Archive | March 2016

రెండు కుందేళ్లు

download

విలువ – ధర్మం; అంతర్గత విలువ — జ్ఞానం పంచుకోవడం.

 

ఫ్రేడ్రిచ్క్ , వాన్డా రెండు కుందేళ్లు మంచి స్నేహితులు. రోజూ కలిసి నడుస్తాయి. ఒక రోజు  నడిచే దారిలో భూమి కింద రెండు కేరట్ దుంపలు  కనిపించాయి. ఒక కేరట్ పెద్ద ఆకులతో, ఇంకొకటి చిన్నగా ఉంది.

ఫ్రేడ్రిచ్క్ పరుగున వెళ్లి పెద్ద ఆకులతోఉన్న కేరట్ భూమి కింద నుంచి తీసింది. వాన్డా పక్కనే ఉన్న కేరట్ తీసుకుంది . ఆశ్చర్యంగా వాన్డా కేరట్ పెద్దగా ఉంది.

వాన్డా, ఫ్రేడ్రిచ్క్ తో అంది , ‘ఆకులను చూసి కేరట్ పెద్దగా ఉంటుంది అని అనుకోకుడదు’.

రెండూ నడుచుకుంటూ ముందుకు వెళ్ళాయి. దారిలో మళ్ళీ భూమి కింద రెండు కేరట్ దుంపలు కనిపించాయి. ఈసారి వాన్డా జాగ్రత్తగా చూసి పెద్ద ఆకులతో ఉన్న కేరట్ ను తీసుకుంది . పక్కనే ఉన్న కేరట్  ఫ్రేడ్రిచ్క్ తీసుకుంది . ఫ్రేడ్రిచ్క్ కేరట్ చాలా చిన్నగా ఉంది. ఫ్రేడ్రిచ్క్ అంది ‘ చిన్న ఆకులతో ఉన్న కేరట్ పెద్దగా ఉంటుంది అని అనుకున్నాను .’

అప్పుడు వాన్డా అంది  ‘ ఆకులను చూసి కేరట్ తీసుకోకూడదు. ఎప్పుడూ  కేరట్ తీసుకునే ముందర ఆలోచించుకోవాలి .’

మళ్ళీ రెండూ నడుచుకుంటూ ముందుకు వెళ్ళాయి. దారిలో మళ్ళీ భూమి కింద రెండు కేరట్ దుంపలు కనిపించాయి.

ఫ్రేడ్రిచ్క్ కి ఏమి తీసుకోవాలో తెలియలెదు. అప్పుడు వాన్డా జాగ్రత్తగా చూసి ఒక కార్రొట్  ఫ్రేడ్రిచ్క్ కి ఇచ్చింది.

అప్పుడు ఫ్రేడ్రిచ్క్ అంది , ‘వాన్డా నువ్వు నాకన్నా తెలివైనదానివి , చాలా జ్ఞానం ఉన్నదానివి.

అప్పుడు వాన్డా అంది ‘అందరితో పంచుకోని జ్ఞానం ఉండి లాభం లేదు. నువ్వు నాకు చాలా మంచి స్నేహితుడివి, ఈ కేరట్ తీసుకుని తిను ‘.

 

నీతి:-

మనకి ఉన్న జ్ఞానం నలుగురితో  పంచుకోవాలి. మనం తెలివిగా, వివేకంతో ఉంటూ ఇరుగు పొరుగు వారికి సహాయం గా ఉండాలి.

https://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu/

 

పరోపకారం విలువ కట్టలేనిది, విలువ : సత్ప్రవర్తన అంతర్గత విలువ: దయా గుణం

 

