Archives

గర్వానికి గుణపాఠము

51667327-3FFB-4085-8E24-CBCC53772AFB
విలువ — అహింస
అంతర్గత విలువ — శాంతము
ఈ కథ మహాత్మా గాంధి గారిది. వారు భారత్ దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన వారు. అహింసకి  ప్రాధాన్యత ఇచ్చిన వారు.
ఒకసారి గాంధీ గారు, ఓడలో ఇంగ్లాండ్ కి ప్రయాణము చేస్తున్నారు.
అదే ఓడలో,  వయసులో ఉన్న ఒక యూరోపియన్  కూడా ప్రయాణము చేస్తున్నాడు . అతను , గాంధీ గారి ని చూసి “బట్ట తల, పళ్ళు ఊడిపోయిన, ఈ ముసలి వాడు, ఇంగ్లాండ్ ఎందుకు వెళ్తున్నాడు ?’ అని అనుకున్నాడు.
అంతే కాకుండా అతను గాంధీగారిని, కించపరుస్తూ , ఫోటోలు తీసి, వాటిమీద, హాస్యంగా వ్రాసి, వెళ్ళి గాంధీ  గారికి ఇచ్చి, ‘ఇవి మీరు ఉంచుకోండి మీకు ముందుముందుగా పనికి రావచ్చు , ఉంచుకోండి ‘ అని అన్నాడు.
గాంధీ గారు, వాటన్నిటినీ  వివరంగా చూసి, అతని దెగ్గిరకి వెళ్ళి చిరునవ్వుతో ‘మీరు చెప్పినట్టు అన్నిటినీ చూశాను కాని , వాటిల్లో  పేపర్ క్లిప్ తప్ప ఉపయోగకరమైనవి నాకు ఏమీ కనిపియ్య లేదు  కనుక  క్లిప్ ని మటుకే ఉంచుకుని ఫోటోలు తిరిగి ఇచ్చేస్తున్నాను.”అని చెప్పారు.
గాంధీ గారి, తెలివితేటలు, వినయం చూసి  ఆ మనిషి సిగ్గుతో తల ఒంచుకున్నాడు.ఇంక ఎప్పుడూ ఎవరినీ  ఇలా హేళన చేయ  కూడదు ,అని అనుకున్నాడు. అప్పటి నుండి
జాతి ,మత ,రంగు ,రూపు మొదలగు బేధములను పక్కన పెట్టి అందరినీ సమానంగా గౌరవించడం అలవాటు చేసుకున్నాడు.
నీతి:
ప్రతి సందర్భంలో శాంతంగా, వినయంగా ఉండడం నేర్చుకోవాలి. ప్రతి మనిషిని, గౌరవించడం, అర్థంచేసుకోవడం నేర్చుకోవాలి. ఎవరినీ హేళాన   చెయ్యకూడదు.గర్వం మంచిది కాదు , అది ఇతరులని బాధ పెట్టి మనకి చెడ్డ పేరు తీసుకొస్తుంది .

మంచి నాలుక-చెడు నాలుక

మంచి నాలుక-చెడు నాలుక

విలువ :అహింస
ఉప విలువ: మిత భాషణ

అనగనగా ఒక రాజు తన ప్రజలని సంతోషపెట్టే విషయముల గురించి తెలుసుకుందామని అనుకున్నాడు. అందుకోసమని ఒక ప్రదర్శనని ఏర్పాటు చేసి ,తమ రాజ్యంలోని తెలివైన వారిని ఆహ్వానించాడు. వారిని ఆ ప్రదర్శనకి ప్రజలని సంతోషపెట్టే వస్తువులని తీసుకురమ్మని ఆదేశించాడు. తాను స్వయంగా ప్రదర్శనని చూద్దామని వెళ్ళాడు.

అక్కడ ఎన్నో కనువిందు కలిగించే పూలు,పండ్లు ,మొక్కలు,మిఠాయిలు,బట్టలు,సంగీత వాయిద్యములు,బంగారు నగలు,చిత్ర కళలు ఇలా ఎన్నో వస్తువులను చూశాడు. కానీ ఇవేవి ప్రజలకి ఆనందం కలిగిస్తాయని రాజుగారికి అనిపించలేదు. చివరకి అక్కడ బంక మట్టి తో చేయబడ్డ ఒక రంగుల శిల్పం ఆయన కంట బడింది.అది ఎంతో ఆకలితో , నాలుకబయిటకి తెరుచుకుని ఉన్న ఒక ముసలి మనిషి శిల్పం . శిల్పం కింద “మంచి నాలుక” అని రెండు పదాలు చెక్కడబడి ఉన్నాయి.

రాజు గారు ,శిల్పిని పిలిపించి ,శిల్పాన్ని ఎందుకలా వింతగా చెక్కావని అడిగారు . దానికి జవాబుగా ఆ శిల్పి,”రాజా ,ఈ ప్రదర్శనలో ఉన్న ఇతర వస్తువుల వల్ల కలిగే సంతోషము తాత్కాలిక మైనది. కాని, దయ మరియు ప్రేమపూరితమైన మాటలు పలికే ఒక మంచి నాలుక ,మనని ఎన్నో ఏళ్ల వరకు ఆనందంగా ఉంచగలదు . మంచి నాలుక మాట్లేడే మాటలు బాధలో ఉన్న వారిలో ఆశ,మరియు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. నిర్బలులలో ధైర్యాన్ని,.ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. అనాధులకి ప్రేమ ,జాలి అందిస్తాయి.కనుక ఒక మంచి నాలుక మటుకే అందరినీ అన్నివేళలా ఆనందంగా ఉంచగలదు”, అన్నాడు. శిల్పి ఆలోచనా విధానాన్ని ప్రశంసిస్తూ రాజుగారు అతనికి ఒక కుండ నిండా బంగారు నాణాలను బహూకరించారు.

మరి కొన్ని రోజులు గడిచాక రాజుగారు మనుషులని బాధపెట్టే విషయములేమిటి అని తెలుసుకుందామని మరొక సారి ఒక ప్రదర్శనని ఏర్పాటు చేయమని ఆదేశించారు. మళ్ళీ రాజ్యంలోని మేధావులని పిలిపించి ఆ ప్రదర్శనలో మనుషులకి బాధను కలిగించి, వారి జీవితాన్ని విషాదంలో ముంచెత్తే వస్తువులని ప్రదర్శించమని కోరారు.

రాజుగారి ఆదేశానుసారం మేధావులు ప్రదర్శనలో కత్తులు,ఖడ్గములు ,కొరడాలు,మధ్యపానము, విషము ,మొరిగేకుక్కలు ఇలా మనుషులకి ఇబ్బందిని , కీడుని కలిగించే వస్తువులని ఉంచారు. కాని ,ఏ వస్తువులు కూడా రాజుగారిని సమాధానపరచలేదు. చివరికి ఆయనకి ఇదివరకు లాగానే బంకమట్టితో చేయబడ్డ ఒక మనిషి విగ్రహం కనిపించింది. ఈ సారి అది కోపంతో మండుతున్న ఎర్రటి కళ్ళు మరియు నల్లటి నాలుక ఉన్న ఒక విగ్రహము. అతను , ఆకలితో బాధపడుతున్న ఒక పేదమనిషిని తిట్టిపోస్తున్నాడు. దాని కింద “చెడు నాలుక” అని రెండు పదాలు చెక్కబడి ఉన్నాయి.

శిల్పిని పిలిచి రాజుగారు ,అటువంటి శిల్పాన్ని ఈ ప్రదర్శనలో ఉంచడం వెనుక కారణమును వివరించమని అడిగారు. దానికి జవాబుగా శిల్పి,”రాజా! ఒక చెడు నాలుక, మనుషుల ఆనందాన్ని ఆశని,ఉత్సాహాన్ని,ధైర్యాన్ని నశింపచేసి వారిని విషాదంలో ముంచేస్తుంది.

చెడునాలుక మనిషుల హృదయాన్ని ఎంత గాయపరుస్తుందంటే ,కొన్నేళ్ల తరవాత కూడా ఆ గాయం మానటం చాలా కష్టము. అందుకే చెడు నాలుక మనిషికి అన్నిటికంటే బద్ధ శత్రువు.
రాజుగారు శిల్పి సమాధానాన్ని మెచ్చుకుని అతని ఆలోచనని ప్రశంసిస్తూ అతనికి కుండనిండా బంగారు నాణాలు,వజ్రములు బహూకరించారు. అంతే కాకుండా శిల్పి చెక్కిన ఈ విగ్రహములు తనకి ఎంతో విలువైన పాఠములు నేర్పాయని మెచ్చుకున్నారు.

నీతి :
చెడు తలంపులు, మాటలతో ఇతరులకి బాధ కలిగించడం వారిని హింసించడమే అవుతుంది.అటువంటి మాటల వలన కలిగే గాయములు ఒక పట్టాన మానవు.
కానీ,ప్రేమతో తీయగా మాట్లాడే మాటలు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. అందుకే ఇతరులని ఎల్లప్పుడూ ఒప్పించలేకపోయినా,వారిని నొప్పించే విధంగా మాట్లాడకూడదు. దయగల హృదయంతో మధురంగా మాట్లాడటం నేర్చుకోవాలి.
మూలము:
శ్రీ సత్య సాయి బాలవికాస్ -గ్రూపు 2 పాఠ్య పుస్తకము
https://saibalsanskaar.wordpress.com/2015/09/04/good-tongue-bad-tongue/

అమోఘమైన ఖడ్గం!

విలువ: అహింస,

అంతర్గత విలువ: శాంతి

ఓ చక్రవర్తి వద్ద ఒక గొప్ప ఖడ్గం ఉండేది.దాని గురించి అందరూ చాలా గొప్పగా చెప్పుకునేవారు.ఆ చక్రవర్తి తన భవనంలో ఎల్లప్పుడూ విందులు విలాసాలలో మునిగి తేలుతూ ఉండేవాడు. ఒకసారి పొరుగున ఉన్న రాజుతో వచ్చిన తగాదా రెండు రాజ్యాలకీ మధ్య యుద్ధానికి దారి తీసింది.

ఇంత కాలం యుద్ధంలో పాల్గొనే అవకాశం వచ్చినందుకు ఆ ఖడ్గానికి ఉత్సాహం ఎక్కువైంది. ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న తన ధైర్యాన్ని మరియు ప్రత్యేకతలను అందరికీ చాటి చెప్పే అవకాశం వచ్చిందని భావించింది.అన్ని ఖడ్గాలకంటే ముందు వరుసలో నిలబడి, తన పౌరుష ప్రతాపాలను చూపి తనే అన్ని అఖండ విజయాలను సాధించినట్టు ఊహలలో తేలిపోయింది.

అనుకున్నట్టే యుద్ధం ప్రారంభమైంది.యుద్ద రంగంలో సంభవించే పరిణామాలను చూసి ఆ ఖడ్గం నివ్వెరపోయింది.తను ఊహించుకున్నట్టు ఏ విషయాలు యుద్ధంలో కనబడలేదు సరి కదా, దానికి విరుద్ధంగా ఎక్కడ పడితే అక్కడ కుప్పలు కుప్పలుగా అన్ని ఆయుధాలు విరిగి పడి ఉన్నాయి.తినడానికి ఏమీ దొరకక లెక్కలేనంత జనం ఆకలి దాహాలతో అలమటిస్తున్నారు.ప్రతి చోట దుమ్ము ధూళి పేరుకు పోయి, శవాలన్నీ రక్తపు బురదగా యుద్ధ రంగం అంతటా దుర్వాసన వస్తూ ఉంది.కాళ్లు-చేతులు తెగి పడిన వారు కొందరు, కొన ఊపిరితో మరికొందరు, గాయాల నుండి రక్తం ఓడుతూ ఇంకొందరు, ఇలా వారందరి హృదయ విదారకమైన ఆర్తనాదాలతో యుద్ధ రంగం మారు మ్రోగి పోkhadgamతూ, చాలా దయనీయంగా కనిపిస్తోంది.

ఇదంతా చూసి ఆ ఖడ్గానికి జ్ఞానోదయం అయింది. యుద్దాలంటేనే విరక్తి కలిగింది.ఇక మీదట ఆటలపోటీలలో తప్ప ఇంకే యుద్ధంలో పాల్గొనరాదని నిర్ణయించుకుంది.యుద్ధాలలో పాల్గొనకుండా ఉపాయాలు ఆలోచిస్తూ ఒక నిర్ణయానికి వచ్చింది.లయబద్ధంగా అటు ఇటు ముందు నెమ్మదిగా కదిలి, క్రమంగా వేగంగా తిరగడం మొదలు పెట్టింది.తరువాత పెద్దగా శబ్దం రావడం మొదలైంది.మిగిలిన ఖడ్గాలు, సైనికుల ఒంటిపై కవచాలు ఇదంతా చూసి అదేమిటని అడిగాయి.“నాకు యుద్ధం అంటే ఇష్టం లేదు, నేను రేపటి నుండి యుద్ధంలో పాల్గొనను”, అని ఖడ్గం సమాధానం ఇచ్చింది.“యుద్ధం అంటే ఎవరు మాత్రం ఇష్టపడతారు, కానీ మనం ఏం చేయగలం”, అని ఒక ఖడ్గం నిట్టూర్చింది. “మీరు కూడా నాలాగనే లయబద్ధంగా కదులుతూ శబ్దం చేయడం మొదలుపెట్టండి, దాని వలన ఎవరికీ నిద్ర పట్టదు”, అని ఖడ్గం సమాధానం చెప్పింది.

అన్ని ఖడ్గాలు మరియు ఇతర ఆయుధాలు అలాగే శబ్దం చెయ్యడం మొదలుపెట్టాయి. శత్రు శిబిరం లోని కత్తులు కూడా వీటితో జత కలిపాయి. రాత్రంతా చెవులు చిల్లులుపడేలా ఎక్కడ చూసినా శబ్దంతో నిండిపోయింది. తెల్లవారే సరికి ఒక్క ఆయుధం కూడా యుద్ధానికి సిద్ధంగా లేదు. రాత్రంతా నిద్ర కరువై సైనికులు, సైన్యాధికారులు మరియు ఇరు రాజులూ నిద్ర కరువై అతి కష్టం మీద సాయంత్రానికి నిద్ర లేచారు. యుద్ధం మరునాటికి వాయిదా పడింది. అన్ని ఆయుధాలు ఆ రాత్రి కూడా మరొక సారి శబ్దం చేయసాగాయి. రాత్రంతా మళ్ళీ ఏ ఒక్కరికి నిద్రలేక యుద్ధం మళ్ళీ ఆ మరుసటి రోజుకు వాయిదా పడింది. ఇలా ఏడు రోజులు గడిచాయి, యుద్ధం వాయిదా పడటం మామూలు అయిపోయింది. ఇరు పక్షాల రాజులు తప్పనిసరి పరిస్థితులలో అసహనంగానే సమావేశమయ్యారు. ఇంతకు ముందు వచ్చిన తగాదాకి ఒకరిపై మరొకరు తీవ్ర కోపంతో ఉన్నా, అతి కష్టం మీద శాంతి చర్చలు కొనసాగించారు. ఆయుధాల శబ్దాలు ఇద్దరికీ చాలా ఆశ్చర్యం కలిగించింది. అందరికీ నిద్రలేక పోవడం కూడా కాస్త అయోమయంగా అనిపించి ఇద్దరూ కొంత సేపు నవ్వుకుని మళ్ళీ స్నేహితులుగా మారిపోయారు.

అదృష్టవశాత్తు వాళ్లిద్దరూ పాత తగాదాలు మరచి యుద్ధానికి చరమగీతం పాడారు. తమ మధ్య శత్రుత్వం అంతరించి మైత్రి నేల కొన్నందుకు సంతోషించి రెట్టించిన ఉత్సాహంతో ఇరువురి రాజ్యాలకూ తిరిగి వెళ్ళారు.తరువాత వారిద్దరూ తరచుగా కలుసుకుంటూ తమ అనుభవాలను పంచుకోవడం మొదలుపెట్టారు. వారి మధ్య శత్రుత్వంకంటే కూడా మైత్రి పెరగడానికి ఎక్కువ సంఘటనలు దోహదం చేశాయని గుర్తించారు.చిన్నపాటి విభేదాలను విస్మరించి శాంతి సౌభాగ్యాలకు, రెండు రాజ్యాల అభ్యున్నతికి కృషి చేస్తూ గొప్ప చక్ర వర్తులుగా పేరు తెచ్చుకున్నారు.

నీతి :- ప్రతి ఒక్కరూ శాంతి, సంతోషాలనే కోరుకుంటారు. యుద్ధం సమస్యలకు పరిష్కారం కాబోదు.శాంతిని స్థాపించడానికి అహింసకు మించిన శక్తివంతమైన సాధనం మరొకటి లేదు.

https://saibalsanskaar.wordpress.com

మనిషి స్వభావము – మార్పు, విలువ — అహింస, అంతర్గత విలువ — సహనం, క్షమ, ప్రేమ

సాధువు ఏకనాధుని ఆశ్రమం వద్ద, కొంత మంది మనుషులు గుంపుగా కూర్చుని జూదం ఆడుకుంటున్నారు.

ఒక రోజు వాళ్ళలో ఒకడికి ఓటమి ఎదురు అయింది. చాలా నష్టపోయాడు. అందరి మీద కోపం, అసూయ పెరిగాయి . అన్నిటికి వాదం మొదలుపెట్టాడు. వాదం నెమ్మదిగా పోట్లాటగా మారింది.

పక్కన ఉన్న తన స్నేహితుడు, ‘కోపం తెచ్చుకోకు’ అని సలహ ఇచ్చాడు.

దానికి ఆ మనిషి ‘నేను ఏమైనా సాధువు ఏకనాథ్ నా  ?’ అని వాదించడం మొదలుపెట్టాడు. ఈవాదన ఇప్పుడు ఇంకో వైపుకు మళ్ళింది.

ఆ గుంపులో నుండి ఇంకోమనిషి వచ్చి ‘సాధువు ఏకనాథ్ ఏమైనా దైవ స్వరుపమా , కోపం రాకపోవడానికి? తను సాధారణమైన మనిషే. ఎవరికైనా కోపం రాకుండా ఉంటుందా ?’ అని వాదించడం మొదలు పెట్టాడు.

ఆ గుంపులో  నుండి ఇంకో మనిషి ఇలా అన్నాడు,’సాధువు  ఏకనాథ్ కి ఆత్మగౌరవం లేదేమో అందుకనే కోపం రాదు’.

ఇలా అందరూ రకరకాలుగా వాదించుకుంటున్నారు.

జూదంలో ఓడిపోయిన డబ్బులు రావడానికి  ఆమనిషి100 రూపాయలు  పందెం వేద్దామా నేను సాధువు ఏకనాథ్ కి కోపం తెప్పించగలను’ అని అన్నాడు.

దానికి అందరూ ఒప్పుకున్నారు.

మరునాడు  ఎవరు అయితే శపధం చేసేరో ఆ మనిషి సాధువు  ఏకనాథ్ ఇంటి దగ్గర నుంచున్నాడు. మిగతా వాళ్ళు దూరంగా నిలబడి గమనిస్తున్నారు.

సాధువు ఏకనాథ్ సూర్యుడు ఉదయించే సమయానికి, బయటికి వచ్చి, భజనలు పాడుకుంటూ గోదావరి నదీ తీరానికి, స్నానానికి బయలుదేరారు.

ఏకనాథ్ ఇంటికి వచ్చేసమయానికి, ఆ శపధం చేసిన మనిషి, నోటిలో కిళ్ళీ వేసుకుని ఆయన ఇంటి దగ్గిర కాచి ఉన్నాడు.

ఏకనాథ్ ఇంటి దగ్గిరకు రాగానే మొహం మీద ఉమ్మి వేసాడు. ఒక్క నిమిషం ఏకనాథ్ , అ మనిషి వంక చూసి, ఏమీ అనకుండా గోదావరి నదీ తీరానికి వెళ్లి స్నానము చేసి వచ్చారు.

ఏకనాథ్ ఇంటి దగ్గిరకు రాగానే, ఆ మనిషి మళ్ళీ ఏకనాథ్  మొహం మీద ఉమ్మి వేసాడు.ఇలా నాలుగుసార్లు ఏకనాథ్  మొహం మీద ఉమ్మి వేసాడు.  అయినా ఆయన ఏమీ అనకుండా భజనలు పాడుకుంటూ గోదావరి నదీ తీరానికి వెళ్ళి స్నానము చేసి వచ్చారు.

దూరం నుంimagesచి అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఏకనాథ్ ఏమీ కోపం లేకుండా గోదావరి నదీ తీరానికి వెళ్ళి స్నానము చేసి వస్తున్నారు.

అందరు పరుగున వచ్చి ఏకనాథ్ కాళ్ళ మీద పడి, ‘మేము చాలా పాపం చేసాము’ క్షమించమని అడిగారు. దానికి సాధువు ఏకనాథ్ అందరిని కౌగిలించుకున్నారు. ఎవరు అయితే ఏకనాథ్  మీద ఉమ్మి వేసాడో అతను చేతులు జోడించి క్షమాపణ అడిగాడు.

ఏకనాథ్ చాలా ప్రేమతో అన్నారు ‘నువ్వు చాలా అదృష్టవంతుడివి, ఎందుకు పాపం చేసాను అనుకుంటున్నావు’.

ఈరోజు ఏకాదశి పుణ్యదినమున నాకు నీవల్ల గోదావరి నదిలో 5 సార్లు స్నానం చేసే భాగ్యం కలిగింది. అందుకని నీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.

ఈ సంఘటన అయిన తరవాత ఎవ్వరూ జూదం ఆడలేదు. అందరు కలిసి దీపం వెలిగించి ప్రార్థన చేయడం మొదలుపెట్టి  ఏకనాథ్ భక్తులుగా మారిపోయారు.

 

 

నీతి :-క్షమ అనేది ఒక దైవ గుణం. ఈ గుణాన్ని మనం గనక పెంచుకుంటే మనలో ప్రేమ, శాంతి పెరుగుతాయి. మనలో వచ్చిన మంచి మార్పు ఇతరులకు ప్రేరణగా నిలుస్తుంది.

