Archive | May 2014

నమ్మకం ; విలువ: సత్యం అంతర్గత విలువ : ప్రేమ

ఒక రోజు ఒక చిన్న పాప, తన తండ్రి వంతెన దాటుతున్నారు. తండ్రి, తన పాప ఎక్కడ పడిపోతుందో నని, పాపతో ఇలా అన్నారు,’చిన్న తల్లి, నా చెయ్యి పట్టుకో, అప్పుడు నువ్వు, నదిలో పడిపోకుండా ఉంటావు.’
అప్పుడు ఆ పాప ఇలా అంది,’లేదు నాన్నగారు, మీరే నా చెయ్యి పట్టుకోండి’.
‘ఏమిటి తేడా’ అని తండ్రి ఆశ్చర్యంగా అడిగేరు.
‘చాలా తేడా ఉంది నాన్నగారు’ అని పాప సమాధానం చెప్పింది.
little girl

‘నేను మీ చెయ్యి పట్టుకుని, నాకు ఏమైన అయితే, నేను మీ చెయ్యి వొదిలెయచ్చు కదా. కాని మీరు నా చెయ్యి పట్టుకుంటే నాకు ఖచ్చితంగా తెలుసు, ఏది ఏమైన, మీరు నా చెయ్యి వొదలరు అని’.

నీతి :-
భగవంతుడు మనందరికి తండ్రి. భగవంతుడిని మనం వదులుకోవాలి అని అనుకున్నాఆయన మనల్ని వదలరు.
భగవంతుడిని గట్టిగా పట్టుకోవాలి, ప్రేమతో, భక్తి తో కట్టెయ్యాలి.

http://saibalsanskaar.wordpress.com/
https://www.facebook.com/neetikathalu

ఆత్మన్యూనతా భావం కూడా అహంకారమే విలువ: ధర్మం అంతర్గత విలువ: నిజాయితీ

ఒకసారి శ్రీకృష్ణుడు తనకు భరించలేనంత తలనొప్పి వచ్చినట్లుగా నటించడం మొదలుపెట్టాడు. ఆయన నటన ఎంత సహజంగా వుందంటే అందరూ అది పూర్తి గా నిజం అనుకున్నారు. ఆయన తన తలచుట్టూ వెచ్చటి వస్త్రం చుట్టుకున్నాడు. నిద్రలేక పోవడంతో కళ్ళు బాగా ఎర్రబడ్డా యి. ముఖం బాగా వాచి పాలిపోయినట్లు కనిపిస్తోంది. చాల బాధ పడుతున్నాడు. రుక్మిణి సత్యభామ మొదలైన శ్రీ కృష్ణుని భార్యలంతా చాల రకాలైన మందులతో శ్రీ కృష్ణుని తలనొప్పిని తగ్గించే ప్రయత్నాలు చేశారు. కాని వాటి వల్ల ప్రయోజనం లేక పోయింది. వాళ్ళు నారదుడికి ఈ విషయం చెప్పారు.
Lord-Krishna-having-headache నారదుడు శ్రీ కృష్ణుని వద్దకు వెళ్లి ఆయన తలనొప్పి తగ్గే మందు లేదా ఉపాయం చెప్పమని ప్రార్థించాడు. నిజమైన భక్తుని పాద ధూళి మాత్రమే తన తల నొప్పి తగ్గడానికి సరియైన మందు అని శ్రీ కృష్ణుడు నారదునికి చెప్పాడు. నారదుడు పేరు పొందిన భక్తులందరి దగ్గరికి వెళ్లి ఈ విషయం చెప్పి వాళ్ళ పాద ధూళి ఇమ్మని అడిగేడు. కాని వాళ్ళంతా తమ పాద ధూళిని శ్రీ కృష్ణుని నొసటి మీద పెట్టడం తగదని తాము చాల తక్కువ వాళ్ళమని వినయంగా తిరస్కరించారు. నారదుడు నిరాశతో తిరిగి వచ్చాడు. శ్రీ కృష్ణుడు నారదుడు చెప్పిన మాటలు వినిబృందావనం వెళ్లి గోపికల వద్ద ప్రయత్నించమని చెప్పాడు. ఆ మాటలు విని శ్రీ కృష్ణుని భార్యలు ఆ గోపికలకు భక్తి గురించి ఏమి తెలుసునని హేళన చేసారు
who_is_the_true_devotee నారదుడు బృందావనం వెళ్లి శ్రీ కృష్ణుడు విపరీతమైన తలనొప్పితో బాధ పడుతున్నాడని వాళ్ళ పాద ధూళి శ్రీ కృష్ణుని నొసటి మీద బొట్టు పెడితే ఆ నొప్పి తగ్గుతుందని చెప్పాడు. మా పాదాల మట్టితో మా స్వామి తలనొప్పి తగ్గుతుందంటే మాకు అంత కంటే ఏమి కావాలి అని, వాళ్ళు ఏమి సందేహించకుండా తమ కాళ్ళ నున్న మట్టి తీసి నారదుడి చేతిలో పోశారు. నారదుడు ద్వారకకు వచ్చే సరికి శ్రీ కృష్ణుడి తలనొప్పి మాయమైంది. ఈ ఐదు రోజుల నాటకం ద్వారా శ్రీ కృష్ణుడు తన భక్తులకు ఒక విషయం చెప్పదలచాడు. నేను తక్కువ వాడిని, పాపత్ముడిని, పనికిమాలినవాడిని అని భావించడం (ఆత్మ న్యూనతా భావం ) కుడా అహంకారమే అవుతుంది.

