Tag Archive | moral and human value stories in telugu

నిష్కల్మష మయిన స్నేహం, విలువ –ప్రేమ,అంతర్గత విలువ –ప్రతి ఫలాపేక్ష లేని స్నేహం

నేను న్యూస్ పేపర్ చదువుతున్నాను. నా భార్య పెద్ద గా కేక పెట్టి ఎంత సేపు ఆ న్యూస్ పేపర్ చదువుతారు. మన పాప అన్నం తినడానికి పేచీ పెడుతోంది. దానికి నచ్చ జెప్పి అన్నం తినిపిస్తారా అని అడిగింది. నేను న్యూస్ పేపర్ ప్రక్కన పెట్టి వచ్చి చూసే సరికి పాప కళ్ళనిండా నీళ్ళు. దాని ముందు అన్నం కంచం. మా పాప పేరు సింధు అప్పుడే ఎనిమిదవ సంవత్సరం వచ్చింది. ఆ వయసు వాళ్ళకు ఉండే తెలివి తేటల కంటే పాపకు కొంచెం తెలివి తేటలు ఎక్కువే. నేను అన్నం కంచం చేతిలోకి తీసుకుని సింధూ మీ నాన్న కోసం రెండు ముద్దలు అన్నం ఎందుకు తినవు అని ముద్దుగా అడిగాను. నువ్వు తినకపోతే మీ అమ్మ గట్టిగా కోప్పడుతుంది అన్నాను. నాకు ఇష్టం లేకపోయినా ఒక్క ముద్ద కాదు మొత్తం అన్నం అంతా తింటాను. డాడ్ నేను ఏది అడిగితే అది ఇస్తావా.అని అడిగింది. అలాగే అన్నాను. అమ్మ కూడా నేను అడిగినదానికి ఒప్పుకోవాలి అంది. నా భార్య, సింధు బుగ్గ మీద ఒక చిన్న దెబ్బ వేసి అలాగే అంది. సింధూ నువ్వు కంప్యూటర్ లాంటి ఖరీదైన వస్తువులు కొనమని మాత్రం అడగవద్దు. అంత ఖరీదైన వస్తువులు కొనడానికి మన దగ్గర కావలసినంత డబ్బు లేదు అన్నాను. నేను ఖరీదైన వస్తువులు కొనమని అడగను అని మొత్తం మీద అన్నం అంతా తినేసింది.

తరువాత సింధు నెమ్మదిగా నావద్దకు వచ్చి డాడ్ ఆదివారం నేను నాజుట్టు పూర్తిగా కత్తిరించుకుంటాను. అని అడిగింది. నా భార్య ఆమాట విని కోపంతో ఆడ పిల్ల అలా చేస్తే ఎంత అసహ్యం గా ఉంటుందో నీకేమైనా తెలుసా అని పెద్ద కేక పెట్టింది. మన ఇళ్ళలో ఎవరూ అలా చేయరు. ఇది టి.వి చూసి పాడయిపోతోంది. మన సంస్కృతి ఈ టి.వి ల మూలం గా నాశనమయిపోతోంది అని మా అమ్మ విసుక్కుంది. సింధూ ఇంకేమైనా కావాలంటే ఇస్తాను బోడిగుండుతో నిన్ను చూడలేను అని ముద్దుగా నచ్చ జెప్పే ప్రయత్నం చేశాను. అది వినలేదు. మొత్తం మీద దాని పట్టుదల వల్ల దాని జుట్టు మొత్తం కత్తిరింపించి గుండు చేయించాను.

imagesVRDN2Q3Eఒకరోజు ఉదయం సింధు ని స్కూల్ దగ్గర విడిచి రావడానికి వెళ్లాను. సింధు తన తరగతి వైపు నడచి వెడుతోంది. అప్పుడే ఇంకో బాబు కారు దిగాడు. సింధూజా నేను కూడా వస్తున్నాను ఆగు అని కేక వేశాడు. ఆ పిల్లవాడి నెత్తిమీద ఒక్క వెంట్రుక కూడా లేదు. నాకు ఆశ్చర్యం వేసింది. మా అమ్మాయి తన తల మీద జుట్టు కత్తిరించు కోవడానికి ఆ బాబే కారణం అని అర్ధమైంది. ఆ బాబు వెనకాల ఒక స్త్రీ కూడా దిగింది తనను తాను పరిచయం చేసుకో కుండానే ఆమె నాదగ్గరకువచ్చి ఇలా చెప్పింది. ఆ పిల్లవాడు మా అబ్బాయి హరీష్.

లుకేమియా వ్యాధితో బాధ పడుతున్నాడు. గడచిన నెల అంతా మా అబ్బాయి స్కూల్ కు రాలేదు. వాడికి కీమోతెరఫీ చేయిస్తే వాడి జుట్టు పూర్తిగా రాలిపోయింది. తోటి పిల్లలు ఏడిపిస్తారని స్కూల్ కు రావడం లేదు. పోయిన వారం సింధుజ మా ఇంటికి వచ్చింది. మా పిల్లవాడిని మిగిలిన పిల్లలు ఏడిపించకుండా చూస్తానని చెప్పింది. కాని మా బాబు కోసం తన అందమైన జుట్టును త్యాగం చేస్తుందని నేను ఊహించలేదు. అలాంటి కుమార్తెను కన్న మీరు మీ భార్య చాల గొప్పవాళ్ళు. ఈ మాటలు విని నేను ఒక్క క్షణం కదలకుండా నిలబడి పోయాను. నీ తోటి వాళ్ళ విషయం లో నీ ప్రేమ ఎంత నిష్కల్మషమైనది. అని అనుకుని ఆశ్చర్య పోయాను.

నీతి: ఈ ప్రపంచంలో సంతోషంగా ఉండే వారెవరంటే తమ ఇష్టం వచ్చినట్లు ఉండాలనుకునే వారు కాదు తాము ఇష్టపడే వాళ్ళ ఇష్టాలకు అనుగుణంగా తమ ఇష్టాలను మార్చుకునే వారు.

https://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

 

Advertisements

బంగారు తలుపులు, విలువ: శాంతి, అంతర్గత విలువ: తృప్తి

ఒక చిన్నపాప తన తల్లిదండ్రులతో కలిసి ఒక కొండ ప్రాంతంలో నివసించేది. రోజూ తోటలో ఆడుకునేటప్పుడు లోయకి అవతలివైపు కొండ మీద ఉన్న ఇంటిని గమనించేది.ఆ ఇంటికి ఉన్న బంగారు కిటికీ తలుపులు చూసి తను కూడా అలాంటి ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుందో అని అనుకునేది.

girl valleyతన ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉన్నా కూడా ఎప్పటికైనా అలాంటి బంగారు కిటికీ తలుపులు ఉన్న ఇంట్లో ఉండాలని కలలుకంటూ ఉండేది.

ఆ పాప పెద్దయిన తరువాత ఒకరోజు స్కూటర్ మీద బైటికి వెళ్ళి వస్తానని తల్లిని అడిగింది.ముందు తల్లి ఒప్పుకోలేదు కాని పాప మరీ మరీ అడగడంతో దూరంగా వెళ్ళద్దని, ఇంటికి దగ్గరలోనే తిరిగి వచ్చెయ్యమని చెప్పి పంపించింది. పాప చాలా సంతోషంగా బయలుదేరింది.నెమ్మదిగా లోయకి అవతలివైపు ఉన్న ఇంటికి చేరుకుంది.

స్కూటర్ ఒక పక్కగా పెట్టి ఆ ఇంటిని దగ్గరగా చూద్దామని వెళ్ళింది. అక్కడ బంగారు కిటికీ తలుపులు లేవు, పైగా అవి బాగా మట్టి పట్టి మామూలు తలుపుల కన్నా హీనంగా ఉన్నాయి.ఆ పాప నిరాశతో విచారంగా స్కూటర్ దగ్గరకు వెళ్ళింది. అక్కడనుండి వాళ్ళ ఇల్లు కనిపిస్తోంది, అది చూసిన పాప ఆశ్చర్యపోయింది, ఎందుకంటే వాళ్ళ ఇంటి కిటికీ తలుపులు బంగారురంగులో మెరుస్తున్నాయి. సూర్య కిరణాలు పడడంవల్ల తలుపులు అలా బంగారురంగులో మెరుస్తున్నాయి అని గ్రహించిది.

 

girl valley 1తన తల్లితండ్రులు అన్ని సౌకర్యాలు అందిస్తూ, ఎంతో ప్రేమగా చుసుకుంటుంటే ఇన్నాళ్ళూ తెలుసుకోలేకపోయినందుకు బాధపడింది. బంగారు తలుపులు ఉన్న ఇంట్లో ఉండాలి ఆశపడింది,కాని ప్రేమ, ఆదరణలతో నిండి ఉన్న తన ఇల్లే బంగారం అని తెలుసుకుని సంతోషంగా ఇంటికి బయలుదేరింది.

నీతి: మనిషి జీవితంలో తృప్తిని మించిన ఐశ్వర్యం లేదు.దూరంగా ఉన్నవన్నీ బాగున్నట్టు కనిపిస్తాయి కాని దగ్గరికి వెళ్తేనే వాటి లోపాలు తెలుస్తాయి.భగవంతుడు ఇచ్చినవాటిని గౌరవిస్తూ, తృప్తిగా జీవించడంలోనే నిజమైన ఆనందం ఉంది.

 

https://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

 

 

 

 

ఆత్మీయులకు విలువ ఇవ్వండి, విలువ: ప్రేమ, అంతర్గత విలువ: క్షమ, కృతజ్ఞత

ఒకప్పుడు ఇద్దరు స్నేహితులు ఒక ఎడారిలో నడుస్తున్నారు. త్రోవలో ఒకచోట ఇద్దరిమధ్యా ఏదో వాదన జరిగింది.ఇద్దరిలో ఒకతను రెండవవాని చెంపపై కొట్టాడు.

desertచెంపదెబ్బ తిన్న మిత్రుడు ఏమీ మట్లాడకుండా, ” ఈ రోజు నా ప్రాణస్నేహితుడు నన్ను చెంపదెబ్బ కొట్టాడు” అని ఇసుకలో రాసాడు.

ఒక ఒయాసిస్ దగ్గరగా కనిపించేవరకు నడిచి, ఒయాసిస్ కనిపించేక అందులో దిగి స్నానం చేద్దామని అనుకున్నారు. చెంపదెబ్బ తిన్న మిత్రుడు ఊబిలో దిగి కూరుకుపోసాగాడు. కాని రెండవవాడు అతను కూరుకుపోకుండా కాపాడాడు. స్నేహితుడు ఊబి నుండి పైకి లాగి కాపాడిన తరువాత అతడు ఒక రాతిపై ” నా స్నేహితుడు ఈరోజు నా ప్రాణం కాపాడాడు” అని రాసాడు.

ముందు చెంపదెబ్బ కొట్టి తరువాత తానే తన స్నేహితుడి ప్రాణం కాపాడినవాడు తన మిత్రునితో ” నిన్ను కొట్టినపుడు ఇసుకలో రాసావు,ఇప్పుడు కాపాడినపుడు రాతిపై రాసావు, ఎందుకు?” అని అడిగాడు.అప్పుడు ఆ రెండవవాడు ” ఇతరులు మనని బాధపెట్టినపుడు మనం ఇసుకలో రాసుకోవాలి ఎందుకంటే ఆ వ్రాత క్షమాగుణం అనే గాలికి కొట్టుకుపోవాలి.కాని ఎవరైనా మనకి ఏదయినా ఉపకారం చేసినప్పుడు అది రాతిపై రాసుకోవాలి ఎప్పటికి చెరిగిపోకుండా” అని అన్నాడు.

నీతి: నీకు జీవితంలో ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్న వాటికి విలువనివ్వవద్దు. నీ జీవితంలో ఉన్న వ్యక్తులకు విలువనివ్వు.

https://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

సాధువు మరియు స్టేషన్ మాష్టర్, విలువ:సత్యం, అంతర్గత విలువ: నిజాయితీ, పరివర్తన

ఒకసారి ఒక గొప్ప సాధువు తన శిష్యులతో కలిసి హిమాలయాలనుండి ఒక పట్టణానికి వచ్చేడు.అతనిలోని దివ్యత్వం పట్ల బాగా ఆకర్షితుడైన ఒక స్టేషన్ మాష్టర్ తనను ఆశీర్వదించమని, తాను అనుసరించడానికి ఏదయినా బోధ చెయ్యమని, అది తాను తప్పక ఆచరిస్తానని ఆ సాధువును మరీ మరీ వేడుకున్నాడు.

images5QJT29QAఈ లౌకిక ప్రపంచంలోని ప్రజలు మీ బోధలు ఆచరించలేరు కనుక ఆ స్టేషన్ మాష్టరుకు ఎటువంటి బోధ చెయ్యనవరంలేదని ఒక శిష్యుడు సాధువుతో అన్నాడు.ఇతను, ఇతని సహోద్యోగులు అందరూ అవినీతిపరులు కనుక ఇతను బాగుపడడం కోసం ఒక సలహా తప్పకుండా ఇవ్వవలసి ఉంటుందని సాధువు శిష్యునితో అన్నాడు.ఇప్పటినుండి వచ్చే మూడు నెలలవరకు ఒక్క అబద్ధం కూడా చెప్పవద్దని, సత్యమే పలకమని సాధువు స్టేషన్ మాష్టరుకు చెప్పాడు.

సాధువు సలహా శ్రద్ధతో పాటించాలని స్టేషన్ మాష్టరు నిర్ణయించుకున్నాడు. వీళ్ళ ఆఫీసులో జరుగుతున్న అవినీతి పనులను గురించి విచారణ జరపడానికి మరునాడే స్టేషన్ మాష్టరు కార్యాలయానికి ఒక విచారణాధికారి వచ్చారు. నిజమే, ఇన్ని రోజులుగా మేము అవినీతి పనులను చేస్తున్న మాట నిజమే కాని ఇకమీదట నీతిగా, నిజాయితీగా ఉండాలని నిర్ణయించుకున్నాను అని చెప్పాడు స్టేషన్ మాష్టరు.

స్టేషన్ మాష్టరు ఆ విధంగా నిజం చెప్పగానే, తోటి ఉద్యోగులందరికీ అతనిపై కోపం వచ్చి, అతనే అసలు అవినీతిపరుడనీ, కావాలనే తమను అనవసరంగా ఇరికించాడని కమిటీకి చెప్పారు.

సత్యం చెప్పడం వలన చివరికి స్టేషన్ మాష్టర్ జైలుపాలు అయ్యాడు.ఆ కారణంగా అతని భార్య, కుమారుడు అతనిని విడిచిపెట్టి, ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. కేసు విచారణ చాలా రోజులపాటు కొనసాగింది.తన కేసుని వాదించడం కోసం ఒక న్యాయవాదిని పెట్టుకోమని జడ్జిగారు స్టేషన్ మాష్టరుకి సలహా ఇచ్చారు.వాదన ఆఖరి రోజున తనకు న్యాయవాది అవసరం లేదని, తాను సత్యమే చెప్తున్నానని స్టేషన్ మాష్టరు అన్నాడు.సాధువు తనకు చేసిన బోధ ప్రకారం తాను కేవలం సత్యమే పలుకుతానని అబద్ధం చెప్పనని చెప్పేడు.తరవాత జడ్జి అతనిని తన గదిలోకి పిలిచి ఆ సాధువు ఎవరని అడిగారు.

ఆ సాధువు ఎవరో స్టేషన్ మాష్టరు చెప్పగానే జడ్జిగారు చాలా సంతోషించారు,ఎందుకంటే ఆయన కుడా ఆ సాధువు బోధలనే పాటిస్తారు కనుక. చివరికి జడ్జి స్టేషన్ మాష్టరు పైన కేసు కొట్టివేసి అతనిని విడుదల చేసారు.ఒక నెలరోజుల తరువాత రైల్వే అధికారులనుండి స్టేషన్ మాష్టరుకు అకస్మాత్తుగా ఒక వార్త అందింది. ఇతని తండ్రి నుండి రైల్వే అధికారులు గతంలో కొంత భూమిని సేకరించి ఉండడంవలన ఆ స్థలానికి విలువ కట్టి, దానికి బదులుగా పదిలక్షల రూపాయలు ఇతనికి ఇస్తున్నట్లుగా తెలిసింది. స్టేషన్ మాష్టరుకు అసలు ఈ భూమి విషయం తెలియదు.ఆ పదిలక్షల రూపాయలు భార్యకి,కొడుకికి ఇచ్చి, తాను అక్కడనుండి వెళ్ళిపోతున్నట్లుగా వాళ్ళకి చెఫ్ఫాడు.

ఒక్క నెలరోజులు అబద్ధం చెప్పకుండా ఉండడంవలన ఇంత పెద్దమొత్తంలో ధనం లభిస్తే జీవితం అంతా అబద్ధం చెప్పకుండా కేవలం సత్యమే పలికితే ఇంకెంతో ప్రయోజనం చేకూరుతుందని అతను భావించాడు.ఆ ఆలోచన అతని మనసులోకి రాగానే అతను ఆ సాధువుతోనే తన శేషజీవితం గడపడం కోసం హిమాలయాలకు వెళ్ళిపోయాడు.

నీతి: నిజాయితీగా జీవించడమే ఉత్తమ జీవన విధానం. గొప్ప గొప్ప గురువులు, సాధువులు గొప్ప విలువలను బోధిస్తారు. వారి సలహాను విని చక్కగా ఆచరిస్తే అది మనలో గొప్ప పరివర్తనను తీసుకువస్తుంది.

https://saibalsanskaar.wordpress

https://www.facebook.com/neetikathalu

 

 

కోపంలో ఉన్నపుడు మనం ఎందువలన గట్టిగా అరుస్తాం?, విలువ : శాంతి, అంతర్గత విలువ: శాంతము, మౌనం

ఒక రోజున ఒక హైందవ సాధువు తన శిష్యులతో కలిసి గంగానది వద్దకు స్నానం చెయ్యడానికి వెళ్ళేడు. అక్కడ ఒక కుటుంబంలోని సభ్యులు కొంతమంది కోపంతో ఒకరిపై ఒకరు అరుచుకుంటున్నారు. ఆ సాధువు తన శిష్యులవైపు చూసి నవ్వుతూ వారిని ఇలా అడిగేడు.

Misunderstanding

“కోపంలో ఉన్నప్పుడు మనుషులు ఒకరిపై ఒకరు ఎందుకు అరుచుకుంటారు?” ఒక్క క్షణం ఆలోచించిన తరవాత ఆ శిష్యులలో ఒకడు ఇలా సమాధానం చెప్పేడు, “మనం సహనాన్ని కోల్పోవడం వల్ల అరుస్తుంటాము”

“కాని మనుషులు పక్కనే ఉన్నప్పుడు అలా అరవలసిన అవసరం ఏముంది? మెల్లగా పక్కనే ఉన్నవాళ్ళకి నెమ్మదిగా చెప్పవచ్చు కదా” అన్నారు సాధువు.

మిగిలిన శిష్యులు కూడా వారికి తోచిన విధంగా సమాధానాలు చెప్పేరు కాని ఎవరుచెప్పిన అభిప్రాయము సంతృప్తికరంగా లేదు.

చివరకు సాధువు ఇలా వివరించేరు.

angerఇద్దరు వ్యక్తులు ఒకరిపట్ల ఒకరు కోపంగా ఉన్నప్పుడు వాళ్ళ హృదయాలు చాలా దూరం అయిపోతాయి. ఆ దూరాన్ని అధిగమించడం కోసం, వాళ్ళకి వినిపించడంకోసం అలా గట్టిగా అరుచుకుంటూ ఉటారు. కోపం ఎక్కువయిన కొద్దీ తమ మధ్య పెరుగుతున్న దూరం కారణంగా మరింత గట్టిగా అరుచుకుంటారు.

అదే ఇద్దరు వ్యక్తులు ప్రేమగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది?

వాళ్ళు ఏమాత్రం అరుచుకోకుండా ఎంతో మెల్లగా, మృదుమధురంగా మట్లాడుకుంటూ ఉంటారు, ఎందుకంటే వారి హృదయాలు ఎంతో దగ్గరగా ఉంటాయి కనుక. ప్రేమలో ఉన్నప్పుడు మనుషుల హృదయాల మధ్య దూరం చాల తక్కువగా, అసలు దూరమే లేనట్లుగా ఉంటుంది.

ఆ సాధువు తన శిష్యులకు ఇంకా ఈ విధంగా వివరించేరు.

మనుషులు ఒకరినొకరు గాఢంగా ప్రేమించినప్పుడు ఏంజరుగుతుంది? వాళ్ళు మాట్లాడరు, ఒకరితో ఒకరు గుసగుసలాడుకుంటూ చాలా ప్రేమగా దగ్గరవుతారు. చివరకు వాళ్ళ్ళకు గుసగుసలతో కుడా అవసరం లేకుండా  ఒకరి కళ్ళలో ఒకరు కళ్ళు పెట్టి చూసుకుంటూ చూపులతోనే మాట్లాడుకుంటారు.అంతే ఆవిధంగా ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకున్నప్పుడు వారి హృదయాలమధ్య అసలు దూరమే లేకుండా దగ్గరవుతాయి.

ఆ సాధువు తన శిష్యులతో ఇంకా ఈ విధంగా అన్నాడు.

“కాబట్టి మీరు వాదించుకునేటప్పుడు కోపంతో మీ హృదయలను దూరం చేసుకోకండి.మనుషుల మధ్య దూరం పెరిగే విధంగా మాట్లాడకండి.లేకపొతే ఆ దూరం ఎప్పటికీ దగ్గరకాలేనంతగా పెరిగిపోతుంది.”

నీతి:

కోపం వచ్చినపుడు మాట్లాడకుండా మౌనంగా ఉండడం ఉత్తమమైన పద్ధతి. అటువంటి కోపంలో మట్లాడే మాటలు అవతలి వ్యక్తి హృదయంపై చెరగని ముద్ర వేస్తాయి.కోపం మనల్ని మనకి ప్రియమైన వారి నుండి దూరం చేస్తుంది.

https://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu

 

భగవతుడిని తెలుసుకోవటానికి కావలిసిన ముఖ్యమైన అరహత….

విలువ: ప్రేమ

అంతర్గత విలువ: ఆర్తి లేదా తీవ్రత

ఒక సాధు నదీ తీరం లో ధ్యానం చేస్తుండగ, అక్కడికి ఒక  యువకుడు వస్తాడు.

ఆతడు ,సాధు ధ్యానానికి అంతరాయం కలిగుస్తూ , ” స్వామి , నన్ను దయ చేసి మీ శిష్యునిగా స్వీకరించరా?” అని వినయంగా

అర్ధిస్తాడు !

”  యెందుకు నాయనా, నీవు నా సిష్యుడివి కావాలని కొరుకుంటున్నావు ” అని సాధు ఆ యువకుడిని తిరిగి ప్రస్నిస్తాడు.

దానికి ఆ యువకుడు , ” దైవాన్ని తెలుసుకోటానికి స్వామి “,అని జవాబు ఇస్తాడు.

అంతలోనే , జవాబు విన్న ఆ సాధు, యువకుడిని, నది వద్దకు ,మెడ పట్టి లాక్కెళ్ళి, ఆ నీల్లలో అతడి తలని  ముంచి ఒక నిమిషం పాటు  ఉంచుతాడు.

యువకుడు నీటిలో ఉక్కిరి బిక్కిరి అయిపొయ్యి తప్పించు కోవాలని తన సాయశక్తులా ప్రయత్నిస్తాడు.
సాధు విడిచిపెట్టగానే , యువకుడు దగ్గుతూ , ఆయాసపడుతూ,ఊపిరి తీసుకోటానికి కూడా కష్టపడుతూ బైటికి వస్తాడు.

కొంత  స్తిమితపడ్డాక, సాధు అతడిని, “నాయనా ,నీటిలో ఉన్న ఆ కొద్ది పాటు సమయంలో నీకు అన్నిటికంటే ఏది అత్యవసరముగా కావల్సి వచ్చింది?”  అని నిదానంగా ప్రస్నిస్తాడు.
దానికి అతడు “గాలి, స్వామి” అని సమాధానం చెప్పగా , సాధు ప్రేమగా , ” మంచిది నాయనా, నీవు ఇక ఇంటికి తిరిగి వెళ్ళు”.    నీటిలో ఉన్నప్పుడు, గాలిని ఎంత  అవసరముగా భావించావో అంతే ఆర్తిగా  భగవంతుడొక్కడే కావాలని బలంగా నువ్వు  కోరుకున్నప్పుడు , నా వద్దకి రా,నిన్ను అప్పుడు నా సిష్యుడి గా తప్పకుండా స్వీకరిస్తాను అని మాట ఇస్తున్నాను”, అని చెప్పి  సమాధానపరచి,అతనిని  ఆ సాధు, తిరిగి వెనుకకి పంపించేస్తాడు.

   నీతి:

  ఎవరైతే “నాకు భగవంతుడు తప్ప  ఏదీ వద్దు “,అని కొరుకుంటారో వారిని ఆ భగవంతుడు తప్పక  అనుగ్రహిస్తాడు.అంతేకాక వారి యోగ క్షేమాలను కూడా తానే దెగ్గరుండి చూసుకుంటాడు.

ప్రాపంచిక సుఖాలని లెక్క చేయక తననే పరిపూర్ణమైన విస్వాసముతో నమ్ముకున్న త్యాగరాజు, మీరాబాయి, అన్నమయ్య,రామదాసు వంటి భక్తుల పై పరమాత్ముడు తన అపారమైన కరుణని  కురిపించి వారిని  కంటికి రెప్పలా ఎలా కాపాడుకున్నాడో మనము  పురాణాలలో విన్నాము కదా!

నమ్మకం, విలువ: సత్యం, అంతర్గత విలువ:నమ్మకం

ఒక వ్యక్తి తన జుట్టు సమంగా కత్తిరించుకోవడానికి క్షవరసాలకి వెళ్లాడు. అక్కడ మంగలి, పని మొదలుపెట్టగానే ఇద్దరూ చాలా విషయాలు మాట్లాడుకోవడం ప్రారంభించారు. భగవంతుడి గురించి మాట్లాడడం మొదలుపెట్టేసరికి, మంగలి”నాకు భగవంతుడు ఉన్నాడు అని నమ్మకం లేదు” అన్నాడు.

“ఎందుకు అలా అంటున్నావు”అని ఆ వ్యక్తి ఆడిగాడు.

మంగలి ఇచ్చిన సమాధానం.” బైటకి వెళ్ళి చూస్తే, భగవంతుడు ఉన్నాడు అని నమ్మకం కలగదు. నిజంగానే భగవంతుడు ఉంటే, ఎందుకు మనుషులు సుస్తీతో బాధ పడుతున్నారు? ఇంతమంది అనాధపిల్లలు ఉంటారా? ఎవరయినా బాధ పడతారా? నిజంగా భగవంతుడికి ప్రేమ ఉంటే ఇవన్నీ చుస్తూ ఊరుకుంటాడా?

imagesC2PRAPJA

 

ఆ వ్యక్తి కాసేపు ఆలోచించి, ఏమీ సమాధానం చెప్పలేదు. అనవసరంగా వాదన చేయడం ఇష్టం లేక. మంగలి పని ముగించగానే, ఆ వ్యక్తి బయటికి వెళ్ళిపోయాడు. రోడ్డు మీదఒక మనిషిని చూసాడు. పొడుగు జుట్టుతో సమంగా కత్తిరిచుకోకుండా, చూడడానికి అసహ్యంగా ఉన్నాడు. అప్పుడు, ఆ వెంటనే, మంగలి కొట్టుకి వెళ్ళి ఇలా అన్నాడు. “నీకు తెలుసా, మంగలి ఉన్నాడు అని నాకు నమ్మకం లేదు”

అప్పుడు, మంగలి, “అలా ఎలా అనగలువు, నేను ఇప్పుడే నీకు పని చేశాను కదా”

అప్పుడు ఆ వ్యక్తి ఇలా అన్నాడు, “నిజంగానే మంగలి ఉంటే, బయట ఆ మనిషి అలా, అంత జుట్టుతో అసహ్యంగా ఉండడు.”

అప్పుడు మంగలి “నా దగ్గరికి రాకపోతే నేను ఏమి చేయ గలను” అని అన్నాడు.

దానికి ఆ వ్యక్తి, “మనుషులు భగవంతుడి సహాయం కోసం, దగ్గరికి వెళ్ళాలి. ఎప్పుడు అయితే భగవంతుడికి దగ్గర అవుతామో ,అప్పుడు సంతోషంగా ఉంటాము. భగవంతుడు ఉన్నాడు.”

నీతి:

భగవంతుడు కావాలి అని అనుకునే వాడికి, భగవంతుడు తప్పకుండా ఉంటాడు. భగవంతుడు ఎక్కడ లేడు? నీ మొహంలో చిరునవ్వు, ఎదుటి వాడు బాధ పడుతుంటే జాలి చూపించటం, మన దగ్గర వాళ్ళకి ప్రేమగా ఉండడం,అన్ని కూడా, భగవంతుడు మనలో ఉండి చేయిస్తున్నాడు. భగవంతుడి కోసం మన హృదయంలో దృష్టి పెడితే నవ్వుతూ కనిపిస్తాడు.

http://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu