Archive | September 2015

బ్రాహ్మణి –ముంగిస, విలువ:ధర్మప్రవర్తన,అంతర్గత విలువ:విచక్షణ

panchatantra-brahmani-mongoose_05

ఒకానొక నగరంలో ఒక బ్రాహ్మణుడు తన భార్యతో నివసిస్తూ ఉండేవాడు. బ్రాహ్మణుడి భార్య ఒక మగపిల్లవాడిని ప్రసవించింది. అదే సమయంలో ఒక ముంగిస కూడా మగముంగిసకు జన్మనిచ్చింది. బ్రాహ్మణుడి భార్య (బ్రాహ్మణి) ముంగిస బిడ్డని దత్తత తీసుకుని తన కొడుకుతో సమానంగా పెంచసాగింది. ముంగిస స్వభావాన్ని బట్టి అది ఎప్పుడైనా తన కుమారుడికి అపాయం కలిగించవచ్చుననే భయంతో బ్రాహ్మణి తన కొడుకుని ముంగిసతో ఎప్పుడూ ఒంటరిగా వదిలేది కాదు. ఎంత అందవికారి, మూర్ఖుడు, క్రూరుడు ఎలాంటివాడయినప్పటికి తల్లితండ్రులకి తమ బిడ్డ ముద్దుగానే అనిపిస్తాడు.
ఒకరోజు చెరువునుంచి నీళ్ళు తేవటానికి వెళుతూ బ్రాహ్మణి తన పిల్లవాడిని భర్తకి అప్పగించి, కనిపెట్టి ఉండమని చెప్పింది. ఇంతలో ఒక త్రాచు పాము ఇంట్లోకి ప్రవేసించింది. బ్రాహ్మణుడి పిల్లవాడికి త్రాచుపాము నుండి అపాయం కలగకుండా ముంగిస ఆ పాముని చంపేసింది. తన పెంపుడు తల్లి బ్రాహ్మణి అడుగుల శబ్దం విన్న ముంగిస పిల్లవాడినికాపాడానన్న ఆనందంతో, నెత్తురు కారుతున్న మూతితో ఎదురు వెళ్ళింది. రక్తం కారుతున్న మూతితో ఉన్న ముంగిసని చూడగానే బ్రాహ్మణి తన కుమారుడిని ముంగిస చంపేసిందన్న అనుమానంతో ఇంకేమీ రెండవ ఆలోచన లేకుండా తన చేతిలోని కుండలో ఉన్న నీళ్ళను ఆ ముంగిసపైన కుమ్మరించింది. తక్షణమే ఆ ముంగిస చనిపోయింది.
ముంగిస మరణానికి బాధపడుతూనే బ్రాహ్మణి లోపలికి వచ్చి తన కుమారుడు ఉయ్యాలలో ఆదమరచి నిదురపోతుండటం, ఉయ్యాల పక్కన ముంగిసచే కొరకబడి మరణించిన త్రాచుపాము ముక్కలని చూసింది. అంతవరకు కన్నకొడుకుతో సమానంగా పెంచుకున్న ముంగిసను అనాలోచితంగా చంపివేసినందుకు బ్రాహ్మణి దుఃఖంతో క్రుంగిపోయింది.

నీతి: విచక్షణ జ్ఞానం ఉపయోగించకుండా తొందరపాటుగా పనులు చేసేవారు బ్రాహ్మణుడి భార్యలాగా విచారించ వలసివస్తుందని పెద్దలు అంటారు.తొందరపాటుతనం దుర్వినియోగానికి కారణం.ఏపనిని అయినా చేసే ముందు బాగా ఆలోచించి చెయ్యాలి.

https://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

వినయమునకు గీటురాయి!!!

విలువ: సత్ప్రవర్తన;

అంతర్గత విలువ: వినయము13-SM-P_2-T_M_-_13_1841470e

ఈశ్వర ఛంద్ర విద్యాసాగర్ గొప్ప వినయవిధేయతలు కలిగి ఉండేవారు. ఆయనలోని ఈ లక్షణమే చాలా మందికి స్ఫూర్తిని కలిగించింది. ఆయన జీవితంలోని అనేక సంఘటనలు వారి నిరాడంబరతను, వినయమును ప్రతిబింబిస్తాయి. ఇటువంటి గొప్పలక్షణములు, వారు సమాజమునకు చేసిన సేవ భారతదేశమంతా ఆయన పేరు ప్రఖ్యాతులు గడించేలా, అందరిచేతా గౌరవింపబడేలా చేశాయి.

కలకత్తా విశ్వవిద్యాలయమును స్థాపించటం కోసం ఈశ్వర ఛంద్ర విద్యాసాగర్ కొంతమంది స్నేహితులతో కలిసి విరాళాలు సేకరించే కార్యక్రమం చేపట్టారు.ఆయన తన తోటి మిత్రులు వారిస్తున్నప్పటికీ వినకుండా అయోధ్యనగరం నవాబు దగ్గరికి విరాళం కోసం వెళ్ళారు. నవాబు దయాధర్మములు లేనివాడు కావటం వలన ఈశ్వర ఛంద్ర విద్యాసాగర్ తమ లక్ష్యమును గురించి వివరంగా చెప్పినప్పటికీ నవాబు ఎంతో అమర్యాదగా విద్యాసాగర్ గారిని కించపరిచేవిధంగా ఆయన జోలెలో తన చెప్పులు వేశాడు విరాళంగా. విద్యాసాగర్ గారు నవాబుని ఏమీ అనకుండా మౌనంగా బయటికి వచ్చేశారు అక్కడినుండి.

మరునాడు నవాబు అంతఃపురమునకు ఎదురుకుండా నవాబు చెప్పులను వేలం వేశారు. నవాబు మెప్పు పొందటం కోసం ఆయన దగ్గర పనిచేసే జాగీర్దారులు, సభికులు అందరూ వేలం పాటకి హాజరయ్యారు. చెప్పులు వేలంపాటలో వెయ్యి రూపాయలకు అమ్ముడు పోయాయి. ఈ వార్తని విని ఆనందించిన నవాబు అంతే మొత్తాన్ని తానుకూడా విరాళంగా ఇచ్చాడు.

నవాబు తన జోలెలో చెప్పులు విరాళంగా వేసినప్పుడు విద్యసాగర్ వేరొకరకంగా స్పందించి ఉండవచ్చును. అది ఒక అవమానంగా భావించి బాధపడి ఉండవచ్చును. కాని, ఆయన తన లక్ష్య సాధనలో దీనిని ఒక అవకాశంగా స్వీకరించారు. వేలంపాట ద్వారా ధనం పొందటమే కాకుండా నవాబును కూడా ఆనందింపచేయగలిగారు. ఆయన తన వ్యక్తిగత భావోద్వేగములకు ప్రాముఖ్యం ఇవ్వకుండా తన లక్ష్య సాధనకే ముందుకు సాగారు. చివరికి ఆయన కృషి, ఆశయం ఫలించి ఆయన చిరకాల స్వప్నమైన కలకత్తా విశ్వ విద్యాలయం స్థాపించబడింది.

నీతి: ఏదైనా వ్యతిరేక పరిస్థితి ఎదురైనప్పుడు దానికి వెంటనే ప్రతిస్పందించటం కాకుండా తగిన విధంగా స్పందించే ప్రయత్నం చెయ్యాలి. ఇటువంటి పరిస్థితిలో ఏ విధంగా స్పందించాలి? తమ ఇష్టాఇష్టములను పక్కన పెట్టి జీవితంలో సాధించదలచిన ఉన్నత ఆశయం కోసం పాటుపడాలి. ఈశ్వర ఛంద్ర విద్యాసాగర్ గారి లాగా వ్యక్తిగత భావోద్వేగములను అదుపులో ఉంచుకున్నప్పుడు మనం అనుకున్న లక్ష్యములను సాధించి విజయం పొందగలుగుతాము. వినయం అనేది ,అంత చక్కని సుగుణము.

https://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

పసితనంలోనే పిల్లలకు మానవతా విలువలను నేర్పాలి!! విలువ:ధర్మము ,అంతర్గత విలువ: సత్ప్రవర్తన

class

   మేము నివసించే ఊరిలో ప్రతి బుధవారం, ప్రతి శుక్రవారం సాయంకాలం చిన్న పిల్లలకి విలువలతో కూడిన నీతిబోధలను క్రమం తప్పకుండా బోధిస్తూ ఉంటాను. ఇలా పిల్లలకి బోధించటం ఎంతో ఆనందమును కలిగించటమే కాకుండా వాళ్ళతో మాట్లాడే సమయంలో, చర్చలలో ఎన్నో విషయాలను నేర్చుకునే అవకాశం నాకు కూడా లభిస్తూ ఉంటుంది.

           2014వ సంవత్సరం, మార్చి 14వ తేదీన శుక్రవారం నాడు మా ఇంట్లో నాలుగు నుంచి ఆరు సంవత్సరములలోపు వయసుకల పిల్లలకి పాఠం చెప్పబోతున్నాను.సరిగ్గా సాయంత్రం 5గం 30నిముషాలకు ఆరు సంవత్సరముల వయస్సుకల  ఒక చిన్న పాప నేను పాఠాలు చెపుతుంటే , మా ఇంటిలోని దేవుడి గదిలోనికి వచ్చింది. చుట్టూ  పరిశీలనగా చూస్తూ, పెదవులపై చిరునవ్వుతో ఆ పాప నాతో “ఇక్కడ నాకు దేవుడు ఉన్నట్లుగా సువాసన వస్తున్నది” అన్నది. ఆ పాప మాటలు నాకు చాలా ఆశ్చర్యమును కలిగించాయి. ఇక్కడ ఏదో వినూత్నంగా,మంచిగా ఆ పాపకి అనిపించినట్లు ఆమె హావభావముల వలన తెలుస్తున్నది. 

పసిపిల్లలు ఎంతో అమాయకంగా, పవిత్రంగా ఉంటారు. ఆ పవిత్రతని, అమాయకత్వాన్ని మన పెద్దలం కూడా నిలుపుకోగలిగితే ఎంత బాగుంటుంది!

                పాఠం చెప్పటం ప్రారంభించిన తరువాత ఒక ఐదేళ్ళ పాప మరొక ఆరేళ్ళ పాప గురించి ఒక నేరం చెప్పింది. ఈ ఐదేళ్ళ పాపకి ఆడుకునే మైదానంలో ఒక దువ్వెన దొరికింది. అది ఆ ఆరెళ్ళ పాపకి ఇస్తే ఆ పాప ఈ పాపకి బదులుగా ఒక బుహుమానం ఇస్తానని చెప్పి ఇవ్వలేదుట. తాను బదులుగా బహుమానం ఎందుకు ఇవ్వలేదో చెప్పటానికి ఆ ఆరేళ్ళ పాప ప్రయత్నిస్తున్నది.

             ఇప్పుడు, వాళ్ళు చెప్పినది విన్న తరవాత చెప్పటం ఇకనావంతు. అసలు మైదానంలో దువ్వెన కనబడినప్పుడు తమది కాని వస్తువును తీసుకోవటం మొదటి తప్పని వాళ్ళకి చెప్పాను. తమకి చెందని వస్తువులను ఎన్నడూ, అది ఏ వస్తువు అయినప్పటికీ తీసుకో కూడదని చెప్పాను. మానవతా విలువలైన నిజాయితీ, సత్ప్రవర్తనలను ఇప్పటినుంచే అలవాటు చేసుకోవాలని చెప్పాను. ఇకముందు ఎప్పుడైనా , ఏదైనా వస్తువు వాళ్ళకి దొరికితే అది వెంటనే అక్కడ ఉండే కాపలాదారుకి ఇచ్చేస్తే అతను ఆ వస్తువును స్వంతదారుకు చేరుస్తాడని చెప్పాను.

              పాఠం ముగించబోతుండగా ఆ ఐదేళ్ళ పాప ఆరేళ్ళ పాపతో అంటున్న మాటలు నా చెవిన పడ్డాయి. ఇంటికి వెళ్ళగానే ముందుగా ఒంటరిగా కాని, ఎవరినైనా తోడు తీసుకుని వెళ్ళి ఆ దువ్వెనని కాపలాదారుకి ఇచ్చేస్తానని చెప్పింది. అంత త్వరగా ఆ పాప సానుకూలంగా స్పందిచటం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. చెప్పిన నీతి , వాళ్ళ బుర్రలోకి అక్కడే అప్పుడే ఎక్కింది. 

            చిన్న పిల్లల స్వభావం అలాగే ఉంటుంది. వాళ్ళకి ఏది చెప్పినా వాళ్ళు వెంటనే వంట పట్టించుకుంటారు. వాళ్ళు “స్పాంజి” లాంటి వాళ్ళు. అందువల్ల చిన్నతనంలోనే వాళ్ళకి నైతిక విలువలు, చక్కని అలవాట్లు మొదలైనవి తల్లితండ్రులు, ఉపాధ్యాయులు నేర్పించాలి. మొక్కై వంగనిది మానై వంగదు కదా! మన పిల్లలకి చిన్నతనం నుంచి మంచి నీతులు, నడవడి నేర్పించి, ప్రపంచమునకే ఆదర్శవంతులైన పౌరులుగా తయారుచెయ్యాలి. నాకెప్పుడూ అంత తృప్తిగా, అంత అర్ధవంతంగా గతంలో ఎన్నడూ అనిపించలేదు.

           పిల్లలకి ఇలా మానవతావిలువలతో కూడిన, అర్థవంతమైన పాఠాలను బోధించగలగటంలో కలిగిన తృప్తి  ఇంతకుముందు ఎన్నడూ కలుగలేదు. ఇది నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. నిజంగా ఈ విధమైన విలువలతో కూడిన విద్యను పిల్లలకి బోధించే అవకాశం నాకు లభించటం, వారిలో చక్కని ఎదుగుదలను, మార్పును చూడగలగటం నాకు లభించిన అదృష్టంగా భావిస్తున్నాను.

https://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

పండితుడు–పాలమ్మి!!విలువ: సత్యము;అంతర్గత విలువ:శ్రధ్ధ

milkmaid-and-pundit-1

ఒకప్పుడు ఒక గ్రామంలో బాగా చదువుకున్న ఒక పండితుడు ఉండేవాడు. ప్రతిరోజూ ఒక పాలమ్మి ఈ పండితుడి ఇంటికి వచ్చి తెల్లవారుఝామునే పాలు పోసివెళ్ళేది. ఒకరోజు ఆమె పాలు పొయ్యటానికి పండితుడి ఇంటికి చాలా ఆలస్యంగా వచ్చింది. అందువల్ల పండితుడికి చాలా కోపం వచ్చి ఆమెను ఆలస్యమునకు కారణం అడిగాడు. నది దాటటానికి పడవవాడు రావటం ఆలస్యం కావటంవలన తను రావటానికి ఆలస్యం అయిందని ఆమె చెప్పింది. పడవవాడి సహాయం లేకుండానే నదిని దాటవచ్చునని పండితుడు పాలమ్మికి చెప్పాడు. హరి నామమును స్మరిస్తూ నదిని సులువుగా దాటవచ్చునని పడవ అవసరంలేదని పండితుడు ఆమెతో అన్నాడు. హరినామస్మరణతో సంసారమనే సాగరమునే సులువుగా దాటగలిగినప్పుడు చిన నదిని దాటటంలో కష్టం ఏముందని పండితుడు అన్నడు. పండితుడి మాటలను పాలమ్మి చాలా శ్రద్ధగా ఆలకించింది.

pundt-and-milkmaid-2

 

మరునాటి ఉదయం పాలమ్మి రోజూ కంటే త్వరగా పండితుడి ఇంటికి పాలు పొయ్యటానికి వెళ్ళింది. అంతత్వరగా ఎలా రాగలిగావని పండితుడు మళ్ళీ అడిగాడు. క్రిందటిరోజు పండితుడు చెప్పిన ప్రకారమే పడవవాడి కోసం ఎదురు చూడకుండా హరినామమును స్మరించుకుంటూ నదిని దాటి వచ్చేశానని పాలమ్మి చెప్పింది. పండితుడు ఆశ్చర్యంతో నిర్ఘాంతపోయాడు. ఆమె ఏదో కట్టుకథ అల్లి చెప్పుతున్నదని అతను భావించాడు. పాలమ్మి పండితుడిని నది దగ్గరికి తీసుకెళ్ళి, హరినమాన్ని స్మరిస్తూ ఆమె నదిలో నడుచుకుంటూ వెళ్ళిపోసాగింది. పండితుడిని కూడా అలాగే నామస్మరణ చేస్తూ నది దాటి రమ్మని చెప్పింది. నదిలోకి దిగుతూనే పండితుడు ఎక్కడ తన బట్టలు తడిసిపోతాయోనని భయపడసాగాడు. అతని ధ్యాస అంతా దేవుడి మీద కంటే తన బట్టల పైనే ఉన్నది. తన మాటల మీద తనకే నమ్మకం లేకపోయింది ఆ పండితుడికి. అతనికి విశ్వాసం లోపించింది.

నీతి: కేవలం శాస్త్రములు చదివినంత మాత్రమున సరిపోదు. విశ్వాసము, భక్తి కలిగి ఉండటం చాలా ముఖ్యం. తమ మాటలపై తమకు నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే ఇతరులకి చెప్పాలి. ఇతరులకి బోధించిన విషయములందు ముందుగా చేప్పేవారికి తమ మాటలయందు నమ్మకం, విశ్వాసం ఉండాలి.

https://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

ప్రయాణం ఎంత ముఖ్యమో గమ్యం కూడా అంతే ముఖ్యము!! విలవ:ధర్మము అంతర్గత విలువ:శ్రద్ధ

 

download (7)

ఒకానొక సమయంలో విలాసములు మరియు సుఖాలలో మునిగి  తేలుతున్న ఒక రాజు ఉండేవాడు .  అతను ఎరుపు గులాబీలు నిండిన మంచం మీద నిదురిస్తూ రుచికరమైన ఆహారాన్ని తింటూ చాలా ఆనందముగా భోగాలను అనుభవిస్తూ గడిపేవాడు. ఒక రోజు, రాజు మరియు అతని వెంట సభాసదులు వేటకు వెళ్లారు. వారు ఆనందముగా చీకటి పడే సమయం వరకు వేటలో గడిపారు.రాజు నాయకత్వం లో అందరూ తిరిగి ప్రయాణం ప్రారంభించారు, కానీ కొంతసేపటికి  తను ఒంటరిగా నడవ సాగాడు.  అలా అతను తన అనుచరులనుండి వేరు పడడం జరిగింది, రాజు కొరకు వెతికిన అనుచరులు అతను కనబడక తిరిగి వెళ్ళిపోయారు.

king-hunting

రాజు ఆకలితో బాగా అలసిపోయాడు. ఈ ఊహించని పరిణామానికి తన మీద తనకే కోపం వఅచ్చింది . ఏమీ చేసేది లేక  గుర్రం స్వారీ చేస్తూ చాలా దూరం వెళ్ళాడు. కొంతసేపటికి అతనికి ఒక ఆశ్రమం కనిపించింది. అందులో ఒక పూజారి ప్రార్ధన చేస్తూ కనిపించాడు.రాజు అతనికి తన పరిస్థితి చెప్పి తిరిగి తన రాజ్యానికి వెళ్ళటానికి సహాయం అర్థిస్తాడు.  పండితుడు నవ్వి అతనికి ఇలా చెప్పాడు; “నేను నీకు ఒక మంత్రం (ప్రార్థన) బోధిస్తాను, మీరు అగ్ని వలయం లో నిలబడి మీ రాజ్యాన్ని తిరిగి పొందేందుకు 40 రోజులు పఠించాల్సి ఉంటుంది” రాజు వెంటనే ప్రార్థన నేర్చుకొని పండితుని యొక్క సూచనలను అనుసరించారు. 40 రోజుల తపస్సు తరవాత  ఏమి జరగలేదు. రాజు ఫలితం గురించి పండితుడిని అడిగాడు. పండితుడు అప్పుడు అత్యంత శీతల నదిలో నిలబడి  అదే మంత్రం తిరిగి ఇంకొక 40 రోజులు పఠించమని చెప్పారు. ఈసారి కూడా మళ్ళీ ఏమీ జరగలేదు.రాజు ప్రయత్నాలు అన్నీ వ్యర్థం అయిపోయాయి. రాజు చాలా నిరాశ నిశ్ప్రుహ    కి  లోనయ్యాడు. అప్పుడు పండితుడు రాజుతో ఇలా అన్నాడు, “రాజా నీవు మంత్రం పఠించేటప్పుడు ఫలితం మీద నీ దృష్టి కేంద్రీకరించావు కాని మంత్రం మీద కాదు! అందుకే నీకు ఫలితం దక్కలేదు.”

నీతి:

ఒక పని చేసేటప్పుడు ఆనందంగా దాని మీద శ్రధ్ధతో చేయాలిగాని, ఫలితం ఆశించి కాదు.  పని చేసేటప్పుడు చాలా నేర్చుకోవచ్చు. మనం చేసే పని ఆశక్తిగా, అర్ధం చేసుకుని చేయకపోతే అనుకున్న ఫలితాలు పొందలేము.అలాగే మనం ప్రయాణించేటప్పుడు ఒక గమ్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. గమ్యంలేని ప్రయాణం  వ్యర్ధం.