 

http://saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu

కలలను వ్యాఖ్యానించిన పక్షి

విలువ: అహింస
ఉపవిలువ: సానుకూల భావములు

 

King dreaming

రాజు అనబడే ఒక యువరైతు తన పొలంలో చాలా కష్టపడి పనిచేసేవాడు. ఒక రోజు సాయంకాలం రాజుగారు ఒక దండోరా వేయించారు “రాజు గారికి వచ్చిన కలకు సరైన అర్ధం చెప్పగలిగినవారు ఏవరైనా సరే వారికి నూరు బంగారు నాణెములు బహుమతిగా ఇవ్వబడతాయి” అని. రాజుగారికి కలలో “ఒక తోడేలు తన ఒడిలోనికి గట్టిగా అరుస్తూ దూకింది.” నాకు ఈ కలకి అర్ధం తెలిస్తే బాగుండును అని తనలో తానే గొణుక్కున్నాడు రాజు. “నీకు వచ్చిన బహుమానంలో సగం నాకు ఇస్తే రాజుగారికి వచ్చిన కలకి అర్ధం చెపుతాను” అన్నది ఒక చిన్న పక్షి రాజుతో. రాజు అందుకు అంగీకరించాడు. “తోడేలు మోసానికి గుర్తు. అందువలన రాజుగారిని జాగ్రత్తగా ఉండమని చెప్పు.” అన్నది పక్షి.
రాజు వెళ్ళి రాజుగారితో ఈ కలకి అర్ధం చెప్పి బహుమానాన్ని పుచ్చుకున్నాడు. “కాని, ఇప్పుడు ఈ బహుమతిలో సగభాగం ఆ పక్షికి ఇచ్చెయ్యాలి కదా!” అనుకున్నాడు రాజు. అతను తన మనస్సును మార్చుకుని పక్షిని తప్పించుకుని వెళ్ళిపోయాడు.
అతడు ఆ డబ్బును తెలివిగా ఖర్చుపెట్టి, బాగా ధనవంతుడు అయ్యాడు. ఐదు సంవత్సరములు గడిచాయి. ఒకరోజు సాయంకాలం రాజుగారి సైన్యాధికారి రాజు ఇంటికి వచ్చి రాజుతో “రాజుగారికి మళ్ళి కల వచ్చింది. కలలో రక్తంతో తడిసిన ఒక బాకు రాజుగారి తలచుట్టూ తిరుగుతూ కనిపించింది.” భయపడిపోయిన రాజు పక్షి కోసం వెతుక్కుంటూ వెళ్ళాడు. మర్రిచెట్టు దగ్గరకి వెళ్ళగానే అతనికి సుపరిచితమైన కంఠధ్వని వినిపించింది. “నేను కలకి అర్ధం చెపితే నీకు వచ్చే బహుమానంలో సగం నాకు ఇస్తావా?” అన్నది పక్షి. ఇస్తానని ప్రమాణంచేసాడు రాజు. “బాకు హింసకి చిహ్నం కనుక రాజుగారు సరైన రక్షణలో ఉండాలని” చెప్పింది పక్షి. ఈసారి రాజుకి బహుమతిగా 1000 బంగారు నాణెములు లభించాయి.
ఈసారి కూడా అతనికి తన బహుమానంలో సగభాగం ఇచ్చిన మాట ప్రకారం పక్షికి ఇవ్వాలని అనిపించలేదు. కాని, ఒకవేళ ఈ పక్షి వెళ్ళి రాజుగారికి అసలు విషయం చెప్పేస్తే! అని భయం కలిగి పక్షి పైకి ఒక రాయి విసిరాడు. అదృష్టవశాత్తు పక్షికి ఎటువంటి గాయము కాలేదు. ఆ పక్షి ఎగిరిపోయి తప్పించుకున్నది. అలా ఏళ్ళుగడుస్తున్నకొద్దీ రాజు అసలు ఈ విషయమే మరచిపోయాడు. మళ్ళి రాజుగారికి మరొక కల వచ్చేదాకా. ఈసారి రాజుగారికి కలలో “తన ఒడిలో ఒక పావురం ఉన్నట్లుగా” కనిపించింది. మళ్ళి రాజు పక్షి దగ్గరికి వెళ్ళి పావురం అంటే “శాంతికి చిహ్నం” అని అర్ధం తెలుసుకున్నాడు. ఈసారి రాజుకి 10,000 బంగారు నాణెములు లభించాయి.

ఈసారి అతను తనకు వచ్చిన బహుమానం మొత్తాన్ని పక్షికి ఇచ్చేసాడు. కాని, పక్షి తనకు వద్దని చెప్పింది. “దయచేసి నువ్వు నన్ను క్షమించానని మాత్రం చెప్పు” అన్నడు రాజు. “మొదటిసారి వాతావరణంలో మోసం ఆవరించిఉండటం వలన నీవు నన్ను మోసం చేసావు. రెండవసారి వాతావరణంలో హింస వ్యాపించి ఉండటంవలన నీవు కూడా హింసాత్మకంగా ప్రవర్తించావు. ఇప్పుడు అంతటా నమ్మకం, శాంతి వ్యాపించి ఉండటంవలన నీవు కూడా దానికి తగిన విధంగానే ప్రవర్తించావు. కొద్దిమంది మాత్రమే తమ అంతరంగమును అనుసరించి ప్రవర్తించగలరు” అన్నది పక్షి.
నీతి: తరచుగా మనం మనచుట్టూ ఉన్న వాతావరణం, వ్యక్తుల వలన ప్రభావితమవుతూ ఉంటాము. సానుకూలధోరణి కల వ్యక్తుల మధ్య ఉంటే మనలో సానుకూలధోరణి పెంపొందుతుంది. వ్యతిరేక భావాలుకల వ్యక్తులు, పరిస్థితులు మనని క్రుంగ దీస్తాయి. అందువల్ల మనం సానుకూల ధోరణి పెంపొందించే వ్యక్తుల సాంగత్యంలో గడపాలి. ఇలా అనుకున్నప్పటికీ మనం మరింత వ్యతిరేక పరిస్థితులలో, వ్యతిరేక ధోరణి కల వ్యక్తుల సాంగత్యంలో పడిపోవచ్చును. అందువల్ల ఇలాంటి పరిస్థితులలోనే మనకి ఇటువంటి వ్యక్తులకు, పరిస్థితులకు లొంగనటువంటి “స్వంతబుద్ధి” కావాలి. ఎటువంటి సవాళ్ళనైనా, ఎటువంటి వ్యతిరేక పరిస్థితులనైనా ఎదుర్కొనగల ఆత్మశక్తిని అభివృద్ధి చేసుకోవాలి. ప్రార్ధనలు, శాస్త్రపఠనం, ఆధ్యాత్మిక సాధనలు, చైతన్య స్ఫూర్తిని కలిగించే కార్యములు చేయటం మనకి సానుకూల ధోరణి పెంపొందించే మార్గమును చూపిస్తాయి. అంతేకాకుండా మనకి అదుపులో లేని విషయాన్ని ఎదుర్కొనగల శక్థిని కలిగిస్తాయి. అయితే ఈ నేర్చుకున్నవన్నీ ఆచరణలో పెట్టగలిగినప్పుడే ఇది సాధ్యం అవుతుంది.

 

https://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

అహింస యొక్క శక్తి, విలువ: అహింస ,అంతర్గత విలువ: మౌనం

image

మహాత్మా గాంధీ గారి మనవడు డా. అరుణ్ గాంధీ; MK గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నాన్ వైలెన్సె స్తాపకులు. వారు తాము యూనివెర్సిటి ఆఫ్ పోరొటోరికో లో ఇచ్చిన ఒక ప్రసంగంలో విచ్చేసిన తల్లితండ్రులకు అహింస యొక్క శక్తిని గురించి చెప్పటానికి, తన జీవితంలో జరిగిన ఒక ప్రత్యక్ష సంఘటన గురించి ఈ క్రింద విధంగా వివరించారు.

