Archive | July 2017

ద్రౌపది భక్తి — నామస్మరణ యొక్క విశిష్ఠత

ద్రౌపది భక్తి — నామస్మరణ యొక్క విశిష్ఠత

విలువ — ప్రేమ
అంతర్గత విలువ — భక్తి

 

IMG_4699

పాండవుల భార్య ద్రౌపదిని ఆపద నుంచి , అవమానాల నుంచి, కృష్ణ భగవానుడు చాలా సార్లు రక్షించారు.
శ్రీ కృష్ణుడి భార్యలు, రుక్మిణి , సత్యభామ, ఎందుకు ద్రౌపది మీద కృష్ణుడికి అంత కృప అని అనుకునేవారు.

వాళ్ళ (రుక్మిణి , సత్యభామ) అనుమానము తీర్చడానికి, శ్రీ కృష్ణుడు వాళ్ళని ద్రౌపది ఇంటికి తీసుకుని వెళ్లారు.

వాళ్ళు చేరేసరికి ద్రౌపది స్నానము అయ్యి, తన జుట్టు దువ్వు కుంటోంది .

శ్రీ కృష్ణుడు, రుక్మిణిని , సత్యభామని, ద్రౌపది జుట్టుని దువ్వ మన్నారు. వాళ్ళకి ఇష్టము లేక పోయినా, శ్రీ కృష్ణుడి మాట కాదు అనలేక, సరే అన్నారు.

వారికి ద్రౌపది యొక్క జుట్టు దువ్వు తుండగా, ‘కృష్ణ! , కృష్ణ!’ అని నామం వినిపించింది.

ద్రౌపది శరీరములో ప్రతి అంగము ఆ భగవంతుని నామము పలుకుతోంది అని గ్రహించారు!

ద్రౌపది తన భక్తి వల్ల సులభముగా భాగవన్తుడి కృప పొందినది అని రుక్మిణి , సత్యభామలు తెలుసుకున్నారు !

నీతి:
కలియుగంలో భగవంతుడి నామము, సాధన చెయ్యడం చాలా అవసరం.

నిరంతరము భగవంతుడి నామము జపించడం వల్ల, భగవద్ కృపకి ,దయకి
పాత్రులము కాగలము.

నామ జపము, భగవంతునికి చేరువ కాగలగటానికి సులభమైన మార్గము.

http://saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu

Advertisements

నిజాయితీ

విలువ:సత్యము, సత్ప్రవర్తన

అంతర్గత విలువ:నిజాయితీ

 

IMG_4511
ఒక ఊరిలో ఒక దొంగ ఉండేవాడు. ఒకరోజు అతడు దొంగతనమునకు బయలుదేరి దొంగిలించడాని కి విలువైన వస్తువులు ఏమీ కనపడక పోవడం తో అన్ని చోట్లా వెతుకుతూ ఒక గుడి వద్దకు చేరుకున్నాడు.అక్కడ ఒక పూజారి మతము మరియు ఆధ్యాత్మిక సంబంధ మైన విషయాల మీద ఉపన్యాసం ఇస్తున్నాడు. ఆయన సత్యము పలకడం,నిజాయతీ అనే విషయములను గురించి మాటలాడుతున్నాడు.ఆ ఉపన్యాసాన్ని అనేకమంది ధనవంతులు, గొప్పవారు, సామాన్యులు అన్నిరకాల జనం ఆసక్తి గా వింటున్నారు. అక్కడ ఉన్న ధనవంతుల వద్ద ఉన్న విలువైన వస్తువులు దొ౦గిలించాలని దొంగ భావించాడు. కాని పూజారి సమక్షంలో దొంగతనం చేయడం తనకు అంత క్షేమం కాదని తాత్కాలికంగా ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు.పూజారి ఉపన్యాసం మరీ అంత చెడ్డ గా లేదు అని దొంగ అనుకున్నాడు. చివరి దాకా ఉపన్యాసం విన్నాడు. ఉపన్యాసం అయిపోయాక అందరూ వెళ్లి పోయారు దొంగ ఒక్కడే అక్కడ ఉండి పోయాడు తన లాంటిదొంగకు నిజ౦ చెబుతూ జీవించడం ఎలా సాధ్యం అని అనుకున్నాడు.
తాను అక్కడ ఉండడం పూజారికి అనుమానం కలిగిస్తుందని దొంగ భావించాడు.పూజారికి భయం కలగ కుండా ఉండాలనే ఉద్దేశ్యంతో దొంగ పూజారి వద్దకు వెళ్లి నేను ఇక్కడ ఏమీ అనుచితమైన పని చేయాలని భావించడం లేదు మీరేమీ సందేహ పడకండి. మీరు నిజాయితీ గురించి చాలా  గంభీరం గా ఉపన్యసించారు మీ ఉపన్యాసం నాకు చాలా నచ్చింది కాని నా మనస్సు మీ మాటలను జీర్ణించు కో లేక పోతోంది నా లాంటి దొంగ కు అబద్ధం కూడా ఆడ కుండా ఉండడం ఎలా సాధ్య మవుతుంది అని చెప్పి పూజారిని దొంగ చాలా ప్రశ్నలు వేశాడు చాలా సేపు వాదించాడు. పూజారి దొంగ ప్రశ్నలన్నిటికకీ  చాలా ఓపిక గా సమాధానాలు చెప్పాడు. అబద్ధమాడకుండా నిజాయితీ కి కట్టుబడి ఉండి నీవు నీ వృత్తి ని కొనసాగించ వచ్చ్చునని పూజారి దొంగకు సలహా ఇచ్చాడు. ఆ క్షణం నుంచి అబద్ధమాడ కూడదని నిజాయితీ కి కట్టు బడి ఉండాలని దొంగ నిర్ణయించు కున్నాడు.
ఒకరోజు రాత్రి దొంగ అలవాటు గా దొంగ తనానికి బయలు దేరాడు అదే సమయం లో ప్రజల మంచి చెడ్డలను స్వయంగా తెలుసుకోవాలని ఆదేశాన్ని పరిపాలించే రాజుగారు మారు వేషంలో బయలు దేరాడు. రాజు దొంగ ఇద్దరూ ఒక చోట కలుసుకున్నారు.రాజు దొంగ ను చూసి,”నువ్వెవరు,అని అడిగాడు.”దొంగ నిజాయితీ గా నేను దొంగను అని చెప్పాడు రాజు నేను కూడా దొంగ నే అన్నాడు దొంగ చాలా  ఆశ్చర్య పోయాడు.ఇద్దరూ మంచి మిత్రులయి పోయారు ఒకళ్ళ నొకళ్ళు ఆప్యాయతతో కౌగిలిం చుకున్నారు రాజు దొంగ తో కొన్ని విలువైన వస్తువులు ఉన్న ప్రదేశం నాకు తెలుసు.అక్కడకు వెళ్లి వాటిని దొంగిలిద్దామని చెప్పాడు. దొంగ అంగీకరించాడు.రాజు దొంగను రాజ భవనానికి తీసుకు వెళ్ళాడు,ధనాగారం దగ్గరకు తీసుకు వెళ్లి ఖజానా పగుల గొట్టమన్న్నాడు దొంగ ఖజానా పగుల గొట్టాడు దాంట్లో అయిదు విలువైన వజ్రాలు ఉన్నాయి.ఈ వజ్రాలలో మనం నాలుగు మాత్రమే తీసుకుని ఇద్దరం చెరో రెండు పంచుకుందాము. మిగిలిన వజ్రాన్ని ముక్కలు చేస్తే దానికి విలువ లేకుండా పోతుంది అనిదొంగ రాజుతో చెప్పాడు దానికి రాజు అంగీకరించాడు ఆ ప్రకార్రం ఇద్దరూ రెండేసి వజ్రాలు తీసుకుని ఎవరి దారిన వాళ్ళు వెళ్లి పోయారు.
మరుసటి రోజున రాజు ఉద్యోగులు వచ్చి చూసే సరికి ఖజానా పగుల గొట్ట బడి ఉంది.విషయం రాజు గారికి తెలిసింది. దొంగను వెతికి  బంధించి తీసుకు రమ్మని రాజు భటులను  ఆజ్ఞాపించాడు.భటులు అంతటా వెతికి  దొంగను బంధించి తెచ్చి రాజు ముందు నిలబెట్టారు. రాజు దొంగను కాలి గోటి నుంచి తల వెంట్రుక  దాకా పరిశీలించి నువ్వేనా దొంగ తనం చేసింది అని అడిగాడు. నేను నా మిత్రుడు కలిసి నాలుగు వజ్రాలు దొంగిలించి ఇద్దరూ చెరొక రెండు వజ్రాలు పంచుకున్నాము అని దొంగ నిజాయితీ గా సమాధానము చేప్పాడు.రాజు ధనాగారం అధికారి ని పిలిచి ఎన్ని వజ్రాలు పోయాయి అని అడిగారు. మొత్తం అయిదు వజ్రాలు పోయాయి అని చెప్పాడు. ఏమి జరిగిందో రాజు గారికి అర్ధం అయింది. రాజు వెంటనే ధనాగారం అధికారిని ఆ ఉద్యోగం నుంచి తొలగి౦చి ఆ స్థానం లో దొంగను నియమించాడు.ఈ విధంగా సత్యం పలకడం అనే విషయానికి కట్టుబడి ఉండి దానికి తగిన బహుమానాన్ని పొంద గలిగాడు ఆ దొంగ.చెడ్డ అలవాట్లు విడిచి పెట్టి మంచి అలవాట్లను అనుసరించ గలిగితే ప్రతి వారు గొప్పవారు కాగలుగుతారు.
నీతి:మంచి అలవాట్లు జీవితం లో మహోన్నత స్థానాననికి చేరడానికి సోపానాలు!

http://saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu

అచంచల విశ్వాసం

అచంచల విశ్వాసం

విలువ :విశ్వాసం

అంతర్గత విలువ: భక్తి

 

IMG_4438

శ్రీకృష్ణుడు అర్జునుడు కేవలం ఆత్మీయులైన బంధువులు బావ బావ మరదులు మాత్రమే కాదు. అర్జునుని దృష్టిలో శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవంతుడు అర్జునునికి శ్రీకృష్ణుని మీద గల భక్తి విశ్వాసములు అచంచలమైనవి. ఈ విషయాన్ని నిరూపించే ఒక సన్నివేశం ఈ చిన్న కథ

ఒక రోజున శ్రీకృష్ణుడు అర్జునుడు తీరిక గా కాలక్షేపం కోసం కాలినడకన షికారుకు బయలు దేరారు. మాటల సందర్భం లో అర్జునుడు శ్రీకృష్ణుని తో బావా నా కళ్ళతో ప్రత్యక్షం గా చూసిన విషయాల కంటే నీ మాటల మీదే నాకు ఎక్కువ విశ్వాసం అన్నాడు. ఆ మాటలు విని శ్రీకృష్ణుడు చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. వాళ్ళు కొంచెం దూరం వెళ్లేసరికి ఆకాశం లో ఎగురుతున్న ఒక పక్షి కనిపించింది. శ్రీకృష్ణుడు దాన్ని అర్జునుని కి చూబించి బావా ఆ పక్షి ని చూడు అది పావురమా అని అడిగాడు బావా అది పావురం కావచ్చు అర్జునుడు సమాధానం చెప్పాడు. శ్రీ కృష్ణుడు ఆ మాటలు విని అర్జునుని చూసి ఉండు, అని మరొక సారి ఆ పక్షి వైపు చూసి నేను అది గ్రద్ద ఏమో అనుకుంటున్నాను అన్నాడు. అవును అది ఖ చ్చితం గా గ్రద్దే అన్నాడు అర్జునుడు. మళ్ళీ శ్రీకృష్ణుడు అర్జునుని తో అది గ్రద్ద లా కనపడడం లేదు అది ఖ చ్చితం గా కాకి అన్నాడు. అవును కృష్ణా అది ఖచ్చితంగా కాకే అన్నాడు ఈ సమాధాన౦ విని శ్రీకృష్ణుడు

అర్జునుని చూసి నవ్వుతూ మందలింపు ధోరణి లో మిత్ర్రమా నీకు కళ్ళు లేవా నీ కళ్ళతో నువ్వుచూస్తున్నట్లు లేదు నేనుఏమంటే దానికి తల ఊపుతున్నావు అన్నాడు

ఆ మాటలకు మళ్ళీ అర్జునుడు శ్రీ కృష్ణుని తో బావా నేను ప్రత్యక్షం గా నా కళ్ళ తో చూసిన విషయాల కంటే నీ మాటల నే ఎక్కువగా విశ్వసిస్తాను నీవు ఏదైనా మాట అంటే దాన్ని ఆవిధం గా చేయ గల శక్తీ నీకు ఉంది. అది కాకి కావచ్చు, గ్రద్ద కావచ్చు, పావురం కావచ్చు నీవు ఏమంటే అదే. అది అదే అవుతుంది అని సమాధానం చెప్పాడు!

నీతి :భగవంతుని మీద భక్తునికి ఎటువంటి అచంచలమైన విశ్వాసం ఉండాలో చెప్పడానికి ఉదాహరణ గా ఈ కధ ను చెబుతూ ఉంటారు ప్రతి వాళ్ళు ఇటువంటి విశ్వాసాన్ని భగవంతుని మీద ఉంచ గలిగితే మంచి చెడ్డల మధ్య సం ఘర్షణ ను తట్టుకుని విజయం సాధించ వచ్చు

 

http://saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu

నలుగురు భార్యల కధ

నలుగురు భార్యల కధ.
విలువ -సత్యము
అంతర్గత విలువ — విచక్షణ జ్ఞానము , సాధన

మూర్తిగారికి నలుగురు భార్యలు.

IMG_4413
అందరికంటే నాలుగో భార్య అంటే మూర్తిగారికి చాలా ఇష్టం. ఆమెకి మంచి బట్టలు, నగలు కొని పెట్టేవారు.

మూడో భార్య అంటే కూడా మూర్తిగారికి చాలా నేఇష్టం. ఆమెకి కూడా అన్ని ఇచ్చే వారు. మూడో భార్య అన్ని విషయాలు చూసుకునేది.

రెండో భార్య అంటే కూడా మూర్తిగారికి ఇష్టం. చాలా నమ్మకముగా, ధైర్యంగా, మూర్తిగారు తనకి ఉన్న కష్టాలు అన్నీ రెండో భార్యకి చెప్పుకునేవారు. తన జీవితం గురించి రెండో భార్య తోనే మాట్లాడేవారు.

మొదటి భార్య ఎప్పుడు అభిమానంగా, అనుకువగా ఉండేది. కాని మూర్తిగారు ఎక్కువగా ఆమెను పట్టిచ్చుకునే వారు కాదు.

ఒక రోజు మూర్తిగారికి చాలా జబ్బు చేసింది. నలుగురు భార్యలు చుట్టూ ఉన్నారు. ఆ నలుగురి ఆయన “నేను ఒక్కడిని మరణించలేను, మీలో యావరైనా నాకు తోడు వస్తారా “?అని అడిగారు.

నాలుగో భార్యతో అన్నారు, “నిన్ను ఎప్పుడు నేను అందరి కంటే బాగా చూసుకున్నాను కదా నాకు తోడు వస్తావా “? అని అడిగితే ఆమె
నేను రాను అని సమాధానము చెప్పింది.

మూడో భార్యని, “నేను మరణించ బోతున్నాను, నాకు తోడు వస్తావా “? అని అడిగితే ఆమె నేను రాను, మీరుమరణించ గానే, నేను ఎవరినైనా పెళ్ళి చూసుకుంటాను,”అని వెళ్లి పోయింది.

రెండో భార్యని కూడా పిలిచి అదే ప్రశ్నని అడిగారు. మీరు మరణిస్తున్నారు అని నాకు చాలా బాధగా ఉంది, కానీ నేను స్మశానము దాకానే రాగలను, అని అంది.

ఇంతలోకి వెనక నుంచి “నేను వస్తాను” అనే మాట మొదటి భార్య అనడం వినిపించింది. అప్పుడు మూర్తిగారు  “నేను నిన్ను ఎప్పుడు బాగా చూసుకోలేదు, నిన్ను చాలా అశ్రద్ధ  చేశాను ” అని బాధ పడుతూ మరణించారు.

ఈ కధలో నాలుగో భార్య అంటే, మన దేహ భ్రాంతి.
మూడో భార్య అంటే మన వద్ద ఉన్న ధనము.
రెండో భార్య అంటే మన స్నేహితులు, బంధువులు, వారు స్మశానము దాకానే రాగలరు.
మొదటి భార్య అంటే మన  మన ఆత్మ. అది ఎప్పుడూ మనతోనే  ఉంతుంది. కానీ మనము సరిగ్గా దానిని గుర్తించము. అది ఎంత విలువైందో, ముఖ్యమైనదో, మనము ఆఖరి క్షణం లోనే తెలుసు కుంటాము.

 

IMG_4412

నీతి:
మనము తెలుసు కోవలసినది ఏమిటి అంటే, జీవుడు దేహము కాదు. ఆత్మ . ఏ ఆత్మకి జనన మరణములు ఉండవు.
అధ్యాత్మి కంగా ఎదగడం వల్ల, మనము జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులని  సమర్ధవంతంగా ఎదురుకో గలుగుతాము.

http://saibalsanskaar.wordpress.com

http://www.facebook.com/neetikathalu

 

 

 

తల్లిదండ్రులని గౌరవించండి !

పెద్దలను అర్ధం చేసుకోకుండా‌ అపార్ధం చేసుకోకండి!

IMG_4395

విలువ :ధర్మం

ఉపవిలువ : సత్ప్రవర్తన

*చిన్న‌ సంఘటన.*

పూర్వము *భారవి అనే కవి వుండేవాడు.* ఆయన చిన్నతనం లోనే కవిత్వం చెప్పేవాడు. కావ్యాలు వ్రాసేవాడు. ఊర్లో వాళ్ళంతా చాలా మెచ్చుకునేవారు.

భారవి తండ్రితో నీకొడుకు చాలా బాగా వ్రాస్తాడయ్యా అనేవారు.

ఆయన మాత్రం వాడింకా చిన్నవాడు యింకా నేర్చు కోవలిసింది చాలా వుంది. ఏదో వ్రాస్తాడులే అనేవాడు.

*భారవికి తండ్రి తనను మెచ్చుకోవడం లేదని చాలా అసంతృప్తి.*

తల్లి దగ్గర నాన్నగారు నన్ను తీసిపారేసినట్టు మాట్లాడుతారు.వూర్లో వారంతా నన్ను మెచ్చుకుంటూ వుంటే తనేమో ఏమున్నది యింకా వాడు చిన్నవాడు అన్నట్టు మాట్లాడుతారు.అని చాలా సార్లు చెప్పుకున్నాడు.

*ఎన్నాళ్ళయినా తండ్రి ధోరణి మారక పోయే సరికి భారవికి తండ్రిమీద కసి పుట్టింది, ఆయనను చంపాలని నిశ్చయించుకున్నాడు.*

ఒకరోజు రాత్రి ఆయన వంటింట్లో భోజనం చేస్తున్నాడు భార్య వడ్డిస్తూ వుంది.

*భారవి, ఆయన పెరట్లోకి చెయ్యి కడుక్కునేందుకు వస్తే చంపెయ్యాలని పెద్ద బండరాయి పట్టుకొని పెరట్లో ఒక పక్క కాచుకొని కూర్చున్నాడు.*

అప్పుడు భారవి తల్లి భర్తతో మీరెందుకు వాడిని అస్తమాను చిన్నబుచ్చినట్లు మాట్లాడుతారు?వాడు చాలా బాధ పడుతున్నాడు.

*వూరు ఊరంతా వాడిని మెచ్చుకుంటూ వుంటే మీరు మాత్రం వాడికేమీ తెలీదని అంటారట!*

అప్పుడు *తండ్రి నవ్వి…. పిచ్చిదానా! నాకు మాత్రం వాడిని చూసి గర్వంగా లేదనుకున్నావా?తండ్రి పొగిడితే బిడ్డకు ఆయుఃక్షీణం అంటారు. అంతే కాకుండా పొగడ్త మనిషిని పాడు చేస్తుంది, వాడి అభివృద్ధికి ఆటంకమవుతుంది. ఇంకా యెంతో పైకి రావలిసినవాడికి గర్వం పెరిగి తనంతవాడు లేడని విర్రవీగుతాడు, దానితో వాడి అభివృద్ధి ఆగిపోదా? అన్నాడు.*

అదివిని భారవికి బుర్ర తిరిగి పోయింది.

*పశ్చాత్తాపంతో రగిలి పోయాడు. వెంటనే బండ అక్కడ పారవేసి లోపలికి వెళ్లి తండ్రి పాదాలమీద పడి భోరున ఏడ్చాడు.*

తాను తండ్రిని చంపాలనుకున్న విషయం చెప్పి నాకేదయినా శిక్ష వేయమని బ్రతిమాలుకున్నాడు.

*పశ్చాత్తాపం తో నీపాపం పోయింది! శిక్ష ఎందుకు? అని తండ్రి చెప్తున్నా వినకుండా తనకు శిక్ష వేయమని పట్టు బట్టాడు.*

తండ్రి సరే అలాగయితే మీ అత్తవారింట్లో ఒక సంవత్సరం ఎవరికీ, చివరికి నీ భార్యకు కూడా ఎందుకు, ఏమిటి, ఏ కారణాలు చెప్పకుండా అక్కడ‌వుండి రా! అన్నాడు.

*ఇంత చిన్న శిక్షనా? అన్నాడు భారవి.*

తండ్రి నవ్వి అది చాల్లే వెళ్ళుఅన్నాడు.

*భారవికి చిన్నతనంలోనే పెళ్లయింది. అప్పటికి యింకా భారవి భార్య కాపురానికి రాలేదు.*

సరేనని భారవి అత్తగారి వూరికి వెళ్ళాడు.‌ వాళ్ళు అల్లుడుగారు వచ్చారని చాలా మర్యాద చేశారు.

*రోజుకో పిండివంట చేసి ఆదరించారు.నెల రోజులు గడుస్తున్నా అల్లుడు వెళ్ళటం లేదేమని వాళ్ళు విసుక్కున్నారు.*

చిన్న చిన్న పనులు చెయ్యమని చెప్పడం ప్రారంభించారు. మర్యాదలు తగ్గాయి. బావ మరుదులు పొలం పనులు కూడా పురమాయించారు.

*అందరూ విసుక్కుంటూ మాట్లాడేవారు..*

దేనికీ బదులు చెప్పకుండా విసుక్కోకుండా అన్ని పనులు చేసేవాడు.

*అతని భార్యను కూడా పొలం పనులకు పంపేవారు.భారవి భార్యకు చాలా బాధగా వుండేది. భర్తకు ఆవిడ మీరు మీ ఊరు వెళ్లిపోండని యెంతో చెప్పి చూసింది.*

భారవి సమాధానం చెప్పకుండా మౌనం వహించే వాడు.

*ఇలా సంవత్సరం గడిచింది. అప్పుడు భారవి యింక నేను మావూరికి పోయివస్తానని బయల్దేరాడు.*

ఇంత హఠాత్తుగా ఎందుకు వెళ్లాలని అంటున్నాడో వాళ్లకు అర్థం కాలేదు.

*భార్యకు, అత్తామామలకూ విషయం వివరించి నాశిక్ష పూర్తి అయింది అందుకని వెళుతున్నాను అని చెప్పాడు.*

ఇది విని వాళ్ళు తమ ప్రవర్తనకు సిగ్గుపడ్డారు.

*భారవి తనతండ్రి వేసిన శిక్ష తనలో ఎంతో ఓర్పును, నేర్పును, సహనాన్ని, అవగాహనను పెంచాయని గ్రహించాడు.*

నీతి :తండ్రిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి! మీ అభివృద్ధిని కోరుకునే వారిలో ఆయనే ప్రథముడు.చిన్నప్పుడు తల్లి కోప్పడిందని, తండ్రి దండించాడని వారి మీద కోపం పెంచుకోకండి!అదంతా మీరు బాగుపడాలనీ, వృద్ధి లోకి రావాలనీ చేసి వుంటారని గుర్తు పెట్టుకోండి!

*తల్లిదండ్రులను ద్వేషించకండి! అంతకంటే పాపం ఇంకోటి వుండదు.*