Archive | July 2015

తోటలో మొక్కలు; అడవిలో చెట్లు, విలువ: ధర్మం, అంతర్గత విలువ: విధి నిర్వహణ

అక్బర్ బాద్ షా  తన ఇష్టమైన మంత్రి బీర్బల్ తో  ఒక నాడు షికారుకు బయలుదేరాడు. దారిలో ఒక ఆటవిక స్త్రీ చెట్టుకింద కూర్చుని ఆయాస పడడం చూసారు.

కొంత సేపటికి తిరిగి కోట వైపు వెళ్తుంటే ఆ స్త్రీ ఒక బిడ్డకి జన్మనిచ్చి ఆ బిడ్డని గుడ్డల్లో చుట్టి, ప్రసవమైన ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసి, తన దారిని చక చక బిడ్డను తీసుకుని వెళ్ళిపోయింది.

ఇది చూసిన అక్బర్ బాద్ షా బిడ్డను ప్రసవించడం అంత సునాయసమని అపోహ పడ్డారు.

ఇంటికి వచ్చి, గర్భవతి ఐన తన బేగంకి పరిచారకులు అవసరంలేదని, తన పనులు తనే చేసుకోవాలని చెప్పి, వాళ్ళను వేరే పనులు చేసుకోమని మళ్ళించారు.

నిండు గర్భవతి ఐన బేగం తన పనులు చేసుకోవటం అలవాటు లేక, చాలా ఇబ్బంది పడసాగింది.

తట్టుకోలేక ఒక రోజు బీర్బల్ను సహాయం అర్థించింది.

బీర్బల్ ఇంత నాజూకైన విషయం అక్బర్ బాద్ షా తో ఎలా  చెప్పాలని సతమతమయ్యాడు.

అలోచించగా ఒక ఉపాయం తట్టింది.

కోట లోని తోటమాలిని కొద్ది రోజులు మొక్కలకి నీళ్ళు పోయవద్దని చెప్పాడు.

రోజు తోటలో విహరించడం అలవాటైన అక్బర్ ఒక రోజు అలాగే తోటలో వుండగా మొక్కలు నీరసించి వాడిపోతూ వుండడం గమనించాడు. వెంటనే తోట మాలిని విషయం చెప్పమని ఆగ్రహించాడు.

birbal-garden-plants

తోట మాలి బీర్బల్ ఆదేశానుసారం మొక్కలకు నీళ్ళు పోయటంలేదని చెప్పాడు.

కోపంతో అక్బర్ బీర్బల్ను పిలిపించాడు. “మొక్కలు నీళ్ళు లేకపోతే ఎండిపోవా?” అని కోపంతో కేకలు వేయ సాగాడు.

బీర్బల్ అప్పుడు నిదానంగా, “బాద్ షా! అడవిలో పెద్ద పెద్ద వృక్షాలు ఏ తోట మాలి సహాయం లేకుండా, రోజు నీళ్ళు పోయకుండ, పెరిగాయి కదా? అలాగే మరి మన కోటలో తోటలకి ఇంత మంది సేవకులు ఎందుకు?” అన్నాడు.

వెంటనే అక్బరుకు జ్ఞానోదయమయ్యింది. బీర్బల్ సున్నితంగా ఇచ్చిన సూచనను గ్రహించి వెంటనే రాణి గారికి పరిచారకులను పురమాయించాడు.

నీతి: భగవంతుడి సృష్టిలో ఒకో జీవికి ఒకో ప్రత్యేకత ఉంటుంది. తమ సంప్రదాయాలు, ఆచారాలు గౌరవిస్తూ తమ విధులు నిర్వర్తించాలి కాని సమాజంలో మిగిలిన వర్గాల వారితో పోల్చుకుని తమ పద్ధతులు మార్చుకోవాలని ప్రయత్నించకూడడు.

https://saibalsanskaar.wordpress.com/

https://www.facebook.com/neetikathalu

 

Bottom of Form

 

 

Advertisements

ఒక విలువైన శాలువా!! విలువ:ధర్మాచరణ,ఉపవిలువ:విచక్షణ

download (5)

ఒకానొకప్పుడు అత్యంత విలాశ జీవితము ,ఇంద్రియ సుఖములయందు అత్యంత ఆశక్తి కల ఒక రాజు   ఉండేవాడు . విపరీతంగా మధ్యము సేవించటం,ఇంద్రియ సుఖాలలో మునిగి తేలటం  ,ఇంకా అనేక ఇతర వ్యసనాలకు బానిసగా జీవిస్తూ ఉండేవాడు .ఆ రాజు తన ప్రధాన మంత్రి తో “మనిషి జన్మ లభించటం అంత సులభమైన విషయం కాదు.అందువల్ల వీలైనంత లౌకిక సుఖాలను ,ఇంద్రియ సుఖాలను అనుభవించే ప్రయత్నం చెయ్యాలి.  జీవితంలోని ఆనందాలన్నీ పూర్తిగా అనుభవించేవిధంగా కాలాన్ని గడపాలి “అని చెబుతూ ఉండేవాడు.

ప్రధానమంత్రి చాలా  తెలివైన గౌరవనీయమైన వ్యక్తి. రాజు యొక్క ఈ విలాశ జీవితం ,అతని అలోచనా విధానం ప్రధానమంత్రికి చాలా బాధ కలిగిస్తూ ఉండేది.అవకాశ దొరికినప్పుడల్లా రాజుకి తగిన సలహా ఇవ్వటానికి ప్రధానమంత్రి ప్రయత్నిస్తూ ఉండేవాడు .కానీ రాజు యే మాత్రం అర్ధం చేసుకునే వాడు కాదు .ప్రధాన మంత్రి సలహా వినే వాడు కాదు .భోగలాలలస తో కలుషితమైన తన మనసు  తప్పు ఎదో ఒప్పు ఎదో గుర్తించలేక తన మనసు ప్రజలను తప్పు త్రోవ పట్టిస్తూ ఉండేది . అతని పరిపాలనలో ప్రజలు భయం తొ బ్రతుకుతూ ఉండేవారు.రాజు చాల దుర్మార్గుడు కావటం వలన ఎవ్వరూ అతన్ని ఎదిరించే సాహసం చేసే వారు కాదు.

ఒక రోజున ప్రధాన మంత్రి చేసిన ఒక పని రాజుకి  చాలా ఆనందాన్ని కలిగించింది .అందుకు బహుమానంగా రాజు మంత్రికి ఒక ఖరీదైన ,విలువైన శాలువాను బహూకరించాడు .ప్రధానమంత్రి పట్ల అసూయ కలిగిన ఒక సభికుడు , మంత్రి ,రాజు గారు ఇచ్చిన ఖరీదైన శాలువా తో ముక్కు తుడుచుకోవటం గమనించాడు . అతను వెంటనే రాజు గారి దెగ్గరికి వెళ్ళి “మహారాజా !ఈ రొజు ప్రధాన మంత్రి మీ గౌరవానికి భంగం కలిగించే విధంగా ప్రవర్తించారు. “ఏమి జరిగింది?” ,అని అడిగాడు రాజు . “మహారాజా!  మీరు బహూకరించిన  అత్యంత ఖరీదైన శాలువాను ముక్కు చీదుకోటానికి ఉపయోనించాడు “అని చెప్పాడు ఆ సభికుడు.

మహారాజు వెంటనే ప్రధానమంత్రిని పిలిపించాడు .”నేను బహూకరించిన ఖరీదైన శాలువా తో ముక్కు చీదుకోవటానికి నీకు ఎంత ధైర్యం ?” అని ప్రశ్నించాడు .ప్రధాన మంత్రి దానికి ఎంతో గౌరవంగా “ప్రభూ !మీరు నేర్పిన విధంగానే నేను ప్రవర్తించాను!” అన్నాడు . “అగౌరవంగా ప్రవర్తించమని నేను నెర్పించానా ? యే విధంగా ?”,అని అడిగాడు మహా రాజు “ఈ శాలువా కంటే ఎంతో విలువైన జీవితాన్ని ,భగవంతుడు మీకు ప్రసాదించాడు .అంత విలువైన జీవితాన్ని మీరు యే మాత్రం గౌరవం,నీతి నియమాలు లేకుండా  ఇంద్రియ సుఖాలకోసం  ,లౌకిక మైన ఆనందాల కోసం  ఉపయెగించటం నాకు  ఇలా శాలువాను దుర్వినియోగం చేయటం నేర్పింది.. ” అని ఎంతో వినయంగా బదులు ఇచాడు ప్రధాన మంత్రి. ఈ విధంగా ప్రధానమంత్రి యుక్తి ఫలంచింది! రాజు తన తప్పుని గ్రహించాడు  .ఆ క్షణం నించి మహారాజు జీవన విధానం ,రాజ్యపాలనా విధానం పూర్తిగా మంచిగా మారిపోయింది.

నీతి: మంచి చెడుల మధ్య భేదాన్ని గుర్తించాలి ! చిన్నతనంలోనే ఇటువంటి విషయాలు నేర్పితే , పిల్లలు మేధావుల లాగా ఎదిగి ధర్మభద్దమైన జీవితాన్ని గడుపుతారు.

http://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

దయతో జీవించు ,ప్రేమతో జయించు!! విలువ: ప్రేమ,అంతర్గత విలువ: దయ

 download (4)

చాలా కాలం క్రితం, సామ్మీ అనే ఒక  బాలుడు ఉండేవాడు . అతను ఒక మంచి పిల్లవాడు.  తన తరగతి లో వేరే పిల్లల కంటే మరింత తెలివైన వాడు. చదువులో చురుకుగా ఉండటమే కాక తలిదండ్రులను ఎంతో గౌరవించేవాడు.అందరిపట్ల దయ ,కరుణ కురిపించేవాడు. పెద్దలు పిల్లలు  ,సామ్మీని ఎంతగానో ప్రేమించేవారు!కానీ సామ్మీ కోరిక,  లాగే  అందరితో ప్రెమించబడా లీ  అనే కోరిక పలువురు ,ఇతర బాలుల లో అసూయ రేకెత్తించింది.

సామ్మీ తరగతి లో చదువుతున్న టిమ్మీ అనే మరొక అబ్బాయి ఉన్నాడు.  అతడు  సామ్మీ లా కాదు చదువులో శ్రద్ధ చూపేవాడు కాదు.పాఠశాల సమయంలో కూడా ఆటలు ఆడుకుంటూ సమయాన్ని వృధా చేసేవాడు .అతను తన తల్లిదండ్రులతో అగౌరవంగా ప్రవర్తించేవాడు, మరియు సామ్మీ తో పాటు తన ఇతర సహచరులను  ఏడిపించే వాడు .   ఎప్పుడూ తరగతి లో ఇతర పిల్లలు ముందు సామ్మీని అణిచివేసేందుకు ప్రయత్నించేవాడు.

కానీ అతను ఏమి చేసినా, సామీ మటుకు బాగ చదువుకుని ఇంకా ఇంకా మంచి మార్కులు తెచ్చుకునే వాడు . సామీ మటుకు బాగా  చదువుకుని ఇంకా ఇంకా మంచి మార్కులు తెచ్చుకునే వాడు. తన ఎనిమిదవ పుట్టినరోజు న, సామ్మీ కి  తన లు చక్కని పెన్న ని బహుమతిగా ఇచ్చారు . దాన్ని సామీ క్లాస్స లో విన్న పాఠాలను ,రాసుకుందామని తెచ్చుకుంటాడు.

అది  చాలా అందమైన పెన్ !అంతే కాకుండా, చాలా వేగంగా  వ్రాయడానికి కూడా ఉపకరిస్తుంది . టిమ్మీ అది చూసి  చాలా అసూయ పడ్డాడు.  అతను,సామ్మీతో కుతూహలంగా , “,ఈ కలం నీకు ఎవరన్నా ఇచ్చరా? లేక నువ్వే కొనుక్కున్నావా అని ప్రశ్నిస్తాడు!

“నా తల్లిదండ్రులు నాకు  పుట్టినరోజు బహుమతిగా ఇచ్చారు.” అని సామ్మీ  బదులిచ్చాడు!”

టిమ్మీ, కోపం మరియు అసూయ తో రగిలిపోయాడు . అతను తన చెడు ప్రవర్తన వలన  తల్లిదండ్రుల నుండి ఏ బహుమతులు పెద్దగా అందుకోనలేదు  .సామ్మీ  యొక్క కలం దొంగతనం చేయుటకు నిర్ణయించికున్నాడు.ప్రతి ఒక్కరూ తరగతి నుండి బయటకు వెళ్ళిన సమయంలో, టిమ్మీ సామ్మీ యొక్క బ్యాగ్ సవరించి  అతని కలం దొంగిలించాడు . అతను  దానిని తన బ్యాగ్ లోపల దాచిపెట్టి   టిఫిన్ తినడానికి  బయటకు వెళ్లి పోయాడు .

సామ్మీ  తిరిగి వచ్చి తన కలం కోసం వెతికి  కనపడక ,దాని గురించి తన తరగతి ఉపాధ్యాయునికి సమాచారం అందించాడు .  అక్కడ తప్పిపోయిన కలం కోసం, తరగతి లోపల ప్రతి పిల్లల బ్యాగ్  వెతకమని , ఉపాధ్యాయుడు తరగతి మోనిటర్ని ఆదేశించారు.తప్పిపోయిన పెన్ వెంటనే టిమ్మీ బ్యాగ్ లోపల దొరికింది . దీనికి తన సమాధానం యేమిటి అని కోపంతో గురువు ఆ బాలుడిని అడిగారు .టిమ్మీ కన్నీళ్లు పెట్టుకొని మౌనంగా ఉండిపోయాడు.టిమ్మీ వైపు  చూసినపుడు, సామీ కి అతనిపై జాలి కలిగింది దయార్ద  హృదయుడైన వాడు అవటం చేత  ,తనకి టామీ  పై  యె మాత్రం కోపం లేదని .తన పెన్న దొరికింది కనక ఇంక టామీ ని శిక్షించవద్దని సామీ ఉపాధ్యయుడిని వినయంగా కోరతాడు.అతను తన సహా విద్యార్థికి వ్యతిరేకంగా ఎటువంటి చెడు భావన లేదని,  అతను ఇప్పుడు తన దోచుకున్న పెన్ గుర్తించినప్పటికీ, టిమ్మీ వ్యతిరేకంగా ఏ చర్య తీసుకోవద్దని  తన తరగతి ఉపాధ్యాయునిని అభ్యర్ధిం చాడు. ఇది టిమ్మీ కళ్ళు తెరిపించింది . అతను ఇప్పుడు సామ్మీఒక మంచి బాలుడు అని తెలుసుకోగలిగాడు . తన గురువు మరియు సామ్మీ ని  క్షమించమని కోరాడు

download (3)

ఆ రోజు నుండీ, ఇద్దరూ మంచి  స్నేహితులు అయ్యారు .క్రమంగా సామ్మీ అంత మంచి వాడిగా మారాడు టామీ . అందరూ టిమ్మీని  ప్రేమించటం  ప్రారంభించారు . సామీ కూడా టిమ్మీ వంటి మంచి స్నేహితుడు దొరికినందుకు ఎంతో  గర్వపడ్డాడు.టిమ్మీ బాధపెట్టినా కూడా  సామ్మీ  మాత్రం  తిరిగి ప్రేమ నే తిరిగి ఇచ్చాడు  .అందరు కూడా శత్రువులను ఎ విధముగా ప్రేమతో జయించ వచ్చు అన్నదానికి ఈ కథ ఒక మంచి ఉదాహరణ .  కేవలం మంచి  ప్రవర్తన వలన చేడుగా వ్యవహరించే వారిని కూడా మంచి వారిగా మార్చవచ్చు.

 

నీతి: అపకారికి కూడా ఉపకారము చేసి, సత్ప్రవర్తనతో శత్రువులను ,మిత్రులుగా మార్చుకోవచ్చు! అందుకే అందరితో మంచిగా మెలగాలి!

 

http://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

దివ్యత్వము మరియు అహంకారం ! విలువ: ధర్మము;అంతర్గత విలువ: అహంకారానికి తావు ఇవ్వకుండా అన్నిటిలో దైవత్వాన్ని చూడగలగటం.

image

అనగనగా ఉత్తంగుడనే ఋషి ఉండేవాడు. ఆయన లోకకల్యాణం కోసం దీక్షగా ఎన్నో సంవత్సరములు తపస్సు చేసారు. జన్మరీత్యా అతడు బ్రాహ్మణుడు, కృష్ణ భక్తుడు. ఉత్తంగుడు కామ,క్రోధ,లోభ,మోహ,మద మాత్సర్యములనే దుర్గుణాల టా కి తావు ఇవ్వకుండా , ఎంతో సాధారణమైన జీవితాన్ని గడు పుతూ తన లోకంలో తాను నిముఘ్నుడై ఉండేవాడు.
అతని తపస్సుకి మెచ్చి శ్రీ కృష్ణుడు తన విశ్వ విరాట్ స్వరూపాన్ని చూపి అనుగ్రహించడమే కాక ఏదన్నా వరం కోరుకొమ్మని ఎంతో ప్రేమగా అడుగుతాడు. అయితే ఏ కోరికా లేని ఉత్తంగుడు, ఎంతో ప్రేమని కురిపిస్తున్న తన ఇష్టదైవాన్ని కాదనలేక ఒక చిన్న కోరికని కోరతాడు. అదేమిటంటే, తనకి దాహం వేసి నీరు త్రాగాలి అనుకున్నప్పుడల్లా తనకి ఎప్పుడైనా, ఎక్కడైనా తాగడానికి నీరు దొరకాలి ,అని!
ఒక రోజు ఉత్తంగ ముని యడారిలో నడుస్తుండగా అతనికి బాగా దాహం వేసింది. ఏక్కడా ఒక నీటి చుక్క కూడా అతనికి కనిపించలేదు. ఉత్తంగుడికి ,శ్రీ కృష్ణుడు అనుగ్రహించిన వరం గుర్తుకొస్తుంది. అలా, ఆ వరం గుర్తుకి రాగానే అతడికి చిరిగిన బట్టలు వేసుకున్న ఒక వేటగాడు కనిపిస్తాడు. అతని తో, ఒక కోపం గా చూస్తున్న కుక్క ..మరియు చేతిలో ఒక నీళ్ళు నిండి ఉన్న లేదెర్ పర్సు ఉంది.అతడి వాలకం చూసిన ఈ బ్రాహ్మణుడికి అసహ్యం కలిగింది. దానితో ఆ వేటగాడు తనకి త్రాగటానికి నీరు ఇవ్వబోతే మొహం మీద “నాకు వద్దు… అడిగినందుకు నేను కృతజ్ఞుడిని అని మాట దాటేస్తాడు”. అయినా కూడా అంత దాహంతో అలమటిస్తున్న ఉత్తంగమునిని ఇంకోసారి నీరు త్రాగమని అర్ధిస్తాడు ఆ వేటగాడు .దాంతో ఇంకా కోపం ఎక్కువైన ఉత్తంగుడు ఆ వేటగాడిని తను ఉన్న చోటునించి తరిమేస్తాడు.
అన్ని సార్లు వద్దన్నాక వేటగాడు కుక్కతో పాటు అక్కడ నించి మాయం అయిపోతాడు. కొద్దిసేపటికి ఉత్తంగుడికి ఒకవేళ భగవంతుడే వేటగాడి రూపంలో వచ్చాడేమో అని తడుతుంది. “అయ్యో! ఆ భగవంతుడే నా దాహం తీర్చటానికి వస్తే నాకు తెలియలేదే! ఎంత తప్పు జరిగిపోయింది. అయినా అన్నీ తెలిసిన కృష్ణుడు ,తక్కువ జాతికి చెందీన వాడితో నాకు ఎందుకు నీళ్ళు పంపాలి. బ్రాహ్మణుడైన నేను అతని చేతితో ఇచ్చిన మంచి నీళ్ళని తాగేస్తానని అసలు ఎలా అనుకున్నాడు! అని తనలో తానే ఇలా బాధ పడుతున్నాడు.”
ఇంతలో శ్రీ కృష్ణుడు చిరునవ్వుతో ప్రత్యక్షమై ,ఉత్తంగుడిని ఇలా ప్రశ్నిస్తున్నాడు “ ఉత్తంగా! ఏవరిని చండాలుడు అంటున్నావు. నేను నీకు మంచినీటిని అందివ్వమని సాక్షాత్ ఇంద్రుడినే పంపాను. దేవేంద్రుడు ,నీళ్ళకి బదులు అమృతాన్నే నీకు ఇద్దామని వచ్చాడు. అయితే నీవు అందరిలో దైవాన్ని చూడగలవో లేదో అని చిన్న పరీక్ష పెట్టాము! ఇది విన్న ఉత్తంగుడు భగవంతుడు తనకి పెట్టిన పరీక్షలో ఓడిపోయానని తెలుసుకుంటాడు. కేవలం తన అహంకారంవల్ల అమృతాన్ని తెచ్చిన ఇంద్రుడిని గుర్తుపట్ట లేకపోయానని గ్రహిస్తాడు.ఉత్తంగుడు లాంటి గొప్ప ముని ఇలా అహంకారానికి గురి అయితే ..మనమెంత.
భగవంతుడి లీలలని, మాయని తెలుసుకోగలిగే సమర్ధత మనకి ఉన్నదా! అలా అందరిలో దివ్యత్వాన్ని చూడగలగాలి అంటే ప్రతిక్షణం జాగ్రత్తగా సావధానంగా ఉంటూ, మన జీవిత పరమార్థమేమిటో తెలుసుకోగలగాలి. భగవంతుడు ఎప్పటికప్పుడు మనకి పరీక్ష పెడుతూనే ఉంటాడు. కాని, అవి మన మంచికే. తాను చేసే ఏపని కూడా మనని బాధ పెట్టే ఉద్దేశంతో చేయడు! ఏది చేసినా మన మంచి కోసమే చేస్తాడు.
నీతి: మనమంతా ఒక్కటే. అందరం ఆ భగవంతుడి ప్రతిరూపాలమే. ఈ సత్యాన్ని ప్రతి క్షణం గుర్తుపెట్టుకుంటే మనం అందరిలో భగవంతుడిని చూడగలిగి అంతటా దివ్యత్వాన్ని అనుభవిస్తూ ఆనందంగా ఉండగలుగుతాము.

http://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

మానవత్వాన్ని గెలిపించిన పరుగు పందెం!!!విలువ :ధర్మము ;అంతర్గత విలువ:పరుల పట్ల సానుభూతి

stock-vector-two-athletes-are-performing-a-relay-race-13577287

ఇది ఒక యువ క్రీడాకారుని కథ!!! అతడు ఎప్పుడూ గెలుపుకే ప్రాధాన్యత ఇచ్చేవాడు. అతనికి విజయం అంటే గెలుపొక్కటే. ఒక సారి తన ఊరిలోనే ఇద్దరు తోటి యువకులతో పరుగు పందెం లో పాల్గొంటాడు. ఈ పరుగు పందాన్ని చూడటానికి, జనాలు గుంపులుగా వస్తారు.అందులో ఒక అనుభవఘ్ఙుడైన పెద్దమనిషి కూడా ఈ క్రీడాకారుని పేరు ప్రఖ్యాతులు విని అతను పాలుగొనబోయే ఆ యొక్క పందాన్ని కళ్ళారా చూడటానికి వస్తాడు.

పందెం మొదలు అయింది, మన క్రీడాకారుడు ఎంతో ఉత్సాహంగా, గట్టి పట్టుదలతో, ధైర్య సాహసాలతో పరుగులో ఎలాగైనా అందరి కంటే ముందు రావాలని కాలు దువ్వాడు. అనుకున్న విధంగానే పందెం మొదటి స్థానంలో గెలిచాడు. ఆట చూడటానికి వచ్చిన ప్రేక్షకులంతా అతని గెలుపుకి చప్పట్లతో, చేతులు ఊపుతూ వారి ఆనందాన్ని వ్యక్తం చే శారు. కానీ ఈ పెద్దమనిషి మటుకు స్థబ్దుగా ఏ స్పందనా లేకుండా కూర్చుని చూస్తున్నాడు. కానీ గెలిచిన మన క్రీడాకారుడు మటుకు చాలా గొప్పగా, ధీమాతో నిలబడి అందరినీ చూస్తున్నాడు.

సరే, రెండో సారి పందెం నిర్వహిస్తున్నట్లు ప్రకటన చేశారు. ఇతడిని ఎలాగైనా గెలవాలని ఉత్సాహంతో ఇద్దరు సమర్థవంతులైన క్రీడాకారులు ముందుకి వచ్చారు. ఈసారి కూడా మన క్రీడాకారుడు మొదటి స్థానంలో పరుగు పందాన్ని గెలుస్తాడు. మళ్ళీ పందాన్ని వీక్షించిన ప్రేక్షకులు హర్షధ్వానాలతో వారి ఆనందాన్ని వ్యక్తపరుస్తూ గెలిచిన క్రీడాకారుని ప్రొత్సహిస్తారు. మళ్లీ గెలిచినందుకు క్రీడాకారుడు ఏదో చాలా గొప్పవాడై పోయినట్టు సంబర పడిపోతున్నాడు.

ఇంక తనని ఎవ్వరూ ఓడించలేరన్న ధీమాతో ఇంకొక సారి పందాన్ని నిర్వహించమని అర్ధిస్తాడు. ఇప్పటివరకు చాలా ప్రశాంతంగా, మౌనంగా కూర్చుని ఉన్న మన పెద్దమనిషి ముందుకి వచ్చి ఇద్దరు కొత్త క్రీడాకారులని ,ఈసారి జరగబోయే మూడవ పందంలో పాల్గొనటానికి అక్కడ ఉన్నవారికి పరిచయం చేస్తాడు. అయితే విశేషమేమిటంటే ఈ సారి వరుసగా రెండుసార్లు తెగ సంబరపడిపోతున్న మన క్రీడకారుడి తో పోటీ చేయటానికి ఒక గుడ్డి వాడు, ఇంకో బక్కగా చిక్కిపోయి ఉన్న ఒక ముసిలి ఆవిడ ముందుకి వచ్చారు.వారిని చూసి ఆశ్చర్యపోయిన మన వీరుడు ఇదెక్కడి పందెం, ఇది సాధ్యమేనా అని నిలదీసి ప్రశ్నిస్తాడు. సరే మళ్ళీ ఈసారి కూడా పందెంలో మనవాడే గెలిచి విజయోత్సాహంతో విఱ్ఱవీగుతున్నాడు.కానీ ఎప్పుడూ ఇతడి గెలుపుని చూసి కేరింతలు కొట్టే ప్రెక్షకులు మటుకు ఈసారి మౌనంగా ,ఏ స్పందనా లేకుండా కూర్చుని చూస్తున్నారు.

అరే, వీళ్ళకి ఏమైందసలు అని, మనవాడు ఈ మూడవ పందాన్ని నిర్వహించిన పెద్ద మనిషిని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆయన యువకుడితో, “మళ్ళీ పరిగెట్టండి, ఈసారి మటుకు ముగ్గురూ ఒకేసారి పరుగుని పూర్తి చేయాలి మరి అని ఆదేశిస్తాడు.అప్పుడు మనవాడు కొంచెం నిదానంగా ఆలోచించి, తన తోటి క్రీడాకారులు, అదే గుడ్డివాడు మరియు ఆ ముసిలి ఆవిడ మధ్యలో నించుని, వారిద్దరి చేయి పట్టుకుని మరీ పరుగెడతాడు. వారివురితో సమానంగా అతడు నిదానంగా నడిచి, పరిగెట్టకుండానే పందాన్ని ఒకేసారి పూర్తి చేస్తాడు. ఎన్నడూ కనీ వినీ ఎరగని ఈ విచిత్ర పరుగు పందాన్ని చూసిన అక్కడి ప్రేక్షకులు ఉర్రూతలూగుతారు.

ఈసారి గెలుపుని మటుకు ఆ పెద్దమనిషి మనస్పూర్తిగా అంగీకరిస్తాడు. అది చూసిన ఆ యువ క్రీడాకారుడు తన విజయానికి గర్వపడతాడు.  కానీ! అతనికి ఒక సందేహం కలుగుతుంది, అదేమిటి అంటే “అక్కడి జనాలు అభినందించేది తననా లేక తనతో పోటీలో పాల్గొనిన తన తోటి క్రీడాకారులనా అని!” తన సందేహాన్ని తీర్చమని అడిగితే అప్పుడు ఆ పెద్దమనిషి అతడి కళ్ళలో సూటిగా చూస్తూ, అతడి భుజాలపై చేతులు వేసి “నాయనా! ఇప్పుడు జరిగిన మూడవ పందేంలో ముందు జరిగిన పందాలలో సాధించిన విజయం కంటే చాలా గొప్ప విజయాన్ని సాధించావు”, దానికే ఇక్కడి జనమంతా నిన్ను హృదయపుర్వకంగా అభినందిస్తున్నారు.  మానవుడు మాధవుడిగా ఎదగడానికి ప్రేమ, కరుణ వంటి చక్కటి భావాలని పెంచు కోవాలి.

 

నీతి: గెలవటం ముఖ్యమే, ఆనందమే, కాని అందరితో కలిసి ఐకమత్యంగా సాధించే గెలుపే అసలైన గెలుపు.

http://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

 

 

 

   ప్రేమ ఎలాంటి మనిషి లోనైనా చక్కని మార్పు తెస్తుంది!! విలువ: ప్రేమ అంతర్గత విలువ: దయ

13459022-n--n---noe-----n------nsn-n--n--n---n-n--mathematics-vector---n------------nfn--n---n------n-n-----n

అది స్కూలు మొదలైన మొదటిరోజు,ఐదవ తరగతి బయట నిలబడి ఉన్న ఆ తరగతి టీచర్ మిసెస్(Mrs) థాంప్సన్ (Thompson) తన శిష్యులని చూస్తూ అందరూ గురువుల వలే, “నేను మీ అందరిని సమానంగా ప్రేమిస్తున్నాను,మీరంతా నాద్రుష్టిలో సమానమే .ఎవరూ ఎక్కువ,తక్కువ కాదు” అని మనసులో అనుకుంటుంది. అప్పుడు తను ఎదురుకోబోయే పరిస్థితులు తనకి తెలియవు. ఆ తరగతిలో మొదటి వరుసలో టెడ్డీ స్టాలర్డ్(Teddy Stallard) అనే చిన్న బాలుడు కూర్చుని  ఉన్నాడు.

టెడ్డీ మూడవ తరగతి టీచర్ తన అభిప్రాయాన్ని తెలుపుతూ ఇలా రాశారు “తల్లి మరణాన్ని టెడ్డీ తట్టుకోలేక పోయాడు. అంతేకాక తండ్రి కూడా ఈ పిల్లవాడిని ఇంట్లో సరిగ్గా పట్టించుకోవటం లేదు. ఇది ఇలాసాగితే టెడ్డీ తప్పు దారి పట్టటం ఖాయం.”ఇంక టెడ్డీ నాల్గవ తరగతి టీచర్ ” టెడ్డీ ఎవరితోనూ సరిగా కలవలేకపోతు న్నాడు . బడికి రావటం, చదవుకోవటం పట్ల సరియైన శ్రద్ధ చూపలేక పోతున్నాడు. పైగా అప్పుడప్పుడు పాఠం మధ్యలో పడుకుండిపోతున్నాడు. ” అని రాసింది. ఇవన్నీ చదివిన టెడ్డీ అయిదవ తరగతి టీచర్ “అయ్యో నేను టెడ్డీ ని తప్పుగా అర్ధం చేసుకున్నానే. అతను ఎందుకిలా ఉంటున్నాడో నాకిప్పుడిప్పుడే అర్థమౌతున్నది అని బాధపడింది

ఇంతలో క్రిస్ట్మస్ పండుగ వచ్చింది. తరగతిలోని పిల్లలందరూ మంచి మంచి ఖరీదైన బహుమతులు చక్కగా అందంగా రంగురంగుల కాగితములతో పాక్ చేసి తీసుకొచ్చారు. వాటిలో చిరిగిపోయిన కాగితంతో పాక్ చేసి ఉన్న బహుమతిని టీచర్ తెరిచి చూసింది.  అది టెడ్డీ తెచ్చిన బహుమతి. మిసెస్(Mrs) థాంప్సన్ చాలా ఓపికగా ప్రేమతో అతని బహుమతి తెరిచింది,చూస్తే అందులో తనకి ఒక బ్రేస్లెట్ట్ కనిపించింది. దానిలో కొన్ని రాళ్ళు  కనపడలేదు. బ్రేస్లెట్ట్ తో పాటు పాకెట్ట్ లో ఒక వంతు పెర్ఫ్యూం ఉన్న సీసా ఒకటి కనబడుతుంది. ఇంతటి దయనీయ స్థితి లో ఉన్న బహుమతి చూసి తోటి పిల్లలంతా అపహాస్యం                చేస్తా రు.మిసెస్(Mrs) థాంప్సన్  టెడ్డీ ని  హేళన  చేస్తున్న పిల్లలని మందలించి ” టెడ్డీ, బ్రేస్లెట్ట్ చాలా  బాగుంది అంటూ ఆ పెర్ఫ్యూం ని కొంచెం తన చేతిపై చల్లుకున్నది”

ఆ రోజు స్కూలు అయిపోగానే టెడ్డీ మిస్సెస్స్  థాంప్సన్ దగ్గరికి వచ్చి “టీచర్ ఇవాళ్ళ మీరు మా అమ్మ పెర్ఫ్యూం కొంచెం కొట్టు కోవటం వల్ల మీరు దగ్గరికి వచ్చినప్పుడల్లా నాకు మా అమ్మ గుర్తుకు వచ్చిందండి.” అని తన మనసులో మాట చెప్పి వెళ్ళిపోతాడు. ఇది విన్న మిస్సెస్స్ థాంప్సన్ ఎంతగానో స్పందించి దాదాపు ఒక గంట సేపు కుమిలి కుమిలి ఏడుస్తుంది.

ఈ సంఘటన తరువాత తను టెడ్డీ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టటం మొదలు పెట్టింది. తనతో ప్రత్యేకంగా ఎక్కువ సేపు గడిపేది. టెడ్డీ కూడా చాలా హుషారుగా ఉండటం మొదలుపెట్టాడు.

ఇంక ఆపై సంవత్సరం టెడ్డీ ఆరవ తరగతికి వెళ్ళటం మొదలు పెట్టాడు. ఒక రోజు మిస్సెస్స్ థాంప్సన్  ఇంటి బయట ఒక చిన్న ఉత్తరం కనిపించింది అందులో టెడ్డీ, “మిస్సెస్స్ థాంప్సన్ , ఎప్పటికైనా మీరే నాకు అందరికంటే ఎక్కువ ఇష్టమైన టీచర్ అని రాశాడు. ఇలా ఆరు సంవత్సరాలు గడిచిపోయాయి. మిస్సెస్స్ థాంప్సన్  కి టెడ్డీ నుంచి మరొక లేఖ వచ్చింది. అందులో టెడ్డీ “మిస్సెస్స్ థాంప్సన్ ,  నేను హైస్కూలు ,మంచి మార్కులతో పాస్స్ అయ్యాను అని, తరగతిలో తాను మూడవ స్థానంలో ఉత్తీర్ణుడైనట్లు కూడా రాశాడు.” కానీ, ఇప్పటికి కూడా మీరే  నా ‘బెస్ట్ టీచర్ అని రాశాడు.

సరిగ్గా ఇంకో నాలుగు సంవత్సరాలకి, పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ తన పట్టుదలతో కాలేజీ పూర్తిచేశానని , ఉత్తమశ్రేణిలో ఉత్తీర్ణుడయ్యానని,టెడ్డీ ఇంకో లేఖ రాస్తాడు. ఇప్పటికి కూడా ఆవిడే తన అభిమాన ఉపాధ్యాయురాలని, ఇప్పుడే కాదు ఎప్పటికీ కూడా ఇంతే అని మాట ఇస్తున్నానని రాస్తాడు. ఇంకొంత కాలానికి మళ్ళీ టెడ్డీ బాచిలర్ డిగ్రీ పూర్తి చేశానని ,ఇప్పుడు తను టెడ్డీ కాదు ,‘Theodre F Stallar’ అని తన పూర్తి పేరుతో ఆ లేఖలో సంతకం కూడా చేశాడు.

కథ ఇంతటితో ఆగలేదు. అదే సవంత్సరం తను పెళ్ళి చేసుకుంటున్నట్లు టెడ్డీ మరొక లేఖ రాశాడు. అందులో తన తండ్రి రెండు సంవత్సరాల క్రిందట మరణించారని, అంతేకాక “మిస్సెస్స్ థాంప్సన్  పెళ్ళిలో మీరు నా తల్లి స్థానంలో కూర్చుంటారా” అని వినయంగా అర్ధిస్తాడు. దానికి మిస్సెస్స్ థాంప్సన్ సంతొషంగా అంగీకరించారు. పైగా పెళ్ళికి మిస్సెస్స్ థాంప్సన్  టెడ్డీ తనకు బహుమతిగా ఇచ్చిన తన తల్లి బ్రేస్లెట్ట్ ని తొడుక్కుని ,ఆవిడ వాడే పెర్ఫ్యూం ని కూడా కొంచం జల్లుకుని వస్తారు. టెడ్డీ  తల్లి ,తనతో జరుపుకున్న చివరి క్రిస్ట్మస్ పండుగలో అదే పెర్ఫ్యూం ని వాడారు.మిస్సెస్స్ థాంప్సన్ ని చూడగానే టెడ్డీ ఎంతో ప్రేమగా ఆవిడని కౌగలించుకుని చిన్నగా ఆవిడ చెవిలో “మిస్సెస్స్ థాంప్సన్  నన్ను ఇంతగా నమ్మిన మీకు నేను ఏ రకంగా క్రుతఘ్నతలు     తెలుపుకోగలను. మీరొక్కరే నాకు అండగా నిలిచి నేను జీవితంలో ఏదో సాధిస్తాను అని బలంగా నమ్మారు. నేను నా ప్రతిభ తో ,నా కంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకోగలనని , మీరొక్కరే గుర్తించారు.

ఎంతో ప్రేమ, గౌరవం నిండియున్న టెడ్డీ మాటలు విని మిస్సెస్స్ థాంప్సన్  కళ్ళు చమ్మగిల్లాయి.”టెడ్డీ నేవే నాకు జీవితంలో చక్కటి పాఠం నేర్పావు, నీ వల్లే నేను ఒక ఆదర్శ గురువుగా, పిల్లల జీవితాలని ఎలా తీర్చిదిద్దగలనో నేర్చుకున్నాను. నేవు పరిచయమయ్యేదాకా ,ఒక గురువు ఎలా పిల్లలకు ప్రేమగా పాఠాలు చెప్పవచ్చు, దాని వల్ల పిల్లలు ఎంత స్పూర్తి పొందగలరు అని నాకు అసలు తెలియలేదు.”అని టెడ్డీతో తను ఎప్పటినించో చెప్పాలి అనుకున్న మాటలని మనసు విప్పి చెప్పుకుంటారు ఆవిడ!

నీతి: గట్టి పట్టుదలతో మనం ఒకరి జీవితంలో ఎంత చక్కటి మార్పు తేగలమో ఊహించలేము. ఎంతటి వృక్షమైనా చిన్న విత్తనం నించే కదా వస్తుంది! మంచిని, మానవత్వాన్ని ఎప్పుడూ నమ్మాలి.చక్కటి ఉన్నతమైన భావాలు కలిగిఉండాలి. మనం పరులకి చేసే సహాయం చిన్నదే అయినా పవిత్ర భావాలతో చేస్తే అది వారికి వెయ్యి రెట్లు మేలు కలిగిస్తుంది.

ఏపని కూడా తక్కువ కాదు. ఏది చేసినా మనస్పూర్తిగా, శ్రద్ధతో ,ప్రేమతో మన సాయ శక్తులా చక్కగా చేయాలి. అప్పుడు ఆపని మనకి,  ఎవరి కోసమైతే వారికి చక్కటి ఫలితాలని అందిస్తుంది.

http://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

గర్వపోతు అయిన ఒక ఎర్ర గులాబి కథ !!

విలువ:సత్ప్రవర్తన ;అంతర్గత విలువ:విచక్షణాఙ్ఞానముdownload (2) అందమైన ఒక వసంత కాలపు రోజున అడవిలో ఒక అందమైన ఎర్ర గులాబి పువ్వు వికసించింది.అడవిలో ఎన్నోరకాల చెట్లు ,మొక్కలు పెరుగుతుంటాయి.ఆ ఎర్ర గులాబీ  పువ్వు తన చుట్టూ చూస్తుండగా  దగ్గరలో ఉన్న ఒక పైన్ చెట్టు “అబ్బా ఎంత అందంగా ఉంది” ఈ గులాబీ పువ్వు ! నేను కూడా అంత అందంగా ఉంటే ఎంత బాగుండేది! ” అని అనుకుంది”.మరొక చెట్టు, పైన్ చెట్టుతో ,”ఓ ప్రియమైన వృక్షమా,విచారంచవద్దు ! అందరికీ అన్నీ ఉండటం  సాధ్యం కాదు!”అని అన్నది. ఈ మాటలు విన్న  ఆ గులాబీ పువ్వు తన తలని తిప్పుతూ ” బహుశా ఈ అడవిలో ఇంత అందమైన పువ్వులు కల మొక్క  నేను మాత్రమే ఉన్నాను కాబోలు.” అని అనుకుంది.అప్పుడు తన పక్కనే ఉన్న పొద్దుతిరుగుడు పువ్వు పచ్చని తన తల పైకి ఎత్తి గులాబీ పువ్వుతో “నువ్వు అలా ఎందుకు అనుకుంటావు!” ఈ అడవిలో అందమైన మొక్కలు ఎన్నో ఉన్నాయి నువ్వు వాటిలో ఒక దానివి మాత్రమే అంటుంది .ఎర్ర గులాబీ, దీనికి సమాధానంగా ,”అందరూ నా వైపే చూస్తున్నారు ,ఎంతగానో నన్ను ఆరాధిస్తున్నారు , నువ్వు కూడా  చూస్తున్నావు కదా” అని జవాబు ఇస్తుంది. ఆ తరువాత ఎర్ర గులాబీ,  అక్కడ  ఉన్న ఒక ముళ్ళ కాక్టస్ చెట్టు వైపు చూస్తూ “ఆ చెట్టు ….నిండా ముళ్ళతో, ఎంత అందవికారంగా ఉన్నదో!”అన్నది ఎర్ర గులాబి.అప్పుడు  పైన్ చెట్టు ఎర్రగులాబీ తో, “ఓ  ఎర్ర గులాబీ ! నువ్వు ఎందుకిలా మాట్లాడుతు న్నావు? అందమంటే ఏమిటో యెవరు చెప్పగలరు ? నీకు కూడా ముళ్ళు ఉన్నాయి కదా !అప్పుడు ఎర్ర గులాబీ పువ్వు పైన్ చెట్టు వైపు కోపంగా చూస్తూ “నీకు చాలా చక్కని అభిరుచి ఉన్నది అని అనుకున్నాను .నీకు అసలు అందమంటే ఏమిటో తెలియదు .నాకున్న ముళ్ళను ఆ కాక్టస్ ముళ్ళతో పోల్చటానికి వీలు లేదు ” అన్నది. ఇదంతా విని “ఎంత గర్వపోతు ఈ ఎర్రగులాబీ”అనుకున్నాయి  ఆ మిగతా చెట్లు.కాక్టస్ చెట్టు నుండి దూరంగా తన వేళ్ళను కదపాలని చాలా ప్రయత్నించింది ఎర్రగులాబీ ,కానీ కదల్చలేకపోయింది! అలా రోజులు గడుస్తున్నాయి .ఎర్ర గులాబీ కాక్టస్ చెట్టు వైపు చూస్తూ దానిని అవమానపరిచే విధంగా “ఈ చెట్టు ఎంతపనికి మా లినది ?ఇలాంటి చెట్టుకు పొరుగున ఉండటం ఎంత విచారకరం!అంటూ ఉండేది.కానీ ,కాక్టస్ ఎంతమాత్రమూ చలించకుండా గులాబీకి సలహా ఇవ్వటానికి ప్రయత్నిస్తూ ” భగవంతుడు ఏ ప్రయోజనమూ లేకుండా  దేనినీ సృష్టించలేదు. “అని చెప్పేది. వసంతఋతువు వెళ్ళిపోయింది .మెల్లగా ఎండలు ఎక్కువయిపోయినాయి.వర్షంలేకుండా ఎండ ఎక్కువగా ఉండటం వలన చెట్ట్లన్నీ నీళ్ళకోసం  దాహంతో అలమటించసాగాయి .ఎర్ర గులాబీ చెట్టు ఎండిపోసాగింది .కొన్ని పిచుకలు కాక్టస్ చెట్టు పై వాలి ,తమ ముక్కులతో ఆ చెట్టుని పొడిచి ఎంతో ఆహ్లాదంగా ,ఆనందంగా ఎగిరి పోవటం ఎర్రగులాబీ చూసింది.ఈ విషయం ఆశ్చర్యంగా అనిపించి ఎర్రగులాబీ పైన్ చెట్టును,” ఈ పక్షులు ముళ్ళచెట్టు పైన ఏమి చేస్తు న్నాయని అడిగింది.కాక్టస్ చెట్టు నుంచి పక్షులు  నీళ్ళు తాగుతున్నాయి అని, పైన్ చెట్టు చెప్పింది .” పక్షులు అలా చెట్టును పొడిచి కన్నాలు చేస్తే చెట్టుకునొప్పిగా ఉండదా?” అని ఎర్ర గులాబి పైన్ చెట్టుని అడిగింది.”నిజమే,కానీ  పక్షులూ దాహంతో అలమటించటం. బాధ పడటం కాక్టస్కి  ఇష్టం ఉండదు. “అని చెప్పింది పైన్ చెట్టు. ఆశ్చర్యంతో  కళ్ళు విప్పార్చి చూస్తూ  ఎర్ర గులాబీ “కాక్టస్ లో నిజంగా నీళ్ళు ఉంటాయా? అని అడిగింది .” ఔను! నీవు కూడా కావాలంటే ఆ నీళ్ళు తాగొచ్చు “కాక్టస్ని నీవు సహాయం అడిగితే ,పిచుక నీకు నీళ్ళు తెచ్చి ఇస్తుంది” అని చెప్పింది.తాను గతం లో కాక్టస్ గురించి అన్న మాటలు తలుచుకుని ,ఎర్రగులాబీ చాలా సిగ్గు పడింది.చివరికి ఎర్రగులాబి, కాక్టస్ని సహాయం అడిగంది.కాక్టస్ ఎంతో దయతో అంగీకరించింది .పక్షులు తమ ముక్కులతో కాక్టస్నుంచి నీళ్ళు గ్రహించి తెచ్చి ఎర్ర గులాబీ చెట్టు వేళ్ళకు నీళ్ళను అందించాయి .ఆవిధంగా ఎర్రగులాబీ పాఠం నేర్చుకుంది.ఆ తరువాత ఎర్ర గులాబీ, ఎప్పుడూ ఆకారాన్ని ,రూపాన్ని బట్టి, ఎవ్వరి గురించి మాట్లాడటం గానీ  ,విమర్శించటం గానీ మానేసింది. నీతి: పైకి కనిపించే రూపాన్ని బట్టి ఎవ్వరి గురించీ అంచనా వేయకూడదు. రూపాలు మన కళ్ళని మోసం చెస్తాయి .వ్యక్తుల పనులవలన మాత్రమే వారిని గురించి తెలుసుకోగలము కానీ వారి రూపాన్ని బట్టి, స్వభావాన్ని గ్రహించలేము! http://saibalsanskaar.wordpress.com https://www.facebook.com/neetikathalu