“నాకు అప్పుడు పదహారు సంవత్సరములు, నేను చెరుకు పంట మధ్య మా తాతగారు గాంధి గారు స్థాపించిన ఇన్స్టిట్యుట్ లో మా తల్లితండ్రులతో నివసించేవాడిని. సౌత్ ఆఫ్రికా (South Africa) దేశంలో డర్బన్ అనే ఊరికి సుమారు ఒక పద్దెనిమిది మైళ్ళ దూరంలో ఉందేవాళ్ళము.
ఊరికి బాగా దూరంగా ఉండటంవల్ల మా చుట్టు పక్కల ఎవరూ ఉండేవారు కాదు. దాంతో నేనూ నా ఇద్దరు అక్కచెల్లెళ్ళు ఎప్పుడెప్పుడు వెళ్ళి మా స్నేహితులను కలవాలని లేదా సినిమాలకు సరదాగా వెళ్ళాలని ఎంతో ఎదురు చూసేవారము.
ఒకరోజు మా నాన్నగారు నన్ను పట్టణానికి బండి మీద తీసుకెళతానని చెప్పారు. ఆయనకు అక్కడ ఏదో మీటింగు ఉందట. నేను చాలా ఉత్సాహంగా గెంతులేస్తూ తయారయ్యాను. అయితే నాన్నగారు మీటింగు అయ్యేంతవరకు నేను ఖాళీనే కనుక మా అమ్మ కొన్ని సరుకులు తెమ్మని ఒక లిస్ట్ రాసి ఇచ్చింది. అలాగే నాన్నగారు నన్ను పనిలోపని కారుని సర్వీసింగ్ కూడా చేయించమని చెప్పారు.
మరునాడు, అనుకున్న విధంగానే నేను నాన్నగారిని టైముకి దింపేశాను. అయితే వారు నన్ను సాయంత్రం సరిగ్గా అయిదింటికి అదే చోటికి వస్తే కలిసి ఇంటికి వెళదాము అని చెప్పారు. నేను కూడా సరే అని చెప్పి గబగబా పనులన్నీ ముగించుకుని అక్కడ దగ్గరలో ఉన్న టాకీస్ (Theatre) లో జాన్ పెయిన్ చిత్రం చూస్తూ అందులో బాగా మునిగిపోయి టైముని పట్టించుకోలేదు. సడన్ గా అయిదున్నర గంటలకి గుర్తువచ్చి గరాజ్ కి పరుగులు పెట్టి వెళ్ళి , అక్కడ కారుని తీసుకుని నేరుగా దాంట్లో నాన్నగారిని రిసీవ్ చేసుకుందామని వెళ్ళాను.
పాపం వారు నన్ను చూడగానే ఎంతో ఆదుర్దాతో నేను ఆలస్యంగా రావటానికి కారణం అడిగారు.నాకు సినిమా చూస్తూ ఉండిపోయానని చెప్పటానికి ఎంతగానో చిన్నతనంగా అనిపించింది. దాంతో అప్పటికప్పుడు ఏమీ తోచక, కారు సర్వీసింగ్ కి ఇచ్చాకదా నాన్నగారు అక్కడ వాళ్ళు కొంచం ఆలస్యం చేసారు అని తప్పించుకోటానికి అబద్ధం చెప్పేసాను. కాని అప్పటికే నాన్నగారు గరాజ్ కి ఫోన్ చేసారని నాకు తెలియదు. నేను అబద్దం చెప్పానని తెలిసి చాల బాధ పడ్డారు.
ఖచ్చితంగా నాపెంపకంలోనే ఏదో పొరపాటు జరిగింది. అందుకే నువ్వు ధైర్యంగా నిజాన్ని దాచకుండా చెప్పలేక పొయావు. ఎక్కడ తప్పు జరిగిందో నేను తెలుసుకోవాలి. నేను ఇప్పుడు నీ వెంట రాను, నేను ఇంటికి 18 మైళ్ళు నడుచుకుంటూ వెళతాను, దారిలో నాపెంపకంలో ఒక తండ్రిగా నావల్ల ఏమి పొరపాటు జరిగిందో ఆలోచిస్తూ వెళతాను అని అవే ఆఫీసు బట్టలతో వారు అంత చీకటిలో నడుచుకుంటూ వెళ్ళిపొయారు. దారిలో రోడ్డుమీద ఏక్కడా లైట్స్ కూడా లేవు. వారిని ఒక్కరిని అలా ఒంటరిగా పంపటానికి నా మనస్సు ఒప్పుకోలేదు. అందుచేత నేను వారి వెనకాలే చిన్నగా అయిదున్నరగంటలు, కారుని నడుపుకుంటూ వెళ్ళాను.కాని నేను అబద్ధం చెప్పటం వల్ల వారు ఎంత బాధ పడ్డారో నేను చూడలేక పొయాను.
ఆరోజే అప్పటికప్పుడే జీవితంలో ఎప్పుడూ అబద్ధం చెప్పకూడదని నిర్ణయం తీసుకున్నాను. అయితే ఈ సంఘటన గుర్తు వచ్చినప్పుడల్లా ఆరోజు నాన్నగారు, ఈ కాలంలో మనం తప్పు చేస్తే మన పిల్లలని ఏవిధంగా శిక్షిస్తున్నామో మా నాన్నగారు కూడా ఆరోజు నన్ను శిక్షించి ఉంటే నేను తగిన గుణపాఠం నేర్చుకోగలిగేవాడినా అని అనిపిస్తుంది. నేను అబద్ధం చెప్పటం మానగలిగే వాడిని కాదేమో. నాన్నగారు ఎన్నుకున్న ఈ అహింసా మార్గం చాలా శక్తివంతమైనది.నన్ను జీవితంలో ఎప్పుడూ అబద్ధం చెప్పకుండా చేసింది.
నీతి: అహింసలో చాల శక్తి ఉంది. మహాత్మా గాంధీ గారి జీవితమే అహింసా మార్గం. మన భారత దేశానికి స్వతంత్రం తెచ్చిపెట్టింది. మనం ఎదుర్కొనే ఎన్నో సమస్యలకి శాంతి ప్రేమ చక్కటి మార్గాలు. చాలా సార్లు కఠినమైన శిక్షలకంటే మౌనం చాలా గుణపాఠాలను నేర్పుతుంది. పిల్లలకి మంచి బుద్ధులు నేర్పటానికి వారిలో మార్పును తీసుకురావటానికి వారిని భయపెట్టనవసరం లేదు. అహింస తో కుడా మనం వారికి సర్ది చెప్పవచ్చు. వాదనల వల్ల, అరుపుల వల్ల, ఆవేశం ,కోపం ఎక్కువ ఔతాయేకాని పిల్లలలో ఈ మార్పును తీసుకురావు. కేవలం అహింస వల్లనే వారికి ఎప్పటికి మనస్సుకు హత్తుకు పొయే విధంగా నచ్చచెప్పవచ్చు

https://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

మిణుగురు పురుగు, కాకి : విలువ : అహింస, అంతర్గత విలువ: సమయస్పూర్తి

అనగనగా ఒక అడవిలో ఒక మిణుగురు పురుగు వుండేది. అడవిలో సంతోషంగా తిరుగుతూ వుండేది. ఒక రోజు ఒక కాకి వచ్చి ఆ మిణుగురు పురుగును తినబోయింది.

979739-A-single-funny-little-green-smiley-grasshopper-Stock-Vector-cricket-grasshopper-insectనోరు తెరిచిన కాకి తనను మింగేలోపు, “ఆగు! నా మాట వింటే నీకే మేలు” అని అరిచిందా పురుగు.

కాకి “ఏమిటది” అని అడిగింది.

“నీకు నా లాంటి చాలా పురుగులున్న  చోటు ఒకటి  చూపిస్తాను. నన్ను తినేస్తే నీకేమీ లాభం లేదు” అన్నదా పురుగు. కాకి అత్యాశతో ఒప్పుకుంది.

ఆ పురుగు కొంత మంది మనుషులు చలిమంట కాసుకుంటున్న చోటుకు తీసుకు వెళ్ళింది. నిప్పురవ్వలను చూపించి అవన్ని మిణుగురు పురుగులని చెప్పింది.

 
Crow  కాకి ఆ అని నోరు తెరుచుకొని ఆ నిప్పు రవ్వలను మింగేసింది.  నోరు కాలింది. బాబోయి,     ఈ మిణుగురు పురుగలను మనం తినలేమని ఎగిరిపోయింది.

ఆ పురుగు “బలం కన్నా బుద్ధి గొప్పది ” అని తన సమయస్ఫూర్తిని తనే మెచ్చుకుంది.

 

 

 

నీతి:  సమయస్ఫూర్తి  అనేది ఒక కళ. దీనిని అవసరమైనప్పుడు మరియు ఆత్మరక్షణకు ఉపయోగించుకుంటూ జీవితంలో ముందుకు వెళ్ళాలి కాని తెలివితేటలు ఉన్నాయి కదా అని అహంకారంతో మన తోటివారిని ఇబ్బంది పెట్టకూడదు.

 

https://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

 

సింహము-ఎలుక, విలువ: అహింస, అంతర్గత విలువ: స్నేహం

అనగనగా ఒక అడవిలో ఒక సింహము వుండేది. ఒక రోజు మధ్యాహ్నం ఆ సింహము కునుకు తీస్తూ వుండగా ఒక ఎలుక ఆ సింహము పంజా దగ్గర నుంచి వెళ్ళింది. గబగబా పరిగెడుతున్నఎలుకని సింహము పట్టుకుంది. అల్పాహారముగా బాగానే వుంటుందన్న ఉద్దేశంతో ఆ ఎలుకను నోట్లో పెట్టుకోబోయింది.

lion and rat 1

సింహము ఉద్దేశం గ్రహించిన ఎలుక వెంటనే – “ఓ రాజా; నన్ను వదిలెయ్యి. నా చిన్న శరీరంతో నీకు ఎలాగా ఆకలి తీరదు. నన్నువదిలేస్తే ఎప్పుడయినా నీకు పనికివస్తాను!” అని ప్రాధేయపడింది.

“నువ్వు నాకు ఏమి పనికివస్తావులే కాని, క్షేమంగా వెళ్ళు.” అని ఆ సింహము నవ్వుతూ ఎలుకను వదిలేసింది.

ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకు సింహము అడవిలో వేటాడుతుంటే ఒక వేటగాడి వలలో చిక్కుకుంది. ఎంత ప్రయత్నించినా ఆ వలనుంచి బయటపడలేక పోయింది. చివరికి కోపంతో, నిస్సహాయతతో గట్టిగా అడవి మొత్తం వినిపించేలా గర్జించింది. జంతువులన్ని భయపడి దాక్కున్నాయి.

 

 

 

కొద్ది సేపటికి చిన్నగా, బింకంగా ఒక చెట్టు వెనుకనుంచి ఎలుక కనిపించింది. సింహం పరిస్థితి చూసిన వెంటనే ఎలుక తన దంతాలతో ఆ వలను చిన్న చిన్నగా కొరికి తీసేసింది. చాలా సేపు కష్ట పడింది. చివరికి వలలో పెద్ద చిల్లు తయ్యారయ్యింది.lion and rat 2

సింహం వలలోంచి బయట పడింది. ఎలుక వైపు తిరిగి కృతజ్ఞతతో ధన్యవాదాలు తెలపాలనుకునే సమయానికి ఎలుక పారిపోయింది.

“చిన్న ఎలుక నాకు  ఏమి పనికివస్తుంది అనుకున్నాను – ఈ రోజు నా ప్రాణాలు కాపాడింది. నేను ఏ జంతువునీ తక్కువగా అంచనా వెయ్యకూడదు !” అనుకుని సింహం తన దారిని వెళ్ళింది.

 

 

   నీతి: ఈ సృష్టిలో ప్రతి జీవి భగవంతుడికి ప్రియమైనది, ప్రత్యేకమైనది. మనుషులైనా, జంతువులైనా మరి ఏ ఇతర జీవులైనా వాళ్ళ జీవనవిధానానికి అవసరమైన అర్హతలతో సృష్టించబడతాయి.ఎవరినీ తక్కువగా చూడకూడదు అలాగే మిగతావారితో పోల్చుకుని బాధపడకూడదు. అందరినీ గౌరవిస్తూ, స్నేహభావంతో జీవించాలి.

https://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

అహంభావం, విలువ: అహింస,అంతర్గత విలువ: ప్రశాంతత

“టాంగ్” వంశానికి చెందిన ప్రధానమంత్రి జాతీయ నాయకుడిగా, సైనికాధికారిగా సాధించిన విజయాల వలన గొప్ప పేరు ప్రఖ్యాతులు గడించాడు. కాని అతనికి కీర్తి, అధికారం, సంపదల కంటే వినయవిధేయతలు, భక్తితో కూడిన బౌద్ధునిగా ఉండడమే ఎక్కువ ఇష్టం. తనకి ఎంతో ప్రియమైన గురువు జెన్ వద్దకు వెళ్ళి ఎన్నో మంచి విషయాలు నేర్చుకుంటూ ఉండేవాడు. వారిద్దరూ ఎంతో బాగా కలిసి ఉండేవారు.పూజనీయుడైన గురువు, గౌరవప్రదమైన శిష్యుడుగా వారిరువురి మధ్య సఖ్యత చాలా బాగా ఉండేది.

ఒకరోజున ఎప్పటిలాగే గురువు వద్దకు వెళ్ళినపడు ఈ ప్రధానమంత్రి, “బౌద్ధమతం ప్రకారం అహంభావం“ అంటే ఏమిటి? అని ప్రశ్నించాడు. వెంటనే గురువుగారి ముఖం కోపంతో ఎర్రబడి, తిరస్కారపూరితమైన భావంతో ఏమిటా పిచ్చి ప్రశ్న? అని అడిగారు.

 

unnamed

ఎదురుచూడని ఈ సమాధానంతో ప్రధానమంత్రికి కోపం,బాధ వచ్చాయి. అప్పుడు ఆ జెన్ గురువు చిరునవ్వుతో ప్రధానమంత్రి గారూ; అహంభావం అంటే ఇదే అన్నారు.

నీతి: వివరాలు తెలుసుకోవడం కంటే, స్వయంగా అనుభవం పొందడం వల్లనే విషయాలు చక్కగా అర్థం అవుతాయి. జెన్ గురువులు ఈ విధంగా సులభమైన విధానాలలో సాధకులైన శిష్యులకు చక్కగా అర్థం అయ్యేలా బోధ చేస్తూ ఊంటారు. ఇది చాలా ఆసక్తికరమైన బోధనా విధానం.

https://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu