Archive | July 2014

భగవంతుని మీద నమ్మకం, విలువ : సత్యం, అంతర్గత విలువ : నమ్మకం

శాంతి తన స్నేహితురాలి ఇంటికి వెళ్ళి అనుకోకుండా చాలా సేపు ఉండిపోయింది. చీకటి పడింది, తన ఇంటికి వెనక్కి, ఒక్కత్తి నడుచుకుంటూ వెళ్తోంది. తనని ఇంటికి జాగ్రత్తగా తీసుకుని వెళ్ళమని, భగవంతునికి ప్రార్థన చేసుకుంది.ladyఇంటికి దగ్గర త్రోవలో నడుచుకుంటూ వెళ్తోంది, చాలా చీకటిగా ఉంది. సగం దూరం నడిచాక, రోడ్డు చివర ఒక మనిషి నుంచుని ఉన్నాడు. తన కోసమే నుంచున్నట్టు, శాంతికి అనిపించి , చాలా భయపడింది,రక్షించమని భగవంతుడిని వేడుకుంది. వెంటనే శాంతికి ఎంతో ధైర్యంగా అనిపించింది. ఎవరో తనతో పాటు నడుస్తున్నట్టుగా అనిపించింది. ఆ మనిషి నుంచున్న చోటు దాటి జాగ్రత్తగా ఇల్లు చేరింది.imagesXGFEY3DIతరవాత రోజు పేపర్ లో, నిన్న రాత్రి ఒక యవతి బలాత్కరింపబడింది అన్న వార్త చూసింది. సమయం చూస్తే శాంతి అక్కడ నుంచి వచ్చిన 20నిమిషాలకి ఈ సంఘటన జరిగింది. ఇది విని శాంతి బాధతో ఏడవడం మొదల పెట్టింది.
భగవంతునికి కృతజ్ఞత చెప్పుకుని, ఆ యువతికి సహాయం చెయ్యడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్ళడానికి నిర్ణయించుకుంది. శాంతి తప్పు చేసిన మనిషిని గుర్తుపట్టగలనని, తన కధ అంతా పోలీస్ కి చెప్పింది. అప్పుడు పోలీస్ శాంతిని, తప్పు చేసిన మనిషిని గుర్తుపట్టగలవా అని అడిగారు. వెంటనే శాంతి, ఆ మనిషిని గుర్తు పట్టి చూపించింది.
తప్పు చేసిన మనిషి వెంటనే క్షమాపణ కోరుకున్నాడు. శాంతి ఆ మనిషిని ఒక ప్రశ్న అడగచ్చా అని పోలీస్ ని అడిగింది. తనని ఎందుకని ఏమీ చెయ్యలేదు అని అడిగింది.పోలీస్ అడగగానే, అప్పుడు ఆ మనిషి ఇలా అన్నాడు. శాంతితో పాటు ఇద్దరు పెద్ద మనుషులు, తనకి రెండు వేపులా నడుస్తున్నారు.

నీతి:
నమ్మకం పర్వతాలని కూడా కదపగలదు. భగవంతుడు మనతో పాటు ఎప్పుడు ఉంటాడు, మనల్ని కాపాడతాడు, మనల్ని వదలడు, మనలోనే ఉన్నాడు, మనకి ధైర్యాన్ని ఇస్తాడు, అని చాలా నమ్మకంతో ఉండాలి. మన మనసుకి ధైర్యాన్ని ఇవ్వమని భగవంతునికి ప్రార్థన చెయ్యాలి.
ఆ నమ్మకమే ఎటువంటి సందర్భంలో అయినా మనల్ని కాపాడుతుంది.

http://saibalsanskaar.wordpress.com
https://www.facebook.com/neetikathalu

రామనామవైశిష్ట్యం , విలువ : ధర్మం, అంతర్గత విలువ: జ్ఞానం

ఒక గురువుగారు తన శిష్యులకి విష్ణుసహస్రనామం బోధిస్తూ ఈ క్రింది శ్లోకం చెప్తున్నారు.
“శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే”
తరవాత ఈ విధంగా చెప్పసాగేరు.
3 సార్లు రామ నామం చెప్తే విష్ణుసహస్రం మొత్తం చదివిన ఫలితం వస్తుంది లేదా 1000సార్లు రామనామం చేసిన పుణ్యం వస్తుంది.

అప్పుడు ఒక విద్యార్థి లేచి అదెలా కుదురుతుంది గురువుగారు , 3 సార్లు = 1000 సార్లు ఎలా అవుతుంది అని అడిగాడు.
ఆ గురువుగారు గొప్ప రామభక్తుడు మరియు బుద్ధికుశలత కలిగిన వ్యక్తి. ఆయన ఈ విధంగా చెప్పేరు. అన్ని నామాలలోకి రామనామం చాలా గొప్పదని, రామనామస్మరణ చెయ్యడం వల్ల విష్ణు సహస్రనామం చేసిన ఫలితం పొందవచ్చని భగవానుడైన ఈశ్వరుడు తెలియచేశారు.
సంఖ్యాపరంగా ఈ విధంగా నిరూపించవచ్చు.

రా ( య, ర, ల, వ,శ,ష లలో 2వది)
మ ( ప,ఫ,బ,భ,మ లలో 5వది)

రా*మ= 2*5=10
రామ రామ రామ = 2*5*2*5*2*5=10*10*10=1000srr
ఈ విధంగా 3సార్లు రామనామం చేస్తే 1000కి సమానం అవుతుంది.
ఈ వివరణతో ఆ అబ్బాయి సంతృప్తి చెంది శ్రద్ధగా విష్ణుసహస్రం నేర్చుకోవడం మొదలుపెట్టాడు.
sri rama slokam

నీతి : మనం పాటించే ఆచారాలు,పద్ధతులు మరియు చేసే ప్రార్థనల అంతరార్థాన్ని వివరిస్తూ పిల్లలకు బోధించాలి. దీనివల్ల వాటి విలువను తెలుసుకోగలుగుతారు. అనుభవం ద్వారా సంపాదించిన జ్ఞానం ఎప్పటికీ నిలబడుతుంది.

http://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

చేతనైనంత సహాయం చెయ్యండి, విలువ : ప్రేమ ,అంతర్గత విలువ: దయ

ఒక పరిచారిక చాలా అలసట, బాధతో ఉన్న ఒక పెద్దాయన మంచం దగ్గరికి ఒక వ్యక్తిని తీసుకుని వెళ్ళింది. ‘మీ అబ్బాయి ఇక్కడ ఉన్నాడు’ అని ఆ పెద్దాయనకి చెప్పింది. చాలా సార్లు ఆ మాట చెప్పాల్సి వచ్చింది, రోగి కళ్ళు తెరిచే లోపల.

రోగి గుండె నెప్పితో బాధ పడటం వల్ల, ఎక్కువ మోతాదు మత్తు మందు ఇవ్వటం జరిగింది. నెమ్మదిగా కళ్ళు తెరిచి చూస్తే, తన మంచం పక్కన, మంచి దుస్తులు వేసుకున్న ఒక అబ్బాయి నుంచుని ఉన్నాడు. పెద్దాయన , తన చెయ్యి బయటికి పెట్టారు, అప్పుడు ఆ అబ్బాయి కూడా,
చెయ్యి ప్రేమతో పట్టుకున్నాడు. అప్పుడు పరిచారిక, ఆ అబ్బాయికి ఒక కుర్చీ తెచ్చి వేసింది.nu219002 రాత్రంతా ఆ అబ్బాయి మంచం పక్కనే, పెద్దాయన చెయ్యి ప్రేమతో పట్టుకుని, కబుర్లు చెబుతూ, ధైర్యాన్ని ఇచ్చాడు. కొంచెంసేపు అయ్యాక, పరిచారిక, ఆ అబ్బాయిని విశ్రాంతి తీసుకోమని అడిగింది, కానీ ఆ అబ్బాయి ఒప్పుకోలేదు.

అప్పుడప్పుడు ఆ పెద్దాయన, ఏదో మాట్లాడినట్టు అనిపించేది. కానీ చూస్తే, ఆ అబ్బాయి చెయ్యి, రాత్రి అంతా గట్టిగా పట్టుకునే ఉన్నారు.
తెల్లవారుజామున, పెద్దాయన కన్ను మూశారు. ఆ అబ్బాయి వెళ్ళి పరిచారికకి, తెలియ చేశాడు.

పరిచారిక అన్ని పనులు పూర్తిచేసుకుని వచ్చేదాకా, ఆ అబ్బాయి అక్కడే ఉన్నాడు.పరిచారిక,ఆ అబ్బాయిని ఓదారుస్తూ ఉండగా, ఆ అబ్బాయి ఆమెను ఆపి, ఆ పెద్దాయన ఎవరు అని అడిగాడు. పరిచారిక ఆశ్చర్యంతో ‘మీ తండ్రిగారు కాదా’ అని అడిగింది. దానికి ఆ అబ్బాయి’నేను ఎప్పుడూ, ఆయనని చూడలేదు’ అని సమాధానం చెప్పాడు. దానికి పరిచారిక’నేను ఆయన దగ్గరికి తీసుకుని, వెళ్ళినప్పుడు, ఏమీ మాట్లాడలేదే?’ అని అడిగింది.
ఆ అబ్బాయి సమాధానం చెప్పాడు, ‘ఎక్కడో పొరపాటు జరిగింది, అని వెంటనే తెలిసింది, కానీ ఆయనకి ఇప్పుడు తన కొడుకు అవసరం అని తెలిసింది. పెద్దాయన చాలా జబ్బుతో ఉండడం వల్ల, అలాగే ఆయనతో ఉండిపోయాను’

‘ఈ రోజు నేను విలియం గ్రే గారిని చూడడానికి వచ్చాను. అయిన కుమారుడు, ఈ రోజు ఇరాక్ లో మరణించాడు. ఈ పెద్దాయన గారి పేరు ఏమిటి?’
పరిచారిక కళ్ళు నీళ్ళు పెట్టుకుని, ఈయనే విలియం గ్రే అని చెప్పింది.

నీతి:
—–

ఎంత వీలు అయితే అంత సహాయం చెయ్యాలి. మంచి మాట, చిరునవ్వు, సహాయం ఎదుటి వారికి ఎలా పనికి వస్తుందో మనకి తెలియదు .

http://saibalsanskaar.wordpress.com
https://www.facebook.com/neetikathalu

గురుపూర్ణిమవైశిష్ట్యము

ఆషాఢ శుక్ల పూర్ణిమ ను గురుపూర్ణిమ అని వ్యవ హరించుట సంప్రదాయము . ఇది వేద వ్యాసుని జన్మ దినము గా ప్రసిద్ధము. వేద వ్యాసుని ప్రపంచమునకు గురువు గా భావించుట ఎంతయో సముచితమైన విషయము. మహా భారతము, అష్టా దశ (18) పురాణములు, బ్రహ్మ సూత్రములు మొదలగు అనేక గ్రంథములను రచించి అపారమైన జ్ఞానరాశిని ప్రపంచమునకు అందించిన మహానుభావుడు వేద వ్యాసుడు. మహా భారతము వంటి గ్రంథము ప్రపంచము లో మరే భాషలోను కానరాదు. 1,25,000 శ్లోకములతో గూడి పరిమాణములో మాత్రమే కాక ధర్మ, అర్థ ,కామ మోక్ష రూప మైన చతుర్విధ పురుషార్థ ములు ఉదా హరణము రూపముగా అనేక కథలతో వివరింపబడుట మహా భారతము ప్రత్యేకత. అందుచేతనే” ప్రపంచములో ఏ ది కలదో భారతము నందు అదియే కలదు, భారతము లో ఏది కలదో అదియే ప్రపంచమున కలదు”. అను ప్రశస్తి ఏర్పడినది. గురువు కామ క్రోధ లోభాది అరి షడ్ వర్గములను జయించిన వాడు అయిఉండ వలయును. అట్టి ఉదాత్త లక్షణములు వేద వ్యాసుని యందు కలవని మహా భాగవతములో నారదుడు ఒక సందర్భములో చెప్పి యుండెను. అందుచే వేద వ్యాసుని జన్మదినము గురు పూర్ణిమ గా పేర్కొనబడుచున్నది.
గు అను శబ్దమునకు చీకటి అని అర్థము. రు అనగా పోగొట్టుట అని అర్థము. ఇక్కడ చీకటి అజ్ఞా నమునకు సంకేతము. అజ్ఞానమును పోగొట్టి విజ్ఞానము నొసంగు వాడు గురువు. ఇంతటి విశిష్టమైన అర్థములో గురు శబ్దము వాడ వలసి యున్నది. అందుచే ప్రతి వారును గురువు అని చెప్పదగిన వారు కారు. నిజము గా శిష్యుని జ్ఞానము అనెడి దాహమును ఎవరు ఉపశమింప చేయగలుగుదురో అట్టి వారే నిజమైన గురువు. ఈ విషయము ఈ క్రింది శ్లోకములో ఈ విధముగా వివరింపబడినది.
imagesWCOGXM0X “గురవో బహవ స్సంతి శిష్య విత్తాప హారకాః గురవో విరలాః సంతి శిష్య చిత్తా పహారకాః “

ఈ లోకములో శిష్యుల ధనమును అపహరింప జూచు గురువులు పెక్కు మంది కలరు. కాని వారి చిత్తమును (మనస్సును) హరింపగలవారును, శిష్యుల జ్ఞాన దాహమును పోగొట్టగలవారును అయిన గురువులు చాల తక్కువ మంది ఉందురు. అట్టి ఉదాత్త మైన వ్యక్తిత్వము గల వేద వ్యాసుడు మాత్రమే లోకమునకు గురువు. ఆయన జన్మ దినమే గురుపూర్ణిమ.
https://www.facebook.com/neetikathalu

వినయము లేని భక్తి విలువ లేనిది , విలువ: ప్రేమ , అంతర్గత విలువ: వినయము

మేల్పత్తూర్ నారాయణ భట్తత్తిరి, గురువా యూరప్పన్ (శ్రీ కృ ష్ణుని ) భక్తుడు. ఆయన 1586 సంవత్సరములో 1034 శ్లోకములతో సంస్కృతములో “నారాయణీయము” అను గ్రంథమును రచించెను. ఇది భాగవతమునకు సంగ్రహ స్వరూపము. మేల్పత్తూర్ భట్తత్తిరి, అచ్చ్యుత పిషారది శిష్యుడు. ఒకప్పుడు గురువుగారు ఒక తీవ్రమైన వ్యాధితో బాధపడుచుండగా గురుదక్షిణగా భట్టత్తిరి ఆ వ్యాధిని తానే స్వీకరించెను. గురువుగారు ఆరోగ్యవంతులైరి. ఆ వ్యాధి కుదుర్చుటకు సాధ్యము కానిది. ఎజు తచ్చన్ అను భట్టత్తిరి మిత్రుడు గురువాయూరప్పన్ ను సేవించి ఆయన అనుగ్రహముతో వ్యాధినుండి విముక్తుడవు కమ్మని భట్టత్తిరి కి చెప్పెను. సంస్కృత పండితు డైన భట్ట త్తిరి భగవంతుని స్తుతించుచు ప్రతి దినము ఒక్కొక శ్లోకము వ్రాయుచుండెను. ఆఖరి శ్లోకము వ్రాయు సరికి ఆయన వ్యాధి పూర్తిగా తగ్గి ఆరోగ్య వంతుడయ్యెను.
lord-krishna3పూన్తాననం నంబూద్రి కేరళ దేశానికి చెందిన ఒక గొప్ప విష్ణు భక్తుడు. ఆయన భక్తితో వినయంతో గురువాయూ రప్పన్ ను ఆరాధించేవాడు. ఆయన మలయాళంలో “జనప్పన” అనే పేరుతో గురువాయూరప్పన్ ను స్తోత్రం చేస్తూ కొన్ని పాటలు వ్రాశారు. భట్టత్తిరి వలె ఆయన పండితుడు కాక పోయినా ఆయన పాటలు సులువుగా సరళంగా, భక్తీ భావ స్ఫోరకం గా ఉండేవి ఆయన తన పాటలను భట్టత్తిరికి చూపించి వాటిని పరిష్కరించమని (తప్పులను సరి దిద్ద మని ) కోరాడు . భట్టత్తిరి ఆ పాటలు చూచి నంబూద్రి కి సంస్కృత జ్ఞానం లేదని ఆక్షే పించాడు . పూన్తాననం ఇంటికి పోయి
భగవంతుని ముందు పెద్దగా విలపించాడు. ఆ రాత్రి భట్తత్తిరికి ఒక కల వచ్చింది . ఆ కలలో భట్టత్తిరికి ఒక బాలుడు కనిపించాడు. భట్టత్తిరి “నారాయణీయం” చదవడానికి సిద్ధపడుతున్నాడు. . ఆ బాలుడు భట్ట త్తిరి ప్రక్కనే కూర్చున్నాడు.
భట్ట త్తిరి మొదటి శ్లోకం చదవగానే ఆ బాలుడు దానిలో ఒక తప్పును చూపించాడు. అది తప్పే అని ఒప్పుకుని భట్టత్తిరి రెండవ శ్లోకం చదివాడు . అందులో రెండు తప్పులు చూపించాడు . మూడవశ్లోకంలో మూడు, నాలుగవ శ్లోకంలో నాలుగు ఇలా ఆ బాలుడు తప్పులు చూపిస్తూనే ఉన్నాడు . పది శ్లోకాలు చదివే సరికి భట్ట త్తిరికి విషయం అర్థ మయింది ఆ బాలుడు మరెవరో కాదు సాక్షాత్తు భగవంతుడే అని.
తన పాండిత్యం కంటే పూన్తాననం భక్తి యే భగవంతుణ్ణి సంతోషపెట్టింది అని భట్టత్తిరి అర్థం చేసుకున్నాడు. పూన్తాననం వద్దకు పోయి తనను క్షమిం మని వేడు కున్నాడు. భట్ట త్తిరి పూన్తాననం వ్రాసిన “జనప్పన” పుస్తకం తీసి ఆ పాటలను పరిశీ లించాడు. వాటిలో ఒక్క తప్పు కూడా కనపడ లే దు. అవి నిర్దుష్టం గా ఉన్నాయి
నీతి :- పాండిత్యం కంటే వినయ విధేయతలతో కూడిన భక్తి విశ్వాసములే గొప్పవి. శీల నిర్మాణంలో వినయమునకు గల ప్రాధాన్యం విలువ కట్టలేనిది.

http://saibalsanskaar.wordpress.com/
https://www.facebook.com/neetikathalu

అన్నీ మన మంచికే ; విలువ : శాంతి, అంతర్గత విలువ : సహనం

ఏది జరిగినా ఒక కారణం ఉంటుంది.
ఏది జరిగినా మన మంచికే!
కానీ మనం అర్ధం చేసుకోలేక పోవచ్చు; ప్రత్యేకంగా మనకి నచ్చకపోతే.

నేను: స్వామీ, నేను మిమల్ని ఒక ప్రశ్న అడగచ్చా?
భగవంతుడు: తప్పకుండా.
నేను: మీరు నొచ్చుకోరు కదా.
భగవంతుడు: నేను ఏమీ అనుకోను.
నేను: ఈ రోజు నాకు ఎందుకు ఇంత జరిగింది?
భగవంతుడు: అంటే ఏమిటి?
నేను: నిజమే, నేను ఆలస్యంగా లేచాను.
భగవంతుడు: సరే.
నేను: నా బండి పని చెయ్యడానికి చాలా సమయం పట్టింది.
భగవంతుడు: సరే.
నేను: భోజనం దగ్గర ఆలస్యం చేశారు, అందుకని నేను వేచి ఉండాల్సి వచ్చింది.
భగవంతుడు: అవును.
నేను: ఇంటికి వచ్చే దారిలో, ఫోను మాట్లాడదాము అంటే పని చెయ్య లేదు.
భగవంతుడు: సరే.
నేను: అన్నిటికంటే, ఇంటికి వచ్చాక, కాసేపు కాళ్ళకి విశ్రాంతి తీసుకుందాం అనుకుంటే, కాళ్ళు ఒత్తే పరికరం పని చెయ్యలేదు. ఈ రోజు ఏదీ సరిగ్గా లేదు! ఎందుకు అలా చేశారు?
భగవంతుడు: ఈ రోజు ఉదయం యముడు నీకు చాలా దగ్గరగా వచ్చాడు, అప్పుడు నేను ఒక దేవతని నీ ప్రాణాలు కాపాడమని పంపించాను. ఆ సమయంలో నిన్ను పడుకో నిచ్చాను.
నేను: అలాగా…
భగవంతుడు: నీ బండి ఎందుకు పనిచెయ్య లేదు అంటే, అదే దోవలో నువ్వు వెళ్ళి ఉంటే , ఒక మద్యపానం త్రాగిన డ్రైవర్ నిన్ను గాయపరిచేవాడు.
నేను: సిగ్గుతో తలవంచుకున్నాను.
భగవంతుడు: నీ భోజనం ఎందుకు ఆలస్యం అయ్యింది అంటే, వంట వాడు జబ్బుతో ఉన్నాడు, అది నీకు అంట కూడదు. నాకు తెలుసు, నీకు ఉద్యోగానికి వెళ్లకపోతే కుదరదు కాబట్టి.
నేను: బాధతో – సరే.
భగవంతుడు: నీ ఫోను ఎందుకు పని చెయ్యలేదంటే, అవతల వాడు తప్పు సమాచారం ఇవ్వ బోతున్నాడు. నువ్వు మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు.

నేను: అలాగా స్వామి.
భగవంతుడు: ఆ కాళ్ళ పరికరం పని చేసి ఉంటే, ఇంట్లో రాత్రి కి విద్యుత్ సరఫరా ఉండేది కాదు. నువ్వు చీకట్లో ఉండాల్సివచ్చేది.
నేను: నన్ను క్షమించండి స్వామి.
భగవంతుడు: బాధపడకు, నా మీద పూర్తిగా నమ్మకం పెట్టుకో …. అన్ని విషయాల్లోను, మంచి, చెడు రెండింటిలో.
నేను: మిమ్మల్ని నమ్ముతాను.
భగవంతుడు: అనుమానం వద్దు. నువ్వు అనుకున్న దాని కంటే, నేను అనుకున్నది ఎప్పుడూ మంచిది.
నేను: నేను అనుమానపడను. ఈ రోజు జరిగిన అన్ని విషయాలకి ధన్యవాదాలు.
భగవంతుడు: సంతోషం. నాకు నా పిల్లలు అంటే చాలా ఇష్టం. నేను ఎప్పుడూ వాళ్ళని గమనిస్తూనే ఉంటాను.
Devotee-Requesting-Lord Krishna

నీతి:
మనం ఏమీ చెయ్యలేని దానికి, సహనం ఓర్పు ఎంతో అవసరం. మనం చెయ్యగలిగినది చెయ్యడం. సరైన స్వభావం కలిగి ఉండడం. ఏమి జరిగినా మన మంచికే అని తెలుసుకోవాలి. ఎప్పుడు దానిలో ఒక నీతి దాగి ఉంది.

http://saibalsanskaar.wordpress.com
https://www.facebook.com/neetikathalu