నీతి:అహంకారం పూర్తిగా నశిస్తే నేను గొప్ప లేదా తక్కువ అనే ప్రశ్నే ఉదయించదు. భగవంతుని చేరడానికి అనుసరించవలసిన మార్గాలలో అహంకారం విడచి పెట్టడం చాల ముఖ్యం అని ఈ కథ మనకు తెలియజెబుతుంది.

http://saibalsanskaar.wordpress.com
https://www.facebook.com/neetikathalu

ఆత్మవిశ్వాసం విలువ : ధర్మం అంతర్గత విలువ : నమ్మకం

ఒక రోజు నేను అందర్నీ వదిలి వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాను. నా ఉద్యోగం, నాకు ఉన్న అనుబంధాలు,ఆధ్యాత్మికత పట్ల నాకున్న శ్రద్ధ అన్నీ వదిలెయ్యాలనిపించింది.
చివరిసారిగా భగవంతుడితో మాట్లాడదామని అడవిలోకి వెళ్ళేను.
దేవుడా ! “వీటినుండి వెళ్ళిపోకుండా నిలబడడానికి నాకు ఒక కారణం చూపించగలవా” అని అడిగాను.
అప్పుడు భగవంతుడు , నీ చుట్టూ ఉన్న అడవిమొక్కలు మరియు వెదురుచెట్లను ఒక్కసారి చూడు అన్నాడు. నేను చూసానని చెప్పేక ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టేడు.
నేను అడవిమొక్కల విత్తనాలు, వెదురు విత్తనాలు ఒక్కసారే పాతేను. రెండింటికి నీరు,వెలుగు అందేలాగ సమంగా శ్రద్ధ తీసుకున్నాను.అడవిమొక్కలు తొందరగా ఎదగడం ప్రారంభించాయి.వాటి పచ్చదనంతో నేలంతా ఎంతో అందంగా కనిపించసాగింది.వెదురు విత్తనాలు అలాగే వున్నాయి.వాటిలో ఏమాత్రం ఎదుగుదల లేదు, అయినా నేను నిరాశ పడలేదు.
ఒక సంవత్సరం గడిచింది, అడవిమొక్కలు ఇంకా బాగా ఎదిగి నేలంతా పరచుకుంటున్నాయి, కాని వెదురు విత్తనాలు అలాగే వున్నాయి, అయినా నేను నిరాశపడలేదు. మూడవ సంవత్సరంలో కూడా వెదురు విత్తనాల్లో మొలక రాలేదు, అయినా నేను నిరాశపడలేదు, నాలుగవ సంవత్సరంలో కూడా ఎలాంటి ఎదుగుదల లేదు.
Fern_Forest_by_KKtrin .
ఐదవసంవత్సరంలో చిన్న మొలక కనిపించింది. అడవిమొక్కలతో పోలిస్తే చాల తక్కువనే చెప్పాలి,కాని 6నెలలు గడిచేసరికి 100 అడుగుల ఎత్తు వెదురు చెట్లు లేచాయి.5 సంవత్సరాలుగా వెదురు విత్తనాలు భూమిలో వుండి , చెట్టుగా మారేక నిలబడడానికి అవసరమైన వేళ్ళను బలంగా తయారుచేసుకున్నాయి.
BambooStand
నా సృష్టిలో ఏ ప్రాణికీ అది చెయ్యలేని పనిని నేను ఇవ్వను. ఇన్ని సంవత్సరాలుగా నువ్వు పడుతున్న ఒత్తిడి వల్ల జీవితాన్ని ఎదుర్కొందుకు అవసరమైన ధైర్యం నీలో పెరుగుతోంది.వెదురు చెట్ల విషయంలో నిరాశపడి వాటిని వదిలిపెట్టలేదు, అలాగే నిన్ను కూడా వదిలిపెట్టను. నిన్ను నువ్వు ఇతరులతో పోల్చుకుని తక్కువ చేసుకోకు. అడవిమొక్కలు, వెదురుచెట్ల లక్ష్యం ఒకటికాదు, కాని ఆరెండుకలిసి అడవిని అందంగా చేస్తున్నాయి.

నీకు కూడా మంచికాలం వస్తుంది. అప్పుడు నువ్వు కూడా జీవితంలో పైకి ఎదుగుతావు. నీ ఎదుగుదల ద్వారా నా కీర్తిని వ్యాపింపచెయ్యి అని చెప్పేడు. దేవుడు నన్ను వదిలిపెట్టడన్న నమ్మకంతో నేను ఇంటికి తిరిగివచ్చేను. భగవంతుడు ఈ విశ్వానికే తండ్రి కాబట్టి తన పిల్లలవిషయంలో అశ్రద్ధ ఎప్పుడూ చూపడు. ఒత్తిడి తట్టుకోలెక మనమే ఆయన్ని అపార్థం చేసుకుంటాము.

మంచి రోజులు సంతోషాన్ని ఇస్తే , చెడ్డ రోజులు అనుభవాల్ని ఇస్తాయి. జీవితంలో రెండెంటి విలువ తెలుసుకోవడం మన కర్తవ్యం.
నీతి: ఇతరులతో పొల్చుకోవడం మానేసి మన పనిమీద దృష్టి పెట్టగలిగితే విజయం సాధించడం సులభం అవుతుంది. మన కర్తవ్యం నిర్వహించి మిగిలినది భగవతుడికి వదిలెయ్యాలి. అడవిమొక్కలు, వెదురుచెట్లలాగే మనుషులందరి జీవితాలకి విభిన్నమైన లక్ష్యాలు ఉంటాయి. నమ్మకంతో ప్రయత్నం చేసి వాటిని చేరుకోవడం మన కర్తవ్యం.

