Archive | December 2021

 ఎవరు గొప్ప భక్తుడు ?

విలువ : ప్రేమ

ఉప విలువ : విశ్వాసము . 

ప్రజలందరినీ నారాయణ ,నారాయణ అని పలకరించే నారద మహర్షి ఒకసారి శ్రీ మహావిష్ణువు ను దర్శించుకోవటం కోసం వైకుంఠానికి వెళ్ళాడు . “ఎవరు గొప్ప భక్తుడు మీ దృష్టిలో?”చెప్పమని విష్ణుమూర్తిని ప్రశ్నించాడు. ఒక్కక్షణం ఆలోచించి శ్రీ మహా విష్ణువు “భారతదేశంలో ని మారుమూల ఒక కుగ్రామంలో ఉన్న ఒక పేద రైతు గొప్ప భక్తుడు” అని నారదునితో చెప్పాడు.నారదుడు చాలా ఆశ్చర్యపడి విష్ణువు అలా చెప్పటానికి కారణం ఏమిటని మళ్ళీ ప్రశ్నించాడు. నిరంతరమూ నారాయణ నామస్మరణ చేసే తనకంటే అతను ఎందువల్ల గొప్ప భక్తుడు అని నారదుని కి చాలా ఆశ్చర్యంగా ఉంది. (జీవితకాలమంతా ప్రతి క్షణమూ నారాయణ నారాయణ నామ జపం చేస్తూ ఉంటాడన్న విషయం లోక విదితమే . )

విష్ణువు నవ్వి ఇది తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుంది. కనుక ఈ లోగా నారదా నీకు ఒక పని చెపుతాను చెయ్యగలవా? అన్నాడు . అర్ధాంగీకారం గానే కొంచెం అయిష్టంగా నారదుడు తల ఊపాడు శ్రీ మహావిష్ణువు నారదునికి ఒక గిన్నె నిండా నూనె అంచు వరకు నింపి ఇచ్చాడు . ఆ నూనె గిన్నె చేతిలో పట్టుకొని ఒక్క చుక్క నూనె బొట్టు కూడా క్రింద పడకుండా ప్రపంచమంతా చుట్టి రావాలి అని చెప్పాడు . నారదుడు జాగ్రత్తగా గిన్నె చేతిలో పట్టుకొని ప్రపంచమంతా చుట్టి రావటానికి బయలు దేరాడు . విష్ణు మూర్తి చెప్పిన విధంగా చుక్క నూనె కూడా క్రింద పడకుండా ప్రపంచమంతా చుట్టూ తిరిగి వచ్చాడు . ఆ గిన్నె చేతికి ఇస్తున్నప్పుడు విష్ణువు నారదునితో నారదా ! నీవు నా కోసం ఈ చిన్న పని చేసినందుకు చాలా సంతోషం .. కానీ ఈ గిన్నె చేతిలో పట్టుకొని తిరిగేటప్పుడు నీవు ఎన్ని సార్లు నా నామం జపించగలిగావు ?అని అడిగాడు .

ప్రజలందరినీ నారాయణ ,నారాయణ అని పలకరించే నారద మహర్షి ఒకసారి శ్రీ మహావిష్ణువు ను దర్శించుకోవటం కోసం వైకుంఠానికి వెళ్ళాడు . ఎవరు గొప్ప భక్తుడు మీ దృష్టిలో? చెప్పమని విష్ణుమూర్తిని ప్రశ్నించాడు. ఒక్కక్షణం ఆలోచించి శ్రీ మహా విష్ణువు “భారతదేశంలో ని మారుమూల ఒక కు గ్రామంలో ఉన్న ఒక పేద రైతు గొప్ప భక్తుడు” అని నారదునితో చెప్పాడు.నారదుడు చాలా ఆశ్చర్యపడి విష్ణువు అలా చెప్పటానికి కారణం ఏమిటని మళ్ళీ ప్రశ్నించాడు. నిరంతరమూ నారాయణ నామస్మరణ చేసే తనకంటే అతను ఎందువల్ల గొప్ప భక్తుడు అని నారదుని కి చాలా ఆశ్చర్యంగా ఉంది. (జీవితకాలమంతా ప్రతి క్షణమూ నారాయణ నారాయణ నామ జపం చేస్తూ ఉంటాడన్న విషయం లోక విదితమే . )

నీతి : జీవితం లో ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ మనం విడువకుండా నామస్మరణ చేయటం నేర్చుకోవాలి . అలవాటు చేసుకోవాలి . మనం చేసే ప్రతి పనినీ భగవంతునికి నివేదించాలి . ఆ పనిని శ్రద్ధా భక్తులతో , నిజాయితితో ,నిర్వర్తిస్తే భగవంతుడు మనతోనే ఎల్లప్పుడూ ఉంటాడు .