Archive | June 2017

ఓడ అధికారి శర్మగారు

ఓడ అధికారి శర్మగారు.

విలువ — శాంతి
అంతర్గత విలువ — నమ్మకము, స్పష్టత , కర్తవ్యము.

 

IMG_4290

ఇది ఒక రిటైర్డ్ ఓడ అధికారి కధ. షెట్లాండ్ ఐలాండ్స్ కి కొంత మంది ప్రయాణికుల ని శర్మగారు తీసుకుని వెళ్ళుతున్నారు.
ఓడలో చాలా మంది యువకులు ఉన్నారు.
శర్మగారు ఓడ కదిలే ముందర ప్రార్ధించడం చూసి, అందరూ ఎగతాళి చేశారు.
అకాస్మాత్తుగా ఉగ్రమైన గాలి వీచి,వాన కురిసింది.

అప్పుడు అందరూ శర్మగారి దెగ్గిరకి వచ్చి భగవంతుడిని ప్రార్థించ మని వేడుకున్నారు.
అప్పుడు శర్మగారు బదులుగా “నేను ప్రశాంతముగా ఉన్నప్పుడే భగవంతుడిని ప్రార్ధిస్తాను , ప్రశాంతత లేనప్పుడు ఓడని చూసుకుంటాను” అని అన్నాడు.

నీతి:
సుఖముగా , ప్రశాంతంగా ఉన్నపుడు భగంతుడి దెగ్గిరకి వెళ్లకపోతే, కష్టాల లో ఉన్నపుడు కంగారు పడతాము.
సుఖముగా ఉన్నప్పుడు కూడా భగవంతుడిని తల్చుకోవాలి, అప్పుడే కష్టములలో కూడా అప్రయత్నముగా భగవంతుడి ఆలోచన వస్తుంది.

http://saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu

Advertisements

ఒక కుండ కోరిక

ఒక కుండ కోరిక
విలువ : సత్యం
అంతర్గత విలువ : సరైన నడత

 

IMG_4191

 

ఒక కుమ్మరి కుండలు తయారుచేస్తున్నాడు. ఓర్పుతో, నేర్పుతో మట్టి ముద్దలను కుండల ఆకృతిలో మలిచాడు. వాటిని కాల్చడానికి ఏర్పాట్లు చేశాడు. అప్పటికే కాలుతున్న కొన్ని కుండలని చూసి పచ్చి కుండల్లో ఒకదానికి చాలా భయం వేసింది. ‘అమ్మో! ఒళ్లు కాలిపోవడమే? వద్దు. దయచేసి నన్ను కాల్చొద్దు. నన్నిలా వదిలెయ్‌. సుఖంగా ఉన్న ప్రాణాన్ని దుఃఖాన పెట్టకు. నాకు భయంగా ఉంది’ అని కుమ్మరిని దీనంగా బతిమాలింది. కుమ్మరి కుండతో ఇలా అన్నాడు,”జీవితంలో తొలిదశలో కష్టపడితే తర్వాత జీవితాంతం హాయిగా ఉండొచ్చు.” ఇప్పుడు కష్టమని భావించి సోమరిగా ఇలా ఉండిపోతే నీ జీవితం వృథా అవుతుంది. సమాజానికకి ఉపయోగపడక వ్యర్థమైపోతావు”అంటూ ఎన్నో విధాల నచ్చచెప్పాడు. అతడు ఎంత చెప్పినా వినకుండా కుండ మొండికేసింది. సరే… అంతలా అడుగుతోంది పోనిమ్మని కుమ్మరి ఈ కుండని వదిలేసి మిగిలిన కుండలను ఆవంలో పెట్టాడు. ఆవంలో కాలుతున్న కుండలని చూస్తూ తనకి ఆ అవస్థ తప్పినందుకు, ఆనంద పడుతూ, “నాకా బాధలు లేవు, హాయిగా ఉన్నాను” అనుకుంది ఆ పచ్చి కుండ.

బాగా కాలిన ఎర్రని, నల్లని కుండలన్నీ అమ్ముడుపోయాయి. ఎవరూ కొనేవారు లేక పచ్చి కుండ మాత్రం ఆరుబయట ఆవరణలో అలా ఉండిపోయింది. కుమ్మరి ఒక కుండలో నీళ్లు నింపాడు. కొన్ని కుండీలలో మట్టి నింపి మొక్కలు నాటాడు. తనకా బరువులు లేనందుకు ఆనందించిందా పచ్చి కుండ.

 

ఇలా ఉండగా ఒక రోజు కుండపోతగా వర్షం కురిసింది. కాల్చిన కుండలూ, కుండీలూ దృఢంగా అలాగే ఉంటే ఈ పచ్చికుండ మాత్రం మెల్లిగా కరిగి మట్టిలో కలిసిపోసాగింది. తన ఆకృతిని, ఉనికిని కోల్పోయింది. కుమ్మరి మాటల్లో అంతరార్థం దానికి చివరిక్షణంలో బోధపడింది. కానీ అప్పటికే జీవితం చేజారిపోయింది

నీతి:

‘జీవితంలో తొలిదశలో కష్టపడితే తర్వాత జీవితాంతం హాయిగా ఉండొచ్చు. ఇప్పుడు కష్టమని భావించి సోమరిగా ఇలా ఉండిపోతే నీ జీవితం వృథా అవుతుంది. సమాజానికీ ఉపయోగపడక వ్యర్థమైపోతాము’

మానవ సేవయే మాధవ సేవ!!!

 

విలువ ; ప్రేమ
అంతర్గత విలువ ; దయ, కరుణ

శ్రావణి ఉత్తరాలు ఏమైనా వచ్చేయేమో చూద్దామని పోస్ట్ బాక్స్ దగ్గరకు వెళ్ళింది. అందులో ఒక్కటే కవర్ ఉంది. దాని మీద స్టాంప్ గానీ, ఎక్కడ నుండి పంపారో వివరాలు గాని లేవు. శ్రావణి పేరు, చిరునామా మాత్రం రాసి ఉన్నాయి. శ్రావణి కవర్ లో నుండి ఉత్తరం తీసి చదవడం మొదలుపెట్టింది.

 

IMG_4123

 

ప్రియమైన శ్రావణికి,

నేను శనివారం సాయంత్రం పని మీద వెళ్తున్నాను. దారిలో మీ ఇంటి దగ్గర ఆగి నిన్ను చూడాలి అనుకుంటున్నాను.

ఇట్లు ప్రేమతో,
శ్రీరాముడు.

ఉత్తరం చదివిన శ్రావణికి చేతులు వణకసాగాయి. ఉత్తరం బల్ల మీద పెట్టి” భగవంతుడైన శ్రీరాముడు నన్ను ఎందుకు చూడాలి అనుకుంటున్నారు? నేనేమీ ఆయనకీ ప్రత్యేకమైన వ్యక్తిని కాదే? ఆయన వస్తే ఇవ్వడానికి కూడా నా దగ్గర ఏమీ లేదు. ఎలాగా?” అని ఆలోచించసాగింది. వంట చెయ్యడానికి కూడా ఇంట్లో సరుకులు లేవు, తొందరగా షాపుకి వెళ్ళి ఏమైనాతీసుకురావాలి అనుకుంది.
పర్స్ లో డబ్బులు కోసం చూస్తే 100 రూపాయలు మాత్రం ఉన్నాయి. అవి తీసుకుని షాపుకి వెళ్ళి వంటకి అవసరమైన బియ్యం, కూరలు మరియు ఇతర వస్తువులు కొనుక్కుని ఇంటికి వస్తోంది.

దారిలో ఎవరో తనని పిలిచినట్లుగా అనిపించి వెనక్కి తిరిగి చూసింది. ముసలి దంపతులు నిల్చొని ఉన్నారు. వారిలో భర్త, శ్రావణితో “అమ్మాయీ;నాకు ఉద్యోగం లేదు. నేను, నా భార్య రెండు రోజులుగా ఏమీ తినలేదు. నువ్వు మాకు ఏమైనా సహాయం చెయ్యగలవా?” అని అడిగాడు.

శ్రావణి వాళ్ళిద్దరినీ పరిశీలనగా చూసింది. ఇద్దరూ మాసిపోయిన బట్టలతో, బలహీనంగా ఉన్నారు. “తాతగారూ; నాకు కూడా మీకు సహాయం చెయ్యాలనే ఉంది. కాని నా దగ్గర ఉన్న కొద్ది డబ్బులతో ఈ బియ్యం కూరగాయలు మరియి అరటిపళ్ళు కొన్నాను. ఇవాళ్ళ మా ఇంటికి ముఖ్యమైన అతిధి వస్తున్నారు. వీటితో వారికి వంట చేసి పెట్టాలి. ఇలా చెప్పినందుకు క్షమించండి అంది శ్రావణి.

“పరవాలేదు అమ్మా! మేము అర్థం చేసుకోగలము అని ఆ ముసలి దంపతులు వెళ్ళిపోయారు. వాళ్ళు అలా వెళ్ళిపోవడం చూసిన శ్రావణికి వెంటనే ఒక ఆలోచన వచ్చింది.

“తాతగారూ!అని పిలిచింది. వాళ్ళిద్దరూ వెనక్కి తిరిగి చూశారు. ఆగండి, ఈ బియ్యం,కూరలు, అరటిపళ్ళు మీరే తీసుకోండి. మా ఇంటికి వచ్చే అతిధి కోసం నేను ఇంకొకటి ఏదయినా చేస్తాను అంది.

వాళ్ళు అవి తీసుకుని,”చాలా సంతోషం అమ్మా” అని శ్రావణి చేతులు పట్టుకున్నారు. అలా పట్టుకున్నప్పుడు ఆ ముసలావిడ చేతులు వణకడం శ్రావణి గమనించింది. తను వేసుకున్న కోటు తీసి ఆవిడకి ఇస్తూ, “ఇది మీరు తీసుకోండి. నాకు ఇంటి దగ్గర ఇంకొకటి ఉంది అని చెప్పింది”.

శ్రావణి ఇంటికి తిరిగి వస్తూ ఇప్పుడు శ్రీరాముడికి ఏమి చేసి పెట్టాలి? అని ఆలోచించసాగింది. ఇంటికి వెళ్లేసరికి గుమ్మం ముందు ఇంకో కవర్ ఉండడం చూసింది. ఇదేంటి మళ్ళీ ఎవరు ఉత్తరం రాసేరు అనుకుని తీసి చదవసాగింది.

“ప్రియమైన శ్రావణికి

“నిన్ను కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. సమయానికి మా ఆకలి తీర్చినందుకు మరియు చలి నుండి కాపాడుకోవడానికి కోటు ఇచ్చినందుకు కృతజ్ఞతలు.”

ఇట్లు ప్రేమతో,
శ్రీరాముడు.”

ఆ ఉత్తరం చదిన శ్రావణికి ఆశ్చర్యంతో మాటలు రావట్లేదు. కళ్ళ నుండి ఆనంద భాష్పాలు కారసాగాయి.

నీతి:

మానవ సేవయే మాధవ సేవ అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అందరిలోనూ భగవంతుడు ఉంటాడని గుర్తు పెట్టుకుని మనకు అవకాశం దొరికినప్పుడల్లా ఇతరులకు సహాయం చేస్తూ ఉండాలి.

 

 

http://saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu

విశ్వాసమే బలము !!

విలువ: విశ్వాసం

అంతర్గత విలువ: నమ్మకం

IMG_4074

కొత్తగా పెళ్ళయిన దంపతులు ఒక పడవలో ప్రయాణం చేస్తున్నారు. ఆ నదిలో ఉన్నట్టుండి పెద్ద తుఫాను మొదలయింది. భర్త ధైర్యంగా కూర్చుని చూస్తున్నాడు. భార్య మాత్రం చాలా భయపడసాగింది. ఒక వైపు నదిలో అలలు, మరోవైపు తుఫాను వల్ల వాళ్ళు ప్రయాణిస్తున్న చిన్న పడవ అటూ ఇటూ ఊగిపోసాగింది. ఏ క్షణంలో పడవ మునిగిపోతుందో అని భార్య భయపడుతోంది. భర్త మాత్రం అసలు ఏమీ జరగనట్లుగా, మౌనంగా, ధైర్యంగా కూర్చున్నాడు.

భార్య వణుకుతున్న గొంతుతో , భర్త తో ఈ విధంగా అంది” మీకు భయం వెయ్యట్లేదా? అంత ధైర్యం గా ఎలా ఉండగలుగుతున్నారు? నాకయితే ఇవాళే మన జీవితంలో ఆఖరి రోజు అనిపిస్తోంది. ఈ తుఫానులో మనం క్షేమంగా ఒడ్డుకి చేరుకోవడం కష్టం. ఏదయినా అద్భుతం జరిగితేనే మనం ప్రాణాలతో బయటపడగలం. లేదంటే మనకి చావు తప్పదు. మీకు పిచ్చి గాని పట్టిందా? అసలు ఇంత ధైర్యంగా ఎలా ఉన్నారు.”

భర్త నవ్వుతూ తన దగ్గర ఉన్న కత్తిని తీసాడు. అతని ప్రవర్తనకి ఆశ్చర్యపోయిన భార్య అయోమయంతో అతని కేసి చూస్తోంది. భర్త కత్తిని భార్య మెడకి దగ్గరగా పెట్టి ” ఇప్పుడు నీకు భయం వేస్తోందా?” అని అడిగాడు. భార్య నవ్వుతూ నాకెందుకు భయం? మీ చేతిలో కత్తి ఉంటే నేను భయపడాలా? మీరు నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి నన్ను ఏమీ చెయ్యలేరు అంది.

భర్త కత్తిని వెనక్కి తీసుకుని , “ఇదే నా సమాధానం కూడా. భగవంతుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈ తుఫాను సృష్టించింది ఆయనే కాబట్టి, ఆయనే మనల్ని రక్షిస్తాడని నా నమ్మకం” అన్నాడు.

అందువల్లనే మన పెద్దలు ఏది జరిగినా మన మంచికే అని చెప్తూ ఉంటారు. మన జీవితాల్లో ఏమి జరిగినా భగవంతుని నిర్ణయం ప్రకారం జరుగుతాయి కాబట్టి భగవంతుని పట్ల విశ్వాసం కలిగిఉండాలి.

నీతి

మనం భగవంతుని పట్ల విశ్వాసం పెంచుకోవాలి. ఆ విశ్వాసమే మన బలంగా మారి మనల్ని ముందుకి నడిపిస్తుంది.

http://saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu