Archive | July 2021

నిజమైన భక్తి

          విలువ :   ప్రేమ 

         ఉప విలువ :    భక్తి . 

ఒకానొక  గ్రామంలో ఒక గొప్ప పండితుడు భగవద్గీతను గురించి చాలా చక్కని వ్యాఖ్యానం చేస్తూ ప్రవచనం చెబుతున్నారు . ఆ ప్రసంగం వినడానికి ఒక పల్లెటూరి బైతు కూడా వచ్చాడు. అక్కడున్నవారంతా చాలా శ్రద్ధగా ప్రవచనం వింటున్నారు . కానీ ఈ పల్లెటూరి రైతు మాత్రం ఏడుస్తూ ఉన్నాడు . అక్కడ వ ఉన్నవాళ్లు   ఇతనిని ఎందుకు ఏడుస్తున్నావు? అని అడిగారు. రధ సారధిగా శ్రీ కృష్ణుడు అర్జునుని   రధం నడుపుతున్నాడు.   అర్జునునితో ఏదైనా మాట్లాడాలి అంటే మెడ తిప్పి శ్రీ కృష్ణుడు మాట్లాడాలి కదా . అలా మాట్లాడినప్పుడు  ప్రభువు  మెడ ఎంత నొప్పి పెట్టిందో కదా ! అని ఏడుస్తున్నాను  అని అతను అన్నాడు . ఆ పల్లెటూరి అమాయకపు వ్యక్తి అంతగా ఆ ప్రవచనం లో ని పాత్రలో లీనమై నాడు . అర్జునితో జరిగిన సంభాషణలో శ్రీ కృష్ణుడు పడిన భాదను అతను స్వయంగా అనుభవించగలిగాడు అంటే అతనికి భగవంతుని యందు కల నిజమైన భక్తి మాత్రమే . 

నేర్వవలసిన నీతి :గొప్ప శాస్త్రాలు చదవటం ,వినటం వాటిని గురించి చెప్పడం ఒక విషయం . అయితే అందులో శాస్త్ర సారాంశమును ,అసలైన సందేశమును బాగా అర్థం చేసుకొని దానిని స్వయంగా ఆచరణలో పెట్టకపోతే విన్నది, చదివినది చెప్పింది అంతా వ్యర్థం. శాస్త్రములు కేవలం మనకి మార్గాన్ని చూపే మ్యాప్ ల వంటివి మాత్రమే. మనము విన్నదానిని ,చదివినదానిని అర్థం చేసుకొని వాటిని ఆచరణలో పెట్టగలగాలి .  

https://saibalsanskaar.wordpress.com/2017/07/26/real-devotion/