Archive | October 2016

పెను గాలులు

img_0600
విలువ : శాంతి
ఉప విలువ : నమ్మకము

కొన్నేళ్ళ క్రిందట సముద్ర తీరంలోని ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. అతనికి కొంత భూమి , ఒక ఫార్మ్ హౌస్ ఉండేది. రైతు తన ఫార్మ్ హౌస్ లో పని చేయటానికి ఒక మనిషి కోసం ప్రకటణలు ఇచ్చాడు.తానే స్వయంగా ఎంతో మందిని అడిగాడు. కానీ ఎవరూ పని చేయటానికి ఒప్పు కోలేదు. ఎందుకంటే సముద్ర తీరంలో వచ్చే తుఫాను,గాలులు, వాటి వల్ల వచ్చే బీబత్సాలకు భయపడి.దంతో రైతు చాలా నిరాశ చెందాడు.

ఇంతలో సన్నగా పొట్టిగా ఉన్న ఒక నడివయస్కుడు వచ్చి తాను ఫార్మ్ లో పనిచేయ గలనని, ఎంతటి గాలులు వీచినా గానీ నిద్ర పోగలనని చెప్పాడు.వెరే గత్యంతరం లేక రైతు అతనిని కూలీగా పెట్టుకున్నాడు.

ఈ పని మనిషి సూర్యోదయం నుండి సూర్యాస్తమం వరకు ఎంతో శ్రద్ధగా కష్టపడి పని చేయటం చూసి రైతు చాలా సంతోషించాడు.

ఉన్నట్టుండి ఒక రోజు అర్ధరాత్రి,పెను గాలులు వీచ సాగాయి. రైతు హఠాత్తుగా మేల్కొని లాంతరు తీసుకొని గబగబా ఈ కూలీ ఉన్న గది లోకి వచ్చాడు. వచ్చీ రాగానే, నిద్రపోతున్న ఆ రైతుని చూసి “లే !లే! పెద్ద తుఫాను వచ్చేట్టుంది” అని లేప సాగాడు.

కానీ కూలీ ఏ మాత్రం కంగారు పడకుండా “నేను ముందే చెప్పా కదా ,ఎంత గాలులు వీచినా నిద్ర పోగలను ” అని వేరే వైపు తిరిగి పడుకున్నాడు. రైతు కి ఎంతో కొపం వచ్చి అప్పటికప్పుడు , అతనిని పనిలో నించి తీసి వేయాలి అనుకున్నాడు.
ఇంతలో పరిస్తితిని దృష్టిలో ఉంచుకుని తనకు తానే ఏదో ఒకటి చెయాలి అని బయలు దేరాడు.
కానీ ఆశ్చర్యం! ! తీరా చూసే సరికి గడ్డి వాములమీద టార్పాలిక్ కప్పబడి చాలా టైట్ గా కప్పబడి ఉన్నాయి. పశువులు షెడ్ లో సురక్షితంగా ఉన్నాయి,తలుపులకి తాళాలు వేసి ఉన్నయి. అలాగే కోళ్ళు కూడా రక్షింపబడి ఉన్నాయి. అన్ని విధాలా తుఫాను గాలులకు ఏమాత్రం చెక్కు చెదరకుండా , అన్నీ ఎంతో పకడ్బందీగా ఉండటం చూసి,రైతు చాలా సంతోషించి,తను కూడా నిశ్చిచింతగా నిద్రకుపక్రమించాడు.

నీతి: భగవంతిడి యందు నమ్మకము, మన అధ్యాత్మిక పురోగతికి దారి తీస్తుంది. దాని వల్ల మనము శారీరిక, మానసికంగా ఎటువంటి కష్టాలనైనా ఎదుర్కొని , ప్రశాంతంగా ఉండగలుగుతాము

http://saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu

Advertisements

కుటుంబం

 

విలువ : ప్రేమ

అంతర్గత విలువ : ఐకమత్యము

 

img_0504

లంకాధిపతి రావణబ్రహ్మ యుద్ద భూమిలో… మృత్యు శయ్యపై అవసాన దశలో శ్రీరాముడితో ఇలా అన్నాడు…”రామా……….. నీ కంటే నేను అన్నింటిలో గొప్పవాణ్ణి

. నేను బ్రాహ్మణ జాతి లో పుట్టాను..నీది క్షత్రియ జాతి. నేను … నీ కంటే వయసులో పెద్ద. నా కుటుంబం… మీ కుటుంబం కన్నా పెద్ద.
నా వైభవం…. నీ వైభవం కన్నా అధికం. మీ అంత:పురం మాత్రమే స్వర్ణం…. నా లంకానగరం మొత్తం స్వర్ణమయం. నేను బలపరాక్రమాలలో …. నీకంటే శ్రేష్ఠుడిని. నా రాజ్యము,
…. నీ రాజ్యము కంటే పెద్దది.
జ్ఞానంలో, తపస్సులో … నీ కంటే శ్రేష్ఠుడిని”.

“ఇన్ని శ్రేష్ఠమైన విషయాలు కలిగి వున్నా …. యుద్ధంలో నేను
నీ ముందు ఓడిపోయాను.
దీనికి కారణం ఒకటే…నీ తమ్ముడు నీ దగ్గర వున్నాడు… నా తమ్ముడు నన్ను వదలి వెళ్ళిపోయాడు”.

*నీతి*

తమ్ముడు వెంట లేకుండా, రావణబ్రహ్మ లాంటి వాడే
ఓటమి పాలయ్యాడంటే…. మనలాంటి వాళ్ళ బ్రతుకెంత?
అందరూ కలిసి వుండండి….! విజయాలు పొందండి!!
కుటుంబాలు విచ్చిన్నం కాకుండా అందరూ ప్రయత్నించండి!!!
ఎందుకంటే… ఏ వృ క్షమూ, కఱ్ఱ సహాయం లేని గొడ్డలితో తెగి పడదు. వృక్ష జాతి స్నేహం తోనే… గొడ్డలి విజయం సాధిస్తుంది.

ఒక ఎలుక కథ!

విలువ:సత్యం

అంతర్గత విలువ : ఆత్మ విశ్వాసం

img_0409

🐀🐭
ఒక అడవిలో ఒక తల్లి ఎలుక ఉంది. దానికో పిల్ల ఎలుక.

💪💪 ప్రపంచంలో అందరి కంటే శక్తిమంతుడైన వాడిని వెతికి తెచ్చి పెళ్లి చేయాలని తల్లి ఎలుకకొక బుల్లి కోరిక.

💩🗻 అలాంటి పెళ్లి కొడుకు ఎక్కడ దొరుకుతాడా అని పుట్టలు, గుట్టలు ఎక్కి వెతికింది. ఆకాశంలోకి చూసింది. ☁☁

☁⛅ తన తేజస్సుతో లోకమంతా కాంతులు నింపుతున్న సూర్యుడు కనిపించాడు. 🌞

“నాయనా సూర్యుడా! సృష్టిలో అందరికంటే శక్తిశాలివి నువ్వు.

👫 మా అమ్మాయిని నీకిచ్చి పెళ్లి చేస్తాను” అంది. “అసలు సృష్టిలో నేను అందరికంటే శక్తిశాలిని అనే నీ అభిప్రాయమే తప్పు. ❎

⛅🌝🌚దట్టమైన మేఘం కమ్మితే, శక్తి మాట దేవుడెరుగు, నేను కనపడకుండా పోతాను” అన్నాడు సూర్యుడు.

☁☁ టక్కున మేఘం దగ్గరికి పరుగెత్తింది తల్లి ఎలుక. “నాదేమి శక్తి, వానాకాలం శక్తి. గట్టిగా గాలి కొడితే నిలవలేక ఎగిరిపోయేవాడిని” అంది మేఘం.

💨💨
నిజమే కదా అనుకుంటూ గాలి దగ్గరికి పరిగెత్తింది ఎలుక.🐀

💨 గాలి నీరసంగా, దిగులుగా నవ్వుతూ, “నాదొక శక్తా? అదిగో, ఆ కనిపించే చిన్ని కొండను పడేయాలని ఎన్నాళ్ళనుంచో కిందా మీదా పడుతున్నాను.

నా శక్తి అంతా ఉపయోగించినా, ఒక్క అంగుళం కూడా కదల్చలేక పోయాను” అంది.

🐀🗻
ఎలుక కొండను పట్టుకుంది.

“నాదొక పెద్ద శక్తి కాదు, తెల్లవారుతుందంటే భయం. ఊళ్ళో ఆంబోతు వచ్చి, తన కొమ్ములు నా రాళ్ళకు రుద్ది రుద్ది చంపుతుంది.
😈
దాని కొమ్ములు పదునవుతున్నాయి కానీ నా రాళ్ళు మాత్రం నుగ్గి నుగ్గి అయిపోతున్నాయి. నువ్వు ఆ ఆంబోతుని పట్టుకుంటే బాగుంటుంది” అన్నది కొండ.

➰➰➰
తీరా ఆ ఆంబోతుని కదిలిస్తే “నాది మాత్రం ఏమి శక్తీ? నాలుగు తాళ్ళు తెచ్చి కట్టేస్తే, నేనలా పడి ఉండాల్సిందే, నా కంటే ఆ తాడుకే ఎక్కువ బలం” అంది.

🐭🐭🐭🐭
తాడుదగ్గరికే వెళ్ళితే “నాదేమి బలం, చిన్న ఎలక పిల్ల కూడా నన్ను పట పటా కోరికేయగలదు కదా” అంది తాడు.

😎😎
తల్లి ఎలుకకు జ్ఞానోదయం అయింది, అందమైన ఎలుక వరుడిని చూసి, తన కూతురునిచ్చి పెళ్లి చేసింది.

🐭🐹
నీతి:
ఈ లోకంలో ఎవరి బలం, శక్తియుక్తులు వాళ్ళవి.
‘నాకు బలం లేదు’ అనుకోవటమే బలహీనత…

ఏది ముఖ్యం ? గెలుపా?ప్రేమా? ఐశ్వర్యమా!

విలువ :ప్రేమ

అంతర్గత విలువ :విచక్షణ

 

img_0230

 

 

ఒక పల్లెలోని ఒక ఇంటికి చాలా రోజులు ప్రయాణం చేసి, అలసిపోయిన ముగ్గురు పెద్దవాళ్ళు వచ్చారు.

“లోపలికి రండి నా భర్త వచ్చిన వెంటనే భోజనం చేయవచ్చు మీరు” అంటూ పిలిచింది.

మగవాళ్ళు లేని ఇంట్లో మేం భోజనం చేయము.అతను తిరిగివచ్చిన తరువాతే లోపలికి వస్తాము అని బయట అరుగు మీద అలసట తీర్చుకుంటున్నారు.

భర్త పొలం పని ముగించుకొని సాయంత్రం ఇంటికి వస్తూనే బయట అరుగు మీద ఉన్న వారి వద్దకు వెళ్ళి”నా భర్త వచ్చాడు లోపలికి రావడానికి మీకు అభ్యంతరం లేదు కదా,” అని అడిగింది.” లేదు….. కాని మా ముగ్గురిలో ఒకడు మత్రమే మీ ఇంట్లోకి వస్తాడు అది మా నియమం” అన్నారు.

ఆ ఇల్లాలు ఆశ్చర్యంతో చూస్తుండగా పెద్దాయన” నా పేరు ‘ప్రేమా, ఇతని పేరు ‘గెలుపూ, ఈయన పేరు ‘ఐశ్వర్యం’. మాలో ఒక్కరిని మాత్రమే ఆహ్వానించు అన్నాడు. వచ్చిన వారు మాములు మనుషులు కారు అని ప్రేమ, గెలుపు, ఐశ్వర్యం అనే రూపాల్లో ఉన్న దేవతలని తెలిసిపోయింది.

సంతోషంతో పొంగిపోతు అమె ఆ విషయాన్ని భర్తకు చెప్పింది. విన్న భర్త పరవశంతో “బ్రతుకులో గెలుపే ముఖ్యము కాబట్టి ఆయన్నే పిలుద్దాం అని” అన్నాడు.

దానికి ఆమె “గెలుపు ఒకటే ఏమి లాభం, ఐశ్వర్యం లేకపోయే కాబట్టి ఐశ్వర్య దేవతని ఆహ్వనిద్దాం” అని అంది.

వీరి ఇద్దరి మాటలు వింటున్న్న వారి కోడలు, గెలుపు ఐశ్వర్యం కంటే ప్రేమ ఉంటే భార్యా భర్తలు, పిల్లలు, అత్తా కోడళ్ళు కలిసి మెలసి ఉండగలం కాబట్టి ప్రేమ మూలాధారం సుఖజీవనానికి” అంటూ సలహ ఇచ్చింది.

వెంటనే ఆ ఇంటి యజమాని బయటకు వచ్చి మీలో ‘ ప్రేమ ‘ అనే వ్యక్తి లోపలికి రావచ్చు అన్నాడు. ప్రేమ అనే వ్యక్తి ఇంట్లోకి వచ్చాడు. ప్రేమ వెనకే గెలుపు, ఐశ్వర్యం కూడా అతనితో బాటు ఇంట్లోకి వచ్చాయి. ఇది చూసి ఆమెకు ఆశ్చర్యం కలిగింది.

ఆముగ్గురూ “మీరు గెలుపు లేదా ఐశ్వర్యం కోరి ఉంటే మేమిద్దరం ఉండి పోవాల్సివచ్చేది .ప్రేమను మీరు పిలవడం వలన మేమూ పిలవకుండానే వచ్చాము కారణం ప్రేమ వెన్నంటే గెలుపు, ఐశ్వర్యం అనేవి నడవాలి అని మా దేవుని ఆఙ్ఞ” అన్నారు……కాబట్టి ఎక్కడ ప్రేమ ఉంటె అక్కడ ఐశ్వర్యం, గెలుపు తప్పక ఉంటాయి !

http://saibalsanskaar.wordpress.com

 

వినయం వివేకవంతుని లక్షణం !!

పరమాత్ముడైన శ్రీ రామ చంద్రుడు అమిత పరాక్రమశాలి మహావీరుడు ధనుర్విద్యానిపుణుడు.

img_0093

 

 

శ్రీ రాముడు బ్రహ్మర్షి అగు వసిష్ఠ మహర్షి వద్ద సకల శాస్త్రములు ధనుర్విద్య అభ్యసించినాడు. గాయత్రీ మంత్రద్రష్ట అగు విశ్వామిత్ర బ్రహ్మర్షి వద్ద బల అతిబలాది విద్యలు మఱియు ఎన్నెన్నో అతి రహస్యములైన అస్త్రములను నేర్చినాడు. ఈ అస్త్రములు కేవలము విశ్వామిత్రులవారికే తెలియును. ఇదియే కాక పరమపూజనీయుడగు అగస్త్య మహర్షి శ్రీ రామ చంద్రునకు దివ్య ధనువు అక్షయ తూణీరము రత్నఖచిత ఖడ్గమును ప్రసాదించెను.

ఒక్క బాణముతో శ్రీ రామ చంద్ర మూర్తి మహాబలశాలియైన తాటకను నేలకూల్చెను
ఒకేమాఱు రెండు బాణములు వదిలి సుబాహు సంహారము చేసి మారీచుని సప్తసముద్రాలకు అవతల పారవేశను
మహాభారవంతమైన శివచాపమును అవలీలగా ఎత్తి ఎక్కుపెట్టిన అది విరిగెను
శ్రీ రాముడొక్కడే ప్రహరార్ధకాలములో ఖర త్రిశిర దూషణాదులను వారి సేనలను సంహరించెను
ఇంత ప్రతాపవంతుడైనప్పటికీ శ్రీ రాముడు ఎప్పుడూ తనకుతానుగా బలప్రదర్శనము చేయలేదు. ఆ దయార్ద్ర హృదయుడు సర్వదా వినయవంతుడై వర్తించెను. దీనికి తార్కాణము సముద్రుని గర్వభంగ ఘట్టము.

శ్రీ రాముని సైన్యము సముద్ర లాంఘనము చేయుసమయము వచ్చెను. సర్వజ్ఞుడైన రాముడు ఉపాయము ఎఱిగియు సహజ వినయవంతుడగుటచే పరమభాగవతోత్తముడైన విభీషణుని సలహా అడిగెను. విభీషణుడు ఇట్లు పల్కెను “ఓ రఘునాయకా! మీ బాణమొక్కటే కోటి సముద్రములనైనను శుష్కింప చేయగలదు. ఐనను సముద్రునే ఉపాయమడుగ ఉత్తమమని నా యోచన”.

రావణుడు తనను వివాహమాడమని హెచ్చరించి సీతమ్మవారికి నెల రోజుల గడువు ఇచ్చెను. భరతుడు పదునాలుగేండ్లపై ఒక్క నిమిషము కూడా శ్రీ రామునికి దూరంగా ఉండజాలక శ్రీ రాముడు ఆలస్యమైన పక్షంలో శరీరత్యాగం చేసెదనని ప్రతిజ్ఞబూనెను. ఈ రెండు కారణముల వలన శ్రీ రాముని వద్ద అప్పటికి పట్టుమని ౩౦ రోజులుకూడాలేవు. ఐనను రఘురాముడు తన బలప్రదర్శనము చేయక వినయముతో సాగరుని ప్రార్థింప నిశ్చయించెను.

శ్రీ రాముడు ఉదధిని సమీపించి సముద్రునకు శిరసా ప్రణమిల్లెను. పిదప తీరమున దర్భలు పరచి ఆ దర్భాసనం పైన కూర్చుని తదేక దృష్టితో సముద్రుని ప్రార్థించెను. ఇట్లు ౩ దివసములు సముద్రునికై ప్రార్థించినను ఆ సముద్రుడు రాడాయె. చివరకు శ్రీ రాముడు “ఈతనికి సామముగా చెప్పిన వినడాయె. ఇటువంటి వారికి దండోపాయయే సరియైనది” అని సముద్రునిపై అస్త్రం సంధించెను. శ్రీ హరి కోపమును భరింపగలవారెవ్వరు? వెంటనే సముద్రుడు ప్రత్యక్షమయ్యెను. అంత దయాళువైన శ్రీ రాముడు సముద్రుని క్షమించి తాను ఎక్కుపెట్టిన అమోఘ బాణము దేనిమీద ప్రయోగింపవలెనని అడిగెను. సముద్రుడు ఉత్తరాన దుష్టులైన కాలకేయ రాక్షసులు ఉన్నారని సూచించెను. అంతట శ్రీ రాముడు ఆ అస్త్రముతో ఆ రాక్షసుల సంహారముచేసి ఆ కాలకేయులుండే పర్వతం ఔషధాలకు నిలయమై ప్రజాహితం చేకూర్చునని ఆశీర్వదించెను.

నీతి :

శ్రీ రాముడు ఎంత బలశాలి ఐననూ సముద్రునిపై బలప్రదర్శనము చేయక వినయముతో ప్రార్థించెను. వినయం సజ్జనుని భూషణమ్.
మనకు ఉపాయము తెలిసినను తోటివారిని గౌరవించి వారి సలహా తీసుకుని ధర్మసమ్మతమైన పని చేయుట ఉత్తమ పురుషుని లక్షణమ్. అందుకనే శ్రీ రాముడు విభీషణుని సలహా అడిగెను.
దయాగుణం ఉత్తమగుణమ్. సముద్రుడు తనకు చేసిన అపకారమును మన్నించి శ్రీ రాముడు అతనిని కాచెను.
సజ్జనులు అప్రయత్నంగానే లోకహితం చేస్తారు. వారు ఏది చేసినా అది లొకహితమే అవుతుంది. శ్రీ రాముడు సముద్రునిపై కినుకబూని అస్త్రం సంధించినా అది చివరకు కాలకేయులను సంహరించి లోకహితం చేసింది.
https://neetikathalu.wordpress.com/category/sadguṇam/kṣhama/