Archive | January 2017

మన జీవన పోరాటం

మన జీవన పోరాటం.
విలువ — ఆశావాదం
అంతర్గత విలువ — వైఖరి / తీరు.

img_1904

ఒక రోజు, కూతురు తన తండ్రితో మాట్లాడుతూ, తనకి ఒక సమస్య అయ్యాక మరో సమస్య ఎదురు అవుతోందని, అసంతృప్తి వెల్లడించింది.

అప్పుడు తండ్రి వంటయిల్లు కి తీసుకుని వెళ్లి, మూడు పెద్దకుండలలో నీళ్లు నింపి పొయ్యి మీద పెట్టారు. నీళ్లు మరిగాక, మొదటి కుండలో బంగాళదుంపలు, రెండవ కుండలో గుడ్లు, మూడవ కుండలో కాఫీ గింజలు వేశారు.
కూతురు ఏమి జరుగుతోందో తెలుసుకుందమని ఆసక్తితో ఎదురు చూసింది.ఇరవై నిమిషాలు అయ్యాక, పొయ్యి ఆపేసి, నీళ్లలోంచి బంగాళదుంపలు, గుడ్లు తీసి, విడిగా రెండు పళ్ళాలలో పెట్టారు. కాఫీ గింజల్ని వడగట్టి, ఒక గ్లాసులో పోశారు.
కూతురిని ఇవి ఏమిటీ అని అడిగారు.అప్పుడు బంగాళదుంపలు, గుడ్లు, కాఫీ అని సమాధానం చెప్పింది.
‘జాగ్రత్తగా పరిశీలించు బంగాళదుంపలు ముట్టుకో’ అన్నారు తండ్రి. చుస్తే బంగాళదుంపలు మెత్తగా అయ్యాయి.
తరవాత గుడ్డుని పగలకొట్ట మన్నారు తండ్రి. గుడ్డు పైపెంకు తియ్యగానే, లోపల గట్టి బడింది.
తరవాత కాఫీ తాగమన్నారు. మంచి కాఫీ తాగగానే చాలా ఆనంద పడింది తన కూతురు.
దీని అంతటికి అర్ధము ఏమిటి అని అడిగింది కూతురు.

బంగాళదుంపలు, గుడ్లు, కాఫీ, మూడు ఒకే విధంగా నీళ్లలో మరిగాయి, కానీ వేరుగా స్పందించాయి.
బంగాళదుంపలు చాలా గట్టిగా ఉండేవి, కానీ మెత్తగా, మృదువుగా అయ్యాయి.
గుడ్లు చాలా నాజూకుగా ఉండేవి, కానీ గట్టిగా అయ్యాయి.
కాఫీ గింజలు, మంచి కాఫీ గా అయ్యాయి.
మరిగే నీళ్లలో ఉండి ఇవన్నీ మార్పు చెందాయి.
వీటిల్లో నువ్వు ఎవరివి ? అని అడిగారు తండ్రి.
“బంగాళదుంపలు, గుడ్లు, కాఫీ. కష్టము వస్తే, ఎవరిలాగా స్పందిస్తావు ?”అని అడిగారు

img_1902

నీతి:
జీవితం లో మన చుట్టూ చాలా జరుగుతాయి, కష్టాలు వస్తాయి. దాంట్లోంచి మనము ఏమి నేర్చుకున్నాము, కష్టాన్ని ఎలా ఎదురుకున్నాము అనేదే ప్రశ్న.
ప్రతి సంఘటన లోను మంచి చూడడం నేర్చుకోవాలి

http://saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu

.

భగవంతుడి నామం యొక్క విశిష్టత

విలువ — ప్రేమ
అంతర్గత విలువ — నమ్మకం

 

img_1858

 

ఒక రోజు నారదులవారు, శ్రీమన్ నారాయణ స్వామివారిని కలుసుకోవడానికి వెళ్లారు.
అప్పుడు శ్రీమన్ నారాయణ స్వామి, నారదులవారిని బావున్నావా నారదా అనిఅడిగారు ?
శ్రీమన్ నారాయణ స్వామి, నారదులవారి మధ్య జరిగిన సంభాషణ.
నారదులవారు– నేను బావున్నాను, మూడులోకాలు పర్యటన చేస్తున్నాను.
శ్రీమన్ నారాయణ స్వామి — ఏ ఆలోచనతో పర్యటన చేస్తావు?
నారదులవారు– ఎప్పుడూ మీ నామమే!’నారాయణా నారాయణా ‘ అనుకుంటూనే ఉంటాను కానీ మీ నామము చెయ్యడం వల్ల ఏమి ఫలితమో తెలియడంలేదు.
శ్రీమన్ నారాయణ స్వామి — అయ్యో నారదా !! నువ్వు నామస్మరణ చేస్తున్నావు కానీ దాని రుచి నీకు తెలియదా ?? అయితే అక్కడ చెట్టుమీద కూర్చున్న కాకిని అడుగు.
అప్పుడు నారదులవారు కాకిని నామస్మరణ విశిష్టత గురుంచి ఇలా అడిగారు, ‘నారాయణా నారాయణా’ అని జపించడం వల్ల ఏమిటి ఫలితం అని ? ఆ నామం వినగానే కాకి మరణించింది.
నారదులవారు– కాకిని అడిగాను స్వామి, కానీ మీ నామం వినగానే మరణించింది. ఇదా ఫలితం స్వామీ అని అడిగారు ?
శ్రీమన్ నారాయణ స్వామి — నిజం తెలియడానికి సహనం కావాలి. నారదా ,ఒక బ్రాహ్మణుడి ఇంట్లో, అందమైన చిలక ఉంది, దానిని అడుగు అని సూచించారు .
నారదులవారు, చిలక దగ్గరికి వెళ్లి ‘నారాయణా నారాయణా’ జపించడం వల్ల ఏమిటి ఫలితం అని మళ్ళీ? నామం వినగానే, చిలక
మరణించింది.
నారదులవారు– చిలకని అడిగాను స్వామి , కానీ మీ నామం వినగానే మరణించింది. ఇదా ఫలితం అని మళ్ళీ ?
శ్రీమన్ నారాయణ స్వామి — నిజం తెలుసుకోవాలి అంటే పట్టుదల కావాలి నారదా!ఒక బ్రాహ్మణుడి ఇంట్లో, ఆవుకి దూడ పుట్టింది. ఆ దూడని అడిగిరా !
నారదులవారు దూడ దగ్గరికి వెళ్లి అడిగారు ‘నారాయణా నారాయణా’ జపించడం వల్ల ఏమిటి ఫలితం అని ? నామం వినగానే దూడ మరణించింది.
నారదులవారు:దూడని అడిగాను స్వామి , కానీ మీ నామం వినగానే మరణించింది. ఇదా ఫలితం ?కానీ నిజం తెలిసేదాకా నేను పట్టుదలగా ఉంటాను స్వామీ అని అన్నారు
శ్రీమన్ నారాయణ స్వామి :తొందర పడకు నారదా,సహనంతో ఉండు. రాజుకి నిన్ననే కొడుకు పుట్టాడు. రాజు చాలా సంతోషంగా ఉన్నారు. వెళ్లి నిన్ననే పుట్టిన పసివాడిని అడుగు!
కానీ ఈ సారి, నారదులవారు భయ పడ్డారు. పసివాడు మరణిస్తే రాజుగారి భటులు నన్ను నిర్బంధం చేస్తారు కదా మరి
శ్రీమన్ నారాయణ స్వామి :ఏమీ భయపడకు నారదా, వెళ్లి పసివాడిని అడుగు!
అప్పుడు,నారదులవారు రాజుగారి దగ్గరకు వెళ్లారు, పసివాడిని బంగారపు పళ్ళెంలో తీసుకుని వచ్చారు. అప్పుడు నారదులవారు, ‘పసివాడిని నేను ఒక మాట అడగవచ్చా?’ అని అన్నారు. దానికి రాజుగారు అంగీకరించారు.
అప్పుడునారదులవారు, పసివాడిని అడిగారు, ‘నారాయణా నారాయణా’ అని జపించడం వల్ల ఏమిటి ఫలితం అని ?
నామం వినగానే పసివాడు ఈ విధంగా మాట్లాడాడు.
పసివాడు — మీరు రోజంతా నారాయణా నారాయణా, అని జపం చేస్తారు. కానీ దాని రుచి తెలియదా ??
ముందర నేను కాకిగా ఉన్నపుడు మీరు వచ్చి ‘నారాయణా నారాయణా’ జపించడం వల్ల, నా జన్మ ధాన్యం అయింది.
తరవాత చిలకగా పుట్టాను. మీరు మళ్ళీ వచ్చి నారాయణా నారాయణా’ అని జపించడం వల్ల, నా జన్మ ధాన్యం అయింది.
అప్పుడు , ఒక ఆవుకి దూడగా పుట్టాను. అది ఇంకా మంచి జన్మ. బ్రాహ్మణులు ఆవుని పూజిస్తారు. మీరు మళ్ళీ వచ్చి నారాయణా నారాయణా’ అని జపించడం వల్ల, నా జన్మ ధన్యం అయింది.
ఇప్పుడు నేను రాజుగారికి యువరాజుగా పుట్టాను చూశార! ఎప్పుడూ నారాయణా నారాయణా’ జపించడం వల్ల, జీవితంలో పైస్థాయికి ఎదుగుతాము. ఉత్తమ జన్మను మరియు సద్గతిని పొందుతాము
ఇదే భగవన్నామం యొక్క విశిష్టత.

నీతి.
మనకి భగవంతుడి మీద ప్రేమ , భక్తి , నమ్మకం ఉంటే జీవితంలో పైస్థాయికి ఎదుగుతాము.
‘నారాయణా నారాయణా’ నామం వినడం వల్ల, కాకికి చిలక జన్మ వచింది. తరవాత చిలకకి దూడ జన్మ వచింది. తరవాత దూడకి మానవ జన్మ వచింది.
భగవన్నామం వింటేనే ఇంత ఫలితం వస్తే, ఎప్పుడూ భగవన్నామస్మరణ , భగవన్నామం జపం చేస్తే ఎక్కువ ఫలితం దక్కుతుంది

http://saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu

 

పరులను దూషించుట మనకే మంచిది కాదు!!

img_1832

 

ఆ రాజ్యంలో రాజుగారు చాలా మంచి వాడు . ఆయన ప్రతి రోజూ పేద బ్రాహ్మణులకు మద్యాహ్న భోజనం వండించి పెట్టేవాడు.
ఒక రోజు యధావిధిగా భోజనం వండించే ఏర్పాట్లు చేస్తున్నాడు .అదే సమయం లో ఆకాశం లో ఎగురుతున్న ఒక గద్ద కాళ్ళతో పట్టుకున్న పాము నోటినుండి విషం వడ్డించడానికి సిద్ధంగా ఉన్న అన్నం బేసిన్ లో పడింది .అది ఎవరూ గమనించలేదు
ఆభాగం ఒక బ్రాహ్మణుడు తిన్నాడు.అది తినడం వలన అతడు చనిపోయాడు . ఈ వార్త రాజుగారికి చేరింది . ఆయన చాలా దుఃఖించాడు . మేలు చెయ్యబోతే ఇలా కీడు జరిగింది అని ఆయన చింతించాడు .ఇప్పుడు బ్రాహ్మణుడు చనిపోవడానికి కారణం ఎవరు ?

రాజా ? వంటవాడా ? పామా ? గద్దా ? వడ్డించిన వ్యక్తా
ఈ పాపాన్ని ఎవరి ఖాతాలో వెయ్యాలి ?

వీరిలో ఎవరూ కావాలని ఆ బ్రాహ్మణుడిని చంపలేదు .
యమ ధర్మరాజును అడిగారు .

ఇది ఇలా ఉంటె మర్నాడు దారినే పోతున్న బ్రాహ్మణులు కొందరు అన్నదానం జరిగే చోటును చెప్పమని ఒక వనితను అడిగారు . ఆమె వారికీ దారిని చూపుతూ
” బాబూ ! జాగ్రత్త మా రాజు గారికి బ్రాహ్మణులు అంటే పడదు . నిన్ననే ఒకాయనను విషం పెట్టి చంపేశారు” . మీ రోజులు బాగున్నాయో లేదో ? అంది .
.
యమధర్మరాజు గారు
“ చిత్రగుప్తా ! మొత్తం పాపం అంతా ఈమె ఖాతాలో వెయ్యి .
యాదృచ్చికంగా జరిగే పనులకు వ్యక్తులను నిందించే వారికి ఆ మొత్తం కర్మ ఫలం కలుగుతుంది అని ధర్మం .”అన్నారు

నీతి:

పరులను నిందించినపుడు వారి కర్మను మనమే తీసుకుంటాము!

ఈ నీతి కథ శ్రీమద్ భాగవతం నుండి గ్రహించబడింది

నీకు నువ్వే దీపం

నీకు నువ్వే దీపం

విలువ : సత్యం

img_1757

 

ఇద్దరు ప్రయాణికులు ఒక దారిలో కలిశారు.
ఒకతని దగ్గర లాంతరు ఉంది.
ఇంకొకతని దగ్గరలేదు.
కానీ ఇద్దరూ కలిసి పక్కపక్కనే నడవడం వల్ల కాంతి ఇద్దరి మార్గాల్లో పరుచుకోవడం వల్ల మార్గం సుగమంగా ఉంది.

దీపం ఉన్న వ్యక్తి ఎంత సులభంగా అడుగులు వేస్తున్నాడో లాంతరు లేని వ్యక్తి కూడా అంతే అనాయాసంగా సాగుతున్నాడు.
కారణం దీపమున్న వ్యక్తితో బాటు దీపం లేని వ్యక్తి నడవడమే.

లాంతరు లేని వ్యక్తి తన దగ్గర లాంతరు లేదే అని దిగులు పడలేదు.
కారణం దాని అవసరం అక్కడ లేదు.

అట్లా ఇద్దరూ చాలా దూరం నడిచాకా ఒక నాలుగురోడ్ల కూడలికి చేరారు.
అప్పటి దాకా ప్రయాణం సాఫీగా సాగింది.
అక్కడినించీ దార్లు వేరయ్యాయి. లాంతరు ఉన్న వ్యక్తి కుడివైపుకి, లాంతరు లేని వ్యక్తి ఎడమవేపుకి వెళ్ళాలి.

లాంతరు ఉన్న వ్యక్తి కుడివైపు తిరిగి వెళ్ళిపోయాడు.
కాంతి అతనితో బాటు అతనికి దారి చూపిస్తూ వెళ్ళింది.

లాంతరు లేని వ్యక్తి ఎడమవైపుకి తిరిగి పది అడుగులు వేశాడో లేదో కాలు ముందుకు కదల్లేదు.

కారణం?
చీకటి.

అతనికి ఏడుపు వచ్చింది. లాంతరు ఉన్న వ్యక్తిని తలచుకున్నాడు. అతని దగ్గరగా తను నడుస్తున్నంత సేపూ ప్రయాణం అనాయాసంగా జరిగింది. అతను వెళ్ళిపోయాక, తన మార్గం అంధకారబంధురమయింది.

తన దగ్గర కూడా కనీసం చిన్న దీపమయినా ఉంటే ప్రయాణం సాఫీగా సాగేది కదా అని బాధ పడ్డాడు.

నీతి:
మనకు ఇతరులు కొంతవరకే మార్గం చూపిస్తారు.
తరువాత మనదారి మనం వెతుక్కోవాలి.
చివరిదాకా ఎవరూ ఎవరికీ దారి చూపరు.
గురువు చేసే పనయినా అదే.
గురువు దగ్గరున్న కాంతి కొంతవరకే దారి చూపుతుంది.
శిష్యుడు తనలోని దీపాన్ని వెలిగించుకున్నపుడు ప్రయాణం చివరిదాకా చేయగలడు.

నీకు నువ్వే దీపం అని బుద్ధుడనడం వెనక అర్థమదే.