http://saibalsanskaar.wordpress.com
https://www.facebook.com/neetikathalu

నిష్కల్మష మైన మనస్సు విలువ: ధర్మం అంతర్గత విలువ: ఆశావహ దృక్పథం

ఆరు సంవత్సరాలు వయస్సు గల పాప తల్లి తో కలసి wall mart లో కొన్ని వస్తువులు కొనడానికి వెళ్ళింది. ఎర్రని జుట్టు, అమాయకత్వం ప్రస్ఫుటమౌతున్న అందమైన ముఖంతో ఆ పాప చూడ ముచ్చటగా ఉంది. ఆ సమయంలో బయట వర్షం పడుతోంది. హఠాత్తుగా వచ్చిన వర్షానికి రోడ్డు మీద, రోడ్డు ప్రక్కన కాలువలోను నీరు పొంగి పొర్లుతోంది. మేమందరం ఆ షాపు గుమ్మానికి కొంచెం లోపల ఒక కాన్వాస్ కింద నిలబడ్డాము. ఈ వర్షం వల్ల వాళ్ళ రోజువారి పనులకు ఇబ్బంది కలిగిందని కొంతమంది చిరాకు పడుతున్నారు.
నేను ఎప్పుడూ వర్షాన్ని చూసేసరికి మంత్రం ముగ్ధుడనయిపోతాను. నన్ను నేను మరచిపోతాను. భగవంతుడు ఈ వర్షం ద్వారా ఈ భూమి మీద దుమ్ము, ధూళి, మురికి కడిగేస్తున్నాడని అనిపిస్తుంది. చిన్న పిల్లవాడు పరుగెత్తుతూ, ఆడుతూ, గంతులేస్తూ ఆనందంగా ఉన్నట్టు నేను కూడా రోజూ ఉండే సమస్యలు, బాధలు మరచిపోతాను.
ఆ పాప తీయని గొంతు, అమాయకమైన మాటలు మాకెంతో ఆనందాని కలిగిస్తున్నాయి. అమ్మా ఈ వర్షం లో నడుద్దామా అని పాప తల్లిని అడిగింది. వద్దు వర్షం తగ్గే దాకా ఆగుదాం అంది తల్లి. పాప ఒక్క నిముషం ఆగి మళ్ళీ అదే ప్రశ్న వేసింది. వర్షం లో నడిస్తే జలుబు చేస్తుంది అంది తల్లి. పాప మళ్ళీ తల్లి చెయ్యి పట్టుకొని గారాలు పోతూ అమ్మా అలా కాదు ప్రొద్దున్న నువ్వు అలా చెప్ప లేదు అంది. ప్రొ ద్దున్నా.. వర్షంలో తడిస్తే జలుబు చేయదని నేనెప్పుడు చెప్పాను అని అడిగింది తల్లి. నీకు గుర్తు లేదా నాన్నతో నువ్వు ఆయన cancer వ్యాధి గురించి మాటలాడేటప్పుడు, భగవంతుడు మన వద్దకు ఎలా రావాలంటే అలా వస్తాడు. ఆయన ఎలా రావాలనుకుంటే అలా ఏవిధంగానైనా రాగలడు అని చెప్పేవు కదా. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ నిశ్శబ్దం గా పాప మాటలు వింటున్నారు. మాకు వర్షం శబ్దం తప్ప ఇంకేమీ వినబడడం లేదు. తల్లి ఏం సమాధానం చెబుతుందో అని అంతా చూస్తున్నారు చిన్న పిల్ల మాటలు పట్టించు కోదులే అని కొందరు అనుకున్నారు. చిరాకు పడుతుందని కొందరు అనుకున్నారు.
delhi-rain-monsoon
కాని ఇది ఆ చిన్న పాప జీవితం లో ఒక ముఖ్యమైన సన్నివేశం. అమాయకమైన ఆ పాప నమ్మకాన్ని సమర్ధిస్తే అది విశ్వాసం గా అభివృద్ధి పొందుతుంది.
తల్లి అంది పాపతో నువ్వు చెప్పింది ఖచ్చితంగా నిజం. మనం వర్షం లో నడుద్దాం. మనం తడిసి పోవాలి అని భగవంతుడు భావిస్తే ఈ వర్షంతో భగవంతుడు మనల్ని పునీతం చేస్తాడు. మేమంతా గమనిస్తూనే ఉన్నాము, వాళ్ళు వర్షం లో వెళ్లి పోయారు నవ్వుకుంటూ త్రుళ్ళు కుంటూ అక్కడ ఉన్న కార్లు దాటి వెళ్లి పోయారు వాళ్లకు జలుబు చేసింది. కొంతమంది చిన్న పిల్లల లాగ నవ్వుకుంటూ అరుస్తూ వాళ్ళ వెనకే వెళ్లారు, నేను కుడా వాళ్ళను అనుసరించాను. నాకు కుడా జలుబు చేసింది. నేను కుడా ఈ వర్షం లో పునీతుడను కావాలని నా భావన.

నీతి: ఏ విషయాన్నైనా ముందు మనం నమ్మాలి, ఆచరణ లో పెట్టాలి. అప్పుడే ఇంకొకళ్ళకు చెప్పాలి. అప్పుడే అది పని చేస్తుంది
http://saibalsanskaar.wordpress.com/
https://www.facebook.com/neetikathalu