Archives

పాఠకులందరికీ (2019)నూతన సంవత్సర శుభాకాంక్షాలు!!!

telugu-happy-new-year-wishes-4

Advertisements

స్వచ్ఛమైన మనస్సు

విలువ — ప్రేమ
అంతర్గత విలువ — అక్కర, ఇతరుల గురించి ఆలోచించడం.

vidyasagar

ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ఎంతో దయ,కరుణ కలిగి ఉండేవారు. ఆయన ,తనకంటే తక్కువ కులం వారితో కూడా ఎంతో ప్రేమగా మెలిగే వారు.

విద్యాసాగర్ గారి ఇంట్లో, ఒక పని వాడు ఉండేవాడు. అతను ఇంటి పనంతా చక్కగా చేసేవాడు. విద్యాసాగర్ గారు అతనిని , కుటుంబంలో మనిషిగా, చాలా ప్రేమగా చూసుకునేవారు.

ఒక రోజు విద్యాసాగర్ గారు ఇంట్లో మెట్లు దిగి కిందకి వస్తుండగా, ఆఖరి మెట్టు మీద పనివాడు, చేతులో ఒక ఉత్తరం పట్టుకుని నిద్రపోవటం గమనించారు.
విద్యాసాగర్ గారు ఆ ఉత్తరాన్ని తీసుకుని చదివి అందులో ఉన్న చెడు వార్త గురించి తెలుసుకున్నారు. ఆ కారణంగా ఏడుస్తూ నిద్రపోయిన పనివాడిని చూసి జాలి పడి, ఆయన లోపలి నుంచి ఒక విసినికర్ర తీసుకుని వచ్చి, పనివాడికి విసురుతూ కూర్చున్నారు.

అదే సమయానికి, విద్యాసాగర్ గారి స్నేహితుడు ఇంటికి వచ్చాడు. ఈ దృశ్యం చూసిన స్నేహితుడు ఆశ్చర్యంతో ‘కేవలం (Rs.78)డెబ్బై ఎనిమిది రూపాయిలు సంపాదించే పనివాడికి ఇలా సేవ చేయటం అవసరమా? అని ప్రశ్నించాడు.

“మా నాన్నగారు కూడా అప్పట్లో Rs.78 సంపాదించే వారు. ఒక రోజు ఆయన రోడ్ మీద మూర్ఛబోతే, ఎవరో మంచినీళ్లు ఇచ్చి సహాయం చేశారు”,ఈ రోజు ఈ పనివాడిలో చనిపోయిన మా నాన్నగారిని చూస్తున్నాను. “ అని ఎంతో వినయంతో సమాధానమిచ్చారు.

నీతి:
మంచి మనస్సు అంటే తియ్యగా మాటలు చెప్పడమే కాదు, మన ప్రవర్తనలో కూడా తియ్యదనం ఉండాలి. ఇతరుల గురించి ఆలోచించడం,అందరితో ప్రేమగా ఉండడం నేర్చుకోవాలి.అందులోనే హుందాతనం ఉంది!

http://amritham99.blogspot.sg/search/label/inspiring%20stories

తల్లి గుడ్లగూబ

owl

 

విలువ — ప్రేమ

అంతర్గత విలువ — అందరి మీద అక్కర, నిస్వార్థమైన ప్రేమ.

ఇది తల్లి ప్రేమని తెలియ చేసే ఒక చక్కటి  కథ.ఒక భక్తుడు కోవెల దర్శనం ముగించుకుని బయటికి వస్తున్నాడు. ఒక చిన్న ఉడత పిల్ల భయంతో, చెట్టు కొమ్మ మీద, తల్లి కోసం ఎదురు చూస్తోంది . దెగ్గెరలో ఉన్న ఒక పాము, ఈ ఉడతను తిందాము అని వేగంగా వస్తోంది.

పక్క చెట్టు మీద నుండి ఇదంతా గమనిస్తున్న గుడ్లగూబ వచ్చి, పాముని పక్కకి తోసి ఉడత పిల్లని కాపాడింది . తరవాత, పక్కనే ఉన్న చెట్టు మీద కూర్చుంది. కాని ,ఉడత పిల్లని ఒక కంట గమనిస్తూనే ఉంది.పక్కనే ఉన్న పాము మళ్ళీ,ఉడతని తినడానికి వచ్చింది. గుడ్లగూబ, ఈసారి పాముని క్షేమించలేదు. బాగా జోరుగా యెగిరి, ఉడతని కాపాడింది.

ఆ భక్తుడు, గుడ్లగూబ సమయ స్ఫూర్తిని ,ఉడత పిల్ల పట్ల తాను చూపించిన తల్లి ప్రేమను చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే సాధారణంగా గుడ్లగూబ ,ఉడతలని ఆహారంగా స్వీకరిస్తుంది . అటువంటిది   ప్రమాదంలో చిక్కుకున్న తల్లిలేని ఉడతపిల్లను చూసి తాను ఒక తల్లిలా వెంటనే ఎంతో కరుణతో స్పందించింది.

పశు పక్షులలో ఉన్న ఈ పాటి దయ మానవులలో ఉండటంలేదని ఆ భక్తుడు అనుకున్నాడు.  

నీతి:

మన మనస్సు మరియు  మాట ఎప్పుడూ నిర్మలంగా ఉండాలి. సహాయము చేసే గుణం పెంచుకోవాలి.  నిస్వార్థమైన ప్రేమ కలిగి ఉండాలి. మన చుట్టూ ఉన్న స్నేహితులు,బంధువులు,పరిచయస్తల పట్ల మటుకే కాకుండా సృష్టి పట్ల  అందులో నివసిస్తున్న ఉన్న జీవరాసుల పట్ల కూడా ప్రేమ కలిగి ఉండాలి . అప్పుడే మనము కూడా విశ్వ ప్రేమకి పాత్రులమవుతాము.

http://amritham99.blogspot.sg/search/label/inspiring%20stories

 

చిత్త చోరుడైన కృష్ణుడు మరియి ఒక దొంగ కథ

krishna

విలువ — భక్తి

అంతర్గత విలువ — నమ్మకం

బ్రాహ్మణుడు  ఒక శ్రీమంతుడి గృహంలో శ్రీమద్ భాగవతం ప్రసంగిస్తున్నారు.ఆ సమయంలో ఒక దొంగ ఇంట్లోకి ప్రవేశించి, మూల దాక్కున్నాడు.

భాగవతంలో కృష్ణుడు వేసుకున్న ఆభరణాల ఘట్టం జరుగుతోంది. తల్లి యశోద, కృష్ణుడికి ఏమి నగలు వేసి పంపించేదో చెప్తున్నారు. దొంగ చాలా ఉత్సాహంగా వింటున్నాడు. భాగవత ప్రవచనం పూర్తి అయ్యేదాకా ఉండి, బాల కృష్ణుడు కనిపిస్తే నగలు దొంగలిద్దాము  అని అనుకున్నాడు. దానికోసం బ్రాహ్మణుడి వెంట పడ్డాడు.

బ్రాహ్మణుడు భయపడి ‘నా దెగ్గర ఏమీ  లేదు ‘ అని అన్నారు.దొంగ, మీ దెగ్గర ఉన్న డబ్బుకి నేను ఆశ  పడటంలేదు. మీరు చెప్పిన, నగలు ధరించిన కృష్ణుడు, ఆవులు దెగ్గర ఉండే కృష్ణుడు, ఎక్కడ ఉంటాడో చెప్పండి’ అని అన్నాడు.

బ్రాహ్మణుడు ఆలోచించి, “బృందావనంలో యమునా నది తీరం దెగ్గరకి రోజూ  ఇద్దరు పిల్లలు వస్తారు. ఒక పిల్లవాడు నల్ల మబ్బు రంగులో ఉండి , పిల్లన గ్రోవి వాయిస్తూ ఉంటాడు. ఇంకో పిల్లవాడు తెల్లగా ఉంటాడు , తెల్లటి పట్టు వస్త్రము ధరించి ఉంటాడు.  ఆ నల్ల మబ్బు ఛాయలో , పిల్లన గ్రోవి వాయిస్తూ ఉండే వాడే, నేను భాగవతంలో చెప్పిన కృష్ణుడు”అని ఆ దొంగ నుండి తప్పించుకోటానికి చెప్పాడు

దొంగ బ్రాహ్మణుడి మాట నమ్మి బృందావనానికి వెళ్ళాడు.యమునా నది తీరం వద్ద చెట్టు ఎక్కి కూర్చుని, ఆ ఇద్దరి పిల్లల రాక కోసం ఎదురు చూశాడు. ఇంతలో పిల్లన గ్రోవి వినిపించింది , ఇద్దరు పిల్లలు   వస్తున్నారు.ఆ అందమైన దృశ్యం చూసి చెట్టు దిగి, పిల్లలి దెగ్గిరకి వెళ్ళాడు దొంగ.

బాల కృష్ణుడిని చూడగానే, దొంగ మనసులో ఆనందం కలిగి, అతని కళ్ళమ్మట నీళ్లు కారుతూ, ‘ఏ తల్లి కన్న బిడ్డో, ఇంత అందంగా ఉన్నాడు ‘ అని అనుకున్నాడు.

ఈ విధంగా దొంగ ఆలోచనలో మంచి మార్పు కలిగింది.అతను వెళ్లి బాల కృష్ణుడి చెయ్యి పట్టుకున్నాడు. కృష్ణుడి స్పర్శ తగల గానే, దొంగ చేసిన పాపములన్నీ  కరిగి పోయాయి. “ఎంత అదృష్టవంతుడో కదా దొంగ ! “బాల కృష్ణుడిని ,ఆ దొంగ అమ్మాయకంగా ,”ఎవరు నువ్వు?” అని అడిగాడు. అమాయకంగా కృష్ణుడు ‘నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తోంది, నన్ను వదిలి వెళ్ళిపో ‘ అన్నాడు. దొంగ, ‘దురాచానాలతో నిండి ఉన్న నా మనస్సు వల్ల నేను నీకు అలా కనిపిస్తున్నాను.  నన్ను వదిలి వెళ్ళిపో అని మాత్రం అనకు ‘ “అని ప్రాతిధేయ పడ్డాడు.అప్పుడు బాల కృష్ణుడు, దొంగకి అతను  వచ్చిన పనిని గుర్తుచేసి, తను వేసుకున్న నగలన్నీ  ఇచ్చాడు. అప్పుడు దొంగ, ‘ఇలా మీ నగలన్నీ నాకు ఇచ్చేస్తే మీ అమ్మ మిమ్మల్ని కోప్పడదా ?’అనిఅడిగాడు. దానికి కృష్ణుడు  ‘ఏమి కోప్పడదు , ఎందుకంటే నా దెగ్గర  చాలా నగలు ఉన్నాయి.

 నేను నీకంటే పెద్ద దొంగని. కాని, నీకు నాకు చిన్న తేడా ఉంది. నేను ఎంత దొంగతనం చేసినా , ఎవ్వరు పట్టించు కోరు. నన్ను ప్రేమగా ‘చిత్తచోరా’ అని పిలుస్తారు. నీకు తెలియని విషయం ఇంకోటి ఏమిటి అంటే, నీ దగ్గర కూడా ఎంతో విలువైన వస్తువు ఒకటి ఉంది. ఇప్పుడు దానిని నేను దొంగిలించి తీసుకెళ్తున్నాను “ అని జవ్వాబు చెప్పి ఇద్దరూ అక్కడి నుంచి మాయమైపోయారు. తరువాత చుస్తే, దొంగ భుజం  మీద నగలు నిండి ఉన్న ఒక మూట  ఉంది. అది తీసుకుని,ఆ దొంగ బ్రాహ్మణుడి దెగ్గరకి వెళ్లి, జరింగింది అంతా చెప్పాడు.

ఆనందభాష్పాలతో ఆ బ్రాహ్మణుడు కృష్ణుడిని చూసిన  చోటు, తనకు చూపించమని దొంగని అడిగాడు. ఇద్దరూ కలిసి ఆ చోటికి  వెళ్ళగానే, దొంగకి కనిపించిన బాల కృష్ణుడు, బ్రాహ్మణుడికి, కనిపించలేదు. అప్పుడు బ్రాహ్మణుడు నిరాశతో కృష్ణిడిని ,నీవు ఒక దొంగని  అనుగ్రహించావు ,కనుక నాకు కూడా దర్శనం ఇవ్వవా?” అని నిరాశతో బాధపడ్డాడు.అప్ప్పుడు అపారమైన కరుణ గల కృష్ణ భగవానుడు ఇలా అన్నారు ‘నీవు భాగవత పురాణమును  కేవలము ఒక కథగా చదివావు, కాని , దొంగ, నువ్వు చెప్పిన కథని, మాటలని మనస్ఫూర్తిగా నమ్మాడు. అపార నమ్మకం ,సమ్పపొర్న శరణాగతి ఉన్న చోటే  నేను ఉంటాను.”

నీతి:

పురాణాలను  చదవడమే కాకుండా, దానిలో ఉన్నవి అనుభవించడం నేర్చుకోవాలి. మనము కూడా మన చిత్తములని ఆ చిత్త చోరునికి సమర్పిద్దాము.

https://www.facebook.com/RdhaKrs

మనస్సు యొక్క ప్రతిబింబము

buddha-picture.jpg

 

విలువ — ప్రశాంతత

అంతర్గత విలువ — ఓర్పు, ప్రేమ.

ఉన్నత అధికారి అయిన ఒకపెద్దమనిషి  గౌరవనీయులయిన ఒక సాధువుని కలిశాడు.అధికారి, ఆ సాధువుకి తాను చాలా గొప్ప వాడిని,  నిరూపించాలని అనుకున్నాడు.

సాధువుని ,”ఇప్పటి  దాకా, మీరు నాకు చెప్పిన మాటలు, నాకు ఎలా అనిపించాయో మీకు చెప్పమంటారా? “అని అడిగాడు. సాధువు ‘ నా గురించి నీకు ఎటువంటి అభిప్రాయమున్నా అది నాకనవసరము.  నేను దాన్ని పట్టించుకోను,ఎందుకంటే అది నీకు సంబంధించిన విషయము’. అని జవాబు ఇచ్చాడు.

అధికారి “ మీకు వినాలని లేక పోయినా సరే ,నేను చెప్పదలచుకున్నాను , వినండి.”‘మీరు , నాకు  ఎందుకూ పనికిరాని వారిలా కనిపిస్తున్నారు’. అని సాధువుని కించపరుస్తూ మాట్లాడాడు. కాని, ఈ మాటలు విన్న సాధువు చలించకుండా మౌనంగా ప్రశాంతంగా ఉండిపోయారు .

దాంతో , తన మాటలతో  చెవిటి వాని చెవిలో శంఖం ఊదినట్లైందని తెలుసుకున్న అధికారి,  “ నా గురించి, మీరేమనుకుంటున్నారు,నాకు తెలుసుకోవాలని ఉంది  అని తిరిగి ప్రశ్నించాడు. నువ్వు నా కళ్ళకి, బుద్ధునిలా కనిపిస్తున్నావు ‘ అన్నాడు సాధువు.

ఇది విన్న అధికారి, సంతోషంగా ఇంటికి వెళ్ళి ,తన భార్యకి సాధువు తన గొప్పతనాన్ని  గుర్తించిన విషయం చెప్పాడు.

జరిగిందంతా విన్న భార్య, “ మీరెంత మూర్ఖంగా ఆలోచిస్తున్నారండి. మన  అలోచనలు, బుద్ధి, పనికి రానివి అయినప్పుడు , మనకి ఎదుటివారిలో కూడా అవే  కనిపిస్తాయి. గౌరవనీయులయిన సాధువుకి బుద్ధుని లాంటి హృదయముండటం వల్ల ,ఆయనకి మీతో పాటు అందరిలో కూడా బుద్ధుడే కనిపిస్తున్నారు. “ అని తన భర్తకి అర్ధమేయ్యేలా సున్నితంగా చెప్పింది.  

నీతి:

“యద్భావం తద్భవతి అంటారు”  మన మనసు ప్రశాంతంగా ఉండి ఆలోచనలు నిర్మలంగా, ఉన్నప్పుడు, అవి మనము చేసే పనులలో కూడా  ప్రతిబింబిస్తాయి.

http://amritham99.blogspot.sg/search/label/inspiring%20stories

https://saibalsanskaar.wordpress.com/2015/08/11/reflection-of-mind/

https://www.facebook.com/neetikathalu

బాలగోవిందం -తొమ్మిదవ శ్లోకము

తొమ్మిదవ శ్లోకము                                                                                                                                     సజ్జన సాంగత్యంలో ఉండు

bg9a

సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |                                                                                                             నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః                                                                                                                     భజగోవిందం భజగోవిందం. || 9||

అనువాదం

సత్సంగత్వమె  నిస్సంగత్వం

నిస్సంగత్వమె నిర్మోహత్వం

నిర్మోహత్వమె నిశ్చలతత్వం

నిశ్చలతత్వమె జీవన్ముక్తి

భజగోవిందం భజగోవిందం. || 9||

తాత్పర్యము :    సత్సాంగత్యం వల్ల ,  అసంగత్వం ఏర్పడుతుంది. అసంగత్వం ,మోహాన్ని నశింపచేస్తుంది. మోహం  నశిస్తే నిశ్చలమైన తత్వము, ఏర్పడుతుంది. అది జీవన్ముక్తికి దారి తీస్తుంది.గోవిందుని భజించు ,గోవిందుని  కీర్తించు. ఓ మందమతి !గోవిందుని సేవించు.

విద్యార్థుల కొరకు కథ :  

మంచి,చెడు గుర్తించగలిగే  సామర్ధ్యము.

విలువ: మంచి నడవడి,

ఉప విలువ:సత్సాంగత్యము, మంచి వారితో స్నేహం.

9b

 

 

 

 

 

 

ఒక కాకి, హంస, యిద్దరూ స్నేహితులు. ఒకరోజు కాకి, హంసను తన ఇంటికి రమ్మని ఆహ్వానించింది.​హంసను ,కాకి తన ఇంటికి తీసుకెళ్ళి ఒక ఎండిన, వంకర పోయిన చెట్టు కొమ్మపై కూర్చోమంది.  ఆ చోటు అంతా పేడ, మాంసము ,ఎముకలు  ,దుర్గంధముతో వ్యాపించి ఉన్నది. అది చూసి హంస అన్నది”సోదరా నేను ఇటువంటి  ప్రదేశములో ఒక్క క్షణమైనా ఉండలేను. ఎక్కడన్నా పవిత్ర స్థలం ఉంటే అక్కడకి తీసుకెళ్ళు “ అన్నది .

9c

 

 

 

 

 

 

అందుకు కాకి, హంసను రాజు గారి తోటలోని ,ఒక పెద్ద చెట్టు పైన ఉన్న కొమ్మల మధ్యన ఉన్న తొర్రలో  కూర్చోబెట్టింది. అదీ  ప్రక్కనే కూచుంది. కూచోగానే హంస క్రిందకు చూసింది చెట్టు క్రింద రాజుగారు తల పైకెత్తి కూర్చుని వున్నారు. అయన ముఖంపై  సూర్యకాంతి పడుతూ ఉంది. దయాగుణం కల హంస రాజుగారికి  ఎండ తగలకుండా, నీడకోసం తన రెక్కలు విచ్చుకొని ఎండకు అడ్డం పెట్టింది. రాజు గారికి ఊరట కలిగింది. కానీ దుష్టబుద్ధి గల కాకి రాజు గారి తలపై రెట్ట వేసింది. పై నుంచి రెట్టపడగానే రాజుగారు విల్లు ఎక్కుపెట్టి బాణం వేశారు. బాణాన్ని చూస్తూనే కాకి ఎగిరి పోయినది. కానీ ఆ బాణం హంసకు  తగిలింది. హంస కిందపడి చనిపోతూ యిట్లా అంది. “ఓ రాజా! నీ మీద రెట్ట వేసింది నేను కాదు కాకి. నేను స్వచ్ఛమైన జలాల్లో వుండే హంసను. నీకు ఎండ వేడి తగలకుండా సహాయం చేశాను. కానీ దుష్ట స్వభావి అయినా కాకితో స్నేహం వలన నా  జీవితం నాశనం అయింది . అందుకే దుష్టులను దూరంగా  పెట్టాలి”. అంటారు

నేర్చుకోవలసిన విషయము :మనుషుల మంచితనం ప్రభావం వారితో ఉండేవారిపై ఏ విధంగా ప్రభావం, ప్రేరణ స్తుందో , చెడ్డ వారి సాంగత్యము వారితో ఉండేవారిని ప్రభావితం చేస్తుంది. అందుకే స్నేహితులని ఎన్నుకొనే ముందర సరి అయిన  నడవడి గల మంచి వారితోనే స్నేహం చెయ్యాలి. మంచివారి సాంగత్యం  వల్ల మనిషి  సన్మార్గములో  వుంటాడు.  ఒక మంచివాడు దుష్టుల సహవాసంలో అతని మంచితనం గుర్తింపబడక పోగా ,దుష్టసావాసం వల్ల తన జీవితం నాశనం చేసుకుంటాడు. ఒక సామెత వుంది. “నీ స్నేహితులెవరో చెప్పు, నీవు ఎట్లాంటివాడివో చెపుతాను” అని. చిన్నతనం నుంచే మంచి వారితో స్నేహం అలవరచుకోవాలి. ఇది చాల ముఖ్యము. ఒక క్రుళ్ళిన పండు బుట్టలో మిగతా పండ్లతో ఉంటే  క్రమంగా బుట్టలోని మిగతా  పండ్లు  అన్ని క్రుళ్ళి పోతాయి. స్నేహితులని ఎంచుకొనే విషయం లో కూడా చాల జాగ్రత్తగా ఉండాలి . చిన్న వయసులో అలవర్చుకొనే విలువలు జీవితాంతం మనతో ఉంటాయి. మానవతా విలువలు తెలియచెప్పే విద్య, మంచివారితో సావాసము జీవితం లో అత్యంత ముఖ్యము ,ప్రధానము.

https://saibalsanskaar.wordpress.com

 htps://facebook.neetikathalu.com 

 

శరణాగతి

శరణాగతి

 

 

విలువ: నమ్మకం  

అంతర్గత విలువ : శరణాగతి

ఒక వ్యక్తి  ఓడలో ప్రయాణం చేస్తున్నాడు. ఆ ఓడ ప్రమాదానికి గురి అయింది. ఆ  ప్రమాదం నుంచి తప్పించుకుని  ఒక ద్వీపం దగ్గరకి చేరాడు.రోజూ భగవంతుడిని  ప్రార్థించుకుంటూ ఎవరైనా సహాయానికి కనబడతారేమో అని ఎదురు చూస్తూ ఉండేవాడు. అతి కష్టంతో ఒక చిన్న గుడిసె కట్టుకున్నాడు. ఒక రోజు తినడానికి ఏమైనా దొరుకుతుందా అని వెతుకుతూ  బయటికి వచ్చాడు. తిరిగి ఇంటికి వెళ్ళి చూస్తే కష్టపడి కట్టుకున్న చిన్న గుడిసెకి చితిమంట అంటుకుంది. పొగ ఆకాశం వైపు వెళుతోంది. చాలా  నిరుత్సాహంతో,కోపంతో ఏడుస్తూ  “ఎందుకు ఇలా చేసావు” అని భగవంతుడిని అడిగాడు.మర్నాడు పొద్దున్నే ఓడ హారన్ వినిపించింది. ఇక్కడ నేను ఉన్నట్టు ఎలా తెలిసింది అని ఓడలోని  వ్యక్తులను అడిగాడు. “ఆకాశం లో పొగని చూసి, ఇక్కడ ఎవరో ఉన్నారు అని వచ్చాము అన్నారు వాళ్ళు.  ఆ ఓడలో ప్రయాణం చేసి ఆ వ్యక్తి తన ఇంటికి చేరుకున్నాడు. 

నీతి మనము అనుకున్నవి జరగనప్పుడు నిరుత్సాహ పడడం సహజం. మనం కష్టకాలంలో కూడా భగవంతుడిని నమ్ముకుని పూర్తి శరణాగతితో ఉంటే మనకి కావాల్సిన ధైర్యం, ఆలోచనా శక్తి , బలం అన్నీ  భగవంతుడు మనకి ఇస్తాడు

https://saibalsanskaar.wordpress.com

https://www.facebook.com/neetikathalu