ఇద్దరు బాలురు ఒక రోడ్డు మీద నడచి వెడుతున్నారు ఆ రోడ్డు చేల మధ్య గా పోతుంది. ప్రక్కన ఉన్న పొలం లో ఒకరైతు కష్ట పడి పని చేసుకుం టున్నాడు  అతడు తన బూట్లను ఒక చెట్టు మొదట పెట్టి పని చేసు కుంటు న్నాడు ఆ పిల్లలలో చిన్నవాడు తన కంటే పెద్ద వాడైన తన మిత్రునితో మనం ఈ రైతు బూట్లు దాచేద్దాం, అతడు కొంచెం సేపటి తరువాత వచ్చి బూట్లు కనపడక పొతే మొహం ఎలా పెట్టుకుంటాడో చూద్దాం అన్నాడు. ఆ పిల్లలలో పెద్దవాడు ఒక్క క్షణం ఆలోచించి ఆ రైతు కట్టుకున్న బట్టలు  చూస్తే అతడు  చాల బీద వాడిలా కనిపిస్తున్నాడు. నువ్వు చెప్పినట్టు కాకుండా మనం ఒక పని చేద్దాం. అతని రెండు బూట్లలో రెండు వెండి డాలర్లు పెట్టి ఆ బూట్లను పొదలలో పడేద్దాం అప్పుడు ఆ రైతు ఏమి చేస్తాడో చూద్దాం అన్నాడు.రెండవ పిల్లాడు కూడా దానికి ఒప్పుకున్నాడు. అనుకున్నట్లుగానే ఆ పిల్లలు ఆ రైతు రెండు బూట్లలో రెండు వెండి డాలర్లు ఉంచి ఆ బూట్లను పొదలలో దాచేశారు. ఆ రైతు వచ్చి ఏమి చేస్తాడో చూద్దామని వాళ్ళు కూడా పొదలలో కనపడ కుండా కూర్చొని గమనిస్తున్నారు

చాలా సేపటికి ఆ రైతు వచ్చాడు. అతడు బాగా అలసి పోయి ఉన్నాడు. ఒళ్లంతా చెమట పట్టింది తన బూట్లకోసం వెతుక్కున్నాడు. పొదలలో పడి ఉన్న ఒక బూటును పైకి తీసాడు ఆ బూటు అడుగున ఒక వెండి నాణెం కనిపించింది అది చూసి ఆశ్చర్య పోయాడు. ఆ నాణేన్ని వేళ్ళ మధ్య ఉంచుకుని అన్ని వైపులా చూశాడు. ఎవరూ కనబడ లేదు అది కలా నిజమా అని అయోమయం లో పడి పోయాడు  రెండో బూతో తీసి చూసే సరికి దాల్లో ఇంకో వెండి డాలరు కనిపించింది అతడు అంతు లేని ఆశ్చర్యం లో మునిగి పోయాడు. ఇక్కడ నేను ఒక్క డి నే ఉన్నాను ఈ నాణేలను ఈ బూట్లలో ఎవరు పెట్టి ఉంటారు అను కున్నాడు. కృతజ్ఞతాపూర్వకo గా భక్తి తో భగవంతుడికి నమస్కరిం చాడు ఆనందంతో కేకలు పెట్టాడు. కళ్ళలో ఆనంద బాష్పాలు పెల్లుబికి వచ్చాయి. ఆ రైతు అనారోగ్యం తో బాధ పడుతున్న తన భార్యకు, ఆకలితో అలమటిస్తున్న తన పిల్లలకు ఈ విషయం చెప్పాడు. తనకు తెలియకుండానే తనకు సహాయ పడిన చేతులకు మరొకసారి కృ148678950తజ్ఞతలు తెలుపుకున్నాడు.

ఇదంతా చాటు నుంచి గమనిస్తున్నా ఆ పిల్లలు ఆ రైతు వెళ్ళి పోయాక బయటకు వచ్చి మళ్ళీ తమ గమ్య స్థానానికి నడవడం మొదలు పెట్టారు.తమకు తెలియ కుండానే ఒక బీద రైతుకు అత్యవసర సమయం లో సహాయపడగల్గినందుకు వాళ్ళ మనస్సు అపరిమితమైన ఆనందంతో నిండి పోయింది.

నీతి:– దయాగుణం తో చేసిన ఒక చిన్న పని ఒక్కొక్కప్పుడు ఇతరులకు మహోపకారం అవుతుంది. అలా చేయడం ఇచ్చిన వాళ్లకు పుచ్చు కున్న వాళ్లకు కూడా ఆనందాన్ని కలిగిస్తుంది.  అందుచే ఇతరులకు సహాయపడే అవకా శo వస్తే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆ అవకాశాన్ని ఎంతమాత్ర్రము జారవిడుచుకోకూడదు.

http://saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu

 

మనిషి స్వభావము – మార్పు, విలువ — అహింస, అంతర్గత విలువ — సహనం, క్షమ, ప్రేమ

సాధువు ఏకనాధుని ఆశ్రమం వద్ద, కొంత మంది మనుషులు గుంపుగా కూర్చుని జూదం ఆడుకుంటున్నారు.

ఒక రోజు వాళ్ళలో ఒకడికి ఓటమి ఎదురు అయింది. చాలా నష్టపోయాడు. అందరి మీద కోపం, అసూయ పెరిగాయి . అన్నిటికి వాదం మొదలుపెట్టాడు. వాదం నెమ్మదిగా పోట్లాటగా మారింది.

పక్కన ఉన్న తన స్నేహితుడు, ‘కోపం తెచ్చుకోకు’ అని సలహ ఇచ్చాడు.

దానికి ఆ మనిషి ‘నేను ఏమైనా సాధువు ఏకనాథ్ నా  ?’ అని వాదించడం మొదలుపెట్టాడు. ఈవాదన ఇప్పుడు ఇంకో వైపుకు మళ్ళింది.

ఆ గుంపులో నుండి ఇంకోమనిషి వచ్చి ‘సాధువు ఏకనాథ్ ఏమైనా దైవ స్వరుపమా , కోపం రాకపోవడానికి? తను సాధారణమైన మనిషే. ఎవరికైనా కోపం రాకుండా ఉంటుందా ?’ అని వాదించడం మొదలు పెట్టాడు.

ఆ గుంపులో  నుండి ఇంకో మనిషి ఇలా అన్నాడు,’సాధువు  ఏకనాథ్ కి ఆత్మగౌరవం లేదేమో అందుకనే కోపం రాదు’.

ఇలా అందరూ రకరకాలుగా వాదించుకుంటున్నారు.

జూదంలో ఓడిపోయిన డబ్బులు రావడానికి  ఆమనిషి100 రూపాయలు  పందెం వేద్దామా నేను సాధువు ఏకనాథ్ కి కోపం తెప్పించగలను’ అని అన్నాడు.

దానికి అందరూ ఒప్పుకున్నారు.

మరునాడు  ఎవరు అయితే శపధం చేసేరో ఆ మనిషి సాధువు  ఏకనాథ్ ఇంటి దగ్గర నుంచున్నాడు. మిగతా వాళ్ళు దూరంగా నిలబడి గమనిస్తున్నారు.

సాధువు ఏకనాథ్ సూర్యుడు ఉదయించే సమయానికి, బయటికి వచ్చి, భజనలు పాడుకుంటూ గోదావరి నదీ తీరానికి, స్నానానికి బయలుదేరారు.

ఏకనాథ్ ఇంటికి వచ్చేసమయానికి, ఆ శపధం చేసిన మనిషి, నోటిలో కిళ్ళీ వేసుకుని ఆయన ఇంటి దగ్గిర కాచి ఉన్నాడు.

ఏకనాథ్ ఇంటి దగ్గిరకు రాగానే మొహం మీద ఉమ్మి వేసాడు. ఒక్క నిమిషం ఏకనాథ్ , అ మనిషి వంక చూసి, ఏమీ అనకుండా గోదావరి నదీ తీరానికి వెళ్లి స్నానము చేసి వచ్చారు.

ఏకనాథ్ ఇంటి దగ్గిరకు రాగానే, ఆ మనిషి మళ్ళీ ఏకనాథ్  మొహం మీద ఉమ్మి వేసాడు.ఇలా నాలుగుసార్లు ఏకనాథ్  మొహం మీద ఉమ్మి వేసాడు.  అయినా ఆయన ఏమీ అనకుండా భజనలు పాడుకుంటూ గోదావరి నదీ తీరానికి వెళ్ళి స్నానము చేసి వచ్చారు.

దూరం నుంimagesచి అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఏకనాథ్ ఏమీ కోపం లేకుండా గోదావరి నదీ తీరానికి వెళ్ళి స్నానము చేసి వస్తున్నారు.

అందరు పరుగున వచ్చి ఏకనాథ్ కాళ్ళ మీద పడి, ‘మేము చాలా పాపం చేసాము’ క్షమించమని అడిగారు. దానికి సాధువు ఏకనాథ్ అందరిని కౌగిలించుకున్నారు. ఎవరు అయితే ఏకనాథ్  మీద ఉమ్మి వేసాడో అతను చేతులు జోడించి క్షమాపణ అడిగాడు.

ఏకనాథ్ చాలా ప్రేమతో అన్నారు ‘నువ్వు చాలా అదృష్టవంతుడివి, ఎందుకు పాపం చేసాను అనుకుంటున్నావు’.

ఈరోజు ఏకాదశి పుణ్యదినమున నాకు నీవల్ల గోదావరి నదిలో 5 సార్లు స్నానం చేసే భాగ్యం కలిగింది. అందుకని నీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.

ఈ సంఘటన అయిన తరవాత ఎవ్వరూ జూదం ఆడలేదు. అందరు కలిసి దీపం వెలిగించి ప్రార్థన చేయడం మొదలుపెట్టి  ఏకనాథ్ భక్తులుగా మారిపోయారు.

 

 

నీతి :-క్షమ అనేది ఒక దైవ గుణం. ఈ గుణాన్ని మనం గనక పెంచుకుంటే మనలో ప్రేమ, శాంతి పెరుగుతాయి. మనలో వచ్చిన మంచి మార్పు ఇతరులకు ప్రేరణగా నిలుస్తుంది.

 

http://saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu

కాలాన్ని సక్రమంగా గడపటం!!

image

విలువ — సరియిన నడవడి.

అంతర్గత విలువ — సమర్ధవంతంగా కాలాన్ని వాడుకొవడం.

ఒక అబ్బాయికి టీ.వీ  చూడడం బాగా అలవాటు కావటం వల్ల అన్ని పనులు ఆలస్యంగా పూర్తి చెసేవాడు. టీవీ చూడడం కోసం భొజనం కూడా సమంగా చేసేవాడు కాదు.

ఒక రోజు పొస్ట్ బాక్స్ లో అద్భుతమైన పార్సిల్ ఒకటి వచ్చింది.అ పార్సెల్ లో చాలా ప్రత్యేకమైన కళ్ళ అద్దాలు తో పాటు చిన్న సందేశం ఉన్న కాగితం ఒకటి ఉంది.
అది ఏమిటి అంటే “ఈ అద్దముల ద్వారా నువ్వు కాలాన్ని చూడ గలుగుతావు ”

ఆ అబ్బాయికి ఏమీ అర్ధం కాలేదు . వెంటనే ఆ కళ్ళ అద్దాలు పెట్టుకుని తన తమ్ముడి వైపు చూశాడు.అతని తల మీద నుండి పూల దొంతర క్రింద పడటం గమనించాడు .ఒక్కొక్కటిగా నేలమీద ఆ పూలు నేల మీద రాలి పడిపోయాయి. ఆ కళ్ళ అద్దాల తో ఎవరిని చూసినా , అలాగే కనిపిస్తున్నారు. వారి వారి ఎలా ప్రవర్తనని బట్టి పువ్వులు రాలి పడటం కాని వారి తల పైన మరి కొన్ని పూలు పడటం కాని జరుగుతోంది.

మరునాడు భొజనం తినే వేళ మళ్ళీ , గుర్తుకు వొచ్చి కళ్ళ అద్దాలు పెట్టుకున్నాడు. ఆశ్చర్యకరంగా తన తల నుంచి పెద్ద మోతాదు లో పువ్వులు టీవీ వైపు పడటం గమనించాడు. అంతే కాకుండా ,టీవీ పెద్దగా నోరు తెరుచుకుని, పువ్వులు అన్నిటిననీ భయం కరంగా మింగి వెయ్యటం గమనించాడు .అతను ఎటువైపు కదిలినా ఆ టీవీ పూలని తినేస్తోంది.

చివరికి అ అబ్బాయికి,అద్దములతో తాను పొందిన అనుభవం ద్వారా టీ.వీ చూడటం వల్ల తాను ఎంత సమయాన్ని వృధా చేస్తున్నాడో గ్రహించాడు.ఎలాగంటే టీ.వీ వైపు ఎక్కువ పూలు రాలటం,కుటుంబ సభ్యుల విషయానికి వస్తే తక్కువ పూలు పడ్డాయి చక్కగా బుధ్ధి తెచ్చుకుని .ఇంక ఎప్పుడూ కాలాన్ని వృధా చెయ్యకూడదు అని తెలుసు కున్నాడు.

image

 

నీతి:

అనవసరమైన పనులలో మన కాలాన్ని వృధా చెసుకో కూడదు. తెలివిగా కాలాన్ని వాడుకుందాము. టీవీ, కంప్యూటర్, మనల్ని కలవరపరుస్తాయి. సమర్ధవంతంగా కాలాన్ని ఉపయోగ పరుచుకుందాము.కాలం భగవతుని స్వరూపము , కాలం వృధా చేస్తే జీవితం వృధా చేయటమే ఔతుంది.

http://saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu

Volunteer request

యమైన పాఠకులారా

మానవతా విలువలను బోధించే చిన్న చిన్న కధలు మరియు అంశములను మీ అందరితో పంచుకునే దిశగా మేము చేస్తున్న ఈ వినయపూర్వకమైన ప్రయత్నాన్ని ఆదరించి మమ్మల్ని అడుగు అడుగునా ప్రోత్సహిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదములను తెలుపుకుంటున్నాము.

కొంతమంది సేవా కార్యకర్తలం కలిసి పనిచేసి, వివిధ భారతీయ భాషలలో మానవతా విలువలను చాటి చెప్పే ఈ కధలను విశ్వవ్యాప్తంగా ఉన్న పాఠకులందరికీ అందించాలన్నదే మా ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా భారతదేశంలోని అనేక గ్రామీణ ప్రాంతాలకు చెందిన పాఠశాలల లోని విధ్యార్ధులకు ఉపయోగపడే విధంగా మానవతా విలువలతో కూడిన సమగ్రమైన విద్యను బోధించే పుస్తకాలను తెలుగు మరియు ఇతర ప్రాంతీయ భాషలలో అనువదించే కార్యక్రమాన్ని చేపట్టాము.

నిస్వార్ధభావంతో తలపెట్టిన ఈ ప్రయత్నం మరింత విస్తృతంగా కొనసాగడం కోసం చేయూతనందించటానికి ఆసక్తి ఉన్న స్వచ్చంద కార్యకర్తల కోసం ఎదురుచూస్తున్నాము.మీరు, మీ తోటి స్నేహితులు కాని, లేదా ఇతర కుటుంబసభ్యులు కాని ఇందులో భాగస్తులు కాదలచుకుంటే దయచేసి మాకు తెలియచేయండి.

ముఖ్యంగా ఆంగ్లభాష నుండి ఇతర ప్రాంతీయ భాషలలో అనువదించగల నైపుణ్యం కలవారు, సాఫ్ట్ వేర్ కి సంబంధిచిన గూగుల్ టూల్స్ ని ఉపయోగించుకుని టైపింగ్ చేయగలగటం, లేదా అనువదించబడిన అంశములను పరిశీలించి,ప్రూఫులు దిద్దటంవంటి విభాగాలలో నైపుణ్యం కలవారికోసం మేము ఎదురుచూస్తున్నాము.

పదవీవిరమణ చేసిన అధ్యాపకులు, గృహిణులు తమ విరామ సమయమును సద్వినినియోగం చేసుకుని,తమ సేవలతో తోటివారికి ఉపయోగపడుటకు ఇది చాలా చక్కని అవకాశం.

మా బృందం తో కలిసి పనిచేయటానికి ఉత్యాహంతో ముదుకు వచ్చే ఆసక్తికలవారి కోసం ఎదురుచూస్తున్నాము.

కృతజ్గతాభివందనములతో

మీ ,సాయి బాలసంస్కార్ బృందం

సత్సంగత్వము యొక్క గొప్పదనము !!


విలువ : ధర్మము

అంతర్గత విలువ : సత్ప్రవర్తన

 

image

దేవర్షి అయిన నారదడు సాక్షాత్ శ్రీమహావిష్ణువు యొక్క అవతారరూపుడు. అందుకనే యోగీశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణుడు “దేవర్షీణాంచ నారదః” అని అన్నాడు. అట్టి మహనీయుడైన నారదుడు ఒకసారి శ్రీకృష్ణుని దర్శించుటకై వచ్చి దండప్రణామములు చేసి “భగవాన్! సత్సాంగత్యము యొక్క ఫలము దయచేసి వివరముగా చెప్పండి” అని కోరినాడు. జగద్గురువైన శ్రీకృష్ణుడు సత్సాంగత్య మహిమ అనుభవపూర్వకముగానే నారదునికి తెలియచేయాలని సంకల్పించి “నీవు తూర్పువైపుగా వెళితే ఒక పెంటకుప్ప కనిపిస్తుంది. అందులో ఉన్న పేడపురుగును సత్సాంగత్య మహిమేమని ప్రశ్నించు” అని చెప్పి జగన్మోహనముగా చిరునవ్వునవ్వాడు.

పరమాత్మ ఆదేశానుసారమే చేశాడు నారదుడు. నరద మహర్షి ప్రశ్న అడిగాడోలేదో గిలగిలలాడూతూ ప్రాణాలు విడిచింది ఆ పేడపురుగు. ఇలా జరిగిందేమని దుఃఖిస్తూ శ్రీకృష్ణుని వద్దకు వచ్చి జరిగినదంతా విన్నవించుకొన్నాడు నారదుడు. జరిగినది విని జగన్నాటకసూత్రధారి ఇలా అన్నాడు “ఇప్పుడు పశ్చిమదిశగా వెళ్ళు. ఒక పాడుపడిన దేవాలయము అందులో నివసిస్తున్న పావురము కనిపిస్తాయి. నీ సందేహమును అది తీర్చగలదేమో చూడు”. వెంటనే బయలుదేరి పావురమును కలుసుకొని తన ప్రశ్నవేశాడు నారదుడు. అదేమి చిత్రమో ఆ కపోతము నారద మహర్షి పాదలమీద పడి ప్రాణాలు విడిచింది. “ఇది ఏమి వింత? ఇంకా ఎన్ని విధాల ఆ భగవంతుడు నన్ను పరీక్షించదలచాడో?” అని చింతిస్తూ శ్రీకృష్ణుని వద్దకు వచ్చి జరిగినది విన్నవించుకొన్నాడు. “అలా జరిగిందా నారదా? అయితే ఈ సారి ఉత్తర దిక్కుగా వెళ్ళు. అక్కడి సంస్థానములోని మహారాజుకు చక్కని మగశిశువును పుట్టాడు. నీ సందేహమును ఆ శిశువు తీర్చగలదు” అని చెప్పి చిరునవ్వులొలకబోసాడు లీలామానుషవిగ్రహుడైన నందనందనుడు.

మొదటి రెండు మార్లు జరిగినది తలచుకొని కొంచెం సంకోచించాడు నారదుడు. సర్వజ్ఞుడైన స్వామి అది గమనించి “నారదా! నిర్భయముగా వెళ్ళు. ఈ సారి అంతా శుభమే జరుగుతుంది” అని ఆశీర్వదించాడు. వెంటనే నారదుడు బయలుదేరి ఆ శిశువు వద్దకు వచ్చి “ఓ పాపాయి! మహాత్ముల సాంగత్యము వలన కలిగే ప్రయోజనమేమిటి?” అని ప్రశ్నించాడు. నారదుడు ప్రశ్నించిన మరుక్షణం ఆ పసిపాప ఒక దేవతగా మారిపోయి భగవత్స్వరూపుడైన నారదునికి యథావిధిగా ప్రణమిల్లి ఆశ్చర్యముగా చూస్తున్న నారదునితో “దేవర్షి! అలా ఆశ్చర్య పోతున్నారేమిటి? పెంటకుప్పలోనున్న పేడపురుగును నేనే. అప్పుడు నా జన్మజన్మాంతరాల పుణ్యఫలము వలన అమోఘమైన మీ దర్శన భాగ్యము నాకు కలిగినది. మీవంటి దివ్యపురుషుల సందర్శన మాత్రముచే నాకు పావురము యొక్క జన్మ లభించినది. ఆ జన్మలో కూడా మీ దర్శనభాగ్యము లభించుటచే రాజపుత్రునిగా జన్మించినాను. మరల ఈ జన్మలో మీ దుర్లభ దర్శనము కలిగినందు వలన నాకు దైవత్వము లభించినది. మహాత్ముల సాంగత్యము యొక్క మహిమ ఇంతటిది!” అని అంటూ దేవలోకానికి వెళ్ళిపోయాడు.

నీతి :

జగద్గురువులైన ఆదిశంకరులు

“సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలితత్వం నిశ్చలితత్వే జీవన్ముక్తిః ||”

అని ఉపదేశించినారు.

రాజకుమారుడు చెప్పినట్టు ఆ సత్సంగత్యము మంచి పనులు చేయటం  వలన కలుగును. కాబట్టి మనకు మంచిపనులు చేస్తేనే సత్పురుషుల సాంగత్యము కలుగుతుంది .ఈ కారణముగానే ఇంద్రునిచే శాపగ్రస్తుడైన యయాతి కూడా కనీసం తనను సత్పురుషుల సాంగత్యములో ఉండనివ్వమని ప్రార్థించి సద్భువనములో ఉండుటకు దేవేంద్రుని వద్ద వరం పొంది తరించాడు. కనుక మనము ఎల్లప్పుడూ మంచివారితో ఉండి వారినుండి మంచిని గ్రహించి తరించాలి. దుష్టులకు ఎల్లప్పుడూ దూరముగా ఉండాలి.

 

https://neetikathalu.wordpress.com