Archive | September 2020

చీమ మరియు కాంటాక్ట్ లెన్స్

         విలువ :      సత్యం 

ఉప విలువ :   నమ్మకము 

     బ్రెండా  నిటారుగా  ఉన్న ఒక గ్రెనైట్ శిఖరాన్ని  ఇంచు మించు సగభాగం ఎక్కింది . ఇలా కొండ  ఎక్కటం బ్రెండా కి ఇదే మొదటిసారి కావటం వలన కొంచం ఊపిరి పీల్చుకోవటం కోసం ఒక వంపు దగ్గర ఆగింది. అలా విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఆమె కట్టుకున్న రక్షణ తాడు కంటికి తగిలి ఆమె కంట్లో  పెట్టుకున్న అద్దాలు (కాంటాక్ట్ లెన్స్ ) క్రింద పడిపోయాయి . అప్పుడు బ్రెండా ,”భూమి నుంచి వందల అడుగుల పైన శిఖరానికి వందల అడుగుల క్రింద నిలబడి ఉన్నాను . ఇటువంటి సమయం లో నా కాంటాక్ట్ లెన్స్ పడిపోయాయి నాకు అంతా మసక మసకగా ఉంది. కళ్ళు సరిగా కనబడటం లేదు. ఎంత పని జరిగింది? “ అని అనుకుంటి బాధ పడింది . ఒక వేళతాను నిలబడి  ఉన్న అంచు పైననే పడిపోయి ఉండవచ్చు నని వెతికి చూసింది . ఆమెలో ఆందోళన పెరిగిపోతోంది. ఎలాగైనా పోయిన లెన్స్ దొరకాలని ప్రశాంతత కలగాలని దేవుడిని ప్రార్థించ  సాగింది . 

                                  అలాగే ఆమె శిఖరం అంచు దాక ఎక్కి కొండ పైకి చేరుకుంది . అక్కడ ఆమె స్నేహితురాలు ఆమె కళ్ళను, దుస్తులను పరీక్షగా వెతికింది కానీ, కాంటాక్ట్ లెన్స్ దొరకలేదు. కొండ పైకి  చేరుకోగలగటం వలన బ్రెండా ప్రశాంతంగా నే ఉన్నప్పటికీ కొండ పైకి ఎక్కుతున్నప్పుడు ఆ పర్వత శ్రేణుల అందాలను స్పష్టంగా చూడలేకపోతున్నందుకు ఆమెకు చాలా విచారం కలిగింది. 

             బ్రెండా  దేవుడిని  “ ఓ ప్రభూ” నీవు ఈ పర్వతాలన్నింటినీ చక్కగా చూడగలవు. ఇందులోని ప్రతి రాయి, ప్రతీ ఆకూ నీకు తెలుసు . నా కాంటాక్ట్ లెన్స్ ఎక్కడ పడి ఉంటుందో నీకు తప్పకుండ తెలుస్తుంది. దయ చేసి నాకు సహాయం చేయి తండ్రీ !,అని ప్రార్ధించింది.

                ఆ తరువాత వాళ్ళు అదే కొండ దిగి క్రిందకి వస్తున్నప్పుడు వేరే వాళ్ళు క్రింద  నుంచి పైకి ఎక్కుతూ వస్తున్నారు. వారిలో ఒకరు ‘ ఎవరివైనా కాంటాక్ట్ లెన్స్  పడిపోయాయ ? అని గట్టిగా అరిచారు . ఇంతకీ ఆ కొండ  ఎక్కుతున్న వాడికి ఈ కాంటాక్ట్ లెన్స్ ఎలా దొరికిందో మీరు ఊహించగలరా ? ఒక చీమ ఆ కొండ పైన ఉన్న ఒక చిన్న చెట్టు కొమ్మ ఆకు పైన ఈ కాంటాక్ట్ లెన్స్ మోసుకొని వెళుతూ  కనిపించింది.

                అయితే ఈ కథ  ఇక్కడితో ఆగిపోలేదు. బ్రెండా తండ్రి ఒక కార్టూనిస్ట్ . నమ్మశక్యం కానీ ఈ కథ ను బ్రెండా తన తండ్రి కి చెప్పినప్పుడు అయన ఒక చక్కని చిత్రాన్ని ఈ కథ  ఆధారంగా గీశాడు. ఆ బొమ్మలో ఒక చీమ కాంటాక్ట్ లెన్స్ మోసుకు వెళుతూ   ,“ప్రభూ నా చేత ఈ వస్తువును  నీవు  ఎందుకు మోయిస్తున్నావో నాకు అర్థం కావటం లేదు. ఈ  వస్తువు నాకు తినటానికి పనికి రాదు. పైగా చాలా బరువుగా కూడా ఉన్నది . కానీ నేను ఈ భారాన్ని మోయాలని నీవు అనుకుంటే నేను తప్పకుండా మోస్తాను నీకోసం !”అని అనుకుందట. 

 నీతి : 

                                మనందరం కూడా ఈ విధంగా అనుకోవటం మంచిది. “ భగవంతుడా నీవు ఈ భారం నా చేత ఎందుకు మోయిస్తున్నావో తెలియదు. ఇందులో నాకేమీ  మంచి కానీ ,ప్రయోజనం కానీ కనిపించటం లేదు. పైగా మొయ్యలేనంత భారంగా కూడా ఉంది ,కాని  నువ్వు మొయ్యమంటే మాత్రం నేను తప్పకుండా మోస్తాను . 

             “  భగవంతుడు నేర్పురులైనవాళ్ళని పిలవడు . తాను పిలుచుకున్న వాళ్ళని నేర్పరులను చేస్తాడు 

“మన ఉనికికి మూలం ,మన రక్షకుడు భగవంతుడే . ప్రతి రోజూ మన చేత పనులు చేయిస్తూనే ఉంటాడు.”భగవంతుడి దయవలన ,ఆయన ప్రసాదించే శక్తి వలన నేను అన్ని పనులను చేయగలుగుతున్నాను”,అని గుర్తుచేసుకుంటూ పనులు చేస్తుంటే అది మనకు గొప్ప ఆత్మ విశ్వసాన్ని ఇస్తుంది .ముఖ్యంగా మనము చాలా క్లిష్టమైన పరిస్థితులలో ఉన్నప్పుడు.