బాలగోవిందం -అయిదవ శ్లోకము

అయిదవ శ్లోకము

మోహమునకు,శ్రద్ధకు మధ్య వ్యత్యాసం.

bg5

 

 

 

 

 

 

 

 

 

యావద్-విత్తోపార్జన సక్తః

తావన్-నిజపరివారో రక్తః |

పశ్చాజ్జీవతి జర్జర దేహే

వార్తాం కో‌உపి న పృచ్ఛతి గేహే

భజగోవిందం భజగోవిందం || 5|| .

అనువాదం

సంపాదిస్తూ ఉండేదాకా

‘ఆహా! ఓహో! అంటారంతా

ఉడిగెన గడన , వడలెన వయసు

పలుకరించరిక పనివారైనా

భజగోవిందం భజగోవిందం || 5|| .

 

తాత్పర్యము:   నీకు సంపాదించే శక్తిసామర్థ్యాలు ఉండి,  నీవు సంపాదిస్తున్నత వరకూ నీ వాళ్ళందరూ నీ మీద అనురాగంతో ఉంటారు. కాని ఎప్పుడైతే నీవు అనారోగ్యంతో ఇంకొకరిమీద ఆధారపడతావో అప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవరూ కూడా నిన్ను ఇష్టపడరు, లక్ష్యపెట్టరు. ఓ బుద్ధిహీనుడా; ఇప్పుడయినా గోవిందుడిని ఆశ్రయించు.

విద్యార్థుల  కొరకు కథ                                                                                                                  

బీదగా ఉండటం అంటే ఏంటి ?

bg5a

విలువ: ప్రశాంతత

ఉపవిలువ:  తృప్తి లేక కృతజ్ఞత .

ఒక అయన చాలా  ధనవంతుడు. యువకుడైన తన కొడుకుకు బీదవాళ్ళ జీవితం ఎలా ఉంటుందో చూపాలని ఒక పల్లెటూరికి అతనిని తీసుకుని వెళ్ళాడు.వారిరువురూ, ఆ ఊరిలో రెండు పగళ్లు ,రాత్రుళ్ళు ఒక బీద రైతు వద్ద ఉండి నగరానికి తిరిగి వచ్చారు. ఇంటికి  తిరిగి రాగానే తండ్రి కొడుకుల సంభాషణ ఇలా వుంది.

తండ్రి—  ట్రిప్ ఎలా వుంది?

కొడుకు —- బ్రహ్మాండంగా  ఉంది నాన్న .

తండ్రి — చూసావా బీద వాళ్ళ జీవితాలు ఎలా వుంటాయో?

కొడుకు —ఆ, చూశాను .

తండ్రి— ఈ ట్రిప్ నుంచి ఏం  నేర్చుకున్నావు?

కొడుకు— మనకు ఒక్క కుక్క మాత్రమే వుంది. వాళ్ళదగ్గర 4 వున్నాయి. మనదగ్గర తోట మధ్యలో చిన్న కొలను వుంది వాళ్ళ ఇంటిదగ్గర నది పారుతున్నది. దాని మొదలు చివర కనపడుటలేదు .

మన తోటలో ఇంపోర్టెడ్ లాంతర్లు  వున్నాయి వాళ్లకు రాత్రియందు లెక్కలేన్నన్ని నక్షత్రాలు ఉన్నాయి. మనకు ఇంటినుంచి గేట్ వరకు చిన్నదారి ఉంది  వాళ్లకు కంపౌండ్ వాల్స్ లేవు. వారి ఇంటి చు చుట్టూరా హద్దులు లేని ప్రదేశం. మన ఇంటి చూట్టూ ఉండే స్థలము తక్కువ, వాళ్ళఇంటిముందు నుంచి చూస్తే కనుచూపు మేర కనిపించే పచ్చని పొలాలు. మనకి సేవకులు ఉన్నారు. కానీ వారు ఇంకొకరికి సేవ చేస్తారు. మనం ధాన్యాన్ని సరుకుల్ని కొనుక్కుంటాం,  వారు వారికి కావలసిన కూరగాయలు ,ఆహారం వారే పండించుకుంటున్నారు. మనలని రక్షించుకోవటాని ఇంటిచుట్టూ పెద్ద గోడలు కట్టుకుంటున్నాము. వారికి ఊరంతా ” రక్షింటానికి “స్నేహితులే . ఈ మాటలు విని తండ్రి నోట మాట రాక నిర్ఘాంత పోయాడు.

కొడుకు —- “నాన్న!  నీకు నా ధన్యవాదాలు, నీవు  మనం ఎంత బీదవారిమో నాకు తెలియచేశావు.

నేర్చుకోవలసిన విషయము:

ఎన్నో సార్లు మనకు ఏమి ఉన్నాయో గుర్తించకుండా, ఏమి లేవో వాటిగురించి ఆలోచిస్తాము . ఒకరికి ఏ మాత్రం విలువ ఇవ్వని వస్తువు  ఇంకొకరికి అపురూపమవుతుంది. ఇదంతా, మన దృక్పధం మీద ఆధారపడి ఉంటుంది.

మనకున్న  దానికి మనం ఎప్పుడూ  సంతోషంగా ఉండాలి. భగవంతుడు మనకిచ్చిన దానికి కృతజ్ఞతా పూర్వకంగా ఉండాలి. ఇంకా కావాలనే ,అంతులేని కోరికతో బాధపడకూడదు.

ప్రతివాడు తనకున్న దానికి తృప్తి  చెంది ,కృతజ్ఞతా భావంతో ఉంటే, ఎప్పుడూ సంతోషంగా ,తృప్తిగా ఉండగలుగుతాడు . ఎవరికైతే కోరికలు తక్కువో, అతను ధనవంతుడు. మనిషికి ఎంత ఎక్కువ కోరికలు ఉంటే, అతడు అంత బీదవాడు అని చెప్పొచ్చు.

పిల్లలు పెద్దవారు అవుతున్న కొద్దీ ఒక విషయం గ్రహించాలి. ఒకడు ఇంకొకరిని వారి స్వార్ధం కోసమే ఉపయోగించుకుంటారు ,వారి లాభం కోసం వాడుకుంటారు.  వారితో స్నేహం చేస్తారు. ఆ స్నేహితుడు ధనవంతుడై , అట్టహాసం చేస్తూ ఆర్భాటాలు చేసినంతకాలం ఎంతోమంది అతనికి స్నేహితులవ్వాలని ప్రయత్నిస్తారు . ఎప్పుడైతే ” ఆ ధనవంతుడైన స్నేహితుడు బీదవాడు అవుతాడో అంతకు ముందున్న స్నేహితులందరూ అతన్ని వదిలేస్తారు .” అందరూ  అలా ఉంటారని కాదు”. ఎక్కడకి వెళ్లినా స్వార్ధపరులు ఉంటారు .

ప్రజలు , సంఘంలో పేరు పలుకుబడి కలవారితో, ధనవంతులతో ,రాజకీయ ప్రభావం ఉన్నవారితో , సినిమా వారితో స్నేహం చెయ్యాలని ఉబలాట పడుతూవుంటారు కానీ,  స్వభావ , సద్గుణాలని పరిగణనలోకి తీసుకోరు . సంఘంలో గొప్పవారితో తిరిగితే వారికి మరింత గుర్తింపు వస్తుందని ఆశ .

మహాత్మాగాంధీ , రామకృష్ణ పరమహంస, వివేకానందుడు వంటి గొప్పవారు, వారి అంతరంగిక శక్తి, సామర్ధ్యాల వల్ల ,వారిలోని నిర్మల స్వభావము , సద్గుణాల వల్ల వారు ఇతరుల లోని అంతరంగిక సద్భావనలని ,సద్గుణాలని , వారి బోధనల ద్వారా ఆవిష్కరింపచేసారు.

అలాంటి మహాత్ముల జీవితాలని ఆదర్శం చేసికొని జీవితాన్ని సార్ధకత కావించుకోవాలి. మహాత్ములు వారు ఉద్ధరింపబడి ఇతరులని  ఉద్ధరింపచేస్తారు. మన ఆంతరంగిక శక్తి ని గుర్తించటానికి చిన్నతనం నుండి మంచి గుణాలు , నడవడి ,సత్పురుషుల సాంగత్యం ఇటువంటివి  చేసి మానవతా విలువలు పెంపొందించుకోవాలి!

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s