొస్తుంది,  అని ధైర్యం చెప్పాడు.
ఇంతలో ఎవరో తలుపు కొట్టారు.హసన్ తలుపు తియ్యడానికి వెళ్ళాడు. తరవాత లోపలకి  వచ్చాక ,  హసన్ ముఖం లో సంతొషాన్ని చూసి ఖదీజా మన కష్టాలు తీరిపోయాయి కదా , అని అంది.
హసన్ సంతోషం తొ మాట్లాడలేక పొతున్నాడు.  ఔను అని జవాబు ఇచ్చాడు. మనలో ఉన్న  విశ్వాసం ఉండటం వలన , భగవంతుడు మనకి సహాయం చేశాడు. మన కష్టాలు తీరిపొయాయి. హజ్ సాహిబ్ మనిషి వొచ్చా డా?” అని అడిగింది
లేదు  హజ్ సాహిబ్ స్వయంగా  వచ్చారు అని చెప్పాడు హసన్. ఆయిన చేస్తున్న వ్యాపారానికి నమ్మక మైన మనిషి కొసం చూస్తున్నారుట. మన కుటుంబం పడే కష్టాల గురించి ఆయినకి తెలిసింది. హజ్ సాహిబ్ నాతో ‘నువ్వు ఇప్పుడే పుట్టిన పసివాడి వలె స్వచ్చమైన మనసు  కలవాడివి ‘,అందుకని నీకు ఉద్యోగం ఇద్దాము అనుకున్నాను.
నీతి :
విశ్వాసము మరియు నిశ్చయము ఉన్న చోట గెలుపు తప్పకసంభవిస్తుంది . మన వంతు కష్టం మనము పడితే, మిగిలినది భగవంతునికి వొదిలి వేద్దాము. మనకి ఏది మంచిదో భాగవంతునికే  తెలుసు.

శ్రీమహాభారతం లోని ధర్మవ్యాధుని కథ!!

image

 

విలువ : ధర్మము

అంతర్గత విలువ : సత్ప్రవర్తన

పూర్వం ఒకానొక ఊరిలో కౌశికుడనే బ్రాహ్మణ బ్రహ్మచారి ఉండేవాడు. ఒకనాడు అతడు చెట్టునీడన కూర్చుని వేదం వల్లె వేస్తుంన్నాడు. అతడలా వల్లెవేయుచుండగా చెట్టు మీదనున్న ఓ కొంగ అతనిపై రెట్ట వేసింది. అతడు వేదం చదువుతున్నా అందు చెప్పబడిన “మిత్రస్య చక్షుష సమీక్షామహే” అన్న సూక్తిని మరచినాడు. వేదం ప్రపంచాన్నంతటినీ స్నేహభావంతో చూడమన్నది. అది మరచి ఒక్కసారి కోపదృష్టితో ఆ కొంగను చూచాడు. అతడు తపోశక్తి కలవాడగుటచే ఆ కొంగ క్రిందపడి అసువులుబాసింది.

ఆ తరువాత ఆ బ్రహ్మచారి ఎప్పటిలాగానే గ్రామంలోనికి భిక్షాటనకై వెళ్ళాడు. ఓ ఇంటి ముందు నిలబడి “భవతీ భిక్షాం దేహి” అని అడిగినాడు. ఇంట్లో పనిలో ఉన్నదేమో అని అనుకొని కొంతసేపు నిరీక్షించాడు. ఇంతలో దూరాన్నించి వచ్చిన ఆమె మగడు “ఆకలి ఆకలి” అంటూ ఇంటిలోనికి వెళ్ళాడు. ఆ ఇల్లాలు పరమసాధ్వి పతివ్రత. పతికి కాళ్ళుకడుగుకోవటానికి నీళ్ళిచ్చింది. ఆ తరువాత ఎంతో ఆప్యాయంగా భర్తకు భోజనం వడ్డించింది. అతని భోజనం అయ్యాక భిక్ష తీసుకొని బయటకు వచ్చింది. “స్వామీ! మిమ్మల్ని చాలా సేపు నిలబెట్టినాను. నన్ను క్షమించండి” అన్నది. కౌశికుడు మండిపడ్డాడు. తన పతిసేవ చేసి వచ్చేసరికి జాప్యమైందని చెప్పింది. ఐననూ “ఇది క్షమించరాని నేరం” అన్నాడు కౌశికుడు కోపంగా.

అప్పుడామె అన్నది “స్వామీ! అనవసరంగా కోపంతెచ్చు కోకండి. తపోధనులకు కోపం తగదు. ఒక పతివ్రతకు పతిసేవాధర్మాన్ని మించిన ధర్మంలేదు. నేను కొంగను కాను మీ తీక్ష్ణ దృష్టికి క్రిందపడటానికి”. ఎక్కడో అడవిలో ఏకాంతలో జరగిన వృత్తాంతం ఈమె కెలా తెలిసిందా అని కౌశికుడు దిగ్భ్రాంతిని చెందినాడు. పతివ్రతా శక్తిని చూచి నివ్వెఱ పోయాడు. అప్పుడా సాధ్వి “మహాత్మా! కోపానికి మించిన శత్రువు లేదు. మీరు మిథిలా నగరానికి వెళ్ళి ధర్మవ్యాధుని కలుసుకోండి. అతడు మీకు తత్త్వబోధ చేస్తాడు” అని హితవు చెప్పింది.

 

image

కౌశికుడు వెంటనే మిథిలకు ప్రయాణమైనాడు. ధర్మవ్యాధుని ఇల్లు కునుక్కొని అక్కడికి చేరాడు. అతడొక కసాయి అని తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. కౌశికుని చూచి ధర్మవ్యాధుడు “అయ్యా! దయచేయండి. తమని నా వద్దకు పంపిన సాధ్వీమణి కుశలమేకదా”? అని ప్రశ్నించాడు. ఆ పతివ్రత విషయం ఈ వ్యాధునికెలా తెలిసిందో అని కౌశికుడు ఆశ్చర్య పోయాడు. అతిథికి అర్ఘ్య పాద్యాదులిచ్చి తన తల్లిదండ్రుల సేవకై వెళ్ళాడు ధర్మవ్యాధుడు. వారి సేవ చేశాక కౌశికుని వద్దకు వచ్చాడు. కౌశికుడికి ఇలా ధర్మబోధ చేశాడు “ఆర్యా! ఏ పనినైనా నిక్ష్కామ హృదయంతో ధర్మం తప్పకుడా చేస్తే అది మాధవ సేవే అవుతుంది. ప్రతి మనిషి తన స్వధర్మాన్ని కులవృత్తిని నిర్వహిస్తే ఈ సమాజం బాగా పురోగమిస్తుంది లేకుంటే కొన్ని రంగాలలోనే పురోగతివుంటుంది.

మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను సేవించటం మనకనీస కర్తవ్యం. అట్లుచేయని వాడు కృతఘ్నుడౌతాడు. కృతఘ్నతకు మించిన మహాపాపం మరొకటి లేదు. మాతాపితసేవ ఒక్కటే చాలు మనల్ని మోక్షమార్గంలో నడిపించడానికి”.

image

 

ఈ హితబొధ విన్న కౌశికుడు ధర్మవ్యాధుని వద్ద సెలవుతీసుకుని వెంటనే తను విస్మరించిన మాతాపితరుల కడకేగినాడు. వారికి భక్తితో అనన్య సేవ చేసి తరించాడు. వేదాంత తత్త్వజ్ఞానంతో అధ్యయనంతో తపస్సుతో పరిశ్రమతో పొందే జ్ఞానాన్ని మోక్షాన్ని మాతాపిత సేవతో పొందవచ్చని గ్రహించాడు.

నీతి :

“తన కోపమే తన శత్రువు. తన శాంతమే తనకు రక్ష” అన్న సూక్తి మనకు ఈ కథలో తెలిసింది. కౌశికుడు వృధాగా కొంగమీద సాధ్విమీద కోపగించుకొని తన తపశ్శక్తిని కోల్పోయాడు.
పతివ్రత యొక్క శక్తి అమోఘం. కథలోని సాధ్వి కేవలం పతిసేవ చేసి ఎంతో కఠిన తపస్సుతోకానీ పొందలేని జ్ఞానాన్ని సంపాదించింది. కౌశికుడుకి హితబోధ చేసింది.
స్వధర్మ పాలన యొక్క శక్తి మనకు ధర్మవ్యాధుని వలన తెలిసింది. ఈతడు కసాయి వాడైనా స్వధర్మాన్ని నిర్వర్తించాడు కాబట్టి కౌశికుడికి హితబోధ చేయగలిగాడు.
మాతాపితరుల సేవ యొక్క ఔన్నత్యం ప్రాముఖ్యత ధర్మవ్యాధుడు మనకు స్పష్టంగా చూపినాడు. జన్మనిచ్చినవారికి కృతజ్ఞత చూపింటం భారతీయుల ప్రథమ కర్తవ్యం అని చెప్పాడు.

https://neetikathalu.wordpress.com/category/dharmam/matapitaseva/

 

 

 

 

ఒక్క చెడు అలవాటును మానడం వల్ల మనలో వచ్చే పరివర్తన!!

విలువ :సత్యం

అంతర్గత విలువ:సత్ప్రవర్తన

 

ProphetMuhammad_24562

 

ఆత్మీయత

image.png

విలువ :ప్రేమ

అంతర్గత విలువ :శ్రద్ధ, ఇతరుల కష్ట సుఖాలు గమనించడం తగిన రీతిగా ప్రతిస్పందించడం

జాక్ అనే oka యువకుడు ఉండేవాడు. చిన్న తనం లో అతని తండ్రి మరణించాడు. వాళ్ళ కుటుంబం తో చనువు కలిగిన బెల్సర్అనే ఒక వృద్ధుడు జాక్ ను ఎంతో ప్రేమగా చూస్తూ అతనికి కర్రతో వస్తువులను తయారు చేయడం (carpentary) నేర్పించాడు .

కాల క్రమంలో జాక్ కాలేజీకి వెళ్లి చదువు కోవడం ,ఆడ పిల్లలతో స్నేహాలు ఉద్యోగం తీరుబడి లేని జీవన గమనం తన కల లను నిజం చేసుకోవడానికి విదేశాలకు వెళ్ళడం మొదలైన వాటితో క్షణం తీరిక లేకుండా అయిపోయాడు.జాక్ ఆ వృద్దుడిని చూసి చాలా కాలమయింది కూడా. జాక్ కు గతం గురించి ఆలోచించడానికి క్షణం కూడా తీరిక లేదు. తన భవిష్యత్తును తీర్చి దిద్దు కోవడానికి అతడు నిరంతరం శ్రమిస్తున్నాడు. ఈ విషయం లో అతనిని ఏ శక్తి ఆప జాలదు

ఒకరోజున జాక్ తల్లి ఫోన్ చేసి బెల్సర్ మరణించాడని ,ఆయన అంత్య క్రియలు తరువాత రాబోయే బుధవారం నాడు జరుగు తాయని చెప్పింది. జాక్ కు తన చిన్న నాటి సంఘటనలు ఒక దాని వెంట అంతకు ముందు చూసిన సినిమా లో వలె గుర్తుకు వచ్చాయి. జాక్ నేను చెప్పింది వినిపించిందా అని అడిగింది తల్లి. అమ్మా క్షమించు నీవు చెప్పింది వినిపించింది చాలా రోజు లయి పోయింది కదా నేను నిజం చెబుతున్నాను ఆ వృద్ధుడు బెల్సర్ చాలా కాలం క్రిందటే చనిపోయాడని నేను అనుకున్నాను అన్నాడు.

జాక్ తల్లి ఇంకా ఇలా చెప్పింది. “జాక్ ! బెల్సర్ నిన్ను మరచి పోలేదు.నేను కనిపించి నప్పుడల్లా నిన్ను గురించి అడుగుతూ ఉండేవాడు. నువ్వు తనతో ఉన్న రోజులు గుర్తుకు తెచ్చుకునే వాడు అని కూడా చెప్పింది. ఆయనను నేను కూడా ఎంతగా నో ప్రేమిస్తున్నాను అని జాక్ బదులు చెప్పాడు. మీ తండ్రి గారు మరణించిన తరువాత ఆయన మన ఇంటికి వచ్చి నిన్ను ఒక మంచి ప్రయోజకుడయిన వ్యక్తి గా తీర్చి దిద్దదానికి ఎంతో కృషి చేశారు అని గుర్తు చేసింది కూడా.

ఆయన నాకు కార్పెంటరీ నేర్పించారు. చాలా సమయం కేటాయించి నాకు అనేకమైన విషయాలు చెప్పేవారు. ఆయన సహకారం లేకపోతే నేను ఇప్పుడు ఈ వ్యాపారం లో ఉండగలిగే వాడిని కాదు. ఆయన అంత్య క్రియలనాటికి నేను తప్పక అక్కడ ఉంటాను అని జాక్ తల్లి కి సమాధానం చెప్పాడు.

ఎంత తీరిక లేకున్నా జాక్ వెంటనే అందుబాటులో ఉన్న విమానం లో బెల్సర్ అంత్య క్రియలకు హాజరు అయ్యాడు. బెల్సర్ అంత్యక్రియలు పెద్దగా గుర్తించ దగిన అంశం ఏమీ కాదు. ఎందుచేత నంటే ఆయనకు సంతానం లేదు.ఆయన బంధువులలో చాలా మంది చనిపోయారు. అంత్య క్రియలు పూర్తి అయ్యాక జాక్ అతని తల్లి తమ ఇంటికి ప్రక్కనే ఉన్న బెల్సర్ పాత ఇంటిని ఒకసారి చూసి వెళ్ళాలని అనుకున్నారు. జాక్ వెళ్లి ఆ ఇంటి తలుపును తెరచాడు. గుమ్మం లో ఒక్క క్షణం నిలబడిన జాక్ కు మరో లోకం లోకి వెళ్తున్న అనుభూతి కలిగింది.ఆ ఇల్లు ప్రతి అంగుళం జాక్ కు బాగా గుర్తుంది. ఇంటిలోని ప్రతివస్తువు ప్రతి చిత్రం జాక్ కు ఎన్నో పాత జ్ఞాపకాలను గుర్తు చేశాయి. ఒక చోట జాక్ కదలకుండా నిలబడి పోయాడు.. ఏమైంది జాక్ అని అడిగింది తల్లి. ఆ పెట్టె కనబడడం లేదు అన్నాడు జాక్ ఏ పెట్టె అని అడిగింది తల్లి ఇక్కడ ఈ బల్ల మీద ఒక చిన్న బంగారు పెట్టె ఉండేది. దాన్ని ఈ బల్ల మీద ఉంచి బెల్సర్ ఎప్పుడూ తాళం వేసి ఉంచే వాడు. దాంట్లో ఏమి ఉంది అని కొన్ని వేల సార్లు అడిగాను. అతడు విలువైనది గా భావించే వస్తువు ఉందని సమాధానం చెప్పేవాడు. అంత విలువైన వస్తువు ఏమిటో నాకు తెలియదు. ఆ పెట్టె కనబడడం లేదు మిగిలిన వస్తువులు అన్నీ ఉన్నవి ఉన్నట్లే ఉన్నాయి. బహుశా బెల్సర్ కుటుంబానికి చెందిన వారెవరో ఆ పెట్టె తీసుకుని వెళ్లి ఉంటారు. అనుకున్నాడు జాక్ ఆ మాటే తల్లి తో చెప్పాడు;

జాక్ మళ్ళీ తన వ్యాపార వ్యవహారాలలో మునిగి పోయాడు. బెల్సర్ చనిపోయి రెండు వారాలు గడచి పోయాయి. ఒక రోజున జాక్ తన పనులు చక్క బెట్టుకుని ఇంటికి వచ్చే సరికి ఉత్తరాల పెట్టె లో ఒక కాగితం మీద ఇలా వ్రాసి పెట్టి ఉంది. ఒక పార్సెల్ అందజేయడానికి మీ సంతకం కావాలి. ఇంటిలో ఎవరూ లేక పోవడం చేత పార్సెల్ అందజేయ లేకపోయాము. రెండు మూడు రోజులలో ప్రధాన తపాలా కార్యాలయము వద్ద కు వచ్చి మీ పార్సెల్ తీసుకోండి.మరుసటి రోజు ఉదయం పోస్ట్ ఆఫీస్ కు వెళ్లి జాక్ ఆ పార్సెల్ తీసుకున్నాడు. దాన్ని తెరచి చూశాడు. ఆ పార్సెల్ చాలా కాలం క్రిందట పంప బడినట్లు ఉంది. చిరునామా స్పష్టం గా లేక పోవడం చేత అతి కష్టం మీద చదవ గలిగాడు. ఆ పార్సెల్ పంపిన వారి చిరునామా అతి కష్టం మీద మిష్టర్ బెల్సర్ ది అని జాక్ గుర్తించ గలిగాడు. జాక్ ఆ పెట్టెను తన కారు వద్దకు తీసుకుని వెళ్లి దానిని తెరచి చూసాడు. ఆ పార్సెల్ లోపల ఒక బంగారు పెట్టె ,దాని తో పాటు ఒక కవరు ఉన్నాయి. జాక్ చేతులు సన్నగా వణక సాగాయి. ఆ కవరు తీసి దాంట్లో వ్రాసి పెట్టిన ఉత్తరం చదివాడు. దాంట్లో ఇలా వ్రాసి ఉంది.

నేను చని పోయిన తరువాత ఈ పెట్టె దీనిలో వస్తువులు జాక్ కు అందజేయండి. ఇది నా జీవితం లో చాలా విలువైనది. ఆ ఉత్తరం తో పాటు ఒక తాళం చేవ్వి కూడా జత చేయ బడి ఉంది. జాక్ జాగ్రత్త గా ఆ తాళం చెవి తో ఆ పెట్టె తెరిచి చూసాడు. దాల్లో ఒక అందమైన బంగారు వాచ్ ఉంది. దాని కవర్ తీసి చూసే సరికి దాని మీద నాకోసం నీ విలువైన సమయం కేటాయించి నందుకు కృతజ్ఞతలు అని వ్రాసి ఉంది. జాక్ ఒక్క క్షణం , ఆ వాచీ చూస్తూ ఉండి పోయాడు తన అసిస్టెంట్ ను పిలచి జాక్ ఆ రోజు తన కార్యక్రమములను అన్నిటిననీ రద్దు చేయమని చెప్పాడు. అతని అసిస్టెంట్ ఆశ్చర్యం గా ఎందుకు అని అడిగాడు. ఈరోజు నా కొడుకు తో కొంతకాలం గడపాలని అనుకుంటున్నాను అని జాక్ సమాధానం చెప్పాడు. ఇంకా జాక్ తన అసిస్టెంట్ జేనెట్ ను చూసి నీ విలువైన సమయాన్ని నాకోసం కేటాయిస్తున్నందుకు నా కృ త జ్ఞతలు అన్నాడు.

నీతి:–చాలా మంది తమకోసం తమకు ఆప్తులైనవారు కొంత సమయం కేటాయించచాలని మరియు తమ పట్ల శ్రద్ధ చూపిం చాలని కోరుకుంటారు. కానీ అలా చేయడానికి చాలామందికి క్షణం కూడా తీరిక దొరకదు. మనం ప్రేమించే మన పిల్లల విషయం లోను ,మన పైన మమకారం గల పెద్దవాళ్ళ విషయం లోను మనం కొంత సమయం కేటాయించి వాళ్ళను ఆనందం గా ఉండ గలిగేలా చేయడానికి మనం ప్రయత్నం చెయ్యాలి. మనం వాళ్ళకోసం కేటాయించే ఆ కొద్ది సమయం వాళ్ళకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.

 

http://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu