Archive | February 2014

చిల్లు కుండ విలువ : సత్యం అంతర్గత విలువ : ఆశావహ దృక్పథం

ఒక ఊరిలో ఒక నీళ్ళు మోసేవాడు ఉండే వాడు . అతడు ప్రతి రోజూ కావడి భుజాన వేసుకుని రెండు వైపులా రెండు కుండలు పెట్టుకుని ఒక వాగు నుంచి తన యజమాని ఇంటికి నీళ్ళు పట్టు కుని వెళ్ళే వాడు. అతని వద్ద ఉన్న కుండల్లో ఒకటి చిల్లుది. దానిలో సగం నీళ్ళు ప్రతి రోజూ కారిపోతూ ఉండేవి.
ఇలా ప్రతి రోజు యజమాని ఇంటికి కుండ న్నర నీళ్ళు మాత్రమే తీసుకుని వెళుతూ ఉండే వాడు. ఇలా రెండు సంవత్సరాలు గడిచాక చిల్లు కుండ సిగ్గు పడుతూ నీళ్ళు మోసేవానితో ఇలా చెప్పింది. నా లోని లోపం కారణంగా నీవు సగం నీళ్ళు మాత్ర మే యజమాని కి అందించ గలుగుతున్నవు. నీ శ్రమకు సంపూర్ణం గా ఫలాన్ని పొందలేక పొతున్నా వు. cracked-pot-2
దానికి సమాధానంగా ఆ నీళ్ళు మోసేవాడు దయతో ఆ కుండ తో ఇలా అన్నాడు . మనం వెళ్ళే త్రోవలో కొన్ని పూల తీగలు ఎండ వేడికి వాడి పోతున్నాయి. ఆతీగలు కొండ పై వరకు పాకి ఉన్నాయి. నీ నుంచి కారిపోయే నీళ్ళు ఆ తీగల మొదళ్ళలో పడి ఆ తీగలు చిగురిస్తున్నా యి. ఆ రకంగా
నీ నుంచి కారిపోయే నీళ్ళ వల్ల మంచే జరుగుతోంది. అయినా ఆ కుండ తన నుండి నీళ్ళు కారిపోతున్నందుకు తన బాధను వ్యక్తం చేసింది దానికి మళ్ళీ అతను ఇలా అన్నాడు. నీకు తెలుసా
ఆ తీగలు నీ వైపుననే ఉన్నయి. రెండవ కుండ ఉన్నవైపు లేవు నీలో ఉన్న లోపాన్ని గమనించి నిన్ను ఎప్పుడు ఆ తీగలు ఉన్నవైపు ఉంచుతు న్నాను. ఇటు వైపే విత్తనాలు పాతి రెండు సంవత్సరాల నుంచి నీ ద్వారా నీరు అందిస్తున్నాను. ప్రతి రోజు ఆ తీగలు అందమైన పరిమళంతో కూడిన పువ్వులనిస్తున్నాయి వాటితో నా యజమాని ఇంటిని చక్కగా అలంకరిస్తున్నాను.ఇదంతా నీ వల్లనే సాధ్యమయింది. ఈ మాటలు విని ఆ కుండ ఊరట పొందింది.cracked-pot

నీతి: ఈ ప్రపంచంలో నిరుపయోగమైనది ఏదీ లేదు. లోపాలను కూడా ఉపయోగపడేలా తీర్చి దిద్దుకోవడం వివేకం. ప్రతి విషయాన్నీ అనుకూల, ఆశావహ దృక్పథములతో చూడగలిగితే తోటి వారి కంటే ఎక్కువగా మనం, మన ప్రత్యేకతను నిలబెట్టుకోగలుగుతాము.

http://saibalsanskaar.wordpress.com
http://www.facebook.com/neetikathalu

కృతజ్ఞత విలువ : ధర్మం అంతర్గత విలువ : కృతజ్ఞత

చదువు పూర్తిచేసుకున్న ఒక విద్యార్ధి, పెద్ద కంపెనీలో మేనేజర్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసాడు. మొదటి ఇంటర్వ్యూ లో పాస్ అయ్యాక డైరెక్టర్ చివరి ఇంటర్వ్యూ కోసం  పిలిచారు. మొదటినుండి అతని ఉత్తీర్ణతా ఫలితాలు చాలా మంచి మార్కులతో ఉండడం గమనించారు. నువ్వు స్కాలర్షిప్ తో చదువుకున్నావా అని అడిగేరు , దానికి ఆ విద్యార్ధి కాదు అని చెప్పేడు, మరి మీ నాన్నగారు మంచి ఉద్యోగం చేస్తున్నారా అని అడిగేరు, ఆ విద్యార్ధి తనకు తండ్రి లేరని తల్లి రోజూ కొన్ని ఇళ్ళలో  బట్టలు ఉతికి ఆ డబ్బుతో తనను చదివించింది అని చెప్పేడు. డైరెక్టరు  విద్యార్ధిని  చేతులు చూపించమని అడిగేరు అతని చేతులు చాల సున్నితంగా ఉండడం చూసి, నువ్వు ఎప్పుడయినా బట్టలు ఉతకడంలో మీ తల్లికి సహాయం చేసేవా అని అడిగేరు. దానికి అతను చెయ్యలేదని , తల్లి తనను ఎప్పుడూ చదుకోమని చెప్పి పని అంతా ఆమె ఒక్కత్తే   చేసుకునేది అని చెప్పేడు.ఇంటికి వెళ్ళి మీ తల్లి చేతులు ఎలా ఉన్నాయో ఒక్కసారి పరిశీలించి  ఆమెకు సేవ చేసి రమ్మని ఆ  విద్యార్ధిని ఇంటికి పంపించేరు.

డైరెక్టర్ చెప్పినట్టు చేస్తే ఉద్యోగం వస్తుందని  ఆ విద్యార్ధి సంతోషంగా వెళ్ళేడు. తల్లిని చేతులు చూపించమని అడిగేడు. ఎప్పుడూ అడగని కొడుకు అలా అడగడంతో ఆమె ఆశ్చర్యపోయింది. భయపడుతూ చేతులు చూపించింది.విద్య్యార్ధి తల్లి చేతులు చూసి మౌనంగా ఉండిపోయాడు.చేతులు ముడతలు పడిపోయి, అక్కడక్కడా గీరుకుపోయి ఉన్నాయి.నెమ్మదిగా చేతులు శుభ్రం చెయ్యడం మొదలుపెట్టేడు, కొన్నిచోట్ల ముట్టుకుంటే నెప్పి భరించలేక  తల్లి బాధపడడం గం అనించాడు. ఆ రోజు తల్లి ఉతకవలసిన బట్టలు అన్నీ తనే స్వయంగా ఉతికాడు. ఆ రోజు రాత్రి చాలసేపు తల్లి కొడుకు కబుర్లు చెప్పుకుంటూ గడిపారు.

మర్నాడు ఉదయం ఆ విద్యార్ధి డైరెక్టర్ దగ్గరికి వెళ్ళేడు. ఇంటికి వెళ్ళి ఏమి చేసావో చెప్పమని డైరెక్టర్ అడిగారు. మీరు చెప్పినట్టుగానే తల్లికి సేవ చేసానని, పనిలో  సహాయం చేసానని చెప్పేడు. విద్యార్ధి కళ్ళలో నీళ్ళు గమనించిన డైరెక్టర్, అతనిలో మార్పుని గమనించి, ఏమి తెలుసుకున్నావో చెప్పమని అడిగారు. అప్పుడు విద్యార్ఢి ఇలా చెప్పేడు.
images4WBRC8PJimagesF36LAU0T1.మా అమ్మ శ్రమ వల్లనే నేను ఇంత బాగా చదుకోగలిగాను అని

తెలుసుకున్నాను.

2.అమ్మతో కలిసి పనిచేస్తుంటే, ఒక ఫనిని పద్ధతిగా చెయ్యడంలో ఎంత కృషి, శ్రమ, అవసరమో తెలుసుకోగలిగాను.

3. కుటుంబంలో సంబంధాల విలువ, ప్రాముఖ్యత తెలుసుకున్నాను.

అప్పుడు డైరెక్టర్ ఈవిధంగా అన్నారు. ” నా కంపెనీలో ఉద్యోగులు సమాజానికి ఆదర్శంగా ఉండాలి. కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే వారి లక్ష్యంగా ఉండకూడదు. తోటివారి బాధని అర్ధం చేసుకుని , వాళ్ళకి సహయపడాలి.మానవ సంబధాల విలువ తెలుసుకుని ప్రవర్తించాలి. నీతి నిజాయితిలతో , క్రమశిక్షణగా  జీవించగలగాలి.’

ఇవన్నీ నువ్వు తెలుసుకుని వచ్చావు కాబట్టి నీకు ఈ ఉద్యోగం ఇస్తున్నాను.తరవాత కాలంలో ఆ విద్యార్ధి కష్టపడి పనిచేసి , అందరి మన్ననలు పొందుతూ జీవితంలో  బాగా స్థిరపడ్డాడు.

నీతి : పిల్లలని అతిగా గారం చేసి వాళ్ళకి కావలసినవన్నీ చేతికి అందించడం అలవాటు చేస్తే, అందరినుండి అలాగే ఆశిస్తారు. దీనివల్ల వాళ్ళ మనస్తత్వం అలాగే రూపొందుతుంది. అందరూ తమమాటే వినాలని పట్టుబడతారు, తల్లితండ్రుల కష్టాన్ని , పక్కవాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకునే శక్తిని కోల్పోతారు.ఇలాంటివాళ్ళు  జీవితంలో ముందుకి వెళ్తునట్టు కనిపించినా, వారి మనసంతా  ద్వేషం, కోపం వంటి చెడు భావాలతో  నిండిఉంటుంది. దీర్ఘకాలంలో ఇది ఆరోగ్యకరమైన పరిణామం కాదు. మనిషికి మంచిగుణాలే నిజమైన సంపద. అలంటివాళ్ళవల్ల మాత్రమే సమాజ అభివృద్ది సాధ్యమౌతుంది. పిల్లలకి కావలసిన సౌకర్యాలు అందించడం తల్లితండ్రుల బాధ్యత, దానితోపాటు కష్టం విలువ తెలిసేలా, తోటివాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకుని జీవించగలిగేలా మానసికంగా కుడా వాళ్ళని సిద్ధం చేస్తే సమాజానికి మంచి పౌరులని అందిచినవాళ్ళు అవుతారు

http://saibalsanskaar.wordpress.com

 

నిర్మలమయిన మనస్సు విలువ : శాంతి అంతర్గత విలువ: ప్రేమ

బుద్ధుడు తన అనుచరులతో ప్రయాణము చేస్తున్నప్పుడు, అక్కడ ప్రక్కనే ఉన్న చిన్న మడుగు నుంచి, త్రాగటానికి మంచి నీరు అడిగేరు. అప్పుడే ఒక, ఎద్దులబండి ఆ మడుగులోనుండి వెళ్ళింది. అందువల్ల నీరు అంతా బాగా మట్టిగా అయిపోయింది. అనుచరుడు ఆలోచించాడు ‘ఇంత మట్టి నీరు ఎలా ఇవ్వడం’ అని. బుద్ధుడు దగ్గరికి వచ్చి నీరు త్రాగటానికి వీలుగాలేదు అని చెప్పాడు.
ఒక అర్ధగంట అయ్యాక, బుద్ధుడు అనుచరుడిని మళ్ళీ నీరు తీసుకుని రమ్మని పంపేరు. నీరు ఇంకా మట్టిగానే ఉన్నాయని చెప్పాడు.
మళ్లీ ఒక అర్ధగంట అయ్యాక, బుద్ధుడు అనుచరుడిని నీరు తీసుకుని రమ్మన్నారు. నీరు త్రాగటానికి ఇంకా వీలుగాలేదుఅని చెప్పాడు.
కొంచం సేపు అయ్యాక అనుచరుడు గమనించాడు, మట్టి క్రింద ఉంది, నీరు పైకి తేరిం ది. నీరు ఒక కుండలో బుద్దుడికి తీసుకుని వచ్చాడు.
బుద్ధుడు నీరుని చూసి అన్నారు’నీటిని త్రాగటానికి వీలుగా ఎలా చేశావు. కొంచం సేపు, ఆ మట్టి సద్దుకున్నాక, నీరు పైకి తేరింది .
మనస్సుకూడాఅంతే. చాలా కలత చెందినప్పుడు, కొంచంసేపు వదిలెయ్యాలి. అదే సద్దుకుంటుంది.. నీవు ఏమీ కష్టపడక్కర్లేదు.

నీతి:
నిశ్చలమైన మనస్సుతో ఉండడం కష్టమయిన పని కాదు. ఎందుకంటే, అదిమన స్వభావం.
images